హలో...డాక్టర్/పూజ్యనీయుల ఆశీర్వచనములు

వికీసోర్స్ నుండి

పూజ్యనీయుల ఆశీర్వచనములు


గంటి లక్ష్మీనారాయణమూర్తి

B.Sc, B.Ed, CAIIB, IR & PM

బెంగుళూరు.

మాన్యమిత్రులు డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తిగారు విశాఖపట్నములో 1975 నుండి నాకు పరిచయస్తులే కాకుండా, సగోత్రీకులు, సన్నిహితులు, సోదరులు, ముఖపుస్తక మిత్రులు కూడాను.

1975 లో విశాఖపట్నం, అఫీషియల్ కాలొనీలో వారి తండ్రిగారు కీ.శే. నారాయణమూర్తి గారి నివాసగృహము ఉండెడిది. వారు రామభక్తులు, సత్పురుషులు. వారి సుపుత్రుడు మన డాక్టరు. నరసింహమూర్తి గారు. వారింటి ప్రక్కనే నేను కొత్తకాపురము పెట్టడానికి ఒక గది అద్దెకు తీసుకున్నాను. డాక్టరు. నరసింహమూర్తి గారు మా కుటుంబానికి వైద్య సహకారాలు అందించే వారు. వారితో మాకు సాన్నిహిత్యము ఏర్పడింది. డాక్టర్. గన్నవరపు నరసింహ మూర్తి గారు శస్త్రవైద్యములో నైపుణ్యులై అమెరికాలో స్థిరపడిన తర్వాత ముఖ పుస్తకములో నా ముఖము గుర్తుపట్టి మరల మా స్నేహాన్ని పునరుద్ధరించారు.

డాక్టరు. నరసింహమూర్తిగారు నిరంతర వైద్యసేవయే కాక సాహిత్య సేవ కూడా చేస్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో కలం పట్టిన సవ్యసాచి వారు. వారి వైద్యవిజ్ఞానము దేహానికి ఆరోగ్యము చేకూరుస్తే, వారి పద్యరచనా నైపుణ్యము మానసికానందాన్ని చేకూరుస్తుంది. వారి వృత్తివిద్య అయిన వైద్యము అన్నివిధాల ప్రజలకు, ముఖ్యముగా తన జన్మభూమికి ఉపయోగపడాలని, మాతృ భాషకు సేవచెయ్యాలని, తేటతెలుగు మాటలతో నలభైకి పైగా వ్యాసములు వ్రాసి ‘తెలుగుతల్లి కెనడా’ అంతర్జాల పత్రికలో ప్రచురించి, ఆ పిమ్మట ముఖ పుస్తకములో కూడా నిలిపి అందరికీ అందించారు.

ఆలోపతి వైద్యంలో విషయాలు అన్నీ ఆంగ్లభాషలో ఉన్నా వాటి

మూలములు గ్రీకు, లాటిన్ భాషలలో ఉంటాయి. అవి సామాన్యులకు అరమ ్థ వటం కష్టము. వివిధ రంగాలలో సాంకేతిక శాస్త్రపరిజ్ఞానాన్ని మన తెలుగుభాషలో అందించుటకు పలువురు ప్రయత్నము చేసారు. వారిలో కీ.శే. ఆచంట

వేంకటరాయ సాంఖ్యాయన శర్మగారు (1864-1933) ప్రముఖులు. వారు

మహా మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. వారు భూగర్భ శాస్త్రము, రసాయన శాస్త్రములను తెలుగులో వ్రాసారు. స్వయంగా ఒక సాహిత్య పత్రిక “కల్పలత’’ పేరుతో నడిపి అందులో వారి రచనలు ముద్రించేవారు. వారు శతావధాని,

అష్టావధాని. వారు ‘లలిత’ అను మొదటి తెలుగు కథ వ్రాసారు. వారి

రచనలన్నీ కాలంతో పాటు కరిగి పోయాయి. శ్రీ వేంకట పార్వతీశ్వర

కవులవలన కొంత సమాచారము మన తరానికి దక్కింది. శ్రీ వసంతరావు వెంకటరావు గారు, శ్రీ మహీధర నళినీమోహను గారు, భౌతిక, రసాయన

శాస్త్ర విషయాలను తెలుగులో తెలియపరచారు. వారి ప్రయత్నములు కొన్ని రంగాలకు, కొన్ని విషయాలకు పరిమితము అయ్యాయి.

వీరి కోవకు చెందినవారే డా. గన్నవరపు నరసింహమూర్తి గారు. వీరు

ఆలోపతి వైద్యశాస్త్ర విషయములపై ఎక్కువ శ్రద్ధ నిలిపి తను చదివిన చదువులు తెలుగు వారందరికీ చెందాలనే బృహత్సంకల్పముతో ‘ఆరోగ్యము

- వైద్యము’ తో మొదలిడి వ్యాసపరంపర వ్రాసారు. ఆ వ్యాసములు ‘తెలుగుతల్లి కెనడా’ వారు ‘హలో డాక్టర్!’ శీర్షిక క్రింద ప్రతి నెలా ప్రచురించుట అత్యంత ముదావహము.

ప్రజలకు ఆరోగ్యము - వైద్యము చేరువ జేయాలనే మంచి సంకల్పముతో

ఆ అమూల్యమైన వ్యాసాలను ‘హలో, డాక్టర్ !’ అను పుస్తక రూపములో

ప్రచురించుటకు డా. నరసింహమూర్తిగారు, ‘తెలుగుతల్లి కెనడా’ వారు పూను కొనుట యావదాంధ్ర భాషాభి మానులకు సంతోషదాయకము.

viii :: వారి పుస్తకము ప్రజాదరణ పొంది త్వరలోనే మరికొన్ని ముద్రణలకు

నోచుకొంటుందనుటలో నాకు ఎటువంటి సందేహము లేదు. వారి కుల

దైవము శ్రీరామచంద్రుడు వారిని, వారి కుటుంబమును ఆశీర్వదించి ఆయు రారోగ్యైశ్వర్యములు ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాను. శుభం భూయాత్ ! జూన్ 29, 2021.

గంటి లక్ష్మీనారాయణమూర్తి

ix ::