Jump to content

హైందవ స్వరాజ్యము/పదిమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదిమూడవ ప్రకరణము.

నిజముగా నాగరకమన నేమి ?


చదువరి: మీరు రైళ్లను ఖండించితిరి. వకీళ్లను ఖండించితిరి. వైద్యులను ఖండించితిరి. యంత్ర సామగ్రినంతయు ఖండింతు రనుట నాకు స్పష్టము. అట్టయిన నిజముగా మీరు దేనిని నాగరక మందురో !


సంపా: ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరము కష్టము కాదు. భారత భూమి నిర్మించుకొని వచ్చి యుండు నాగరకము లోకమున మ రెక్కడను లేదు. మన పూర్వీకులు వైచినవి త్తనమును బోలు గట్టివి త్తన మింకెక్కడను దొరకదు. రోము గతించె, గీసుచనె. అసమానులు ఫేరోలు తరలిరి. జపానుపాశ్చ్యా త్య వేషమును ధరించె. చీనాను గురించి యేమియు చెప్పరాదు. అయిన భారత భూమిమాత్ర మెట్టెలో ఇంకను అస్తిభారము లలో చక్కగ నిలిచియున్నది. ఎన్నడో నాగరకమున నుం డిన గ్రీసు రోముల వద్ద నుండి యూరోపియను జాతులు పాఠ ములు చదువు కొనుచున్నారు. అట్లు నేర్చుకొనుటలో కూడ గ్రీసు రోముల లోపములను చూనుట తల పెట్టకున్నారు. ఇది

జాలి కరమగు స్థితి. ఇంతటి మధ్యన భారత భూమి నిశ్చల
74

హైందవ స్వరాజ్యము.


మై నిలచియున్న ది. ఇవియే ప్రతిభ. భారత పుత్రులు ఏమాత్ర ము మార్పు చెందుటకును అంగీకరించరట. ఇది యజ్ఞానమట, మౌర్ఖ్యమట, భారతీయు లంత యనాగరకులట. ఈదోషారో పణ నిజముగా మన సుగుణమును ఖండించుట యయియున్నది. అనుభవముచే బాగుగా పరిశీలించి గడించిన దానిని నిజ మని యరింగిన దానిని మనము మార్చుటకు రాదు. భారత భూమి నెత్తిన నెంత సలహాలను క్రమ్మరించుట కెందరో ప్రయత్నిం చుచున్నారు. మనము వినుట లేదు. ఇందులో సార స్యమిది, ఇది యే మన యాశలన్నిటిని నెఱువేర్చగల యాధారము.


ఏమార్గము మాసవు నకు స్వధర్మోపదేశమును చేయునో అదియే నాగరకము. ధర్మనిర్వహణము, నైతిక ప్రవర్తనము ఇవి రెండును చాలమట్టుకు అభేదములు. 'నై తిక ప్రవర్తనముచే మనస్సును ఇంద్రియములను నిగ్రహింతుము. తన్మూలమున ఆత్మ స్వరూపము నెరుంగుదుము. నాగరకము అనుపదమునకు గుజరాతీ భాషలో నీతిప్రవర్తనము అను నర్థమిచ్చుపదము నుప యోగింతురు.


ఈ పదార్థము నిజమగు నేని అనేకులు గ్రంథకారులు వ్రాసి యుండు రీతిని వరులనుండి భారతభూమి నేర్చుకొనదగిన దేదియు లేదు. ఇది న్యాయమే కదా. మానసము నిలకడ లేని పక్షి.

ఎంత అలవడిన నంత దీని కోరిక. నిరంతరమిది యసంతుష్టమే.

75

నిజముగా నాగరకమననేమి

.


