హంసవింశతి/ప్రథమాశ్వాసము
శ్రీ
హంసవింశతి
అవతారిక
శ్రీరామస్తుతి
శా. | శ్రీరామాంశజయైన జానకి యురస్సీమాంతరాత్యంతవి | 1 |
సీతాస్తుతి
చ. | తనకిది కేశిపద్మమయి తద్దయుఁ బద్దు వహించి తొల్లి లో | 2 |
పార్వతీపరమేశ్వర స్తుతి
క. | యమునాగంగాఝరసం | 3 |
బ్రహ్మస్తుతి
ఉ. | మేరునగప్రపాతమున మించి, రహించు కనన్మణిప్రభాం | 4 |
సరస్వతీస్తుతి
తే. | వాణి నజురాణి ఘననీలవేణి మధుర | 5 |
వినాయకస్తుతి
శా. | లీలాకేళి కృతస్వకందుకములై లెక్కింపఁగా రాని యు | 6 |
ఆంజనేయస్తుతి
ఉ. | తావకపాదపద్మముల తాడన మొక్కటి దక్క నేపనుల్ | 7 |
గరుడస్తుతి
చ. | తన తనుకాంతిఁ గాంచనకృతంబుల రీతి రహించు మారుతా | 8 |
భాగవత స్తుతి
తే. | ఆత్మఁ బ్రహ్లాద రుక్మాంగదాంబరీష | 9 |
సుకవి స్తుతి
సీ. | వాక్యనిర్జితశేషవాల్మీకి వాల్మీకి | |
తే. | మానితాచార మథితాసమాఘు మాఘు | 10 |
ఉ. | నన్నయభట్టు భీమకవినాథునిఁ దిక్కనసోమయాజిఁ బె | 11 |
ఉ. | అయ్యలరాజుఁ దిప్పసచివాగ్రణిఁ బర్వతరాజు రామభ | 12 |
చ. | సరసులు గద్యపద్యముల చాతురికిన్ దలలూఁచి మెచ్చఁగా | 13 |
వ. | అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవి స్మరణంబును గుకవి తిరస్కర | 14 |
ఆత్మ స్తుతి
సీ. | ఎవనికీరితి కుభృద్ధవ కుభృద్ధర బుధ | |
గీ. | మంత్రిమాత్రుండె యతఁడు దుర్మంత్రిమంత్ర | 15 |
వ. | వెండియు నఖండతేజఃకాండమార్తాండమండలప్రచండుండును, నిజవిత | 16 |
కృతి శ్రీరామచంద్రున కంకితము చేయుట.
షష్ఠ్యంతకందములు
క. | వారణ భయవారణ జయ | 17 |
క. | భీషణ ఖరదూషణ పరి | 18 |
క. | సింధుసుపుత్రీకుచధర | 19 |
క. | తక్షక కులశిక్షక చల | 20 |
క. | వక్రత్రయచక్రకుచా | 21 |
క. | భామాయుత కామాయిత | 22 |
వ. అంకితంబుగా రచియింపబూనిన హంసవింశతి యను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. 23
కథా ప్రారంభము.
2సీ. నానాగమస్ఫూర్తిఁ బూని హంసాశ్వస
న్మహిమంబుఁగను ధరామరులు హరులు
తేజోమదంబుల దిక్కుంభినీశుల
నురుమాడనోపు భూవరులుఁ గరులు
మణిచక్రములు భూరిగుణకోటి కేతువు
ఖలరఁగా నొప్పు వైశ్యులు రథములుఁ
బరజీవ జీవనోద్ధరణధర్మఖ్యాతి
విలసిల్లు శూద్రులు వీరభటులు
తే. విమల సుమనఃప్రమోదరాగములఁ దనరి
పల్లవప్రాప్తిచే మించు ప్రౌఢవార
వనిత లారామములు గల్గి వినుతికెక్కు
భూమిరత్నంబు నైషధపురవరంబు. 24
క. కలిత మహాబల సఖ్యో
జ్జ్వలవిక్రమనిహతవిమతసాలోరుయశోఽ
నలరాజభరిత మప్పుర
తిలకము సమమనఁగవచ్చుఁ దేజోవతికిన్. 25
క. ఆపురము ధరాలలనా
నూపురమై రత్నసౌధనూతనరుచికిన్
దాపురమై యభ్రంకష
గోపురమై పొగడ నెగడుఁ గుంభినిలోనన్. 26
వ. మఱియు నప్పట్టణంబు దివ్యసాలోచ్ఛ్రయకలితంబు గావున నాకలోకంబును, మహాశుద్ధాంతరంగంబు గావున యోగిజనంబును, నీలగవాక్షప్రబ లంబు గావునఁ గిష్కింధానగరంబును, గుంభీనసరభసంబు గావున రసాతలంబును, గంధర్వప్రచురంబు గావున దేవలోకంబును, గురుగవిబుధద్విజరాజభాసమానంబు గావున గ్రహమండలంబును ననుకరించి మత్స్యకూర్మాదిమహిమంబులు వహించి కమలాలంకృతంబులై శ్రీమహావిష్ణువుం బురుడించు సరోవరంబులు గలిగి యొప్పు నెప్పుడు. 27
ఉ. ఆపుర మేలు మేలు భళి యంచు నుతింప జనుల్ నవద్వయ
ద్వీపవసుంధరాస్థలి నుదీర్ణజయాంకలిపు ల్లిఖించి, బా
హాపటుశక్తి నిల్పిన మహారజతద్యుతు లొల్కు కంబముల్
ప్రాపితశౌర్యలేఖలయి ధాసిలఁగా నలనాముఁ డున్నతిన్. 28
తే. ప్రబలరాజాధిరాజ వీరప్రతాప
రాజ పరమేశ్వరాష్టదిగ్రాజకుల మ
నోభయంకరబిరుదైకవైభవా య
టంచు మాగధు లెంచంగ మించు నతఁడు. 29
వ. ఇట్లు మహీశాసనంబు సేయుచు నొక్కనాఁడు. 30
ఉ. ఆ తరణీప్రభుండు గొలువై చెలువై బలవైరిభోగసం
ప్రీతి దలిర్పఁగా నృపవరేణ్యులు మాన్యు లగణ్యపుణ్యసం
ఘాతు లమాత్యు లార్యు లధికారులు వీరులు చారు లష్టది
గ్జాతవిచిత్రవస్తువులు గానుక దెచ్చినవారు గొల్వఁగన్. 31
క. ఉన్నయెడ నాల్గువేదము
లెన్నఁగఁదగు శాస్త్రచయము లితిహాసాదుల్
పన్నుగఁ దెలిసిన ప్రత్యు
త్పన్నమతి యనెడు పురోహితద్విజుఁ డెలమిన్. 32
ఉ. వచ్చి ఫలోపవీతములు “స్వస్తిచ తేఽస్త్వితి”సూక్తి మున్నుగా
నిచ్చిన నాదరించి వసియింపఁగఁజేసి నృపాలుఁ డెంతయున్
ముచ్చటయున్ బ్రసంగములు మున్పటిరాజుల చర్యలున్ గథల్
చెచ్చెర నానతిమ్మనినఁ జిత్తము రంజిల నాతఁ డత్తఱిన్. 34
ఉ. చెప్పఁదొడంగెఁ దేనియలు చిల్కఁగ ద్రాక్షలు రాలఁ గప్రపుం
దిప్పలు చిమ్మిరేఁగఁ గడుఁదీయని యిక్షురసప్రపూరముల్
చిప్పిలి పర్వఁగా నమృతశీకరముల్ వడిఁ గ్రుమ్మరింప న
ప్పప్ప యిదౌర యంచు జనులందఱు నౌఁదల లూఁచి మెచ్చఁగన్. 34
తే. చెప్పుచుండఁగ భామల చిత్తవృత్తి
తెలియ బ్రహ్మకైనను గొలఁదిగాదు
ధాత్రిఁ జిత్రవిచిత్రంబు దలఁచిచూడ
దాని నెఱిఁగింపు బ్రాహ్మణోత్తమ మృగాంక! 35
వ. అని యడిగిన నతనికిఁ బురోహితుం డిట్లనియె. 36
క. మంకులు మాయోపాయలు
బొంకులపుట్ట లతిపాపపుం జగజంతల్
జంకెనలు సేయు యువతులు
శంకరుఁడున్ దగఁడు వారి చర్యలు దెలియన్. 37
తే. అయిన నొకకథ కలదు రాజాగ్రగణ్య!
తొల్లి పరమేశ్వరుండు సంతోష మొదవఁ
బార్వతీదేవి కెఱిఁగించె బాగుమీఱ
నది యెఱింగింతు వినుము నీ వవధరించి. 38
వ. అని యిట్లనియె. 39
సీ. మంజులమాణిక్యపుంజరంజితఘన
ప్రాకారచుంబితాభ్రస్థలంబు
చంద్రకాంతోపలసౌధపాండురకళా
మ్రేడితప్రాలేయఘృణికరంబు
రత్నకుడ్యావళీరమ్యాంశుసందోహ
బహుళీకృతార్కప్రభాచయంబు
గంభీరపరిఘాసితాంభశ్చటాతమో
లోకీకృతాధరలోకవితతి
తే. యామికాహతిజాతదిశాధినాథ
పురభయంకరభేరికాభూరిదంధ
ణంధణధణధ్వనిప్రతినాదదాయి
గోపురం బొప్పు నుజ్జయినీపురంబు.
41. క. ఆ పుటభేదనమునకు ది
శాపుటభేదనకఠోరసంగరజయభే
రీపటలధణంధణుఁ డొక
భూపాలుఁడు గలఁడు చిత్రభోగుం డనఁగన్.
42. సీ. వెలయ హరిశ్చంద్రువిధమున, నలుని వీఁ
కను, బురుకుత్సు చాడ్పునం, బురూర
వునిలీల, సగరులాగునఁ, గార్తవీర్యుమ
ర్యాదను, గయుక్రియ, నంబరీషు
మతమున, శశిబిందుమహిమ, నంగునిఠేవఁ,
బృథునిమాడ్కి, మరుత్తవృత్తి, భరతు
నీతి, సుహోత్రునిభాతి, భార్గవుబలె,
రాముపోలిక, భగీరథునిపొలుపు
తే. న, శిబిసంగతి, మాంధాతనయమునను, య
యాతికరణి దిలీపునియట్ల, రంతి
రీతి, నాచక్రవాళపరీతభూత
ధాత్రిఁ బాలించు సవిభుండు తద్విభుండు.
43. తే. అతఁ డంతిపురంబులో హావభావ
విభ్రమవిలాసవైఖరుల్ విస్తరిల్లు
మరుని సామ్రాజ్యలక్ష్ముల హరువుఁ జెందు
చెలులు గొలువంగఁ గొలువుండెఁ జెలువుమీఱ.
44. వ. ఉన్న సమయంబున.
45. సీ. పొడవైన జిలుగుఁగెంజెడల కీల్గంటును
నిండారెడు విభూతిపెండెకట్లు
వీనులఁ బటికంపు వింతకామాక్షులు
కనుబొమల్ సందునఁ గావిబొట్టు
కుచములపైఁ గావికుబులసంబు గళమున
నలరారు రుద్రాక్షహారతతులు
చే నాగబెత్తంబు చిన్నికృష్ణాజిన
మక్షిగోళంబుల నంజనంబు
తే. కావివస్త్రంబు పావాలు కక్షపాల
తామ్రకటకంబు సింగినాదంబు క్రోవి
పొందు సిద్ధక్రియలు చిదానందభూతి
యొనరఁ దాలిచి యొక మహాయోగురాలు.
46. తే. చెట్టుడిగి వచ్చినట్టులఁ జెంతనిలువఁ
జూచి లేచి నృపుండు సంస్తుతుల మ్రొక్కి
పీఁట వేయించి కూర్చుండఁబెట్టి తా సు
ఖాసీనుఁడై యున్న యవసరమున.
47. సీ. శ్రీరస్తు శుభమస్తు ధీరస్తు విజయోఽస్తు
పుత్రరంజనమస్తు పుణ్యమస్తు
ధనమస్తు ధాన్యమస్త్వనవద్యసుఖమస్తు
చిరతరసంకల్పసిద్ధిరస్తు
సత్యమస్తు మహోఽస్తు శౌర్యమస్తు యశోఽస్తు
స్వస్త్యస్తు సుగుణోఽస్తు శక్తిరస్తు
సామ్రాజ్యమస్తు శాశ్వతధర్మఫలమస్తు
వృద్ధిరస్తు మహాప్రసిద్ధిరస్తు
తే. జ్ఞానమస్తు శ్రియఃపతిధ్యానమస్తు
గురుచరణభక్తిరస్తు సత్కుశలమస్తు
శాంతిరస్తు నిరంతరైశ్వర్యమస్తు
భాగ్యమస్తు మహాసార్వభౌమ! నీకు.
48. క. అని దీవి చక్షత పు
ష్పనిచయము విభూతిపండ్లు ఫలములు దివ్యాం ప్రథమాశ్వాసము
జనములు సిద్ధక్రియలును
దనరఁగ శివసత్తి భూమిధవున కొసంగెన్.
49. వ. ఇట్లొసంగిన వినయంబున లేచి కైకొని స్వాగతం బడిగిన సంతోషించి మనోరంజనార్థంబు ధర్మార్థకామమోక్షంబులు రాజ్యలక్షణంబులుఁ బురాణేతిహాసంబులుఁ గొన్ని లోకాభిరామంబులు ననాగతవర్తనంబులు నుచితానుకథాస్వారస్యంబులుఁ దెలిపిన విని మహాత్మురాలా! నీవు వినని కనని కార్యంబులు ముల్లోకంబుల నెవ్వియు లేవైన నొక్కటి యడిగెద నాన తిమ్మని యిట్లనియె.
