సౌగంధికప్రసవాపహరణము/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సౌగంధిక ప్రసవాపహరణము

పీఠిక


శ్రీరామచంద్రుఁ డాశ్రితవత్సలుండు
తారకబ్రహ్మావతారుఁ డచ్యుతుఁడు
సుమశరాసనుగన్న సుందరాంగుండు
నముచిసూదనముఖ్య నానాదిగీశ
రాజకాంతివిలాసరాజితపాద
రాజీవుఁ డంభోజరాజవంశజుఁడు
నీలాతసీసూన నీరదశక్ర
నీలవర్ణుఁడు దయానిర్మలాత్మకుఁడు ,
జానకీచిత్తాంబుజాతమిత్రుండు
భూసుతమాణిక్యభూషణాన్వితుఁడు


పరిపంధి దైతేయబలభేదనుండు
హరివర్ణితుఁడు శరణార్తరక్షకుడు
దశరథధారుణీతలనాథగర్భ
నిశదాబ్ధిచంద్రుడు విశ్వంభరుందు
విలసితసామ్రాజ్యవిభవసంపదలు 15
సలఘుసద్వస్తువాహననికాయములు
నతులితోదగ్ర జయ ప్రతాపములు
వితతసౌఖ్యంబులు వేడ్కతో నొసఁగి
రావిళ్ల లింగ భూరమణ శేఖరుని
భూవరనుతునిగాఁ బోషించుఁగాత,20
తలఁబ్రాల వేళ నెంతయు సిగ్గుదోఁపఁ
దలవంప గళరత్న తారహారాగ్ర[1]
మానితమాణిక్యమధ్యభాగమున
నానామరస్తుత్యు, నవ్య చారిత్రు
మకరకేతనకోటి మహితలావణ్యు 25
సకలలోకాధారు జగదే కవీరు


భూమండలాధ్యక్షుఁ బుండరీకాక్షు
"రాముని సుగుణాభిరాముని మదిని
భావించి చూచి సంభ్రమమునఁ బొదలు
పావనగుణధామ భామాలలామ
నీతామహాదేవి చెలువంపుఠీవి
ఖ్యాతిగా సకలసౌఖ్యములు సంపదలు
రాజిల్లు సిరు లిచ్చి రావిళ్ల లింగ
భూజాని ననయంబు బోషించుఁగాత
చక్కెర కవణంబు చవిగొని మెక్కు
జక్కి నెక్కినజోదు సమయించు వేల్పు
పలిగట్టుపట్టికి వలపులు గులుక
నెలమి దేహం బర్థ మిచ్చినదాత
పావిబువ్వకు బుట్టు బలియు సోదరుని
చేపట్టి గోర్కె లిచ్చినదయాజలధి
సొలపు చీఁకటిగుంపు సొంపుల బెంపు
చలివేఁడి వెలుగుల జరుగుచక్రములు
దుక్కి కైదువబూను దొర బిడ్డ తమ్ముఁ
డక్కుననేర్చిన యబల పెద్దన్నఁ


జెలఁగుచు రాజుగా జేసిన యతని 45
కలకంఠ కంఠినిఁ గన్న రథంబు
సిరియింటఁ బుట్టిన చిన్న బాలకుని
కొరకు వెన్నుని ముద్దుకొడుకు టెక్కెంబు
దురుసురూపము దాల్చి తొలివేల్పు దునిమి
యురవుగా గొనివచ్చు నుత్తమాశ్వములు 50
నలరు లోకములు చరాచరంబులుసు
మెలఁకువతోడ నిర్మించుసారథియు
నుదుటు జేజేలకు నునికియై వెలయు
పదియాఱువన్నెలబంగారువిల్లు
తొగవైరినందను ద్రుంచువు మున్ను55
తగగన్న మిన్న మేతలుగొన్న నారి
యెచ్చోటఁ దలఁచిన నెందుఁ జూచినను
సచ్చట వెలుగొందునట్టిసాయకము
గలిగి చెన్నొందినగంగాధరుండు
విలసిత బహుభాగ్యవితతు లొసంగి 60
గాయగోవాళుని కలితకేళాది
రాయని నల రతిరాజసన్నిభుని

శ్రీలచే జగతి రాజిలు లింగధరణి
పాలుని దుర్గాధిపతిఁ జేయుఁగాత.
ప్రాణనాథుని జటాబంధంబు మాన్చి
మానిత నవరత్న మకుటంబు దాల్చి
పేరైన పులకలపేరులు దిగిచి
భూరి మౌక్తికహారములు పొసంగించి
కన్నుల వినుసొమ్ము కడలకు వైచి
సన్నుత దివ్యభూషణము అమర్చి 70
పూవిల్తు భస్మంబు పూత బోఁదుడిచి
తావులు గులుకుగంధంబు మై నలఁది
గజచర్మపటము చక్కఁగఁ దొలంగించి
రజితాంబరంబు తీరంబుగాఁ గప్పి
గ్రక్కున వులితోలు కాశ సళ్లించి 75
తక్కక కెంబట్టుదట్టి పొంకించి[2]
జోగివేషము బాపి సొగసైనపుట్టు
భోగిరూపంబు సొంపుగఁ బోసంగించి

హరుమేన నలకొన్న యచలేంద్రకన్య
గరిమెతో బసువశంకరబిరుదాంకు 80
గురుతర వెల్లుట్లగోత్ర పావనుని
గండరగండని ఘనశౌర్యధనుని
గొరడథాత్రీనాథు కూర్మి నందనుని
ఘనుని రావిళ్ల, లింగమహీతలేంద్రుఁ
గనికరం బొదవ వేట్కలఁ బ్రోచుఁగాత. 85
కళలు గుల్కెడు తమ్మిగద్దియమీఁదఁ
బలుకు తొయ్యలి: గూడి పరమహర్షమునఁ
గొలువుండ బ్రహ్మాండకోట్ల నిర్మించి
యలరుచు నున్న యాయండంబులందు
స్థావరతిర్యక్ప్రచారజంతువుల 90
దేవదైత్యగ్రహదిక్పాలవర్య
తారకాద్రిపయోనిధానకాంతార
భూరిచతుర్దశభువనభూతముల
నొనరఁ గల్పించి యాయుః ప్రమాణముల
ననువొంద లిఖియించి యాహారవిధుల 95
నద్భుతక్రీడావిహరసంగమము

