Jump to content

సౌగంధికప్రసవాపహరణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము


సకలపురాణశాస్త్రంబులు వినుచు
నకలంకహృదయుఁడై నలరుచు నుండి
జనమేజయుండు వైశంపాయనునకు
వినయమార్గంబుల వినుతులు చేసి
విహితభక్తిజ్ఞానవిభవవైరాగ్య
మహితతపోధనమౌనికులేంద్ర!
పాండవులకు యక్షపతికి నేతెరఁగు
భండనంబు ఘటిల్లె? ప్రదన మేరీతి?
అలర జయాపజయంబు లెవ్వరికిఁ
గలిగె నానతియిమ్ము కరుణాపయోధి
యని విన్నవించిన యతికులేంద్రుండు
మనుజేంద్రుఁ జూచి సమ్మతి నిట్లు పలికె.



 

బదరికావన వర్ణనము


భూతలాధీశ! జంబూద్వీపమునను
ఖ్యాతి కెక్కిన యట్టికాంతారములకు
మేటియై మిక్కిలి మిన్నంది పెరిగి
పాటిల్లు పాటలి పనస ఖర్జూర
చూతమహావటాశోకహింతాల
మాతులుంగాశ్వత్థ మాధవి వకుళ
మందార చంపకామ్లాత తక్కోల
కుంద కురంటక కుర్వజ కుటజ
బదరికా జంబీర పాటలి నింబ
కదళికా క్షారద క్రముక పలాశ
తాల తక్కోలాది తరులతావితతి
కాలవాలంబునై యనవరతంబు
పల్లవదళపుష్పఫలవిలాసముల
సల్లలితామోద సరసవైఖరుల
వాసవనందనవనమునుబోలి
భాసిల్లు నిరతంబు బదరీవనంబు,
ఆకాననంబున ననవరతంబు


నాకాల మీకాల మని తేటపడక 30
సొలపువాసనలచే జొటజొట వడియు
పలుచనిపూఁ దేనెపై నాస పొడమి
చిగురుజొంపములపై చిత్తముల్ నిలిపి
తగుఫలాపేక్షల తమకముల్ మించి
గగనభాగం బెల్లఁ గప్పి యుప్పొంగి 35
జిగిమిర దిక్కులఁ జీకట్లు గ్రమ్మఁ
జను భృంగశుక పిక సంఘముల్ గాంచి
తనరుచు బలునీరదము లని తలఁచి
వెలయ కలాపము ల్వికసింపఁ జేసి
యెలమితోడుత నటియించుమయూర 40
తతులకు తాళ భేదనము వీణియలు
జతగూడ మీటుచు స్వరలయకాల
మానముల్ దెలిసి వేమరు రాలు గరఁగఁ
గానంబు లొనరించు గంధర్వపతులు
గానము ల్విని సొక్కి గదుపులై చేరి 45
పూనిన పరవశంబున వైరవర్గ
ములు మాని యానందమున వినుచున్న


సలలితబహువిధజంతుసంతతులు
కమనీయబహువనకై రవకమల
కమలసంపూరితకమలాకరముల
రాజిల్లు రాజమరాళ సంఘముల
నోజతోడుతఁ జేరి యొక్కొక్క యొడల
కిలకొట్టుచును జలక్రీడ లేవేళ
సలుపుచు మెలఁగు నచ్చరపూవుఁబోండ్లు
కన్నులపండువుగాఁ జూచి భ్రమసి
కన్నన విలుకానికయ్యంబునకును
తమకించి బొదలు గంధర్వ శేఖరులు
కమలకాండాసక్త కమలాకరములఁ
గడునోర పౌరులు గలుగక యుండ
నడుపులు నేర్పు కిన్నరరాజముఖులు
నలువొంద రంభాదినలినలోచనలు
సలలితనాట్యప్రసంగ వైఖరులఁ
జెలుపురంజిల్లుమై సిరిపొంకములును
బొలుపొందు నభినయంబులసోయగములు
కొలఁదికిమీరినకోపుచాలులును


బెళుకులు దళుకులు పేరిణి విధము
లొనరంగ వీక్షించి యుల్లము ల్చెదరి
యనయంబు మోహించుయక్షవల్లభులు
సొరిది నన్నియుఁ జూచి చూడని యట్ల
వెర వొప్పఁగా విని విననిమార్గముల

పరమేశ్వరుని మనఃపద్మంబునందు
నిరవొందఁగా నిల్పి యీషణత్రయము
హరియించి యెపుడు బ్రహ్మధ్యాను లగుచు
ధరతపంబులు సేయు తాపసోత్తములు
మరి పెక్కుఁగలచిత్రమహిమలు గలిగి

పరువడి విలసిల్లు బదరికావనము
ఆవనమధ్యంబునందు నత్యంత
పావనంబై భవభయహరం బగుచు
గరుడగఁ ధర్వరాక్షసయక్షుఖచర
సురకిన్నరమనీంద్ర శోభితం బగుచు

ధర నెన్న మోక్షప్రదాయకం బగుచు
గరిమచే వెలయు గంగాతీరమునను


పాండవులు బదరికావనమున నివసించుట


పరువడి వసియించు పాండునందనులు
ధరణీసురులతోడఁ దమవారితోడఁ
దగినవేళలను గృతస్నాను లగుచు
సగణితం బగుపురాణాదులు వినుచుఁ
జెనఁటి యాకురురాజు చేసినకొదువ
లనయంబుఁ దలఁచుచు నావనంబునను
ధూర్తదానవకోట్ల ద్రుంచివైచుచును
నార్తులఁ బ్రోచుచు నలరుచుండఁగను

 

వసంత కాల వర్ణనము



బొలుపొంద తీయనిపూవుఁ దేనియల
వలసి వల్లములుగా వలగొని త్రావి
మధుమత్తవిస్ఫూర్తి మలయుచు మెలఁగు
మధుపసంఘంబులు మధురగానముల *
జతలుగూడి యపాంగసంగతు ల్నెరపి
సతతంబు క్రీడించుచారణాంగనలు


సలలితం బైనరసాలసాలములఁ
జెలువుమీరిన లేఁత చిగురులు మెసవి
కడుపులు నిండి వెక్కస మైనననల
కడలకుఁ దొలఁగించి కడుమెడలెత్తి

ప్రాకటంబుగఁ గూయుబలుకలకంర
కాకలీరవములఁ గలయంగనిరత
మానందహృదయులై యలరుచు మధుర
గానంబు లొనరించు గాంధర్వపతులు
వెలయు భూజములకు వ్రేగుగాఁ బండి

బలురసంబుల పరిపక్వంబు లైన
ముంతమామిడిపండ్లు ముక్కునఁ జిమ్మి
గొంతులగోలఁదిగాఁ గుటగుట ద్రావి
తామరతంపమై తనివిదీరినను
వేమారు పుక్కిళ్ల వెళ్లఁగాయుచును

చెలువంబు మెరయ రాజిలుకలకులుకు
పలుకులతోఁగూడ బహుతాళగతుల
వరుసతో మాధుర్యవాగ్విలాసముల



కెరలి దర్వులు బాడుకిన్నరసఖులు
లాలితస్వరకాలలయతాళగతుల

తాలమానంబులు దప్పకయుండ
కుటిలకుంతలములు కులికినటింప
నటియించు దేవతానలినలోచనలు
బొలుపుమీరిన మల్లెపూఁబొదరిండ్ల
వలరోజుకేళిలో వలపులు హెచ్చి

ప్రమదంబులను బహుబంధవైఖరుల 1
రమణులతో సమ రతులభోగించి
యంతంత మోహంబు లగ్గలం బైన
కాంతులఁ బైకొని కళ లుప్పతిల్లఁ
బలుమరు ధమ్మిల్ల బంధము ల్వీడ

బలువిడి కబరికాప్రసవముల్ రాల
సొలపుమై జెమటలు సోనలై గురియఁ
జెలువంపుహారముల్ చిక్కులుపడఁగ
నలుపురంజిల్లు కంకణము లందియలు
 


ఘలుమల్లు రని తాళగతులచే మొరయు 130
పనుపడి సుపరతి బంధ వైఖరుల
ననయంబు క్రీడించు యక్ష కామినుల
నలసత వెడలింప నతులమోదమున
మలయుచు విహారించు మందవాతములు [1]
మను జేంద్ర ! మరి పెక్కు మహిమల నలరి 135
చనుదెంచె నపుడు వసంతకాలంబు

భీముఁడు కందమూలముల దేఁ బూనుట

ఆసమయంబున నాయరణ్యమున
భాసిల్లు వేడ్కల బాండవాగ్రజుఁడు
తమ్ములు హితులు బాంధవులు గొల్వఁగను
నెమ్మితో ద్రౌపది నెయ్యంబు నెరప 140
పొలుపొంద ధౌమ్యాదిభూసురావళులు
చెలువంబుగను సుఖాసీనులై యుండి
ననురాగమునఁ జేర నరిగి యేవేళ
మునులు భూతభవిష్యములు దెల్పుచుండ
 



దుష్ట దానవకోటి ద్రుంచివై చుచును 145
శిష్టరక్షణమును జేయుచుండగను
జెన్నొంద నొకనాడు చెలఁగుచు భీముఁ
డన్నకు మ్రొక్కి ధౌమ్యాదుల కెరఁగి
తమ్ముల ద్రుపదనందన నాదరించి
నెమ్మి నానాయుధనికరము ల్పూని 150
మందస్మితంబున మసలక వేగ
కందమూలఫలార్థగమనుఁ డౌనపుడు

ద్రౌపది భీమునితోఁ గూడ వనవిహారము సేయఁగోరుట

ధరణీతల శ్రోణి ద్రౌపదీరమణి
ఆరసి దిగ్గన లేచి యని లనందనుని
దారి కడ్డముగచ్చి ధర్మజుఁ జూచి 155
నేరుపుతో మ్రొక్కి నిలిచి యి ట్లనియె
అనఘాత్మ ! నేఁడు నీయనిలజు వెంట
వనవిహారముసల్ప వాంఛ బుట్టెడిని
యీచెంత నున్న మహీరుహాపళులు
పూచి రాచి ఫలించి పొదలుచున్నవియు


తక్కినవనముల తరుల తావితతు
లిక్కడి కన్నను యెక్కువ లేమొ!
అక్కడివనభూము లావినోదములు
మక్కువతోఁ జూచి మరలివచ్చెదను
యనుపతుల్చెప్పక నవును కాదనక [2]165
నెనరున తలఁపు[3] మన్నించగావలయు
నని వేడుకొన్నట్టియంభోజముఃఖని
గనుఁగొని పాండవాగ్రజుఁ డిట్టు లనియె
వనజాక్షి యిటువంటి వాంఛలు గోర
జనునె నీమదిలో విచారించి చూడు 170

 ధర్మరాజు వలదనుట

మనకు రారాజుకు మాననిపగలు
ఘనముగా నేవేళ గలిగియుండగను
అదిగాక యీనిబిడారణ్యభూమి
మదదానవేంద్రులు మలయుచుండఁగను


అనిలనందనుఁ డొంటి నరుగుచుండఁగను
చనియెదనన నీకు సమ్మత మగునె?
సరసీరుహానన సఖియల కోర్కె
లరసి చూచిన నెంతకై ననువచ్చు
కామినిచే టెఱుఁగనికూన వగుట
యేమియు దలపోయ నిది నీతి గాదు
కసిబోయి తిరిగెడు కావడిబరువు [4]
వసుధపై మోసేటివారికె తెలుసు
కడనున్నవారికిఁ గానఁగా రాదు
పుడమిలో పయనమై పోయెడివారి
నరికట్టఁగాఁ జెల్లదరుగునీవేఁగ
సరసంబు లిక చాలు చాలు ర మ్మనిన
అండజయాన రోషాశ్రువు లొలుక
పాండవేయాగ్రణి భాషించి పలికె

ద్రౌపది నిష్టురోక్తు లాడుట

నరవరోత్తమ నీవు ననుదూరవచ్చు


నరుదుగా మీరు నాకై పడ్డ చేటు190
లరసి చూడంగ నెన్నైనను గలవు
గరిమెతో నేకచక్రంబునఁ జేరి
చలములు విడిచి భిక్షము లెత్తి గుడిచి
పలువురు విప్రులపంచల ముడిగి
యున్నతస్థితి మాని యున్నది యెల్ల195
నన్నుంచి కాదె! యోనరనాథచంద్ర!
మాయజూదము లాడి మహిఁ గోలుపోయి
దాయలచేఁ జిక్కి ధైర్యముల్ వదలి
కూళలై యాయుధకోట్లఁ బోనాడి
ఆలి నంగడిబెట్టి యపకీర్తి వడసి200
బేలవై పగరకు భృత్యులై చేసి
చలములు విడిచి భిక్షము లెత్తి కూడు
పోలింపఁ ద్రోపులఁబోయి యన్నిటికి
యలసి యుండుటయెల్ల న న్నుంచికాదె!
ఘోరాటవులఁ జేరి గోపంబు లుడిగి205
కూరలు గాయలు కూళ్లుగాఁ గుడిచి
నారచీరలు గట్టి నగుబాటు కోర్చి


చారుసువస్త్రభూషణములు విడిచి
పొలుపొందనిష్టోపభోగము లుడిగి
నలుకునఁ జెందుట, నన్నుంచి కాదె!210

అనఘాత్మ! నిన్ను నే ననఁబని లేదు
తనరార బ్రహ్మవ్రాతకుఁ దప్పురాదు [5]
మాయయ్య ద్రుపదభూమండలేశ్వరుఁడు
పాయనిప్రేమల పగలును రేలు
దాదులరొమ్ములఁ దనరారునట్టి215

దూదిపానుపులయందు బెనిచి యెపుడు
యేకోర్కెఁ గోరిన నేవేళనైన
కైకాన్కగా దెచ్చి కరుణతో నిచ్చు
పలుమారు మీపాలఁబడినది మొదలు
నలమటకొదువలే దది మీకె తెలుసు220

నొకనాయకుని నమ్మి యుండినసతికి
సకలకోరిక లెల్ల సమకూర్చు నతఁడు
అతులితాటోపు లత్యంతప్రతాపు


లతిధైర్యబలవిక్రమాటోపులయిన
పతు లేవురును గల్గి పడుపాటు లెల్ల225
జితపడ ననుభవించితి నని పల్కి
యనిలతనూజుని యాననాబ్జంబు
గనుఁగొన నాతఁ డగ్రజున కిట్లనియె

భీముఁడు ద్రౌపది నంపుమనుట



నరనాథ! మీ యనుజ్ఞలు గల్గెనేని
ధరణిపై నా కసాధ్యములును గలవె230
నను నీవు పేదమానవునిగఁ జూచి
యనిలనందనుఁ డొంటి యని పల్కఁదగునె
సాటికి నెక్కు నిశ్శంకరాయనికి
కోటముత్తిక లన గూడునే యెందు [6]
తిలకించి చూడు రాతికి గిలిగింత235
గలిగిన నాకళ్కు గలుగుభూపాల [7]



నీకు నే వెఱచుట నిక్క మొక్కటియె
కాక భయంబు నే కలనైన నెఱుఁగ!
కురురాజు నొకపెద్దకొండఁగాఁ జేసి
పరువడి మొనఁజూపి పల్కితి రిపుడు240
అతనికిఁ దోడుగా నమరగంధర్వ
పతు లేఁగుదెంచిన బర్వు లెత్తింతు
ననుఁ జూచి యిపుడె యీనలినాక్షి ననుపుఁ
డన విని ధర్మజుఁ డనిలజుఁ జూచి
ఓభీమ! కల దింక నొకసంశయంబు245

ధర్మరాజు సంశయించుట

ఈభీతహరిణాక్షి యీనీలవేణి
నిఁగ నేమి యనవచ్చు నిటువలెఁ గోరె
సొగసినట్లనరాదు సులభంబు గాదు
బహుయక్షరాక్షసభయద మీవనము
విహితంబు గా దిది వీరాగ్రగణ్య!250
యదిగాక నీవైన నర్జునుండైన
పదపడి నన్నుఁ గాపాడకయున్న


కలుషాత్ముఁడైన యాకౌరవాధిపుఁడు
పొలియింతు నని చెంతఁ బొంచియున్నాఁడు
అక్కట చనియెద నన ధర్మ మగునె!255
అక్కడ గాండీవి యమరేంద్రుపురికి
తతశక్తి నేఁగె నింతకుఁ జేరఁడాయె!
నతఁ డిందురాక ని న్ననుపలే ననిన
వినయంబుతో మ్రొక్కి వేడ్క రంజిల్ల
ననిలతనూభవుఁ డన్న కి ట్లనియె260

భీముని సమాధానము

అమరేంద్రుపురినుండి యర్జునుం డిపుడె
కమనీయవస్తువుల్ గైకొనివచ్చు
వహికెక్కు కురుపతి వచ్చిన నకుల
సహదేవు లున్నారు సమయింపగలరు
జగదీశ! సతులవాంఛలు దీర్పకున్న265
నగణితపాతకం బని యండ్రు బుధులు
ము ద్దుంచి మన మీతమోనిభవేణి
సద్దుదీర్పకయున్న భావ్యంబుగాదు


లలనలు చిన్నబాలురు వీరవరులు
తెలియఁజెప్పిన [8]దండ దీయరెంతైన270
సకలలోకంబులఁ జండప్రతాప!
అకలంకగతి నిల్పు ననఘుఁడ వీవు
పెలుచ నీపేరు చెప్పినయంత మమ్ముఁ
దలపఁగా శక్యులే ధరణీతలేంద్ర!
ముక్తిప్రదాత కాముని గన్నతండ్రి 275
భక్తశరణ్యుఁ డాపబ్బాంధవుండు
ఘనవర్ణుఁ డఖిలజగద్రక్షకుండు
మనపాలఁ నుండఁగా మరిభయఁ మేల
నుతికెక్కు నానందనుని ఘటోత్కచుని
ధృతిమీర మీసన్నిధిని నిల్పి పోదు.280
ధరణీశ సెలవిమ్ము తడవేల యనిన
నరనాథునకు మ్రొక్కి నకులుఁ డి ట్లనియె.