50. క. ఏ యే భూములఁ జూచితి
వేయే రాజ్యములఁ గలరు శృంగారకళా
ప్రాయలగు రూపరేఖా
శ్రీయుతి గల కన్నె లనిన శివసత్తి యనెన్.
51. మ. మది రంజిల్లఁగఁ జెప్పెదన్ వినుము ప్రేమన్ సచ్చిదానంద సం
పదచేతన్ గరజంభలంబుగతిఁ గన్పట్టున్ ధరాధీశ! యీ
యుదయాస్తాచలసేతుశీతనగమధ్యోద్యద్ధరాచక్ర మిం
పొదవన్ దేశములందు నుండుదురు విద్యుద్వల్లికాభాంగనల్.
52. ఉ. డెబ్బదిరెండు పాళెముల ఠీవిఁ దనర్చు సమస్తదుర్గముల్
జొబ్బిలుకల్మిఁ బట్నములుఁ జొక్కపుఁబేఁటలుఁ బాతకంబు పో
ద్రొబ్బెడులీలఁ జాల్తిరుపతుల్ గనుగొంటిని నుందు రందులన్
సిబ్బెపు నిబ్బరంపుజిగిఁ జిక్కని చక్కని గుబ్బ గుబ్బెతల్.
53. క. వెలనాడు వేఁగినాడును
బులుగులనా డ్పాకనాడు పొత్తపినాడున్
గల ములికినాడు రేనా
డలయక కనుఁగొంటి నచటి యబలలఁ గంటిన్.
54. సీ. లాట కర్ణాట మరాట వధూటులఁ
బాండ్య పౌండ్ర విదర్భ పద్మముఖుల బంగాళ వంగ కళింగ లతాంగులఁ
గుకురు కేరళ కురు కోకకుచల
మళయాళ నేపాళ మాళవ యువతుల
మత్స్య వత్స కరూశ మానవతులఁ
గోస లాంధ్ర వరాట కుంతల స్త్రీలను
బాంచాల బర్బర భామినులను
తే. ద్రవిళ గాంధార కాశ్మీర ధరణిసతుల
మగధ కొంకణ టెంకణ మానినులను
మఱియుఁ దక్కిన ధారుణీమండలములఁ
దనరు చెలువలఁ జూచితి ధరణినాథ! 54
తే. రాజ వశ్యౌషధాకృతుల్ రమ్యతర ర
తిస్వరూపలు మోహన దివ్యమూర్తు
లతులతర కామమంత్ర దేవతలు వీర
లనఁగ నుందురు సుందరు లచట నచట. 55
సాతానిసతి హేమావతి
ఉ. ఈ నవఖండమండితమహీస్థలి నెల్లఁ గనంగ దేవ! నే
నీ నగరీలలామమున నెంతయు రేఖఁ జెలంగు మన్మథా
ధీనసుమోహనాకృతి రతిన్నగు మిన్నగు సౌరుగల్గు సా
తాని బిసప్రసూనదళ ధాళధళీ తరళాక్షిఁ జూచితిన్. 56
తే. దాని ప్రియనాయకుఁడు విష్ణుదాసుఁ డనెడు
పేరు గలవాఁడు కలవాఁడు పెద్దవాఁడు
హేమవతి యనఁదనరు నయ్యింతిఁ బొగడఁ
దరమె బ్రహ్మకునైన శంకరునకైన. 57
ఉ. ఆ మధురాధరకచాళికనద్ఘననైగనిగ్యమా
యామృదులోరుసారరుచిరాంబురుహాక్షుల ధాళధళ్య మా యా మెఱుఁగారుఁబోఁడి జిగియబ్బెడి గుబ్బల చాకచక్యమా
యేమని చెప్పవచ్చు జగతీశ్వర! శాశ్వతరూపసంపదల్. 58
క. దాని జిగి దాని కులుకును
దాని తనుద్యుతులసొంపు దాని విధంబున్
దాని వగ దాని యందము
మానవవర! మరుఁడు గన్న మగ్నుఁడు గాఁడే! 59
క. వగ లొలుకు ధాగధగ్యపు
జిగి గుల్కెడు నుబ్బుగబ్బిసిబ్బెపుగుబ్బల్
నిగనిగలు గులుకు కొప్పును
సొగసుం దెలికనులు దాని సొమ్మై పరఁగున్. 60
ఉ. విండ్లకు మేల్తరంబు ఘనవేణి కనుంబొమదోయి బంగరుం
గిండ్లకు మేటిసాటి తులకించు చనుంగవ లేఁతతమ్మి పూఁ
దూండ్లకు మిన్నయన్న జిగిఁదొల్కెడు చేతులు లోకమందుఁ బూఁ
బోండ్లను గానమో వినమొ పోలరు తత్సతి కాలిగోటికిన్. 61
సీ. కబరీభరమునకుఁ గందంబు సెల్లు ను
త్పలమాలికలు నేత్రములకుఁ జెల్లుఁ
గర్ణంబులకును మంగళమహాశ్రీ సెల్లు
గాత్రంబునకుఁ జంపకంబు జెల్లు
మధురవాగ్వృత్తికి మత్తకోకిల సెల్లుఁ
జనుగుబ్బకవకు మంజరియుఁ జెల్లు
బిరుదైన పిఱుఁదుకుఁ బృథ్వివృత్తము చెల్లు
మధ్యంబునకుఁ దనుమధ్య చెల్లుఁ
తే. బాదముల కంబుజము చెల్లుఁ బరఁగు నడకుఁ
దనరు మత్తేభవిక్రీడితంబు సెల్లుఁ
గృతుల వర్ణింపఁదగు తదాకృతులె కృతులు
వాంఛలే దానిఁ బొందినవాఁడె సుకృతి. 62 తే. చండదోర్దండమండితమండలాగ్ర
ఖండితోద్దండరిపుకాండభండనమునఁ
బండితుండగు రాజవేదండమునకుఁ
గాక, యొకపాటివాని కాకన్నె తగునె? 63
ఉ. సౌరభ మొందు కాంచనపు జంత్రపుఁబుత్రిక వాగ్విలాసము
ల్వారక నేర్చు రత్నపుసలాక తిరంబగు రూపుఁ జెందు తొ
త్కారమెఱుంగు జీవకళఁ గాంచిన చిత్తరుబొమ్మ యానశృం
గారిణియౌ సుధాసరసిఁగా నుతి సేయఁగవచ్చు నెచ్చెలిన్. 64
క. అని సిద్ధురాలు సెప్పినఁ
బొనపొనగా భ్రమలు చెందఁ బులకలు వొడమెన్
మనసిజ శిఖి యెనసినచోఁ
గనఁబడు ధూమాంకురములగతి నృపుమేనన్. 65
క. అంతట సిద్ధాంగన యా
ద్యంతంబును జెప్పి తన మహాశ్రమ మహికిన్
సంతోషంబునఁ జనె భూ
కాంతుఁడు హేమవతిమీఁది కాంక్ష జనింపన్. 66
మ. కరుణాదృష్టులు నాగవాసముల సోఁకంజూచి వేడ్క న్మనో
హరముల్ కోకలు రూకలున్ మణులు హారాలంకృతిస్తోమముల్
సరసత్వంబున నిచ్చి పంచి కొలువున్ జాలించి తాఁబోయె భూ
ప రతీశుండు మనంబు హేమవతిపై బాళిన్ దువాళింపఁగన్. 67
క. మిన్నందు సౌధవీథి స
మున్నతమగు మేలుమచ్చు లొప్పెడుచోటన్
మిన్నగు చిత్తరువులచేఁ
బన్నుగఁదగు నొక రహస్యభవనము పజ్జన్. 68
చ. అకలుషదివ్యరత్నమయమౌ నొకకేళిగృహంబులోపలం
జికిలి కిరీటిపచ్చల రచించిన చిల్కలకోళ్ళ నందమౌ సకినెల పట్టెమంచమునఁ జాయనఖాసు తివాసిపైఁ దురం
గిక మొకమాలు లేపున నొగిన్ శయనించి మనోభవవ్యథన్. 69
క. ప్రీతిని హేమావతిపై
నాతీరున మనసు నిలిపి యతివిరహార్తిన్
జేతోజాతధనుర్భవ
శాతశరవ్రాతసారచకితాత్మకుఁడై. 70
క. ఉలుకున్ వెన్నెలవేఁడిమి
కలుకున్ శుకపికమిళిందహంసార్భటికిన్
బెళుకున్ మలయానిలునకు
జెళుకున్ బూఁబాన్పునందుఁ జిరవిరహార్తిన్. 71
ఉ. చెక్కిటఁ జేయిఁ జేర్చుకొని చింతిలు నుస్సురటంచుఁ జూపులన్
వెక్కసమంది లేమ సరవిన్ బొడగట్టినయట్టు లుండఁగా
నక్కునఁ జేర్పఁబోవు భ్రమమంది వెసన్ దలయూఁచు నంతలోఁ
బక్కున నవ్వు నింతిపయిబాళి నృపాలకమౌళి ఖిన్నతన్. 72
వ. మఱియు నారాజు విరహంబు తాపాతిశయకరంబు గావున నిదాఘంబును, విరళీకృతాశ్వాసంబు గావున సత్ప్రబంధంబును, విచ్ఛిన్నాలంకారంబు గావున యవనవివాహంబును, నిమీలితతారకంబు గావున నహర్ముఖంబును, విప్రలాభముఖరంబు గావున సాయంకాలంబును ననుకరించె నప్పుడు. 73
క. అటువలె నృప నిటలాక్షుఁడు
పటుతరవిరహంబుఁ జెంది బాధపడంగా
నటనమున హేల యనియెడు
కుటిలాలక వచ్చెఁ దెలివిఁగొనఁజేయుటకున్! 74
శా. పన్నీట న్నయనంబు లొత్తెఁ దనువున్ బాటీరపంకంబుతోఁ
జెన్నారన్ బదనిచ్చె గీరి సిగవేసెన్ దాయెతుల్ సుట్టె జీ న్సొన్నాపట్టె రుమాలుగట్టె జరతాచుట్టంచు డాల్మించు మే
ల్మిన్నాసన్నపుదుప్పటంబుఁ దగహాళిన్ గప్పె సొంపారఁగన్. 75
వ. ఇ ట్లుపచారంబులఁ గొంతతాపంబు శాంతం బొనర్చి, నృపాలునకు హేల యిట్లనియె. 76
ఉ. స్వామి! పరాకు, నీమదికి సమ్మతియౌ పని యేమి చెప్పుమా!
ప్రేమ దలిర్ప నేర్పు దలఁపింప నదెంతటి కార్యమైన నే
నే మఱి తీర్చి, నీకుఁగల నెంజిలిఁ బాపెదఁ జూడుమన్న నా
శ్రీమహనీయవైభవుఁడు శీతకరాస్యకు హేల కిట్లనున్. 77
తే. సిద్ధురాలు హేమావతీ సితకరాస్య
వలపు రేఖాతిశయవైభవమును దెలుప
వినఁగ నగు మోహముననైన వెతను మాన్పు
కరుణ ననుఁ జేర్చి యమ్మచ్చెకంటిఁ గూర్చి. 78
క. అని చీనీచీనాంబర
ఘనమణిహారములు మేలు కాల్కడియంబుల్
గొనబున్ మెఱుఁగుంగరములు
చనవమరఁగ నిచ్చి పనుప సముచితరీతిన్. 79
ఉ. పూని ముదంబు లుప్పతిల భూవరముఖ్యునిచేత వీడికో
లై నవరత్నకీలితమహారజతోన్నతదివ్యదీధితి
శ్రీనిధు లెల్లదిక్కుల దిసించుచు మించిన విష్ణుదాసు స
న్మానితగేహసీమకు సుమాళముతోఁ జనె హేల హేలలన్. 80
సీ. కస్తూరివీణలుఁ గపురంపు లప్పలు
నిండిన గృహములు నెరయ దాఁటి
కుంకుమాగరుఖండసంకుమదంబులు
గలుగు బిడారులు గడచిపోయి
గౌళముల్ పచ్చాకు కచ్చూరములు చాల
నించిన కొట్టడీ ల్మించి యేఁగి
పునుఁగు చట్టంబులు బుక్కారజంబులు
పొంకమౌ మళిగల పొంతఁ దరలి
తే. చూచె నొకదివ్యరత్ననిస్తులగృహంబు
నందు హేమావతీ కన్య నలరు ధన్య
వఱలు సొంపుల టెంకి జవాది వంకి
జాతి రతిలీల నా రాజదూతి హేల. 81
వ. ఇట్లు తన్నుఁ జేరవచ్చిన రాజదూతిం గనుంగొని మహారాజు మన్ననల మనియెడు పడంతుక యని రత్నంపుగద్దియపై వసియింపంజేసి స్వాగతం బడిగిన నబ్బాలకు హేల యిట్లనియె. 82
క. నీ చాతుర్యము నీవా
చాచిత్రపటుత్వరూపసంపద లెపుడున్
నీ చుట్టంబులు సెప్పఁగఁ
జూచెదనని వచ్చినాను సుదతీ నిన్నున్. 83
ఉ. చక్కనివారిలో మిగులఁజక్కనిదాన వటంచు వేడ్కతోఁ
జొక్కుచుఁ జెప్పి రందులకుఁ జూచినయందుకు నా మనోరథం
బక్కడ సిద్ధమయ్యె ఫల మబ్బెను హా యిటులుండ వద్దె? యో
చక్కెరబొమ్మ! యంచు సరసప్రతిభాషల నిచ్చగింపుచున్.84
సీ. దీనచకోరాళి తృష్ణఁ దీర్చుఁ గదమ్మ
భామ! నీ వదనచంద్రామృతమ్ము
బీదబర్హిణముల నాదరించుఁ గదమ్మ
మెలఁత! నీ వేణికామేఘపంక్తి
ఘనదరిద్రపికాళిఁ దనియఁ జేయుఁ గదమ్మ
చెలియ! నీ వాతెఱ చివురడంబు
బడుగుజక్కవల నింపడరఁ బ్రోచుఁగదమ్మ
ముగుద! నీ చనుఁదమ్మి మొగ్గదోయి
తే. పేదకీరసందోహము నేదునమ్మ
నీ వచోబృందమకరందనిర్ఝరంబు
లిట్టి పస మిసి జిగి బిగి యీ విధంబు
ప్రణుతి సేయంగఁ దరమె యా బ్రహ్మకైన. 85
క. ఇదిగాక యత్తమామల
ముద మొదవఁగ బంధుసంఘముల దాసీదా
సదళంబుల బహువిశ్వా
సదయల నీరీతి మనుచు సతులన్ గానన్. 86
వ. అని యిత్తెఱంగున. 87
ఆ. దాని యత్తతోడఁ దగ మామతో బంధు
దాసజనముతోడఁ దగిన మైత్రిఁ
గూడి యాడుచుండి కొన్నిదినంబులు
చన్న పిదప నొంటి నున్నవేళ. 88
ఉ. ఒక్క సుధాంశురత్నరుచిరోన్నతవేదికమీఁద నిద్దఱున్
మక్కువ మీఱ నుండి యనుమానముతో నొక కొంత కొంకికొం
చక్కట! నీ కొకందులకు నచ్చిక లేక మెలంగ విష్ణుదా
సెక్కడి భర్తఁ గాఁగ సృజియించె నజుండని హేల నవ్వుచున్. 89
క. ఈ రూప మీ పటుత్వం
బీ రేఖావైభవంబు లీ నెఱప్రాయం బీ రసికత నీకును మఱి
మా రాజున కగును నితరమనుజుల కగునే! 90
సీ. కలికి! నీ సిబ్బెంపు గబ్బి గుబ్బలు వాని
గడుసు చేతులఁబట్టి కలఁచఁదగునె?
