Jump to content

హలో...డాక్టర్/నెయ్యుని పరిచయ వాక్యాలు

వికీసోర్స్ నుండి

నెయ్యుని పరిచయ వాక్యాలు

‘హలో డాక్టర్’ అనే పేరుతో మా ప్రియమిత్రుడు ఆంధ్ర వైద్యకళాశాల 68 బాచ్ సహాధ్యాయి

డాక్టర్. గన్నవరపు నరసింహమూర్తి వ్రాసిన ఆరోగ్య, వైద్య విషయాలపై వ్యాసాలను పరిచయం చేయటం నాకు గర్వకారణం. వైద్యశాస్త్ర సాంకేతిక పదాలను అనువదించడం చాలా సందర్భాలలో కష్టము. అనువాదకులు అభాసు పాలవటం మాకు తెలుసు. కాని మా మూర్తి ఎక్కడ ఎలా సంపాదించాడో, సృష్టించాడో కాని చక్కని‌ సాంకేతిక పదాలతో మంచి ఒరవడిని సృష్టించాడు. అవసరమైన చోట ఆంగ్ల పదాలను వాడటం ద్వారా ‌విషయాలను బాగా చెప్పాడు.

వ్యాసాలలో చక్కటి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇవి చదివిన వారికి చాలా వ్యాధుల గురించి మంచి అవగాహన ఏర్పడుతుంది. ధూమపానం‌ నష్టాలను వివరించిన పద్యం మూర్తిలోని కవిని ఆవిష్కరించింది. మా 68 బాచ్ గ్రూపులో ప్రతి శనివారం మహాభారతాన్ని అర్థ తాత్పర్యాలతో వివరిస్తున్న‌ మూర్తికి మాత్రమే ఇది సాధ్యం.

వ్యక్తిగా‌ వైద్యునిగా సహృదయమూర్తిగా పేరొందిన మా నరసింహమూర్తి ఇటువంటి రచనలు మరెన్నో చేయాలని మా సహాధ్యాయులందరి తరుపున కోరుకుంటూ శుభాభినందనలు, ‌శుభాకాంక్షలతో,

జూన్, 21, 2021

- డాక్టరు. అడుసుమిల్లి శివరామచంద్రప్రసాద్. భద్రాచలము.

xii ::