 నకులుడు ద్రౌపది నంపు మనుట

తావక కీర్తిప్రతాపము ల్సకల


దీవులయం దెల్లఁ దేజరిల్లఁగను
అదిగాక భీము బాహాటోపశౌర్యు
విదితగదాదండవిస్ఫులింగములు
శిఖిశిఖారేఖప్రసిద్ధమై మిగులు
నిఖిలలోకంబులయందు వెలుంగ
నక్షీణరథకేతనాశ్వసారథులు
నక్షయదివ్యశస్త్రశరాసనములు
[బహుయక్షరాక్షసభయద మీవనము
విహితంబు గా దిది వీరాగ్రగణ్య
యదిగాక నీవైన నర్జునుండైన
పదపడి నన్ను గాపాడక యున్న
కలుషాత్ముఁడైన యాకౌరవాధిపుఁడు
పొలియింతు నని చెంతఁ బొంచియున్నాడు
అక్కట చనియెద నన ధర్మ మగునె
అక్కడ గాండీవి యమరేంద్రుపురికి
తతశక్తి నేఁగె నింతకుఁ జేరఁడాయె!
నతఁ డిందురాక ని న్ననుపలే ననిన
వినయంబుతో మ్రొక్కి వేడ్క రంజిల్ల


ననిలతనూభవుఁ డన్న కి ట్లనియె,
ధరణీశ నీముద్దుతమ్ముఁ డై నట్టి
పరశక్తి గల కపిధ్వజుని యీక్షణమె
పసమించు నస్మదంబరదూతచేత
పొసఁగ మీసమ్ముఖంబునకు రప్పింతు
నుర్వీతలేశ్వర యొకనిరూపంబు
పరువడి వ్రాయించు ఫల్గునుపేరు
నన విని సంతోషితాత్ముఁడై శమన
తనయుండు కరుణ నాతని కౌగిలించి
యాయర్జునుని పేర నపు డొకలేఖ
వ్రాయించి యిచ్చిన వాయుసూనుండు
కరుణతోఁ దనతండ్రి గంధవాహనుఁడు
ఇరవొందఁ దను మెచ్చి యిచ్చినయట్టి
గ్రంథానుసారసత్కమనీయధూప
గంధిలవరమంత్రకలితరభాంగ
బంధబంధురకరభ్రాజితంబైన
గంధపారోజ్జ్వలద్ఘనసాయకంబు
పొది యడలించి యద్భుతముగా నార్చి


పదపడి యాలేఖ భద్రంబు చేసి320
శరమధ్యమున గట్టి చట్టమైనట్టి
వరశరాససము చెల్వమున చేపట్టి
గొనకొని విలునారి గొనయ మెక్కించి
కనకపుంఖోజ్జ్వలకాండ మంకించి
నారి సంధించి యానాక మీక్షించి325
ప్రారూఢకర్ణాంతపర్యంతమునను
దిగిచి కవ్వడిసన్నిధిని నిల్పు మనుచు
గగనవీథికి నేసె ఘనతరాస్త్రంబు
అపు డాశరాసము నద్భుతం బడర
గప్పున నురగలోకము సొచ్చివచ్చి330
కాకోదరాధీశు గర్వం బడంచి
వైకుంఠమునకు జవంబున నేగు
గరుడునిలీల నాకాశమార్గమునఁ
గరమొప్ప నధికవేగమున నేతెంచె
వరభోగభాగ్యదుర్వారసంపదల335
సరసమై చెన్నొందు స్వర్గంబునందు
కౌండిన్య గౌతమ కశ్యప కణ్వ


మాండవ్య మైత్రేయ మౌద్గల్య ప్రభృతి
పరమమునీశ్వరుల్ పార్శ్వభాగముల
నరసి పురాణశాస్త్రాదులు చదువ
తుంబురునారదాదులు వీణియలను
తంబురుల్ మీటి గీతములు పాడఁగను
రంభావధూటి తోరంపువక్షోజ
కుంభంబు లొక్కింత కుల్కి చెల్వుగను
కొలువువా రచ్చెరుకొని చూచి మెచ్చి
నలుదెరంగుల హెచ్చి నాట్యంబు సలుప
సురగేంద్రనిభవేణి యూర్వశీరమణి
పరువడి కటికచభారంబులకును
గడువడిఁ బరికింపఁ గద్దు లే దనెడి
నడుము దొట్రుపడంగ నర్తనం బాడ
మెలకువ గతులచే మేనకాలలన
నిలుకడతోఁ జేరి నృత్యంబు సలుప
నలమంజుఘోషామృగాక్షి శాస్త్రోక్తి
నలువునఁ జెలరేఁగి నటనలు సూప
గరుడకిన్నరయక్షఖచరకన్యకలు


సిరులు దొలుకఁ జేరి సేవలు సేయ
ఆకటీకట నిల్పి యమరగంధర్వ
రాకేందుముఖులు పరాకులు దెలుప
రహిమించు కాంచనరత్నసంఖచిత
మహితమహాస్థానమంటపంబునను
తిరవొందకొలువున్న దేవవల్లభుని
సరిగద్దె యెక్కి యచ్చరులు మెచ్చఁగను
కాలకేయాదుల ఖండించు బిరుదు
లోలిదేవత లెల్ల నుగ్గలింపగను
సరసకళావిలసద్వినోదములఁ
బరికించుచున్నట్టి ఫల్గును మ్రోల
నమరసంఘము లెల్ల నచ్చెరువొంద
భ్రమసి సంయమిరాజపటలి వీక్షింప
సురవిభుం డెంతయుఁ జోద్యంబు నొంద
పరివారములు భయభ్రాంతిచేఁ జెలఁగ
వ్రాలిన నమ్మహావాయుసాయకము
పోలించి శాంచి యాపురుహూతసుతుఁడు
ఆయస్త్రమున వ్రాయు నక్షరపంక్తి


వాయుసూనునియాన వ్రాలౌటఁ దెలిసి
విహ్వలచిత్తుడై వివ్వచ్చుఁ డపుడు 375
సింహాసనము డిగి చేతులు మొగిచి
వరుస నస్త్రమునకు వలగొని మ్రొక్కి
కరమొప్ప తన రెండుకరములు నెత్తి
కమ్మ నమ్ముననంటఁ గట్టినయట్టి
కమ్మపై పాండవాగ్రణిముద్రఁ గాంచి 380
సిరిమించు నా లేఖ శిరసావహించి
గరిమెతో నిటలభాగంబునఁ జేర్చి
కనుఁగవనొత్తి వక్షంబున నలమి
పనుపడఁ గట్టిన బంధముల్ విడిచి
వినయంబుతో కమ్మ విప్పి వాసవుఁడు 385
వినుచుండ చదివె నావీరశేఖరుఁడు
"శ్రీమన్మహారాజశేఖరుం డఖిల
భూమండలాధీశ భూరిమాణిక్య
మహిత కిరీటశుభ ప్రభాజాల
విహిత పాదాబ్దుండు వీరపుంగవుఁడు 390
సత్యవ్రతాచారు సర్వజ్ఞమూర్తి


నిత్య పోడశ దాననిరతుఁ డైనట్టి
యనఘ చారిత్రుండు యమతనూభవుఁడు
తనరార తనకూర్మితమ్ముఁ డైనట్టి
భుజబలవిక్రమాద్భుతయశోధనుని 395
విజయుని వేట్క దీవించి పుత్తెంచి
నట్టి కార్యము నేటియరుణోదయంబు
దట్టించి పవననందనుడు కాంతార
మునకుఁ దాఁజని కందమూలఫలములు
గొనివత్తు నని వేగఁ గువలయనేత్రి 400
పతిహిత చారిత్రి పాంచాల పుత్రి
నతని కడ్డమువచ్చి యాగిపోనీక
గొనకొని తనుఁదోడుకొనిపొమ్మటంచు
వనజాక్షిచలపట్టు వదలదింతైన
నేమియు: దోఁచక నిపు డున్నవాఁడ 405
నాముద్దుతమ్ముఁడ నాకేశతనయ
కడఁకతో నీకమ్మ కన్నాక్షణంబె
వడిగ రమ్మని దూరి వ్రాసిన లేఖ"
తేటగాఁ జదివి పార్థివుడు వేగంబె


ఖేటేశునకు మ్రొక్కి కీర్తించి పలికె ?
దేవదైత్యవిదార దీనమందార
యేవిన్నవించెద నేనొక్క మనవి
వడిగ రమ్మని లేఖ వ్రాసే మాయన్న
తడవు నే నిందుండ ధర్మంబుగాదు
పాంచాలపుత్త్రి తాపట్టిన ప్రతిన
కొంచెపుపనిగాదు కుధరవిదార
కోరదు మున్నెట్లు కోర్కె లెన్నఁడును
మీరదు మామాట మిగుల దింతైన
చపలనేత్రికి యింతచలము పట్టుటయు
విపరీతకార్యంబు వివరించి చూడు
కలహంబు బహుళంబుగాఁ గల్గు మాకు
సెలవిమ్ము చనియెద శీఘ్రమే యనిన
తనయుఁ గౌఁగిటఁజేర్చి తగ నాదరించి
కనకాంబరములు ఘనభూషణములు
గారవం బెసఁగ సుగంధవస్తువులు
పారిజాతాధికప్రసవదామయములు
యావాసవుం డిచ్చి యనిచిన నతఁడు



దేవసంఘములు సుభళి యని మెచ్చ
సురనాథునకు మ్రొక్కి సొరిది నర్జునుఁడు
వరదివ్యరథ మెక్కి పడి నేఁగి యేగి 430
ద్వైతవనాంతరస్థల మటు చేరి
యాతతభయభక్తి యన్నకు మొక్కి
వరుస ధౌమ్యాచారవరుని శ్రీపాద
సరసిజములకు సాష్టాంగముల్సేసి
యనవొందననిలజు నడుగుల కెరఁగి 435
యనుజులదీవించి యతివ నూరార్చి
యందఱఁజూచుచున్నంత దేవేంద్ర
నందనుతో ధర్మనందనుం డనియె
అర్జున విక్రమోపార్జన సమద
దుర్జనసంహార దోర్వీక సార 440
వనజాతదళనేత్రి వనవిహారంబు
జనఁదలఁచినది యాసామీరి వెంట
నిబిడఘోరాటవినిఖిలదానవులు
ప్రబలులై యందంద బలసియున్నారు
కౌరవాధీశుఁ డిక్కడ దృష్టినిలిపి 445



ధీరుఁడై కోరలు దీటుచున్నాఁడు
ఈవేళ మనపైన భీష్టంబు లేక
దైవరాయఁడు దయదప్పియున్నాడు
అక్కడ నొకకార్యమై చిక్కువడిన
పక్కున నగరె! యాపగవారలెల్ల
సమయంబుగా దని సరసోక్తిమీర
కమలాక్షికిని దెల్పఁగా దగుననిన
విని సంతసించి యావివ్వచ్చుఁ డపుడు
ననబోణి వీక్షించి నగుచు నిట్లనియు,
ఫుల్లాబ్జగంధి! యోభుజగేంద్రవేణి
పల్లవపాణి యోపాంచాలతనయ
కోమలి యిది యెంత కోర్కె గోరితిని
యామహాగగనంబునందు పోవలదు
మృదులాంబుజంబుల మీరు నీతళుకు
పదముల కేల యీపాషాణ బాధ
నాకలోకమునందు నఖిలవస్తువులు
నీకు దెచ్చితి నేను నెమ్మితో నిపుడు
మందారకుసుమదామములు నిచ్చెదను


యిందిందిరాలక యీకోర్కె విడువు
మంచివస్తువులు ప్రేమమున యిచ్చెదను 465
సందీప్త దేవభూషణము లిచ్చెదను
ఇందుబింబానన యీకోర్కె విడుపు
రమణీయదివ్యాంబరము లిచ్చెదను.
కమలయాతాక్షి యీకాంక్షలు విడువు
మంచివస్తువులు ప్రేమమున నిచ్చెదను 470
కాంచననాస! యీకాంక్షలు విడువు
కొంచక దక్కినకోర్కె లిచ్చెదను
కాంచనాంగిరొ! బుద్ధి కాంక్షలు విడువు
అటుగాక చంద్రబింబాస్య , యీ యడవిఁ
బటుతరకాలసర్పంబులు గలవు 475
అరుదందమీనాక్షి యవ్వన భూమి
వరిసంచయములవిహారము ల్గలవు
కరిమదయాన భూగహనంబులందు
గురుతర హర్యక్షకులములు గలవు
అరవిందపాణి! యీయడవిలోపలను 480
దురుసైనగంధసింధూరము ల్గలవు

.


హరిమధ్య! యిట్టిమహారణ్యమునను
కరమొప్ప శరభమృగంబులు గలవు
ఏమిగావలెవన్న యిచ్చెద నీకు
వామలోచన! యిట్టి వాంఛలు విడువు
అన విని పాంచాలి యర్జునుఁ జూచి
కనుఁగవ నశ్రువుల్గ్రమ్మ నిట్లనియె
అనఘచారిత్ర యోయమరేంద్రపుత్త్ర
యనువొంద మున్నెన్నఁడై నను మిమ్ము
కోరి యీగతి వేడకున్నదిగాదె
మారుతి మానవమాత్రుఁడే యకట
అడవిలో లేనిభయంబులు సెప్ప
తడబడి పెదవులు తడుపుచు నిట్లు
తెరగొప్ప నావాంఛఁ దీర్పక మీరు
పరిహసించఁగ నెంత పని ఇది నాథ
మందారకుసుమదామములు "నే కొల్ల
సందీప్తదేవభూషణము లేనొల్ల
రమణీయదివ్యాంబరములు నే నొల్ల
క్రమమొప్ప చందనగంధ మే నెల్ల


మంచివస్తువులు ప్రేమమున నేనొల్ల 500
కొంచక దక్కినకోర్కె నేనొల్ల
నంపిన గహనవిహార మంపుదురు
నంపకయున్న నే నన్నియు నొల్ల
నన విని కలకంఠి నపు డాదరించి
ఘనుఁడు కిరీటియగ్రజున కిట్లనియె 505
జగతీశ పతులు వాంఛలు దీర్పకున్న
నగణితపాతకం బని యండ్రు బుధులు
లలనలు చిన్న బాలలు వీరవరులు
తెలియజెప్పినదండతీయ రెంతైన
ముద్దుగా నతిహర్షమున నీలవేణి 510
సద్దుదీర్పకయున్న భాగ్యంబుగాదు
సకలలోకంబులు చండ ప్రతాప
మకలంకగతి నిచ్చు ననఘుండ వీవు
పెలుచ నీ పేరు చెప్పినయంత మమ్ము
దలపఁగ శక్యులేధరణితలమున 515
ననిలతనూభవుఁడసహాయశౌర్యు
ఘనధైర్యగాంభీర్యకలితతేజుండు


సరయ హిడింబి బకాసురవీర
వరుల చెండాడినవరబాహుబలుడు
సందేహ మేటికి సామీరి వెంట 520
యిందీవరాణీని నిపు డంప నగును
నావిని ధర్మనందనుతోడ నకులుఁ
డావెస నిట్లను ననుమోద మెసఁగ
తావకకీర్తి ప్రతాపము ల్సకల
దేవులయందెల్లఁ దేజరిల్లఁగను 525
భీమసేనునిగదా భీమప్రచండ
ధామ విజృంభితోద్దండప్రదీప్త
శిఖశిఖారేఖప్రసిద్ధతేజంబు
అఖిలలోకంబులయందు వెలుంగ
నక్షీణరథ కేతనాశ్వసారథులు 530

గలమహాబలశౌర్యగాంభీర్య దైర్య

  • 249-290 పంక్తుల స్థానమున ఈ విషయము (291-531 పంక్తులు ) ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారికడనున్న (త ) యను తాళపత్ర ప్రతియం దున్నది.


కలిత తేజోనిధి గాండీవి గలుగ
నిన్నిఁటికన్నను హితుఁడు బాంధవుండు
వెన్నుఁడు గలుగంగ వెరవేల మనకు
దర్పణంబునఁ బర్వత ప్రకాండంబు
లోర్పున నణుకులై యున్న చందంబు
నకట దేవరపాలి యాజ్ఞలోఁ జిక్కి
యొకకొంతవెరపుచే నుందురుగాని
ధరణిశ నీ సహోదరులు గోపింప
కురురా జనఁగ నెంత కురుయోధు లెంత
సురవరు లెంత రక్షోవీరు లెంత
గరుడనాయకు లెంత గంధర్వు లెంత
నరు లన నెంత కిన్నరులన నెంత
పరగ త్రిలోకాధిపతు లన నెంత
నెలకొని నీబల్మి నీ వెరుంగకను

సహదేవుఁడు ద్రౌపది నంపుమనుట

తలపోయనేటికి ద్రౌపది ననుపుఁ
డన విని సహదేవుఁ డగ్రజుతోడ
ననువొంద నిట్లను నవనీతలేంద్ర



కడుభీతితోఁ దల్లికడుపుసొచ్చినను
కడపటవచ్చెడి కార్యంబులెల్ల 550
రాకపోనేరవు కానికార్యంబు
లెక్కడనున్నను నింతైనరావు[9]
వలనొప్ప నలచక్రవర్తి రాఘవులు
తలపోయలేరైరె దైవవశంబు
దప్పింప శక్యమే ధాతకునైన 555
నెప్పటి కప్పటి కేమేమిపనులో
యప్పటి కాపను లమరఁజేయంగ[10]
తప్పి వచ్చిన మీద దైవ మున్నాడు
ఆదిగాక మొనఁజూపి యాడితి రిపుడు
మదినుండి నీ పవమాననందనుఁడు 560
చలమున నెంతైన చట్రాతినార
వలచు నీపనులందు వలదన్న వినఁడు
అతివ సంపుట లెస్స యంపకయున్న
నతఁడు దోడ్కొనిపోవునది నిక్కువంబు


నాకుఁ దోఁచినయంత నావిన్నపంబు 565
మీకు జెప్పితి దేవ మీ చిత్త మింక

ధర్మజుని సంశయము


అన విని సహదేవు నక్కునఁ జేర్చి
యనుమోదమునఁ బాండవాగ్రణి పలికె
తమ్ముఁడ నీపల్కు తథ్యంబు మాకు
సమ్మదం బగు నిందు చల్లలే దనుచు 570
నూఁదుకత్రావుచు నుందుమీఘనుడు
తోదేనెలేనివాడులు దెచ్చు నెపుడు
మిముఁజూచుకొనుచు నేమియుఁ జింతలేక
నెమ్మదినుండు నన్నియుఁ గల్గినటుల
కాంతారమున నొంటిగా జనువేళ 575
నెంతవారికినైన నింతి సంగడము
నడవిలో నొక కార్యమైన లెంచవలయు
నంపక యుండిన నతివదుఃఖించు
పంపిన యేమౌనొ యది గాన రాదు 580


బాహుభోగముల నున్న పాంచాలపుత్త్రి
గహనంబునందు సాంగత్యదోషమున
నలమటగుంద నేమనవచ్చు విధిని
పలుమరుదైవంబు పగవారి గూడె
నని తలయూఁచి హా! యని వెచ్చ నూర్చి 585
కనుఁగవ కలితాశ్రుకణములు నించి[11]

ధర్మరాజు ధౌమ్యాచార్యు నడుగుట

తెలియ ధౌమ్యాచార్యు దెస జూచుటయును
అలరి యా విప్రకులాగ్రణి పలికె

ధౌమ్యుఁడు ద్రౌపది నంపు మనుట

నిటువంటిపనుల కైయేటికి మీరు
అటునిటు జూచెద రవనీతలేంద్ర 590
నాకుఁ దోఁచినరీతి నయశాస్త్రయుక్తి ,
వాక్రుచ్చుచున్నాఁడ వనితతో నివుడు
కాననభూమికిఁ గదులుచున్నారు.
నానావిహారముల్ నడుపుచున్నారు