కాంతరో! నీ తావి కావిమోవిటు వాని
కొక్కిదంతంబుల నొక్కఁదగునె?
చెలువ! నీ జిగి గోముగల మోము మఱి వాని
తొట్టినోరున ముద్దు వెట్టఁదగునె?
సుదతి! నీ కనకంపు సొంపు దేహము వాని
కఱకుమేనునఁ జేర్చి కలయఁదగునె?
తే. కులుకు శృంగారరసములు చిలుకఁ గీలు
బొమ్మవలె నీటు గలదానవమ్మ! నీవు
మర్కటము వంటివాఁడు నీ మగఁడు చూడ
వానితోఁ గూడి రతికేళిఁ బూనుటెట్లు? 91
క. నీవంటి రూపవతికిని
నీవంటి ప్రియుండు గలుగ నిర్మింప కయో!
యీ విధిని దగులు చేసిన
యా విధి నిటు దూర నింక నగు ఫలమేమీ? 92
తే. అయిన మగఁడెంత నీటుకాఁడైన నేమి!
ప్రాణప్రదమైన చౌశీతిబంధగతుల
నింపు సొంపును జూచి చొక్కింప నగునె?
రతికిఁ జొచ్చిన తఱి మానవతుల కెపుడు. 93
ఉ. కేరఁగరాదు, నవ్వి గిలిగింతలు వెట్టఁగరాదు చెక్కులన్
జీరఁగరాదు, గుబ్బలు ఖచిక్కునఁ గ్రుమ్మగఁరాదు కేళిలో మీఱఁగరాదు, పైకొని రమింపఁగరాదు, గళారవంబు లిం
పారఁగ సల్పరాదు మదిరాక్షులు భర్తలఁ గూడు వేళలన్.94
వ. అదియునుం గాక. 95
క. పదివేల మదను లొక్కట
నుదయించిన లీల మెఱయు నురుగుణుఁడు సుమీ!
మదిరాక్షి! చిత్రభోగుఁడు
మదిఁ గోరెను నీదు భాగ్య మహి మెట్టిదియో!96
సీ. కువలయానందంబుఁ గూర్చి యేలు ఘనుండు
విబుధులఁ బ్రోచు సద్వితరణుండు
సర్వజ్ఞమౌళి భూషణమైన ధన్యుండు
లలితవిభ్రమరూపలక్షణుండు
సరవికళల్ నించు శ్యామాభిరాముండు
వఱలెడు సన్మార్గవర్తనుండు
విష్ణుపదార్చితవిహితశుభ్రకరుండు
వితతతమోహారి వినుతశీలుఁ
తే. డమ్మహారాజచంద్రుఁ డాయన నిజాంత
రంగమంతయు నినుఁజేర్చి రమణతోడ
నేలఁ గలఁ డమ్మ! నీ పుణ్య మెసఁగె నమ్మ!
తమిని నీడేర్పవమ్మ! కుందనపుబొమ్మ! 97
వ. అనిన విని సంభ్రమభయవిస్మయలజ్జాహాసకాంక్షలు మనంబునం బెనంగొన నమ్రముఖియై హేమావతి రాజదూతి కిట్లనియె. 98
ఉ. అమ్మకు చెల్ల! యిట్టి పలుకాడుదురే? మఱి యత్తమామలున్
గ్రమ్మి తలారులై మెలఁగఁగా మగఁడున్ బులిరీతిఁ దెంపుగా బమ్మెర రొప్పుచుండఁగను బాంధవు లెల్లను గాంచియుండఁగాఁ
గొమ్మరొ! యిట్టికార్య మొనఁగూడునె? కూడిన హాని చెందదే? 99
తే. అనిన హేమావతికి నిట్టు లనియె హేల
రేపటికి నేఁటి ప్రాయంపుటేపు గలదె?
మోహ మెక్కొనఁ జక్కని ముద్దుజాణ
యొకని బిగికౌఁగిఁటను జేర్చి యుండవలయు. 100
క. ఎక్కడి మగఁ డెక్కడ సఖు
లెక్కడి నీయత్తమామ లెక్కడి చుట్టా
లిక్కొలఁది దొడ్డ కొంచెము
లెక్కింపకు మరుని హావళిన్ బడువేళన్. 101
సీ. కోటగోడలనైన మీటుగా నెగఁబ్రాకి
దాఁట నేరని దేటి తలిరుఁబోఁడి
ఘుమఘుమార్భటితోడ ఘోషించు నదులైన
నీఁది పోవని దేటి యెమ్మెలాఁడి
తనమీఁది తప్పు నొక్కనిమీఁద నిజముగాఁ
బెట్టనేరని దేటి బిసరుహాక్షి
ధవుఁడైనఁ దనజాడ తగదని పట్టిన
నిర్వహింపని దేటి నీటుకత్తె
తే. తలవరులు గన్నచో లేని తాల్మిఁబూవి
బొంకు తథ్యంబు తథ్యంబు బొంకుఁ గాఁగ
నెంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
చక్కటికిఁ దేని దది యేటి సరసురాలు. 102
వ. అని మఱియు బోధింప నంగంబు పులకాంకురానుషంగంబుగా నిజాంతరంగంబునం బొడము వ్రీడాభరం బుడిపికొని దరస్మితానతముఖాంబుజ యై యెట్టకేలకుఁ జెవి యొగ్గిన నగ్గజరాజగామినిన్ బాసి తనరాక కెదురు చూచుచున్న రాజసన్నిధికిం జని తాఁ బోయివచ్చిన కార్యం బెఱింగించె నంతట దైవయోగంబున విష్ణుదాసునకు దూరప్రయాణంబు సంభవించె నంత. 103
విష్ణుదాసుని విదేశప్రయాణసన్నాహము
తే. పయనమున కైనయవి యమర్పంగ నపుడు
పరిచరుల కానతిచ్చినఁ బటకుటీర
పాత్ర సామగ్రి మొదలైన బరువులెల్ల
శకటవామ్యశ్వవృషమహోష్ట్రముల కెత్తి. 104
వ. మఱియుం గలమాన్నంబులుం, గల వంటకంబులుఁ బొంగలి పులియోగిరంబు దధ్యోదనంబు, నానవాలు, జున్నులు, మీఁగడ పెరుగులు, నవనీతంపు ఘుటికలు, నొలుపుఁ బప్పు, నప్పడంబులు, వఱుగులు, వడియంబులుఁ, బెరుగు వడియంబులు, మిరియపుంబొడి, మెంతికూటువ, సంబారంబుఁ, జింతపండులు, బజ్జు, లుసిరికలుఁ, బచ్చ ళ్ళూరుఁబిం, డ్లూరుఁగాయలు, మామిడితొక్కులు, నివి మొదలుగాఁగల పరికరంబులును, మఱియు వడపప్పు, బేడలు వేఁపుళ్ళు, ననుఁప గుగ్గిళ్ళు, బొరుగులుఁ, బొడులుఁ, బాకపుఁ జలిమిడి, కాయమ్ములుం, జిమ్మిరుంటలు, నటుకులు, మూఁగలు, లాజలుఁ, బేలాలుఁ, జిటి కాఱుకులు, నువ్వులు నానబియ్యంబులుఁ బేలపిండిఁ, బ్రేలసత్తు, దోసగింజలు, వెల్లగిసెలు, గోఁగులు, గరింగరుము, లుపిళ్ళు, సెనగపప్పు, బొరుగుపప్పు, సారపప్పు, జీడిపప్పు, బాదంగి పలుకులుఁ, గొబ్బెర, గసగసాలు, ఖర్జూరములు, ద్రాక్ష, లాదియైన ఫలహారంబులును, మఱియు నుండ్రంబులు, మండెఁగలుఁ, గుడుములు, దోసె, లరిసెలు, రొట్టెలు, నిప్ప, ట్లప్పంబు, లతిరసంబులు, సుకియ, లమృతకలశమ్ములు, సోగులుఁ, జక్కెర బుడగలుఁ, గరిజులుఁ, బొరివిళంగాయలుఁ, దేమనంబును, బాలకాయలుఁ, జక్కిలమ్ములు, మినుఁప చక్కిలమ్ములు, మినుప పోకలు, మనోహరంబులు, గారెలు, బూరెలు, మోరుండ, లంగ రొల్లెలు, మణుఁగుఁ బువ్వులుం, బేణీలు, నీరువత్తిగెలు, మడతలుఁ, బప్పు బూరెలు, సజ్జబూరెలు, వడ, లామవడ, లొబ్బట్లు, సారసత్తులు, సేవలుఁ, జిరిమిళ్ళు, సరడాలుఁ, బరిడ గవ్వలుఁ, జాపట్లు, నిడ్డెనలు, తేనె తొలలు, బొరుగులు, నేలకికాయలు, వెన్న మెఱుంగులు, నిడికుడకలు, సడకుడకలు, ముత్తెఁపుఁజిప్పలుఁ, జంద్రకాంతలుఁ, గరిజకాయలు, బెడదలు, లడ్వాలుఁ, గోడబళ్ళు, గూడు పరిగెలుఁ, దెలుపరిగెలుఁ, బూరీలు, గూళ్పాపిడ, లాదిగాఁ గల భక్ష్యంబులు, గూడలనించి, జాతి సాతానులు గావళ్ళంబూని వెంటనంటిరా, నప్పుడు.105
తే. తనకు నిలవేల్పులౌ తల్లిదండ్రులకును
భక్తితో మ్రొక్కి దన ప్రాణపదము నైన
భార్యతోఁ దెల్పి యక్కునఁ బట్టి చేర్ప
నా వధూటియు నధికదీనాస్య యగుచు. 106
ఉ. ఓ మగరాజ! నీవు చన నొంటిగ నేనిట నుండ నేర్తునే?
నామదిఁ జూడఁగోరి యిటు న న్నలయించెద వంచు బాష్ఫధా
రామిళితాక్షియై ఘనతరంబగు శోకముఁ జెంద విష్ణుదా
సా మధురోక్తి నూఱడిలుమంచు ముదంబునఁ గుస్తరింపఁగన్. 107
సీ. నీ తావి కెమ్మోవి నిలుచుఁబో! కంచివా
ల్గంటుల మొలపంటి గంటి గుఱుతు
నీ వాలుఁగన్నుల నెఱయుఁబో! నెల్లూరి
కొమ్మల కపురంపుఁ దమ్మరసము
నీ చెక్కుల రహించుఁబో! చెన్నపట్నంపు
వారిజేక్షణల క్రొవ్వాఁడి గోరు
నీ యురస్స్థలి మించుఁబో! యఖిలక్షమా
కోమలాంగుల కుచకుంకుమంబు
తే. లింటనె మెలంగు వారల కీసుఖంబు
లెటులఁ జేకూరు? నని పల్కి హితముఁ జిల్కి పోయి రమ్మని మోము మోమున ఘటించి
చుంబన మొనర్చి పనిచె నయ్యంబుజాక్షి. 108
వ. అంత. 109
తే. మణిఖచితహేమపంజరమధ్యమునఁ
బ్రేమ నాబాల్యముగఁ దాను బెంచినట్టి
హంసరాజంబుఁ గదియంగ నరిగి, తనదు
పయన మెఱిఁగించి యింటిలో భద్ర మనుచు. 110
క. చెప్పంగఁ దగిన మాటలు
సెప్పి మరాళంబు వనుపఁ జిత్తంబున సొం
పుప్పతిల నిల్లు వెలువడి
యప్పగిదిన్ విష్ణుదాసుఁ డరిగెడువేళన్. 111
తే. ఈడము వళంద బందర యింగిలీషు
కళము మొదలైన పేఁటల గౌరలెల్ల
సౌరభద్రవ్యములు బేరసార మాడఁ
బిలువనంపిరి తమతమపేఁటలకును. 112
చ. అటువలె విష్ణుదాసుఁడు హితావళి గొల్వఁగఁ దోడిబేర మం
దుటకుఁ జనంగ హేమవతి తోడనె శంబరవైరి శాతవి
స్ఫుటచటులోగ్రపంకరుహసూననవీనశరవ్రజంబు హృ
త్పుటమున గాఁడనేయ నృపపుంగవుఁ జేరఁగఁగోరి యున్నెడన్.
