సింహగిరి వచనములు/హరిచందనం

వికీసోర్స్ నుండి

హరిచందనం

ఆంధ్ర వచన వాఙ్మయ ప్రథమాచార్యుడు శ్రీ కృష్ణమా చార్యులను గూర్చీ, చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలైన అతని సింహగిరి నరహరివచనాలను గూర్చీ ముచ్చటించే ముందు అతని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన ద్రామానుజుల శ్రీవైష్ణవ సిద్ధాంత దృక్పథం గురించీ, కృష్ణమాచార్య వాఙ్మయ జీవలక్షణమైన శ్రీవైష్ణవ సంప్రదాయ రహస్యాన్ని గురించీ ఇక్కడ పూర్వరంగగా భూమికగా ప్రస్తావించటం ఆవశ్యకం.

- పూర్వరంగభూమిక -

నేడు ఖండాంతరాలవారు భారత భూమిని పూతభూమిగా, తత్వవిచారజన్మభూమిగా భావించి అట్టిది తమ జన్మభూమి గానందుకు విచారించినట్లే, నాడుదేవతలు సైతం భారతజనిని స్పృహణీయంగా భావించేరు.

"గాయంతి దేవాః కిలగీతకాని
 ధన్యాస్తుయే భారత భూమిభాగే,
 స్వర్గాపవర్గాస్పదమార్గ భూతే
 భవంతి భూయః పురుషాస్సురత్వాత్ "

దక్షిణ దిక్కు సర్వోత్తర

భారత మంతా ఇట్లా పవిత్రమూ దివ్యస్పృహ ణీయమూకాగా భక్తాగ్రగణ్యులైన ఆళ్వారుల అవతారంతో దక్షిణం విశేషించి పూతతమం అయింది. “దిగ్దక్షిణాపి పరిపక్త్రిమ పుణ్యలభ్యాత్సర్వోత్తరాభవతి దేవి తవావతారాత్" అని శ్రీమన్నిగమాంతదేశికులవారన్నట్లు గోదాదేవి ఆవిర్భావంతో, దక్షిణ దిక్కే సర్వోత్తర అయింది.

ఆళ్వారులు - వైష్ణవం

ఆధునికుల దృష్టిలో దాక్షిణాత్య శ్రీవైష్ణవ భక్తి వాఙ్మయ చరిత్రలో క్రీ. శ. మూడవ శతాబ్దినుంచి ఎనిమిదవ శతాబ్దం వరకు ఒక స్వర్ణయుగం. భక్తిసార భట్టనాధ ప్రభృతు లైన ఆళ్వారులతో పాటు అనన్యభక్తితో ఆరవిందాక్షుణ్ణి అర్చించి ఆత్మ సమర్పణం చేసుకొన్న ఆండాళ్ అవతరించడంతో ఈ కాలపు చరిత్ర సంపుటం చాంపేయసుమ పరిమళ సంభరితంబంది. పరాంకుశభ క్తిసార భట్టనాథ ప్రభృతులైన భక్తచూడామణుల మందిర ప్రాంగణాల్లో గుబాళించే భక్తి పారిజాత పరీమళాల ప్రభావంవల్లనో. శ్రీరంగేశ్వరనాభిపంకజరజశ్శ్రీసమ్మిశ్రితాలై నాడంతటా ప్రసరించే కావేరీతరంగ స్పర్శశీతలాలైన శ్రీవైష్ణవ సంప్రదాయ పవనాంకురాల సుఖస్పర్శంవల్లనో, ప్రబుద్ధమై, ప్రవృద్ధమై, వైష్ణవ పారమ్య ప్రతిష్ఠాపన స్రవణమైన విశిష్టాద్వైత సిద్ధాంతం ఉత్తరాశయందు కూడాదాక్షిణ్యం వహించి పరమాత్మలాగ సర్వవ్యాపి అయింది.

ఆళ్వారులు - ఆచార్యులు

భక్తి భూమికా సుప్రతిష్ఠిత మైన ఈ శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రవర్తకులు 'ఆళ్వారులు.; ప్రచారకులు. ఆచార్యులు. ఆళ్వారులు పన్నిద్దరూ భక్తిపార వశ్యంలో తమిళంలో పాశురాలుపాడి వకుళామోదవాసితాలైన భక్తివాసనల్ని దాక్షిణాత్యులహృదయాంతరాళాల్లో చిరస్థాయిగా ప్రసరింప చేసేరు. ఆళ్వారులు నాటిన భక్తి వల్లరులకు పాదుగా, పందిరిగా సిద్దింతాను ష్ఠానాలను ఏర్పరిచి తత్పరిరక్షణం కోసం పాటు పడ్డవారు ఆచార్యులు.

ద్రావిడ వేదవ్యాసులు

వీరిలో అన్ని విధాలా ముందు పేర్కోదగ్గవారు నాధమునులు. వీరు అస్తవ్యస్తంగా ఉన్న ఆళ్వారుల పాశురాలను సంపాదించి, సంకలనంచేసి, ఒక వ్యవస్థతో-ఒక వింగడింపుతో, 'నాలాయిర దివ్యప్రబంధం ' గారూపొందించి “ద్రావిడ వేదవ్యాసులై "నవారు. వీరి పౌత్రులుయాము నాచార్యులవారు. శ్రీవైష్ణవ దర్శనానికి సిద్దాంత పరమైన ప్రతిష్ఠాభూమిక సమకూర్చినవారు వీరు. యామునమును లకెన్నో శతాబ్దాలకు ముందే ఉత్తరాన్న సంకర్షణ వాసుదేవారాధకులుండేవారనీ, వార్ని సాత్వతులు, • భాగవతులు అని వ్యవహరించేవారనీ చారిత్రకులకధనం.

భాగవతమతం

వైదిక "కర్మకాండ" మీద, తద్విధానాలమీద, వర్ణవ్యవస్థమీద ఒక రకమైన తిరుగుబాటు చేసిన వారువీరు. వీరిసంప్రదాయ భూమికకేవల భక్తి . ఇది రానురాను "వర్ణ వ్యవస్థను” పాటించే సాంప్రదాయికుల్నీ ఆకర్షించింది.

3

ఇల్లూ యీ సాంప్రదాయికులూ ఇందులో ప్రవేశించటంతో దీనికి సంఖ్యాబలం తోపాటు సిద్ధాంతాల్లో అనేకానైన కలగలుపులూ ఏర్పడ్డాయి. ఈ సమ్మిత్రణంలోనే సిద్ధాంత, పూజా విధాన ప్రతిపాచకంగా 'పాంచరాత్రం' ఆవిర్భవించింది. ఈ విధంగా సోత్వత భాగవత పాంచరాత్ర శబ్దాలు వైష్ణవ పర్యాయాలుగా తత్సంప్రదాయానుయాయివర్గవాచకాలుగా ఏర్పడ్డాయి.

భాగవతం - వైదికీకరణం.

వర్ణవ్యవస్థమీదా, కర్మకాండ మీదా తిరుగుబాటు చేసి సాంఘికసూత్రాలు ప్రధానంగా వున్న జైన బౌద్దమతాలవారు ప్రజల్లోకి చొచ్చుకపోయి విపరీతంగా తమతమ ప్రచారం చేసుకొంటున్న ఆరోజుల్లో, వార్ని నిలవరించటానికి కఠోరనియమాలతోడి కార్మకాండల్తో కూడిన పూర్వమీమాంస కానీ, కేవలం మేధాశక్తి తో గారడీలు చేయించే “అద్వైతం కాని ఆక్కరకు రాలేదు. ప్రజా సామాన్యాన్ని నిల వరించి తమ వేపు తిప్పుకోవటానికి ప్రజా సాహిత్యంలోనే ప్రచారంలో ఉన్న సొత్వత-భాగవతమతాన్ని పాంచరాత్ర సిద్దాంతాన్ని తామూ అంగీకరించి అందులో ప్రవేశించి తద్వారా అవై దికాలైన జైన బౌద్దాల ప్రవాహ వేగాన్ని అడ్డుకొన్నారు వైదికులు. ఇట్లా విప్లావకమైన సోత్వత భాగవతమఠం శ్రీ వైష్ణవమూ వైదికమూ కూడా అయింది. ఐనా వైదికుల్లో వీరిమీద కన్నెఱ్ఱ పోనేలేదు. అవసరానికి వీరితో చేతులు కలిపినా తమ ఆభిజాత్యం అడుగడుగునా వీరికి గుర్తు వస్తు నే ఉంది. దీనితో ఇందులోనే ఉండి. దీన్ని తమకు అనుకూలంగా వాస్తవానికి దూరంకా కుండా మలచుకొనేవారు కోందరూ విడిపోయీ, దూరంగానే ఉండే, దీన్ని విమర్శించే వారు కోందరూ తయారయేరు. శ్రీ శంకరాచార్యుల వారి నాటికి ఈ విమర్శ పాంచరాత్ర ప్రామాణ్యాన్ని శంకిం చేవరకూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో భగవద్యామునమునులు అటుసాత్వత భాగవతుల్ని, ఇటువైదిక

బ్రాహ్మణుల్ని శ్రీ వైష్ణవసాధార ణీకరణంతో ఏకంచేసి పాంచరాత్రాగ మప్రామాణ్య పరిరక్షణంకోసం పాటు పడ్డారు. పాంచరాత్రాగమానికి ఇతర తంత్రవై లక్షణ్యాన్ని వైదిక తనీ ప్రతిష్టాపించి శ్రీవైష్ణవ "విశిష్టాద్వైత (సంప్రదాయ.) సిద్దాంత పూర్వరంగ భూమికను ఏర్పరిచేరాయన,

4

శ్రీమద్రామానుజులు - సిద్ధాంత పూర్వరంగం

ఆ తరవాత ఆశ్వారుల భక్తి ప్రపత్తులు అంతస్సారాలుగా బ్రహ్మసూత్రాలు శరీరంగా పాంచరాత్ర సిద్ధాంత పీఠిక మీద విశిష్టాద్వైత సిద్ధాంతమూర్తిని రూపొందించిన వారు శ్రీమద్రామానుజులు. ఉత్తరాన సంస్కారులూ విప్లావకులూ ఆయన సాత్వత భాగవతులకు వారసులీ దక్షిణాన అవతరించిన ఆళ్వారులు, అటుసాత్వత భాగవతుల లోని సంస్కార దృష్టినీ, విప్లావక బుద్ధినీ, భక్తినీ, భావావేశాన్ని ఆరాధనాతత్త్వాన్ని ఆకళించు కొన్నారు.

శ్రీమద్రామానుజులు. అట్లాగే ఇటు ఆళ్వారుల్లో ఉన్న ఆర్తినీ, శ్రీమన్నాయణ పారమ్యాన్ని భక్తి మాధుర్యాన్ని సమతాదృష్టినీ సౌందర్యభావననూ సమాలోకనం చేసిన వారూను శ్రీమద్రామానుజులు. తమ కనులముందే ఆవేశభక్తి తో, వర్ణవ్యవస్థమీద, వైదిక సంప్రదాయాల మీద తిరుగు బాటుతో బసవన్న వీరశైవ ప్రచారంలో జనసామాన్యం ఉఱ్ఱూతలూగటం చూస్తున్నవారాయన. జైన బౌద్ధాల ధాటికి తాళలేక మూలపడి మళ్ళీ బూజులు దులుపు కొనికర్మ కాండ యజ్ఞవాటికల్లో వేదికల్న లంక రించటం పరికిస్తున్నారా యన. ఇన్ని గందరగోళాల్లోనూ దృశ్యమాన ప్రపంచమంతా మిధ్యే అంటూ చివరకు గురు శిష్యసత్తా “మిధ్యాత్వాన్ని సిద్ధాంత మిధ్యాత్వాన్ని కూడా ప్రతిభా సింపచేసి"అకర్మణ్యత్వాన్ని పలాయనశీలాన్నీ ప్రబోధించే అద్వైత ధోరణుల్ని ఆయన అత్యంత శ్రద్ధతో పరిశీలిస్తూనే ఉన్నారు. ఇన్నిటిని అనుశీలించి చూస్తే 'మేధకూ హృదయానికీ,' జ్ఞానానికీ-భక్తికీ: సంప్రదాయానికీ- సంస్కరణకూ, వర్ణవ్యవస్థకూ= సమతా సౌభ్రాత్రాలకూ; అసత్యానికీ - సత్యానికి : బ్రహ్మండమైన సంఘర్షణ ఆయనకు గోచరించింది. వీటినన్నింటినీ అవిరోధంగా ఏకముఖంగా సమన్వయ పరిచే సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాలనే సంకల్పం ఆయనలో కలిగింది. ఇక్కడే శ్రీమద్రామానుజుల మహోన్నత వ్యక్తిత్వం మనకు గోచరిస్తుంది. ఈ మహత్తమ కార్యభారాన్ని నిర్వహించేందుకు తమజీవిత సర్వస్వం ఆయనత్యాగం చేసేరు. ఇందులో ఆయన తృషద్విధావిభక్తం. ఒకటి ప్రచారాత్మకం. రెండోది నిర్మాణాత్మకం.

5

వర్ణవ్యవస్థ - సమతావాదం

వర్ణవ్యవస్థ దొంతరల్లో ఆదుగున పడి అణగి పోతున్న వార్ని, మేధతో జ్ఞానంతో ప్రమేయం లేకుండా కేవలం సవాసనులైన వార్ని ఆర్తి, సౌందర్యదృష్టి అతిశయంగా కలవార్ని, ఆకర్షించి వార్ని ఏకముఖం చేసేందుకు ఆయన ఆళ్వారులు పాడిన “దివ్యప్రబంధ" వాజ్మయాన్ని చేపట్టేరు. దివ్యప్రబంధాను సంధానంతో వారిలో సాధారణీకరణాన్ని సాధింపదలచుకొన్నారాయన. ఆరోజుల్లో సంపూర్ణంగా వర్ణవ్యవస్థ మీద తిరుగుబాటు చేసి వైదిక చిహ్నాలైన యజ్ఞోపవీతాదుల్ని పరిత్యజించిన వీరశైవులు సైతం వైదికమతాను యాయుల్ని పరాజితుల్ని చేసేందుకు బ్రహ్మసూత్రాల నాశ్రయించి స్వమతానుగుణంగా వాటికి భాష్యం సంతరించుకొన్నారు. అయితే ఇందుకు విలక్షణంగా శ్రీమద్రామానుజులు వైదిక మార్గవర్తను లైన అగ్రవర్ణాలవార్ని సవ్యమార్గంలో నడిపిచేందుకు వాస్తవాన్నే శ్రుత్యంతరంగాన్నే సుందరంగా విశదపరిచేందుకు బ్రహ్మసూత్రాలకు తామూ శ్రీభాష్యం సమకూర్చేరు. వేదప్రామాణ్యాన్ని అంగీకరిస్తూనే వర్ణ వ్యవస్థను పాటిస్తూనే పరస్పర సౌద్రాత్రంతో సమానత్వం సాధించ వచ్చుననే సమన్వయ వాది ఆయన. వర్ణవ్యవస్థను పాటించటమంటే హెచ్చుతగ్గులు ప్రదర్శించుకుంటూ, పరస్పరం దెబ్బలు తీసుకుఁ టూ లేదా బక్కవాళ్ళను, చిక్కినవాళ్ళను చావుదెబ్బలు తీస్తూ, చివరకు తామే అయిన సమాజాన్ని కుళ్ళబెట్టుకొనే కుత్సిత విధానాలనవలంబించటం కాదు. తత్త ద్వర్ణాల వారు అన్యోన్యా విరోధంగా దేశకాలోచిత ధర్మ నిర్వహణం చేసుకొంటూ శ్రీవైష్ణవ సాధారణీకరణంతో మానవజ్వోపాధికమైన ఏకజాతిగా రూపొందాలనే ఆయనకాంక్ష

శ్రీమద్రామానుజులు- సమన్వయవాది

వేద విజ్ఞానాన్ని, దానికి వారసులైన వార్ని వదిలేసి అవై దికులేమో అని కొందరానాడు భావిస్తున్న కేవల భాగవతులో కలిసి పోవటం ఆయన ఆభిష్టంకాదు. అట్లా అని భాగవత సంప్రదాయాన్ని దూరంచేసుకోవటమూ ఆయనకు ఇష్టం లేదు. రెండు వర్గాల వార్ని ఏకముఖంగా నడిపించటమే ఆయనలక్ష్యం ఈ కలయికని సాంప్రదాయికులు అక్ష్యరాలా సమ్మతించక

6

పోవచ్చు. అంచేతే ఆయస సమాంతరాలుగా కాకుడా పన్ని యోగ విశిష్టాలుగా, సన్నిహితాలుగా ఉభయ వేదాంతశాఖల్నీ ప్రచారంలో ఏర్పరిచేరు. ఫలితంగా ద్రావిడ వేదాంతశాఖాధ్యాయి అబ్రాహ్మణుడు సంస్కృత వేద విజ్ఞాన వంచికుడుకాడు. అట్లాగే ద్రావిడ వేదాధ్యయనం చేసిన సంస్కృత “వేదాంతి- బ్రాహ్మణుడు" కేవల మేధావిగా మడిగట్టుక కూచోక హృదయ స్పందనంతో, వైష్ణవసాధారణీకరణంతో, ఇతర వర్ణాలపట్ల హార్ధమైన సౌబ్రా త్రంతో సమన్వయ దృష్టిలో సంచరిస్తాడు. ఈస్నానిహిత్యనైరంతర్యం వల్ల ఇరు తెగలకూ “విశిష్టాద్వైతం" సిద్ధించడం విశేషం. ఇంతగడుసుదనపు ఎత్తుగడతో ఆయన ఉభయ వేదాంత ప్రతిష్టాపనాచార్యులై వారు అటు దివ్య ప్రబంధానుసంధానం ప్రచారంచేసి ఆళ్వారుల భక్తి మాధురీ మధుస్రవంతులలో సహృదయ సామాన్య ప్రజల్ని తలమున్కలు చేసి తమవైపు ఆకట్టు కొన్నారు. ఇటు మహా మేధావుల్నీ, కర్మిష్తుల్నీ, అగ్రవర్ణాలవార్నీ, కర్కశతర్క వాదాలతో కటకటపడుతున్న వార్నీ. తమ శ్రీష్య సిద్ధాంత ప్రతిపాదనంతో తమవేపు తిప్పుకొన్నారు. ఒక వర్గం వారు రాగవతుల వారసులు. ఇంకో వర్గంవారు "కేవల వై దికులకు వారసులు. అటీ భాగవత యముననీ అటా వైదిక గంగనీ సరస్వతీ స్వరూపులాయన తనతో మేళనంచేసి తన దివ్వ తేజస్సు అంతర్వాహినిగా ఈ సంస్కృతి అంతా భిన్న భిన్న రూపాలుగా కాక త్రివేణీ(సమాహార) రూపంగానే భారతం అంతా ప్రవహించి పునీతం చెయ్యాలని సంకల్పించారు. ఇది అమలులోకి వచ్చి ప్రచారం సాగితే భిన్న వర్గాల వారు ఏకోన్ము ఖంగా ప్రయాణంచేసి సమభావం సౌభ్రాత్రం కలిగి శ్రీవైష్ణవ సాధారణీకరణంతో ఏకజాతిగా రూపొంది భారతావనిని స్వర్గసీమ చేస్తారని భావించేరాయన, ఈ దృష్టితోనే ఆయన ఉభయ వేదాంత శాఖల్ని ఏర్పాటు చేసి తత్ప్రచారానికి “పీఠాలను" నెలకొల్పి “పరంపర "లనేర్పాటుచేసి సుస్థిరమూ సుదృఢమూ అయిన వ్యవస్థనూ ప్రణాళికను రూపొందించి లోకోపకారకులయేరు.

ప్రాంతీయ భాషల్ని మత ప్రచారంలో ఆదరించటం తమిళ భాషామయమైన దివ్యప్రబంధాన్ని 'వేదం'గా పరిగణించటం, దాక్షిణాత్య సంప్రదాయ సిద్ధాలైన శ్రీవైష్ణవాలయాలలో అందరకూ తీర్ధ ప్రసాద స్వీకారయోగ్యతను పరికల్పించటం,

7

హరిజనులను మొదట “మనసారా' ఆదరించి భగవత్ సేవావకాకాన్ని ప్రసాదించటం.

వర్ణవ్యస్థకు అతీతంగా, వివిధ వర్ణాలకు చెందిన ' ఆళ్వారులకు 'అతిమానవ 'కాదు. “దివ్యత్వ "ప్రతిపత్తి కల్పించి ఆలయాలలో వారికి 'పూజాపురస్కారాలు' పరికల్పించి (అట్లాంటి 'దివ్యసూరులు' వేంచేయని ఆలయాన్ని దివ్వస్థలంగా పరిగణించక, ఆచట తీర్ధప్రసాదాలు స్వీకరించరు శిష్టులు నేటికీ. అట్లాంటివాటికి 'ప్రాకృత' స్థలాలనే వ్యవహారం) తీర్థ ప్రసాద స్వీకార యోగ్యత సర్వులకూ సంతరించటం.

మానవులంతా హృదయం ఉంటేచాలు. సౌదర్యసంభావనం చేయగల వారైతే చాలు లింగ, వర్ణ విభేదంతో ప్రమేయం లేకుండా భారతీయ ఆధ్యాత్మిక సంపదనుభవానికి వారసులని చెప్పటం, ఇట్లాంటి సంస్కరణ లెన్నో వారి సమతాదర్శనానికి, సౌందర్యభావనానికి తార్కాణలుగా నేటికీ నిలుస్తాయి. దీని పర్యవసానమే ఇటు మన కృష్ణమాచార్యులవారు అటు తాళ్ళవాకవారూ శ్రుతి సమ్మితాలుగా, బహు శ్రుతి సమ్మరాలుగా, బహుశ్రుత మఠాలుగా తెలుగు నాట తెలుగులో, వేదాలు పాడటం.