కనఁగల కార్యముల్ గనుచు నున్నారు 595
వినుతకీర్తులచేత వెలయు చున్నారు
మంచివస్తువులు ప్రేమంబునఁ గొనుచు
వేంచేయుచున్నారు వేవేగ నిటకు
కలఁగనేటికి మీకు ఘనరాజ్యలక్ష్మి
చెలువంబుతో మిమ్ముఁ జేరుచున్నదియు 600
ననుమానమేటికి నంభోజముఖిని
ననుపుట లెస్సయా యనిలజు వెంట
నన విని ధర్మజు, డౌఁగాక యనుచు
మనమున హర్షించి మారుతిఁ గాంచి
నాముద్దుతమ్ముఁడ నగరాజధీర 605
యోమరున్నందన యోభీమసేన
వనిత నీ వెనువెంట వచ్చుచున్నదియు
ఘనమృగాధీశఖగసంకులంబు
తరులతా నిబిడీకృతం భైనవనము
సరస చీమకుఁ దూర శక్యంబు గాదు 610

ధర్మరాజొడంబడుట

కంటికి ఱెప్పగాఁ గాపాడి వేగ


వెంటబెట్టుకరమ్ము వీరాగ్రగణ్య
అని సెలవిచ్చిన యధికమోదమున
పనుపడ ధర్మజుపదముల కెరఁగి
యతనిచే దీవన లంది ధౌమ్యునకు 615
హితభక్తిసంభ్రమం బెసఁగ నెంతయును
మ్రొక్కి యాశీర్వాదములు గాంచి యెలమి
గ్రక్కునఁ దమ్ములఁ గౌఁగిఁట జేర్చి
నిశ్చలవృత్తితో నెలఁతయుఁ దాను
పశ్చిమగమనుఁడై పరువడి వెడలె 620
సంతాపమును బొంది శమననందనుఁడు[12]
చింతించి నకులుని జేరఁగాఁ బిలిచి

 భీముఁడు ద్రౌపదితో వనమున కరుగుట

వనితాలలామంబు వాయునందనుఁడు
ఘనమైన ఘోరదుర్గములకుఁ జనిరి
ఆమరగంధర్వవిద్యాధరయక్ష 625



ధర్మరాజువిచారము నకులుని భీమునివెంటఁ బొమ్మనుట,

రమణీమణు లహోరాత్రు, లెల్లెడల
నిరవొంద జరియింతు రివ్వనభూమి
నెరయ నామదిలోన నెగులు బుట్టెడిని
యవనిపై సఖులపై నర్థంబుపైని
ఎవరికి నైన నభీష్టంబు గలదు. 630
నరయక్షకిన్నరనాగగంధర్వ
గరుడఖేచరసిద్ధకామినీమణుల[13]
సరకుసేయని మహాసౌందర్యశాలి
తరుణిమాత్రంబె యీద్రౌపదీరమణి
చంద్రనివాసంబు సతి నెమ్మొగంబు 635
చంద్రవిలాసంబు సఖియ లేనగవు.
కనకంబు నిరసించు కలికి మైమెఱుఁగు
కనకంబు నిరసించు కలకంఠినాస
కువలయానందంబు కొమ్మనేత్రములు
కువలయానందంబు కోమలిపిఱుఁదు 640


సారంగవిభవంబు జలజాక్షివేణి
సారంగవిభవంబు చామయానంబు
హరివినోదంబు తొయ్యలి రోమరాజి
హరివినోదంబు కంజాక్షి , నెన్నడుము !
అబ్జ సౌభాగ్యంబు హరిణాక్షిగళము
అబ్జ సౌభాగ్యంబు అతివ హస్తంబు
దానివిలాసంబు దాని రూపంబు
దానినిటారంబు దాని చెల్వంబు
దానివయ్యారంబు దగఁగాంచిరేని[14]
మౌనీంద్రులకు నెల్ల మది బెగ్గడిల్లు
వనితయు మారుతి వచ్చునందాక
ననుమాన మగుచున్న దనఘాత్మ నాకు
పదపడి వారివెంబడి పడి నీవు
కదలిన నామది కలగదీరెడీని
అన విని నకులుడు యమసూతుఁ జూచి[15]


నకులుని ప్ర ....

అనఘాత్మ మీ పల్కు లవియెల్ల నిజము
కరమర్థి మీయనుగ్రహమున నేఁగ
యిరవొంద వనభూమి కేతెంచునపుడు
నన్ను వీక్షించి గంథవహాత్మజుండు
నన్నల బిల్చి హస్తంబుఁ జేపట్టి 550
ఎన్నెన్ని విధముల నిటచాటి చాటి
యన్న యున్నాఁ డని యరిగె నెంతయును
పదరక నాతని పటువాక్యసరణి
మదిలో విచారించు మానవాధీశ![16]
మనమీద క్రోధ మేమరడు రారాజు 665
దిన రాజసుతుఁడు బోధించు నాతనికి
చలమున శకుని దుశ్శాసను లెవుడు
పెలుచ మచ్చరములు పేర్చుచుండుదురు
కనుగల్గియుండక గడుమోసపోయి.[17]


వెనుక చింతించుట వెఱ్ఱితనంబు
ధరణిపై పవననందనుఁ డజేయుండు
నెరయ నాతనిబల్మి నీ వెఱుంగుదువు
గాక నంతట దొడ్డ కార్యమౌనేని
యాకట వనుల కేనరిగెదగాని
వెనుక బుద్ధులు పదివేలుచెప్పుదురు
జననాథ యిపు డిది సమ్మతిగాదు
నావిని ధర్మనందనుఁ డట్టినీతి
దా విచారించి యంతయు నూరకుండె
అంతట పవచుజుఁ డలివేణి దాను
కొంతద వ్వరు దెంచి కోమలిఁ గొంచి

ద్రౌపదీదేవి వనవిహారము.
 
వనజాక్షి మాయన్న వలదన్న వినక
వనవిహారము వాంఛ వచ్చితి వీవు
అనువొంద యేఫలం బనుభవించితివి [18]


వనిత పోయినయట్ల వచ్చినయట్లు 685
గాకున్న నీమహాగగనంబునందు
నీ కభీష్టం బేమి నిక్కంబుపలుకు
మిచ్చకువచ్చిన నేవస్తువైన
నిచ్చెద నీయాన [19]యిందీవరాక్షి
నావిని నవ్వి యానాళీకపాణి
ఠీవి నెమ్మదిని వాటిల్ల నిట్లనియె 690
ప్రాణేశ నాశోర్కె ఫలియింప నీవు
గాని యింకెవ్వరు గల రెంచి చూడ
నడుగ మంటివి గాన నడుగుట సులభ
మడిగిన యిచ్చట యది దుస్తరంబు
నోటి కొచ్చినయట్ల సూరనవచ్చు.695

మాటాడి నిలుపుట మరికొద్ది కాదు.
సతులు గోరినకోర్కె సఫలంబు సేయ
చతురాననుని కైన శక్యంబు గాదు
బిరుదు వీరుండైన బిరికివాడైన
 


సరసి జాక్షులచెంత సాహసుం డౌను 705
ఎదురు దన్నెఱుఁగక నెంతయుఁబల్కు
కదిసి వేడిన వేళ కళవళమందు
వలవని యడియాస వలదు భూపాల!
యలరువనంబుల కరుగుదమన్న[20]
కనకాంగివదనంబు గాంచి యాప్పొంగి 710
యనిలతనూభవుం డనియె నంతయును
ఎంత మాటాడితి విందీవరాక్షి
కంతువిద్వేషితోఁ గదలివచ్చినను
అంభోజసంభవుం డడ్డగించినను
జంభాసురారిమచ్చరము చేసినను 715
కోరి త్రిలోకము ల్గూడివచ్చినను
దారుణి వాక్యంబు దప్పను నేను
తిరమొంద నీకోర్కె దీర్చకయున్న

తరుణి నేధర్మజు తమ్ముడఁ గాను
అన విని పాంచాలి యనిలనందనుని
గనుఁగొని యిట్లనె కటకటం బడుచు
నా జీవితేశ్వర నరనాథచంద్ర
రాజవంశాగ్రణిరణరంగ భీమ
మతిలేక నే ననుమాటకె యింత
ప్రతినసేయఁగ నీకు భావ్యమే నాథ
వనవిహారముజాలు వస్తువుల్జాలు
నిను వేఁడుటలు చాలు నీ యీవి చాలు
బెదరె యుల్లంబు వచ్చినయట్టిత్రోవ[21]
పదపద నికఁజాలు పదివేలువచ్చె
నన విని నవ్వి యయ్యనీలనందనుఁడు
నసబోణి వీక్షించి నలువొందఁ బలికె
శీతాంశువదనరాజీవదళాక్షి
నా తెంపు నా పెంపు నా భుజాబలము
గనియున్న దానవు గలఁగ నేమిటికి



ననుమీరివచ్చు నంతటిపనిగలదె
యిచ్చెద ననిపల్కి, యియ్యకయున్న
కచ్చుకపడి పాతకముబోవనీదు
ధరణి మెచ్చరు వీరధర్మంబుగాదు
యరమరసేయక యనుమానపడక
నడుగు మేవరమైన నడిగినకోర్కె.
లిడియెద ననిన నయ్యింతి యిట్లనియె
ప్రకటించి నీదువెంబడివచ్చునపుడె
సకలభాగ్యము లెల్ల సమకూడె నాకు
వేమాఱు నే విన్నవించిననైన[22]
నామాట చెల్లించు నాథుండ నీవు
మనుజేంద్ర యీవనమార్గంబునందు
ఘనమైనవస్తువుల్ ననుగొంటినేని
యప్పుడు మిమ్ము నే నడిగెదఁగాని
యిప్పటి కేమి మహీనాథచంద్ర[23] త్ర)
సొంపైన వనములు సొబగైన నగము


లింపైన వాహిను లెన్నంగఁదగిన
కొలఁకులు నొరపైన కోన లెచ్చోట
గల వచ్చటికి వేగ గమనించవలయు
ఆనిన సంతోషించి యనిలనందనుఁడు
చనుమార్గములను గంజాతలోచనకు 755
గరుడకిన్నరయక్షఖచరగంధర్వ
వరసిద్ధసాధ్య నివాసభూములను
వనములు నదులు పర్వతనికాయములు
ఘనమైన పొదరిండ్ల కలితంబులయిన[24]
మహిత వస్తువులు వేయారు దెల్పుచును 760
విహిత సంభ్రమముల విహరించుచుండ
పొసఁగ నాకట నొచ్చి బొరియలు సొచ్చి
బుసగొట్టుచును నేఁగు భుజగ సంఘముల
కొదకక, మెడలంటి గొరికి ఖండించి
బొదలు ముంగిసల చప్పుడు లాలకించి 765
యదరుచు కన్నంబులవి లీల వెడలి


కదుపువై చనుమూషకములకు బొంచి
రాగించు బలుబిడాలములపై దూరి
మూగిన రేచుగుంపులు మీర గొప్ప
గించు బెబ్బులులపై గినియు భల్లూక
సంచయంబుల నొంపఁ జనువరాహముల
బోనీక మార్కొనబోవ నేనుఁగుల
పైన లంఘించి కుంభంబుల వ్రచ్చి
మనుచు వేలె నని యంభోజవదన
ననుపమానందసమంచితామోద
లలితలతాంతపల్లవ పుష్పప్రతతి
వలనొప్ప శృంగారవనము సొత్తెంచి
తన కైశ్యవదన నేత్రకపోలములకు
తన కాళికాధరదంత వాక్తతికి
తనకంఠ బాహులతాహస్తములకు
తన కుచరోమాళితనుమధ్య దేశ
ఘనతరనాభికాకటిభోగములకు
తనయూరుజంఘాపదర్వయగతుల
కమరసమానంబు లైనవస్తువులు


కమలాకరములందుఁ గని చెలరేఁగి
తుమ్మెదకదుపులఁ దోలి నెత్తమ్మి
గమి యెమ్మె లడంచి కలువలు బ్రెంచి
పలుమారు నవచంద్రఫలకముల్ విరిచి
సొలవక కాంచనసూనముల్ రాల్చి
లలితమౌ బింబఫలంబులు డుల్చి 790
కలగక మొల్ల మొగ్గలనిగ లడఁచి
చిలుకల నెగదోలి వెలగి శంఖంబు
కలిమెల్ల బోనాడి కంజకాండములు
చెలువముల్ బెకలించి చిగురాకుగిల్లి'
తులకించి పువ్వుగుత్తుల నెత్తిబట్టి 795
చీమబారుల నొంచి సింగంబు దరిమి
వేమారు జిగిపొన్న విరిరేకు మడచి
తెలియంగ కర్పూరదిన్నియల్ ద్రొక్కి
చలమున కదళికాచర్మంబు లెత్త
కరమర్ది శాలికాగర్భముల్ సించి 800
యరుణాంబుజంబుల నటు నిటు బరచి
యంచలంచల మించు సంచలగముల



నించుక చప్పట లిడిపారదఱిమి
రవణ మౌ కమలాకరంబు సొత్తించి
యవగాహమొనరించి యటవినోదించి
తనరారు కాంచనతరుల మధ్యమున
ఘనతరకల్పవృక్షంబులనీడ
భూనుతంబై మించు పూపొదరిండ్ల
జానొప్ప గిరిగింజచప్పరంబులను
ఘసపారమృదువేదికలసోలి వ్రాలి
జనపతి దాసు విస్తారభోగముల
విలసిల్లురొదలేనివేడ్కల బొరలి
పొలపొంద నొకప్రొద్దు క్రీడించి
అంతట జాలించి యచ్చోటు బాసి
కుంతితనూజుండు కువలయనేత్రి
అంచితం బైననీలాభ్రంబు చెంత
మించులు గుల్కు క్రొమ్మించుచందమున
సతీకేలు వదలక జనపల్లభుండు
పతిదండ బాయక పాంచాలపుత్త్రి
వింతయు వేడ్కల నింపుసొంపులను


వింత వనాంతమున వెదకి చూచుచును
నెయ్యంబుతోటల నికరంబులందు
నుయ్యాల లూగుచు నొగి పొదరిండ్ల
దూకుడు మీరుచు దుమికి యాడుచును 825
నీరజాకరముల నెఱి జొచ్చి హెచ్చి
యోలలాడుచు భ్రమ నొండొరుల్ గెరలి
వేలారునిధముల విశ్రమించుచును
కేలికానగముల క్రీడించి మించి
మేలైనకోనల మెలఁగుచు పూల 830
బంతుల మేయుచు బలుదెరంగులను
మంతనం బాడుచు మరి జన నెదుట
మహిజాతముల్ రోమమార్గముల్ గాఁగ
రహిమీంచుగండ శైలముల బెడంగు
లలితమౌ కుంభస్థలంబులు గాగ 835
నలరారు నలపారు టాకుల సిరులు
నలువొందునట్టి కర్ణంబులు గాఁగఁ
తిలకింప గిరినుండి దిగువకు సాగి
తోరమె తగచూడ తుండంబుగాఁగ
.


నారూఢతిలకాజటాలంబగరిమ
వరుస మహాజలవాలంబు గాఁగఁ
బరువడి నెడలేక పారునిర్ఝరులు
దనరారు మదగజధారలు గాఁగ
లోనుండి యిల నంటు గొన బైనవిరులు
వినుపడ విలసిల్లుపదములు గాఁగ
ననలొందురామృగవిహారామహిమ
గరమర్థి భయదలంకారంబు గాఁగ
నరుదుమీరినవారణాచలాధీశు
గనుఁగొని యత్యంతకౌతుకం బడర
నెనయ నాపాంచాలి కి ట్లని పలికె
యిందీవరానన యీమహానగము
మందులగుబ్బ లీమలయాచలంబు
హిమపర్వతంబు హేమభూధరము
వమరుతారాగంబు వరుణగోత్రంబు
నకలంకలీల నణకించుజాతి
సకలవస్తుచయంబు సకలభాగ్యంబు
సకలసౌఖ్యంబులు సకలౌషధములు


సకలవైభవము లచ్చటఁ గల్గియుండు
ఒకవంక కిన్నరు లొకదిక్కు దివిజు
లొకపక్కి గంధర్వు లొకట గింపురుషు860
లొకటెంకి యక్షేశు లొకచెంత సిద్ధు
లొకచోట గరుడులు నొకక్రేవ మునులు
నమితమోదంబున ననవరతంబు
సమధికక్రీడల సలుపుచుండుదురు
వనజాక్షి యిమ్మహావైఖరిగొంత865
గనుగొందు రమ్మని కడువడి జనఁగ
మనసిజపవమానమానవాధీన
దినవీరప్రతిమానదేదీప్యమాన
గరుడకిన్నరయక్షఖచరసంతాన
నిరతకల్యాణవర్ణితసంవిధాన870
సౌభాగ్యసంధాన సంతతానూన
శోభనవిజ్ఞాన సుకరప్రధాన
భూనుతసంతాన భూజవితాన
నానాలతాసూన నవ్యనిధాన
మానితనిరుపమమణిమయసాన875


తానమానసమాన తంతన్యమాన
కలితసాంద్రనవీన గంధర్వగాన
విలసితం బగు కోనవేట్క లింపూన
గని మెచ్చి మెచ్చి యాకామినీమణికి
ఘనవినోదంబులు గణుతించి మించి880
పశ్చిమభాగంటు పరికించి కాంచి
యాశ్చర్యచిత్తుఁడై యనిలనందనుఁడు
ద్రౌపది నీక్షించి తగ నిట్టు లనియె
నోపంకజానన నోముద్దుగుమ్మ
కలికి చక్కెరబొమ్మ కమ్మపూఁగొమ్మ885
కులుకుమీటుమిటారి కోమలాకారి
యలరు మొల్లలబంతి యంగజుదంతి
కలితకైరవనేత్రి కాంచనగాత్రి
తనరువేడ్కల కొంతదవ్వు బుచ్చితిమి
మనవివేకంబు లేమనవచ్చు నబల (త)890
కుప్పలుగా నున్న గొప్పముత్యములు
చప్పరించుచు వెదచల్లుచుఁ గెరలు
కొదమసింహముల మార్కొని పోరి పోరి


కదలని శరభసంఘములఁ దోలుచును
మేదిని నేనుంగు మేతలాడుటకు
మోదంబుతో మిన్నుముట్టి భోరునను
చండవేగంబున జనుదెంచుఘోర
గండభేరుండపక్షిరవంబులకును
భీతి నేగెడురణభీమగృధ్రముల
ఘాతకుదీరి దిగ్గనఁ బార తెంచు
బైరిల చప్పుళ్ల భ్రమసి రివ్వునను
బారులగుళ్లనిబ్బరముల దెలిసె
చలియించి పరతెంచుసాళ్వసంఘముల
నెలవెల్ల బరికించి నెగులునఁ బారు
వారణంబులం గని వణఁకుచుఁ బొదలు
దూరుజాల్ డేగలతోరంపురవళి
కలుకుచు నులుకుచు నన్యోన్య భీతి
కలకలార్భటుల కాకసము గంపింప
బరచు నానావర్ణపక్షిసంతతుల
నిరవందఁ జూపుచు నేఁగుచున్నంత
సింధురగమన రాజీవదళాక్షి