చ. విలసితమోహదాహపరివేదన పొమ్మని యెత్తు పెట్టఁగా
వలపులవింటివాఁడు నెఱవాదితనంబునఁ ద్రోవఁజూపఁగా
నలమిన భీతి లజ్జ వలదం చరికట్టఁగ నింతి నంతలో
జలజహితుండు గ్రుంకె నల చానవెతల్ కనలేని కైవడిన్. 114
వ. అయ్యవసరంబున. 115
తే. తరణి తురగ ఖురోద్ధూత చరమశైల
గైరికస్థలపాంసువు ల్గప్పె ననఁగఁ
బశ్చిమంబునఁ గుంకుమపంక మటుల
సాంధ్యరాగంబు మించె నిస్తంద్ర మగుచు. 116
ఉ. కాలకలాదమౌళి దినకాంతి హసంతికలోన యామినీ
బాలకు సొమ్ము సేయుటకు భాస్కరుఁడన్ కనకంబుఁ గ్రాఁచి క
ల్లోలవతీవరాంతరములో నిడఁ దోఁచిన ధూమమున్ తమో
జాలము పర్వె, నా రవలచాడ్పునఁ దారలు వొల్చె నెంతయున్. 117
మొదటిరాత్రి
సాతాని భామిని ఱేనికడకుఁ బయన మగుట.
హంస వారించి బుద్ధిసెప్పుట.
క. అప్పుడు హేమవతి తమి
ముప్పిరిఁ గొనఁ జిత్రభోగ భూపాలునితో
నప్పుష్పబాణుకదనము
చొప్పడ నొనరించు వాంఛ చొరఁ దమకమునన్. 118
చ. పరఁగెడు రస్తు కొట్టుడులు భద్రముగా నొగి బీగముద్రలున్
గరిమ నొనర్చి తొత్తులకు గ్రాస మొసంగి నికాయకృత్యముల్
దరలిచి యత్తమామల పదంబుల నొత్తుచు నిద్రపుచ్చి మై
మెఱపుగ శీతలాంబువుల మిన్నగ మజ్జనమాడి వేడుకన్. 119
సీ. మెఱుఁగుఁగుచ్చెలమీఁద జరతారుపని మీఱు
చెంగావిరంగారు చీరఁ గట్టి గుజరాతి జిగిసిస్తు గోట్లదాఁపిన డాలు
రహి మించు పైఠిణీరవికఁ దొడిగి
ఘుమ్ముఘుమ్మని తావి గ్రమ్ము చొకాటంపుఁ
గలపంబు సొగసుగాఁ గలయ నలఁది
తళుకుతళ్కునఁ గాంతి చిలుకఁ గుల్కెడు జాతి
మణిభూషణంబులు మమతఁ దాల్చి
తే. తిలక మొగిఁదీర్చి మితభుక్తి సలిపి వెంట
బూమె లెఱుఁగని యొకపాటి బుడుత, యాకు
మడుపు లందీయ మోహంబు మరులు గొల్ప
వెడలె నల భామ నిజకేళివేశ్మసీమ. 120
వ. అటుల వెలువడి. 121
తే. తనదు ప్రాణంబు దైవంబు తల్లి తండ్రి
యనుచుఁ జెలియైన యల రాజహంసమున్న
దివ్యనవరత్నఖచితదేదీప్యమాన
కనకపంజర మొక్కింత గదిసి నిలిచె. 122
చ. నిలిచి దరస్మితంబయిన నెమ్మొగ మించుక వంచి యాత్మఁ దాఁ
దలఁచినకార్యమెల్లఁ బ్రమదంబునఁ దిన్నని కల్కిపల్కులం
దెలిపిన రాజహంస సుదతీమణిఁ గన్గొని పక్షయుగ్మముం
దలఁ గదలించి యందుకు మనంబునఁ జింతిలి యప్పు డిట్లనున్. 123
ఉ. అక్కట! భర్తకాఁపురము నాఱడిపుచ్చి నృపాలమౌళితోఁ
జొక్కి రమించునందులకుఁ జొచ్చినఁ, దావక బంధువర్గముల్
తక్కువ సేతురమ్మ! చరితవ్రతముల్ చెడునమ్మ! జాతికిన్
బక్కున నిందఁ జెంది తలవంపులు దెత్తురఁటమ్మ! మానినీ! 124 సీ. అత్తమామలు గన్న నాఱడిపుత్తురు
బావ పరీక్షింప నేవగించు
మఱఁదులు గాంచినఁ గఱకఱి నెంతురు
వదినె లెఱింగిన వాసి చెడును
బంధువుల్ గనినచోఁ బరఁగ నిందింతురు
తోడికోడలు చూడ నాడికొనును
బతి కనుఁగొన్నచోఁ బ్రాణహాని యొనర్చు
వాడవా రెఱిఁగిన వన్నె దఱుఁగు
తే. నరయ నిదిగాక యన్నిఁట నాఁడుపుట్టు
పుట్టఁ బాపంబు, పుట్టినఁ బుట్టినింటి
కేని మఱి చొచ్చినింటికేన్ గీర్తిఘనతఁ
దేక, యపకీర్తిఁ దెత్తురే? తెఱవ లెచట.
క. అగుఁ బ్రాణహాని యపసిరి
యగణిత మగు మానభంగ మహహా! తెలిసెన్
దెగువయె యింద్రపదవి యనఁ
దగు బుద్ధి జనియింపఁబోలుఁ దరుణీ! నీకున్.
సీ. పంక్తికంఠుని మోహ పరితాప మెంచెనే
భువనమాత జగత్ప్రపూత సీత
యల పుళిందునిఁ బొంద నాసక్తిఁ జెందెనే
ప్రియ హితామితనయ భీమతనయ
నహుషుని విరహంపుఁ దహదహల్ సూచెనే
సాంద్రసద్గుణచర్య యింద్రుభార్య
మఱి సింహబలుని పెన్మాయలఁ జిక్కెనే
యాఱడి పనిఁబూని యాజ్ఞసేని
తే. మునుపటి పతివ్రతలు మహామూర్ఖచిత్తు
లైన దుర్జను లతిఘోరసూనసాయ కాస్త్ర జర్జరితాత్ములై యాసపడిన
మాన ముడిపుచ్చుకొనిరఁటే మచ్చెకంటి! 127
చ. పతిహితభక్తిచే వెలయు పద్మదళప్రతిమాననేత్రకున్
వ్రతముల సోదు లేటికి? ధ్రువంబుగఁ బుణ్యము లబ్బు నెప్పుడున్
బతినిఁ దిరస్కరించి పరభర్తలఁ జెందిన భామ పుణ్యముల్
గతజలసేతుబంధములు గావె? వచింపఁగ నెంత నోచినన్. 128
క. పతిసేవయె భూషణములు
పతిసేవయె జీవనంబు భామామణికిన్
బతిసేవయె సువ్రతములు
పతిసేవయె యిహముఁ బరము భాగ్యము లనుచున్. 129
క. లలి జాగ్రత్స్వప్నసుషు
ప్తులను మనోవాక్శరీరములచే నేవే
ళలనైన సతులు పరపురు
షులఁ గోరిన వన్నెలేదు చూవె! ధరిత్రిన్. 130
క. ఈరీతి హంస పలికిన
నారీమణి చెవుల నవియు నారాచములై
దూఱి చుఱుక్కున నాటినఁ
గ్రూరకటాక్షములఁ గ్రేటుకొని తనుఁ జూడన్. 131
వ. అత్తెఱవ చిత్తం బెఱింగి మరాళం బక్కటా! యిత్తరుణి దుష్కర్మాయత్తతం బరాయత్తచిత్తవృత్తి యయ్యె, నిట్లగుట మదీయసునీతివాక్యంబులు దీనికిం బరుషంబులై తోఁచుచున్నవి. సమదమదనప్రదరవేదనాదోదూయమానంబైన దీని మానసంబు సామంబునం గాని చక్కంబడదని కొంత తడ వంతరంగంబునఁ జింతించి వెండియు నా రాజహంసంబు హంసగమన కిట్లనియె. 132
తే. మానవతి! నీవు పరసంగమమున కాస
పడఁ దలంచితి వేనిఁ జేపట్టు కొంచె
మైన చక్కని యొక యందగాని తోడఁ
గూడి యాడక, రాజులఁ గోరఁదగునె? 133
మ. అధిపుల్ క్రూరఫణిస్వరూపు లధరం భాసించు టేరీతి? భూ
మిధవుల్ కాలకరాళకీలిసదృశుల్ మేన్మేనఁ బొందించు టె
ట్ల? ధరాధీశులు మత్తదంతిసము, లేలా నీకుఁ జెల్లాట మా
డ? ధరాభృత్కుచ! యిత్తెఱం గెఱిఁగి, వేడ్కన్ గోర్కు లీడేర్చుకో! 134
క. ఇలపతుల చిత్తవృత్తులు
గలయికలం దెలిసి మెలఁగు కాంతల కెలమిన్
జెలు వొనరు జయము చేకుఱు
నలఘు శ్రీసౌఖ్య మబ్బు నంబుజగంధీ! 135
వ. ఇట్లు గావున నిత్తెఱంగునఁ దత్తరంబు లేక నృపవరోత్తముల చిత్తవృత్తి దెలిసి హత్తుకొన వర్తిల్లు మని హంసంబు ప్రత్యుత్తరం బిచ్చు నవసరంబున. 136
సీ. పిసవెఱ్ఱి కసరెత్తి యెసరేఁగు నసగూఁటి
పూఁబోండ్లు తమ యిండ్ల పొంతకరుగఁ
బరుసొమ్ములకు నిమ్మువడఁ గ్రమ్ము నెఱహమ్ము
తస్కరుల్ దిగులొంది తావుఁ జేరఁ
దనరారు సిరిసౌరు తనివారఁ గలవారు
కనుగూర్క మదిఁ గోరి కన్నుమూయ
రతిరూపు పసమాపుగతి చూపుగల కాఁపు
గుబ్బెత లెసటికై కుండ లరయ
తే. దూరదేశసమాగతధూర్తపాంథ
జనసమూహంబు పయనంబు సాఁగ లేవ
ఱెక్క లలరించి కుత్తుకల్ నిక్క మించి
కొక్కొరోకో యటంచును గోళ్ళు గూసె. 137
క. తెలతెల నయ్యెను దిక్కులు
పలపల నుడుగణము మాయఁ బాఱెను బక్షుల్
కలకలనఁ గూయఁ జొచ్చెను
దులదులఁ దుమ్మెదలు తమ్మితుటుముల వెడలెన్. 138
తే. అపుడు హేమవతీకన్య హంసనుడుపు
నీతిచాతురి వినురీతి నేర్పు మాని
పడుకటిలు సేరి కళవళపడుచు నిమిష
మొక్క యేడుగఁ బవలెల్ల నొనరఁ గడపె. 139
క. ఉదయోపరి రవి సింహము
మది మీఱఁగ నస్తశైల మత్త ద్విపమున్
బొదువ గమకించి దుమికిన
యదొ యన దినకరుఁడు పశ్చిమాశకుఁ జేరెన్. 140
తే. రసికుఁ డైనట్టి కాలంపు వ్రాతకాఁడు
తనరు బ్రహ్మాండ మను పెద్ద దవతిలోన
శాయి నిండారఁ బోసిన చందమునను
గారు తిమిరంపు గుంపు సొంపారఁ బర్వె. 141
చ. పనుపడ మిన్ననుం గడితపాళెఁ దమంబునఁ గట్టిపెట్టి శో
భనతరచంద్రదీధితులపంక్తి జమాఖరుచుల్ లిఖించి యిం
తనుకొని కాలమన్ గణకుఁ డప్పుడు తీర్చి లిఖించినట్టి యా
దినవహి లెక్కవ్రా లనఁగఁ దెల్విగఁ జుక్కుల పర్వె నత్తఱిన్. 142
చ. జలకము లాడి జీని బురుసాపని వస్త్రముఁ గట్టి మోమునన్
దిలకముఁ దీర్చి క్రొవ్విరులు నించి కచాళిని గబ్బిగుబ్బలున్
గలపనులంది గందవొడి గమ్మనఁ బూసి, నృపాలునింటికిన్
జెలియ చనం దలంచె రతిశిక్షకు రెండవనాఁటి మాపునన్. 143
తే. పోవుచో నమ్మరాళంబు పొంత నిల్వఁ
జెలియ పూనిన జిగినీటు కులుకుఁ జూచి
రాజహంసంబు వలికె, నో రాజవదన!