శ్రీమద్రామానుజులు - కళింగాంద్రం

ఇట్లాంటి వక్తి త్వమూ అంతరంగమూకల శ్రీమద్రామానుజులు ఆసేతుశీతాచలమూ పర్యటించి తమ సిద్ధాంతం ప్రచారం చేస్తున్న సమయంలో అన్ని ప్రాంతాలతోపాటు ఆంధ్రావనీ అయన ఆశయాలను ఆదరంతో స్వీకరించింది. ఎందరో పూర్వభాగవత వైష్ణవ కుటుంబాల వారూ అద్వైతాదీతర మతాల వారు కూడాఆయన సిద్ధాంత ప్రతిపాదనల్ని శిరసావహించి

నూతనోత్తేజంతో శ్రీవైష్ణవులై నారు. ఆయన ఆంధ్రదేశ పర్యటనలో శ్రీకూర్మ సింహాచలాలు విశిష్ట ఘట్టాలు. కళింగాంధ్రం అంతా ఆయనకు కైమోడ్పులు ఘటించింది. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమద్రామానుజుల నిర్యాణానికి సరిగ్గా వంద సంవత్సరాలనాడు మన ప్రథమాంధ్రవచన కవితాచార్యులు కృష్ణమాచార్యులు అవతరించేరు. పై పూర్వరంగపీఠికలో నిరూపింపబిడ్డ శ్రీమద్రామానుజుల వ్యక్తిమూ, ఆశయాలూ కృష్ణమాచార్యులు గా తెలుగు

8

నాట ఆవతరించేయనటం అతిశయోక్తి కాదు అవినయమూకాదు. అందుకే కృష్ణమాచార్యుల వ్యక్తిత్వం తదవతార పూర్వరంగం అర్థం కావటంకోసమే సుదీర్ఘమయిన ఇంత ఉపోద్ఘాతం ఉపక్రమించక తప్పలేదు.

తెలుగు కవి అంటే చాలు అతని దేశకాలాల విషయంలో పెద్దగా లిదుమారంచెల రేగుతుంది. కృష్ణమాచార్యులకూ ఈ “గాలి" సోకక తప్పలేదు.

కృష్ణమాచార్యుల్ని గురించి కృషి చేసినవారు

కృష్ణ మాచార్యులను గూర్చి ఆధునికుల్లో బహుళః మొట్ట మొదట ప్రస్తావించిన ఘనత శ్రీనిడుదవోలు వెంకటరావు గారిది. తరువాత శ్రీ తిమ్మావర్షుల కోనందరామయ్యగారూ, శ్రీవేటూరి ఆనందమూర్తి గారు పరిచయ వ్యాసాలు వ్రాసినట్లున్నారు. ఆ తరువాత శ్రీ ఆరుద్రగారు తమ సమగ్ర ఆంధ్రసాహిత్య చరిత్ర పద్మనాయక యుగం-సంపుటంలో కృష్ణమాచార్యుల్ని గురించి క్లుప్తంగా ముచ్చటించేరు. చివరగా ఆగ్రరచయితల సంఘంపక్షాన డా౹౹ కుల శేఖరరావుగారు “సింహగిరి వచనములు" అనే పేర కృష్ణమాచార్యుల వచనాన్ని కొన్నిటిని సేకరించి ప్రకటించి తెనుగు జాతికృతజ్ఞతకు పాత్రులైనారు. 1964లో అనుకొంటాను నేనూ పూజ్యులు డా౹౹ కొర్లపాటి శ్రీరామమూర్తి గారూ కలిపి ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉన్న కృష్ణమాచార్య వచనాలను సంస్కరించి ప్రకటించాలన్న ఊహకు వచ్చేం. కడమవచనాల కోసం, కాలదేశాల కోసం కొంత ప్రయత్నించీ, వ్యక్తి గతాలైన ఇబ్బందుల వల్ల మా ఊహ ఊహగానే ఉండిపోయింది. ఇంతలో 1968 లో డా॥ కులశేఖరరావుగారి 'సింహగిరి వచనములు' వెలుగులోకి వచ్చేయి ఈ ఉద్యమంతో సంబంధం గలవాడుగా, విశేషించివ్యక్తిగతంగా డా౹౹ కుల శేఖరరావు గారికి కృతజ్ఞతాభివందనాల ర్పిస్తున్నాను. డా౹౹ రావు గారు గ్రంథారంభంలో ఉపోద్ఘాతం సంతరించి కృష్ణమాచార్యుల జీవితవిశేషాలు కొన్ని తెలియ చేసేరు

ప్రధమాంధ్ర వననకావ్యనిర్మాత కృష్ణమాచార్యుల్ని గురించి వీలైనన్ని యధార్థాలూ, ఔచితీసహాలూ అయిన విషయాలు సవిమర్శంగా ఆంధ్ర ప్రజానీకం ముందుంచి వారికి కృష్ణమాచార్యుల్ని గురించి “తొలి తెలుగు వచనకవి"ని గురించి తెలియ జెప్పటమే నేనాశించిన ప్రయోజనం.

9

కాలం

కృష్ణమాచార్యులు తమ వచనాల్లో 'వికృతి' సంత్సరంలో తాము జన్మించినట్లు చెప్పుకున్నారు. ఆయన ద్వితీయ ప్రతాపరుద్రుడివల్ల సమ్మానాలు పొందినట్లు ' ప్రతాప చరిత్ర సిద్ధేశ్వర చరిత్రలు, చెప్తున్నందువల్ల ద్వితీయ ప్రతాపరుద్రుడి సమకాలంలో ఉండే వికృతిని ఆయన జన్మసంవత్సరంగా భావించటం ఉచితం అన్న దృష్టితో కావచ్చును, కీ॥ శే౹౹ శ్రీనిడుదవోలు వేంకటరావుగారు కృష్ణ మాచార్యుల జన్మను క్రీ౹౹శ౹౹ 1290 వికృతిగా నిర్ణయంచేరు. కానీ డా౹౹ కుల శేఖరరావు గారు ప్రతాపరుద్రుడి పరిపాలనా కాలం 1295-1326 కనక 1290 ఆయన జన్మకాలం అయితే ప్రతాపరుద్రుడి నాటికి కృష్ణమాచార్యులు మరీచిన్న వయసులో ఉండవచ్చును అంచేత 1260_65 ఆయన జన్మకాలం అవటం బాగుంటుందనీ “మూజు వాణీ" తీర్మానం ఒకటి ప్రతిపాదించేరు. వారు ప్రతిపాదించిన కాలంలో 'వికృతి' సంవత్సరం లేదు. దీన్ని వారు పట్టించు కున్నట్టు కనబడదు. అయితే శ్రీ నిడుదవోలు వారి కాలాన్ని (1290) అంగీకరిస్తే శ్రీ కులశేఖరరావు గారి అభియోగం మాట ఏమిటన్న ప్రశ్న అల్లాగే ఉంటుంది.

అంతరంగ సాక్ష్యం

దీనికి సమాధానం కృష్ణమాచార్య వాజ్మయంలోని ఆంతరంగిక సాక్ష్యాలు, ఆయన కావ్యనిర్మాణ రంగస్థలం అయిన సింహాచలం, తాత్కల చరిత్ర, ఆనాటి శ్రీవైష్ణవ సంప్రదాయ ధోరణీ, ఇవన్నీ అనుశీలిస్తే కాని చెప్పటం కుదరదు. కృష్ణమాచార్యుల వేశ్యాలోలత్వం, శృంగార ప్రియత్వం ఆయన వచనాల వల్ల నే తెలుస్తోంది. ఇదొకటి ఆయన జీవితంలో గమ

నించాల్సిన అంశం. అహోబలం నుంచి “నారసింహుని నాట్య వినోదులు” “పొతకమూరి భాగవతులు' సింహాచలం వచ్చి కృష్ణమాచార్యులను దర్శించు కొంటారు. అప్పటికి 'చాతుర్ల క్ష' గ్రంథంలో లక్షా ఏబది వేలు కొదవ కృష్ణమాచార్యులకు. 'చాతుర్ల క్ష' ఒకటి "యక్ష ప్రశ్న" లాగ విడవకుండా ఇంకా అలాగేఉంది. ఆది ఏమైనా వారు వచ్చేనాటికి కృష్ణమాచార్యులకు 40, 45 ఏళ్ళ

10

వయసైనా ఉండి ఉండాలి. ఆయన తన పదహారోయేట పరాభవ సంవత్సర ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు సంకీర్తనం ప్రారంభించేరు. ప్రతాపచరిత్ర ప్రకారం కృష్ణమాచార్యులు చాతుర్లక్ష గ్రంథం రాగి రేకుల మీద చెక్కించి వాట్ని బళ్ళకెత్తించి శ్రీరంగం తీసుకపోయేరు. ప్రతాపరుద్రుడి అవసానం 1323 కనక కనీసం 1320 లోగానై నాయీపని జరగాలి. శ్రీవెంకటరావు గారి ప్రకారం అప్పటికి ఈయన వయస్సు 30 ఏళ్ళు. ఆరోజుల్లో చాలా చిన్న వాడు. పదహారోయేట సంకీర్తనం ప్రారంభించినా కనీసం ఏభై అరవై ఏళ్ళు స్వామిని అనవరతంగా కీర్తించి చాతుర్ల క్షల మాట ఎలాగున్నా కొన్ని వేల కీర్తనలో వచనాలో ఆయన కూర్చి ఉంటారన్నది మాత్రం నిర్వివాదాంశం. పొతకమూరి భాగవతులతో ఆయన ప్రసంగించేటప్పుడు “కదమ 1.5 లక్షలూ ఎప్పటికపుతాయా" అనేదిగులు కూడా ఆయనలో కనబడుతుంది. దీన్ని బట్టి ఆది చాలా పెద్ద ప్రణాళిక గా కనబడుతుంది. కాని ఏటికి ముప్పై వేల గ్రంథం ప్రణాళికలా తోచదు. ముప్పైయేళ్ళకే అది పూర్త యేలాగుం టే ఆయన అంత దిగులుగా “ఎన్నటికి పూర్తవుతుందా" అని ఆందోళన పడవలసిన అవసరమూ కనబడదు. పొతకమూరి భాగవతులు కృష్ణమాచార్యులను సందర్శించే నాటికి ఆయనకు కొడుకు పుట్టటం, ఏడేళ్ళు జీవించి ఆ శిశువు పరమ పదించటం కూడా జరిగింది. ఆరోజుల్లో ఆష్టవర్ష కన్యకలకే వివాహం జరిగినా వరులు మాత్రం కనీసం త్రిదళులుగదా ! అందునా కృష్ణమాచార్యులు తనవారంతా కాదంటే మతంలో అనాథగా పెరిగి 'అనాధపతి' యేన సింహగిరి నరహరి కరుణవల్ల గొప్పవారయినవారు. ఈ గొప్పదనం ఒక రోజులో, ఒకయేడులో వచ్చేదిగాడు. 16 వ యేట సంకీర్తనం ప్రారంభించిన ఆయన కనీసం 10, 15 సంవత్సరాలు గడిస్తే కాని ఆమాత్రం పేరు ప్రతిష్ఠలు సంపాదించటం కాని, ఆయన మహత్వం కాస్త దేశవ్యాప్తం కావటం కాని జరిగే అవకాశం ఉండదు. అంచేత రమారమి పాతిక ముప్పది సంవత్సరాల వయస్సులో మేనమామ కూతురితో ఆయనకు వివాహంజరిగి ఉండవచ్చు.

వివాహంనాటికే ఆయన భక్తి పారవశ్యంలో తల మున్కలౌతూండటం అంతరంగ' ప్రమాణసిద్ధం. వెంటనే పుత్రోదయం. ఏడేళ్ళు బ్రతికి ఆకొడుకు

11

పోవటం. 40 ఏళ్ళలోగా ఇది జరిగి ఉంటే ఆ తరవాత 40, 45 మధ్య పొతకమూరి భాగవతులు ఆయన్ను సందర్శించటం జరిగి ఉండవచ్చు ఇక ఆయన వేశ్యాలోలత్వాన్ని గురించి. ఇందుకు ఆయనే సాక్షి. వివాహం అయి భార్యకాపురానికి వచ్చేకే ఈయన ఈ వ్యామోహంలో పడ్డట్టుకనపడుతుంది. ఆరోజుల్లో వేశ్యా లాంపట్యం అకార్యం, ఆవమాన్యం కాకపోగా మగటిమికి లక్షణం. కాని ఒక్క మాట, సమాజంలో ఏదోరకంగా అంతో ఇంతో వ్యక్తి త్వం మహత్వం సంపాదించుకొన్న తరవాతనే ఇట్లాంటివి చెల్లుబాటుకు వచ్చేవి. అంతేకాదురాణించేవిని. ఆనువంశికమూ పారంపరీణమూ అయిన పెట్టుబడివల్ల కాక, కృష్ణమాచార్యులు స్వార్జితమైన కీర్తి ప్రతిష్ఠల పెట్టుబడితోనే సమాజంలో సామాన్యమానవుడుగా నిలబడగల గటమేకాడు సామ్రాజ్యభోగాలనుభవించే స్థితికే వచ్చేరు. ఇంత స్థితికి వచ్చేకనే వారేంచేసినా లోకం ఆదర్శంగా ఆదరంగా చూస్తుంది. కృష్ణమాచార్యులకు ఈ స్థితికి రావటానికి ఆయన మనిషయేక, అంటే 16 ఏళ్ళ తరవాత కనీసం రెండు పదులేనా పట్టిఉండాలి. అంటే రమారమి 35 సంసత్సరాల వయస్సు వచ్చి ఉండి మంచినిండు జవ్వనంలో ఆచార్యులవారుండగా శృంగారవల్లభులయేరన్న మాట. దీనికి సంవాదిగా సింహాచలం చరిత్ర కనబడు తోంది.

శృంగారవాల్లభ్యం

ఆటపాటల్లో ఆందెలు వేయించుకున్న "దేవదాసీలు" దేవాలయాల్ని సేవించటం భారత దేశంలో సార్వత్రికం సామాన్యమూను. సింహాచలంలో 1264 నుంచి యీ సంప్రదాయం ప్రారంభం అయినట్లు శాసనాలు తెలుపుతున్నాయి 1266 లో గాంగ ప్రథమనరసింహ చక్రవర్తి దేవాలయానికి నూరుమంది పాటకత్తెలను సమకూర్చటమేకాక తత్సంప్రదాయ నిర్వహణకు

ఒక వృత్తి కూడా ప్రసాదించాడు. వీరంతా సానులేకావచ్చునని చారిత్రకుల ఊహ.ఈ సందర్భంలో కృష్ణమాచార్యుల " దేవ వేశ్యా భుజంగా " అన్న సింహగిరి నరహరి సంభోధన అను సంధించు కోవటం ఎంతేనా అవసరం. ఈ ప్రకరణంతో కలుపుకొని చూస్తే దాన్లో ఆశ్చర్యం అక్కరలేదు. వీరు అందగత్తెలే కాక ఆట-పాటల్లోనూ ఆరి తేరినవారు. అప్పటికే కృష్ణమాచార్యులు పదకర్తగా సంకీర్తనా చార్యులుగా, మహామహిమాన్వి

12

తులైన భక్త శిఖామణిగా పేరువడి సింహాచలంలో స్వామి సేవాతత్పరులుగా ఉన్నారు. స్వామివారి ఏకాంత సేవాసమయాల్లో చిందులు తొక్కుతూ, చిఱు తాళాలు వాయిస్తూ, దండెమీటుతూ, వచనభావంతో సింహగిరి నాధుణ్ణి కీర్తిస్తూ, పరవశించిపోతున్న తరుణంలో వీరిలో మేలిసాని, నృత్యగాన విద్యా విశారద. “జగన్మోహనాంగి" 'పదునొకండవ అవతారుండైన' కృష్ణమాచార్యులపై మరులు గొనటం, లోకమూ తామూ తమను అవతారంగా భావించు కొంటున్న కళాహృదయులు కృష్ణమాచార్యుల వారు ఆ “కళావంతురాలి" వలపు చిన్నెలకు పరవశించి విప్రనారాయణులవలే ఆమె కై వసంకావటం అబ్బురం ఏంకాదు. సుమారొక దశాబ్దం ఆమెతో గడిపిన తరవాతనే పొతకమూరి భాగవతులు ఆయనను సందర్శించి ఉంటారు. అంటే 1275 ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చును.ఈ నాటికి రమారమి 45 ఏళ్ళ వయస్సుగల కృష్ణమాచార్యులు క్రీ౹౹ శ౹౹ 1230 వికృతి సంవత్సరంలో జన్మించి ఉంటారని ఒక బలమైన ఊహ ప్రస్తుతానికి చెయ్యవచ్చును.

సంకీర్తన సంప్రదాయం - శాసన ప్రమాణం

పూర్ణపురుషాయుష ప్రమాణంగా ఆరోజుల పరిపాటి ననుసరించి. నూరేళ్ళు కాక పోయినా 80, 90 ఏళ్ళయినా కృష్ణమాచార్యులు జీవించి ఉండ వచ్చును. ఆయన సంకీర్తన సంప్రదాయం అగ్రవర్ణాల వారిలోకంటే, ఇతరుల్లోనే ముఖ్యంగా సానుల్లో ఆయనకు వారితో ఉండే సాన్నిహిత్యాన్ని బట్టి. అందులో పొరి కుందే సొమర్ధ్యాన్ని బట్టి కొంతకాలం అయినా "నిలిచి

ఉండా"లి క్రీ౹౹ శ౹౹ 1374 లో అంటే సుమారుగా కృష్ణమాచార్యుల పరమపదానికి 50 సంవత్సరాల తరవాత సంకీర్తన సంప్రదాయ పరిక్షణకు, అది సానులచే నిర్వహింప చేయటానికి వృత్తిని కల్పిస్తూ, సింహాచలంలో వేయించిన ధర్మశాసనం ఒకటి దీన్ని సమర్థిస్తోంది, ఇప్పటికి సింహాచలం లో కృష్ణమాచార్య సంకీర్తనం అన్నది ఈ సంప్రదాయం గానే నిర్వహింపబడుతూండటం కూడా ఇందుకు ఉపష్టంభకం. 1290 కృష్ణమాచార్యజన్మ సంవత్సరం అయివుంటే 1374 లోనే ఇంచుమించు ఆయన

13


జీవితకాలంలోనే, ఆయన సంస్మరణమైనా లేకుండా, సంకీర్తన సంప్రదాయ పరిరక్షణం కోసం శాసనం పుట్టటం సంభావ్యంకాదు. అందుచేత ఈ శాసన బలాన్ని పట్టికూడా కృష్ణమాచార్యుల జన్మవర్షం క్రీ౹౹ శ౹౹ 1230 గా ప్రస్తుతానికి పరిగణిచంటంలో విప్రతిపత్తి ఉండకూడదు.

ఆచార్య సూక్తి ముక్తావళి - అంతరార్ధం

ఇది యిలా గుండగా శ్రీ వైష్ణవ సంప్రదాయ చారిత్రక గంథం- "ఆచార్య సూక్తి ముక్తావళి"లో కృష్ణమాచార్యులు శ్రీ మద్రామానుజులకు సమకాలికులుగా చిత్రింపబడ్డారు. అదే నిజమైతే ప్రథమాంధ్రకవి నన్నయ గారికి సద్యస్సమనంతరకాలికు లౌతారు ప్రథమాంధ్ర వచనకవీని, కాని యీ ప్రతిపాదనం అంతరంగ బహిరంగ సాక్ష్యాలకు రెండింటికీ విరుద్ధంగానే కనబడుతోంది. చివరకు సిద్ధాంతం ఏమయినా కేవలం ప్రతాప చరిత్రబలంతో ఆచార్య సూక్తి ముక్తావళి ప్రతిపాదనాన్ని త్రోసిరాజన్న వారు కొందరూ, అసలు అదొకటి ఉన్నదని కూడా తలవనివారు మరి కొందరూను మన విమర్శకులు. చారిత్రకంగా కృష్ణమాచార్యుల కాలనిర్ణయంలో ఆచార్య సూక్తి ముక్తావళి అంగీకృత ప్రమాణంకాకపోయినా ఆయన జీవిత సత్యాలనీ, సిద్ధాంతాలనీ నిరూపించేందుకు ఉపయోగపడుతుంది. ఇది విమర్శకులు గ్రహింపలేదు. సింహగిరి నరహరీ వచనాల అంత స్సాక్ష్యాన్ని జట్టి ఆచార్య సూక్తి ముక్తావళి విలువల్ని ఈ సందర్భంలో విమర్శించటం అవసరం. కృష్ణమాచార్య వాజ్మయాన్ని పట్టి ఆయన శ్రీ మద్రామానుజుల పట్ల ఎల్లప్పుడూ అపారమైన భక్తి విశ్వాసాలు కలవారని తెలుస్తోంది. సింహగిరి నరహరితో పాటు యతిపతి రామానుజులు, కృష్ణకువ్వారు, రాఘవేశ్వరుడు వీరు ముగ్గురూ ఆయనకు దైవ సమానులు. ఈ భక్తి సర్వకాల సాధారణం,

ఇట్లాంటి కృష్ణమాచార్యులు ఒకప్పుడూ రామానుజులను “వట్టి సన్యాసి" గా భావించరు. ఇక శ్రీమద్రామానుజులా ఆయన ఉదాత్త గంభీరులు. ప్రాణికోటి పట్ల ఆయన కరుణ అపారం గోష్ఠి పురగోపురం మీద నిలిచి మంత్రార్ధవితరణం చెయ్యటం ఆయన ఔదార్యానికీ కరుణకూ తార్కాణ. అంతేకాదు ఆత్మోత్తారణం కంటే పరోద్దారణానికి ఆయన తపనకు పరమో దాహరణ .