గంధవాహతనూజుఁ గనుఁగొని పలికె
నవనీశచూడు మల్లదె మిన్ను ముట్టి
వివిధభూరుహలతావితతులఁ బొదలి
కనకనానామణీకలితంబు నగుచు[25]915
కనిపించుచున్న నగంబు పేరేమి?
యని విన్నవించిన యలినీలవేణి
ననురాగమును జూచి యనిలజుం డనియె

గంధమాదనపర్వతవర్ణనము



తరలాక్షి గంధమాదన మనుపేరఁ
బరఁగిన శైల మీపర్వతమహిమ920
లెన్న శక్యంబె వాణీశునకైన
పన్నగేంద్రునకైన పల్లవపాణి
మందరగ్రామంబు మణికోటినగము
మందులగుబ్బలిమలయాచలంబు
హిమచలోచ్చయమును హేమభూధరము925


నమరుతారాగంబు నరుణగోత్రంబు
నకలంకలీల వణకింపఁజాలి
సకలవస్తుచయంబు సకలభాగ్యములు
సకలసౌఖ్యంబులు సకలౌషధములు
సకలవైభవము లిచ్చటఁ గల్గియుండు
ఒకవంక కిన్నరు లొకవంక దివిజు
లొకచక్కి గంధర్వు లొకట కింపురుషు
లొకటెంక యక్షేశు లొకచెంత సిద్ధు
లొకచోట గరుడులు నొకక్రేవ మునులు
నమితమోదంబుల ననవరతంబు
సమధికక్రీడల సంచరింపుదురు
వనజాక్షి యిమ్మహావైఖరుల్ గొన్ని
గనుఁగొందు కమ్మని గడువడిఁ జనఁగఁ
గడురమ్యముగఁ గ్రొత్తగా ననలొత్తి
వడిజలకణములు వానలై కురిసి
సలలితపుష్పగుచ్ఛంబుల వ్రాలి
తొలకెడుపూఁదేనెతో కూడ పక్వ
ఫలరసంబులఁ జాలుపైని వర్షించి


బలుకాల్వలై పారి పండువెన్నెలల
కువలయాధిప శిలాకోటులు గరగి945
ప్రవహించి దుముకు నిర్ఝరములఁ గూడి
పచ్చరాచలువలపై నిండి యున్న
పచ్చికస్తురితెప్పలు లోనఁ గొనుచు
సొంపైన వంకల సొలపు జవ్వాది
రొంపుల మీద నారూఢిగా దుమికి950
పనుపడ నీరులై పారుచు తట్టు
పునుఁగున జొబ్బిల్లి పొలుపొందు వెదురు
గుములపై పడిసొచ్చి కుసుమపరాగ
సముదయంబుల మంచిశారదతతుల (తరుల)
పొంతలగపురంపుప్రోవులనెల్ల965
వింతగాఁ గలయించి వెల్లువల్ బారి
కడురమ్య మగుతరంగములచే నలరి
బెడిదంబు లగుచు నొప్పెడుపుణ్యనదుల
నవగాహనముల నెయ్యమున గావించి
కవగూడి యవల వేడ్కలుమీరఁ జనఁగ960
ఉన్నతావరణచంద్రోపలగిరులు

సన్నుతికెక్కిన సాలము ల్గాగ
లలితవినూత్న పల్లవరసాలములు
పసమించు మణి సౌధపంక్తులుగాఁగ
ప్రారూఢపుష్పపల్లవకింశుకములు 965
భూరిమాణిక్య గోపురములుగాఁగ
పొలుపొందఁ బూచిన పొన్న భూజములు
బలుమగరాల యుప్పరిగెలుగాఁగ
నెంచ మొగ్గలబోల్చు నీపూలసిరులు
మంచిముత్యపు మేలు మచ్చులుగాఁగ 970
బహుసూనరమ్య చంపకమహీజములు
మహనీయ హేమథామంబులుగాఁగ
సిరు లుల్లసిల్లఁ బూచిన పొదరిండ్ల
సరసంపు చిత్తరుచవికెలుగాఁగ
ధర నొప్పుగురువింద ద్రాక్షపందిరులు 975
మెరపైన చెందొవల్ మేల్కట్లుగాఁగ
కొమరు చెన్నొందు వైకుంఠంబుపోలె
సముదగ్ర మాధవసంచార మగుచు
నిటలాబ్జలోచననిలయంబుపోలె

పటుసర్వమంగళాభ్యంచిత మగుచు 980
వారిజాసనుని నివాసంబుపోలె
నారదశారదానందంబు దగుచు
పురుహూతపట్టణంబును బోలి యెపుడు
నెరయు రంభాహారిణీయతం బగుచు[26]
పురుడింపఁగ నయోధ్యఁబోలె శ్రీరామ 985
భరతలక్ష్మణకళాబంధురం బగుచు
పొలుపొందు ద్వారకాపురమునుబోలె
బలభద్రహరిచక్రభాసురం బగుచు
కవిరాజుకల్పితకావ్యంబుఁబోలె
నవరసాలంకారనైపుణ్య మగుచు 990
సతతకవిస్తుతచందంబుఁబోలె
యతిగణవర్ణఫలాన్వితం బగుచు
రమణీయరత్నాకరంబునుబోలె
విమలాబ్జబహురత్నవిలసితం బగుచు
ఘనరామరావణకదనంబు బోలె[27] 995

వనచరాధిపదైత్యవర్ణితం బగుచు
నొరసైన భారతయుద్ధంబుఁబోలె
గురుకర్ణభీష్మసంకులమును నగుచుఁ[28]
దనరారు గంధమాదనపర్వతంబు
చనవున కమలలోచనకుఁ జూపుచును 1000
పలుచనీహారసౌపానమార్గమునను
నెలమితో తిన్నగా నెక్కి పోవుచును
మదగజగమనమార్గంబునందుఁ
బొదలు తుమ్మెదలఁ జూపుచు వేగవేగ
మలయక మిట్టతామరలు ద్రుంపుచును 1005
విలసిల్లు సంపఁగెవిరులు రాల్చుచును
వెసచంద్రఫలకముల్ విఱిచి వైచుచును
అసమానబింబఫలాళి డుల్చుచును
కుందకోరకముల గుంజివేయుచును .
పొందైన చిలుకగుంపులను దోలుచును 1010
తెలివైన పోఁకబోదియలు గీటుచును
తొలఁగక జిగిఁదమితూండ్ల ద్రెంచుచును

నలువు మీరిన లేఁతననలు గిల్లుచును[29]
సలలితసూనగుచ్ఛముల రువ్వుచును
పదరుచు కృష్ణసర్పములఁ దోలుచును 1015

కొదమసింగముల టెంకులకుఁ బాపుచును
చక్కనిఘనసారసైకతస్థలులఁ
ద్రొక్కుచు ననఁటుల తొలఁగ దొబ్బుచును
పొల్చు నిర్వులబిఱ్ఱుపొట్టలబిగువు
సీల్చుచు తాఁబేళ్ల చెదర నూకుచును 1020

నరుణాబ్జములు తమ్మిహంససంఘముల
నురికింపుచును మది నుల్లాస మొంది
పతికేలు వదలక పాంచాలపుత్రి
సతి నండఁబాయక జనవల్లభుండు
వింతస్థలంబుల వెదకి చూచుచును 1025

సంతోషచిత్తులై చన చన నెదుట
మనసిజపవమాన మాధవస్థాన
ఘనవాసనానూనకలితనవీన

ఫలపల్లవోత్తాన పావనాసూన
లలితవనాసీన లావణ్యమాన 1030
మానితగాంధర్వమానిని గాన
మానస్వనాధీన మార్గఫణీన
తాండవలసమాన దాననిధాన
పాండురద్రుమవిటపస్థలోడ్డీన
కలకంఠముఖపతగవ్యాజమాన 1035
కలకలాకీర్ణలోకస్తూయమాన
సలలితశీతలచ్ఛాయాసమాన
విలసితం బగుకోన వేడ్కలింపూన
గని మెచ్చి మెచ్చి యాకామినీమణికి [30]
ఘనవినోదంబులు గనుపించె వేగ 1040
పశ్చిమభాగంబుఁ బరికించి చూచి

సూర్యాస్తమయ సమయము


యాశ్చర్యచిత్తుఁడై యనిలనందనుఁడు
అంచితాంబుజపాణి యలినీలవేణి

పాంచాలపుత్రి నేర్పడఁజూచి పలికె
సలలితమృదుపాణి సైకతశ్రోణి 1045
తలిరాకుఁబోణి యోద్రౌపదీరమణి
తనరు వేడ్కల నెంత దవ్వు వచ్చితిమి
మనవివేకంబు నేమనవచ్చు నబల
తిలకించి పడమటిదిక్కు వీక్షింపు
నలినాక్షి ఘడియ యున్నది ప్రొద్దు గ్రుంక 1050

భీముఁడు ద్రౌపదితో ధర్మజుకడకుఁ బోదమని చెప్పుట


నీయహార్యస్ఫూర్తు లెల్లఁ జూచుటకు
వేయిగన్నులు గలవేలుపువశమె!
తడవిందు నిలిచిన ధర్మనందనుఁడు
బుడిబుడి యదటునఁ బొక్కి చింతించు[31]
నామీఁద నీమీఁద నరనాయకునకుఁ 1055
బ్రేమవాత్సల్యంబు బ్రియమును గలదు
ననుబాసి నినుబాసి నరనాథుఁ డెంత

ఘనదైన్యభయములఁ గలఁగుచున్నాఁడొ![32]
పోవలె పద మని పొసఁగఁ జేపట్టి
పావని మరలింపఁ బాంచాలి పలికె
సన్నుతాటోప! మీసంగడి రాఁగ 1060
నన్నియుఁ గనుఁగొంటి నభిలాషదీరె
కలకంఠ శుకముఖ్యకలకలధ్వనులు
విలసిల్ల వీనుల విందుగా వింటి
సురుచిరదివ్యప్రసూనవాసనలు
గరిమ ఘ్రాణింపఁ గలిగె నీవలన 1065
పరిపక్వమాధుర్యఫలవితానములు
పరువడి రుచిగొని భక్షింప గలిగె
సమ్మతి నొందితి చనుఁ డన నతఁడు

ద్రౌపది యందుల కిష్టపడుట


నెమ్మితోడుత గమనించు నవ్వేళ
బాలభానుప్రభాభాసితం బగుచు
లాలితామోదవిలాసంబు నగుచు
కమనీయకలితశృంగారంబు నగుచు
రమణ లోకైకవిరాజితం బగుచు
సముదితఘనతరాశ్చర్యంబు నగుచు
కొమరొందు జిగిబిగిఁ గులుకుచు నలరి
వేయుదళంబులు వెలయుపద్మంబు

సౌగంధికము వచ్చి వారలకడఁ బడుట


వాయువశంబున వడి నేఁగుదెంచి
వరసౌరభము దిశావలయంబు నిండ
నిరువురిసన్నిధి నెలమి వ్రాలినను
పన్నగాశనయాన పాంచాలతనయ
కన్నులపండువు ల్గాఁగ వీక్షించి
గరిమెతో దనముద్దుకరముల నెత్తి
సరసలోచనపంకజంబుల నొత్తి

భావించి కాంచనపద్మంబుఁ గాంచి
పావనివదనంబు పరికించి గాంచి 1085
వామలోచన ఖిన్నవదనాబ్జ యగుచు
భీమసేనునిఁ జూచి ప్రియమునఁ బలికె
ధరణీశ కనకపద్మము గనుఁగొనిన

ద్రౌపది సౌగంధికములఁ గొన్నిఁటిఁ దెమ్మని భీము నడుగుట


నరుదార మదిలోన నాసవాటిల్లె
గరిమెతో నివ్విరిఁ గైకొందుననిన 1090
సరస మున్నెవ్వరో సవరించినారు.
పరులు ధరించిన ప్రసవసంఘములు
నొరులకు ధరియింప యోగ్యముల్ గావు
వనవిహారమునకువచ్చు నవ్వేళ
చనువున ననుఁ బిల్చి సత్యప్రతిజ్ఞ 1095
నడుగు మిచ్చెద నని యంటిరి మీర
లడిగెద నటువంటిహాటకాబ్జములు
గనుఁగొని యెందైనఁ గలదేని తెమ్ము
ఘసత మీసత్యవాక్యము నిల్పుకొండు
చేకొని మీర లిచ్చినవరంబునకు 1100

నాకోర్కె చెల్లించు నా ప్రాణనాథ
యీవర మీకున్న నిచ్చోటు పాసి
నే వచ్చునది లేదు నీపాదమాన
అన విని బెగ్గిలి యనిలనందనుఁడు
కనకాంగి పల్కులు కడుముల్కు, లగుచు 1105
మనమున నాట ధర్మతనూజు నీతి
ఘనముగాఁ దలపోసి కామిని డాసి
కనువిచ్చి మోము వెక్కసముగాఁ జూచి
యినుదిక్కు వీక్షించి యి ట్లని పలికె
కలకంఠి కంటివే కమలబాంధవుఁడు 1110

ద్రౌపదీ భీముల సంవాదము.


పొలుపొందు పశ్చిమాంభోనిధిఁ జేరె
నిరులు గ్రమ్ముచు నున్న నీకావవంబు
సురదైత్యు లిచట హెచ్చుగ మెలంగుదురు
నారీశిరోమణి ననువంటి మేటి
వీర శేఖరు నీవు వేడితి విపుడు 1115
ఇమ్ము దప్పినవేళ నెంతేసి ఫనులు

సమ్మతి గాని విచారంబు లనక
కోరుట కొదువలౌఁ గోరినయట్టి
కోరిక లీకున్న కొదువలో కొదువ
కటకటా సమయంబుగాని యీవేళ 1120
నిటువలె నడిగిన నేమనఁగలను
నిబి డాటవులయందు నిన్నుఁబోవిడిచి
యబల యేవిధమున నరుగుదు నేను
ప్రాణపర్యంతమౌ పనులయందైన
మానంబు పోకుండ మనవలె నండ్రు 1125
అటుబోవ నిట నెవ్వరై నను గలరె
యిట నున్న నటు సన నెవ్వ రున్నారు
ఇట నిల్తు నటఁ బోదు నేన యటన్న
పటుతరవిశ్వరూపంబును లేదు
తెగువ నిచ్చోటికిఁ దెప్పింతు నన్న 1130
మగువ యాకర్షణమంత్రంబు లేదు[33]


.

మాయన్న చెంత నెమ్మది నిన్ను నిలిపి
పోయెదఁ దెచ్చెదఁ బ్రొద్దున లేచి
కనకాంగి సౌగంధికములు దేకున్న
పనుపడ నామోము పరికింపవలదు 1135

లోలాక్షీ ముగుదాటిలో గాలు దూర్చి
నేలమూర్ఖము మాను మీపనియంత
చనుదెమ్ము పోదముం జా గేల ననిన[34]
వనజదళాక్షి పావని కిట్టు లనియె
అనఘాత్మ నీవంటి యసహాయశూరు 1140

నినువంటి నెరయోధు నే వేడుకొనిన
కళవళపడి చేతగాని మానవుని
వలె దూరిపలుక నెవ్వరు చెప్పఁగలరు
మునుపు యిచ్చెద నని మొనసినవేళ
వెనుకముందఱఁ జూడ వీరధర్మంబె 1145

యీపని మీయన్న యింతయు విన్న
కోపించుకోరికల్' కొనసాఁగఁబోవు

ముల్లోకములఁ జూడ ముగుదలకో ర్కె
చెల్లించఁగలవీర శేఖరు లెవరు
నీవు చింతిల నేల ? నెగులొంది నన్ను 1150
భావించి చూచి కోపము సేయ నేల?
విచ్చలవిడి పల్కు వేళలు వేరు
ఇచ్చట బరికింప నెవ్వరు లేరు
ఇచ్చట లే దను మిపుడె నీ వెంట
వచ్చెద ననిన పావని యిట్లు పలికె 1155
నళినాయతాక్షి యెంతయు బాలకన్నఁ
బలుచఁగా ననుఁదూరి పలుకఁగ నగునె,
యీయరణ్యమున నిన్నిరనొంద నిల్పి
పోయిన నపకీర్తిఁ బొందుదు నిజము;
కుసిమీర వెంట దోడ్కొని పోదు ననిన 1160
పసదప్పి కార్యంబు పైకొనివచ్చు;
ముందఱ చఱి వెన్క పులి పొంచియున్న
చందమాయెను నీదుసౌఖ్యంబు రమణి ;
కలఁగక నీవంటి కాంత యీబుద్ధి
దలఁచుట యిది యెల్ల దైవయోగంబు 1165

వామాక్షీ చలపట్టి వదలవు మీఁద
నేమిగా నున్నదో యెఱుఁగంగరాదు,
నినుఁ దూర నేమి నా నేరమెగాదె!
యన విని పాంచాలి యనిలజుఁ జూచి,
అమ్మక్క చెల్ల! యో యనిలతనూజ! 1170
ఇమ్మెయి ననుఁదూరి యేల పల్కెదవు?
ధర్మ నందను కూర్మి తమ్ముండ వగుట
ధర్మశాస్త్రము లాడి తప్పరా దనుచు
మొరలుపెట్టుచు నుండు మొనసిన నెపుడు
విరులు గోరుట లవివేకమే నాథ! 1175
భీముఁ డాడినమాట చెనికె నటన్న
భూమి విశేషంబు బొంకుట గాదు
పెక్కు గా నాసలు బెట్టుటకంటెఁ
గ్రక్కున లేదనఁ గలుగుపుణ్యంబు,
పట్టినప్రతిన నేపట్టుననైన 1180
గట్టిగా వదలని ఘన ధైర్యశక్తి
నరునకుఁ గాక పదునాల్గులోకముల
నొరులకు చెల్లునే యుర్వీతలేంద్ర

అన విని చింతించి యనిలనందనుఁడు,
తనమదిలోఁ గొంత తడవు చింతించి, 1185
చలపట్టి వదలదు జలజాయతాక్షి
తొలగఁగూడదు బహుదుర్ఘటం బాయెఁ!
గొరగానిసంగతి గూడి నే నిట్లు
ఇరుకున జిక్కితి నే మనవచ్చుఁ !
గొనకొని తాఁ జేసుకొన్నంత తానె 1190
యనుభవింపకతీర దజునకునైన,
గురుతుగా మెడఁజుట్టి కొన్నట్టిపాము
గరువక విడుచునే కటకటా.యింక !
కావలియై యింతి కడనుండ నెనరు ,
దేవప్రసూసము ల్దెచ్చువా రెవరు? 1195
వనజాతములఁ జూపు వార లెవ్వారు?
అనుచు వితర్కించు నాసమయమునను

నారదాగమనము.