పోయెదవు గాని యుపమతోఁ బొసఁగి చనుము. 144
క. ఉపమ యెఱుంగని వారల
కపరిమితావస్థ లొందు నది యెట్లన న
య్యుపమ యెఱుంగక కాదే
చపలత మున్నొక్క నక్క సమసెన్ బెలుచన్. 145
వ. అనిన విని హేమావతి యిట్లనియె. 146
రెండవ రాత్రి కథ.
కక్కుఱితిబడి చచ్చిన నక్క
క. ఆకథ వినియెద నుడువు, సు
ధాకరకలు రాలఁ దేనె ధారలు చిలుకన్
లోకేశ తురంగమ! యన
నా కలికికి రాజహంస మపు డిట్లనియెన్. 147
క. వినవమ్మా! హేమావతి!
కనవమ్మా! స్థూలసూక్ష్మకార్యములు దగన్
మనవమ్మా! నన్నో చ
క్కని కొమ్మా! మెచ్చుకొమ్మ! కథ విని పొమ్మా! 148
క. విభ్రమమణిమండనమస
నభ్రంకషసౌధకేతనాంశుకజనితా
దభ్రానిలహతగతిజా
తాభ్రమణిహయశ్రమోద మప్పుర మమరున్. 149
క. ఆ పురవరమణిలో గుణ
దీపక నామమున భూమిదేవుం డలరున్
జూపట్టి వేదశాస్త్ర
వ్యాపారముచేత రెండవవిధాత యనన్. 150
సీ. అరఁగులసున్నపుటెఱమట్టి పట్టెలు
దీర్చిన గోడలు తేజరిల్ల
నిండుసున్నపుఁబూత నెఱచాలు బోదెలు
దిద్దిన దేవరమిద్దె దనర
నారికేళపుమట్టతీరుగా నలికిన
ముంగిలి మలెసాల ముద్దుగులుకఁ
బంచవన్నియ మ్రుగ్గు పద్మముల్ నించిన
బృందావనము లోఁగిలందె వెలయ
తే. నుదికిన మడుంగుదోవతు లుంచినట్టి
దండె మౌపాసనము సేయు కుండ మమరఁ
బడలిక లడంచు పసపాకు పంది రలర
నుండు నా బ్రాహ్మణుని గృహం బుత్పలాక్షి! 151
చ. అతనికిఁ జారుశీల యను నంబుజగంధసుగంధి యొప్పుఁ ద
త్సతి తనయుండు లేమిఁ బరితాపముతోఁ గడుఁ బుణ్యభూము లా
యతమతిఁ ద్రొక్కఁ బూర్వసుకృతాంశముచే నొకఁ డుద్భవించె సం
తతశుధాముఁ డప్రతిమధాముఁడు రామగుణాభిరాముఁడై. 152
బ్రాహ్మణ కుమారుని
చదువు సంధ్యలు — తీర్థయాత్ర
వ. అంత గర్భాదాన పుంసవన సీమంత జాతకర్మ నామకర ణాన్నప్రాశన చౌలోపనయన వివాహ ప్రాజాపత్య సౌమ్యాగ్నేయ వైశ్వదేవ గోదాన స్నాతక పితమేధంబులను షోడశకర్మంబు లెఱుంగంజేసి. 153
తే. వాని తలిదండ్రు లత్యంతవత్సలతను
బూఁటపూఁటకు గోముచేఁ బొసఁగఁ బెంచి
ప్రాభవం బొప్ప నసమానవైభవమున
ఘనత షోడశకర్మాధికారుఁ జేయ. 154
వ. అంత నత్యంతకుశలస్వాంతంబున నవ్వటుశిఖామమి వేదవేదాంగాది బ్రహ్మవిద్యాభ్యాసానంతరంబు గానంబును గవిత్వంబును గొక్కోకంబును జూదంబును దేశభాషల విజ్ఞానంబును లిపిలేఖనంబును జరాచరాన్యధాకరణంబును విలువిద్యయును సర్వజ్ఞానపరిజ్ఞానంబును శాకునంబును సాముద్రికంబును రత్నపరీక్షయు నరదంబుఁ బఱపుటయుఁ దురగారోహణంబును గజారోహణంబును మల్లశాస్త్రంబును బాకచమత్కారంబును దోహదప్రకారంబును ధాతుగంధరసఖనిజవాదంబులును గుట్టుపనుల వినోదంబు మహేంద్రజాలంబును జలాగ్నిఖడ్గస్తంభనంబును మొనకట్టును వాకట్టును రయస్తంభనంబును వశ్యాకర్షణమోహనంబులును విద్వేషణోచ్ఛాటనసంహరణంబులును గాలవంచనంబులును బక్షిగతిభేదంబులును యోగవాదంబులును వచనసిద్ధులును ఘుటికాసిద్ధులును బరకాయప్రవేశంబును నింద్రజాలంబును నంజనభేదంబులును ధ్వనివిశేషజ్ఞానంబులును దృష్టివంచనంబులును స్వరవంచనంబును మణిమంత్రక్రియలును జోరత్వంబును జిత్తరువు వ్రాయుటయు లోహకారకత్వంబును శిలాభేదకర్మంబును గులాలకర్మంబు రథకారకర్మం బును శూర్పకారకర్మంబును జోళ్ళు నిర్మించుటయుఁ బటకారకర్మంబును నదృశ్యకరణంబును దౌత్యకర్మంబును వేఁటసన్నాహంబును బేరంబును బాశుపాల్యంబును గృషియు మైరేయంబుఁ గూర్చుటయు లావుక కుక్కుట మేషాదుల పోరు హత్తించుటయు ననియెడు చౌషష్టివిద్యలమర్మంబు లెఱింగి యొప్పుచుండు. 155
క. ఈ రీతి సకలవిద్యల
నారూఢిగ నారితేఱి యవ్వటుఁడు సదా
చారస్థితి గంగాయా
త్రారంభవిజృంభమాణహర్షోదయుఁడై. 156
సీ. సకలాతు కుళ్ళాయి యొకయింత కాన్పింపఁ
జుట్టియుండిన పంచె సొంపు దనరఁ
బడెఁడు బియ్యము వండఁ బాటైన తపెల యుం
చిన చిన్నియసిమి దోస్సీమ వెలయ
ముంజిపైఁ గనుపట్ట ముద్దుగాఁ గట్టిన
యంగవస్త్రపుగుడ్డ చెంగులలర
మాంజిష్టి గలిపిన మంత్రాక్షతంబులు
పోసిన మారేడుబుఱ్ఱ యమర
తే. ధౌతశాటియుఁ బరిపాటి ధావళియును
వఱల వేదాంతశాస్త్రంబు వ్రాసినట్టి
తాళదళపుస్తకము చంకఁదనరఁ బూని
చనియె గడిదేఱి యా బ్రహ్మచారి మీఱి. 157
క. ఈ లీల సకలపురములు
శైలంబులు నదులు నిధులు శాఖిచయంబుల్
గాలువలుఁ బల్లె పట్టము
లాలోకింపుచును బోయి యవ్వటు వెదుటన్. 158
సీ. ప్రాలేయశైలాధిపాలకసంజాత
కర్పూరధౌతలోకప్రపూత
జలధినాయకుఁ డేలు సరసంపు టిల్లాలు
పటు భగీరథతపఃఫలము మేలు
తారాధ్వఘట్టనోద్ధతవేగకల్లోల
యఘమహారణ్యదావాగ్నికీల
చంద్రశేఖరశిరస్స్థలశుభ్రసుమదామ
చందనకుందేందుసదృశభామ
తే. రంగదుత్తుంగదీర్ఘతరంగసంఘ
ఘుమఘుమధ్వానమేఘనిర్ఘోషనృత్య
దహిభుగుద్వేలవాలాంశుయామనోర్మి
సంగమభ్రాంతి దాభంగ గంగఁ గనియె. 159
మ. కని యభ్యంచితదివ్యతీర్థములలోఁ గౌతూహలం బొప్పఁగా
ఘననిష్ఠారతి మీఱ భైరవున కర్ఘ్యం బిచ్చి సంకల్పమున్
వినతుల్ స్నాన మొనర్చి తత్తటమహోర్వీవాసవిద్యాతివృ
ద్ధనికాయం బొగిఁ దెల్ప జాహ్నవిమహత్త్వంబుల్ వినెన్ భక్తితోన్. 160
వ. అంత నాబ్రాహ్మణకుమారుండును దత్తీరవాసులకు నిజార్చితద్రవ్యంబులు వ్యయంబు చేసి గో భూ తిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడ రౌప్య లవణంబులను దశదానంబులను దులాపురుష హిరణ్యగర్భ హిరణ్యరథ హేమహస్తి హేమలాంగూల పంచలాంగూల విశ్వచక్ర కల్పలతా సప్తసాగర రత్నధేను భూత సంఘట్టనంబులను షోడశమహాదానంబులు చేసి కాశికాపురంబున కరిగె నప్పుడు. 161
సీ. చిత్రకూటసమాన చిత్రకూటవిమాన
భాసురంబు విశిష్టభూసురంబు
వైజయంత వితాన వైజయంత వితాన
భూషణంబు నృపాల భీషణంబు
భాసమాన శశిప్రభాసమాన క్షౌమ
సుందరంబు కిరాటమందిరంబు
సుమనస్స్తుతోద్దామ సుమనస్స్తుతారామ
బంధురం బురుశూద్రసింధురంబు
తే. సతతబహువైభవాసదృశప్రభావ
కీర్తిరాజితకుండలీకృతసుధీర
వజ్రమణిదీప్తవప్రాంశువలయలలిత
గోపురంబై రహించుఁ గాశీపురంబు. 162
ఉ. ఆ పుటభేదనేంద్ర దృషదావళి కల్పితగోపురాశిపై
నేపున మాపు ఱేపుఁ జను నిందు దినేంద్రులఁ బర్వఁ దద్ద్యుతుల్
బాపురె! వీనికిన్ గ్రహణబాధ యపర్వములందు నేక్రియన్
బ్రాపిత మయ్యె నంచు మది భ్రాంతి వహింతురు తాంత్రికోత్తముల్. 163
తే. అట్టి పుణ్యస్థలంబున కరిగి వేడ్క
గడలుకొన మణికర్ణికాఘట్టమునను
నిలిచి జలకచ్ఛమున స్నాననిష్ఠఁ బూని
వెడి మాధ్యాహ్నికక్రియల్ వేగఁ దీర్చి. 164
క. మణికర్ణిక మణికర్ణిక
మణికర్ణిక యనుచు నుడువు మనుజుల కెల్లన్
గణనాతీతపు దోషము
లణఁగి శతక్రతుఫలంబు లగునని తలఁచెన్. 165
వ. అంతట నవ్వటుశిఖామణి నమకచమకంబుల రుద్రన్యాసయుక్తంబుగా విశ్వేశ్వరు నభిషిక్తుం జేసి పూజించి ప్రదక్షిణనమస్కారంబులు గావించి యిట్లని స్తుతియించె. 166 సీ. జయ భక్తమందార! జయ దుష్టజనదూర!
జయ జగదాధార! శరణు శరణు
జయ నిత్యకల్యాణ! జయ భృత్యసంత్రాణ!
జయ రమాధిపబాణ! శరణు శరణు
జయ గోత్రపుత్రీశ! జయ రక్షితసురేశ!
జయ పంచశరనాశ! శరణు శరణు
జయ శరద్ఘనగాత్ర! జయ పావనచరిత్ర!
జయ కేందుశిఖినేత్ర! శరణు శరణు
తే. జయ నిశితశూలసాధన! శరణు శరణు
జయ మఖామోఘనాశన! శరణు శరణు
జయ హయాకృతనందీశ! శరణు శరణు
జయ మహాదేవ! విశ్వేశ! శరణు శరణు. 167
సీ. శ్రీపార్వతీకుచశిఖరిస్థలవిహార!
హారాయమానమహాభుజంగ!
జంగమస్థావరసంచారసమభావ!
భావజరూపప్రభావహరణ!
రణరంగనిర్జితరౌద్రమహాసుర!
సురయక్షసేవితచరణయుగళ!
గళదరస్థాపితకాలకూటక్షీర!
క్షీరాబ్ధిపుత్రీశఘోరబాణ!
తే. బాణనామకరాక్షసత్రాణదక్ష!
దక్షకల్పితయాగవిదారణోగ్ర!
[1]యుగ్రభీమాదినామధేయప్రసిద్ధ!