14

డనుర్దాసులాంటి ముష్కరులపై కృపాకటాక్షలహరీశీకరాలను చిందించిన కరుణా సింధువాయన. అట్లాంటి ఆ మహానుభావులు కేవలం ఆచార్యోపాధివహంచి వచ్చేరన్న నెపంతో బుద్ధి చెప్పటానికి ఆయనతో మాకు పనిలేద'నేంత విరసులా: పొతకమూరి భాగవతుల సందర్శనానికి ముందు శ్రీమద్రామానుజులతో ఆచార్యులవారికి “భేటీ" జరిగితే తత్పర్యవసానంగానైనా ఆకథ అట్లానడవదు. పొతకమూరి వారి తరవాత శ్రీమద్రామానుజుల సందర్శనం అందామా అంటే ఆస్వాముల్నే "ఎంబెరుమానార్ల స్వరూపులు"గా భావించిన కృష్ణమాచార్యులు, వారి సందర్శనంతో పశ్చాత్త పడై జీవిత విధానాన్నే మార్చుకొన్న కృష్ణమాచార్యులు తమ సమక్షంలో తాముగా సాక్షాత్కరించిన ఎంబెరుమానార్ల పట్ల రాజసవై ఖరినెట్లా అవలంబిస్తారు? సింహగిరి నరహరి వచనాలు ఎప్పటికైనా బయటకు వస్తాయనే ఊహచాలక “అంధాభిజాత్యం" తో “వాది భీకరగురులు" కేశవాచార్యులకు ఈ “కథ" చెప్పేరేమో ! ఇది కేవలం కృష్ణమాచార్యుల సంస్కరణ భావాలు, విప్లొవక దృష్టి కిట్టని అభి

జాత్యసంపన్న కుటుంబాల వారు కల్పించిన కట్టుకథ తప్పమరేమీకాదు.ఈ కథ ఆచార్యసూక్తి ముక్తా వళిలో తప్పమరే శ్రీవైష్ణవ చారిత్రక గ్రంథంలోనూ లేకపోవటం కూడా ఈ ప్రకరణంలో గమనించాలి. బంధురభక్తి భావమహితులూ మహనీయ దివ్యభావ భరితులూ చాతుర్లక్ష గ్రంథ స్వరూపులూ, తెనుగు వేదద్రష్ట, సంకీర్తన వాజ్మయ ద్రష్ట ఆర్తి గలవారూ, అందం చూడగల వారూ ఆయిన కృష్ణమాచార్యులు శ్రీ మద్రామానుజుల్ని సందర్శించిఉంటే తెలుగు దేశపు వైష్ణవ చరిత్ర తీరే వేరుగా ఉండి ఉండేది. భగవద్యామునమునుల్ని శ్రీమద్రామానుజులు సందర్శించ లేనట్లే శ్రీమద్రామానుజుల్ని శ్రీ కృష్ణమాచార్యులు సందర్శించలేదేమో ! ఈ కథకల్పించినవారు రామానుజ సమకాలికత్వంద్వారా కృష్ణమాచార్యులకు ఆంధ్ర వాజ్మయంలో కాని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కాని ముందు పీటవెయ్యటం కొసంకాని, ఈ రూపంగా శ్రీ మద్రామానుజుల మహత్వాన్ని ప్రతిష్టాపించటం కోసం కాని పాటుపడ్డవారు కాదు మణి కేవలం శ్రీ వైష్టవ సంప్రదాయంలో పట్టిన ఆచార్యవ్యవస్థా ప్రాముఖ్యాన్ని ప్రతిపాదించటం

15

కోసమూ తెలుగుదేశంలోని వైష్ణవుల పట్ల వారెంతటి మహత్వాతిశయం కలవారైనా చిన్న చూపుతోనూ కల్పించిన కట్టుకథ యిది. ఆచార్య సంప్రదాయం విషయంలో కృష్ణమాచార్యులు ఏ శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రతిష్ఠాపనాచార్యులకూ తీసిపోయేవారుకాదు. ఇది ఆయన వచనాలు చూచినవారికి తెలుస్తుంది. అంచేత ఆచార్య సూక్తిముత్తా వళికథ ప్రామాణికంగా పరిగణింపబడే అవకాశం లేదు. అహోబలంలోని నాట్య వినోదులైన పొతకమూరి భాగవతుల జాడ చారిత్రకంగా నిరూపింపబడేవఱకూ, కృష్ణమాచార్యులకు ప్రతాపరుద్రుడిచ్చేడను కొంటున్న “ ఏభై ఊళ్ళరాజకీయాధికార శాసనాలు బయటపడేంతవఱకూ, ఇంకా ఏమైనా ఆంతరంగిక సాక్ష్యం చెప్పగల వచనాలు కొత్తవి ఆయనవి బయటపడేంతవఱకూ, ప్రస్తుతం ప్రతిపాదింపబడుతున్న జన్మ సంవత్సరాన్ని అంగీకరించటంలో బహుళః ఏ విప్రతిపత్తీ ఉండకూడదు. ఏతావతా కృష్ణమాచార్యుల జన్మ సంవత్సరం క్రీ౹౹ శ ౹౹ 1230 వికృతి, 1246 పరాభవ సంవత్సర ఆషాఢ శు౹౹ ద్వాదశినాడు దండెయు చిఱుతాళములు ధరించి సింహగిరి నరహరి సన్నిధిని ఆయన సంకీర్తనం ప్రారంభించేరు.

తామ్ర పత్రాల సంగతి

ఓరుగంటిని కృష్ణమాచార్యులు సందర్శించి ఉండటానికి అభ్యంతరం ఏమీలేదు, ఆయన 'భూప్రదక్షిణం' చేసేరు. శ్రీరంగాది దివ్యక్షేత్రాలూ సందర్శించేరు. ఆ సందర్భంలో ప్రతాపరుద్రుణ్ణి చూసి సమ్మానాలూ పొంది ఉండవచ్చును, రాజకీయాధికారమూ చెలాయించీ

ఉండవచ్చును. అయినా ఆయన మనస్సు సింహగిరిమీదే ఉంది. అందుచేతనే కావచ్చు మూడేళ్ళు అధికారం చేసి సొమ్మంతా కూడబెట్టి తామ్రపత్రికలు చేయించి తన చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలు వాటిమీద చెక్కించి స్వామికి సమర్పించటంకోసం, బళ్ళకెక్కించి సింహాచలానికే తరలించి ఉంటారు. ఆయన సింహాద్రినాధుణ్ణి కూడా శ్రీరంగశాయి అంటారు. ప్రతి శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాన్ని "తిరుపతి" అన్నట్లు, ప్రతి విష్ణు క్షేత్రమయిన కొండనూ “తిరుమల" అన్నట్లు శ్రీవైష్ణ

16

వుల వ్యవహారంలో, సింహాచలం నివాస రసికులాయన. 60, 70 వయస్సులో చాలావఱకూ “చాతుర్లక్ష గ్రంథ సంకీర్తసం" పూర్తి చేసుకొని దేశం తిరుగుతూ ప్రతాపరుద్రుడి పరిపాలనా ప్రారంభదినాల్లోనే లేదా అతడు యువరాజుగా రుద్రమదేవి దినాల్లోనే రాజసమ్మానం పొంది ఉండవచ్చును. ఆ తామ్ర పత్రికలు సింహాచలం తెప్పించి వాటి మీద తన వాజ్మయం చెక్కించి సింహగిరి నరహరి శ్రీ భండారానకు సమర్పించి ఉండవచ్చును. శ్రీరంగం వెళ్ళి సింహాచలానికి మళ్ళీ తిరిగివచ్చినట్టూ, సింహాద్రినాధుని శ్రీ భండారానకు “చాతుర్లక్ష గ్రంథ సంకీర్త నలు" సమర్పింప పూనినట్లూ, ఆయన అంతరంగ సాక్ష్యం ఉండనే ఉంది.

ఇక ఆయన నివాసాన్ని గూర్చిన చర్చ

ప్రతాపచరిత్ర కృష్ణమాచార్యులకు ఓరుగంటితో సంబంధాన్ని పేర్కొంటూ ఆయన స్వగ్రామం సంతూరు ' అనీ తరువాత ఆయన 'కల్లూరు' అనే గ్రామం నిర్మించేరనీ చెపుతోంది. 'సంతూరు' లేక 'సంతురు' ఆయన జన్మభూమి అని ఆయన వచనాలవల్ల తెలుస్తోంది. అయితే యీ ‘సంతూరు' ఎక్కడిదన్న ప్రశ్నకు శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు తిరునల్వేలి జిల్లాలో (మదరాసు) సంతూరనే గ్రామాన్ని సమాధానంగా ప్రతిపాదించేరు. తెలుగు రచయిత జన్మభూమి తమిళ గ్రామం అవటం, అనటం బాగుండదని డా.కుల శేఖరరావుగారు మహబూబ్ నగర్ జిల్లాలోని సంతపురినే 'సంతూరుగా' నిరూపించటానికి పూనుకొన్నారు. వారి యీ నిరూపణానికి వారు చూఫినకారణాలు రెండు- ఓరుగంటికి సంతపురి దగ్గరగా ఉండటం, 'సంతపురి' వారు వైష్ణవుల్లో ఉండటం ఒకటి. కృష్ణమా

కార్యులు నిర్మించే ధనదగిన "కల్లూరు" కూడా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉండటం మరొకటీని. కానీ యీ ప్రతిపాదనం అంత ఔచితీసహంగా కనపడదు. వ్యవహార దృష్టితో కాని భాషాశాస్త్రరీత్యాకానీ సంతపూర్ లేక సంతపురి-సంతపూర్ - సంతఊర్ - సంతూర్-సంతూరుగా మారే అవకాశం, ఔచిత్యం ఉంది అని వ్యత్యస్తంగా-సంతూరు సంతపురి గామారే అవకోళం కనపడదు. ఇహ కల్లూరు సంగతే, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉండవచ్చు

17

కాని కృష్ణమాచార్యులు నిర్మించిన ఊరు ఇదేనా అని ? ఆయన నిర్మించే రంటున్నారు అంటే కొత్తగా ఒక గ్రామం ఇలువేల్పు పేరనో, గురువు పేరనో తన పుణ్య-ప్రతిష్ఠల కోసమో నిర్మించుకొని ఉండాలి అంతే కాని గురుస్మృతీ, దైవస్మృతీ ఏదీ లేకుండా వట్టి 'కల్లూరు' అనే పేరు తన గ్రామానికి పెట్టుకొంటారా అనేది పరిశీలించవలసిన అంశం. ఇంతే కాదు కృష్ణమాచార్యులకు దివ్యమైన పేర్లంటే మోజుకూడాను. తన మేనమామ గారి నివాసం " శ్వేత ద్వీపం" అంటారాయన. ఈ 'శ్వేతద్వీపం' ఏ అంతర్వేదిక్షేత్రఘు కావచ్చునేమో ! పరిశోధకులు నిరూపించాలి. ఇట్లాంటి అలవాటున్న వ్యక్తి తను నిర్మించిన గ్రామానికి మరీపాషాణప్రాయమో అవద్యమద్యార్థకమో అయిన కల్లూరన్న పేరు పెడతారనుకోను.ఇక ఆయన జన్మదేశ నిర్ణయం చేసేటప్పుడు సింహాచలం తో ఆయనకున్న సంబంధాన్ని విస్మరించకూడడు. ఈ సంబంధం నిరూపించటానికి కాని, జన్మదేశాన్ని నిరూపించటానికి కాని, ప్రయత్నించేముండు ఈ వృత్తాంతం కల ఆయన వచనం చూడకపోతే అంత కంటే మహాపచారం ఉండదు. ఆయన వచనం ప్రకారం.

అంధుడని తల్లిదండ్రులు నూతిలో పారవేసిన కుఱ్ఱవాణ్ణి 'కృష్ణకువ్వారు' అనే ఒక సన్యాసి తీసి పెంచి కొన్ని సంవత్సరాలకు తాను సింహాద్రి వెళుతూ ఈ బాలుణ్ణి కూడా తోడుకొనిపోయి కింద ఈ పిల్లవాణ్ణి దిగవిడిచి తాను మాత్రం స్వామి సన్నిధికి ( కొండ పైకి) వేళ్ళేటప్పుడు తనను మరిచిపోయి స్వామి సన్నిధినే "కువ్వారు" ఉండి పోతాడేమో అనే భయంతో ఆ పిల్లవాడు తనను మరువ వద్దంటాడు. అందుకనుగుణంగానే మూన్నాళ్ళు ఈ బాలుడి సంగతి పట్టుంచుకోడు ఆ "కువ్వారు". తరవాత సింహాద్రినాధుడు బాల రూపంలో వచ్చి పాలు ఇవ్వటం. అంధ బాలుడికి దృష్టి రావటం జరుగుతుంది. ఇదీ ఆయన జన్మకధ.

- సంతూరు - సంతపురి కాదు-

ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో 'సంతపురి' లో ఉన్న అంధ శిశువుని తీసుకొని ఒక సన్యాసి కళింగాంధ్రంలోని సింహాచలానికి చేరటం

18

సరి పెట్టుకోలేని సంగతి. ఈ మధ్యలో ఎన్నో క్షేత్రాలూ, మఠాలూ, అనాధ మందిరాలూ ఉండగా ఎక్కడా ఆ బాలుణ్ణి దించకుండా ఆ సన్యాసి ఇంత దూరం ఎలా, ఎందుకు తెచ్చినట్టు ? ఆయన సింహాచల స్థిరనివాసి అయిన కుటుంబీకుడుగాడు సన్యాసి శిరోమణి ఆయె: - ఆ తరవాత ఆంధబాలుడు చూపుగలవాడై సంకీర్తనం చేస్తూండగా అతని తల్లి దండ్రులు, బంధువర్గం వారూ సింహాచలం వచ్చి చాలా సంతోషించి బాలుడికి జాతకర్మాది బ్రాహ్మణ సంస్కారాలన్నీ చేస్తారు. ఈ సంతూరు ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే కృష్ణమాచార్యులవార్త వారికి తెలియటం వారంతా సింహాచలం రావటం ఇవన్నీ ఆరోజుల్లో జరగటం కొంచెం అసహాజాలూ కష్టసాధ్యాలూను. కనుక కృష్ణమాచార్యుల జన్మస్థలం అయిన 'సంతూరు' విశాఖపట్నం జిల్లాలోనే సింహాచలం పరిసరాల్లోనే ఉండి ఉండాలి. అలాగైతేనే ఆయన సింహాచలం చేరటానికి కాని తరవాత బంధువర్గం వారు ఆయనజాడ తెలుసుకొని అక్కడికి రావటానికి కాని వీలుంటుంది.

-సింహాద్రి- అప్పన్న దే-

ఈ సింహాద్రి లేక సింహాచలం విశాఖ పక్కదే. ఇతర ప్రమాణలతో పాటు ఆంతరంగిక సాక్ష్యమే ప్రబల తమ ప్రమాణం ఇక్కడ సింహగిరి నరహరిని సింహాద్రిఅప్ప - అప్పడు అని కృష్ణమాచార్యులు చాలా చోట్ల వ్యవహరిస్తారు. శ్రీ జగన్నాధంతోపాటు సింహాచలాన్ని పేర్కొంటారు. ఈ సహపఠితత్వంవల్లాయిది విశాఖ సింహాచలమే. ఇందులో అనుమానం అక్కరలేదు. అంచేత సంతూరు సింహాచలానికి వీలయినంత దగ్గరలో ఉండటమే సంభావ్యతరం. సింహాచలానికి రమారమి 25 మైళ్ళ దూరంలో 'సంతలూరు' అనే ఊరుంది ఇది 'సంతూరు' కావచ్చునేమో పరిశోధించాలి.

-కువ్వారు- కమారశబ్దభవం-

ఇక్కడ నాదొక కొత్త ప్రతిపాదన. తెలంగాణా జిల్లాలతో కంటె మొదటి నుంచి 'ఒరిస్సా' దేశంతో సింహాచలానికి సన్నిహిత సంబంధాలు -

19

టున్నాయి. ఇది కళింగాంతర్భాగం. కళింగ గాంగులు సింహాచలానికి ఎంతో సేవచేసేరు. ఒరియా ప్రజకూ. వారి రాజులకు లాగే సింహాద్రి నరసింహుడు ఇష్టదైవం. ఇప్పటికీ సింహాచలం భోగరాగాలూ ఆదాయమూ ఒరిస్సా ప్రజలవే. కృష్ణమాచార్యుల గురువు, రక్షకుడు అయిన కృష్ణకువ్వారు నరసింహస్వామి భక్తుడయిన ఒక సన్యాసికావచ్చును. ఒరిస్సా ప్రాంతం నుంచి సింహాచలం రాకపోకలు చేసే వాడుకోవచ్చును. లేదా సంతూరులోనే అతనొక మఠంలో ఉండేవాడూ కావచ్చును. ఈ కువ్వారు కులశేఖరరావుగారూ హించినట్లే కుమారభవంకాచ్చును పదమధ్యమకారం ఆనునాసిక్యంతో వకారంగా పరిణమించటం అసంభవం కాదు. మామ మాఁవ అయింది. ఇల్లాగా కుమరాం కుఁవరాం (విశాఖ జిల్లాలోనిదే ఒక గ్రామం) అయింది. ఈ ఆనుసాసిక్యోచ్చారణ కళింగాంధ్రంలోనే అతిశయంగా కనబడుతుంది. తెలుగులో అర్ధబిందూచ్చారణం ఇక్కడే స్పష్టతరంగా వినబడుతుంది. అంచేత కృష్ణకుమార్ ని మనవారు కుమార్ కుఁవార్ కుంవార్ కుంవ్వారు అని ఉచ్చరించ వచ్చును. లేదా కృష్ణమాచార్యులాయనను కృష్ణకుమార్ అనే వ్యవహా రించితే పరంపరలో అది విపరిణామాన్ని పొంది ఉండనూవచ్చును. మొత్తానికీ కృష్ణకుమార స్వామి తెలుగు వారనితోచదు. తరవాత, బలమైన సాక్ష్యం ఆయన ఒరియా దేశస్థులటానికే తోడ్పడుతుంది. ఇది కూడా సంతూరుకు తెలంగాణా సంబంధం కంటె కళింగాంధ్ర సంబంధాన్నే దృఢతరం చేస్తోంది. ఈ కృష్ణకుమార్ పేరునే కృతజ్ఞతా సూచకంగా కృష్ణమాచార్యులకు అతని తల్లి దండ్రులు పెట్టిఉంటారేమో:

సింహగిరి వచనాలు - ప్రక్రియా ప్రాథమ్యం<

ఆంధ్రభాషలో కావ్యరచనకు శ్రీకారంచుట్టిన నన్నయగారు చంపూప్రాయంగా భారతాన్ని సంతరించేరు. సంస్కృతంలో అనూచానంగా వస్తున్న కేవలపద్యకావ్య పద్ధతికంటే సమకాలీనంగా భోజరాజవలంభించిన చంపూ పద్ధతే ఇంపుగా కనపడ్డట్టుంటాయనకు. తిక్కనగారు చివరకు నన్నయగారి మార్గాన్నే అనుసరించినా మొదట్లో నిర్వచన పక్కిననుసరించి తెలుగులో

20

ఒక విశిష్ట సంప్రదాయం నెలకొల్పేరు. కృష్ణమాచార్యులు సంస్కృతానుసారంగా కేవల పద్యపద్ధతిగాక, నన్నయగారి ననుసరించి చంపూ పద్ధతిగాక, వచన శైలిలో కవితా గానం వెలయించేరు. ఈ పద్దతికి తెలుగులో ఈయనే ఆద్యులు.

సింహగిరివచనాలు - గద్యతయపూర్వరంగం

అప్పటికే శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రతిష్ఠాపనాచార్యులైన శ్రీ మద్రామానుజులు సంస్కృతంలో గద్యత్రయ బంధం కటాక్షించేరు. ఈ గద్యత్రయం శ్రీ వైష్ణవులకు నిత్యాను సంధేయంగా ఉపాదేయం. శ్రీ వైష్ణవులూ విశేషించి శ్రీమద్రామానుజులయందు ప్రగాఢ ప్రతిపత్తి కలవారూ అయిన కృష్ణమాచార్యులు గద్యత్రయాన్ని పలుమార్లు మననం చేసుకోవటం లోనూ, కవనశీలురూ దేశభాషాభిన నిష్టులూ అయిన ఆయన దాన్ని ఒరవడిగా గ్రహించి తెలుగులో కావ్యం వెలయించటంలోనూ అబ్బురం ఏమీ లేదు. "యామునార్యసుధాంభోధిమవగాహ్య" అని శ్రీమద్రామానుజులు తాము చెప్పినట్లే భగవద్యామునమునుల స్తోత్రరత్న శ్లోకవాక్య గర్భితంగా గద్యను వెలయించటంవల్ల అందులో చక్కటి వృత్త గంధిత విలసిల్లింది.

కృష్ణమాచార్యులు సహజంగా గాయకులు, బఁధురభక్తి భావంతోపాటు సుమధుర కంఠనాదం కూడా ఆయన సొమ్మై ఉంటుంది. అంచేత లయతాళాను గుణంగా, రాగభావం ప్రస్పుటం ఆయేటట్లు వృత్త గంధి వచనాలతో సంకీర్తనం ప్రారంభించి గద్యత్రయంకంటే మరో మెట్టు పైకే వెళ్ళేరు . గద్యత్రయం పాఠ్యంగా మాత్రమే ఉండగా 'సింహగిరి వచనాలు' సంకీర్త్యమాణాలుగా, గేయాలుగా కూడా ప్రశస్తి కెక్కేయి అంటే ఇవి "తోలి తెలుగు వచన గేయా"లన్నమాట, గద్యత్రయం దీర్ఘ సమాసభూయిష్ట శైలీ విలసితం. కృష్ణమాచార్యులు సమాసాలుక్వాచిత్కంగా వాడినా దేశ తెలుగు పలుకుబళ్ళ ఆయనలో హెచ్చు. ఇది తత్కాల దేశవాసనా విజృంభణ ప్రభావాన్ని సూచిస్తుంది. గద్యత్రయంలో లక్షిపతియతిపతుల సంవాదం ప్రసక్తం. ఈ వచనాల్లోనూ సింహగిరి పతితో కృష్ణమాచార్యుల సంభాష

21

ణలు ఉంటాయి. వృత్తగంధి వాక్యాలు గద్యత్రయంలొ కొకొల్లలు ఈ వృత్త గంధులు విశేషంగా ఉండటమేకాదు రాగభావస్ఫోరకంగా, తాళానుగుణంగా, గాన ప్రయోజకంగా ఇవి అవతరించటంవల్ల వీటి జీవలక్షణమే వృత్త గంధిత. స్వయం వ్యక్తిత్వం కలవారవటంవల్ల కృష్ణమాచార్యులు కేవలం అంధానుసరణం చేయకుండా ఎక్కడ చూసినా తమముద్ర ప్రస్ఫుటంగా కనపడేటట్లు విలక్షణమైన శైలిలో వచనాలు వెలయించేరు.

