హలో...డాక్టర్/నిపుణుల నెమ్మి పలుకులు
నిపుణుల నెమ్మి పలుకులు
మిత్రులు డా. గన్నవరపు నరసింహమూర్తి వివిధ వ్యాధుల గురించి
ఆంధ్రభాషలో వ్రాసిన వ్యాసాలు అంతర్జాలములో చదివిన తరువాత మాతృభాషలో
కూడా ఆధునిక వైద్యశాస్త్రము బోధించవచ్చునని నాకు అర్థం అయింది. ఇంతవరకు ఆకాశవాణి, దూరదర్శిని, ఇతర మాధ్యమాలలో చర్మవ్యాధుల గురించి తెలుగుభాషలో ప్రసంగాలు చేస్తున్నపుడు సరైన తెలుగు పదాలు తెలియక ఎక్కువ ఆంగ్ల పదాలనే వాడేవాడిని. ఈ వ్యాసాలు మా బోటి
వారికి “జంత్రి’’ (Ready Reckoner) గా ఉపయోగపడుతున్నాయి. డా. నరసింహమూర్తి తెలుగు భాషను శోధించి, పరిశోధన చేసి ఆంగ్ల పదాలకు సరైన ప్రత్యామ్నాయ తెలుగు పదాలను వారి వ్యాసాలలో ఉపయోగించారు. ఉదాహరణకు మనం తరచు వాడే “ఫంగస్’’ అనే ఆంగ్ల పదానికి తెలుగులో “శిలీంధ్రము’’ అనే పదము వాడారు. అలాగే వైరస్ కు “విషజీవాంశము’’ అనే
నూతన పదమును, బాక్టీరియాకు సూక్ష్మాంగ జీవులు అనే తెలుగు పదమును ఉపయోగించారు. ఇటువంటి ప్రత్యామ్నాయ తెలుగు పదాలు ఎన్నో వాడారు. దీని వెనుక ఆయన అవిరళకృషి, మాతృభాష మీద ఆయనకున్న మక్కువ,
పట్టు కనిపించుచున్నవి. ఈ విధముగా మంచి మంచి తెలుగు పదాలతో శాస్త్రీయ వ్యాసాలు రచించి, మా అందరికి అందించిన డా.
నరసింహమూర్తి అభినందనీయులు.
ఈ వ్యాసాలన్నింటిని
తెలుగుతల్లి కెనడా వారు ‘హలో డాక్టర్‘ అనే పేరుతో పుస్తక రూపములో
- xiii :: త్వరలో విడుదల చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదములు. ఇటువంటి
పుస్తకము సామాన్య ప్రజలకే గాక, వైద్యవృత్తిలో ఉన్న వైద్యులకు కూడా ఉపయోగపడగలదని నిస్సందేహముగా చెప్పగలను. తెలుగు రాష్ట్రాలలో ప్రతి వైద్యశాల గ్రంథాలయము లో ఉండవలసిన గ్రంథము యిది.
తేది : ఆగష్టు 8, 2021
డా. గండికోట రఘురామారావు, ఎం.డి. విశ్రాంత ఆచార్యులు, చర్మవ్యాధి విభాగము, ఆంధ్ర వైద్యకళాశాల, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. చరవాణి : 09989022314
- xiv ::