సిద్ధబయభంగ! కాశి విశ్వేశలింగ! 168
క. అని సన్నుతించి వేడ్కలు
గొనలొత్తఁగ బ్రహ్మచారికుంజరుఁడు క్రమం
బున దేవతాధివాసము
లనువొందఁగఁ గాంచి భక్తి యలమిన మదితోన్. 169
క. డుంఠి గణాధ్యక్షుని శితి
కంఠుని భైరవునిఁ జండికన్ బటు విద్వ
త్కంఠీరవ మపుడు మహా
కుంఠితతాత్పర్యమునను గొలిచి భజించెన్. 170
వ. తదనంతరంబునఁ బంచక్రోశంబునం గల మహాదివ్యలింగంబుల సేవించి యచ్చోటు వాసి తైర్థికజనహితసమ్యగయగు గయకుఁ జని గదాధరుం గొనియాడి ప్రయాగ కరిగి త్రివేణీసంగమంబునం గృతస్నానదానాద్యనుష్ఠానుండై మాధవు నారాధించి సప్తపర్ణపటంబుం గనుంగొని త్రివేణీతీర్థంబులు నించిన కావడిఁ గైకొని పంచక్రోశంబున నొక్కమరకతలింగంబు సంగ్రహించి నిజస్థానగమనోన్ముఖుండై. 171
సీ. కావడిపై నంటఁగట్టిన యొక కావి
శాటి కంబళి యాత్రసంచి యలర
నేతి లడ్డిగ నీళ్ళు నించిన సొఱకాయ
బుఱ్ఱ లిర్వంకలఁ బొసఁగి యుండ
నెగనెత్తి కుఱుచగా బిగియఁగట్టిన పంచె
పై బిగించిన ప్రాఁతబట్ట యొప్ప
ముఖఘర్మములఁ డోసి మునుఁగఁ జుట్టిన పల్లె
కొనలు మారుత లౌల్యమున హరింప
తే. గమనజవమున నఱ్ఱాడు కావడదరి
కిఱ్ఱుకిఱ్ఱని భుజమునఁ గేళి సల్ప
గౌడరుద్రాక్షమాలికల్ కంఠసీమఁ
దనర వచ్చెను వేడ్క నత్తైర్థికుండు. 172
క. ఈ రీతిఁ దన గృహంబున
కారయఁ జనుదెంచి కావ డటు దించి మహా
ధీరుఁడు జననీ జనకుల
కారూఢిగ సంఘటించె సాష్టాంగమ్ముల్. 173
క. తత్సమయంబున వారలు
వత్సా! మఱి యాత్ర సలిపి వచ్చితె? యని యు
ద్యత్సంతోషంబునఁ దమ
వత్స స్థలిఁజేర్చి ప్రేమ వర్ధిలి చెలఁగన్. 174
తే. శిరము మూర్కొని వదనంబు చెమటఁ దుడిచి
యాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
గాను దీవించి యత్యంతకరుణ మెఱయఁ
గొడుకు తోడను నిట్లని నుడివి రపుడు. 175
క. ఏ యే పుణ్యస్థానము
లే యే తీర్థస్థలంబు లేయే ద్వీపా
లేయే భూములు సూచితి
వాయా మహిమలు వచింపు మర్భక మాకున్. 176
క. అని యడిగిన తలిదండ్రుల
కనునయమునఁ గాశి గయ ప్రయాగము మొదలౌ
ఘన పుణ్యక్షేత్రంబులు
గని వచ్చితి, లింగ మిదిగొ! కౌతుక మమరన్. 177
క. ఈ పురవరమణి చెంగట
నీ పరమేశ్వరుఁ బ్రతిష్ఠ నెంతయుఁ జేతున్
దాఁపురము మోక్షలక్ష్మికిఁ
గాఁపుర మభివృద్ధిఁ బొందుఁగద మన కనియెన్. 178
తే. పుత్రకుని వాక్యవిస్ఫురద్బోధమునకుఁ
దల్లిదండ్రులు సంతోష ముల్లసిల్ల
నపుడు పాషాణభేదుల కర్థ మిచ్చి
ఠీవి నొక దేవళంబుఁ గట్టించి రపుడు. 179
సీ. డంబై న గర్భగృహం బంతరాశికం
బును ముఖమంటపంబును జెలంగ
గాలిమంటపము ప్రాకారంబు లోవలు
బోదెలు చుట్టలు పొందు పడఁగఁ
గప్పట చట్టముల్ ఘన గోపురమ్ములు
జగతియుఁ జప్పటల్ సొగసు గులుక
గచ్చుగోడలు ఱాతికంబముల్ పాలసు
న్నము సువర్ణము ద్వారసమితి వెలయ
తే. దృష్టిపాత్రపు బొమ్మలు తేజరిల్ల
నుఱుకు సింగంబు లరగూళ్ళు మెఱుఁగుఁ దోర
ణములు చిత్తర్వు క్రొంబనుల్ రమణ కెక్క
దేవళము మించె నత్యంతదివ్య మగుచు. 180
క. ఆ దేవళంబులోన మ
హాదేవుని నొక్క దివ్యమగు శుభవేళన్
బాదుగఁ బ్రతిష్ఠ చేసిరి
వేదాగమశాస్త్రరీతి వేడ్క దలిర్పన్. 181
సీ. చెఱఁగు దోవతి పైనిఁ జీరాడఁగా బోడి
తలచుట్టు ధౌతవస్త్రంబు మెఱయఁ
జెక్కులకును దిగి పిక్కటిల్లు విభూతి
పెండెకట్లు లలాటభిత్తి నమర
గళమున నులిగొన్న కావిదారముతోడి
రుద్రాక్షమాలికల్ రూఢిఁ దనర
మారేడు బుఱ్ఱలో మక్కళించిన సందిఁ
గట్టిన చంద్రశేఖరుఁడు వెలయఁ
తే. బెట్టె మూఁకుడు లోపల బిల్వపత్రి
మట్టి ధూపార్తి దీపముఁ బెట్టు చమురుఁ
బొందుపఱచుక మునిమాపు పూజసేయఁ
గ్రొత్త కాణాచి తంబళి హత్తుకొనియె. 182
క. ఈ తీరున నల తంబళి
భూతేశుని పూజ సేయఁ బుష్పంబుల సం
ఘాతముఁ గొని తేలేమని
యా తట్టున నొక్కతోఁట నమరఁగఁ జేసెన్. 183
సీ. సంపెఁగల్ మొల్లలు జాజులు గన్నేర్లు
విరజాజులును మంచి కురువకములు
పొద్దుదిరుగుడు పూల్ పొన్నలు మల్లెలు
పారిజాతములు సేవంతి విరులు
తామరల్ సూర్యకాంతమ్ములు కల్వలు
బొండుమల్లెల పొదల్ పొగడ తరువు
లల్లి పువ్వులుసు నంద్యావర్తములు వాడ
గన్నేరులు తురాయి గట్టిపూలు
తే. మాచిపత్తిరి గగ్గెర మరువము కురు
వేరు దవనమ్ములును వట్టివేళ్ల గుములు
బిల్వవృక్షము లాదిగాఁ బేరుగలవి
ప్రబల నొక తోఁట వేయించి బావిఁ ద్రవ్వె. 184
మ. అమితానర్ఘ్యనిబద్ధశుద్ధశశికాంతాయామసోపానసం
గమ, మంబుగ్రహణాగతోరుపథికాక్రాంతస్పురత్కుట్టిమం
బమలాంభోరుహషండపాండుకుముదాచ్ఛామోదసంవాసితం
బమృతప్రాయజలాభిపూర్ణ మగుచు న్నాబావి యొప్పుం గడున్. 185
క|| అబ్బావికిఁ జేయేతం
బుబ్బుచుఁ దంబళి యొనర్చి యుత్సాహంబున్
గుబ్బతిలఁ గొన్ని చెట్లకు
నిబ్బరమున జలములెత్తి నిస్త్రాణుండై. 186
తే॥ ఎలమి మఱికొన్ని చెట్టుల కెత్తి యెత్తి
యలసి ముంగిసమ్రానితో నానియుండఁ
గుండ నిండారఁగా ముంచి కూడుదినఁగ
నింటి కేఁగెను బడలిక లంటి పెనఁగ. 187
వ॥ అంత నొక్క బక్క నక్క గుక్కు మిక్కనుచు డొక్కం బిక్కటిల్లిన క్షుధానలంబున దందహ్యమానంభై డస్సి. 188
తే॥ పుట్టలను దిట్టలను జెట్లఁ బొట్ల గట్ల
వంకలను డొంక లను బీళ్లఁ బాళ్ల ఱాళ్ల
గుప్పలను దిప్పలను మళ్ల గుళ్ల నూళ్ల
దిరిగి యాహార మందక సొరిగి యరిగి. 189
సీ!! వాణికై పోరాడవచ్చి యెందఱు బ్రహ్మ
దేవుల మనువారు తీఱి చనిరి
పార్వతీ రతులకై బహుపోరి యెందఱు
రుద్రుల మనువారు రోసి చనిరి
సిరినిఁ జేపట్టఁగాఁ జేరి యెన్ని దశావ
తారముల్ కలహించి తీఱిపోయె
శచి మాఱుమనువు రచ్చలఁబెట్టి యెందఱే
నింద్రుల మనువార లేఁగి రహహ!
తే|| చూడ నవియెల్ల యుగచర్య సుద్దులయ్యె
బోయెఁగాలంబు పూర్వవిస్ఫురణ దప్పె
దార్ఘ్య మాలోచనము తెల్వి తగ్గుపడియె
నౌర! విధి నేఁటి కిట్లాయె ననుచు నడరి. 190
తే. ప్రాము జఠరాగ్నిచేఁ "గింకరోమి" యనుచు
నడరు వేదనచేఁ "గ్వ యాస్యామి" యనుచు
విస్మయపు మూర్ఛచే "నాహతొ౽స్మి" యసుచుఁ
బలుపరింపంగ సాగె సబ్బక్క నక్క. 191
వ. ఇట్లు క్షుధాతురత్వంబునఁ గంఠగతప్రాణంబై నోరం దడిలేక మాటిమాటికిఁ బొడము మూర్చల నలసి సొగయుచు మెత్తమెత్తగా వచ్చి తత్కూపతటస్థితద్రోణికాగ్రంబున నుస్న యల్పజలంబులం దన కంఠంబు దడిపికొని యయ్యేతంబు ముంగిసమ్రానికి వెదురునకు నంటఁగట్టిన వారు పరిమళం బాఘ్రాణించి దోనింబడి చని నేఁడీపశుకృత్తి రజ్జువున క్షుధాభరంబు హరించెద నని తలంచి, యుబ్బుచు నెక్కొను తమకంబును ముంగిసమ్రాని పైకిఁ జివుక్కున నెక్కి యబ్బక్క సక్క దారువేణు బంధనంబగు చర్మరజ్జువుం దెగం గొఱికిన. 192
తే. మ్రాను మీటుగ నెగయ గోమాయు పప్పు
డేకతాళప్రమాణ మట్లెగసి కూన
గుంతలోఁ బడి గుడ్లు వెల్కుఱుక నాల్క
నడుము గఱచుక నఱచుచు బెడసి మడిసె. 193
వ. అట్లు క్షుధాతురత్వంబున నాహారంబె చూచెఁ గాని తన చేటుఁ దెలియ దయ్యె. నీవా నక్క తెఱుంగున రాజసంయోగంబె చూచెదవు గాని యితరోపద్రవంబులు విచారింప వయిన నిత్తెఱంగునఁ జిత్తంబునఁ దత్తరంబు లేక తెలిసి మెలంగుమని హంసంబు నయోక్తులు పలుకు సమయంబున. 194
చ. అలమినవేడ్క ఘోష కనకాంగులు మజ్జిగఁ జిల్క, గాఁపుఁగూఁ
తులు తెలియావనాళములు ద్రొక్కఁగ జారగభీరనాయికల్
నిలయముఁ జేరఁ దస్కరులు నెక్కొను భీతిని దావులెక్కఁగాఁ
జెలఁగుచు వేగుఁజుక్క పొడిచెన్ బలసూదను దిక్తటంబునన్. 195
క. అంతట హేమావతి గే
హాంతరమున కేఁగి పార్థివాయత్తమతిన్
గంతు సుమకుంతదళిత
స్వాంతంబున నా దినాంతసంతమసమునన్. 196
చ. కలపము గబ్బిగుబ్బలను గమ్మను పూలసరాలు కొప్పునన్
గులికెడి చంద్రకావి నెఱికుచ్చెలఁ దీరినకోక శ్రోణినిన్
దిలకము మోమునన్ మణులఁ దీరిన సొమ్ములు మేన వేడుకన్
వెలయ నమర్చి మేల్ముసుగు వేసి నృపాలుని కేళిఁ దేలఁగన్. 197
మూడవ రాత్రి కథ
నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుఁడను వైద్యునిఁ గూడుట
క. కలహంసోజ్జ్వలరత్నశ
కలహంసకయుగము ఘల్లుఘల్లని మ్రోయన్
గలహంసగమన చనఁగాఁ
గలహంసము హేమవతిని గని యిట్లనియెన్. 198
ఉ. ఇంకొక గాథ కద్దు విను మింతటిలోఁబడి పాఱిపోవఁ డో
పంకరుహాయతాక్షి! యుపభర్తల హత్తుక తత్తరాన మీ