లుద్భవ ప్రాభవోద్యోగములు పెక్కు
మరియాదలును ధర్మమర్మ కర్మములు
శౌర్య దైర్యోదారచాతుర్య మహిమ
లలరుచు రచియించి యబ్జజాండముల 100
వెలుపల లోపల వెలయుచు సంచ
రింపుచు మెలఁగు విరించి నెయ్యమున
సంపూర్ణకరుణారసంబు లుప్పతిల
నాయురారోగ్యంబు లతులితమతియు
శ్రీయు నుపాయంబు జెలువొంద నొసఁగి 105
రావిళ్లకొండ భూరమణుని లింగ
భూవల్లభుని దయఁ బోషించుఁగాత.
సకలవిద్యలకెల్ల సాక్షి దా నగుచు,
నకలంకమహిమ రాయంచపై నెక్కి,
మతిలేనివారికిఁ మతులు గల్పించి, 110
కృతిలేనివారికిఁ గృతులు గల్పించి,
యిలమతికృతులచే నెల్లభాగ్యములు,
కలితసత్కీర్తులు గలుగంగఁ జేసి,
వరుజిహ్వ నటియించు వాణి మృగాక్షి

యిరువంద నాదిగర్భేశ్వరభవ్య
బిరుదాంకునకు లింగపృథినీశ్వరునకు
సరసచమత్కార చాతుర్యనీతి
విమలతత్త్వజ్ఞానవిభవంబు లొసఁగి
కొమరొందు కృతినాయకునిఁ జేయుఁగాత,
అని పయోరుహకైరవాప్తలోచనుని
వనజాసనాది గీర్వాణమాణిక్య
మకుటకోటి ప్రభామండిత మృదుల
వికసిత పాదారవిందు ముకుందు
వర్ణించి సేవించి వరహిమశైల
వర్ణుని గజరాజవదనుని నేక
దంతుని శంభునందనుని గీర్తించి
సంతతకరుణారసస్వచ్ఛహృదయ
సకలవేదపురాణశాస్త్రాధికారు
వికటమహోద్దండవేదండసింహు
నరుదైన బ్రహ్మరథారోహణాఢ్యు
చిరతరకీర్తి దేశికచక్రవర్తి
రంగనాయక పాదరాజీవయుగ్మ

సంగతపటుహృదంచితచంచరిక
భట్టరు శ్రీ చన్న భట్టరాచార్యు[3]
పట్టభద్రులపాదపద్మములు దలఁచి 135
నరయశోధనులు గీర్వాణాంధ్ర కవుల
నిరతంబు గణుతించి నేర్పు వహించి
చాటు వాక్ప్రౌడలక్ష్మణలక్ష్యశబ్ద
నాట కాలంకార నవ్యప్రబంధ
సారార్థసంగ్రహ సర్వజ్ఞ మూర్తి 140
కారుణ్యసుకవి ముంగరశానసుకవిక[4]
చంద్రు చారిత్రము ల్జననాథ సభల
సాంద్ర మతిస్ఫూర్తి సన్నుతిఁ జేసి
బహువిధాలంకారపదగుంభనములు
మహితశయ్యాపాకమార్గ వైఖరుల 145
నవరసనాయకనాయకీభావ
వివిధలక్షణముల విలసిల్లు నొక్క

రమణీయకావ్యము రచియింపఁ దలఁచి
విమలచిత్తమున భావించుచుండఁగను

కృతిపతివర్ణనము


తనకీర్తిసకల బాంధవమిత్రసుకవి
జనచకోరములకు చంద్రికగాఁగ
తనప్రతాపఫ్రౌఢి దర్సితారాతి
వనసంతతికి దవవహ్నియుఁ గాఁగ
తనదయ శరణాగతవిరోధితతికి
ఘనతరం బగువజ్రకవచంబు గాఁగ
తననిశాతక రాసి ధారవిరోధి
మనుజేంద్ర దేవతామత్త కాసినులఁ
దొలఁగక బొందించు దూతిక గాఁగ
కలిత శృంగార వైఖరులఁ జెన్నొందు
తన మహోన్నతనవ్యధామంబు భాగ్య
వనజమందిరకు నివాసంబు గాఁగ
జననాథు లెన్న విశ్వంభర వెలసె
ఘనుఁడు రావిళ్ల లింగమహీశ్వరుండు
కసికాగ్రగణ్యుండు రావిళ్లలింగ

వసుథాధిపతి సాంద్రవైభవభాగ్య
వినుతసంపదలచే వెలయుచునుండి
యనువొంద నొక్కనా డరుణోదయమున
మెలఁకువచే నిద్ర మేల్కాంచి లేచి
వలనొప్ప దంతథావనము గావించి
మున్ను గా పన్నీట ముఖనుజ్జనంబుఁ
జెన్నొంద నాది లక్ష్మీనాథుఁ దలఁచి
భాగవతోత్తము ల్భహుతాళగతుల
భోగిశశయనుని పుణ్య కీర్తనలు
వినుసింప వీనులవిందుగా వినుచు
తనరంగ నామతీర్థంబు గావించి
గరిమ మీరఁగ శుద్ధగంగోదకముల
సురుచిరంబుగ భూమి శుద్ధిచేయించి
విహితంబుగా నందు వివిధవిచిత్ర
మహనీయరత్న కంబళము వేయించి
యమనియమప్రముఖాష్టాంగపూర్తు
లమరంగ పద్మాసనాసీనుఁ డగుచుఁ
బరఁగ హస్తికపాలభాతిథారులను

ధరణి నీతియు రిపుత్రాటకం బనఁగ
నలరు షట్కంబు లాచరింపుచును
సలలితోడ్డేయాణ జలాంధరములు [5]
మొదలైన దశవిధంబులముద్ర లెలమి
గదియించి యిడయు పింగళ సుషుమ్న
మణిపూరకాది థామములు పదునాల్గు
లోపల నున్న నాడులు వివేకించి
శీతలాభ్ర మరిభస్త్రికమూధ్న కేవ
లాతతరవి భేదనాదినామముల
గలయష్ట విధకుంభకము లేర్పరించి
కలకివలపు గుంభకముల గుంభించి [6]
లీలతో నాసనలింగహృన్నాభి
తాలుమూలలలాటతటములయందు
నాధారమణిపూరకాదినామముల
సాధారణంబులై సరస వర్ణింప
పరుపడి నాల్గారు పది పది రెండు

