హైందవ స్వరాజ్యము/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము.

భారతభూమిస్థితి.

న్యాయవాదులు.


చదువరి: మీరనున దేమి? ఇరువురు పోట్లాడుకొనినప్పుడు వారు న్యాయస్థానమునకు పోరాదా! ఇది చిత్రముగానే యున్నది.


సంపా: మీరు చిత్రమున్నను మరియేమన్నను నేజెప్పినది నిజము. ఈ వేసిన ప్రశ్న వలన మనము న్యాయవాదులను గురించియు వైద్యులను గురించియు ముచ్చటింపవలసి యున్నది. నాయభిప్రాయమున న్యాయవాదులచే దేశము దాసత్వమంది నది. హిందూ మహమ్మదీయవి భేదములు 'పెరిగినవి. ఆంగ్లాధి కారము స్థిరపడినది.


చదువరి: ఈ నేరములుమోపుట సులభము కాని ఋజువు చేయుట మీతరముగాదు. న్యాయవాదులు కాకున్న మరి యెవ్వరు మనకు స్వాతంత్ర్యమార్గమును చూపియుండగలరు? బీదల నెవరు సంరక్షించి యుండగలరు? న్యాయము నెవరు స్థాపించియుండ గలరు : ఉదాహరణార్థము, గతించిన మన

మోహన , ఘోసుగారు ప్రతిఫలముకోరక ఎందరనో బీదలను
64

హైందవ స్వరాజ్యము.


న్యాయస్థానములలో వాదించి రక్షించిరి. వారు ఎంతో పొగ డిన దేశీయ మహాసభ న్యాయవాదులు పనిచేయకున్న రూపము తోనే యుండదు. ఇంతటివారగు న్యాయవాదుల తెగను. దూషించుట న్యాయము నన్యాయముచేయుటగా నున్నది. వారిని బూతులాడుటచే పత్రి స్వాతంత్ర్యమును అపవిత్ర మొనర్చు చున్నారు.


సంపా: ఒకప్పుడు నేను మివ లెనే అభిప్రాయపడియుంటిని. వారు యేమియు మేలు చేసినవారే కాదనీ ధృవపరచుట నా కవసరము కాదు. ఘోసుగారిని స్మరించి కొనిన నా కెంతో గౌరము. అతడు బీదలకు సాయపడెననుట నిజము. దేశీయ మహాసభ న్యాయవాదులకు కొంత ఋణపడి యుండుట సంభావ్యము. వకీళ్లు మనుష్యు లే. ప్రతి మనుష్యునిలోను కొంతగుణము కలదు. ఎక్కడెక్కడ వకీళ్లు మేలుచేసినారని చెప్పవచ్చునో అక్కడక్కడ ఆలోచించి చూచు నెడల వారి మానవస్వభావము అందులకు కారణముగా దోచ గలదు.వారి న్యాయ వాదిత్వముచే చేసిన మేలేమియు నుండదు. నేను మీకు తెలుపదలచు కొనునదంతయు ఇది. ఆవృత్తి అవినీతికి ఆకరము. అందులో దొరకు కొనినవారు దానిమోహమునుండి తప్పించు కొనుట యరిది.

హిందువులు మహమ్మదీయులు పోట్లాడుకొనినా రనుకొం

దము. సామాన్యమానవుడు వారిని ఆ విషయమే మరచి

65

భారతభూమిస్థితి.

పొం డనును. ఇరుపక్షముల లోపము లేక పోట్లాట రాదనును. మరి పోట్లాడవలదని బుద్ధి చెప్పును. వారు వకీళ్ల వద్దకు పోదురు. వకీళ్లు తామంగీకరించు పక్షము వారితో నొక్కటయిపోయి వా. రిని న్యాయమనిపించుటకు సాధనము లాలోచింపవలసియుం దురు. అసలు పక్షమువారికి ఈ సాధనములు తోచను గూడ తో చవు. కాని ఈ ధర్మము నెరవేర్చని యెడల వకీలు తననృత్తికి కళం కము తెచ్చినవాడగును, కాబట్టి సర్వసామాన్యముగా వకీళ్ళు కలహములను త్రుంచుటకు బదులు పెంచువా రగుచున్నారు. ఇంతేకాదు. ఆవృత్తిలో చేరువారు ఎక్కువగా ఇతరులకు సహా యముచేయవలెనని చేరువారు కారు. తాము కుబేరులైన చాలు నని వారియు ద్దేశము. వకీలువృత్తి ఐశ్వర్యమార్గములలో నొక్క- టి కాబట్టి వకీళ్లకు కలహములు పెంచుట మీదనే దృష్టి. మను ష్యులు తమలో తాము వివాదపడిన చోట వకీలుకు సంతోష మనుట నే నెరిగిన సంగతి. చిన్న పకీళ్లు కృత్రిమ కలహములను సృష్టించుట కూడ కలదు. మధ్యవర్తులా బీదల ర క్తమును పీల్చి పిప్పి చేయుదురు. వకీళ్లకు నిజముగా పని లేదు. సౌఖ్యలోలు రగు నుద్దేశముతో సోమరిపోతులి వృత్తి నవలంబింతురు. ఇది నిజము. మరి యేవాద మైనను చెప్పుదు రేని అది వట్టి బూట కము. వకీలువృత్తి గౌర పపాత్రమని కని పెట్టినవారువకీళ్లే తమ

గౌరవ పాత్రతను సిద్ధము చేసినట్టులే వారు శాసనములను గూడ
66

హైందవ స్వరాజ్యము.