శ్రీకాంతుచరితముల్ చెలగు వేడుకల [35]

ప్రాకటజంత్ర గాత్రముల బాడుచును
జడలు దూగంగ బొజ్జనటింపుచుండ[36] 1200
వడిగ రుద్రాక్షతావళము[37] లల్లాడ
కరకమండలనీరకణములు చింద
సరసిజాసనుసూతి చనుదెంచుటయును ;
గని వధూవరులు జక్కఁగ నెదురెఁగి
ఘనభక్తి మ్రొక్కి వేడ్కలను పూజించి, 1205
వినుతులు గావించి వినయము ల్సేసి
జననాథసూను డాసంయమి కనియె
సురమునిరాజు భాసురరవితేజ

నారద భీముల సంభాషణము.


పరమదయాస్వాంత పటుసత్యవంత
మునుపు నేవనమార్గమున వచ్చునపుడు 1210
వనజాతపాణికి వర మిచ్చినాఁడ
నిందుబింబానన యిపు డిటువంటి

పొందమ్మివిరిగోరి పొక్కు చున్నదియ
నివియున్న నెలవు లే నెంతయు నెఱుఁగ
వివరించి యెందైన వెదకెద ననిన 1215
నిక్కడి కక్కడి కేనొక్కరుండు
నెక్కడ దెత్తునే హేమకంజములు
కడఁకతో నిచట నొక్కరుఁడు కాపున్న
గడియలోఁ దెచ్చెద కనకపద్మములు
అనఘాత్మ దీని కుపాయ మేమైన 1220
ననువొందఁగా వేగ నానతిమ్మనిన
జలజసంభవసూతి జనపతిఁ జూచి
నలువొందఁ జిఱునవ్వు నవ్వి యి ట్లనియె
ధరణీశ మీ కసాధ్యము లై నపనులు
కరమర్థి సకలలోకములందుఁగలవె ! 1225
వనజాక్ష్మి చెంత కావలి యుండునట్టి
ఘనునిఁ జెప్పెదను నాకర్ణింపు మిపుడు
నన్ను తాటోపుఁడు చండవిక్రముఁడు

నారదుఁడు ఘటోత్కచుని నందునిచి కమలములఁ దెచ్చుటకుఁ బొమ్మనుట.

వరబాహుబలుఁడు దుర్వారశౌర్యుండు
తరణితేజుఁడు ఘటోత్కచుఁడు నీతనయుఁ 1230
డారాక్షసాధీశు నరయ నిం దునిచి
పోరాదె తేరాదె భూరి పద్మములు
కమలంబు లన నెంత లోకము లన నెంత
నిమిషమాత్రము పట్టునే నీవు దలఁప
ద్రౌపదీరమణి సంతతపుణ్యసాలి 1235
యోపిక లేక దా సుసురుసు రనిన
నాపదల్ సంధిల్లు నవనీత లేశ
యాపువుఁబోణికి హేమకంజములు
గొనివచ్చి మదిలోని కోర్కెలఁ దీర్చు
మనుజేంద్ర నీ వేఁగు మార్గంబునందు 1240

నారదఁడు భీమునితో నతని కాకార్యము నందొక మహాత్ముడు సాయపడునని తెల్పుట.


ననఘాత్ముఁ డొకఁడు నీకై న బంధువుఁడు
కనకకంజము లున్న క్రమముఁ దెల్పిడిని

మనమునఁ దగుననుమానము ల్మాని
చను మని దేవతా సంయమి గదలె
అంతట గంధవాహాత్మజుం డధిక 1245

ఘటోత్కచుఁడు భీమునికడకు వచ్చుట.


సంతోషచిత్తుఁడై సతిని లాలించి
యమితలోకభయంకరాకారమూర్తి[38]

నముదగ్ర శత్రుసంచయసమవర్తి
ఘనబలోద్దండ విక్రమకళాస్ఫూర్తి
తనతనూభవు ఘటోత్కజుఁ దలంచుటయు 1250
దలఁచినయంత నుద్దండ ప్రచండ
బలశౌర్యనిధి హిడింబానందనుండు
అటట్టు త్రిజగంబు లల్లలనాడ
చెట్టుగా ప్రస్థానభేరివేయించి
గగనచుంబి ప్రచండ గండ భేరుండ 1255
ధగధగద్ధగితకేతనధాళధళ్య
నానాయుధోజ్జ్వలనవరత్న ఖచిత
భూసుతదశచక్ర భూరిషట్కోటి
మహనీయఘంటికామార్తాండ సదృశ
బహుళకాంచనకుంభ భాసుర ప్రకట 1260
పంచాననవ్యాఘ్ర భల్లూకశరభ
సంచయభయదోగ్ర చర్మ సంకలిత
వితతమనోనేగవిధజవనాశ్వ
శతపరిభ్రాజితస్యందనం బెక్కి
యరదములో నలుబదియాఱుకోట్లమర 1265

కరిఘట లొకకోటిగడలుకొనంగ
హరులు లెక్కల కెక్కువై పిక్కటిల్లఁ
దరుచుగా బలువీరదానవు ల్గొలువ
తమకంబు బలము నుద్దండంబు చలము
గమకమై పెనఁగొన గడువడి నేఁగి 1270
తల్లిదండ్రులకు వందనములు చేసి
మెల్ల మెల్లన లేచి మిక్కిలి పొగడి
వడముడి వదనంబు వలనోప్పఁ జూచి
కడుమోదమున ఘటోత్కచుఁ డిట్లు పలికె
పనియేమి మాయయ్య! పనియేమి దేవ! 1275
పనియేమి భూపాల! పనియేమి స్వామి!
భోరున నాకొకబుద్ధి మన్నించు
చారణ గరుడఖేచరులఁ జెండుదునొ !
హరిహయ వై శ్వానరాంతక నిరుతి
వరుణ వాయు కుబేర వామదేవాది 1280
ఘనదిశా ధీశుల కట్టల్కఁబట్టి
కొని వత్తునో! భూపకుంజ రావళుల
కొట్టుదునో! భూతకోటులనెల్ల

పట్టుదునో! దైత్యపతుల నెంతయును
చట్టలు చీల్తునో సర్వాధినాధు. 1285
ధట్టింతునో! చతుర్దశ భువనముల
నట్టిట్టు చేతునో! యంబుధు లెల్ల
బెట్టుగావింతునో! భీకరఫ్రౌఢి
కురుబలంబులనెల్ల కూల్తునో! లేక
వరబల్మిపట్టి తేవలయునో! యిటకు 1290
నని బల్కునందను నక్కునఁ జేర్చి
తనరు వేడుక నృకోదరుఁ డిట్టు లనియె

ద్రౌపదియొద్ద భీముఁడు ఘటోత్కచు నునిచి సౌగంధికముల కరుగుట.


ఓవీర శేఖర! యోదైత్యనాథ!
ఓవిశ్వభీకర! యోయికుమార!
వనవిహారమునకు వచ్చు నవ్వేళ 1295
వనజలోచనకు నేవర మిచ్చినాఁడ
పోఁడిమి నిటువంటి భూరిపద్మములు
వేఁడుచు నున్నది

ఆడినమాట లేదనిన పాపంబు
పాడి దప్పుట రాజపంతంబుగాదు 1300
నిన్నుఁ బంపగవచ్చు, నీచేత నౌను;
నన్ను వేడినది యీనాళీకపాణి
యిదిగాక రణమున కరుగుటకంటె
నదనుమానము గాచు టది మిక్కుటంబు
నాసాటివాఁడవు, నాముద్దుపట్టి 1305
వాసికెక్కిన ధైర్యవరశౌర్యనిధివి
అచ్చెరుపడి మీర లందఱు బొగడ[39]
తెచ్చెద జాముకు దివ్యసూనములు
కనకాంబుజము గొని కలకంఠి దోడ్క
జననాథుఁ డున్న యాస్థలమున కరుగు 1310
మని దానవాధీశు నక్కునఁ జేర్చి
కనకాంగి నెంతయుఁ గౌఁగిట నలమి
పోయివచ్చెద నని భుజ మప్పళించి

వాయు వేగంబున వాయుజుఁ డరిగె,
అనిలజుఁ డరిగిన నాఘటోత్కచుఁడు[40] 1315
మొనసేయ కున్నను, మోసం బటంచు
ధనబలంబులనెల్లఁ దగ వేఱు వేఱఁ
గొనఁగొని యష్టదిక్కుల బారు లేర్చి
నలుదిక్కులందు నెంతయు హెచ్చరికల
పొలుపొంద కోపురంబులు బెట్టి రమణి. 1320
నొకపొదరింటిలో నుంచి తా నొక్క
నికట దేశంబున నిలిచి కాపుండె
అంతట బాంచాలి ననిలజాఁ దలచి

ద్రౌపది - సంతాపము.


ఎంతయుఁ దల యూచి యిది చిత్ర మనుచు
మనమునఁ గడు ననుమానంబు బొడమి. 1325
తనలోనె తాను నెంతయుఁ జింత నొంది
జనపతి వల దని చాటిచెప్పినను

విననైతి నే నింత వీఱిఁడి నైతి
వనవిహారం బేల వచ్చితి! వచ్చి
కనకకంజము కాంచితి! గాంచి 1330
పదరి నే నెందుకు పట్టినపట్టు
వదలక ననిచిత వాయునందనుని
మించిన నామాట మీరంగలేక
వేంచేసె నొంటిగా విపినభూములకు: [41]
కరమర్థి సౌగంధికము లున్న నెలవు. 1335
లెఱఁగునో యెఱుఁగడో యేకార్య మగునొ
ఆసకు సిగ్గులేదాయె! యయ్యయ్యొ
నా సరివారిలో నగుబాటు గలిగె
వెలయ పెద్దలబుద్ధి వినకనే వచ్చు
ఫలమెల్ల చేఁజేత ఫలియించె నిపుడు. 1340
పతి నంపి యెంత పాపంబు గట్టుకొంటి!
మితిలేని యపకీర్తి మెడఁగట్టుకొంటి!

రాముని మాయాకురంగంబు జొనిపి
కామిని నెడబాపుకరణి నే నిపుడు
భూమీశు నెడబాపె భూరిపంకజము 1345
ఏమికార్యం బౌనో యెఱుఁగరా దింక
తనరార ధర్మనందనుఁ డిది విన్న
ననుదూరు, నిందించు, నామీఁద నలుగు
నని విలపించు నయ్యంభోజముఖిని
గనుఁగొని యఘటోత్కచుఁ డిట్లు పలికె. 1350
అమ్మ ! నీ వీపని కడల నేమిటికి?
నెమ్మది నిదె వచ్చు నీ ప్రాణవిభుడు
ఆవీరశేఖరు నామహాబలుని
దేవదానవకోట్లు దృష్టింపఁగలరె !
అటు గాక వేరొకటైన నాబాణ 1355
పటలంబుచేత నీపదములకడకు
పరలోక సురలోక నాకలోకములఁ
దిరముగ నిప్పుడె దెప్పింతుఁ జూడు
గొనకొని యిటువంటికొడుకు గల్గఁగను
వినవిమ్మ నీ కేల విడువు భయంబు.

అన విని పాంచాలి. యసురేశుమోము
గనుఁగొని గద్గదకంఠయై పలికె
మాయన్న ! దై తేయమండలాధీశ!
మీయయ్య నెరయోధ మిక్కిలి నీవు
విలుకాండ్ర మేటివి వీర శేఖరుఁడ 1365
నలఘుతరోగ్ర మాయా ప్రవీణుఁడవు
అసహాయశూరుండ వని యెఱుంగుదును
పొసఁగ నీశౌర్య మిప్పుడు గానవచ్చె
నేకాకియై భీముఁ డేఁగు నవ్వేళ
ప్రాకట చతురంగబలములం గూడి. 1370
నిచ్చట నీ వుండు టిది ధర్మ మగునె!
హెచ్చైన రథికుల నిటగాపుఁ బెట్టి
చనరాదె నీవు నీజనకుని వెంట
ౘనవరి వగుచు నిచ్ఛటను నీ వున్న
దనుజవీరులనైనఁ దగ నంపవలదె ! 1375
వనవీధియందు నెవ్వరు లేనిచోట
దిద్ది మీసము దువ్వి దిగ్గన లేచి

గద్దించితే నేమి కార్యసాధనము! [42]
అక్కడ వడముడి యహితులచేత
చిక్కి నొచ్చిన నేమి సేయఁగవచ్చు 1380
నటుమీఁద నీదుసాహసము నీబాణ
పటలంబు నీభుజాబలము మాకేల!
సొలసినపిమ్మట బోయి మీయయ్య
కొలదీర్చిరా మది గోరితివేమొ
అని పల్కి విని విన్నయై తలవాంచి 1385
కనకాంగితో ఘటోత్కచుఁ డిట్లు పలికె
నాతల్లి యింత చింత గలంగ నేల?
వాతాత్ముజుం డాహవమునఁ జిక్కినను
పగలు చుక్కలురాలు వద్మబాంధవుఁడు
తొగలరాయఁడు తప్పుత్రోవ నేఁగుదురు. 1390
సొగలు లోకాలోకములు బెగ్గడిల్లు
గగనోర్వులల్లాడు కమలజాండములు
పటపటపగులు సప్తపయోధు లింకు

వటపత్రశయన శర్వ బ్రహ్మలకును
వరుస నెమ్మనముల వణుకు వాటిల్లు. 1395
నరపతిమాత్రుఁడే ననుగన్న తండ్రి !
గతి దప్పి వేఱొకకార్యమౌనేని
సుతు నన్నుఁ జుల్కగా జూడంగ వలదు
బ్రహ్మాండభాండముల్ పగులఁగొట్టుదును
బ్రహ్మరుద్రాదుల బంధించి వైతు. 1400
వాలాయమునను నవనిధానములును
గాలింతు సకలలోకములు భేదింతు
కడి గొందు గులమహా గ్రావసంఘముల
మడియించెదను గ్రహమండలి నెల్ల
భూవరు దెత్తు మద్భుజశ క్తి నీవు. 1405
భావించి చూడుము పాంచాలతనయ!
నన్ను నాబల్మి నెంతయు నెఱుంగకను
కన్నతల్లివి గాన కారు లాడితివి
జనని యిందుల కేమి సంతోష మాయె |
విను మింక నొకనీతి విన్నవించెదను. 1410
ననఁబోణి యిచ్చట నను నిల్పి చనియె

జనపతి యుంచు నచ్చట నుండ కేసు
యతని యానతి మీరి యరిగితినేని
యతివరో! స్వామి భృత్యన్యాయ మగునె?[43]
మాయయ్య యసహాయమహిత శౌర్యుండు, 1415
మాయయ్య యత్యంతమానధనుండు
దేవప్రసూనము ల్దెచ్చి యిమ్మనుచు
నావీరు నొక్కని యడిగితి నీవు
యతఁడు దాఁ దెచ్చెద నని మమ్ము నెల్ల
చతురో క్తి మెరసి యిచ్చట నిల్పి చనియె 1420

నాతని కేసహాయంబుఁ బంచినను
నాతండ్రికిని ప్రతిజ్ఞాభంగ మౌను[44]

వచ్చును నీమనోవల్లభుఁ డిపుడె
తెచ్చు నీచెంతకు దేవసూనములు 1425
అనుమాన మిక మాను మనిన పాంచాలి
దనుజవీరునిఁ జూచి తలయూచి పలికె

అన్న సంగరశూర హాసుకుమార
చిన్నన్న నా కిన్ని చెప్ప నేమిటికి
అపజయశకునంబు లయ్యెడి నిపుడు
విపరీతములు పుట్టె వినువీథియందు
మది తల్లడము నొందె మక్కుప దొలఁగె
నిదె చూడు మెడమక న్నీగగొట్టెడిని
నాపతి నాదాత నాపట్టుగొమ్మ
నా పెన్ని ధానంబు నాప్రాణవిభుఁడు
నాకూర్చుచెలికాడు నాకొంగుపసిఁడి
నాకోర్కె చెల్లించు నాకూర్మి మగఁడు
భీముఁడు రిపురాజభీముఁడు సుగుణ
ధాముఁడు పటుబలోద్ధాముఁడు ఘనుఁడు
ఆయుధహీనుఁడై యడలుచు సర్వ
కాయమంతయు సంపగమి-గాడి వెడలి
పచ్చిగాయంబుల బహుళరక్తములు
విచ్చలవిడిఁ బార వెక్కసపడుచు
పొదరుచు పడరుచు బొబ్బరించుచును
నెదుట నిల్చినలీల లెసఁగెడి నిపుడు

అని యని వగచి హా యని విలపించు
ననఁబోణి గాంచి దానవనాథు డనియె
వెరవకు మాతల్లి! వెరవకుమమ్మ !
వెరపు నీ కేటికి విక చాబ్జవదన !
రహిదూరదృష్టి దూరశ్రవణములు
మహితమాయోపాయమర్మ కర్మములు 1450
వరుస ననాగతపర్తమానములు
కరతలామలకముల్ కలకలరి నాకు
న న్నెఱుంగక యుండ నసుఁగన్న తండ్రి
కిన్ని బాధకములు ఏటికి వచ్చు ?
నపజయశమనంబు లయినవి యెల్ల 1455
చపలాక్షి మనకు విజయ మని తలఁపు

ఘటోత్కచుని సాంత్వనము.


ఇంతుల కెడమక న్నీగ మొత్తినను
నెంతయు శుభమగు నిందుబింబాస్య
కొత్తగాయంబులఁ గుందుచు విభుఁడు[45]

హత్తి నిల్చిన యట్టు లైనది వినుము 1460
కలితమౌ సౌగంధిక ప్రమానములు
వెలది వేగమే దెచ్చు పేట్క నీ కిచ్చు
నమ్ము నావచనముల్ నాలీకపాణి
సమ్మతి నొందుము చలియింపవలదు
సతికి నెంతయు మనోజయము గల్గినను 1465
పతికి నంతటిబాహుబలశక్తి గలదు
తిరమొంద నీదుపాతివ్రత్య మహిమ
పరమదీర్ఘాయువు పాండుసూనులకు

నని యొక్క రథముపై యబ్జాక్షి నునిచి
కనకపంకేజంబు గైకొని వేగ 1470
నలనొప్పు బదరికావనమార్గమునను
బలములతోడ నిబ్బరమునఁ జనియె

సూర్యాస్తమయవర్ణనము.