విరివిగా పదియారువేలపత్రముల
నలరుచు నుండెడి నారుపద్మములఁ 200
జెలువొంద పవనునిచే మేలుకొలిపి
నాభిపద్మంబు క్రిందట ముమ్మూల
శోభిల్లు బాహ్యాండ సురుచిరంబైన
గంభీరనాభికా కాండంబులోన
గుంభించి యనిలుగొని దానిచేత 205
నాధారకమలమధ్య త్రికోణాంత
రాధీనరేభాంత రాక్షరానలము
వెలుగించి వాయువు వెస నందు నిలిపి
పొలుపొంద నెనిమిది ముఖములక్రిందఁ
దనరు పశ్చిమనాడి తలక్రిందుజుట్టి 210
పెనుఁబాము బలునోరు వెడలంగఁ జేసి
నలుపుగా పశ్చిమనాడిలో నునిచి
వెలయు వేట్క లనేకవింశతిమణులఁ
బెనఁగొని సంతాపభేద్యమై యలరి [7]
వనజాసనేశ విష్వక్సేననామ 215

ములు గలకులిశంబు మురుపున నున్న
యలఘుగ్రంధిత్రయం బెలమి భేదించి
తలప నాపైని యూర్థ్వముఖాంబుజంబు
దలక్రిందుచేసి యందలిసుధారసము
తలకొని హృదయపద్మములోన నునిచి
ములయుచు యోగసామ్రాజ్య సౌభాగ్య
గరిమచే సకలజగన్మయా కారు
వరవస్తు నవ్యయ ప్రణవస్వరూపుఁ
బరమాత్ము భ్రూమధ్య భాగనివాసు
శరజాప్తశతకోటి చటుల ప్రకాశు
మానితమతి నాదిమధ్యాంతరహితు
థ్యానించి హృదయపద్మంబున నునిచి
హరిహరభ క్తుల కాచార్యులకును
నురుభ క్తిహితవందనోపచారముల
జాంబూవదాంబరసద్భూషణములు
తాంబూలయుతముగా దానముల్జేసి
యాచార్య ముఖ్యుల కభివందనంబు
లాచరింపుచు వినయంబునఁ బనిచి

హితబాంధవులఁగూడి యిష్టభోజనము
లతిమోదమునఁజేసి హస్తముల్ గడిగి 235
పొలుపొంద ఘనసారముల మ్రుగ్గు లిడిన
విలసితవిధుశిలా వేదిక మీఁద
రాజిల్లు నూతనరత్నకంబళము
పై జీనిహొంబట్టు పరుపుపై వేడ్క
వసియించి యిరుమైలవనితలు గొల్వ 240
కుసుమసాయకులీల కొలువున్న వేళ
నేమంబుతోఁ జెంత నిలిచి వేరొక్క
భామిని కర్పూరభాగంబు లొసఁగఁ
జిత్తంబు రంజిల్లఁ జేరి వే రొక్క
మత్తకాశిని యాకుమడుపు లందియ్య 245
సొలపుల వలపుల సొంపుల నొక్క,
పొలఁతుక పరిమళంబుల మేన నలది
హవణికెగా నొక హరినీలవేణి
నవరత్న మయభూషణములు గీలింప
నేరుపుతో నొకనీరజవదన 250
తీరుగా కస్తూరితిలకంబు దీర్చ

సిరిమీర నపు డొక చిగురాకుఁబోఁడి
పరువడి జూళువాపాగ గిీలింప
జననుతం బగుబురుసాపచ్చడంబు
వనితెయొక్కెత వలెవాటుగాఁ జేర్ప
ఘన మూరురాయరగండపెండార
మనువుగా నొకలేమ యంఘ్రిఁ గీలింప
చెంగలించినవేట్కచే నప్పు డొక్క
యంగనామణి నిల్వుటద్దంబుఁ బూన
కలితశృంగారముల్ గైకొని లేచి
కలకంఠికంఠులు కైదండ యొసఁగ
కమనీయరత్న కంకణములు మెరయ
రమణులు వింజామరంబులు వీవ
రమణీయకక్ష్యాంతరంబులు గడచి
కొమరుమారిన కొల్వుకూటంబుఁ జేరి
హితులు పుత్త్రులు పురోహితులు సేనాధి
పతులు సామంతులు బంధువర్గంబు
మన్నీలు గురికాండ్లు మండలాధిపులు
సన్నుతి కెక్కినచతురంగబలము

కవిబుధగాయనగాయనీవంది
వివిధనటీనట విలసితఘటన
అఘటనా ఘటనాఖ్యఖడ్గప్రవీణ
పటుతరోపాయులై పరఁగుమంత్రులును
తగురాయబారు లెంతయుఁ జేరి కొలువ
నగణితనవరత్న సింహాసనంబునను 275
వెలయు సంగీతాదివిద్యల వినుచు
వలయు నాట్యప్రభావములు గాంచుచును
శ్రీయుక్తుఁ డగుచు రాజిల్లు వేడుకల
వేయిగన్నులుగల వేల్పుచందమున
రావిళ్ల లింగభూరమణచంద్రుండు 280
కోవిదవినుతుఁడై కొలువుననుండి
నామీఁద కృప నుంచి నన్ను రావించి
ప్రేమతో లాలించి పెంపుఁజేయించి
తాంబూలయుతముగా ధనమణిహార
జాంబూనదాంబర సైంధవాందోళి 285
కాదుల తగునగ్రహారంబు లొసఁగి
నాదిక్కు వీక్షించి నయమొప్పఁ బలికె.

అనుపమరత్నాకరాన్వయాధ్యక్ష
ఘనుఁడ గోపాలసత్కవిసార్వభౌమ
నరనుతవాఙ్మయనైపుణ్యమతివి
సరసచాతుర్యలక్షణలక్ష్యశబ్ద
నాటకాలంకారనవరసభావ
పాటవంబులను నేర్పరివలె జగతి
నిరునిరోష్ట్యంబుల నిరనువాసికల
గురతైనశతకముల్ గూర్చిన మేటి
వనునాసికాష్టవర్ణావళి చొరని
గొనబుతారావళి గూర్చిన ఘనుఁడ
వలకౌమిదికిని దీపాంధ్రశబ్దంబు
లెలమి మీరఁగ రచియించు నేర్పరివి
కవు లెన్నఁగా బెక్కుకట్లమార్గంబు
లపలీలఁజెప్పిన యట్టి ధన్యుఁడవు
మహనీయ బహులిపిమర్మ చాతుర్య
మహిమలు దెలిసినమాన్యుండ వీవు
భవ్యసౌగంధికప్రసవాపహరణ
కావ్యంబు ద్విపదగాఁ గడువిస్తరించి

తనరు వేట్క. మదం ------ సేయవలయు
ననిన హర్షించి నే నానంద మొంది
సంశయం బెడలించి సత్కృతినాథు
వంశావతారంబు వర్ణింతు నెలమి.