నాంకుని కేళిఁ దేలఁగఁ జనంగ నొకానొక మాటవచ్చినన్
బొంకఁగ “లేదు బంతి" యని బొంకవలెన్ గులటావధూటికిన్. 180
క. అని రాజహంసమణి ప
ల్కిన హేమావతి వినోదకేళిగతి గిరు
క్కున మరలివచ్చి యా కథ
వినియెద ననువొందఁ దెల్పు విహగోత్తంసా! 200
వ. అని యడిగిన హేమావతికి హంసం బిట్లనియె. 201
క. విను మనఁగా ననగా నొక
కనకోజ్జ్వలకూటఝాటఘనగోపురశో
భనకృతకదరీకృతనా
కనగరి మణిభద్రపురము గల దొక భూమిన్. 202
క. ఆ నగరము భోగప్రతి
భానగరిపుఁ డైన మానిభద్రుఁడు భద్రా
నూనచరిత్రుఁడు కాంతిసు
ధానిధి నృపు లెంచ శాశ్వతమ్ముగ నేలున్. 203
తే. అతని చెంగట నసహాయుఁ డనెడువాఁడు
చండదోర్దండమండితమండలాగ్ర
దండితారాతి, “రిపుతలగుండు గండఁ"
డనెడి బిరు దొంది తిరుగు నాయకులలోన. 204
నాయకుని ఆయుధములు, పరిశ్రమ
సీ. భిండిపాలాసి కోదండ భల్లాతక
నారాచ రోహణ నఖర వజ్ర
ముష్టిముద్గర శూల ముసల భుసుండిక
ప్రాస ప్రకూర్మ కర్పట కటారి
కాగ రాయోదండ కణయ కుంతాంతళ
పరశు తోమర చక్ర పరిఘ పట్టి
సములు వంకిణీకాది సబలంబు చివ్వీఁటె
సెలకట్టె యాదిగా నిల నుతింపఁ
తే. దనరు ముప్పది రెం డాయుధములు మఱియుఁ
జిఱుత చెయ్యమ్ము గండకత్తెర తుపాకి
గొరక నుసుగాలమును గ్రద్ధగోళ్లు బుట్టె
చూరి బాణా ధరించు న వ్వీరుఁ డెపుడు. 205
వ. వెండియు నవ్వీరుండు సమదండ, గజదండ, భృంగిదండ, యెడమ వరభృంగి, కుడి వరభృంగి, భృంగిపటలము, పయిసరపుదండ, సింగంపుదండ, పొదలికదండ, యడుగడుగు పొదలికదండ, మద్దెలసంచుదండ, కుక్కుటపుదండ మొదలుగా గల పదిరెండు దండల యఖండపాండిత్యంబుఁ దెలిసి యెడమడుగు పరువడి, కుడియడుగు పరువడి, కదలు పరువడి, దాఁటడుగు పరువడి, కోపు పరువడి, ఆంత్రటీక నాట్యము, ధారు ధాణు థోడ, ఉరుథోడ ఝాటుధాణు, కపాలు, ధారుక, ధారుక ధాకు, రాణుధాకు, ఝాటు నివి మొదలైన పదునాలుగు విసరుల మర్మంబులుం జూచి, కక్కి కొక్కిస డొక్కెర ముత్తైన డొక్కెరము కుమ్మరింపు బోడింపు సందు సీసంబును గొంతుమారును సమసంబును సురాటంబును జేవయుఁ గందనంబును గల్లంబును దొట్టును గిర్ణయుం బరిబొంచుటయు రొండివేటును ఫణంబును గన్నాతును భారంబును చొంగిణియుఁ బెట్లాగును దూణింపును సరిచిత్తరంబును లాగును విట్టాలయంబును దిణింగిణియుఁ బాదనివారణంబును బాదగళాప్తియు గళకతైరయుఁ గాసె నిల్కడయు నృసింహంబును నాదియగు ముప్పదిరెండు విన్నాణంబుల నాణెంబు పరీక్షించి, యొంటి యడుగు కత్తెర, సర్వబంధ కత్తెర, పొదలిక కత్తెర, చిట్టడుగు కత్తెర, పావుపావులు, జాగినపావు మొదలుగాఁగల పదిరెండు పరువళ్ల యగణ్యప్రావీణ్యం బెఱింగి, హరిగతి, గజగతి, వ్యాఘ్రగతి, మహిషగతి, జంబుకంబుగతి, మర్కటగతి, మార్జాలగతి, హరిణగతి, చటకగతి, పక్షిగతి, తాండవగతి, నరగతి మొదలైన పదిరెండుగతుల యవార్యచాతుర్యంబు నేర్చి, విష్ణుచక్రంబును రామబాణంబును నాగబంధనంబును దొలకరి మెఱుపును అల్లిమత్తును విస్సందును హస్తాభరణంబును బదఖండనంబును బరిత్రాడును లోబిత్తరి వెలిబిత్తరి సర్పాంకుశంబు మొదలుగాఁగల పదిరెండు కాయమానంబుల
భేదంబులు విచారించి లోమొన వెలిమొన యుసిమొన ఘుమ్మొన చతురమొన పుణ్యమొన పాపపుమొన చాటడుగుమొన కదలుమొన అరమీటుమొన నెఱమీటుమొన సరితాళంపుమొన యాదిగాఁగల పదిరెండుమొనల నాఱితేఱి లోవెలి గజ్జదుముకు చూరణనఱకు మొదలగు నఱుకుల దగులుం గనుంగొని దండనిల్కడ కదలు తుటుము కలయిక మెలఁకువ కింగళింపు దిశాపదిశలు పాదపుపారువ హస్తపుపారువ దేహపుపారువ నయనపుపారువ వివరాకడ ఎకసరపైసర భృంగిపటలము ఝంపు టెక్కు కరలాఘవంబు లాదియౌ షోడశోపవీతంబుల రీతులు నేర్చి భ్రాంతంబును ద్రాంతంబును ఆప్లుతంబును ఆవిష్కృతంబును ఆప్టికంబును ఆకరంబును అవికరంబును మిశ్రితంబును మానుషంబును నిర్మర్యాదయు విచిత్రంబును ఛిన్నంబును సవ్యజానువు ఆపసవ్యజానువు క్షిప్తంబును ధృతంబును గుడంబును లంబనంబును సవ్యబాహువు వినీతబాహువు త్రిబాహువు సవ్యోత్తరంబును ఉత్తరంబును తుంగబాహువు సవ్యకరంబును బ్రథితంబును యౌధికంబును అపృష్టప్రహారంబును వల్గితంబును స్వస్తికంబు లనెడి ద్వాత్రింశత్ప్రచారంబులు విచారించి యవక్రపరాక్రమంబున సాటి లేక మెలంగు మఱియును. 208
ఉ. సాదనమేలు, చెంపపయి జగ్గుగ వ్రేలు రుమాలు, మీసముల్
మీఁదను జీరుకేలు, జిగిమించఁగఁ గప్పినశాలు, వైరులన్
వాదులగెల్చువాలు, చెలువంబుగఁ దాల్చినపూలు నొప్పఁగా
నా దొరయొద్ద సంబళిక లందుచునుండు నతండు ధీరతన్. 207
తే. అతని కులభామ గుణధామ యలఘుకామ
యతులితారామ యసమరూపాభిరామ
వదనజితసోమ యధికలావణ్యసీమ
హేమరేఖాసనామయై యింతి వెలయు. 208
ఉ. కన్నులచందమున్ నగుమొగంబు విధంబును గల్కిపల్కులుం
జన్నులపొంకమున్ నడుముచక్కదనంబును బాహులందముం
బెన్నెఱిగుంపు సోయగము బిత్తరి యా చెలియందకాక యే
కన్నియలందుఁ గల్గిన మెగాదిగ చూడమె మూడులోకముల్! 209
సీ. జల్లి మాటలుగాక సరిచేయవచ్చునే
సవరంబు లీ శిరోజాతములకుఁ
మూఁతసుద్దులు గాక పోల్పంగవచ్చునే
చందనం బీ మేనిగంధమునకు
మాటమాత్రముగాక దీటుగావచ్చునే
గగన మీ నడుముసోయగమునకును
వదరుపల్కులుగాక తుదిసాటివచ్చునే
కిన్నెరకాయ లీ చనుఁగవకుఁ
తే. చక్కఁదనమెల్ల ముల్లెగా సంతరించి
బ్రహ్మదేవుండు తన నేర్పు ప్రౌఢిచేతఁ
దీర్చి సృజియించెఁగాఁబోలు దీని ననఁగ
వీఁటఁజరియించు నొక్కొక్కవేళ నదియు. 210
తే. దానిఁ దనివారఁ జూడని మానవుండు
చూచి తలయూఁచి మెచ్చని సుజనవరుఁడు
మెచ్చి విరహా ర్తినొందని మేటిఘనుఁడు
కలుగఁ డెందైన మూఁడులోకములయందు. 211
క. మదమొదవు కోడెవిటులకు
హృదయపుటాంతరములోన హేమాహేమిన్
బదివేల మన్మథులు పు
ట్టుదు రా సీమాటి కుచపటుత్వముఁ గన్నన్. 212
వ. అది మఱియును. 213
తే. బిడ్డపాపలఁ గని పెంచు జిడ్డులేక
తిండిచేఁ గండమెండైన దండికతన
నెసఁగు నసగూఁటి పిసవెఱ్ఱి కసరు రేఁగి
జారవాంఛావిహారంబు సలుపసాఁగె. 214
చ. విటులకుఁ గొంగుబంగరము, వేడుకకాండ్రకుఁ బట్టుగొన్ము యు
త్కటతరమన్మథార్తులకుఁ గల్పకుజంబు, భుజంగకోటికిన్
ఘటితనిధానసీమ, యుపకాంతుల చేరువపంట, జారస
త్పటలికిఁ బంచదార యను దానివిలాస మయారె! యారయన్. 215
సీ. కుఱుమాపు మైనున్న కఱలచీరటువిప్పి
చెలువైన సరిగంచు చీరఁ గట్టు
మెఱుఁగంచుకమ్మలు దొరయవం చటుడించి
మణుల రంజిల్లు కమ్మలు ధరించుఁ
[2]జిటి పొటి సొమ్ములు దీసి మెఱుంగు కట్టాణి
పూసల హారముల్ పొసఁగఁ దాల్చు
గుత్తంపు రవికఁ దా హత్తకుండఁగఁ జేసి
కలపంబు కులుకు గుబ్బలను బూయు
తే. నడర బెడఁగైన నిడువాలు జడ సడల్చి
కుప్పె గన్పడ సవరంపుఁ గొప్పుఁ బెట్టు
మరియు ముంగిట నిలుచుండి మొలకనగవు
లెసఁగ విటభాగ్యరేఖ యా హేమరేఖ. 216
చ. కిలకిల నవ్వు, మోవి పలుగెంటుల దీటుఁ గుచంబులోరఁగా
వెలువడఁ బైఁటవేయు, నెఱవింతగఁగేరు, మరుల్కొనంగ, బె
ళ్కులు గొనఁజూచు, లేని వగలుంగొని, మాటికిఁ గుల్కుఁ, గోటి చి
మ్ములు నొనరించు నవ్వెలఁది మోహపుఁబ్రాయమువానిఁ జూచినన్. 217
సీ. ఏటినీటి కటంచుఁ బాటిపంటెత్తుక
పలుమాఱు దిరుగు నిబ్బరముతోడ
రోలు రోఁకలికంచు రూఢిగా నిల్లీల్లు
దిరుగు నేప్రొద్దుఁ దత్తరముతోడఁ
గూరగాయల కంచుఁ గోరి తా బాజారు
కును మఱిమఱి నేఁగుఁ గొమరుతోడఁ
బరిలేని పనిజోలిఁ గొని వాడవాడలఁ
జరియించు సారె కచ్చెరువుతోడఁ
తే. బోలికల నెంచు వలరాచ పొగరు నిగుడఁ
గులుకుఁ బ్రాయంపు నెఱనీటు కోడెకాండ్ర
గమికిఁ దన జగ్గు జిగి సంచకార మొసఁగి
వలపు రెట్టింప మెలఁగు నవ్వనజగంధి.
క. తన కంటికిఁ బ్రియమయ్యెడు
ఘను నొక్కని వెంటనంటి కౌతుక మొప్పన్
మనసంటి కౌఁగిలింపక
చన దింటికి దాని బల్వ్యసన మేమంచున్!
సీ. ఆసువోసెడు దాని హస్తంబురీతిని
గుంచె దీసెడు దాని కొమరు మిగుల
జడ చిక్కు దయ్యంబు చందంబునను జెట్టు
విడిచిన భూతంబు కడఁక తోడ
మద్దెలలో నెల్క మర్యాద, నర్థార్జ
నాసక్తిఁ దిరుగు సన్న్యాసిమాడ్కి
వల్లంబు పోనాడు వైశ్యుని ఠేవను
గాలు గాలిన పిల్లి క్రమము దోఁపఁ
తే. గంతుమాయల నుమ్మెత్తకాయఁ దినిన
వెఱ్ఱితెఱఁగున వ్యసనంపు వెఱ్ఱి వొడమి
చికిలి నెఱ వన్నెకాండ్రకు సివములెత్త
నెవనసి చరియించు వీఁట నాహేమరేఖ.