తను ప్రయోగింప నుద్దండత వెడలి
దనుజవీరులనెల్లఁ దగఁ దునుమాడి
ఘనర క్తయుక్తమై గ్రక్కున మరలి[46] 1475
చనువున పశ్చిమజలరాశి యనెడి
చెలువంపు టోరలోనఁ జేరు కంజాక్షు
సలలితం బగుదివ్యచక్ర మనంగ
నరయ మహానటుం డసువీరముష్టి
దురుసునఁ బరువళ్లు దొక్కునవ్వేళ 1480
నలరుచు సమయకంజాక్షి వాయించు[47]

పలుమఱు నిటువంటిపనులకై నీవు
వలవదు విలసింప వనజాతపాణి
యని కోటిచండమార్తాండసంకాశ
ఘనతరమాణిక్యఖచితసంకలిత
తనదివ్యమకుటంబు ధవళాక్షిపాద
వనజాతములు సోక వరభయభక్తిఁ
బ్రణమిల్లి లేచినఁ బటుబలాధిపుని
రణరంగవిజయుని రాక్షసాధిపుని
కనుగొని పాంచాలి కచవివిజితాశి
యనువొంద దీవించి యతని కి ట్లనియె
దనుజేంద్ర నినువంటితనయుఁ డుండగను
మనసులో నా కనుమాన మేటికిని
యదుకులస్వామి కటాక్షంబు గలుగ
పదపడి మరికొంతభయము నాకేల
పంకజంబులకు నే పతి నంపినట్టి
యపకీర్తి దరిగె నెంతయుగాని?
విపరీతములకు నే వెరువలేదన్న
యని పల్కి తనమదియడలు వారించి
కనకాంగినిశ్చలగతి యున్నయంత
తను బ్రయోగింప నుద్దండత వెడలి

ప్రథమాశ్వాసము

143


చెలువైనబంగారుజేగంట యనఁగ
వినుతారుణప్రభావితతవైఖరులఁ
దనరు పంకజబాంధవుఁ డస్తమించె?
గరిమెతో ఫణిరాజకన్యక ల్వేగ1485
గురుతైన బుఱ్ఱట క్రోవులు బూని
పరపైన యస్తాద్రిపై నెక్కి నిక్కి
సురకామినులమీఁద చూడ్కులు నిలిపి,
నెయ్యముల్ మనమున నివ్వటిల్లంగ1490
నురగకన్యలమీఁద నొగి జలరేగి
కరమర్ధి దేవతాకమలలోచనలు
మురియుచు రతనంపు మొరిటెల ముంచి
గురుతుగా నించినకుంకుమో యనఁగ
సడలక దట్టమై సాంధ్యరాగంబు1495
పడమటిది క్కెల్ల ప్రభవించి మించె
వెడవిల్తు డెంతయు వేట్క రంజిల్ల
వడి పాంథులౌ సురవర్గంబుమీఁద
విలసిల్లు రసదాళివి ల్లెక్కువెట్టి
తొలఁగక నేసిన తుదిమిన్ను దాకి1500

144

సౌగంధిక ప్రసవాపహరణము


 
మొనలు జిక్కుకయున్న మొల్లబాణంబు
లనఁ బొల్చె తారక లాకాశవీథి
రమణీయగిరిగహ్వరంబులు వెడలి
గమకమై చనుభల్లుకంబు లనంగ
గరుడవాహనుమీఁదఁ గడుదండు వెడలి1505
పరతెంచురాక్షసబలము లనంగ[48]
ననిలుని దార్కొన నధికవేగమున
కనలుచు చను ఘనాఘనము లనంగ
తనర నెల్లడల తానయై నిండి?
కనుపించు హరిదేవకాంతు లనంగ1510
భూనభోభాగముల్ పూర్ణమై కవిసి[49]
కానఁగానఁగ మీంచె కటికఁచీకటుల

చంద్రోదయవర్ణనము

ఆసమయంబున యామినీరమణి
భాసిల్లు హరిపదపద్మావధూటి

ప్రథమాశ్వాసము

145




కరుడు మీరఁగ మంగళార్తులు పెట్టి1515
పరఁగ నెత్తిన వెండిపళ్లెర మనఁగ
కలితమౌ పదియారుకళలఁ జెన్నొంది
తొలిదిక్కు ననుదోచె తుహినకరుండు
అలరుచు చందురుం డనుమాంత్రికుండు
మలయుచు దిశ లన్ని మంత్రించి కట్టి1520
తగ నంధకారభూతంబుల దరిమి
పొగడొందఁ జల్లు విభూతి యనంగ
పొసఁగ నభోలక్ష్మి భూకాంతమీఁద
గసటుదీరగ నించు కర్పూర మనఁగ
మునుల నెల్లను దేవమునులఁ గావించి1525
వనధు లెల్లను క్షీరవారిధుల్ జేసి
భూజాతములఁ గల్పభూజము ల్సేసి
రాజవర్యుల బలరాములఁ జేసి
నదుల నెల్లను దేవనదులు గావించి
వదలక సతులవాగ్వనితలఁ జేసి1530
యలరుపక్షుల రాజహంసలఁ జేసి
కలమృగంబులను సింగములఁ గావించి

కడిమి విద్యల జూపుగారుడసాని[50]

వడువున చంద్రికావైఖరు ల్వెలసె[51]

ప్రథమాశ్వాసము

147



మలయమారుతవర్ణనము

మలయాద్రిచెంత నెమ్మది నుద్భవించి1535
పొలుపొందు మల్లెపూఁబొత్తుల బొరలి
యొనరు పూఁదేనియ యుగ్గున బెరిగి
పనుపడ నునుమంచు బాల నీడేరి
వరుస నానాసూనవాసన లాని
శరజాకరముల ముచ్చట నోలలాడి[52]1540
కపురంపుఁదిన్నెలఁ గడువినోదించి
విపులమౌ చందనవృక్షంబు లెక్కి
యొగి కల్పలతలతో నుయ్యాల లూగి
జగిమించు తేటితేజి నెక్కి నిక్కి[53]
పంచధారాగతు లుపన్యసింపుచును1545
నంచల నంచల నటు దువాళించి
చెలఁగుచు నొకవీథి చేవాగెసడలి
తొలఁగనీక కుదించి దుమికించుకొనుచు

148

సౌగంధిక ప్రసవాపహరణము



వలనొప్పు మేటి రేవంతునిలీల[54]
మలయుచుఁ జనుదెంచె మలయానిలుండు.1550
అంతకుమున్నె యయ్యనిలనందనుఁడు
సంతోషచిత్తుఁడై చన చన నెదుట
పాఠీనకర్కట బహుజలగ్రాహ

కళానదీవర్ణనము

కారీన కర్పర కమఠాళిహోర
హరి భేక భేకీ మహాధుళీఘోర 1555
కరిభీమ తిమితిమింగలారావ
కోలాహలంబునై కొమరొందుదాని
హాళిదరు ల్మించి యరుదెంచుదాని

 

ప్రథమాశ్వాసము

149


వలగొనియున్న శైవాలజాలంబు
లలితమౌ వేణీవిలాసంబు గాఁగ1560
పొలుపొందు వికసితపుండరికంబు
కలితమౌ వదనవికాసంబు గాఁగ
కలికి నిగ్గుల నల్లకలువలసిరులు
తళుకులు గుల్కు నేత్రంబులు గాఁగ
వలనొప్ప రంజిల్లు వలమురిగరిమ1565
కళల రాజిల్లెడు కంఠంబు గాఁగ
నలువొందు మృదుల మృణాలవైఖరులు
బలురమ్యమై యొప్పు బాహువు ల్గాఁగ
నరుదుగా వికసించు నరుణాంబుజములు
గరిమశోభిల్లెడు కరములు గాఁగ 1570
కర మొప్ప నలరు పంకజకోరకములు
సరసంపుబిగి వాడిచన్నులు గాఁగ
నందమై మెలగెడి యావర్తసరణి
పొందుగా నలరారు పొక్కలి గాఁగ
నారూఢసలిలవేదండతుండములు1575
తోరంపుమెరుగుపెందొడలును గాఁగ


వరవేగసంఘాతవాతజాలములు
సొరిగి జంతువులెల్ల సుడిగొని తిరుగ
యలవైనతేయుని యనువు జెన్నొంది 1605
ఎలమి మహోద్ధతి నేఁగుచు నుండి
గరుడకిన్నరయక్ష గణము భేదిల్ల
గిరులెల్ల నురుల మిక్కిలి దిక్కులవియ
ధారుణి గంపింపఁ దరువులు పెకల
భోరున శంఖంబుఁ బూరించుటయును 1610
పిడుగుమ్రోఁతలఁబోలు బెడిదంపురవము

ఆంజనేయుఁడాశంఖారావమునువిని లేచుట

కడువడి విని లేచి కపినాయకుండు
వడముడి శంఖారవం బిది యనుచు
తడయక యంత నుదగ్రతఁ జూచి[55]
యతఁడు వచ్చినకార్య మంతయు నెఱిఁగి 1615
అతనిభుజాబలం బతని శౌర్యంబు
దెలిసి పద్మము లున్న తెఱఁగెల్లఁ జెప్ప
 



వలయు నటంచు జవంబున లేచి
మనుజేశుఁ డేతెంచుమార్గంబునందు
నొనర కన్నులు మూసి యొగి నోరు దెరచి 1620
పలుమఱు నఱచుచు బయలు బ్రాకుచును
తలవడ కింపుచు దగ్గుచు నిలిచి[56]
పలువిడి రోజుచుఁ బడియుండె నచట




అలఘుబలోద్దండుఁ డాంజనేయుండు
ఆపాండుసుతుఁ డడ్డమాఁగయులేక[57]

భీముఁడు హనుమంతునిఁ జూచుట

నేపున జనుదేర నెలమి గట్టెదురు
నడలుచు వణకుచు నరచుచు నిట్లు
బడియున్న వనచరు భావించి చూచి
కరుణాకటాక్షమాఘునునిపై నునిచి
పొరిపొరి మేనెల్ల పుణికి చూచుచును1630
వెరవకు మని చీరి వెన్ను చే జరచి
యిరుమైల నడలించి యిట్లని పలికె[58]

భీమహనుమంతుల సంవాదము

అనఘాత్మ! నీ వెవ్వరయ్య! యిచ్చోట
కనుమూసి డియున్న కారణం బేమి



మేదినీరుహ చర్య! మిక్కిలి నీకు1635
ఈదైన్య మీభయం బెటువలెఁ గల్గె?
అదిగాక శతవృద్ధవైతి వీ వింక
కొదువ వస్తువు లేమికోరెద విపుడు
పనిఁబూని నేవచ్చు పయనంబు మాని
గొనకొని నీను గనుంగొనినది మొదలు1640

మాయన్న నీమీఁద మమత పుట్టెడిని[59]
యీయున్న విధము నీవింతయుఁ దెలుపు
మనీ సారె సారెకు యడలించి పిలువ
వినియును నొక్కింత విననిచందమునఁ
గనియును లేశంబు గననిమార్గమున1645

తనుదానె ప్రక్కలు తలగీరికొనుచు
విప్పుగా రెప్పలు నిప్పించి నవ్వి
తప్పి వ్రాలినబొమ ల్దాల్మి నిక్కించి
పెదవులు నట్టిట్టు బెట్టుగాఁ జెదరి
పదరిచిందులుద్రొక్కి పండ్లూగులాడ1650


నలసతచేఁ జూచి యలుకుచు కీఁచు[60]
పలుకుల నిట్లనుపాండునందనుని
నీ వెవ్వరో యయ్య నీకుఁ బే రేమి?
యేవస్తువులకు నీ వేఁగుదెంచితివి?
గరిమెతో నీమోము గనుఁగొన్నయపుడె 1655

సొరిది నాతమ్మునిఁ జూచిన ట్లాయె‌;
నింతింత యని మది నెన్నంగరాని
సంతోష మందితి జనపాలచంద్ర!
బడలి కెల్లను దీరె భయములు దారె
నడలు ధైన్యము మాసె నాఁకలి పానె 1660

తత్తరంబు దొలంగె కాల్మి చెలంగె
చిత్తంబు జిగురించె చెలువంబు మించె
తపమెల్ల ఫలియించె ధన్యుండనైతి
నృపచంద్ర ! దైవంబు నినుఁ జూవె మాకు 1665
మేదినీవల్లభ మీస్వరూపంబు

నాదిగర్భేశ్వరునట్లు గన్పించె


వలనొప్పఁగా చక్రవర్తిచిహ్నములు
తొలఁగక నీయందు దోచుచున్నవియు
నిన్నియుఁ గల్గి నీ వెవ్వరు లేక
ని న్నగపంక్తుల నీయరణ్యముల 1670
జడియక యీనిశీసమయంబునందు
కడు నొంటిగాఁ జన కారణం బేమి?
నీరాజసంబును నినుఁ జూడలేక
యీరీతి బనుపువా రెవ్వరు నిన్ను[61]
మనుజాధినాయక మముబోంట్లకైన 1675
నిను గనుఁగొన్నను నెనరు బట్టెడిని
తెలియంగ నిదొ దొడ్డదేవతాభూమి
మలసి చూచిన నీవు మానవరూవు
చండపంచానన శరభశార్దూల
గండభేరుండము ల్గల వెల్లయెడల, 1680


నదిగాక యక్షవిధ్య్యాధరామరులు
కొదకక నినుఁ గన్నఁ గొట్టి చంపెదరు,
చనవల దోయన్న చన దనరాదు
ఘనుఁడవు నీచేతఁ గానిది లేదు
నీవు వచ్చినపని నిక్కంబు పలుకు 1685
నాబిధం బెఱిఁగింతు నరనాథ యనిన
తనజనకునిపేరు తనయన్న పేరు
తనపేరు తనసహోదరుల పేరులును
వినయమార్గంబున వేర్వేరఁ దెలిపి
వనితయుఁ దానును వనికి‌ వచ్చుటయు 1690
కనకకంజము గాంచి కాంత వేడుటయు
ననువొందఁ దెచ్చెద నని పల్కి చనుట
పూసగ్రుచ్చినయట్లు పొసఁగఁ దెల్పుటయు
వేసాలవాసరవీరుఁ డి ట్లనియె
ధరణీశ; పాండునందనులకుఁగాక 1695
నొరులకుఁ దరమె యి ట్లొంటిగా నేగ
జననాథ మా కతిసంతోషమాయె
కనకాబ్జములజూడఁ గరపెద వెనుక


పనుపడ నే నిందు బడియున్న తెఱఁగు
వినుపింతు విన వన్న విశదంబుగాను[62] 1700

నీవిధంబునను నే నిబిడాటవులకు
కావరంబుస నొంటిగాఁ జనుదెంచి
మినుకైనఫలములు నొక్కుచు వేడ్క
వన మెల్ల వెదకుచు వచ్చి యామ్రాను
పరికించి యందొక్కఫలము నీక్షించి 1705

యరుదైన ఫల మౌట యాస వాటిల్లి
యరుగక యీతరు వెక్కఁగా బోయి
వరబల్మి చెడిపోయి వ్రాలి యున్నాడ
ముదిమి పైకొని నేత్రములు చూపు దరిగె
పదపడి యీపండు పడిన భక్షింతు1710
ననిన శతాబ్దంబు లయ్యె నీవరకు
మనుజేశ యీమహామాయాఫలంబు
పడినది లేదాయె ఫలముపై నాస


విడిచిపోయెదనన్న వెసకాళ్లు రావు
కోరుచుండఁగఁ బిచ్చుగుంటపై ఘనము 1715
జారుభాగీరథిఁ జనుదెంచు లీల[63]
వచ్చితి వీవు నావయసు ని న్నడుగ
వచ్చంబులేని సత్వంబు ని న్నడుగ
మానవాథీశ! యొక్కటే పండు
యీమ్రాన నున్నది యీక్షింపు మయ్య 1720
అనఘాత్మ! పాండవు లార్తరక్షకులు
ననుచుఁ బల్కఁగ విని యడిగెద నిన్ను
యీపండు సాధించి యిచ్చితివేని
పేపనులైన వయ్యెడిని నీచేత



ధీరత నాకోర్కె దీర్చకయున్న1725
నీరజంబులఁ దేను నీకు శక్యంబె
అంటక ముట్టక నామహాఫలము
గెంటించి నను బ్రోచి కీర్తి వహించు
తమకించి వేవేగ తరు వెక్క వలదు.
విమలాత్మ ననువలె వృద్ధ వయ్యెదవు1730
ఆఁకలి దీర్చిన యాపుణ్యనిధిని
శ్రీకాంతున కెన సేయంగవచ్చు,
వని సన్నుతించిన నయ్యగచరాధిపుని
కనుఁగొని యర్జునాగ్ర జుఁ డిట్లు పలికె
ఇది యెంత పని వానరేంద్ర! యీమాయ 1735
గదలించి ఫల మిత్తు ఘనశక్తి మెరసి
మెప్పుగాఁ దలుపులు మ్రింగు వానికిని
యప్పళా లననెంత యని విజృంభించి
విల్లెక్కువెట్టి యవ్వీరశేఖరుఁడు
భల్ల మొక్కటి బూని పండు నే యుటయు 1740
నది బీరువోయిన నైదంబకములు
గదియించివేసిన కడల కేఁగుటయు


పదియు నిరువది ముప్పది నారసములు
పొదివి యేసిన తప్పిపోవుటఁ జూచి
విరివిగా నూరులు వేలు లక్షలును 1745
గురుతరాస్త్రములేయ గురి తాకకున్న
పోతించి కోటు లర్బుదములు మేటి
వాలమ్ము లేసిన‌ వ్యర్థమై చనిన
నచ్చెరువును గోప మధికమై వెలయ[64]
విచ్చలవిడి పండు వీక్షించి చూచి 1750
ఆయెడ పొదినున్న యమ్ము లన్నియును
పోయిన బాండుభూజసూనుఁ డలిగి
కరవాల మంకించి గద్దించి వేయ
బెర బెర చని యది బెళికిపోవుటయు
తరలక కరముల ధనువు సంధించి 1755


చరణంబు లూఁది భూస్థలము ధట్టించి
కనలి మింటను గొట్టి గమకించి వ్రేయ
మునుపటిపొడవున మురియుచు నుండ
నెంతయు వెరగంది యిది చిత్ర మనుచు
చింతించు నరనాథశేఖరుఁ గాంచి 1760
యార్ణవగంభీరుఁ డాంజనేయుండు
కర్ణకఠోరంబుగాఁగ ని ట్లనియె;
నొకపండుకోసమై యూరక నీవు
ప్రకటించి పడరానిపాట్లెల్ల బడితి
వటదుర్ఘటంబైన హాటకాబ్జంబు 1765
లెటువలెఁ దెచ్చిరో యెఱుఁగంగరాదు
ఆతతఫ్రౌఢి ము న్నాడివయట్టు[65]
చేతఁ జూపిన వీరశేఖరుఁ డండ్రు
కడప దాఁటగ లేవు కడువడి మీరి
జడధు లెల్లను దాఁటి చనఁ దలంచెదవు ! 1770
తెగి కూటిలో రాయి తీయగా నోప