సింహగిరివచనాలు - ప్రతులు

ప్రస్తుతం ముద్రితం అయిన ప్రతి తంజూపూరి సరస్వతీ మహల్ పుస్తకభాండాగారంలో విష్ణు నామసంకీర్తసఫలం అన్న పేరుతో ఉన్న D. No, 803 తాళపత్రప్రతి. ఇందులో 60 వచనాలు ఉన్నాయి. ఇది కాక 'మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో 'సింహగిరి నరహరి వచనాలు' అన్న పేరుతో ఒకతాళపత్రప్రతి ఉన్నట్లు కాట్యలాగువల్ల తెలు స్తోందని, కానీ దాన్ని గురించి మదరాసులో విచారించగా దాన్ని తిరుపతికి తరలించేరన్నారనీ, తీరా తిరుపతిలో విచారిస్తే అది అక్కడకు చేరనేలేదన్నారనీ డా౹౹ కుల శేఖరరావు గారు అంటున్నారు ఈ నిర్లక్ష్యం తిరుపతి వారిదో మదరాసు వారిదో తెలియదు. ప్రథమాంధ్ర వచనకావ్య ప్రతిపోగోట్టు కోవటం సాహిత్య పరంగా ఎంతటి మహానష్టమో ఇప్పటికీ మనవారు గుర్తించినట్టు కనపడదు. మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంవారి క్యాటలాగులనుబట్టి కృష్ణమాచార్య వచనాలుండదగిన లిఖిత గ్రంధాలు 5 కనపడుతున్నాయి. ఇందులో ఒకటి ఇందులోనే మరోగాని ప్రత్యంతరం అంచేత నాలుగు విభిన్న ప్రతులు కృష్ణమాచార్యులకు సంబధించినవి ఉన్నాయన్న మాట, వాటివివరాలు ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

మద్రాసు పాచ్యలిఖిత పుస్తక భాండాగారం ప్రతులు

1 సింహగిరి నరహరి వచనములు. తాళపత్రప్రతి. నెం, 1484 14-3/4" X 1-1/4" :పరిమాణములో 11 పేజీలు. (బహుళ: 11 ఆకులు

22

కావచ్చునేమొ) పుటకు ఐదు పంక్తులున్నాయి. నెం. 1398గా ఇది Ante లో వర్ణింపబడ్డది. ఉదాహృత వచనం ముద్రితవచనాలతో సంవదిస్తోంది. ఇదే కుల శేఖరరావుగారు పేర్కొన్న పోయిన ప్రతి.—— దీనివివరాలు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంవారు 1937లో ప్రకటించిన డిస్క్రిప్టివ్ కాటలాగు ఆరవ సంపుటం వచనకావ్యాల్లో 1779వ పుటలో ఉన్నాయి.

కృష్ణమాచార్య సంకీర్తనము

కాగితపు ప్రతి. ఆర్. నెం. 1034. 9-1/2 X 10-1/2 పరిమాణములో ఉంది. 1933-34 సంవత్సరాల్లో డి. నెం. 2946 వ్రాతప్రతి నుంచి ఉద్ధరించేరు. అసమగ్రం. దీనివివరాలు 1949లో ముద్రింపబడ్డ మద్రాసు ప్రా. లి. పు. భాండాగారంవారీ ట్రయన్నియల్ క్యాటలాగు ఆరవ సంపుటలో 2237వ పుటలో ఉన్నాయి. ఇందులో ఆర్. నెం. 813 నుంచి 1064దాకా ఉన్న గ్రంధాల వివరాలున్నాయి. ఉదాహృతవచనంలో కృష్ణమాచార్యముద్ర (సింహగిరినరహరి నమో నమోదయానిదీ) కనపడలేదు. కాని మిగతా కృష్ణమాచార్యవచన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆయన పేరూఉంది ఇందులో. కృష్ణమాచార్య కర్తృత్వ సాధనాలుగా మరి రెండు విషయాలు ఇందులో కనబడుతున్నాయి. 1. విదురునింటి విందా, పాండవపక్షపాతీ వంటి సంబోధనాలు. 2. శ్రీరాఘవేశ్వర. కృష్ణకుమార సంభోధనలు, మొదటి రెండు సంబోధనలూ ముద్రితవచనాల్లోనూ ఉన్నాయి కృష్ణ కుమారుడు——ముద్రితవచనాల్లో ఉన్న కృష్ణ కువ్వారుస్వామికాని మరొకరుకాదు. ఇక రాఘవేశ్వర సంబుద్ధి. ఇది కేవలం రఘునాధపరం కాదు. కృష్ణకుమారస్వామిలాగే

యీ రాఘవేశ్వరస్వామి లేక రాఘవస్వామి కృష్ణమాచార్యులకు గురుస్థానీయులనితోస్తుంది, ముద్రిత వచనాల్లో 13వ వచనంలో “రాఘవభాష్య విశేషసుధామృత సంజీవనిష్ఠ" అనే ఒక ప్రయోగం యీ సందర్భంలో గమనించాలి. ఈ“రాఘవభాష్య" కర్త ఆ "రాఘవేశ్వరుడే కావచ్చును. ఈతనితో ఆచార్యులవారి సంబంధం ఎలాంటిదో అసలీయన ఎవరో తెలుసుకోవాలి. ఏమయినా యీ గ్రంథం కృష్ణమాచార్య వాజ్మయ దృష్టితో పరిశీలించదగింది.

23

కృష్ణమాచార్య సంకీర్తనము

కాగితపు ప్రతి. సమగ్రం. వరుస నెం. 655 ఆర్. నె. 206. 1911-15 సంవత్సరాల్లో గ్రంథాలయం వాతప్రతి నుంచి ఉద్ధరింపబడింది. 1917లో ముద్రింపబడ్డ మద్రాసు ప్రా. లి. పు. భాండాగారంవారి ట్రయన్నియర్ క్యాటలాగు రెండవసంపుటం మూడవభాగం (తెలుగు) లో ఈ వివరాలున్నాయి. ఉదాహృతవచనాన్ని పట్టి పైన పేర్కొన్న గ్రంధంయిదీ ఒక్కటిగానే కనపడుతున్నాయి.

కృష్ణమాచార్య సంకీర్తనము

తాళపత్ర ప్రతి. సమగ్రం, వరుస నెం. 654 బీరువా వివరాలు 11_1_5. ఈ వివరాలు 1932 లో ప్రకటితమైన "తెలుగు" లిఖిత గ్రంథాల ఆకారాది సూచిక" 31 వ పుటలో ఇవ్వబడ్డాయి. డిస్క్రిప్టివ్ క్యాటలాగుల్లో మరి దీని వివరాలు కనబడలేదు.

కృష్ణమాచార్య సంకీర్తనము

తాళపత్రప్రతి, సమగ్రం, ఆర్ 4476 (25) ఆర్ 206 వంటిదే అని యిక్కడ వివరణ వ్రాసి వుంది. కృష్ణమాచార్య ప్రశంసాపరమైన పుస్తకం ఇది అని క్యాటలాగు వారూ, విమర్శకులూ భావిస్తున్నారు. కాని కృష్ణమాచార్య వాజ్మయ లక్షణాలు ఇందులో చాలా ఉన్నాయి. ఉదాహృత భాగంలో ముద్రలేదు. దేవా అన్న సంబోధన, కృష్ణమాచార్యుల పేరు ఉన్నాయి. అంతంలో "ఈ దివ్యనామ స్మరణం యెవరు వ్రాసినా యెవరు చదివినా యవరు విన్నా” అని ఉంది. దీన్ని బట్టి యిది కృష్ణమాచార్య సంకీర్తనమే కావచ్చును. ఆయన మహత్వాన్ని ఓరుగంటితో ఆయన సంబంధాన్ని సూచించే వచనం ఒకటి ముద్రిత ప్రతిలోనూ ఉంది. కృష్ణమాచార్యుల మహత్త్వాన్ని ఇతరులే చెప్పక్కర్లేదు ఆయనే చెప్పుకోగల రనటానికి ఆయన వచనాలే సాక్ష్యం. కృష్ణమాచార్యులు ప్రధమ పురుషలో

24

ప్రస్తావింపబడ్డంత మాత్రంచేత ఇది పరకర్తృకం కానక్కర్లేదు. ఈ ప్రథమ పురుష వ్యవహారం నన్నయగారిలో పోతరాజు గారిలో కూడా చూసినవారికి కృష్ణమానార్యుల్లోనూ విచిత్రం కాదు. ముద్రిత వచనణాల్లోనూ ప్రథమ పురుష వ్యవహారం ఉంది. కాకపోయినా ఆయనను గూర్చిన గ్రంథంగానైనా దీని విలువలను తెలుసుకొని ఉపయోగించుకోవాలి.

శ్రీ ఆరుద్ర వచనం

ఇవి యిల్లా గుండగా శ్రీ తిమ్మావఝ్ఝల కోదండరామయ్యగారు కొన్ని సింహగిరి నరహరి వచనాలు సేకరించి ముద్రణానుకూలంగా సిద్ధం చేసి ఉంటారని శ్రీ ఆరుద్రగారు అంటున్నారు. 1952 లో శ్రీ తిమ్మావఝ్ఝలవారి భారతి వ్యాసం నేనూ చూసేను, కాని ప్రస్తుతం అది నాకు లభించలేదు. దాన్ని గూర్చిన ప్రత్యభిజ్ఞా చాలటం లేదు. శ్రీ ఆనందమూర్తి వ్యాసమూ భారతుల్లోనే చూసిన గుర్తు ఖచ్చితంగా పరామర్శింపలేకపోతు న్నాను, శ్రీ ఆరుద్రగారు "సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర" పద్మనాయక యుగంలో కృష్ణ మాచార్యుల వచనం ఒకటి ఉదాహరించేరు. తంజావూరి నుంచి తాము వచనాలు వ్రాయించి తెప్పించుకొన్నట్లు శ్రీ ఆరుద్రగారు తెలుపుతున్నారు. కానివారిచ్చిన ఆ వచనం తంజావూరి ప్రతిలోదికాదు. తంజాపూరిలో సింహగిరి నరహరి వచనాలు. "విష్ణు నామ సంకీర్తన ఫలం"

అన్న పేరుతో ఉన్నట్లు శ్రీ ఆరుద్రగారు పేర్కొన్నారు. ఆ "విష్ణు నామ సంకీర్తన ఫలాన్నే" డా! కుల శేఖరరావుగారు ప్రకటించేరు. దాని కాగితపు వ్రాతప్రతి. 1947 లో వ్రాయించినది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులోనూ ఉంది. శ్రీ ఆరుద్రగారు తమకావచనం ఎక్కడ లభించిందో సరిగా చెప్పలేదు. మద్రాసులోని సింహగిరి వచనాల సంగతి వారు ప్రస్తావించలేదు. వారు కృష్ణ మాచార్యుల్ని గూర్చి చెప్పిన విషయాలకు శ్రీ కోదండరామయ్య గారే ప్రమాణం అని వారి వ్రాతలవల్ల తెలుస్తోంది. ఈ వచనం శ్రీ కోదండరామయ్య గారి దగ్గరనుంచి కాని శ్రీ ఆరుద్రగారు స్వీకరించేరో లేక తామే

25

మద్రాసు భాండాగారంలోంచి సంపాదించేరో తెలియదు. తంజావూరినుంచి వ్రాయించి తెప్పించుకొన్న “విష్ణునామ సంకీర్తనఫలం"లో వచనం ఉదాహరించకుండా అవిజ్ఞాతజన్మ కారణ రహస్యమైన యీ వచనాన్ని ఉదాహరించటంలో వారి ఊహ ఏమిటో ! ఒక వేళ ఈవచనాన్నే శ్రీ కోదండరామయ్యగారో, శ్రీ ఆనందమూర్తి గారో భారతుల్లో వెనక ఉదాహరించేరేమో స్మృతికి రావటం లేదు. శ్రీ ఆరుద్రగారి వ్రాతలవల్ల, వారిచ్చిన ఉదాహరణ వచనంవల్లా శ్రీ కోదండరామయ్య గారు మద్రాసు 'సింహగిరినరహరి వచనాల'ను సేకరించే ఉండిఉంటారని నేనూ మొదట్లో భావించేను. శ్రీ కోదండరామయ్య గారు మద్రాసు ప్రతు లెరగనివారుకాదు. కాని తమవద్దే ఆ వచనాలుంటే రెండు దశాబ్ధాలుగా వాట్ని 'వెలుగులోకి తేకుండా ఊరుకొంటారా శ్రీ కోదండ రామయ్యగారు అని మళ్ళీ సందేహమూ కలుగుతోంది, మద్రాసు ప్రతి అక్కడ లేకుండా, తిరుపతి చేరకుండా, చివరకు సింహగిరి వచనాల ప్రతి ఎక్కడా లేకుండా పోయిన యీ గడ్డుకాలంలో, 1952లోనో అంతకు పూర్వమో మద్రాసు మాతృకకు ప్రతి వ్రాసుకొని ఉంటే శ్రీ కోదండరామయ్యగారే కృష్ణమాచార్య వాజ్మయ పోషణకు తోడ్పడాలి. 1[1]వారు తాము సేకరించిన ముద్రిత ప్రతి భిన్నాలైన వచనాల్ని యథాతథంగా నైగా పత్రికాముఖంగా ప్రకటిస్తే 'పరివర్ధిత సింహగిరి వచనాల' ముద్రణకు అవకాశం ఉంటుంది. కృష్ణమాచార్యులను గురించి ఏమేనా మరికొంత చెప్పే అవకాశమూ ఉంటుంది. 2[2]

'సింహగిరి నరహరి వచనాలు' అన్న పేరుతోనే ఉన్న పుస్తకం కనపడక పోవడం, నాటినుంచీ ప్రథమాంధ్ర వచన కావ్యరచయితకు తెలుగు దేశంలో జరుగుతున్న అమర్యాదకు తార్కాణ. ఇందుకు బాధ్యులైనవార్ని

26

ఆంధ్ర ప్రజ ఉపేక్షించటం మరీ సహింపరానిది. ద్రావిడాభిజాత్యంగల శ్రీ వైష్ణవకుటుంబాల వారూ, వర్ణవ్యవస్థమీద అవర్ణ్యమైన భక్తిశ్రద్ధలుగల అగ్రవర్ణాల విద్వాంసులూ, చివరకు నేటి పరిశోధకులూ, 'సంపాదకులు' కూడా ఏదోరకంగా తెలిసో తెలియకో ఆయనపట్ల అపచారపడుతున్న వారే.

శ్రీ విశ్వనాధ - విచిత్రచర్య

ఈ సందర్భంలో “ఒక విచిత్రోదంతం." ఆంధ్రప్రజల ముందు విన్నవించుకొంటున్నాను. ఆంధ్రసాహిత్య అకాడమీవారు కళాప్రపూర్ణ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ (ప్రభృతుల) గారి సంపాదకత్వంలో “ఆంధ్ర గద్యచంద్రిక " అని ఉదాహరణ ప్రాయమైన ఆంధ్రవాజ్మయ గద్యభాగ సంకలన గ్రంథం ఒకటి ప్రచురించేరు. ఇంతకు ముందే ఎప్పుడో ప్రధమాంధ్ర వచన కావ్యరచయితగా పేర్కొనబడ్డ కృష్ణమాచార్యుల వచనం మచ్చుకు ఇందులో లేకపోవటం ఆంధ్రత్వానికి గర్వకారణం ! సంపాదక వర్గ నాయకులు ఆంధ్రప్రభుత్వాస్థాన కవులు: గ్రంథం ప్రకటించినవారు పరిగణింపబడ్డ ఆంధ్ర సాహిత్య అకాడమీవారు: పుస్తకమా ఆంధ్రగద్య చంద్రిక: ఈ ఆంధ్రత్రివేణీ సంగమంలో అవగాహనం మాట అలా ఉంచండి పుడిసెడు తీర్థం పుచ్చుకొనేందుకు అర్హత సంపాదించుకోలేకపోయేడు ప్రధమాంధ్ర వచనరచయిత. ఈ చంద్రికలోనే చూడలేకపోతే ఎక్కడో మారుమూల చీకట్లలో ఉన్న సింహగిరివచనాల్ని అసలు చూడగలరా తెలుగుజనం. ఇందులో అజ్ఞాత కర్తృకాలూ అర్వాక్కాలికాలూ అయిన 'భవానీ మనోహర వచనాలు' మొదట ఇచ్చేరు. ఈ ప్రాథమ్య హేతువు తెలపలేదు. తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వైరాగ్యవచన మాలికాగీతాల్లోని తొలి

వచనం అజ్ఞాతకర్తృకంగా రెండోదిగా ఇచ్చారు. మరీ అర్వాక్కాలికమూ దీవి కృష్ణమాచార్య కర్తృకమూ అయిన 'శఠకోపవిన్నపముల'లోని ఒక విన్నపం మూడోదిగా ఇచ్చేరు. నేనెరిగినంతవఱకూ చివరి రెండూ ముద్రితాలు. వీటి రెండింటి మీదా కృష్ణమాచార్యుల ప్రభావం ప్రస్పుటంగా ఉంది

27

శ్రీ రఘువీరగద్య ఆంధ్రంకాదు

దీనికితోడు ఇందులో మరో “అఘాయిత్య " ఏమిటంటే కవితార్కిక సింహులు. సర్వతంత్రస్వతంత్ర బిరుదాంచితులు; శతాధిక గ్రంధకర్తలు వేదాంత దేశికవిఖ్యాతులు అయిన శ్రీమద్వేంకటనాధ కవులు సంస్కృతంలో చెప్పిన "శ్రీరఘువీరగద్య" ని అజ్ఞాతకర్తృకంగా ఆంధ్రగద్యచంద్రికలో ఉదాహరించేరు సంపాదకులు. గీర్వాణవాజ్మయాన్ని మనం ఎంత కొల్లగొట్టుకు అనుభవిస్తున్నా ఇంతదురన్యాయమా? ఇది అన్యాయ దురాక్రమణంకాదూ? ఇతరభాషలవారు శ్రీరఘువీరగద్యకర్తృత్వాన్ని గుర్తించలేని మన గీర్వాణ సాహితీ పరిచయాన్ని పరిహసించరూ ? ఇహవేదాంత దేశికులు తెలుగువారనో, ఆయన తెలుగులోనే యీ గద్యం వ్రాసేరనో, లేకపోతే మన ఆంధ్రకవివృషధులెవరో వ్రాసీన తెలుగు గద్యనే శ్రీమద్వేదాంత దేశికులు స్వీకరించి ఉంటారనో చిత్రచిత్ర సిద్ధాంతాలని ప్రతిపాదించాలి. దేశికులకు రమారమి నాలుగుపదులు ముందున్న కృష్ణమాచార్యులు 1945 నుంచి పత్రికల్లో ప్రధమాంధ్ర వచన కవితాచార్యుడుగా కీర్తింపబడుతున్నా ఆయన వచనం ఆంధ్రగద్యచంద్రికలో లేకపోవటం ఆత్మవంచన; ఇది పరవంచన.

సింహగిరివచనములు - స్వరూప స్వభావాలు.

ఇప్పటికి ముద్రితవచనాలు 60, వీటిలో కొన్ని సామాన్య లక్షణాలతో కొన్ని విశేష లక్షణాలూ ఉన్నాయి, ప్రతివచనం దేహఅనే సంబోధనతో ప్రారంభంఅయి, 'సింహగిరి నరహరీ నమోనమోదయానిధీ 'అనే మకుటంతో ముగియటం సామాన్యలక్షణం. ఈ మకుటంలో కొన్ని చోట్ల “మాయతి రామానుజముని పరందాతారు అని 'కృష్ణకువ్వారుస్వామీ' అనీ ముందు

చేరటంకద్దు. వచనానికి ఏకరూపమైన పరిమితి పాటించినట్టు కనబడదు. "ఆలాపవర్ణనలతో నమోనారాయణాయని విష్ణునామ గుణ కథలు వచన భావంబున కీర్తించను. ఘుమఘుమ ధ్వనులు మ్రోయగాను దండెమీటుచు తాళంబులుగ్గడించుచు పంచమవేదస్మృతులును చాతుర్ల క్షగ్రంధ సంకీర్తన వాక్ఫూజలును చేయంగాను" అనేవాక్యాలవల్ల రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడేవని తెలుస్తోంది.

28

నవరత్న పంచరత్న కీర్తనలు

ఇవికాక "సింహాద్రియప్పని సంకీర్తన చేయుచున్నపుడు నవరత్న పంచరత్న సంకీర్తనల జెప్పగా" అనటంవల్ల, నేటికాలంలో త్యాగరాజాదుల పంచరత్న కీర్తనలు ఛందోబద్ధాలుగా కనపడుతూన్నందువల్ల, కృష్ణ మాచార్యులుకూడా ఛందోబద్ధాలైన నవరత్న పంచరత్న కీర్తనలు రచించి ఉంటారనీ తోస్తుంది. వాటి స్వరూపస్వభావాలను గురించి ప్రస్తుతం చెప్పలేం. రాగతాళ సమాశ్రయాలూ, ఛందోబద్ధాలూ అయిన కీర్తనలూ గీతాలూ కృష్ణమాచార్యులు రచించి గానం చేసేవారనటానికి మరో ప్రమాణం ఆయన వచనాల్లోనే కనపడుతోంది. కోడిపుంజుల యుద్ధాన్ని వర్ణిస్తూ దాని కుపమానంగా ఒక గీతం ఉదాహరించేరాయన -ఘటితముఖవరదధిత సంధిత కౌస్తుభాంశు.. మకుట కఠోరవందిత కుంభినీజయ శోభితమ్ కనక ఘనపీతాంబరాచ్యుత కౌస్తు భాజయశోభితమ్. గీత డోలక ఆదిజం కిణికి ణింకిణి కిణికిణింకిణి కిణికిణీంకిణి కిణికిణింకిణి—— దేవా అనాథపతి స్వామీ సీంహగిరినరహరీ" దీన్ని పట్టిచూసినా ఆయన ఇటు వచనగేయాలూ అటు రాగతాళానుగుణాలైన గీతాలూ కూడా రచించేరని చెప్పవచ్చు.

చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలు

కృష్ణమాచార్యుల వాజ్మయ పరిమితిని గురించి ప్రస్తుతం చెప్పదగ్గ సాక్ష్యం ఏమీలేదు. ఆయన చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్పూజలు చేస్తున్నట్లు చెప్పుకొన్నారు. పలుతావుల్లో. "గ్రంథం" "అంటే 32 మాత్రలనే సంప్రదాయత మనకు ఉంది. మనవారు గ్రంథ పరిమితిని "గ్రంథ" ప్రమాణంతోనే చెప్పేవారు. తమిళంలోనూ దివ్యప్రబంధవ్యాఖ్యాన సంప్రదాయంలో గ్రంథ ప్రమాణ పరిగణనం పరిపాటిగా ఉంది. తమిళంలోకాని సంస్కృతంలో కాని ఏదీ లక్ష దాటినట్టు కనపడదు. భారతమే మనకు లక్ష గ్రంథం. గుణాఢ్యుని బృహత్కథ ఏడులక్షలనీ కధ. కృష్ణ మాచార్య సంకీర్తనం 'పంచమ వేదానికి

చతుర్గుణం అన్నమాట! ఈ నిక్షేపం అనుభవించటానికి తెలుగువారు కాచుకోన్నరో లేదో మరి. పోనీ 'చాతుర్లక్ష' ని లక్షక శబ్ధంగా పరిగణించె

29

అవకాశం ఉందా అంటే అదీ కుదరటం లేదు. పొతకమూరి భాగవతుల ప్రసంగంలో అప్పటికీ చాతుర్ల క్షలకు లక్షౌఏభై వేలు కొఱత అంటున్నారాయన దీన్ని బట్టియిది వాచకమే అనటంలో అనుమానం అక్కరలేదు. కృష్ణమాచార్యులనాడు గంటంతో తాటాకుల మీద వ్రాసుకొనే అలవాటుంది. ఒకానొక సందర్భంలో ఆయన స్వామి సన్నిధిని గానం చేస్తూండగా స్వామి బాల రూపంతో వచ్చి ఆయన తొడమీద కూర్చొని గంటంతో తాటాకుమీద ప్రాయసాగేడట:. దీన్ని పట్టి అంతకుముందు వ్రాయకుండా ఆశువుగా ఎప్పటికప్పుడు తోచినట్టుగానం చేసే అలవాటున్నా ఈ సంఘటన తరవాత నైనా వ్రాయించాలన్న ఊహ ఆయనకు తోచి ఉండాలి. అంతదాకా అక్కర్లేదు 'చాతుర్లక్ష' అనగానే, సంఖ్యాపరిమితి పెట్టుకోగానే వ్రాయించే ఉంటారనేది నిర్వివాదం. అయితే యీవ్రాయించటం తామ్ర పత్రాలమీదేనా? తాళపత్రాల మీద కూడా వ్రాయించి ప్రచారానికి వీలు కల్పించేరా? అన్నదో ప్రశ్న. కొన్ని తాళ పత్ర గ్రంధాల్లో ఫలశ్రుతిగా సంకీర్తన మహత్వం చేపుతూ “ఎవరు వ్రాసినా" అని ఉన్నందువల్ల ఆయన కాలంలోనే యివి ప్రోత్సహింపబడి దేశంలో వ్యాపించి ఉంటాయి. అయితే ఏ ఒక్కరూ చాతుర్లక్షనూ వ్రాసే అవకాశం ఉండక పోవచ్చు. చాతుర్ల క్షలూ ఉన్న తాళ పత్రప్రతి ఉండే అవకాశం కాని అది మనకు లభించే అవకాశం కాని లేక పోవచ్చు అక్కడికి మిగిలిన ఆశ అల్లా తామ్రపత్రికల నిక్షేపం మీదే.

తామ్రపత్రికలు

రాగిరేకులు చేయించి వాటి పై కీర్తనలు చెక్కించి వాట్ని కృష్ణమాచార్యులు శ్రీ. న తీసుకుపోయినట్లు ప్రతాపచరిత్ర చెప్తోంది. కృష్ణమాచార్యులవారు తమ చాతుర్లక్ష సంకీర్తనల్ని తామ్రపత్రికల మీద చెక్కించి హరి సమర్పణంగా స్వామి భండారానకు సమర్పించి భావితరాలవారి కోసం స్వామిప్రసాదంగా, భాగవత శేషంగా వాట్ని నిక్షేపించినట్టు దీనివల్ల తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రతాపచరిత్రను జాగ్రత్తగా పరిశీలించాలి ఈ విషయం ఇంతకు పూర్వమే విన్నవించేను. ప్రతాప చరిత్రతో పాటు

30

అన్ని విధాలా కృష్ణమాచార్యులకు వారసులన దగిన తాళ్ళపాక వారు తామ్రపత్రికలు వేయించటమూ, కృష్ణమాచార్యులు తప్పకుండా తామ్రపత్రికలు వేయించే ఉంటారనటానికి అవార్యమైన అనుమానప్రమాణంగా కనపడుతోంది. తాళ్ళపాకవారి తామ్రపత్రిక పెన్నిధి బయటపడ్డట్టే ఆచార్యులవారి తామ్రపత్రికల నిక్షేపమూ బయటపడాలి. తెలుగు సరస్వతికి శాపవిమోచనం ఎప్పటికో:

తెలుగు వేదం - వచనాలు

కృష్ణమాచార్య వచనాలకు వేదప్రామాణ్యం, తౌల్యం అందులోనే ప్రతిపాదించబడింది. తన సంకీర్తనల్ని పంచమ వేద స్మృతులుగా భావిస్తారాయన. వాటిలో వేదం ఉన్నదంటారా మహానుభావుడు. అవి వేదమే అంటారు కొన్నిచోట్ల. ఇట్లా పంచమవేదస్మృతి ద్వారాను, ఋగాదివేద ప్రామాణ్య ప్రతిపాదనంద్వారాను వాటి విశిష్టతని ఆయనే ప్రకటించేరు. వేదం ఎట్లా పరతత్త్వ ప్రతిపాదకమో. ఉపనిషత్తులు ఎట్లా పరబ్రహ్మస్వరూప నిరూపకాలో ఆయన వచనాలూ అట్లాగే పరతత్వం అయిన శ్రీమన్నారాయణుని స్వరూపరూపగుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కావటంవల్ల ఇవి వేదతుల్యాలు - తెలుగు వేదాలు ఆయేయి.

తమిళ వేదం శఠకోపులు

ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ద్రావిడ వేదం ఆయిన యిర దివ్యప్రబంధం విషయంలో, ముఖ్యంగా శ్రీ శఠకోపసూరుల విషయంలోనూ ఇట్లాంటి సమన్వయమే ఉంది. “వేదంతమిళ్ శెయ్దమారన్ శఠకోపన్" అని వేగాన్ని తమిళం చేసినవారుగా ఆయనకు ఖ్యాతి ఉంది. అంటే చతుర్వేదాలనూ లేకత్రయిని, లేక ఏదో ఒక వేదాన్ని యథామూలంగానో, ఛాయగానో, స్వతంత్రంగానో తమిళ భాషలో అనువదించేరనికాదు. ఇంతకు ముందు చెప్పినట్టే అఖిల హేయప్రత్యనీక కల్యాణ గుణైకతానుడు. త్రివిధ కారణ భూతుడు, చిదచిత్స్వరూపుడూ అయిన శ్రీమన్నారాయణని స్వరూప రూపగుణ విభవాది కీర్తనంలోనే వేదప్రామాణ్యం, తౌల్యమూను. ఈ ప్రామాణ్యంతోనే తరవాతవారు వేదాలకులాగే తమిళవేదానికి ఒక వింగడింపూ, అధ్యయన పద్ధతి, అక్కడి స్వరపద్ధతికి దీటుగా ఇక్కడ నియతరాగతాళగాన పద్ధతి, దాని స్వస్తి విధానానికి ప్రతిబందిగా సేవాకాల విధానం-ఇట్లు ఏర్పరిచి ద్రావిడవేదమనీ, ద్రావిడవేదాంతమనీ సుదృఢమయిన వ్యవస్థను రూపొందించేరు. అల్లాంటి వ్యవస్థయేదీ లేకపోవటంవల్లా తరవాతి వారి ప్రోత్సాహం లభించక పోవటమేకాదు కొందరు దురర్థసంప్రదాయానుయాయుల మౌర్ఖ్యం పెద్ద అవరోధం కావటంవల్లా, సువ్యవస్థగానో అవ్యవస్థగానో వేదప్రమాణాలుగానో ఏదో అప్రమాణంగానో అసలాయన వచనాలు నిలిచి తెలుగు జాతికి లభిస్తే బాగుండుననేటట్టుంది యిక్కడి స్థితి.

తమిళవేదం - దేశిదృక్పథం

ఆళ్వారుల దివ్యప్రబంధాన్ని 'ద్రావిడవేదం' అనటంలో-వారు బంధురభక్తిభావ పారవశ్యంతో పరమేశ్వరుణ్ణి కీర్తించటంతో వారిపై పేర్కొన్న బ్రహ్మాండమైన భక్తిభావం తదనుయాయులచేత అట్లా పలికించింది. రెండోది-ఆళ్వారులు కృష్ణభక్తి సంప్రదాయాన్ననుసరించటం. తమిళంలో పాడటం, వారు పరస్పరం, వారందర్నీ తరవాత వారూ, వర్ణవ్యవస్థాపరిధుల్ని అతిక్రమించి గౌరవించి అనుసరించటం, వేదానికి ప్రతిద్వంద్విగా, ప్రతికోటిగా ద్రావిడ-వేద-వేదాంత వ్యవస్థ ఒకటి నెలకొల్పటం ఇవన్నీ మౌలికంగా భాగవత సంప్రదాయంలోనూ, తమిళభాషా వాఙ్మయచరిత్రలోనూ ఉండే స్వతంత్రచ్ఛాయల్నీ, దేశితనాన్ని విస్పష్టంగా ప్రకటించుతాయి. అంతర్యవనికంగా ఇంత వ్యవహారం తమిళవేదానికి ఉన్నది. ఈ దృష్టితోనే కృష్ణమాచార్యుల తెలుగువేదాన్నీ మనం పరిశీలించాలి.

తెనుగు వేదం - విమర్శకుల అపార్ధం

మొట్టమొదట కృష్ణమాచార్యుల వాఙ్మయాన్ని తెనుగువేదంగా పేర్కొన్నఘనత తాళ్ళపాక తిరువెంగళనాథునిది. “వేదంబు తెనుగు గావించి సంసారఖేదంబు మాన్చిన కృష్ణమాచార్యు" అని అతడు పూర్వాచార్యసంస్మరణం చేస్తూ అంటాడు. అయితే ఇక్కడ మన విమర్శకులం దరూ ఒక చిత్ర విచిత్రమైన బ్రాంతికిలోనై “శఠకోపవిన్నపములు" అనే పేరుతో కనబడుతున్న విన్నపాలే కృష్ణమాచార్యుల తెనుగు వేదం అయి ఉండవచ్చుననే అభిప్రాయం ప్రకటిస్తున్నారు. కాని అది సరికాదు. వీరందరూ ఇట్లా పొరపడే ఆవకాశం ఇచ్చినవి పై పరమయోగి విలాస పంక్తులే. పూర్వవాక్యాలతో కలిపి వాటిని మరోమారు పరిశీలిస్తే యథార్థం అవగతం అవుతుంది. తొండమాన్ చక్రవర్తినీ, శ్రీమద్రామానుజుల భాగినేయుడు దాశరథినీ, శ్రీపరాశర భట్టార్యులనీ, అనందాళువార్నీ స్తుతించిన తరవాత,

శఠమత రాద్ధాంత సంహారియైన
శఠకోపమునిఁబోలు శఠకోపమౌని,
వేదంబు తెనుగుగావించి సంసార
ఖేదంబు మాన్చిన కృష్ణమాచార్యు.

అని పరమయోగి విలాస పంక్తులున్నాయి. శ్రీనిడుదవోలు వారిదగ్గరనుంచి శ్రీ ఆరుద్రగారివరకూ అందరూ ఇంచుమించు ఈ పంక్తుల్ని అపార్ధమే చేసుకొని, పూర్వపంక్తిలో ఉన్న “శఠకోపమౌని"ని యివతలకు ఈడ్చి ఆయన నెత్తిన వేదాన్ని మోపి, ఆ శఠకోపమౌనియొక్క వేదాన్ని తెనుగుచేసిన కృష్ణమాచార్యులనే తాత్పర్యం సంపాదించి "శఠకోపవిన్నపాలే"యీ తెలుగు వేదం అన్న చమత్కారమైన సిద్ధాంతం ప్రతిపాదించేరు. దీనికితోడు మరో అభాండధ్వనికూడానూ ఇక్కడ— ఈ శఠకోప విన్నపాలకు మాతృకామాత్రమే శ్రీ శఠకోపుల తమిళవేదం అని. మన పరిశోధక విమర్శకులు తాత్పర్యగ్రాహులేకాని ఆన్వయచణులూ చతురులుగా కనపడరు.

వారి ధోరణిలో అన్వయించినప్పుడేనా పై ఉద్ధారంలో రెండోపంక్తిలో ఉన్న ఉపమానవాచకం ఏంకావాలి? అదీగాక ఇద్దరు శఠకోపులు ఇక్కడ కనపడ్డంలేదూ ?

అసలు సమన్వయం ఇదీ.

శఠమతరాద్ధాంత సంహారియైన శఠకోపమునిఁబోలు.
     'శఠకోప' బిరుదాంచితుడైన నమ్మాళ్వారులకు సాటికాదగిన
శఠకోపమౌని(న్) - (అహోబలమఠాధిపతియైన ఆదివణ్ శఠకోపయతినీ.

అని ఇక్కడికీవాక్య ఖండంసరి. విడిగా వేదంబు తెనుగు గావించి సంసారఖేదంబుమాన్పిన కృష్ణమాచార్యుణ్ణీ, అని చెప్పి వీటికన్నిటికీ 'తలఁచి అంజలిగావించి' అని ముందరిక్రియతో ఏకాన్వయం చెప్పాలి. నమ్మాళ్వారుల్లాంటి ఆదివణ్ శఠకోపయతినీ, తెనుగు వేదం పలికిన కృష్ణమాచార్యుల్నీ తిరువెంగళనాథుడు స్తుతించేడు. అంతకు ముందే 'ఆళువారలను' విడిగా ప్రస్తుతించేడు. అయితే ఇక్కడ విమర్శకులకు మరో శంక కలిగి ఉండవచ్చు. వేదంబు తెనుగు గావించిన అంటున్నాడుగదా, ఎందులోనో ఉన్న దాన్ని గదా తెనుగు గావించటం. అంచేత శఠకోపమౌని వేదాన్ని కృష్ణమాచార్యులు తెనుగు గావించేడని శంకాపరిహారం చేసుకొని ఉంటారు వారు. అట్లావారు భావిస్తే శఠకోపమునిలాంటి శఠకోపమౌని యొక్క వేదాన్ని తెనుగు జేసినవాడు కృష్ణమాచార్యులు అని అర్ధం లభిస్తుంది. అప్పుడు ఉపమేయ శఠకోపు లెవరు? ఉపమాన శఠకోపు లెవరు? అన్న ప్రశ్నలు బయల్దేరతాయి. ఉపమాన శఠకోపులు ప్రాక్కాలికులు, ఉపమేయుల కంటే మహత్తరులూ కావాలిగద! ఉపమాన శఠకోపుల్ని ఎట్లాగూ నమ్మాళ్వారులనీ ఉపమేయ శఠకోపుల్ని ఇప్పుడేనా ఉపమానభిన్నంగా వ్యక్త్యంతరంగా కడకు ఆదివణ్ శఠకోపయతిగా అంగీకరించక తప్పదు. ఈ ఆదివణ్ శఠకోపయతికి వేదకర్తగా ప్రామాణ్యంకాని ప్రచారం కానీ లేకపోవటమేకాదు. ఈయన మన

కృష్ణమాచార్యులకు రమారమీ రెండు శతాబ్దాలు అర్వాక్కాలికుడు. ముందు పుట్టబోయే శఠకోపులు వ్రాయబోయే వేదాన్ని కృష్ణమాచార్యులు ముందే తెనుగు చేసేరంటారా, వార్ని ఆ శఠకోపులే వంచాలి. ఇక్కడ శఠకోపౌపన్యంలో సంబంధార్థం గ్రహించాలి. తిరువెంగళనాథుడే చక్కగా దీన్నిధ్వనించేడు. ఈ ధ్వనిమనవారు వినలేదు. ఉపమాన శఠకోపుల్ని శఠకోప‘ముని' అనీ, ఉపయేయ శఠకోపుల్ని శఠకోప 'మౌని' అనీ అభివర్ణించే రాయన. అంటే నమ్మాళ్వారుల్ని మునిఅనీ వణ్ శఠకోపుల్ని మౌని అనీ పేర్కొన్నాడన్నమాట. మౌని లోని తద్ధితార్థాన్ని ఇక్క డ విశేష దృష్టితో చూడాలి. మునిభావం మౌనం, అదికలవాడు మౌని ఇక్కడ మౌనం శఠకోప సంబంధం. అది గలవాడు శఠకోపమౌని. అంటే

34

నమ్మాళ్వారుల సంబంధం గలిగి ఆయనలాంటివాడే అయినవారు వణ్ శ్ఠకోపయతి అని సారస్యం. శ్రీవైష్ణవ భాగవతులందరూ తాము ఆళ్వారుల సంబంధుల మని చెప్పుకొంటారు. ఆ సంబంధంలోనే ఉంది వారి ఘనత. వణ్ శఠకోపయతి కూడా ఆళ్వారుల సంబంధం కలవారు అని యిక్కడిధ్వని. అయితే ఇంకా వేదంబు తెనుగు గావించిన అన్నప్పుడు 'మూలాధారా' ప్రశ్న అలాగే ఉంటుంది. మన విమర్శకులకు. సంస్కృత వేదమే తెనుగు గావించిన అని సమాధానం యిక్కడ. ఈ తెనుగు గావించిటంకూడా “నమ్మాళ్వారుల ' వేదంతమిళ్ శెయ్ ద' లాంటిదే. దీని సంగతి యింతకు ముందే విన్నవించేను. ఈ సంప్రదాయం తెలిస్తే కాని యీ అన్వయం నిర్వహించటం కుదరదు. మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంవారు. క్యాటలాగులో శఠకోపవిన్నపాలకు సూచిక వ్రాస్తూ తమిళానికిది అనువాదమనే భ్రాంతిని ప్రకటించు కొన్నారు. ఆ భ్రాంతి విలసిత వాక్యాలే పై దురన్వయానికి మన విమర్శకుల్ని పోత్సహించేయి. ఇక పోతే శఠకోప విన్న పాలను గురించి.

శఠకోప విన్నపాలు తెలుగు వేదం కాదు

మద్రాసులో ఉన్న శఠకోప విన్నపములు రెండురకాలు.ఒకటి సమగ్రం. రెండోది అసమగ్రం. అసమగ్రప్రతినే తమిళానువాదంగా భాంఢాగారంవారూ,వార్నను సరించి విమర్శకులూ భావించారు. ఇందులో ఉన్నది ఒక్క వచనమే. మిగిలినవి మరిదొరక లేదు. తమిళానికి దిఅనువాదం అన్న ఊహ శఠకోప విన్నపములు' అన్న పేరు వల్ల వీరికి వచ్చింది. మరో 'శఠకోప విన్నపాలు'న్నాయి. ఇవి సమగ్రం. నామసామ్యం రెండింటికి ఉంది. ఆవీ

తమిళానికి అనువాదంకావు. మరి యీ అసమగ్రప్రతిలోని కేవల విష్ణు ప్రశంసాత్మకమైన ఒక్క వచనాన్ని పట్టుకొని 'చూడని తమిళాని' కిది. అనువాదమని ఎల్లా ఊహించేరో ఊహకందనిది. అసమగ్రమై "నమోనమోలక్ష్మీ వల్లభా" అని (మకుటం) చివరకల శఠకోప విన్నపాలు (అందులో ఉన్నది ఒక్క విన్నపమే!) శఠకోపముని ద్రావిడ వేదానికి కృష్ణమాచార్యుల తెలుగు చేత కావచ్చునని శ్రీనిడుదవోలు ప్రభృతుల భావన. ఈ భావనతోనే చిన్నన్న ద్విపదపంక్తుల్ని అపార్థం చేసుకొన్నారు కూడాను.

35

శఠకోపుల తమిళవేదం శరకోప విన్నపాలకు మాతృక కాదు

శఠకోపముని ద్రావిడ వేద స్వరూప స్వభావాలు వేరు. ఈ విన్నపం తీరు వేఱూను. నామ సంకీర్తనం, శరణాగతి, నైచ్యానుసంధానం తప్ప ఇందులో అనుస్యూత వస్తువులేదు. ఇదే కాదు ఏ విన్నపాలు, వచనాలూ అయినా ఇంతే. అనుస్యూత వస్తు సూత్రం అందులో ఉండదు. ఇవి కొంత వఱకూ శతకధర్మాల్ని ముక్తక లక్షణాన్ని కలిగి ఉంటాయి. శ్రీశఠకోపుల తమిళ వేదమని ప్రశస్తమైన “తిరువాయ్ మొళి"కి ఒక రచనా ప్రణాళిక, వస్తు గాంభీర్య వైవిధ్యాలూ ఉన్నాయి. ఆయన వాజ్మయం అంతటా అంతర్వాహినిగా మధుర భక్తి శ్రవంతి ప్రవహిస్తూంటుంది. భగవంతుణ్ణి నాయకుడు గాను, కవి తనను నాయికగానూ భావించుకొని అక్కడక్కడ ఆ పారవశ్యం తోనే దూతీ, సఖీ, దుహితృమాత్రాది భూమికల్ని భావించుకొంటూ దివ్యభావ కమనీయ మహనీయంగా వెలయించిన కావ్యం అది. ఆ గాంభీర్యంవేఱు, ఆ సారస్యం వేఱు. ఆ చమత్కారం వేఱు, ఆ రామణీయకంవేఱు, ఆ శిల్పం వేఱు , ఆ భక్తి మాధుర్యమే వేఱు. అది అదే! అది ఇంకోటికాదు: దానిలా ఇంకోటిలేదు. రాదు. ఇట్లాంటి శఠకోప వాజ్మయానికి ఈ 'మచ్చుతునక 'విన్నపం అనువాదమేకాదు, ఛాయామాత్రాను సరణంకూడా కాదు! కృష్ణమాచార్యుల సింహగిరి నరహరి వచనాల ప్రభావంవల్ల ఆవిర్భవించిన వైష్ణవ పరమైన 'విన్నపముల'లో ఒకటి అది. దానికి శఠకోఫవిన్నపములు అన్న పేరు పొరపాటున వచ్చి ఉండవచ్చు. రెండవ శఠకోప విన్నపాలను పట్టి రావచ్చు. ఒక శఠకోపనాముడైన ఆర్వా క్కాలికుడు వ్రాసుకొన్నందువల్ల రావచ్చు.