తులుగరతనపట్టి తొలుతటి చికిలి[8] 310
ములికిలో నుండి కల్ముల నీనురాణి
వాసంబు నేవేళ వక్షంబునందు
భాసురోన్నతి నుంచు భక్తవత్సలుఁడు
పాల మున్నీట పాపని లీలఁ దాల్చి
మూలనున్నయ్యసొమ్ములు మెక్కుజక్కి 315

పైనెక్కి విహరించు పరమపావనుఁడు
దీనశరణ్యుఁడు దిక్పాలసుతుఁడు
సర్వవిద్యాకళాశాస్త్రపురాణ
పర్వతాంభోనిధి బ్రహ్మావతార
తారకాయుధభూతదంతిదిగబ్జ 320

వారిజహితయోగవర్ణనవర్ణ
రసతిథమాసకరణ రా చంద్రు
వసుమతినిధిధరాధ్వయని తార
కలితంబులై దివాకరులీలఁ బోల్చు
బలుకైదువధరించి ఫ్రౌఢివహించి
కడుప్రోవుజిగిడాలు గలయెకిమీని
బుడుతబంధించిన పొగరు రక్కసుని
వరభుజాబలగర్వవైభవస్ఫురణ
అరిమురిదునుము సాహసబలోన్నతుఁడు
సకలాగమమునీంద్రసంఘముల్ పొగడ
నకలంకధృతిఁ బొల్చు నబ్జలోచనుఁడు
పరఁగ నాశ్రీహరి పాదపద్మమున
సురనదితోఁగూడ శూద్రకులంబు

కమ్మకులము



కలిగె వారలలోన కమ్మకులంబు
బలశౌర్యధైర్యప్రభావచాతుర్య
వరదానధర్మదుర్వారసంపదల

తరుతటా కాదిసంతానవైఖరుల
                          పకారముల
పరగుచు సకలభాందవాశ్రితుల
నలవడఁ బ్రోచి విద్యారహస్యములు
తెలిసిన సర్వజ్ఞ ప్రతిష్ఠ వహించి(?)
పరిపంధివీరుల బంధించి వైచి
శరణాగతశ్రేణి సత్కృపఁ బ్రోచి
మానితవర్ణాశ్రమములవారలకు
భూసుతంబుగ కల్పభూజంబు లనఁగ
కరుణ కాధారమై ఘనతరకీర్తి
బిరుదుసంపదలచే పృథివిపై వెలసె

మల్లభూర మణుఁడు



ఆకమ్మవంశసుధాంభోధియందు
రాకానిశాకరరమణ చెన్నొంది
యనుపమాటోపసాహసవిక్రమార్కుఁ
డనుచు రాయకుమారు లభినుతించఁగను
విమతరాడ్భయదమై విస్మయం బగుచుఁ

గొమరొందుగుడిపాటికోటచెంగటను
గుతలాధిపతులెల్లఁ గొనియాడి మెచ్చఁ
గుతుబుసాహుబలంబు ఘోరించి నరికెఁ
జెల్లుగా రాయలచే హెచ్చుబిరుదు
లెల్లఁ గైకొని మదాహితరాజహృదయ
భల్లప్రతాపప్రభావుఁడై వీర
మల్లభూరమణుండు మహికీర్తి నించె.
వినుతులు గాంచు రావిళ్ల వరమల్ల

తిప్పభూపతి.



జననాథు చంద్రవంశంబున నలరి
ఘోరావహకిరీటి గుణరత్న మేటి
వీరాగ్రగణ్యుండు వితతపుణ్యుండు
పరబలసమవర్తి పటుధర్మవర్తి
నిరుపదకీర్తి మన్నియచక్రవర్తి
చంద్రార్కనయనపూజావిధేయుండు
సాంద్రసత్యవ్రతాచారవర్తనుఁడు
రవివంశమున శ్రీరామచంద్రుండు

భువి నుద్భవం బైనపోల్కి జన్మించి
జననాథు లెన్నఁగా జగతిపై వెలసె 370
ఘనుఁడు తిప్పక్షమాకాంతశేఖరుఁడు.
ధీరుఁడారావిళ్ల తిప్పభూభుజుఁడు
హేరాళముగ ధాత్రి యేలుచు నుండి
భుజబలోద్దండులై పొదలుచువచ్చు.
గజపతిదళములు గదిసి చెండాడి 375
నికలంబుగాఁ జేసి వెన్నంటి తరిమి
యకలంకబిరుదధ్వజావళుల్ పట్టు
గొడుగు లందలములు గొనబుపల్లకులు
బెడిదంపుభేరులు పెద్దబూరుగలు
వన్నెవన్నెగుడార్లు వాజులు కరులు 380
చెన్నొందఁ గైకొని సిరులచే వెలసి
తనకీర్తి సకలదిక్తటముల నింపె
జనపాలు రెన్న రాజ్యము చేయుచుండె.

తిప్పభూపతిభార్య పెద్దమాంబ.



పరమసాధ్వీమణి పటుశీల యనఁగ

బరగిన పెద్దమాంబాగర్భమునను 385
హరిహరసదృశులై యలరినసుతుల

తిప్పభూపతికుమారులు అయ్యపనాయఁడువెంకటాద్రి.


నిరువురఁ గాంచె మహేశసన్నుతులు
బలశౌర్యధనునయ్య పక్ష్మాతలేంద్రు
నలఘుతేజుని వేంకటాద్రిభూవిభుని
నరయ నాయిరువురయం దగ్రజుండు 390
పరమపావనుఁడయ్య పక్ష్మాతలేంద్రుఁ

అయ్యపనాయనిభార్య లక్కమాంబ కుమారుఁడు తిప్పభూపతి.