వెగయించు సంగడా లెత్తబోయెదవు. [66]
దగదొట్టి మేనెల్ల దల్లడ మొందె
సొగపణంగెను మోము సొబగెల్లఁ దరిగె[67]
పొంగు నొయ్యారంబు పొంగెల్ల నుడిగె 1775
పొగడ నొప్పెడుబాణములు మాయ మాయె
మగతనం బెడలె జృంభణము దొలంగె
నగుబాటు బ్రతుకాయె నరనాథ యింక
యూకించి యూకించి యను రుసు రనఁగ
నీ కేల యీపను ల్నీ చేతఁ గాదు 1780
అచ్చంపుమగలచే నగునట్టిపనులు
పిచ్చుగుం టెక్కడ! పేరెంబు లెందు!
కూడుగూరలు పెద్దకుంభముల్‌ మ్రింగి
వాడియౌ తోడెలివలె డొక్కఁ బెంచి


మేన కండలు బెంచి మించి మదించి 1785
పూనిక గడిపోతు పోల్కి నుండఁగను
నిన్ను నే నెరనమ్మి నెమ్మితో వేఁడు
కొన్నది నావల్ల కొదువ రెంతైన[68]
ఎనుపోతు గాంచి మత్తేభం బటంచు
ననువొందఁగా భృంగమాశించినట్లు 1790
వాసికెక్కిన మగవాఁడనే యనుచు
ఆసింప నాశ నిరాశఁ జేసితివి
పంద నీ దేయూరు! పద్మ మేయూరు!
ఇందేల వచ్చితి వేఁగు వేవేగ!
అన విని కోపించి యాపాండుసుతుఁడు 1795
వనచరాథీశ్వరువదనంబుఁ గాంచి
నినుఁ జూడు, నను జూడు నీ వెంతవాఁడ
వనరానిమాట లి ట్లాడ నేమిటికి?
నాపేరు చెప్పిన నను గనుంగొనిన
నేపారలోకంబు నిట్టటుగానె 1800


పండన నెంత! నీపని యన నెంత!
ఖండింతు దండింతు గదగొని యిపుడె
అడరంగ నాయుపాయంబు లన్నియును
నుడిగియు నోరేల యడుగకపోయె?
చెలరేఁగి యీకోతి చేష్టలుసేయ 1805
నలుక పుట్టదె యెంత యోర్పరికైన
నవలక్షణపుకోతియై బంగి మ్రింగి
శివ మెత్తి వెంట వృశ్చికము సంధించి
పెనుబాము బంధించి పిడికిళ్లఁ జిక్కి
యనలంబు ద్రొక్కి‌ దయ్యము లూదినపుడు 1810
ఏగుణంబులచేత నెసఁగుచు నుండు
నాగుణంబులు గాననయ్యె నీయందు
వానరాధీశ! నీవంశ మిట్టిదయ;
యేనాట యెదురు ద న్నె ఱుఁగక నీవు
కొసవెఱ్ఱి బలుగొంటెగూబ జం కెనలు [69] 1815
వసుధపై మీస్వభావంబు లెగావె!
కలనైన మిమ్ములఁ గనుఁగొన్న హాని


పొలుపొంద నటువ౦టిపుణ్యులు మీరు
మదనుత్తుఁడవు నీవు మర్కటాధముఁడ!
ఇదిగొ యల్పస్నేహ మింతకు వచ్చె! 1820
పొగరుకూతల గూసి పొంగితి విపుడు!
తెగి నిన్ను మోదిన దిక్కెవ్వ రిందు?
వానరుఁడై యుంట వార్థిక్య మౌట
నానాతరులయాకు నమలి యాపసరు
తలకెక్కి యుండుట తడవడి నుంచి 1825
యలసి నిరాహారివై యుంట నిన్ను
యెగ్గు లెన్నగ చెల్ల దిక నొక్కఁడైన
నుగ్గుసూచంబుగా నులిమిపోవైతు;
నావిని పాండునందకునుని వీక్షించి
యావానరాథీశుఁ డనియె నెంతయును; 1830
ఓరి మానవ! యింత యుద్దండ మేల?
యూరక యిటుపడి యున్నా నటంచుఁ
గొనకొని యిటువంటికూతలు గూయఁ
జనునేర ! నావంటి సాహసాంకునకు
ముదిమి వాటిల నెంత మోసంబువచ్చె? 1835


తుదిమొద లెఱుఁగక తూలనాడెదవు !
మునుపు నే నీప్రాయమునఁ జేసినట్టి
పనులెల్ల శ్రీరామచంద్రుఁడే యెఱుఁగు;
నలవడ నాదిత్యు నైన మ్రింగుదును
నలఘుశక్తిపయోధు లైన దాఁటుదును 1840
పెనుమహీజము లైన వెల్లగించుదును
ననువంద బలుగిరు లైన నెత్తుదును
ఈసున నిపు డైన నేమి యింకొక్క
దాసరితోపాటు తలపడగలను
అచ్చుగాముకు పచ్చలారవు బిరుదు [70] 1845
పిచ్చుకతో సరి బెనఁగఁ జూచెదవు
చెనకగూడనివారి చెనకి యావెనుక
తినుక నేటికి లేనిధీమనం బేల
మగఁటిమి గలిగిన మగవాఁడ వైన
తెగువతో నాపండు దెచ్చి నాకిమ్ము; 1850
గరిమ నీపని చేత గాకుండెనేని


దొరవలె వచ్చిన త్రోవనే జనుము;
అనిన నత్యుగ్రుఁడై యాపాండురాజ
తనయుఁ డిట్లనిపల్కె తరుచరేశ్వరుని
వనచరాధమ! ముదివాఁడవై యున్న 1855
ఘన మెఱుంగక పెక్కు కారు లాడెదవు
ముందె వానరుఁడవు, ముదిమికిఁ దోడు
కుందేటివెఱ్ఱి నెక్కొనె మేలు మేలు !
ములుచవానర వేదముండకోపంబు
తిలకింప పెదవులతీటమాత్రంబె [71] 1860
పాటించి నోటికి బగసికఁ దగిన[72]
మాటలాడెద వెంత మడియఁడ వీవు[73]
వరుసఁగూర్చుండి లేవగ లేవు గాని


వరునఢి వేరము ల్భార బోయెదవు
విదిత మెఱుంగవు వెఱ్ఱిమర్కటమ 1865
వదరిన పండ్లూడవైచెద నిపుడు
నీ వనఁగా నెంత! నీ పని యెంత!
దేవేంద్రముఖ్యుల తృణముగాఁ జూతు
పొలుపొందఁగా నిన్నుఁ బుట్టించినట్టి
యలికలోచనునై న నదలించగలను 1870
బిక్క పగ్గెల నింక వ్రేలితివేని
చిక్కించుకొని సిగ్గు చెరచక విడువ
తిరమొంద నన్ను ప్రార్థించివేడినను
నెరయ నాఫల మిత్తు నీయాశదీర్తు
నరసురయక్ష కిన్నరసిద్థసాధ్య 1875
వరు లడ్డమై యున్నవనజము ల్దెత్తు
ననుఁ జూడు మని సింహనాదంబుచేసి
తనరు దక్షిణభుజాదండంబునందు
మలసి మేదోమాంసమస్తిష్కకక్త
కలితమై చెలువొందు గద ధరియించి 1880
పరువడి సూటిగా పండు వీక్షించి


వరబాహుశక్తిచే వడిగ వైచుటయు;
ఆది మహారయమున నటు బరతెంచి
పరువడి ఫలము నిబ్బరముగ దావి
చెదరక బంగారు చెండుకైవడిని 1885
గదతోడ నెగసి యాకాశమార్గమున
నటియింపుమను యోజనం బరుదెంచి
యటుబోకనిటురాక నంతట నిలిచి
భానువైఖరినిస్వర్భానునిలీల
భూనుత ప్రభలచేఁ బొలుపొందుచున్న 1890
ఫలవిలాసమును నాప్రతిభ వీక్షించి
పలుమరు‌ చింతించి ప్రౌఢి చాలించి
మదిలోన డోలాయమానసుఁడై యంత
యిది యేమి మాయయొ! యీభూమితీరొ [74]
తెలియరా దని తనదెసఁ జూచుచున్న 1895
బలశాలిఁ గనుగొని పలికె వానరుఁడు
ఓహోహొ! యీగద నుంచి నీచండ


బాహుబలంబు నీబగినెల్ల దెలిసె
కూతలు బెట్టుగా గూసినవాని
చేతగా దనుమాట సిగ్ధంబుగాదె 1900
జగతిలో నింతగా జలజసంభవుఁడు
మగపుట్టుఁ బుట్టించె మాయన్న! నిన్ను
పాలుమాలిన యట్టిపాపపుబుట్టు
వేల బుట్టఁగవలె నీలోకమునను
జననాథ సకలదేశములఁ గాంచితిని 1905
నినువంటిపందల నే నెందుఁ జూడ
నీలావు నీజిగి నీయొడ్డుపొడుగు
భావింపఁ గన్నులపండు, వయ్యెడిని!
ఓరి! నీ కేమాయె! నొరపైనపెద్ద
బూరుగవృక్షంబుఁ బోలి యన్నావు! 1910
నిన్నుఁజూచిన నిల్యు నీరు పండెడిని
అన్న నీసాహసం బంతయుఁ దెలిసె [75]


పొలుపుమీరిన మేకపోతుగంభీర
ములు సాగ‌ విక నిందు మూర్ఖ మానవుఁడ!
వెఱ్ఱిచూపులు చూచి వెస పండ్లుగొరికి 1915
వెఱ్ఱికూతలు గూయ వెరవ నే నింక [76]
ముదిమిచేఁ గన్నులు మూసుకయున్న
నదరక యెంతలే దని చూచి నన్ను
కోతి కోతి యటంచు కొదువ లెన్నెదవు
కోతు లేమైనను గొంచెమా నీకు 1920
వననిధి లంఘించి వరశక్తి మెరసి [77]




దనుజేంద్రపురి గాల్చి దైత్యుని గూల్చి
ఘనులెన్న రామభూకాంతుఁడు మెచ్చ
గోనబుమించినవారు కోతులుగారె
యాకాలమునను నే నాంజనేయుండు 1925
ఏకశరీరమై యెలమి నుండుదుము
మడియడ నీకేల మమువంటి వారి
గోడవ లిట్లొనరిన కొట్టి చంపెదరు
తగనిమాటల నన్నుఁ దడవితివేని[78] '
సుగుల నొంచక మాన చూడు నా చెయ్యి[79] 1930
కొదువలువచ్చిన కూతలు మాని


గదమీది మోహముల్ గదలించి కదలు
అన వినీ వనచరాధ్యక్షునిమోము
గనుగొని నడముడి కను లెఱ్ఱచేసి
మర్కటాధమ! యిన్ని మాయలు పన్ని1935
మార్కొని యెంతేని మాటలాడెదవు
ముదికోతివనియున్న, మోసంబువచ్చె[80] '
నిదియెల్ల నీమర్మ మిప్పుడు దెలిసె
పరుషంబు లిట్లాడి బకహిడింబాది
నరభోజనులు గూలివారు నా చేత1940
దనుజుఁడ వేమొ! గంధర్వుఁడ వేమొ.
వనచరాధమ! చావవలదు నా చేత
ఆరసి నీబాము లన్నియుఁ జూచి
యీరూపుతో నిల్చి యిచ్చోటనుండి
యనువొంద మాయన్న యాంజనేయుండు1945
వనధిలంఘించిన వై ఖరిదోఁప
దాఁటిన నొకజంగ దాఁటనా నిన్ను
మీటిన మిన్నంట మీఁద నా వ్రేల



వాలంబుతోఁబట్టి వరణముల్ద్రిప్పి[81]
నేలలోఁ గొట్టనా నీ న్నీక్షణంబు
నిముషంబులోపల నీతనువెల్లఁ
దుమురుగాఁ జేతును దుర్మార్గ! యనిస
తరుచరాధ్యక్షుండు ధరణీశుమోము
పరికించి యిట్లను బకపక నగుచు
పాండునందన నీప్రభావంబు బలిమి
పండుపల్లనె గానబడినది గాదె!
నిన్ను జూచితిగాని నీసాహసంబు
లెన్ను చుండెడివారి నెవ్వరి నెఱుఁగ
చలమున నిశ్శంక సాహసు లిట్లు
పలుకరు నినువంటి పందలుగాని
తెల్లమిగలనరుల్ తిన్నగా బారు
పిల్లవంకలు మొరల్బెట్టుచు దుముకు
నను దాటఁజాలవు నను మీటలేవు.
ఘనశక్తి వాలంబు గదలింపఁగలవె
యీ నీచవాక్యంబు లేల నారోమ


మైనను దెమలింప నలవియే నీకు?
దడయక వామహస్తమునబట్టెదను
విడిపించుకొని పారి వెళ్లగాఁ గలవె
బలిమి నీకెక్కడ ప్రజ్ఞ లేయూరు
ౘలపదం బిచ్చోట సాగదు నిలువు1970
మనిన పాండుతనూజుఁ డాగ్రహమొంది
ఘనగిరులద్రువశంఖంబు పూరించి
అట్టహాసము చేసి నా హస్తద్వయమున
గట్టిగా వాలంబు కబళించిపట్టి
ఉదుటున వడి ద్రిప్ప నుంకించుటయును; 1975
గదలకయున్న నాగ్రహమున గెరలి
పదము లూనఁగఁ ద్రొక్కి పవనంబుబట్టి
యదలించి యెత్తుచో నప్పు డింతైన
మెదలకుండుట గాంచి మెయిబెంచి నిగుడి
గుదికొన్నకినుకతోఁ గుదియించి యలమి 1980
విలయాంతకునిలీల వెస నార్చి పేర్చి
చలమున నుబికిన చలియించుకున్న
మొనసి నానామార్గములఁ జూచి యలసి



తనమదిలోఁ గొంతతడవు చింతించి
ఘన మిది సాధ్యంబుగా దని యెంచి
యనఘాత్ము డేయుపాయము లేక బెగడి
పలుమరు దశదిశల్' పరికించుచున్న
నలువెల్ల దెలిసి వానరనాథుఁ డనియె
జగదీశ! యిఁకనైన చాలింపరాదె!
దగ దొట్టి దగిలించి తడబడనేల[82]
వరబాహుబలిమి నావాలదండంబు
దరలింప లేవు పద్మములు దేఁగలవె![83]
నిను నీవు తెలియవు నీచేతఁ గాని
పనులకు వత్తువే పనులకు నిటకు[84]
పొలుపొంద పవమానపుత్రుండ వానచుఁ
దలఁతురు నిన్ను భూతలమున నెల్ల
కలమాట నిజమైనఁ గరువలిపట్టి


చెలిమినైనను నిల్వ చెల్లదే యకట!
ఆమ్ము లన్నియుఁ బోయె! నాగద బోయె!
కమ్మదమ్ముల కెట్లు గదలెద వింక!2000
తోచక నీచేయుదుడుకు లన్నియును
గాచి రక్షించితి గరుణతో నిపుడు
పగ్గెల బొదలక పదరక లేని[85]
సిగ్గులబడక వచ్చిన త్రో వచనుము
ప్రాణము ల్గలిగిన భార్యలు గలరు2005
బాణముల్ గాంచిన పద్మముల్ గలవు
భూవర! యీ వెఱ్ఱి బుద్ధులు మాని
పోవోయి నీవు నీ పొందుపంట్లకును,
అన విని కడువిన్న యై తలవాంచి
మనుజ వల్లభుఁడు నెమ్మది చింత నొంది2010
తలకక ఘోరకాంతారభూములకు
నెలత దోడ్కొని చన నీతిగా దనుచు
చీరి వేమరు బుద్ధి చెప్పిన వినక




వారిజాక్షిని దోడ్క వచ్చుట గొదువ;
వేడు మిచ్చెద నని వేడిన పిదప
పోడిమి నీ కున్న బొందు పాపములు;
వనజము ల్గొనిపోక వనిత యున్నెడుకు
జనిన నపఖ్యాతి; సకియ దుఃఖించుఁ;
బాయని యపకీర్తి భరమున కోర్చి
పోయెద ననినను బోనీయఁ డితఁడు;
సకలాయుధంబులు చనుటయు మోస
మకట! యీతఁడుచేసె నాబాణహాని;
యితని జంపుదు లేక నితనిచే జుత్తు
నితరంబు లే దని యెంచి క్రోధించి
తలప లోకములోన ధర్మనందనుఁడు
వల నొప్పగా సత్యవంతుఁ డౌ నేని
గోపాలకృష్ణుండు గోరినయపుడె
మాపాలగల్గి యేమరకుండునేని,
యనయంబు.........నంజనకూర్మి
తనయుఁడు నామీఁద దయ గలఁడేని;
పసిడిబంగరుబోలు పాంచాలపుత్త్రి




వసుధలోపల పతివ్రత యగునేని,
నెగడువేదంబులు నిక్క మౌనేని;
జగతిలో ధర్మమే జయమగు నేని,
యీవానరునితోడ నీమాయలెల్ల2035
వావిరి దెగటార్చి వరసాధనములు
గైకొని చని హేమకంజము ల్దెచ్చి
రాకేందువదనకు రహి నిత్తు ననుచు
బొసగ గర్జిలి భుజంబులు బెట్టు సరచి
వెసబేర్చి యొక సాలవృక్షంబు బెరికి2040
తనమీఁద నడతెంచు ధాత్రీతలేంద్రు

 ఆంజనేయుఁడు నిజరూపమును దాల్చుట

యనువెల్ల బరికించి యాంజనేయుండు
యనుపమామోఘవాక్యము దప్ప దనుచు
ఘనమైనవృద్దమర్కటరూప ముడిగి
నెనరున నెంతయు నిజరూపు దాల్చి2045
యనుజని మ్రోల ప్రత్యక్షమై నిలిచె[86]



నన విని జనమేజయావనీశ్వరుఁడు
మునీనాథుఁ గాంచి కేల్మొగిచి యిట్లనియె
నినతేజ మౌనీంద్ర యీచరిత్రంబు
విన విన మదిలోన వేడ్క బుట్టెడిని
తరుచరాధిపుఁడు ప్రత్యక్ష మైయున్నఁ
దరువాత కథలెల్లఁ దగఁ జెప్పు మనిన
జన మేజయునకు వైశంపాయనుండు



నగచరుం డన నెంచ నగునె యీఘనుని
నగ భేదనుండో పన్నగభూషణుండొ
గజరాజవరదుండొ గంధవాహనుఁడొ
గజిబిజియయ్యె మర్కటశక్తిగాదు.
కలకబుట్టగ పానకములోని పుడుక
వలె నడ్డమై నిలిచె వనచరాధిపుఁడు
సొలువక దేవతారాజసూనంబు
లిలలోన మనుజల కేల సిద్ధించు
నన్నమాటలు మీరి యతివబోధనలు
విన్నఫలం బెల్ల వేగ ఫలించె....
హనుమంతు తిరువళి యనవరతంబు
ధనరాధ నామీద దయగలదేని. (త )