ముద్రిత శఠకోప విన్నపాలు

కృష్ణమాచార్య వచనాలు తెలుగులో ప్రచారంలోకి వచ్చేక తమగురువునో ఇష్టదైవాన్నో ప్రశంసిస్తూ వచనాలు, విన్నపాలు వ్రాయటం తెలుగు లో శ్రీవైష్ణవ సంప్రదాయంలో పరిపాటి అయింది. ఇట్లాంటివే రెండో(సమగ్ర) శఠకోప విన్నపములు.. వీటి రచయితా కృష్ణమాచార్యులే. అయితే మన కృష్ణమాచార్యులు కాదు. ఆయన దీవికృష్ణమాచార్యులు:

36

కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో నివసించే తిరుమల బుక్కపట్టణం వంశ్యుడైన, (బహుళ) శఠకోపాఖ్యులైన తమ ఆచార్యులను ప్రశంసిస్తూ ఆయన చేసిన విన్నపాలివి. మన కృష్ణమాచార్యులకు చాలా అర్వాక్కాలికుడా యనఅని ఆ విన్నపాలే అంతరంగ సాక్ష్యం పలుకు తున్నాయి. ఇది 102 విన్నపాలు ముద్రితాలుకూడాను. శ్రీకాకుళంలో తమ ఆచార్యుల పరివారం లోని కొందర్ని ఈయన పేర్కొన్నాడు. దీనివల్ల కొన్ని చారిత్ర కాంశాలు తెలుస్తాయి. ఈయన పేర్కొన్న కొన్ని “సత్సంప్రదాయ" విషయాల వల్ల కూడా సంప్రదాయ చరిత్ర కోంత తెలుస్తుంది. ఈ విన్నపాలలో కృష్ణమాచార్యుల ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. ఈ శఠకోపవిన్నపాలరచయిత ఒక కృష్ణమాచార్యులు కావటంతో, మొదటి (అసమగ్ర) శఠకోప విన్నపాలు అజ్ఞాత కర్తృకాలు కావటంతో, అవీ కృష్ణమాచార్య ప్రణీరాలనే అనుమానానికి వచ్చి శఠకోప సన్ని కర్షతో కృష్ణమాచార్యుల తెనుగువేదం సహాపఠితం కావటంతో శఠకోపముని తమిళ వేదాన్ని కృష్ణమాచార్యులు తెనుగు చేసేరనే భ్రాంతికి పలువురు వచ్చేరు. కాని అది సరికాదు. కృష్ణమాచార్యుల ప్రభావంతో తెలుగులో వచ్చిన రచనలు అవి. వాటి కర్తృత్వంతో కృష్ణమాచార్యుల కెలాంటి సంబంధమూ లేదు.

ప్రచ్ఛన్న సింహగిరి వచనాలు

కృష్ణమాచార్య వాజ్మయం మహత్తరం, బృహత్తరం కావటంవల్ల ఆయన వచనాలు ఏ ఒక్కరూ సమగ్రంగా వ్రాసుకోవటం సాధ్యంకాదు. అంచెత ఎవరికి లభించినంత వఱకూ, శక్తి చాలినంత వఱకూ, వారు వ్రాసుకొని ఉంటారు. ఇవి వ్యావహారిక శైలీవిలసితాలూ, ఛందో బంధ విరహితాలూ కావటంవల్ల రానురాను కొన్ని చేర్పులు మార్పులు కూడా కొందరు

చేస్తూ వచ్చి ఉంటారు. దీనివల్ల కృష్ణమాచార్య వచనాలు కొన్ని మరుగున పడిపోవటం, మరికొన్ని రూపాంతరితాలై ఇతర కర్తృకాలుగా ప్రచారంలోకి రావటం జరిగింది. ఈ దుర్గతిదేశివాజ్మయానికి మోదటి నుంచి వున్నదే: మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో "వేంకటేశ్వర మహత్వము"

37

అనే పేరుతో సమగ్రంగా ఉన్న వచన గ్రంథం ఒకటి ఉన్నట్లు క్యాటలాగు వల్ల తెలుస్తోంది. వచన సంఖ్య తెలియదు. కృష్ణమాచార్య వచనలక్షణాలు ఇందులో ఉన్నాయి. దేవా అని ప్రారంభ సంబోధన' నమోనమో శ్రీవేంకటేశ్వరా నమస్తే నమస్తే నమః' అని తుదివాక్యం. శ్రీ వేంకటేశ్వరా ! అన్నది మకుటం కావచ్చును.

క్యాటలాగులో ఉదాహృతమైన వచనం :-

మొదలు. “దేవా : మీ దివ్యతేజస్సు సూర్యుండెఱుంగు. మీ భుజబలంబు కోదండం

        బెఱుంగు. మీ మహిమ విశ్వామిత్రుండెఱుంగు. మీ వదనంబు వశిష్ట వాల్మీకాడు 
        లెఱుంగుదురు."

తుది. “నీ భక్తులై నవారికి అటు మీదట మీరున్న వైకుంఠంబు గలుగజేతురు. గాన

        ఇందుకు సందేహంబులేదు. శ్రీహరి సింహగిరి నరహరి నమోనమో శ్రీ 
        వెంకటేశ్వరా నమస్తే నమస్తే నమః"

ఆ ఎత్తు గడలోని దేవాతోపాటు ఈ ముగింపులోని “సింహగిరి" ముద్రని యిక్కడ గమనించాలి. ఇందులోని శైలీభావాలు రెండూ కృష్ణమాచార్యుల్నే గోచరింపచేస్తున్నాయి. కొన్ని సింహగిరి వచనాలనే తరవాతి వెంకటేశ్వర భక్తు లెవరో తమ ఇష్టదైవం పేరు చేర్చి వేంకటేశ్వర మహత్వంగా ప్రచారం చేసి ఉంటారనే అనుమానానికి పై వచనం అవకారం ఇస్తోంది. పుస్తకం అంతా పరిశోధిస్తే కాని వాస్తవం నిక్కచ్చిగా చెప్పలేం. కాని యీ అనుమానంతో పరిశోధన చెయ్యటం మాత్రం అవసరం. ఇదే నిజమైతే మఱికొన్ని కృష్ణమాచార్య వచనాలు వెలుగులోకి వస్తాయి. ఈ అనుమానం ప్రామాణిక మే కావచ్చుననటానికి మరో ఆధారం కూడా కనబడుతోంది.

తంజావూరి సరస్వతీ మహల్ పుస్తక భాండాగారంలో “వేంకటేశ విన్నపములు" అనే పేర అజ్ఞాత కర్తృకంగా ఒక వచన గ్రంథం ఉన్నట్లు క్యాటలాగు సూచిస్తోంది. ఇందులో కొన్ని వచనాలు తాళ్ళపాక పెదతిరుమలాచార్యులవిగా తిరుపతివారి ప్రచురణల్లో ఉన్నాయి, కోన్ని కృష్ణమా

38

చార్య వచనాలు యధాతథంగా ఇందులో కలిసేయి. చివరిమకుటం మాత్రం సింహగిరి నరహరికి బదులు శ్రీ వేంక టేశ్వరా అని ఉంది.ఇవి చాలా మట్టుకు "విష్ణు నామ సంకీర్త నఫలం"లో పాఠ భేదాలతో ఉన్నవే. మఱికొన్ని కృష్ణమాచార్యులవేమో అనిపించే ధోరణిలో నడిచినాయి. ముద్రా భేదంతో విష్ణునామసంకీర్త నఫలం వచనాలతో ఇందులో కొన్ని యధా తథంగా సంవదించటంవల్లా, కడమవి. వీటితో సహపఠితాలు కావటంతో పాటు కృష్ణమాచార్య వాజ్మయధర్ములు కావటంవల్లా ఇందులోనూ సింహగిరి నరహరి వచనాలు రూపాంతరితాలై ఉన్నాయేమో అని అనుమానించవలసి ఉంది. అటు తాళ్ళపాకవారి వచనాలతో, దొరకిన సింహగిరి వచనాలతోనూ జాగ్రత్త గా వీట్నిపోల్చి వాస్తవంగా అందులో సింహగిరి నరహరి వచనాలెన్ని ఉన్నాయో ఉద్ధరించి చూపాలి. మొత్తానికి తెలుగులో కనీసం శ్రీవైష్ణవ పరంగా వచ్చిన వచనాలు, విన్న పాలు అన్నీ కృష్ణమాచార్య ప్రభావవిలసితాలే అనటంలో సందేహం లేదు. వేంకటేశ్వర విన్నపాలు, వచనాలు, శఠకోప విన్నపాలు, రామానుజ విన్నపాలు, యతిశేఖర విన్నపాలు ఇట్లా స్తు తీవచన కావ్యాలు చాలా వచ్చేయి. వీటన్నిటా కృష్ణమాచార్యుల ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది.

ఆంద్ర మహాకవులమీద కృష్ణమాచార్యుల ప్రభావం

ప్రస్తుతానికి మనకు తెలిసినంతవరకూ కృష్ణమాచార్యులచే ప్రభావితుడైన మొదటి తెలుగు మహాకవి పోతనామాత్యులు కావచ్చును. కృష్ణమాచార్యులవలెనే పోతనగారూ విష్ణు భక్తులు. ఆచార్యులవారి భక్తిలా ఉన్మస్తకం కాకపోయినా పోతన్న గారిదీ పారవశ్యభక్తే. కాకతీయుల రాజ

ధాని ఓరుగంటిలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కృష్ణమాచార్యుల మహత్వమూ, ఆయన సంకీర్తనవచనాలూ జనం నోట వినిఉంటారు పోతన్నగారు. ఆయన దశమస్కంద వచన భాగాలు కృష్ణమాచార్య వచన లక్షణ ప్రతిఫలకాలుగా కనిపిప్తాయి. సామాన్యంగా కృష్ణమాచార్యులు ప్రతివచ

39

నాన్నీ దేవా! అన్న సంభోధనతో ప్రారంభిస్తారు. మహత్వ ప్రతిపాదనమో, నామ సంకీర్తనమో, పూర్వభాగవత కథాకథనమో వచన వస్తువుగా ఉంటుంది. చివఱకు నమస్కారమకుటంతో ముగుస్తుంది. ఇదీ ఆయన వచనాల సామాన్య లక్షణం. పోతన్న గారి యీ వచనాల్లోనూ ఈ లక్షణాలు -దేవా అన్న సంబుద్ధితో వచనం ప్రారంభం కావటం, అంతర్భాగం మహత్వ ప్రతిపాదకం కావటం, శరణాగతి నమస్కారాలతో వచనం ముగియటం -కనబడతాయి. ఇవి ప్రధాన గ్రంథాంతర్వర్తులు కనక మకుట సంప్రదాయం ఉండదు. వచనంలో నమస్కారం లేనప్పుడు అవ్యవహితంగా ఆ ఊపు లోనే పద్యం అందుకొని అందులోనైనా నమస్కారాదిగానో, నమస్కారాంతంగానో వచనభావం పరిసమాప్తి చెయ్యటం పోతన్న గారిలో కనబడుతుంది. ఈ ఉదాహరణల్ని పరిశీలించండి.

(1) " దేవా ఇట్టి జీవాత్మ స్వరూపుడవును సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపుడవునని యెవ్వ రెఱుంగుదురు .. .అదిగావున.

'దేవా నీ చరణ ప్రసాద కణలబ్ధింగాక .... ...ఓ యీశ్వరా !” భాగవతం దశమస్కంధం పూర్వ భాగం. 570.

(2) దేవా సకల పురుషాంతర్యామి రూపత్వంబువలన పరమపురుషుం....వయ్యును ఒప్పు నీకు నమస్కరించెదను." భా. ద, పూ. 682.

(3) "దేవా నీ చేత నింకఁ జాబూర ముష్టిక గజ కంస శంఖ యవన ముర నరక ..... అర్జున సారథి వై యనే కాక్షోహిణీ బలంబుల వధియించెదవు, మఱియును.

'కృష్ణా : నీ వొనరించు కార్యములు లెక్కింపన్ .....

విశ్వేశ్వరున్ మ్రొక్కెదన్". భా.ద పూ. 1183.

40

(4) " దేవా ఏనరుండై ననేమి శ్రద్ధాగరిష్ట చిత్తుండై నిన్ను సేవించునట్టి మహాత్ముండు విధిచోదితంబయిన ప్రమాణబహుళ విముక్తుండై వర్తించునట్లు గావున యోగీశ్వరేశ్వరుండవై ననీ వీళితవ్యులమైన మమ్ము నిష్పాపులం జేయుమని నుతించి మఱియు నిట్లనియె" భా. ద, ఉత్తరభాగం. 1151,

(5) "దేవా నీ సచ్చరిత్రంబులు కర్ణరసాయనం బులుగా నాకర్ణించుచు నీకుంబూజ లొనర్చుచు నీ చరణారవిందంబులకు వందనంబులు సేయుచు నీదివ్య నామకీర్తనంబులు సేయుచు......మఱియు నిట్లనియె. “నీకు మ్రొక్కెద కృష్ణ నిగమాంత సంవేద్య' భా.ద. ఉ 1196.

తాళ్ళపాకవారు

మొట్టమొదట తాళ్ళపాక చినతిరుమలాచార్యులు తన సంకీర్తన లక్షణంలో కృష్ణమాచార్యుల్ని పదకర్తగా ప్రశంసించాడు. ఆయన వచనాలనే కావచ్చు చూర్ణికలని పేర్కొన్నాడుకూడాను. తమతాత అన్నమయ్యగారు సంస్కృతంలో చెప్పిన సంకీర్తన లక్షణాన్ని తన తండ్రి 'పెద తిరుమలాచార్యులవారు వ్యాఖ్యానిస్తే తద్వ్యాఖ్యానుసారంగా తెలుగు పద్యాల్లో వ్రాస్తున్నానంటాడు చిన తిరుమలా చార్యులు. అంచేత కృష్ణమాచార్యుల్ని సంస్కృత సంకీర్తన లక్షణంలో అన్నమయ్యగారే ప్రశంసించి ఉండవచ్చునేమో. తిరువెంగళనాథుడు తెనుగు వేదప్రణేతగా ఆచార్యులవారికి ఆంజలిస్తాడు. ఈ స్మృతి ప్రశంసలేకాక తాళ్ళపాక వారి రచనల్లో కృష్ణమాచార్యుల ప్రభావం ప్రస్ఫుటంగా కనబడు తోంది.

"శ్రీ వైష్ణవుడే పరమసాధకులు
శ్రీ వైష్ణవులే బ్రాహ్మణులు
హరిభక్తి లేని విద్వాంసుని కంటెను
హరికీర్తనము సేయు నతడు కులజుండు
శ్వపచుండైన నేమి ఏవర్ణం బైన నేమి
ద్విజుని కంటె నాతండు కులజుండు"

41

అగ్రవర్ణత్వ-శ్రీవైష్ణవాల మీద కృష్ణమాచార్యులు ప్రకటించిన యీ భావాలు అన్నమాచార్యుల పదాల్లో ఎల్లా ప్రతిబింబిస్తున్నాయో క్రింది పదాలు చిత్తగిస్తే తెలుస్తుంది.

" ఆణు రేణు పరిపూర్ణుడైన శ్రీవల్లభుని
ప్రణు తించు వారువో బ్రాహ్మలు"
హరినామములనే సంధ్యాది విధులొనరించు
పరిపూర్ణ మతులుచో బ్రాహ్మలు;
హరి మంత్రవేద పారాయణులు హరిభక్తి,
పరులైన వారు వో బ్రాహ్మలు;
ఏవి చూచినను హరియన్నిటంగలడనుచు
భావించు వారువో బ్రాహ్మలు;

“కొంచెమును ఘనముంగనుగొననేల హరించలంచు
పంచమహా మహాపాత కుండె బ్రాహ్మణోత్త ముండు౹౹
వేదములు చదివియును విముఖుండై హరికథల
నాదరించని సోమయాజి కంటే
ఏదియును లేనికుల హీనుండై నను విష్ణు
పాద సేవకుడువో బ్రాహ్మణోత్త ముండు11.

కోడి పుంజుల యుద్ధాన్న భివర్ణించే వచనంలో కృష్ణమాచార్యులు స్వామిని కికురిస్తూ “ఈ కోమటి పిల్లవాణ్ణి బతికిస్తావా లేకపోతే నీగుట్టంతా బయట పెట్టేదా” అని బెదిరిస్తారు. ఆ సందర్భంలో

“దేవా మీరు శబరియెంగిలి ఉన్నది చెప్పుదునా
ఆతని ప్రాణవాయుపు నిచ్చెదవా"

అంటారు.

కృష్ణమాచార్యుల ఈ భావ వల్లి అన్నమయ్య గారి హృదయోద్యాసంలో నాటుకొని చిగిరించి తీగలుసాగి ఏడు కొండలపొడిపై పూలజల్లులు కురిసింది-

" హరినా కులంచ మిచ్చేవు అన్ని మర్మములు చెప్పుదునా
దోరవంటు మొక్క నీ దాసులతోడ తుచ్ఛపునీచేత చెప్పుదునా!!

(6)

42

అలనాడు నీవుమైలన్న చొక్కయనంటుకొన్న సుద్ది చెప్పుదునా
గొల్లెతల వాడ చీకటిని తప్పుకోరి చేసినది చెప్పుదునా
.. .. .... .. ..
.. .. .. ..
యీడు వెట్టుకొని నీపు బోయదాని యెంగిలిధిన్నది చెప్పుదుగా"

పై పంక్తుల్లో భావ మేకాకుండా "ఎంగిలి దిన్న ది చెప్పుదునా" అన్న ఆచార్యుల వారి వృత్త గంథి అన్నమయ్య గారి పదానికి మంజు మంజీరమే అయింది.

కృష్ణమాచార్యులు పై వచనంలోనే కోమటి పిల్లవా డెంతకూ లేవక పోవటంతో కోపంవచ్చి స్వామిని

“నీకు చాతుర్లక్ష గ్రంథ సంకీర్త సం కాయను మాతల్లి కడవాడవా? నీవు మాకెన్నాళ్ళ ఋణస్థుడవో నీకు నేనెన్నాళ్ళ ఋణస్థుడనో"అంటారు. ఈ భావంతో పాటు

"మా తల్లి కడవాడవా" అనేది ఒక అభాణకమే అయి అన్న మయ్యగారిలో ఎల్లా ప్రవేశించిందో చూడండి-

" నేము ని కన్యులమా నీవుమాలో లేవా
యీ మేర లనే మమ్ములనేలు కొందుగాక౹౹
ధర విభీషణుండు మీ తల్లి కడవాడా
నిరతి ఘంటకర్ణుండు మీ తండ్రి కడవాడా
యిర వైధృవుండు మీయిల్లాలి కడవాడా
శరణన్న మాటలో సరిగగాచితిరి ".

అని ఆచార్యుల వారికంటె మఱి నాలుగాకు లెక్కువే చదివేరు అన్నమయ్యగారు. ఇట్లాగే ఆచార్యులవారి “విదురు నింట విందు" అన్నమయ్య గారింటా విందు లారగించేడు.

అన్నమయ్యగారి కుమారుడు పెద తిరుమలాచార్యులు తండ్రిగార్ని అనుసరించి సంకీర్తనలు వ్రాయటమేకాక కృష్ణమాచార్యుల అడుగుజాడల్లో వచనాలు విన్న వించేడు. రచనా పద్ధతిలోనూ భావవ్యక్తి కిరణంలోనూఆచార్యులవారి ముద్ర యీ వచనాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. తామ్ర

43

పత్రికలు వేయించటంలో, కవితలో, మతంలో దేశితనాన్ని ఆశ్రయించటంలో, శ్రీవైష్ణవ పారమ్య ప్రకటనంలో, సంకీర్తన సంప్రదాయంలో, ఇందూ అందూ ఏమిటి అన్నిటా తాళ్ళపాకవారికి కృష్ణమాచార్యులు ఆచార్యులే.

కృష్ణమాచార్యులకు వారసులు తాళ్ళపాకవారు

మతంలో దేశితనం అంటే_భాగవతమతం ఉత్తరాన ఉద్భవించటం లోనే స్వతంత్రత, విప్లాపకత, సమత, సౌందర్యం, ఆర్తి, ఆరాధన, మొదలైన భావాలతో దేశితనంతో తేజరిల్లింది. ఆళ్వారులు దక్షిణాన్న కూడా దానికి వారసులుగా ఇన్ని లక్షణాలూ దేశిదృక్పధంతో సంతరించుకొని తమిళంలో పాశురాలు పాడేరు. ఇది విరోధ దృష్టితోనో విద్వేషదృష్టితోనో సంస్కృతంమీదా తత్సంస్కృతిమీదా చేసిన విప్లవంకాదు. మతసంస్కృ తుల్ని దేశీయూలుగా సంతరించుకోవాలనే దేశిభావనతోడి తపన ఇక్కడ మనం గమనించాల్సింది. అటు వీరశైవంలోనూ ఈ లక్షణాలు కనబడు తున్నాయి. సంస్కృతం తత్సంస్కృతీ అగ్రవర్ణాలవారి, మేధావివర్గవారి కంచుకోటల్లోనే ఉండిపోవటంవల్లా విప్లావకమూ భక్తి భావభూమికా ప్రాదుర్భూతమూ, సర్వసాధారణీకరణ లక్షణ సమన్వితమూ అయిన ఈ విలక్షణ సంప్రదాయం, సంస్కృతీ, వాజ్మయం, దేశీయతాముద్రతో సామాన్య ప్రజానీకంలోకి చొచ్చుకుపోవటానికి ఈ దేశిమార్గానుసరణం ఆవశ్యకర్తవ్యం అయింది. కర్తవ్యం మాత్రమే కాదు దానిలక్ష్యం కూడా అదే. కృష్ణమాచార్యులు ఆళ్వారుల్ని, శ్రీమద్రామానుజుల్ని, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించటంలో కూడా ఈ దృక్పధమే కనబడుతుంది. భాగవత సంప్రదాయానుసరణంలో ఆళ్వారులు ఎల్లాంటి స్వతంత్ర ప్రతిపత్తి నవలంబించేరో, ఆళ్వారుల్ని శ్రీమద్రామానుజుల్ని అనుసరించటంలోనూ కృష్ణమాచార్యులు అట్లాంటి స్వతంత్ర ప్రతిపత్తి నే అలంబించేరు. ఆళ్వారుల వల్ల తమిళభాష వకుళా మోదవాసితం అయినట్లే కృష్ణమాచార్యులవల్ల తెలుగుభాష చాంపేయ సుమపరీమళ సంభవితం కావలసింది, ఆ పరీమళాల్నా స్వాదించటానికాంధ్రులింకా నోచుకోలేదు.