డతిశీలవతి లక్కమాంబికయందు
సుతుని శ్రీతిప్పవసుంధరాధిపునిఁ
గని పెంచి సకలభూకాంతులు గొలువ
పనుపడ తనయుని పట్టంబుగట్టి 395
క్షితి నెంత వారికి చెల్లని బిరుదు
లతిశయింబుగఁ దాల్చి యలరఁ బట్టించి
హగలు గగ్గోలురాయ హజీరుఁ డనుచు.[9]

ముగురుదునేదార్లు మొగి సన్నుతింప
బాపురే మాయయ్య భళిభళీ యనుచు 400
గోపాలరాజు చేకొని చూచి మెచ్చ
నళుకు బెళుకును లేక నాహవభూమి
తెలుఁగుబిజ్జలుమాడ్కి తెగువతోఁ జొచ్చి
మొనసి కందనయోలి ముట్టడి యల్ల
మునుమున్నె విడిపించి మోహరంబైన 405
బలుదునేదారుల భంజించి వైచి
పొలుపొంద గం ధేభముల నుగ్గుఁ జేసి
పొదలగ నీబుల పొం గణగించి
యెదురుపరాణీల నెల్ల మట్టాడి
చెలరేఁగి యెగసి నజీరులఁ జిదిపి 410
కలడక్కినీలఁ జీకాకుఁ గావించి
డేరాలత్రాళ్లెల్ల తెగ నరికించి
కోరి భాండారముల్" కొల్ల లాడించి
తనపేరు వారికందనయోలికోట
యనురాగమున సొచ్చి యారాజుచేత జు 415
మెచ్చులు గైకొని మేదినీపతులు

నిచ్చలు తను జూచి నృపులెల్ల నితఁడె
గెలుపులరాజని గీర్తించి పొగడ
విలసిల్లు రణకేళి విహరించె నెలమి
అతనితనూభవుఁ డగుతిప్పనృపతి
కుతలాధిపతులెల్లఁ గూర్మితో మెచ్చ
ధరణి వేరైన యాదవని దుర్గంబు
సురతాణి లగ్గగా చూర లాడించి
తగువజీరుల దునేదారులఁ జంపి
పొగరు తురుష్కులఁ బోనీక త్రుంచి
కలపాళెగాండ్ల చీకాకు గావించి
జల రేఁగి జయలక్ష్మి చేకొనివచ్చి
చల్లనివాఁడని జనులు నుతింప
నెల్లమహీస్థలి యేలుచునుండె
అంగనాజనమణి యలినీలవేణి

{తిప్పభూపతిభార్య వెంగమాంబ;
కుమారుఁడు లింగభూపాలుఁడు.}


సింగారవతి యనఁ జెలువొందినట్టి
వెంగమాంబికయందు వితరణకర్లు

లింగభూపాలు లాలితయశోధనునిఁ
గనియె నాలింగభూకాంతశేఖరుఁడు
తనదానధారావితానవాహినులు 435
వనధికి కళ్యాణవైఖరుల్ నెరప
తనభుజంబున భూతథాత్రి యేవేళ
ఘనరత్న కేయూరగరిమరాజిల్ల
మనుజాధిపతులు నెమ్మది కాన్క లొసఁగ
ధరణి యేలుచునుండెఁదగుముహూర్తమున 440

◂{లింగభూపాలునిభార్య సిద్ధాంబ, కుమారులు కొండభూపతి, అయ్యపనాయఁడు.}▸


పరఁగ నర్రావుల పర్వతాధిపుని
కన్నియ సిద్ధాంబకరుణావలంబ
నెన్నఁగాఁ బెండ్లియై యెసఁగుచునుండి
నీరజాప్త ప్రభానిసితాసివిజిత
ఘోరాహితనృపాలు కొండభూపాలు 445
సతతవదాన్యప్రసన్న సత్కాంతి
జితచంద్రునయ్య పక్షితినాథచంద్రుఁ

బుత్రులుగాఁ గాంచి పొలుపు వహించి
ధాత్రీపతులు మెచ్చ ధరణిపై వెలసె
ఆకుమారులలోన నహితరాజన్య

కొండభూపాలుని సంతానము.


భీకరశౌర్యుండు భీమబలుండు
బలభేదివిభవుండు బటుబెళగంటి
జలరాశి టంకశుంభత్ప్రౌఢిరాజ[10]
పురహల్లకల్లోల భువనభేతాళ
పరసైన్యభైరవ బల్లాడరాయ
గండోగ్రజగనొబ్బ గండప్రచండ
గండరగండవిఖ్యాతకేళాది
రాయచౌరాసీ దుర్గవిభాళచటుల
గాయగోవాళరక్తచ్ఛత్ర బసువ
శంకర సర్వేశ నిశ్శంకసాహసుని

వెంకభూపతి


వెంకభూపాలుని విమలచారిత్ర

సంగరాటోపప్రచండాధిరాజ
పుంగవప్రాభవభుజగర్వహరణుఁ
గరుణాపయోనిధి గాయగోవాళ
బిరుదాంకుఁ డగులింగపృథ్వీతలేంద్రు 465

లింగభూపతి


గద్దరి రిపువీరగజసింహమూర్తి

ముద్దులనాయఁడు


ముద్దులనాయని మోహనాకారు
నిటువంటితనయుల నిరవొందఁ గాంచి
పటుసత్యశీలుడై ప్రబలుచు నుండె[11]

బలియుఁ డాకొండభూపాలసోదరుఁడు

కొండభూపాలుని సోదరుఁడు అయ్యపనాయకుని ప్రభావము


విలసితసాహసవిక్రమార్కుండు
గురుతరపరవీరకోలాహలుండు
వరభవ్యగాంగేయవర్ణకేతనుఁడు
రాజిల్లు వెలియు కర్ణాట శ్రీరామ
రాజదత్తకిరీటరమ్యభూషణుఁడు
మనసిజాకృతి చెంచుమలచూరకార[12]
ఘనబిరుదాంకుండు కలితతేజుండు
నరనుతు నయ్యపనాయకేంద్రుండు
ధరణీశు లెన్న భూస్థలి వార్త కెక్కె
ఆమోద మెసఁగ నయ్యపనాయకేంద్రు