క. ఈ లీలఁ బురము లోపల
మేలౌ ప్రాయంపు రూపు మీటగు బారిం
జాలి భయ లజ్జ లన్నియుఁ
దూలి చనన్ వెన్నుఁ జఱచి తొలఁగక కలయున్. 221
వ. ఇత్తెఱంగున. 222
చ. చవిఁగొని జారవీరరతిసౌఖ్యము దెప్పలఁదేల నెప్పుడున్
దివురుచు మోహవార్ధిని మునింగి యొకానొక కాలమందునన్
శివశివ! కాపురంబుపయిఁ జింత యొకింతయు లేక చిత్తసం
భపు నిజమాయ గప్పి కలఁపం దలవాకిట నుండు నెప్పుడున్. 223
శా. ఈ మర్యాదను గొన్నినాళ్ళు చనఁగా హెచ్చైన కార్యానకై
భూమీశుం డొకనాఁడు పొమ్మినినచో ఫూత్కారుఁడై యీగతిన్
“స్వామీ! కట్టడఁజేసితే” యనుచుఁ “జీ! జన్మం బిదే” లంచుఁ జిం
తామగ్నముఁ జెంది మందిరములోనం జేరి పెండ్లాముతోన్. 224
వ. అసహాయుం డిట్లనియె. 225
తే. భూవరుం డొక్క పయనంబు పొమ్మటన్న
మంచిదని వచ్చితిని సమ్మతించి నేడు
సంబళము, కంబళము, కత్తి, చద్ది, చల్ల
డంబు, కేడెండు, ధట్టి తెమ్మంబుజాక్షి! 226
క. అని పల్కరించి నప్పుడె
ఘనకుంతల “తొడుసువాసెఁ గదరా” యని యిం
పొనర నవి యిచ్చి పనిచినఁ
జనె నాతఁడు పయనమయి విచారముతోడన్. 227
వ. అట్లసహాయుం డరిగిన పిమ్మట. 228
క. ఆ హేమరేఖ మదిఁగల
మోహావేశమునఁ దోడి ముద్దియ తోడన్
బాహా బాహిఁ బెనంగెను
సాహోయని కంతు పాదుశహి రహిఁ గేరన్. 229
చ. పొలుపగు మావి లేఁజిగురు పొందక పోఁతపిరంగిలోన నె
క్కొలిపిన పుష్పగుచ్చమను గుండు పరాగపు మందునించి వె
గ్గలపుఁ బరాక్రమాగ్నిఁ గొని కంతుఁ డనేటి పరంగి భామగు
బ్బలనెడు దుర్గముల్ పగులు వాఱ గుభిళ్లున నేసి యార్చినన్. 230
క. అళుకుచు మూర్ఛిలి తెలుసుక
కళవళ పడి లేచి మనసు గాసిల్లంగా
భళిరా! యని వెలువడి తన
నెళవరులను జూచికొనుచు నిలుచున్నంతన్. 231
వైద్యుఁడు - వాని పరిశ్రమ
చ. మెలివడు తీఁగచుట్ల జిగిమించిన పాగ జినుంగు పచ్చడం
బలవడు చల్వదోవతి యొయారపు గందపుఁబూఁత డొల్లుపోఁ
గులు మణిముద్రికల్ వలపుగుల్కెడు వీడ్యము చలకవట్ర మం
ఘ్రులతుద ముచ్చెలున్ వెలయ గుప్తగుణుండను వైద్యుఁ డొప్పుగన్. 232
తే. వైద్య మాత్రంబునన కాదు, వజలునట్టి
నిరుపమాకారసౌష్ఠవస్ఫురణచేత
నాశ్వినేయులతో నైన నతఁడు వాదు
కెదిరి యోజింపకయె జవాబీయఁ గలఁడు. 288
వ. మఱియు నశ్వగంధాదిఘృతంబును నైలేయకఘృతంబును షట్పలఘృతంబును దూర్వాదిఘృతంబును బంచగవ్యఘృతంబును నార్ధ్రకఘృతంబుసు గదళీకందఘృతంబును గల్యాణఘృతంబును దండులీయక
శ్లేష్మంబుల నుల్బణంబులైన త్రిశతషష్టి రోగంబులకుఁ దత్తచ్చికిత్సలు చేయు చాతుర్యంబును గలిగి రెండవ ధన్వంతరి యనంబరగు నతఁడు. 234
తే. వీథివెంటను రాఁజూచి వెలఁది యనియె
నౌర! యిట్లుండ వలదె యొయార మహహ!
వీనిఁ జిక్కించికొని మారవిగ్రహమున
భంగపడఁజేయనిది యేటి ప్రౌఢతనము. 235
క. అని తన మనమున ననుకొను
చును నిలుచున్నంత దాని సొగసు నొయారం
బును గని మనసిజ సమ్మో
హనవిద్యను జొక్కి యాతఁ డంచుకు రాఁగన్. 236
ఉ. "ఎక్కడనుండి యెక్కడికి నేమి ప్రయోజనముండి వోయె, దీ
వక్కట! నామమే?" మనిన నన్నియుఁజెప్పి "పరోపకారిరా!
యిక్కలకంఠకంఠి" యని యెంతయు డగ్గరఁజేర మారుఁడున్
బ్రక్కలు నెక్కొనన్ బొడువఁ బై కొను మోహముచేత లేమయున్. 237
తే. అమల శశికాంతకాంత శుద్ధాంతకేళి
కా నిశాంతాంతరమ్మున ఘమ్ము రనెడు
పచ్చ బచ్చెన చిత్తరు పనుల మించు
ప్రతిమ సంఘట్టనల మంటపంబులోన. 238
చ. సకినెల కీలుకంఠమున జాయమెఱుంగుల సొంపుకెంపు ము
క్కుకొనల పచ్చకాచిలుకకోళ్లఁ దనర్చిన పట్టుపట్టె య
ల్లికపయి జాఫరాజినుఁగు లేపునఁజెందు పలంగుపోషు త
క్కికగల జాళువాగొలుసు గీల్కొను మంచముపై మహోన్నతిన్. 239
తే. అపుడు గుప్తగుణాహ్వయుం డనెడి వైద్యు
నెలమిఁ గూర్చుండఁబెట్టి యా హేమరేఖ
పండుటాకులు కప్రంపు భాగములను
వేడ్కతోడుత నిద్దఱు వేసికొనుచు. 340
మ. సరసాలుం జిఱునవ్వులున్ మురిపెముల్ సయ్యాటముల్ వింతలున్
గరఁగింతల్ వలపించుటల్ చతురతల్ కాంక్షల్ వినోదంబులున్
దరితీపుల్ వలపుల్ మిటారితనముల్ దాటింపులున్ దచ్చనల్
నెఱచిన్నెల్ మఱపించుటల్ సొగసులున్ నీటుల్ పచారింపుచున్. 241
సీ. ఆసక్తి దీఱని యాలింగనంబులు
నురువాంఛ దరుగని ఛురితవితతు
లనురక్తి వాయనియట్టి చుంబనములు
తమి వెలిగాని దంతక్షతంబు
లభిలాష లుడుగని యతిటపేటంబులు
తాత్పర్య మెడలని తాడనమ్ము
లాశలు మానని చౌశీతిబంధముల్
భావమూనని కళాస్పర్శనములు
తే. లలిత కలకంఠ కలహంస కలరవములు
పలుకు కివకివ కవకవ ప్రకట టకుట
కకుట కహకహ హసనముల్ గళరవములు
చెలఁగ నిద్దఱు రతికేళి సలుపునపుడు. 242
చ. తెమలను నిన్నుఁ బాసి సుదతీ! యని తీయని నీదుమోవి కా
యమృతరసోర్మియేని సమమా? యని మాయని మోహదాహ సం
భ్రమ మెదలోన నెంత తలఁపా? యని పాయని కూర్మితోడి నా
తమి పరభామలందుఁ గలదా? యని దా యని కౌఁగిలింపుచున్. 243
వ. ఇట్లన్యోన్యసరససల్లాపంబుల గుప్తగుణుండు సురతకేళికాలోలుఁడై హేమరేఖతోఁ బెనంగు సమయంబున. 244
సీ. కొప్పెరపెట్టుగాఁ గొమరొప్ప నొనరించి
పై రుమాలు బిగించి పచ్చడంబు
నాగవల్లీదళ పూగ పూరితమైన
యొడిలోన నిడికొన్న యడపమొకటి
చాయలఁ దనరారు సకలాతు నొరతోడి
పృథు భుజస్థలి నొప్పు పెద్దకత్తి
చీర్ణంపుఁబనిచేత జిగిమించు కరమున
సొంపైన సత్తు సున్నంపుఁగాయ
తే. పాదముల మెట్లు మొలఁదాల్పఁబడిన బాఁకు
చల్ది గట్టిన వస్త్రంబు చంకదుడ్డు
నమర గమన జవోద్భవ శ్రమముఁ జెంది
యప్పు డసహాయుఁ డింటికి నరుగుదెంచె. 245
క. అరుదెంచి పురుషుఁ డుండెడి
యరుదెంచి నిజప్రసిద్ది కందఱు నళికే
బిరుదెంచి రోషవశుఁడై
సరిదంచిత ఘోష భాషఁ జానను బిలిచెన్. 246
క. జడియక యిపుడా సతి యే
వడువున బొంకంగవలయు? వనరుహగంధీ!
యడుగుం దప్పినయప్పుడె
పిడుగుం దప్పునను మాట పేర్కొన వినవే! 247
వ. అని. 243
ఉ. ఈవిధి హంసలోకవిబుధేంద్రుఁడు ప్రశ్న మొనర్చి పల్క హే
మావతి కొంతకొంత యనుమానముతో బొటవ్రేల నేల రే
ఖావిధ మొప్ప వ్రాయఁ గుతుకంబున నీకిది తోఁచెనేని ను
ర్వీవరుఁ జేర నేఁగుమని వేఁడిన నప్పువుబోఁడి యిట్లనున్. 240
క. నినువంటి కతలకారిని
గని వినియెడివారి నడుగఁగావలెఁ గానీ
ననువంటి దాని నడిగిన
వినిపింతునె యెట్లు బొంక వివరింపఁగదే! 250
క. అని యడిగిన హేమావతి
కనురాగంబొప్ప రాజహంసకలాపం
బనియె, ససహాయుఁ డటువలె
ఘనరోషం బుట్టిపడఁగ ఘర్షించుటయున్. 261
తే. వైద్యుఁ డప్పుడు గడగడ వడఁకి నాకు
బుద్ధి యేమని పల్క నప్పువ్వుఁబోఁడి
వెఱవకు మటంచు దిట్టయై వెన్నుఁ జఱచి
సంచి విడిపించి యపుడు స్వస్వామి కనియె. 252
చ. కడుపున శూలయెత్తి వడిగాసిలి ప్రాణము లేఁగునట్లయై
తొడిఁబడ నీవులేమి ఘనదుఃఖముచే వెతఁబొంది యీ మహా
త్ముఁడు పురినేఁగఁ గావుమని తోడ్కొనివచ్చితి నీతఁడౌషధం
బిడుటను నేను జీవము వహించితిఁ గ్రమ్మఱ, నేమి సెప్పుదున్. 253
క. అని యుస్సు రస్సు రనుచును
నన్నతోదరరోగమునఁ బ్రియాంగన పొరలన్
గని కుస్తరించి వైద్యుని
మనమున రంజిల్లఁ జేసి మమత దలిర్పన్. 254
తే. నీఋణముఁ దీర్పఁగలవాఁడనే! యటంచుఁ
బచ్చడంబిడి బహుమానమెచ్చ వైద్యుఁ
బంపి సందేహమందక భార్యతోడ
నిండు వేడుక నుండె నో నీరజాక్షి! 255
వ. అని మరాళశేఖరంబు చెప్పిన నరాళకచ యగు హేమవతి తన మనంబున. 258
క. సురుచిర మణి తాటంక
స్ఫురితప్రభ చెక్కులందుఁ బొలయ శిరంబున్
మఱి త్రిప్పి పొగడె నహహా!
గరితలమిన్నదియకాక, కలదే పుడమిన్? 257
వ. ఆ సమయంబున. 258
తే. మై వియల్లక్ష్మి కస్తూరిమళ్ళ చీర
రేయిఁగట్టుక సడలించి రేపటికడ
నుదయరాగంబుఁ దాల్చిన యొఱపు దోఁప
దమము జాఱంగ సాంధ్యరాగము జనించె. 259
చ. పలపలనయ్యెఁ దారకలు పక్షులు కూయఁ దొడంగె, దీపముల్
దెలతెలఁబాఱె దిక్కులను దెల్వి బనించె, బిసప్రసూనముల్
దులదుల విచ్చెఁ దాపులకు దొందడిఁ జేరి జారచోరు లా
మలయసమీరణంబు కడుమందగతిన్ విహరించె నత్తఱిన్. 260
తే. తఱియను కళాదుఁ డుదయభూధర హసంతి
నరుణహేమంబునకు వన్నియలను నింప
గ్రాఁచి, నీరార్చ నెత్తిన కరడునాఁగ
సూర్యబింబంబు పొడిచె నవార్యగతిని. 261
క. మణిఘంటల మొలనూలున్
ఝణఝణ యని మ్రోయఁ గేళిశాలకుఁ జని య
య్యణుమధ్య నృపార్పితగుణ
గణయై వసియించె దినము కల్పముగాఁగన్. 262
వ. అని ప్రత్యుత్పన్నమతి చెప్పిన విని సంతోషించి నలుండు తరువాతి వృత్తాంతం బానతిమ్మని పలికిన. 263
మ. హర కోదండ విఖండన ప్రచుర బాహాదండ! దండాయుధా
ద్యురుధిక్పాల సురానివార్యతర బాహోర్దండ! దండాంకభి
ద్ధరిణాక్షీమణి జీవనాకృతి నిజాఖ్యాఖండ! ఖందాబ్జభృ
ద్భరసాభృద్రిపువాహ సన్నిభ యశోభాకాండ! కాండోదరా! 264
క. ధారాధర ఘృణివారా!
వారణ రాజన్య వైరివారణ ధీరా!
ధీరాజిత శుభకారా!
కారణ పురుషావతార! కరుణోదారా! 265
కలహంసోత్సాహ వృత్తము
కలుషదూర! భవవిదూర! కమలసారలోచనా!
కలితహార! వరవిచార! ఖరవిహారమోచనా!
లలితనీరనిధిగభీర! లసదుదార కీర్తిని
ర్దళిత హార శరపటీర దర సుధారసోత్కరా! 266
గద్యము.
ఇది శ్రీమత్కౌండిన్యసగోత్ర పవిత్రాయ్యలరాజాన్వయ సుధావార్ధి పూర్ణిమాచంద్ర నిస్సహాయ కవిత్వనిర్మాణ చాతుర్యనిస్తంద్ర శ్రీరామనామపారాయణ నారాయణామాత్యప్రణీతంబయిన హంసవింశతియను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.
——: O :——