వినుపింపఁదొడఁగె తద్వృత్తాంత మెలమి
అని యనంతాకన్యకాధీశుపాద [87]
వనజాత నిరత సేవారతు పేర[88]
భావజహితచంద్ర బలదైశ్యఖచర
దేవభూరుహసుర "ధేనుధనాధి
పతి మేఘసాదోధిపద్మాప్తపుత్ర
వితరణు పేర కోవిద ను తుపేర
శతమఖపాటీర శారదాహీర
శతధృతినందన శారదాహీర[89]
గగనకల్లోలినీ కౌముదీశిశిర
నగరాజమృగరాజ నవ్య ధావళ్య"



తరకీర్తిపేర మేధానిధి పేర
సరసకళాపూర్ణ చంద్రునిపేర
సుకవిపోషణుపేర శుభమూర్తి పేర
సకలపురాణార్థసంగ్రహు పేర
నాదనినదుర్గహరణుని పేర
చేదిభూవరదత్తసింహతలాట
కరహటనృపదత్తకనకపతాక
బిరుదాంకుపేర గంభీరాబ్ధి పేర
కరనొప్ప జగనొప్ప గండని పేర
శఠనృపాలకశైలశతకోటి పేర
కఠినచౌరాసి దుర్గవిభాళు పేర[90]



మానిత భాషణం బామనఃపద్మ[91] '
భానునిపేర వైభవజిష్ణు పేర
రావిళ్లకొండధరామరులింగ
భూవల్లభునిపేర బుధు లౌ ననంగ2080
నంకితంబుగ నుపమాది ప్రోల్లసద
లంకార బహువిధ లక్షణఫణితి
తనరు వేడుకలరత్నాకరకృష్ణ
ఘనునిగోపాలసత్కవిశేఖరుండు
సరసోక్తిరచియించె సౌగంధికాప2085
హరణకావ్యంబునం దాపాండుసుతులు
వలనొప్ప బదరికావనముఁ జేరుటయు
నలరు ద్రౌపది దోడ్క వనిలనందనుఁడు
వనభూమి కరుగుట వనజంబు గనుట[92]



ప్రతిభగల్గినయట్టి ప్రావీణ్య పేర
కఠినచౌరాసీదుర్గవిభాగు పేర
చటులవిక్రమ పుణ్యశాలియు పేర (ట)




ననబోణి యడుగుట నారదమౌని
వేవేగ వచ్చుట వికచాబ్జముఖికి
కావలి యాఘటోత్కచుని దెల్పుటయు
ననిలతనూభవుం డలరుచుఁ గూర్మి
తనయుఁ దలంచుట తడయక నతఁడు[93]
వచ్చుట పాంచాలివద్ద నాఘనుని
మచ్చికతో నుంచి మసలక వేగ
నెంతయు నేఁగుట, నింతి దాఁ గొంత
జింతనేయుట పట్టి చింతబాపుటయు
నలమార్గముననుండి యాంజనేయుండు
బలుమాయ గల్పించి భ్రమల దూలించి
వలసి యన్యోన్యవివాదము ల్చేసి
చెలువంబుతో భీమసేనునిమ్రోల
నలపడ ప్రత్యక్ష మైనట్టి కథల
నలరుచు నిది ప్రధమాశ్వాసె మయ్యె

ప్రథమాశ్వాసము సంపూర్ణము.

  1. వాయువుల (త)
  2. ఆనుమతు ల్చెప్పక నవును కాదనక (చ)
  3. నెలవు (378)
  4. కాశికిబోయిన కావడిబరువు (ట)
    కసిబోక తిరిగెడు కావటిబరువు (క)
  5. లేదు (2421)
  6. కోటముత్తికె లన గూడునా యెందు (క )
    కోటముట్టడి యనఁగూడునా యెందు (త)
  7. గలుగునే లోకంబులోన భూపాల (చ)
  8. పట్టిన (ట )
  9. లెక్కడనుండిన నెంతైన బోవు. (4191)
  10. యప్పటి కాపను లమరకపోవు . (1878)
  11. ఘనముగా చింతించి కటకటా యనుచు (2421)
  12. శమననందనుఁ డంత సంతాపమంది.
      యమరేంద్ర సుతునితో ననియె నెంతయును (త)
  13. గరుడఖేచరనిశాకరబింబముఖులు (ట , ప)
  14. దాని యొయ్యారముల్దగఁగాంచిరేని (ప)
  15. అన విని గాండీవ యెన్న కిట్లనియె (త )
  16. ఆ మహామహుని వాక్యము నిక్క మరయ
      నీమది దలపోయు నృపకులోత్తంస (2421)
  17. కనుగల్గియుండ కిక్కడ మోసపోయి (2421)
  18. ననుబోటి బలశౌర్యనయకాలివెంట (ట)
      ననువంటి బలశౌర్య నయశాలివెంట(ప)
  19. సాధించి, (ట)
  20. నెర సాహసండవు నిన్నంటగాదు
    నరనాథ పురుషులనడత లెంచెదను
    చనువున కోపంబు క్షమింపవలయు
    ననిన పాంచాలితో ననిలుజు డనియె.(1378)
  21. పదపడి ధర్మజ పదములకడకు (2421)
  22. నేమేమి నే విన్నవించిన నైన (ఆ)
  23. యొస్పైసరావుల కొనర వేంచేయు
  24. మునిజనాగణ్య తపోనివాసముల (ప )
  25. కలిత నానామణీకలితంబు లగుచు
    విలసితంబుగ చాల వేడ్క రంజిల్ల (1578)
  26. నెరయ రంభాప్సరోనిర్గతం బగుచు
  27. 4491 లో లేదు.
  28. 4491 లో లేదు.
  29. పొలపుమీరిన లేఁతసొనలు గిల్లుచును (1578)
  30. గని మెచ్చి మెచ్చియాకాననంబునను (ట)
  31. బుడి బుడి యడలును బొక్కిచింతించు (క)
  32. కవ్వడి నిచటికి గలముచున్నాఁడొ
    యెవ్విధి నున్నాఁడొ యిందునిభాస్య
    అర్జునుం డిచటికి నరుదెంచెనేని
    దుర్జనుం డైనట్టి దుర్యోధనుండు
    ఏపనుల్ దలఁచునో యెఱుఁగరా దతని
    చేపట్ట గతజలసేతుబంధనము. (త)
  33. రహిమీర నిచ్చటికి రప్పింతు ననిన
    మహిమ నాకర్షణమంత్రంబు నెఱుఁగ (త)
  34. చనుదెమ్ము పోదాము జాగేల యనిన (క)
  35. శ్రీకాంతుచరితలంచితవైభవమున (2421, 4502)
  36. జడలు దూగెడ బొజ్జనటెంపుచుండ (2421, 4502)
  37. తావడము (2421, 4502)
  38. అఖిలలోకభయంకరాకారమూర్తి
    సుఖపుణ్యకీర్తి, భాసుంజయస్ఫూర్తి
    కమనీయసకల రాక్షసచక్రవర్తి
    సముదగ్ర శత్రుసంచయనమపర్తి
    బలశౌర్యధైర్య ప్రభావ ప్రతాప
    పటులోగ్రుఁడఖిలదిక్పాలకద్రిదశ
    ప్రకటవిద్యాధరగరుడగంధర్వ
    యక్షకిన్నరసిద్ధహరిదశ్చచంద్ర
    రాక్షసాధిపనవబ్రహ్మరుద్రాది
    లోకచతుర్దశలోకాన వరకు
    భీకరుఁడగుహిడింబీనందనుండు (త)
  39. ఇచ్చట నీవుండు మే నేఁగి వేగఁ
    తెచ్చెద జాముల దివ్యసూనములు (త),
  40. భీముఁ డేఁగిన హిడింబీనందనుండు
    నేమరి యుండుట నిది మోస మనుచు (క)
  41. హెచ్చుగు నాకోర్కె మీరంగ లేక
    విచ్చేసె నొంటిగా విపినభూములకు (త)
  42. గద్దించినను నేమి కార్యసాధకము (త)
  43. యితరమౌ స్వామి భృత్యన్యాయ మగునె (ట),
  44. అమరేంద్రు గొట్టెద నగ్ని బట్టెదను
    శమను ముట్టెదను పుణ్యజనుని మొట్టెదను
    వరుణుని తెంచెద వాయు నొంచెదను
    నరవాహనుని మహానటు పశించెదను
    వాలాయమున సప్తపరనిధానములు
    గాలింతు సకలలోకములఁ జరింతు
    కడిగొందు కలమహాగ్రాహసంఘములు
    మడియింతు గ్రహతారమండలి నెల్ల
    భూవరుదేవి సమ్మదమున నీవె
    భావించి చూడుము పాంచాలితనయ
    నన్ను నాఖ్యాతి నెంతయు నెఱుంగకను
    కన్నతల్లివిగాన కారులాడితిని
    జనని యిందుల కేమి సంతోషమాయె
    నిను మింక నొకరీతి విన్న వించెదను
    ననుఁ జేరఁ బిలచి యెంతయు గారవించి
    కనికరంబున గ్రుచ్చి కౌఁగిటఁజేర్చి
    తనయ భద్రం బని తడయక నేఁగె
    యదిగాక నికనొక్క యనుమాన మొదవె
    నదియు దెల్పెద విను సంభోజవదన (త)
  45. కొత్తగాయములలో కొతుకుచు విభుఁడు
    హత్తి నిల్చినయట్టు లయినది వినుము
    యదువంశకలిత క్షీరాబ్ధిచంద్రుండు
    పరమదయాళుండు భక్తవత్సలుఁడు
    కరిరాజవరదుండు కపటనాటకుఁడు
    భవరోగవైద్యుఁ డాపద్బాంధవుండు
    రవికోటితేజుఁ డార్తశరణ్యమూర్తి
    మన్మథజనకుండు మదవిభేదనుఁడు
    చిన్మయుం డాదిలక్ష్మీనాయకుండు
    కరుణతో మనపాల గలుగు నన్నాళ్లు
    సరసిజానవ యపజయ మేల కల్లు (త),
  46. ఘనతరరత్నసంకలితమై మరలి (త)
  47. ప్రతిలేని నాభుజాబలశక్తి పాండు
    సుతులకు పజ్రాంగి జోడుమృగాక్షి
  48. అలఘుపంకజభవాండకరండభూరి
    కలికబంధురదివ్యకస్తూరి యనఁగ (ఠ)
  49. భూనభోభాగసంపూర్ణమై కదిసి (క)
  50. (1) కడిమి విద్యలు జూపుఁ గారడిగాని
    (2) కడిమి విద్యల చూపు గారడసాని
    (3) కడిమివిద్యలు జూపు గారుడవాని
  51. వరుస నారదమునివరులెల్ల నవ్వ
    శరనిధులటు సుధాజలరాశి గెరల
    తరుచైన యఖిలభూతములు సహింప
    లరిధరాజములు కల్పకము నెగ్గింప
    కరమర్థి నదులు గంగను నెరిగింప
    తరణులెల్లను శారదను జుల్క సేయ
    ఖగములు హంసల గదుముచు దిరుగ
    మృగములు సింగంబుమీఁద దండెత్త
    కమలాక్షి కమలాంక కమలసంభవులు
    మమతతో సతుల నేమరకుండఁ జేయ
    కడు దానెయౌ మహాగారడసాని
    వడువున చంద్రికావైఖరుల్ వెలసె
  52. సరసులయందు ముచ్చట నోలలాడి
  53. జగిమించు లేడి తేజి నెక్కి నిక్కి
  54. యంతట నంతట నాగి నిల్చుచును
    పొంకట చౌపుటంబులు వ్రేడెములును
    నంచల నంచల నటు దువాళించి
    చెలఁగుచు నొకవీథి చేవాగె నడలి
    తొలఁగక కికురించి దుమికించుకొనుచు
    వలనొప్ప మేటిరేవంతునిలీల(త )
  55. తడయక నెంతయుఁదా విచారించి(ప)
  56. అతిరయంబున జను నాభీమసేను
    గతియెల్ల మున్నె తా గన్నట్టెతెలిసి
    యంతరంగంబున నాంజనేయుండు
    గొంక చింతించి వేగురుముదికోతి
    తనువు గైకొనివచ్చి తగమ్రానికింద
    నొనర కన్నులుమూసి నొగి నోరు దెరచి
    తెరుపుకడ్డముబడి తెలివి లేనటుల
    కరచరణాదులు కదలింపలేక
    నుసు రుసు రనెడి నిట్టూర్పులతోడ
    బుస పెట్టుచును బోరుగొండచందమున
    మూల్గుచు బలుముచు ముడుగుచుఁ బొరలి
    నీల్గుచు వడకుచు నెరయ నున్నంత. (త)
  57. 1 (a ) ఆపాండుసుతు డడ్డ మాగెయులేక (ప)
    (b) ఆపాండుసుతు డడ్డమాజ్ఞయులేక (త)
  58. (a) యిరవంద నదలించి యిట్లని పలికె (క)
    (b). యిరువందఁగాహెచ్చరించి యిట్లనియె (త)
  59. మాయన్న నీమీద మర్లుబుట్టెడిని (ప, ట)
  60. కీలు, పలుకుల నిట్లను (ట. త>)
  61. నిత్తరి యొకవార్త విన్నవిచెదను చిత్తావధానివై చెవియొగ్గి నినుము ......... ......... ........ ...... థారుణి నిర్దయదాక్షీణ్యు లగుచు
  62. వదరుచు నే నిందు బడి యున్న తెఱఁగు
    విదితంబుగా నేను విన్నవించెదను (ట,ప)
  63. కోరుచుండఁగ పిచ్చుగుంటుయంగమున
    చారుభాగీరథి చనుదెంచులీల
    తలఁప శక్యముగాని దారిద్రునకును
    నలువొంద పెన్నిథానం బబ్బినటుల
    నిచ్చలో నాడబోయినతీర్థ మెదురు
    వచ్చి నిల్చినమాట్కి వచ్చితి నీవు (త)
    (b) కోరుచుండగ పిచ్చుకుంటపై వేగ. (చ)
  64. నూరు నిన్నూరు మున్నూరు నన్నూరు
    ఘోరాశుగములేయ గురిదాకకున్న
    వేలు లక్షలు కోట్లు వెస నర్బుదములు
    వాలంబు లేసిన వ్యర్థమై చన్నిన
    తచ్చెరువును గోప మదికమై చెలఁగ. (త)
  65. 1. ఆతీతఫ్రౌఢి ము న్నాడినమాట. (ట)
    2. ఆతతఫ్రౌఢి మున్నాడినయంత. (వ)
  66. a. తెగి కూటిలో రాయి తీయంగా లేవు
    ఎగరుచు జంగరా ళెత్తబూనెదవు. (మ)
     b .తెగి కూటిలో రాయి తీయఁగా నోప
    వెగయుచు జంగరా ళ్లెత్తబూనెదవు. (త)
  67. నుగు లడంగెను మోము సొబగెల్లఁ దరిగె. (ట)
  68. కొన్నది నావల్ల కొదువ లెంతయును. (త)
  69. కొసవెఱ్ఱి పలుగొంటె ఝం కెనలు. (త)
  70. అచ్చుగాముకు పచ్చలారవు పనులు. (ట)
    2. అచ్ఛుకతో భేరి నదలించవచ్చు. (మ)
  71. దీనికితర్వాత నొకప్రతిలో నీపంక్తులుకలవు.
    కడుబలశౌర్యముల్ గలవు నీయందు
    వెడగ నీమోముఁ జూడఁగఁగానవచ్చు.
  72. పాటించి నోటికి బరిపాటిదగిన (త)
  73. మాటలాడవు యెంత మడియవు నీవు (ప)
  74. యిది భూవిశేషంబొ! యీశోతిమహిమొ (త)
  75. పలుమరు నీ భుజాబలిమి గనుగొన్న,
    నలువొంద నాకును నవ్వుపుట్టెడిని. (త)
  76. చిఱ్ఱులేశములేక బీదభావమున
    వెఱ్ఱిచూపులు చూచి వెసపండ్లుగొరికి. (త)
  77. వననిధి లంఘించి వరశక్తిమించి
    దనుజేశుపురి గాల్చి దైత్యుల గూల్చి
    రావణు జంపించి రహికీర్తి మించి
    యా విభీషణుని లంకాధిపు జేసి
    యినకులస్వామికి యింతినిగూర్చి
    పనుపడ రాఘవు పట్టంబుగట్టి
    ఘనులెన్న రామభూకాంతుడు మెన్చ. (త)
  78. చెప్పగ లట్లెల్ల చెప్పతి నింక
    తప్పు నాయెడల నింతయు లేదు లేదు
    తలలేని తెరబంటు తనముగల్గినమ
    సౌజుపక నొకచెయ్యి చూడు నామీఁద
    నదిగాద టంటివే నే యధమ మానవుఁడ
    గదమీది మోహముల్ గదలించి కదలు (త )
  79. (a) సుగు ల డంచక మానఁ జూడు నాచెయ్యి. (ట )
      (b) సుగు లడగించెద- జూడు నాచెయ్యి. (చ)
  80. ముదికోతి యనియున్న మోసంబు వచ్చె. (ట )
  81. వాలంబుతోఁబట్టి వడిగ నినుఁ ద్రిప్పి
  82. (a) దగదొట్టి దగలించి తడబడనేల (ట)
      (b) తగదిటు గదలింపఁ దడఁబడ నేల. (ప్రాతఅచ్చు ప్రతి)
  83. ఒరలింపగలవె యోభూనాధచంద్ర (ట)
  84. పనుపున వత్తురే పనులకు నిటకు (ట )
  85. ప్రెగ్గెలబొదలక బెదరకలేని (క )
  86. ఎన్నడు గలన న న్నెదిరి పోరాడి
      యున్నవారల గాన నుర్వీతలమున
  87. (a) అని యనంతర కాళికాధీశ్వరాంఘ్రి . (చ)
      (b) అని యనంతట కన్యకాధీశ్వరాంఘ్రి
    - (c) అనియె నంతకు కన్యశాధీశుపాద (క )
  88. (a) వనజాత నిరతు సేవారతు పేర (ట )
      (b) వనజాప్తనిరతసేవాధీశుపేర
  89. శతధృతినందన శంకరాహేంద్ర (ట)
    2 శతధృతినందనా శారదాహేంద్ర (క )
  90. విలసిల్లు శ్రీరాయ వేశ్యాభుజంగ
    కులసంభవుండు సద్గుణపుణ్యశాలి
    వలనొప్ప కేళాది వైభవసాంద్ర
    సలలితౌదార్యుండు సంగ్రామభీముఁ
    డగు నజ్జనాధారుఁ డార్యపోషకుఁడు
    ఆగణిత ధౌరేయుఁ డర్థిమందారు
    శత నృపాలకశైల శతకోటిపేర
  91. మానిత భాస్కరాంబామనఃపద్మ
  92. వనభూమియందుల వసియించి చనుట
  93. తనయుండు వచ్చుట దగుసంభ్రమమున (ట)