అతనికుటుంబము


భామిని వెంగమాంబామణి గర్భ

జలనిధి సంపూర్ణచంద్రునిలీలఁ
గలిగె శ్రీకొండ భూకాంతశేఖరుఁడు
ఆకొండనృపతి దయాపరమూర్తి
శ్రీకామినీనాథ సేవాభిరతుఁడు
అనిలోన నెదిరిన మహితకోటులకు
ఘనదివ్యభోగము ల్గలుగంగఁ జేసి
వెన్నుచ్చి చను శత్రువిభులకు నెల్ల
సన్నుతం బైనమోక్షంబుఁ గల్పించి
శరణుజొచ్చిన రిపుజనకోటి నెల్ల
నురుభోగభాగ్యసంయుతులఁ గావించి
తనకీర్తి యాచంద్రతారకముగను
వినుతింప నెగడించి వెలయ భూస్థలిని
రాజతేజుం డగు రావిళ్లలింగ
భూజానికొండభూభుజుఁడు మోదమున
సులవకపుత్త్రుల సుముహూర్తమునను [13]
జెలగుచు రాజ్యాభిషిక్తులఁ జేసి

మంతుకెక్కిన మేటిమన్నీలతోడ
పంతము ల్గలధరాపాలురతోడ
బలువిడి చతురంగబలములతోడ 500

కొండభూపాలుని పరాక్రమము


వలనొప్పు పలువైభవములతోడ
ఖకకరదీప్తులకరవాలుఁ బూని
సరిలేని చికిలిపచ్చలబాకు గట్టి
కరకుకెంపులబాషికంబులు దాల్చి
తరలక కరనీరదామంబుఁ బూని 505
సిరిగుల్కు రత్నాలసింహతలాట
బిరుదాంకముల చాల పెంపొందు జవన
తురగంబుపై నెక్కి తోరంపువేడ్క
సరసల వీరసేనలు జల్లుచుండఁ
గొప్పయెఱ్ఱనిపట్టుగొడుగులనీడ 510
నొప్పు చల్లనిగాలి యొదవుచు నుండ [14]
చెలువొంద జయలక్ష్మి చేకొనుకొఱకు

కులుకుచుఁ జను పెండ్లికొడుకుచందమునఁ
బొదలుచు మానవపురిచెంతఁ జేరి
పదరునేదులశాహుబలములమీఁద 515
గొదకక హరిణంపుగుంపుల గాంచి
కొదమసింహము చొచ్చుకొమరు చెన్నొంద
తేజీని చేసళ్లిధే యని నూకి
యాజిరంగముఁ జొచ్చి యహితసైన్యముల
గకవికల్ గావించి గద్దించి నరికి 520
ప్రకటించి తనపేరు పారిపోనీక
నెదురు రావంతుల నెలమి హుజీర్ల
పొదలుదునేదార్ల పుడమిపైఁ గొల్చి
హత్తి వెంబడివచ్చు నవనీశు లెల్ల
తత్తరంబున వెన్కఁ దగులువెట్టంగ 525
నిరుమొనల్ నరికిన నేదిక్కు గన్న
ధర డొళ్లియాడెడుతలలును నెగసి
పడెడికండలు బెట్టుపారురక్తములు
పొడియైనయలుఁగులు పొలియు రాహుతులు
గలిగి యొప్పెడు మహాకదనరంగమున 530

నళుకు బెళుకును లేక నని సేయువేళ
వేయారు లెద గాడి వీఁపున వెడలు
గాయముల్ మణిపతకంబులు గాగ
వెక్కసంబున మేన విరిగినయలుఁగు
లక్కజంబుగ హీరహారముల్ గాఁగ 535
పెనగొని మైవ్రేలు ప్రేవులసొబగు
తనరు నుత్తరజన్నిదంబులు గాఁగ
తరలక రంభాదితరుణులు మోహ
భరితలై తనదిక్కు భావించి చూడ
ఆచంద్రతారార్క మగునట్టికీర్తి 540
భూచక్రమున నించి పోరిలో వెలసె
ఆమహావీరుని నాత్మజులందు[15]

కొండభూపాలుని సంతానము


రామాభిరాముఁడు రణభయంకరుఁడు
వితరణకర్ణుఁడు విద్యలభోజుఁ
డతిబలశాలి దయాపయోజలధి 545

బలిమి భీమమరాళ బలరామ కులిశ
మలయజ ఘనసార మల్లికాతార
తారకాక్షార మందార నీహార
హారకుంద పటీర హరశరదభ్ర
హరి శారదా నారదాహీశ చంద్ర 550
శరదరచంద్రికాసాంద్రసత్కీర్తి
కార్తికేయార్జున కలితసాహసుఁడు
మార్తాండమండలమండితమండ
లాగ్రఖండితవిమతావనీనాథుఁ
డగ్రప్రతాపుఁ డత్యున్నతబలుఁడు 555
ఘనుఁడు రావిళ్లలింగనృపాలచంద్రుఁ

లింగభూపతి కృతిభర్త


డెనయ వేడ్కల ధాత్రి యేలుచు నుండు.
కారుణ్యవితరణగాంభీర్యపటిమ
క్షీరపయోరాశి చెలువున నలరు
సాయపనాయనిసత్కులాఢ్యుండు 560
శ్రీయనంతనృపాలశేఖరుం డెలమి

ధరణి భాగీరథీతరలాక్షిఁ బోలి
పరఁగు శ్రీలక్కమాంబాగర్భమునను[16]
గన్న సద్గుణధామకాంతాలలామ
సన్నుతాంగ విలాసచంద్రికాహారి
పరమకళ్యాణసంపత్పరంపరల
నరవిందమందిర యనఁగఁ జెన్నొంది
రచితశుభాకరరమ్య వైఖరుల
నచలేంద్రకన్యక యన నొప్పు మీరి
ప్రతిలేనిరూపవిభ్రమవిలాసముల
రతిదేవి యనఁగ ధరాస్థలి వెలసి
పరఁగు శ్రీభాష్కరాంబాపయోజాక్షి
వరముహుర్తమున వివాహమై ప్రేమ

లింగభూపతిభార్య భాస్కరాంబ


లొనర భావింపుచు నుచితవైఖరుల
వినుతకీర్తుల ధాత్రి వెలయుచునుండె.
మదదానవారిపదావతియందు

మదనునిఁ గన్నక్రమంబున నెలమి
పరఁగు శ్రీ భాస్కరాంబామణియందు
సరసరూపవిలాససత్కళామూర్తి
లలితభాగ్యవిశాలలక్షణాన్వితుని 580