మన మన మెంతటి సంతోష మింద్రియములకు కలిగింతుమో అంత యెక్కువగా నవి ఆశలననంతము చేయుచుండును. కాబట్టి పూర్వీకులు మనభోగములకు మట్టు లేర్పరచిరి. సౌఖ్యము మానసిక స్థితి యనుటను గ్రహించిరి. ద్రవ్యమున్నంతమాత్ర మున మూనవుడు సుఖికాడు. ద్రవ్యము లేనందున బీద వాడు సౌఖ్యము లేనివాడు కాడు. కోట్లకొలది ప్రజ యెల్లప్పుడు బీదలే. ఇదంతయు గమనించియే మన పెద్దలు మనలను భోగములనుండి భాగ్యములనుండి వారించిరి. వేలయేండ్ల క్రిందనుండిన నాగటి వంటి నాగటితోనే మనము కాలముగడుపుచున్నాము. పూర్వ పు కుటీరములపోలు కుటీరము లే నేటికినిమనకు నిలుచుటకాధా రములై యున్నవి. మన దేశీయ విద్యకూడ నాటిదే నేడు.జీవిత మును దుర్భరముచేయు పోటీపధ్ధతి మనది కాదు. ప్రతివాడును తన వృత్తినివ్యాసానమును చేసికొని తదనుగుణనుగు ద్రవ్య మును సంపాదించును. యంత్రములు చేయుటకు మన పెద్దలకు తెలియదన రాము .అయిన మనము అనుభోగములపయి ఆశ పెట్టితిమేని వానికి దాసులమగుదుమనుట వారెరుగుదురు. మన నైతిక జీవనము నశించుననుటయు వారు గమనించిరి. బాగుగ నాలోచించి వారందుచేతనే మనకు దైవమిచ్చిన కాలు నేతులు పయోగించి యెంతపని చేయనచ్చనో అంత మాత్రము పనినే

నియోగించిరి. మనయనయవముల సర్వినియోగమే నిజమగు
76

హైందన స్వరాజ్యము.


సౌఖ్యమునకును ఆరోగ్యమునకును కారణభూతము కాని మరి యొకటి కాదనుటను వారు గ్రహించిరి. ఇంతే కాదు. గొప్ప గొప్పనగరముల నిర్మాణముకూడ వ్యర్థమనియు దోషాకరమ నియు వారు కని పెట్టిరి. అట మానవుడు సుఖపడజాలడు. దొం గలు, దోపిడీకాండ్రు ఎక్కువగ నుందురు. దుష్ట వృత్తులు మెం డగును, భాగ్యవంతులు బీదలను దోచికొందురు. కాబట్టి మన పూర్వికులు చిన్న గ్రామములను నిర్మించుకొనుటతో సంతృప్తి పొంది యుండిరి. రాజుల కత్తులు నీతికత్తికి లోకువయనుట వారి నమ్మిక. కాబట్టి ఋషులు, పరులయెదుట సార్వభౌములు తక్కువయని సిద్ధాంతీకరించిరి. ఇట్టి యమోఘసిద్ధాంతముల కాకరమయిన జూతి ఇతరులకు గురు పదమున నుండదగినదే కాని ఇతరుల నుండి నేర్చుకొనదగినది కాదు. మనజూతి వారుకూడ న్యా యస్థానములు, న్యాయవాదులు, వైద్యులు అనుసంస్థలను ఎరుం గుదురు. కాని వీని కెప్పుడును. మితియేర్పడియుండును; ఈవృత్తు లెంతో గౌరవాస్పదములు కావనుటను ప్రతివాడును అంగీక రించుచుండెను. అంతేకాక వకీళ్లు, వైద్యులు ప్రజలను దోచు కొనుచుండ లేదు. వారు ప్రజల నౌకరులుగా నెంచబడుచుండిరి గాని యజమానులుగా నెంచబడుచుండ లేదు. న్యాయవిచారణ సాధారణముగా సరిగా నుండినది, న్యాయస్థానములకు పోకుండుట

నాటి సామాన్య సూత్రము. మానవులను అందులోనికి ప్రవేశ

నిజముగా .నాగరకమన నేమి.