( లాగున్నది) -- ఆంచేత శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అనూచానంగా వస్తున్న ఈ స్వాతంత్య్రాన్నీ

44

దేశితనాన్ని తాళ్ళపాకవారూ కృష్ణమాచార్యులద్వారా సంగ్రహించుకొని తమ వాజ్మయం వెలయించేరు.

తరువాత వారెవరూ కృష్ణమాచార్యుల్ని స్మరించటం కానీ అనుసరించటంకాని జరిగినట్లు కనబడదు. తాళ్ళపాకవారి వాజ్మయం చిరకాలం అంధకారంలో ఉండిపోయినట్లే కృష్ణమాచార్య వాజ్మయమూ ఏళ్ళతరబడి కాఱు చీకట్లలో కాలం వెళ్ళబుచ్చుతోంది. వేంకటాచల విహారశతక కర్త ఒకడు ప్రాసంగికంగా కృష్ణమాచార్యుల్ని ప్రస్తావిస్తాడు. సింహాచలంతోనూ నరసింహ స్వామి తోనూ స్నిగ్ధ సంబంధం ఉన్న గోగులపాటి కూర్మనాధకవి కూడా కృష్ణమాచార్యుల్ని స్మరించకపోవడం విస్మార్యంకాదు.

దేవాలయాలు - కృష్ణమాచార్యులు

సింహాచలంలోనూ మరికొన్న దేవాలయాల్లోనూ కృష్ణమాచార్య సంకీర్తన వ్యవహారం ఉంది. అధ్యయనోత్సవాదుల్లో ఇతర వేదపురాణాదులకువలె వీటికీ 'సన్నిధివిన్నపం' మర్యాదఉంది. కాని ఇక్కడ శోచనీయం ఏమిటంటే ఆ విన్న విపంబచేవి కృష్ణమాచార్య విన్న పాల్లా కనపడకపోవటం. నామమాత్రంగానే తప్ప మచ్చుకుకూడా ఇక్కడివారికవి తెలియవు. ఇందుకు కారణాలన్వేషించటంలో ఆచార్యసూ క్తిముక్తావళికథవల్లా, సింహ గిరి నరహరివచనాల అంతరంగ సాక్ష్యంవల్లా ఒక రహస్యం బయటపడుతోంది. ఆచార్య శబ్దం పేరులో ధరించి రాజస ప్రవృత్తి తో వ్యవహరించటమే కృష్ణమాచార్య వచనాలు అగ్రవర్ణాలవారికి ఆగ్రాహ్యాలై 'నిత్యుల' పాలవటానికి కారణాలుగా అచార్య సూక్తి ముక్తావళి ప్రకటిస్తోంది, ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి.

కృష్ణమాచార్యుల 'వెలి' రహస్యం

కృష్ణమాచార్యులు వర్ణవ్యవస్థ విషయంలో విప్లావక భావాలు కలవారు. ఒక్క వ్యర్థ వంవస్థలోనే కాదు చాలా సంప్రదాయాల్లో ఆయన స్వాతంత్య్రం ప్రకటించినట్లు 'వచనాల' వల్ల తెలుస్తోంది. వీటికన్నిటికీ ఆయన కాధారం శ్రీ వైష్ణవమే. "శ్వపచోపి మహిపాల విష్ణుభక్తో

ద్విజాధికః"

45

అనే వాక్యం నాటినుండి నేటిదాకా అగ్రవర్ణాల పండితులందరూ సెలవిస్తున్నా అంతరంగశుద్ధి అంత చెప్పుకోతగ్గదికాదేమో అనిపించకమానదు. కృష్ణమాచార్యులు ఈ సూక్తిని అక్షరాలా నమ్మినవారు. సాని సంప్రదాయంతో పాటు నిత్యులతోడి సంపర్గం కూడా ఆయనకుండేదేమో. అయన వివాహ వృత్తాంతమొకటి ఇక్కడ స్మరణీయం. కులశేఖరాళ్వారుల్లాగ ఆయన "ఉన్మస్త భక్తుడు.' తన వివాహానికి సింహగిరిస్వామిని అనుమతి ఆర్ధిస్తే ఆయన తానూ పెళ్ళికి వస్తానంటాడు. పెళ్ళి వారింట్లో పెళ్ళికుమారుడితో పాటు స్వామివారూ "సాపాటు" కు కూర్చొన్నారు.

చరమరహస్యం - పరమరహస్యం

తీరా కన్యాదాత లోపలికి వచ్చిచూస్తే 'అల్లుడు' గారి పక్కనున్న వ్యక్తి చరముడు: దాంతో వర్ణవ్యవస్థను సుదృఢంగా చాలా 'రిజిడ్' గా అనుసరించే ఆయన గారు అల్లుణ్ణి ఇంట్లోంచి గెంటేసి పిల్లను పంపక వెలివేస్తాడు. ఈ చరమ రహస్యం ఒక పరమరహస్యం. ఆచార్యుల వారికి పరముకు చరముడిలో కనబడ్డాడా ! ఆయన మామగారికి పరముడే చరముడిగా కనబడ్డాడా ? ఏమో ! ఇది పరమరహస్యం ! చరమరహస్యం.!! 'హరిజనుల' విషయంలో ఆచార్యులవారి యీ ఆర్ద్రతే వారూ వారి వాజ్మయమూ 'అగ్రవర్ణాలవారికి ' 'వెలి' కావటానికి కారణం కావచ్చును. కృష్ణమాచార్యుల్లాగే హరిజనుల పట్ల ఇంత ఆర్తి నీ ప్రకటించిన మరొకవక్తి శ్రీవైష్ణవ సంప్రదాయంలో 'శ్రీపరస్తుపట్టర్ పిరాన్ జియ్యర్ ' "వీరు సన్యాసులుగా మత ప్రచారంచేసి తృప్తి లేక దూరంగా ఉండి మీరూ మేమూ సమానులం అంటే ఏం బాగుంటుందనుకొని శిఖాయజ్ఞోపవీతాలు పరిత్యంజిచి హరిజనుల్లో కలిసిపోయేరుట. ఇప్పటికీ, వీరి శిష్యులైన నిత్యులు పశ్చిమాంధ్రంలో ఉన్నారట" ఈ సంగతి పూజ్యులు మాఆచార్య చరణులు శ్రీమాన్ న.చ.రఘునాధాచార్య స్వామి వారునాతో అన్నారు. ఆంధ్ర దేశంలో హరిజనుల్లో 'దాసరి' సంప్రదాయంవారున్నారు వీరు వైష్ణవులు. కృష్ణమాచార్య కటాక్షపాత్రు లేమోవీరు. కృష్ణమాచార్య సంకీర్తన సంప్రదాయం వీరిలో ఇంకా ఆడుగంటి

కూడా ఉందేమో చూసితత్పరిరక్షణకు వెంటనే పాటుపడాలి.

46

కృష్ణమాచార్యుల సంకీర్తన గురువు

వరాహపురాణాంతర్గత కైశికీమాహాత్మ్య కథానాయకుడైన గాయక చండాలునిపట్ల కృతాజ్ఞతా సూచకంగా, సంకీర్తనంలో అతని వారసత్వాన్ని పొందినతాను అతని వారిపట్ల ఆ మాత్రం ఆర్తిని కనబరచక పోవటం అకృ తజ్ఞం అన్న ఉపకారస్మృతితో కృష్ణమాచార్యులు హరిజనులపట్ల వ్యవహంచే రనిపిస్తోంది. ఇట్లాంటి విప్లావక సన్ని వేశాలు జీవితంలో ఉండటంవల్లా, తమిళంలోనో సంస్కృతంలోనో (మాత్రమే) స్తుతించాల్సిన స్వామిని దేశిసంప్రదాయంలో తెలుగులో ఆయన స్తుతించటంవర్ణా' అగ్రవర్ణాలవారికీ , ద్రావిడాభిజాత్యసంపన్నులై ఆంధ్ర దేశంలో మత ప్రచారం కోసం పీఠాలు నెలకొల్పుకొన్న బ్రాహ్మణ శ్రీవైష్ణవ కుటూంబాలవారికీ ఆయనా ఆయన వాజ్మయమూ అంటే అనాదరభావం కలిగి ఉండవచ్చు, అంచేతనే ఇతరు లతోపాటు శ్రీవైష్ణవ సాంప్రదాయికుల్లోనూ సింహగిరి వచనాలు కనబడ కుండా పోయేయి.

సింహగిరి వచనాలు- వింగడింపు

ప్రస్తుతం ముద్రిత వచనాలను విషయవైవిధ్యాన్ని బట్టి 5, 6 రకాలుగా వింగడింపవచ్చును. ఈ వింగడింపు ఎట్లా ఉన్నా ఆన్నిటా అంతర్వాహినిగా వైష్ణవపారమ్యం, మహత్వం ప్రవహిస్తూనే ఉంటుంది.

1. నామసంకీర్తన వచనాలు. వచనం అంతా సంబుద్ధులతో నిండి ఉంటుంది. ఈ సంబుద్ధులన్నీ విష్ణు నామగుణ విభవ ప్రతిపాదకాలుగా విలసిల్లటం విశేషం. పైవాటిలోనే మరో అంతర్విభాగం ఉంది. ఈ సందోధనలు రామపరంగానో కృష్ణపరంగానో ఒక క్రమపద్ధతిలో కూర్చబడి తత్తజీవిత ప్రతిపాదకాలుగా ప్రస్ఫురిస్తాయి. ఇట్లా శ్రీరామాయణం. భాగవత విష్ణు పురాణాలూ ఈ వచనాల్లో కీర్తింపదిడ్డాయి. ఈయన శ్రీరామాయణ వచనం లాంటిదే తరువాతివారైన శ్రీ మన్నిగమాంత దేశికుల శ్రీ రఘువీరగద్య, సంబుద్ధ్యాత్మకంగా శ్రీ రామాయణ ప్రతిపాదకం యిది.

47

2. పౌరాణిక వచనాలు. సృష్టి ప్రళయాదులైన వివిధ పురాణాంతర్గత విషయాలు వర్ణించి పర్యవసానంగా శ్రీమన్నారాయణ పారమ్యాన్ని ప్రతిపాదించటం వీటి ప్రయోజనం.

3. ధార్మికవచనాలు. ధర్మశాస్త్రాల్లో, గరుడపురాణాదుల్లో ఉండే జన్మాంతర కారణాలైన దానధర్మాల, పాపపుణ్యాల పరిగణనం చేస్తూ తదపేక్షయా శ్రీవైష్ణవపారమ్య ప్రతిపాదనం చెయ్యటం, సంకీర్తన మహిమాభివర్ణనం చెయ్యటం వీటి స్వభావం.

4. కథావచనాలు. ప్రావాహికాలూ, ప్రాదేశికాలూ, పారంపరీరాలూ, పౌరాణికాలూ అయిన శ్రీవైష్ణవభక్తుల కథలని చెప్పేవి. విష్ణు భక్తి మహత్వ ప్రతిపాదన ప్రవణాలూ శ్రీ వైష్ణవ పారమ్య ప్రతిపాదన వరాలను ఇవి.

5. జీవిత వచనాలు. రచయిత జన్మవృత్తా దికాన్ని తత్తద్విశేషాలనీ సూచించేవి యివి.

6.సంప్రదాయ వచనాలు. శ్రుతి - స్మృతి ఇతిహాస- పురాణ ప్రమాణ వాక్యాలతో శ్రీమన్నారాయణుని స్వరూప రూప-గుణ విభవ ప్రతిపాధనం చేస్తూ విశిష్టాద్వ్యైత పద్దతిలో శ్రీమద్రామానుజ దర్శనానుగుణంగా సంస్కృత వేదాంత సంప్రదాయ ప్రతిపాదకాలు కొన్ని:

దివ్యప్రబంధ సంప్రాదాయ ధోరణిలో రహస్యత్రయాది ప్రశంసా పూర్వకంగా, ఆచార్య శేష - శ్రీపాద శీర్థ మహిమాభివ్యంజకంగా శ్రీవైష్ణవులకు శిరోధార్యాలు ఆచార్యుల వారికి అధ్వాక్కాలికాలూ శ్రీ వైష్ణవ సంప్రదాయ మణిమంజూ షాంతర్ని క్షిప్తాలూ అయిన శ్రీ వచనభూషణాది సంప్రదాయ గ్రంథాల్లో నిక్షిప్తాలైన పారంపరీణ భాగవతసంప్రదాయ

రహస్య విశేషాలను ప్రతిపాదిస్తూ ద్రావిడ వేదాంత సంప్రదాయ ప్రతిపాదకాలు కొన్ని: ఇట్లా శ్రీ వైష్ణవంలో ఉభయ వేదాంత ప్రతిపాదకాలు ఈ వచనాలు,

48

3) దేవా !

వచనాలు - వ్యక్తిత్వం

వర్ణ వ్యవస్థని ఉన్న పాళంగా పటాపంచలుచేసి కూలదోయ్యమని ఆయన కంఠోక్తి గా చెప్పకపోయినా విష్ణుభక్తి -వర్ణ వ్యవస్థల మధ్య సంఘ ర్షణవస్తే విష్ణుభక్తి వైపే ఆయన మొగ్గుతారు. ఈ క్రింది పంక్తులు 'గమ నించండి.

1) “జాతివర్ణములతో బనిలేదు మీ భక్తుడైనఁజాలుననీ శ్వపచోపి మహీపాల' ఆంటిరి.(26వ వచనం)

2) దేవా !

విష్నుభక్తి లేని విద్వాంసుకంటే
హరికీర్తనము సేయు నతడెకులజుండు
శ్వపచుండైననేమి ఏ వర్ణంబైననేమి ?
ద్విజునికంటెనతండు కులజుండు
దృష్టింజూడగా విద్వజ్జన దివ్యభూషణము
సింహగిరిందలంచిన యాతండెకులజుండు" (౹౹)

3) దేవా !

 మీ చరణయుగళ సేవ కేకులజుండైననేమి ?" (28)

4) దేవా !

మీ దివ్యనామ సంకీర్తన యెవ్వండాయెనేమి
చేయగా వినియిది హీనముఇది హెచ్చు
వర్ణంబులుగానని నిషేధించినవాడు ........

దేవా!

 మీ దివ్యనామసంకీర్తన మెవ్వరునుతియించిరి.
వారెపో పరమ భాగవతులు." (44)

5)

“ఏవర్ణ మైన నేమి మీ దివ్యనామ గుణసంగతి
గలుగజేసి మీదాసానుదాసునిగా జేయవే" (47)

6)

"మీ కులగోత్రంబెన్న నేమిటికి ?" (3)
మనిషినిగా మనిషి పరిగణించటానికి, గౌరవించటానికి అతడు
భగవద్దాసుడు, భాగవతదాసుడు కావటమే ప్రధాన హేతువు
కాని శాస్త్రవై దుష్యం, అభిజాత్యం ఎంతమాత్రం కావం
టారాయన.

49

1) "సంధ్యాది నిత్యకర్మానుష్ఠానంబులు దప్పక నడిపిననేమి
చతుర్వేద షట్ శాస్త్రముల్ సదివిననేమీ
శతక్రతువులాచరించిననేమి
సకల ధర్మంబులు నేసిననేమి
మా సింహగిరినరహరిదాసులకు దాసులైనంగాని లేదుగతి"

2)

“మీ కైంకర్యపరులకు వందనము చేయుటయే పదివేలు."

3)

“మీ నామావళినుచ్చరించు భాగవతులు ధన్యాత్ములు"

4)

“పురుష సూక్తంబున అభిషేకంబులుచేసి మిమ్ము గానలేరు.
పురాణంబులు శాస్త్రంబులు చదివిననేమి
మీ గుణంబులు తెలియక మీ దాసుండుగాక
మిమ్ముగనలేడు"

5)

“మీ దాసుల కెవరికైననేమీ తిరుకళ్యాణము చేసిన
వారలకనంతములైన పుణ్యములు కలుగునయ్యా"

ఆచారులవారి ఆంతర్యం

మతాంతర-మంత్రాంతర- సాధనాంతర-దైవతాంతర ప్రయోజనాంతరాలని పరిత్యజించా లంటారు ఆచార్యులవారు. శ్రీమద్రామానుజ సిద్ధాంతం లాంటి సిద్ధాంతంలేదు. రహస్య త్రయంలాంటి మంత్ర(త్రయ)ం లేదు. ఆచార్యకటాక్షంకంటే మరోసాధనంలేదు. సింహగిరి నరహరిని మించి దైవంలేడు, శ్రీ వైకుంఠంకంటే మరో ప్రయోజనంలేదు. ఇవి కృష్ణమా చార్యులసుదృఢభావాలు.

మత సహనం

(శ్రీవిష్ణుపారమ్యాన్నీ శ్రీ రామానుజ సిద్ధాంతాన్ని ఎంత అభినివేశంతో అనుసరించినా ఆదర్శప్రాయమైన మతసహనం ఆయనలో గోచరిస్తుంది-

50


“దేవా మీభక్తుండై యుండి రుద్రభక్తుల దూషించుట
దోషంబని తెలిసియందుకు
“మద్భక్త శ్శంకరద్వేషి, మద్ద్వేషీ శంకరప్రియః
తావుభౌ నరకం యాతఃయావచ్చంద్ర దీవాకరౌ,"
అనియెడువాక్యప్రమాణంబులు తెలిపి"

దీనివల్ల ఆయన మతసహనం అవగతం అవుతుంది. ఇంతేకాదువిష్ణుభక్తుని మహత్వాన్ని ప్రతిపాదించే ఒక కథ చెప్తారాయన అందులో--కొందఱు రుద్రభక్తులు. ఒకడే విష్ణుభక్తుడు. రుద్రభక్తులమీద ఎట్లాంటి కువిమర్శాచెయ్యకుండా చాలా జాగ్రత్తగా చిత్త శుద్ధితో కథనడిపించి విష్ణు భక్తుడి మహత్వం ప్రకటింపచేస్తారు. అతని మహత్వానికి ముగ్ధులైన రుద్ర భక్తులు అతణ్ణి ఆచార్యుడుగా వరించి విష్ణు భక్తు లౌతారు. ఈ చివరిఆంశంకూడా సూక్ష్మంగా ధ్వనిస్తారుగాని వాచ్యం చెయ్యరు. ఆయన మర్యాద ఆల్లాంటిది. రుద్రభక్తులు విష్ణుభక్తు లవటంలో విష్ణుభక్తుని చిత్త శుద్ధితోడి మహత్వమూ నిశ్చయ జ్ఞానంతోడి భావశుద్ధీ కారణాలు.అంతేకాని యిందులో శివ కేశవుల “తులన' ప్రసక్తే లేదు.

శ్రీవైష్ణవసంప్రదాయ విశేషాలు

శ్రీమద్రామానుజ సిద్ధాంతానుయాయి అయిన ఆచార్యులవారు ప్రపన్న సంప్రదాయంబాగా ఎఱిగినవారు. మేదినీసురులు, ఆచార్యులు. జననీ జనకులకంటే పెద్దలైన ప్రపన్నులకు ప్రథమస్థానం యిస్తారాయన. ఆళ్వారుల్నీ భాగవతుల్నీ, తరచు తలుచుకొంటారాయన. పదుగురాళ్వారులనటంలో ఈయన ప్రాచీనత ప్రకటితం అవుతోంది. పదముగ్గురు భాగవతు లంటారాయన, కానివారు పదునలుగురు. 'ప్రహ్లాద నారద పరాశర' శ్లోకం ఈయనెరగంది కాదు. మఱి యీ పదముగ్గురిమాట ఎట్లాగో?. ఇక్కడ ఆయన అంతరంగం ఏమిటో తెలీదు.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆచార్య కటాక్షానికి విశేష ప్రాముఖ్యం ఉంది. చాలా చోట్ల తన్మహత్వాన్ని ప్రకటిస్తారాయన.

51

"ఆచార్యుడనెడి హనుమంతుఁబంపి •
“మీదాసులకాచార్య కటాక్షము లేకుండుటయే హాని
పరమాచార్యులం బోలు మఱి యాచార్యులు లేరు.
“నీవేమాయాచార్యుడవనిదండము సమర్పించి కడకుజనిరి.
“సదాచార్యకటాక్షేణ భజసిద్ధిం." ఆచార్యులేనరహరి
ఆచార్యకృపకు చేరనీయక
“నీవుత్తమ సాత్వికుండవు. సకలాచార్యుండవు"
“పరమాచార్య కృపచేర నేర్పు లేక
ఆచార్య శేషము దొరుకక"
“మీ యాచార్యులెవ్వరు"
“మాకు పరమాచార్యులైన మహాత్ముండు
మీకు మాపరమాచార్యులై యన్నియు దెలిపితిరి
“మాకాచార్యాపజారంబులేల మోపుగట్టెదవు.
"ఆచార్య కరుణా విశేషంబువలన,
“ఆచార్య కృపాకటాక్షమువలన
"అభ్యసింపరానివి రెండు–ఆచార్య కటాక్షంబోకటి ...."
"ఆ మీదట నాచార్యులకృపచేరుట"

ఈ ఆచార్య శబ్దం శ్రీ మద్రామానుజులకే వాచకం ఈయన దృష్టిలో. సొమాన్యంగా గురువుల్ని ఆచార్యులనీ, వారీగురువుల్ని పరమాచార్యులనీ వ్యవహరించటం కద్దు. కానీ కృష్ణమచార్యులు ఆచార్యుల్ని పరమాచార్యులంటారు. ఇందులో ఒక చమత్కారం ఉంది, “తస్మిన్ రామానుజార్యేగురురితి పదంభాతి నాన్యత్ర" అన్నట్లుగా పరములై న--- శ్రేష్ఠులైన ఆచార్యులు అంటే శ్రీ మద్రామానుజులే అని భావించినవారాయన. ఇదే భావంతో " పరమాచార్యులంబోలు మఱియాచార్యులు లేరు. పరమ బాగవతులం బోలు మఱి భాగవతులు లేరు" అంటారు. ఇట్లా పరమాచార్యులతో స్వాచార్యులకు అభేదాధ్యవసాయం ఘటించి స్వాచార్యులు రామనుజులవంటి వారనటం మరో విశేషం. పోతకమూరి భాగవతులతోడి ప్రసంగంలో మీ "దర్పోద గ్ర దశానవేంద్రియ... హనుమత్సమాన గురుణా"...