లింగభూపతికుమారుఁడు రామభద్రుఁడు


కలితచాతుర్యవిక్రమధురంధరుని
రామభద్రనృపాలు రమణీయశీలు
శ్రీమంతు బాంధవాశ్రితకల్పవృక్షు
బలరామ సత్వసంపన్నునిఁ గాంచి
చెలువుమీరఁగఁ బోషింపుచు నుండె 585

లింగభూపతి పరాక్రమము


అంగ వంగ యుగంధ రాంధ్ర విదర్భ
బంగాళ నేపాళ బర్బర ద్రవిళ
లాట కర్ణాట వరాట కాశ్మీర
భోట విదేహ కాంభోజ సౌరాష్ట్ర 590
కురు కరూశ మరాట కోశలాత్మంత
ధరణీతలేశు లెంతయు సంతసింప

తిరుమణికోటలో స్థిరముగా నునిచి
పరవీరదుర్గముల్ పట్టణంబులును
నదలించు భేదించు నావార్త దెలిసి
బొదలు సుల్తానయబ్దులపాదుశాహ
మలయుదునేదార్ల మన్నీలఁ బిలిచి
సెలవు మన్నించియ శీఘ్రమె తరలి
చతురంగబలహితసంరంభు లగుచు
ధృతిమీరఁగా నలుదిక్కులు గ్రమ్మి
యుదయాస్తమయముల నురిమినలగ్గ
లుదిరించి నరికి మహోగ్రశౌర్యమున
డాబాలపైఁ బడి డాగులు చేసి
జీబులు బలిసినసేనల దునిమి
మన్నీల దొరల సామంతుల చెండి
వన్నెకు నెక్కు రేవంతులఁ జదిపి
మేటిదునేదార్ల మెరయువజీర్ల
ఘోటకమత్తేభకోటులఁ జదిపి
యాలంబుపై సొచ్చి యఖిలశాత్రవుల
దోలి పెన్గొండకుఁ ద్రోవలు సూపి

కురువీరబలముల గోరించినట్టి 610
నరుఁడే విభుండని నరనాథు లెంచఁ
గదిమిన శత్రువుల్ గళవళమంది
చెదరి పోరఁగ లేక చేతులు మొగిచి
కావుము బసువశంకరబిరుదాంక
ప్రోవుము బెళగంటిపురి శిలాటంక 615
శరణు గండరగండశత్రువిభాల
కరుణించి రక్షించు గాయగోవాళ
కీర్తించెదము మిమ్ము కేళాదిరాయ
యార్తుల మన్నింపు మవనీశగేయ
యని వేడుకొనిన దయాదృష్టి చూచి 620
తనరు వేడ్కల ధర్మధారఁ బొన్పించి[17]
సమరంబు చాలించి చయ్యన మరలి
రమణతో ధారుణీరమణులచేత
దళవాయి వేంకటధరణీశుచేత
నలరుచు దగుహెచ్చు లగుమెచ్చులందు 625

మానకౌరవరాజు మార్తాండతేజు
గాంగేయనగధైర్యు గాంగేయశౌర్యు
వెంగధాత్రీనాథు విమలచారిత్రు
తనయునిగాఁ గాంచి ధరణీశు లెన్న 660
వినుతసంపదలచే వెలయుచు నుండి
శశిధర వితరణ సాహసశాలి
విశదచారిత్రుండు వెల్లుట్లగోత్ర
పాత్రుండు సకలలార్థిబాంధవపద్మ
మిత్రుండు లింగభూమీకళత్రుండు 670

భాష్కరాంబవర్ణనము


దనరు వేడ్కలతో సుధాకరవదన
జననుతగుణధామ సాధ్వీలలామ
తిలకింప పరమపాతివ్రత్యమహిమ
నల యరుంధతిసాటి యని యార్యు లెంచఁ
జెన్నొంద బాంధవాశ్రితజనార్థులకు 670
నన్నపూర్ణ యటంచు నభినుతిసేయ
జగతిపై నుభయవంశములవారలకు

నగణితకీర్తి నెయ్యము గల్గి మెలఁగి
ఏపగు శ్రీ భాష్కరాంబామణి నెలమి
సరసవైఖరుల ముచ్చటలఁ బ్రోచుచును 675

లింగభూపాలునికీర్తికాంతావర్ణనము


సలలితసంపూర్ణచంద్రబింబంబు
నలువుమీఱినయాననంబును గాఁగ
వలనొప్పు తెల్లకల్వలవిలాసముల
కలికి బెళుకులసోగకన్నులు గాఁగ
లలితమౌ ధవళతిలప్రసూనంబు 680
విలసిల్లు నాసికావిభవంబు గాఁగ
పలుచని ఘనసారఫలకపుబ్రాఁతి
చెలువొందు ముద్దులచెక్కిళ్లు గాఁగ
మలచి సానలు దీరు మగరాలచాలు
కలితమౌ రదనవికాసంబు గాఁగ 685
సరసంపువలమురి సౌభాగ్యగరిమ
కరము రంజిల్లెడి కంఠంబు గాఁగ
నరసి చూఁడగ నంద మగుకల్పలతలు

పరువడి భాసిల్లు బాహువుల్ గాఁగ
భూనుతంబై మించు పుండరీకములు
మానితహస్తపద్మంబులు గాఁగ[18]
శ్రీల విరాజిల్లు సింహవిస్ఫూర్తి
లాలిత గగనాపలగ్నంబు గాఁగ
చె న్నొంది మిన్నయై చెలగుచుచున్న
పొన్న క్రొవ్విరిమేటి పొక్కిలి గాఁగ
పురుహూతబంధురస్ఫురితకంబములు
బిరుదులు రాణించు పిరుదులు గాఁగ
సముదగ్రశారదాస్తంభభాగ్యములు
కమనీయమృదులోరుకాండముల్ గాఁగ
రకమై వెలింగెడురజతకాహళులు
సుకరంపుజంఘికోస్ఫురణలు గాఁగ
నాకమహీజాతనవపల్లవములు
ప్రాకటం బగుపాదపద్మముల్ గాఁగ