22

పెట్టు నేటి మధ్యస్థు లప్పుడు లేదు. ముఖ్య పట్టణములలో వాని చుట్టుపట్టును ఆ సూత్రము న్యాయస్థాన విచారమైన నుండినది . సాధారణముగా ప్రజతమ గ్రామములలో తాము స్వతంత్రముగా జీవించుచు వ్యవసాయాదికములను చేసికొనుచుండిరి. స్వరాజ్య మును అనుభవించుచుండిరి,


నేటి నాగరకము దూరని యట్టిఘట్టములలో, భారతభూమి నేటికినీ పూర్వమువలెనే యున్నది. అక్కడివారు మనలను చూచునప్పుడు మననవనసమార్గములను నవ్వుదురు. వారిపై ఇంగ్లీషు అధికారమును లేదు. మీయధి కారమును నుండబోదు. ఎవరి ప్రతినిధులము మనమని మాటలాడుచున్నామో వారిని మన మెరుగము. వారు మనల నెరుగరు. మీరును మీవలె దేశాభిమాను లైన యితరులును ర్లై చేరని యట్టి ప్రదేశములకు పోయి అచ్చట ఆరుమాసము లుండి రావలసినదని నా యిష్ట ము. అప్పుడు దేశాభిమానముతో మీరు స్వరాజ్యమును గు రించి మాటలాడవచ్చును.

నిజమైన నాగరక మనగా యర్థమేమో ఇప్పుడు మీకు తెలిసియుండును. నేను వర్ణించియుండు ఈ స్థితిగతులను మార్చ దలంచునట్టి వారు దేశద్రోహులు. పాపులు .


చదువరి: తామువర్ణించినట్లే భారత భూమియుండు నేని బా గుండును. అయిన నీ దేశములో ఎందరో బాల వితంతువులు

న్నారు. ఎందరకో రెండు సంవత్సరముల వయసున నే శిశువివా
78

హైందన స్వరాజ్యము.


హములు జరుగుచున్నవి. పండ్రెండేండ్ల బాలికలు బిడ్డలగని సంసారము బరువు మోయుచున్నారు. స్త్రీలు బహుభర్తృకలును కలరు. నియోగములు నడచుచు నేయున్నవి. మతము పేరు పెట్టి స్త్రీలు వ్యభిచారమును వృత్తి చేసికొనుచున్నారు. దేవతలకు ప్రీతి యని మేకలు గొర్రెలు హతమగుచున్నవి. మీరువర్ణించిన నా గరకమున కివి గూడ చిహ్నములనియే ఈయభిప్రాయమా?


సంపా: మీరు చెప్పునది సరిగాదు. మీరు చూపిన లోప ములు లోపములే. అని పూర్వనాగరకమునకు చెందినవని యెవ్వ రును భ్రమపడట లేదు. దానిశక్తిని ప్రతిఘటించికూడ అవినిల చినవి. వానిని నశింప జేయుటకు ఎల్లప్పుడును ప్రయత్నములుజరి గినవి, జరుగుచున్నవి, జరుగగలవు. మనయందుద్భవించిన నవీ న తేజముచే ఈదోషములకు పోనాడుకొనుటకు ప్రయత్నింప వచ్చును. నవనా గరక చిహ్నములని నేను వర్ణించిన దంతయు దానిచిహ్నములే యని తద్భక్తుత లే యంగీకరించుచున్నారు. ఏ నాగరకము క్రింద గాని, ఏదేశములోగాని మానవుడు సంపూర్ణ త్వము సందినది లేదు. భారతనాగరకముయొక్క దృష్టి మానవు ని- నైతికస్వభావమును పెంచుట. నవనాగరకము యొక్క దృష్టి అవినీతిని అధికముచేయుట, దీనికి దైవభక్తి తోడు లేదు.దానికి -దైవభక్తియే యాధారము. ఈ విధముగా నాలో చించి ఈరీతిని విశ్వసింను ప్రతి భారతీయుడును తల్లి యురము వీడని శిశువువలె తన ప్రాచీన నాగరకమును వీడక నడుచుకొనవలెను.