హలో...డాక్టర్/సౌజన్య వచనములు
సౌజన్య వచనములు
డాక్టర్ గన్నవరపు వరాహనరసింహమూర్తి నా ఆప్తమిత్రుడు, శ్రేయోభిలాషి. తన గురించి వ్రాయాలంటే నాకు ఎంతో ఆనందం.
మన నరసింహమూర్తిని వర్ణించాలంటే తెలుగులో “ఉ” అన్న అక్షరాన్ని ఙ్ఞాపకముంచు కోవాలి. ఉన్నతము, ఉత్తమము, మరియు ఉత్కృష్టము.
ఉన్నతము: ఆశయాలు, భావాలు ఉన్నతము. ఫలమునాశించ కుండా
పరులకు ఉపకారము చేసే సత్త్వగుణ సంపన్నుడు.
పరుల బాధలు తన బాధలుగా తలచి సహాయ సహకారాలందించే సుగుణము తనలో ఉన్నది.
ఉత్తమము: రచనలు, కవితలు ఉత్తమము. తన వృత్తి వైద్యము. ఎన్నో సంవత్సరాలుగా వైద్యము చేస్తూ ఎంతో మందికి సహాయము చేసిన ఉత్తముడు.
రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇంకా ఎన్నో ఎన్నో అంశాలమీద రచనలు చేసి సమాజానికి మేలు చేయుట గమనించ దగ్గ విషయము. మానసిక వ్యాధులమీద తన రచన శ్లాఘనీయము. రోగములకు కారణాలు, రోగ లక్షణాలు అవి కనుగొనుటకు చేసే పరీక్షలు, వాని చికిత్సా విధానాలు చక్కగా వర్ణించి, వైద్యులకే కాక సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలాగ తెలుగులో వ్రాయుట తన ఙ్ఞానానికి, పట్టుదలకు నిదర్శనం.
- x :: తన తెలుగు పద్య రచన ఎంతో మధురముగా ఉంటుంది. శ్రీకృష్ణపరమాత్మ
పైన వ్రాసిన పద్యము నాకు ఎంతో సంతోషము కలిగించింది. తన వైద్య రచనలు, పద్య రచనలు భావి తరాలవారికి ఉపయోగపడతాయని నా విశ్వాసం. ఉత్కృష్టం: జన్మించినది సనాతన సాంప్రదాయమైన ఉత్కృష్ట కుటుంబం. మంచితనము, మానవత్వము తనకు తోబుట్టువులు. వారిని, వారి కుటుంబ సభ్యులను భగవంతుడు నిత్యమూ దీవించుగాక.
డాక్టరు. ప్రసాద్ అచ్యుత ఇరగవరపు, ఎం.డి. జూన్ 26, 2021
డెల్ రే బీచ్, ఫ్లోరిడా, ఉత్తర అమెరికా.
- xi ::