సిద్ధము చేయుదురు, ఏమిరుసుములు తీసికొనవ లెనో వారే నిశ్చ యింతురు. పదో మహోపకారము చేసినట్లు నటించి బీద లోహోయను నట్లో నర్తురు.


సాధారణ కార్మికులకంటే వారి కేల యెక్కువ రుసుము చెందవలెను? వారి యవసరము లేల అంతకంటెను నెక్కువ! సామాన్య కార్మికులకంటె వీ రెట్లు దేశమున కెక్కు వయుప 'మోగకారులు.. ఎక్కువ మేలుచేయువారి కెక్కున ద్రవ్యము చేరవలేనా? ద్రవ్యముకొరకు వారు 'దేశమునకు 'మేలుచేయు నెడల దాని నెట్లు మేలుగా గణింపవచ్చును? హిందూ మహమ్మదీయ వివాదములను గురించి కొంచె మైనను ఎరింగిన వారు అవి సలుమరు వకీళ్ల మూలకముగా జనిం చిన వనుటను గుర్తింపగలరు. కుటుంబములు వారివలన నశిం చినవి. వారు సోదరులను శత్రువుల నొనర్చినారు. సంస్థాన ములు వకీళ్ల అధీనమున జిక్కి అప్పులకుప్పలైనవి. కొందరు సర్వస్వమును ధారపోసికొనినారు. ఇట్టి సంగతు లూరక పెంచి చెప్పవచ్చును.


వకీళ్లు దేశమునకు చేసిన అపచారములలో నెల్ల పెద్దది ఇంగ్లీషు వారిపట్టును బలవ త్తమ మొనర్చుటయే. న్యాయస్థానములు లేకపోయినయెడల ఇంగ్లీషువారి రాజ్య పరిపాలన సాధ్యమగునా?

ప్రజల మేలునకయి న్యాయస్థానము లేర్పడినవని యాలో

67

భారతభూమిస్థితి.

చించుట పొరబాటు. తమయధికారమును నిలవబెట్టి కొన నాలోచించువారు న్యాయస్థానముల మూలకముగా ఆపనిని నిర్వహింప జూచుచున్నారు. ప్రజలు తమ లోని కలహములను తీర్చు కొనగలుగు నెడల మూడవవానికి అధికార మే దొరకదు.యుద్ధ ములు చేయుట చేతనో బంధువుల మూలకముగనో కలహములు తీర్చుకొనునప్పుడు మానవుడు మానవత్వము లేనివాడయ్యెను. న్యాయస్థానములకు పోవునప్పటికీ అంతకంటెను పౌరుషనిహీను డైనాడు. ద్వంద్వ యుద్ధమున వివాదముతీర్చుకొనుట అనాగరక మనుట నిస్సంశయము. నాకును మీకును కలవివాదమును తీర్చు. టకుమూడవ వానిని నియమింతునేని అదియంతకంటెను తక్కువ యనాగరకమగునా? మూడవవాని తీర్మానము ఎల్లప్పుడును సరి కాజాలదు. వివాదపడిన వారికే తెలియును తమలో ఎవ్వ రిది న్యాయమో, ఎవ్వరిది కాదో, అట్లుండగా మనము మన యమాయకత్వము చేతను, అజ్ఞానము చేతను మనద్రవ్యము తీసి కొనిన మూడవవాడు మనకు న్యాయము కలుగ చేయునని భ్రమపడుచున్నాము.


ముఖ్యముగా జ్ఞాపక ముంచుకొనదగిన దిది.న్యాయవాదులు లేక న్యాయస్థానములు స్థాపితములై యుండవు. న్యాయస్థా నములు లేక ఇంగ్లీషు పరిపాలన అసాధ్యమైయుండును. ఇంగీషు

న్యాయాధికారులు, ఇంగ్లీషు న్యాయవాదులు, ఇంగ్లీషు పోలీసు
65

హైందవ స్వరాజ్యము,

ఉన్న యెడల వారు ఇంగ్లీషు వారిని మాత్రమే పరిపాలించుట వీలగును. హైందవ న్యాయవాదులు, హైందవ న్యాయాధికా రులు లేనిచో ఇంగ్లీషువారికి మార్గ మేయుండదు. వకీళ్లెట్లు ఏర్పాటైరో, వా రెట్లు ప్రోత్సహింప బడిరొ మొదట వివరింప వలసి యున్నది, అప్పుడు ఆవృత్తియెడల, నా కెంత అసూయ కలదో మీకును అంతియే, అసూయ యుండును, న్యాయవాదు లు తమవృత్తి దాసివృత్తివంటిదని గుర్తించి వదలివేయుదు రేని ఇంగ్లీషు పరిపాలన ఒక్క నాటిలో ఆసాధ్యము కాగలదు. మీన ములు నీటినివలె హైందవులమైన మనము వివాదమును స్యాయ స్థానములను ప్రేమింతుమను నింద మనకు కలుగుటకు వారే ఉత్తరవాదులు. న్యాయవాదులను గురించి నే చెప్పినది సహజ ముగానే న్యాయాధికారులకుకూడ నన్వయించుచున్నది. వారు జ్ఞాతులు; ఒకరికొకరు సహాయులు.