కళల నొప్పెడు తారకానికాయములు
సొలపులు గలమేలిసొమ్ములు గాఁగ 705
బలుదండిగాఁ గాయు పండువెన్నెలలు
పొలుపొందువెలిపట్టుపుట్టము ల్గాఁగ
వెలసిన సత్కీర్తి వికచాబ్జముఖిని
పలుకులకొమ్మయంబరనదీరమణి
కులుకు చక్కనిపెండ్లికూఁతుఁ గావించి 710
నిలిచి పేరంటముల్ నెరపుచునుండ
భీమరాములు పెండ్లి పెద్దలై మెలఁగ
తామస మెడలించి దగ్గఱఁ జేరి
యలనారదుఁడు పురోహిత మొనరింప
చెలఁగి యశోలక్ష్మిఁ జేకొని వేడ్క 715
బలపరాక్రమభీమభాగ్యసంపదల
విలసిల్లె లింగపృథ్వితలేశ్వరుఁడు
ఎంతకాలంబు మహీమండలంబు
దంతావళంబులు ధరణీధరములు
వననిధానంబులు వాహినీతతులు 720
దినరాజచంద్రులు దిక్పతుల్ సురలు

తారకావళులు వేదములు ధర్మములు
నారూఢి విలసిల్లు నంతగాలంబు
నాయ రారోగ్యంబు లమితసౌఖ్యంబు
లాయతసంపద లఖిలభాగ్యములు
మానితోన్నతసామ్రాజ్యభోగములు(?)
సురుచిరకల్యాణశోభనంబులును(?)
కరితురగాందోళికాస్యందనములు
గలిగి రావిళ్లలింగమహేశ్వరుండు
నలనొప్పి జగతి ప్రవర్ధిల్లుచుండు
అని యిట్లు సకలలోకాభిరామునకు
ఘనఘనాఘనచంద్రకల్పధరాజ
శిబిదధీచిబలీంద్ర దిక్పాలఖచర
విబుధ ధేనుసమానవితరణాఢ్యునకు
శరజన్మగాంగేయశక్రతనూజ
వరబలోద్దండదుర్వారశౌర్యునకు
బహుళప్రతాపప్రభాపరాభూత
మహనీయతరచండమార్తాండునకును
కోమలమాధుర్యగుణధురీణునకు

భౌమినీ నూతనపంచబాణునకు 740
సకలపురాణశాస్త్రవిధిజ్ఞునకును
వికటశాత్రవబలవిచ్ఛేదనునకు
శరణాగతారాతిసంరక్షకునకు
నరపతి సింహాసనస్థాపకునకు
గురుతరరావిళ్లకులభూషణునకు 745
ధర నెన్నఁదగులింగధారుణీపతికి
నంకితంబుగను నే నార్యులు మెచ్చ
పొంకించి రచియింపఁబూనిన యట్టి
పరమసౌగంధికాప్రసవాపహరణ
చరితంబునకుఁ గథాసరణి యెట్లనిన.[19] 750

తనయుల నిర్వురఁ దగఁ గాంచి పంక్తి
రథుడు మోదమున శ్రీరామలక్ష్మణుల
విదితంబుగాఁ గన్నవిధము చెన్నొంద
నందగ్రజుఁడును ధర్మాయత్తచిత్త
మందరధీరుండు మహితయశుండు
కమనీయరూపరేఖాపరాభూత
సుమసాయకుండు తత్క్షోణీభవుండు
ధర తల్లిదండ్రి ముత్తాతలకీర్తి
కరెయ దన్నియుఁ గూర్చునట్టిధన్యుండు
రామభద్రక్షమారమణచంద్రుండు
భూమీశు లెన్న నద్భుతశక్తి వెలసె
ఆరామభద్రనాయకసహోదరుఁడు
సారబలోద్దండసాహసాంకుండు
హారచౌషష్టివిద్యాప్రవీణుండు
ఘోరమదాదిసంకులభేదనుండు
ధీరుండు తిమ్మధాత్రీకళత్రుండు
ధారుణి నెలసె సత్కవులు నుతింప

  1. తలవంచిగళరత్న తారహారాగ్ర. (క)
  2. తక్కక కెంబట్టు దట్టి పొందించి (చ)
  3. సంగరహృదయాబ్జ సచ్చంచరీక భట్టరు శ్రీచెన్నభట్టరాచార్యు (6)
  4. కారుణ్యసుకవి ముంగరశాససుకవి(క)
  5. సలిలతోడ్డీయాణ జాలాంతరములు (క)
  6. కలకేవలపు గుంభకముల గుంభించి (క)
  7. బెనగొని సంతతాభేద్యమై యలరి (క)
  8. తొలఁగక తనపట్టి తొలుతటి చికిలి (క)
  9. హగలు గగ్గోలురాయ వజీరుఁ డనుచు (క)
  10. బలశిలాటంకశుంభత్పాండ్యరాజ్య. (క)
  11. శంకర నిశ్శంకశౌర్యహంవీర
    కంకణహస్తసంగడిరక్షపాల
    శత్రుమహీనాథ సముదయాకార
    చిత్రతాందగభీమసింహతలాట
    నరకొర్యముఖ్య నానాభవ్యబిరుద
    భరితుఁడు కొండభూపాలశేఖరుఁడు
    తనకీర్తి భూనభోంతరములు నించి
    ఘనులు భూజనులు సత్కవులు నుతింప
  12. వరుస నార్గురు చక్రవర్తులకరణి
    నిరవొంద ధాత్రిని నేలుచునుండె (క)
  13. సొలవక పుత్త్రుల సుముహూర్తమునను (క)
  14. వొప్పుచందురు కావి యుల్లెడక్రింద (క)
  15. ఆమన్నెహమ్మీరు నాత్మజులందు (క)
  16. పరఁగు శ్రీరంగమంబాగర్భమునను (క)
  17. తనరు వేడ్కల ధర్మదారఁ బట్టించి (క)
  18. చెలువొందు తారాద్రి శీతాద్రి గోత్రములు
    కులుకుచు జొక్కపుగుబ్బలు గాఁగ (క)
  19. అయ్యపనాయకునికుమారుఁ డైనకొండనృపతి కిద్దఱు పుత్త్రు లున్నట్లు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములోని వ్రాతప్రతియం దున్నది.
    ఆకొండనృపతి బాహాబలోదగ్ర
    భీకరశౌర్య గంభీరచాతుర్య
    వినయవివేకప్రవీణు లైనట్టి