వేదాంత దేశికులు

52

పరమాచ్యారులెవ్వరు' అంటారు. అంటే మీపాలిటి రామానుజులెవ్వరని అర్ధం. అట్లాగే “మా పరమాచార్యులైన పొతకమూరి భాగవతుల కృపవలన" అంటారు. తనపాలిటి శ్రీమద్రామానుజులు పోతకమూరి భాగవతులని భావం. వార్ని వర్ణిస్తూ “ఎంబెరుమా నార్ల స్వరూపులైన స్వాములు' అనటంలో ఆప్రతిపత్తి ప్రకటితమౌతుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రముఖస్థానం వహించిన 'రహస్యత్రయం' పలుతావుల ప్రస్తావించబడ్డది. తత్రాపి ద్వయాధికారి పైలక్షణ్యాన్ని విశేషతః ప్రబోధిస్తారు. ఇది శ్రీవైష్ణవంలో మరో మెట్టు. రహాస్యత్రయం:-తిరుమంత్రం. ద్వయమంత్రం. చరమ మంత్రం.

1)

"తిరుమంత్రమును విన్నపము చేసిరి"
'తిరుమంత్రా పేక్షలను"
"అష్టాక్షరీ మంత్రోపదేశము"

ఇట్లా పేర్కొనటమేకాక అష్టాక్షరీసంపుటితోనే ఒకవచనం కీర్తిస్తారు.

2)

"ద్వయము బ్రహ్మజ్ఞానమూర్తీ లోను. మా సింహగిరి నరహరి పదధ్యానమందును దొరుకును.”
"ద్వయమును పఠించిరి.
“ద్వయమునకధికారియేంతటివాడు ?
.........తన్ను దానెఱుంగక
దూషించు కపటాచారడాంబిక పరుండు ద్వయాధికారియగునే"
“మీ దీవ్యమంగళంబైన ద్వయ ........."
"ఆద్వయమనవరతంబు సంధించుచు"

3)

 "పరమరహాస్యంబునుంబోలు మఱి రహాస్యంబు లేదు" "ఆ చరమార్థం బనియెడు తెప్పగట్టి."

ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సూచించే పదాలూ, పద బంధాలూ వచనాల్లో చాలా కనబడతాయి. పరమరహస్యం. పరమనాంచారి. పెరుమాళ్ళు, తిరుమణి, తిరుచూర్ణములు, తళిగె తిరుకళ్యాణం, ఆడియేని. దాసిన్ తోండండు. ప్రపత్తి, ప్రపన్నులు అచార్య శేషము. ఎంబేరు మానార్ణు, తిరు పట్టణము. తిరుమాళీగ, తిరువడిగళ్ళు, తిరుముఖారవిందము

53

ఆళ్వారులస్వరూపులు, పరమ పదము, తిరువారాధన, ఆరగింపుతళియ, తిరువాయిమొళి, తిరుమంత్రము, తిరునాళ్ళు, తిరుమేను, తిరువక్తము, తిరుపతులు

కృష్ణమాచార్యుల భాషావిశేషాలు.

వ్రాత ప్రతుల్లో కృష్ణమాచార్య వచనాలు చాలా వఱకూ వ్యావహారికశైలిలోనే కనబడుతున్నాయి. డా|| కుల శేఖరరావుగారు వాట్ని గ్రాంధి కీకరించినట్లు తెలుస్తోంది. సింహగిరి వచనాలున్న తామ్ర పత్రికలు బయటపడేంత వఱకూ ఈ గ్రాంధికీ కరణౌచిత్యాన్ని గురించి కాని యీ వచనాల్లో భాషా విశేషాలను గురించి కాని స్పష్టంగా చెప్పటంకష్టం. కనీసం 'సింహగిరి వచనాలూ','కృష్ణమాచార్య సంకీర్తనము' అన్న పేర ఉన్నవీ, ఇంకా ప్రచ్ఛన్నంగా ఉన్న ఆయన వచనాలూ అన్నీ బయటపడి ఏక రూపం అయిన 'శైలీ విన్యాసంతోడి 'కృష్ణమాచార్య వచనాలు' వెలుగులోకి వచ్చింతరువాత కాని ఆయన భాషా విశేషాలు బయటపడవు. అయినా కొన్ని విశేషాలు మనకు ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉన్నాయి.

రణించు, బోడించు, తుండించు లాంటి ధాతురూపాలు విలక్షణంగా కనబడతాయి. 'ఇంద్రజిత్తు తలగుండుగండా' లాంటి దేశ్య బిరుద సమాసాలూ, విభీషణ స్థాపనాచార్యా, దక్షిణ సింధు రాజ బంధనా దేవ వేశ్యా భుజంగా వంటి సంస్కృత సమాసాలు, తత్కాలీన రాజకీయ బిరుద స్వభావాన్ని సూచిస్తున్నాయి.

తరువాత తరువాత కూచిపూడి భాగవతాల్లోనూ ఇతరత్రానూ వినపడే అమితరవికోటితేజా-భాగవత కల్పభూజా' వంటి పదబంధాలు మొదటగా కావచ్చు ఈయన వచనాల్లో కనబడతాయి.

"విదురు నింటి విందా వంటి తెలుగు సమాసాలు దేశితనానికి ప్రతీకలు. "శ్రీపాద తీర్థ-తళీయ ప్రసాదములు" వంటి సమాసం సంప్రదాయాఖినివేశాన్ని సూచిస్తుంది. ద్వారవాకిళ్ళు, ఆర్య పెరియలు, అనేక తెఱగులు అనేక యిడుములు, అనేక చెలికత్తెలు- వంటి వైరి సమాసాలు

54

ఆరోజుల్లో అందునా వ్యావహారిక శైలిలో ఉన్న వచనాల్లో ఉండటం అబ్బురమేంకాదు.

పరిష్కరణం . పరిష్కరణీయాలు

డా|| కులశేఖరరావుగారు వచనాల వ్యావహారిక స్వరూపాన్ని గ్రాంధికీకరించటంతో పాటు అనన్వితాలూ అపపాఠాలూ అని తాముభావించిన వాట్నీ చాలా ఓపికతో సావధానంగా పరిష్కరించేరు. ఇందుకు వారెంతేనా అభినందనీయులు. అయినా పరిష్కరణీయాలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఈ ముద్రణంలో మరి కొంత పరిష్కరణం సంప్రదాయాను గుణంగా నేను చేసేను.

మచ్చుకు కొన్ని:- 57వ వచనంలో.

“కుముద కుమూఢాక్షులు(?)ను" అని ఉంది. ఇక్కడ “కుముద కుముదాక్షులు" అని ఉండాలి.

30వ వచనంలో

“ఆ సింహాద్రి జగదీశ్వరుండంగ రంగ వైభోగదాయకుండు శ్రీరంగశాయి శ్రీ పరమపదవాసుండు శ్రీ జగన్నాధుండు సింహాద్రి యప్పుడుఁని వసించు తిరుపట్టణమందు" అని ఉంది. ఇక్కడ వాక్యాన్వయం ఎలా కుదిరిందో తెలీదు. సింహాద్రియప్పుడు కాదు “సింహాద్రియప్పడు" అని ఉండాలి. సింహాద్రినాధుడికి అప్ప అప్పర్ (రు) అప్పడు మొదలైన పేర్లు ఉన్నాయి. కృష్ణమాచార్యులు కూడా ఇదే వచనంలో మరోచోట పొతకమూరి

భాగవతులతో మీ మహత్వము సింహాద్రియప్పడు వినవలెను' అంటారు.ఈ అంతరంగ సాక్ష్యం వినకపోవటం వల్లనే ఎక్కడో వేంకటాచల విహారశతక పద్యపాదం ఉదాహరించేరు. విమర్శకులు కృష్ణమాచార్యుల సింహగిరినరహరి అప్పన్నే అనటానికి. ఇక్కడే మరో విషయం కూడా గమనించాల్సింది ఉంది. పొతకమూరి భాగవతుల్ని పరిమాఆచార్యులవారు

55

“ఎంబెరుమాళ్ళస్వరూపులైన తదీయులు, నదబెరుమాళ్ళ స్వరూపులైన స్వాములు" అని వర్ణించినట్లు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉన్న వ్రాత ప్రతిలో ఉంది. ముద్రిత ప్రతిరో రెండు విశేషణాలకి బదులు ఎంబెరుమానార్ల స్వరూపులైన స్వాములు' అన్న ఒక్క విశేషణమే ఉంది. వ్రాతప్రతిలోని మొదటి విశేషణాన్నే 'ఎంబెరుమానార్లు'గా సంస్కరించి ఉంటారు రావుగారు. 'తదీయులు' రాలేదు. తదీయులంటే భాగవతులనీ అర్ధం. ఇక రెండోది..'నడబె రుమాళ్ళు 'తెలుగు సరస్వతికి కృష్ణమాచార్యులుకై చేసిన చూడామణి యిది. దీన్ని తొలగించేరు శ్రీరావుగారు. 'నడఁగొండ' లాంటిది యీ సమాసం. జంగమ దైవ స్వరూపులని అర్ధం. శైవంలోని జంగమదేవరలకు ప్రతిగా ఉన్నారు వీరని యీ విశేషణం సూచిస్తోంది. దీనివల్ల ఈ పొతకమూరి భాగపతులు చాత్తాద వైష్ణవులనే ఊహకూ అవకాశం కలగకపోదు. దీనికి తోడు వారి పేర్లలో ఆచార్యశబ్దంలేకుండా అందరూ “అయ్యలు'గానే ఉండటం ఇందుకుపష్టంభకంగానే ఉంది. అబ్రాహ్మణులపట్ల ఆచార్యులవారి అదరావి కిచి మరో ఉదాహరణ కావచ్చును. ఇంట్లాటి వాటివల్లనే పాపం ఆయనా ఆయన వ్యాజ్మయమూ కూడా “వెలి' శిక్షననుభవించటం.

18 వ వచనంలో

"పరమరహస్య కారియగు పురుషా కార ప్రపన్నుని తప్పులెన్నుదురు" అని ఉంది. ఇది ఆకర్తృకమై ఆధ్యాహార్యకర్తృకం కావాలి. వాల్తేరు లిఖిత ప్రతిలో 'ద్రష్టలెన్నుదురు'అని ఉంది. ఇలా ఊంటేనే అన్వయం చక్కగా ఉంటుంది. 'ప్రపన్నుని'కి బదులు 'ప్రసన్నుని' ఉంది లిఖిత ప్రతిలో-ఇప్పుడం వ్యయంచూడండి-పరమరహస్యం అంటే చరమశ్లోకం. పరమరహస్యకారి చరమార్ధ ప్రదాత. పురుషాకార ప్రసన్నుడు- లీలామాసుష విగ్రహుడై సాక్షాత్కరించినవాడు- ద్రష్టలు ఋషులు ఎన్నుదురు-కీర్తింతురు. లీలామానుష విగ్రహుబై చరమార్ధ ప్రదాత అయిన పరమేశ్వరుణ్ణి ఋషులే కీర్తంచగలరు. లౌకికులు ఆయన్ని గుర్తించనేలేరు అని యిక్కడి తాత్పర్యం 19వ వచనంలో

'మీ పాదయుగళ పరిమళ మెఱ్గిగినవారికి చందన ఘవసార పల్లవ

56

ములసహ్యములు, -అని ఉంది కృష్ణమాచార్యుల ధోరణిని బట్టియిక్కడ- పల్లవములుకు బదులు 'పరిమళములు' ఉంటే బాగుంటుంది. మరో ప్రతితో సంప్రతించి కాని నిర్ధారణ చెయ్యలేం. 20వ వచనం లో

“భాగవతులు ధన్యాత్ములు. జాయమీశ స్వరూపులు" అని ఉంది. ఇది అనన్వితం. వాల్తేరు లిఖితప్రతిలో(సం)యమీశ స్వరూపులు అని ఉంది. యోగీశ్వరులన్న అర్ధంలో ఈ పూరణమే బాగుంది. లేకపోతే జాయదీశ స్వరూపులు' కావాలి. కాని వ్రాతప్రతిలో యమీశ స్పష్టంగా కనపడు తున్నందువల్ల ఇది సంయమీశ స్వరూపులే కావచ్చును. 21వ వచనంలో

“ఈ విధంబున జగంబునఁజతుర్విధరూపంబుల (?) దాల్చి" అని ఉంది. ఇక్కడ చతుర్విధ రూపాలంటే డాక్టరుగారు ఆశ్చర్యం ప్రకటించేరు. శ్రీరంగం, వేంకటాచలం, శ్రీ జగన్నాధం. సింహాచలం. ఈ నాలుగు క్షేత్రాలయందూ కృష్ణమాచార్యులకు సమాన ప్రతిపత్తి . శ్రీ పరమపదవాసుడే ఈ నాలుగు స్థలాల్లో నాలుగు రూపాలతో ఉన్నాడని ఆయన విశ్వాసం. మిగతా ముగ్గురితోనూ శ్రీపరమపదవాసుడితోనూ సింహాద్రినాయుడికి అభేదమే ప్రకటిస్తారాయన. "శ్రీరంగశాయి శ్రీపరమపద నివాసుండు శ్రీ జగన్నాధుండు సింహాద్రియప్పడు” అంటున్నారాయన. అంచేత 'చతుర్విధరూపంబుల' పట్ల ఆశ్చర్యం అక్కరలేదనుకొంటాను. 25వ వచనంలో

“ఆ చోరుండప్పుడా గ్రహముతో నరువదియేండ్లు మంటిరత్నమున దోగినను తుమ్మ దుడ్డునకు" అని ఉంది. ఇది అనన్వితం. ఇక్కడ ఆధోజ్ఞాపికలో "మన్నుతో కూడిన రత్నములందు" అని అర్ధము కావచ్చుమ" అని డా. రావుగారు సూచించేరు. కాని యిక్కడ వాల్తేరు లిఖితప్రతిలో “అరవై యేండ్ల మట్టిరక్తాన దోగిన తుమ్మదుడ్డుకు" అని ఉంది. పట మలని పరిణామాన్ని గుర్తిస్తే పంచమ్యర్ధకమైన 'పట్టిగా' ఇది తేలుతుంది. మట్టిమైన (పట్టి, పైన) వంటిరూపాలు వ్యవహారంలో ఉన్నాయి. రక్తంలేక

57

రక్తం రత్నంగా వ్రాతలో మారే, పొరబడే అవకాశమూ లేకపోలేదు. మన్నుతోకూడిన రత్నాలలోకంటే 'అరవై ఏళ్ళబట్టి రక్తంలో నానిన 'అన్న అర్థం సరైనదేకాదు సరసమైనదీని. విప్రవధలవల్ల రక్తంలోనే దోగిఉంది ఆదుడ్డు. ఇందులో మౌలికంగా రక్తప్రసక్తి కే అవకాశం ఉంది. దోగిన అన్న ధాత్వర్ధం ఇందుకే తోడ్పడుతోంది. ప్రకరణ బలంవల్లా లేఖన సంభావ్యత వల్లాధాతు సన్నికర్షవల్లా. అన్వయ సారళ్యంవల్లా, అర్ధౌచిత్య సారస్యాల వల్లా కూడా ముద్రితపాఠంకంటె లిఖిత ప్రతిపాఠమే కవిహృదయం కావచ్చుననిపిస్తోంది. 26వ వచనంలో

"శ్వపచోపి మహీపాలః అంటిరి" అనిఉంది. ఇక్కడ మహీపాల శబ్దం సంబుద్దివాచకం. విసర్గాంతంకాదు. 30వ వచనంలో

"నూటయెనుబది తిరుపతులును" అని ఉంది. ఎనుబదికాదు. "ఎనిమిది" అని ఉండాలి. ఇదేవచనంలో చివర మళ్ళీ 'నూటయెనిమిది' అనే ఉంది. 31వ వచనంలో

‘అగాధో ఆర్ధో విష్ణువనెను' అని ఉంది. ఇది బహుశః "ఆకారార్దో విష్ణుః" కావచ్చునేమో ! ముద్రిత పాఠం అనన్వితం. ఇది శ్రీ పరాశర భట్టార్యుల అష్టశ్లోకీ ప్రారంభవాక్యం. 39వ వచనంలో

'అపదోద్ధారకా' అని ఉంది. ఆపదుద్ధారకా అని ఉండాలి. 52వ వచనంలో

“సంకీర్తన నామోచ్చారణంబుచ్ఛరింప ముహూర్తము పెట్టుమనిన విప్రుడాలస్యముచేసె" ఆని ఉంది. లిఖితప్రతిలో 'విప్రుడా స్సెం చేసెను. అని ఉంది. ఆస్సెం ఆంటే హాస్యం. "హోరీ: నువ్వు సంకీర్తనం చెయ్యడ మేమిట్రా" అని యీ కుఱ్ఱవాణ్ణి ఆస్ఫేం చేసేడు, పరిహసించేడు. ముద్రిత పాఠంకంటె ఇదేబాగుంది.

58వ వచనంలో

58

“నీ మహత్వంబు దెలియ బ్రహ్మరుద్రాదులును బ్రహ్లాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాం రుక్మాంగడ విభీషణాది పుణ్యానిమాంపరమ భాగవతులుమిమ్ము నుతియింపలేరు" అని ఉంది. ఈ తెలుగు సంస్కృతాల "ఘోరకలి" ఎబ్బెట్టుగా కాని అనన్వితంగా కాని, సంస్కరణీయంగా కాని, కవ్యుద్దీష్టం కాకపోవచ్చునని కాని పరిష్కర్త లకు తోచినట్లు లేదు. ఇక్కడ అసలు పొరపాటు సమర్ధులుకాని వ్రాయసకాండ్రది. 'ప్రహ్లాద నారద' అని కనపడగానే తమకు వచ్చిన శ్లోకమే అన్న దృష్టి పెట్టుకొన్నారుకాని ఆ శ్లోకంలోని భాగవతుల "పేర్ల పట్టీలు మాత్రం గ్రహించి అంతవఱకూ అవసరం అయిన సమాసాల్నే కవియిక్కడ వాడుకొంటున్నాడన్న వివేకం వారికిలేదు. అంచేత యీ పొరపాటు జరిగింది. 'ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మ దాల్భ్య రుక్మాంగద విభీషణాది పుణ్యులైన పరమ భాగవతులు' అని ఉంటే బాగుంటుంది. 8వ వచనంలోనూ ఇట్లాంటి పొరపాటే జరిగింది.

“మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన రామో రామరామశ్చ బౌద్ధకల్కి దశావతారా" అని ఉంది. ఇది ఎంత అనన్వితం.! శ్లోకంలో ఉన్న పది పేర్లనూ తోరణంగా కూడా సమాసం కూర్చలేనివారా కృష్ణమాచార్యులు ! ఇదీ వెనకటిలాగే 'వ్రాత గాళ్ళ' పొరపాటే కావచ్చును. ఇదే భావం 39వ వచనంలో “మత్స్యకమఠ వరాహ నారసింహమూర్తి వామన జామదగ్ని రామ దశరథరామ రామ కృష్ణ బుద్ధకల్క్యావతారా" అని ఏక సమాసంగా ప్రకటిస్తారు. అయితే సమాసం చివర యణాదేశంలో దీర్ఘం పొరపాటు. 'కల్క్యవతార' అని ఉండాలి.—— ఈ దృష్టితో ప్రస్తుత ప్రతిని వీలయినంతవరకు పరిష్కరించి ముద్రిస్తున్నాం. కాని చేయవలసింది యింకా చాలా ఉంది.

సింహగిరి వచనాలు-రాగతాళానుగుణ ముద్రణావావశ్యకత

తామ్రపత్రికల్లో రాగనిర్దేశంచేసినా తాళనిర్దేశం లేకపోవటం వల్ల తాళ్ళపాకవారి పదసంకీర్త నవిధానం తెలియకపోతోందని శ్రీమాన్ రాళ్ళపల్లి

59

వారు ఆవేదనపడ్డారు. అయినా సమకాలికులైన పదకర్తల బాణీలను, నాటి సంగీత రంగధోరణులనూపట్టీ వారు తాళ్ళపాకవారి పదాలకు స్వరకల్పనం చేసినట్టు చెప్పినానారు. కృష్ణమాచార్యుల విషయంలో ఆమాత్రం అవకాశమూ ఉన్నట్టు కనపడ్డంలేదు. దండెయు, చిఱుతాళంబులు పూని కీర్తించినట్లు తాను చెప్పినందువల్ల ఈ వచనకీర్తనలు రాగతాళ సమన్వితాలే అయి ఉంటాయి. ప్రస్తుతానికీసంప్రదాయం మనం కోల్పోయేమనుకోకతప్పదు. తిరుమల తిరుపతిదేవస్థానంవారు ప్రకటించిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వైరాగ్య వచన మాలికా గీతాల్లాగ రాగభావం ప్రకటించటానికి వీలుగా కనీసం వాక్యాంతంలో ఏకతాళ పద్ధతిని తాళం కొట్టటానికి వీలుగా వింగడింపుతో ఈ వచనాలు పునర్ముద్రణం జరగాలి. ప్రస్తుత ముద్రణంలో కూడా ఈ పద్ధతి పాటించటం కుదరలేదు కారణాంతరాలవల్ల.

వచనాల రకాలు - కొన్ని ఉదాహరణలు

ఛందోబంధ విరహితాలైనా కృష్ణమాచార్యుల వచనాల్లో పదలక్షణమూ గద్యకు మరీ ఆవశ్యకమూ అయిన తూకం కనపడుతుంది. ఈ వచనం చిత్తగించండి.——

దేవా శ్రీ రామానుజ సిద్ధాంతమునుబోలు
           మఱి సిద్ధాంతము లేదు
పరమాచార్యులంబోలు
           మఱియాచార్యులు లేరు
పరమభాగవతులంటోలు
           మఱి భాగవతులు లేరు
వారి కైంకర్య పరులంబోలు
           మఱి కైంకర్యపరులులేరు
అస్మద్గురుభ్యోనమః అను మంత్రమునకు
           సరి మంత్రంబు లేదు
పరమ రహస్యంబునుంబోలు
           మఱి రహస్యంబు లేదు

60

పరమ నాంచారి బోలు
              మఱి జననిలేదు
అనాధపతి స్వామి నరహరిఁబోలు
              మఱి దైవంబు లేదు
స్వామీ సింహగిరినరహరీ
              నమోనమోదయానిధీ !

వైరాగ్య విషయాలను ప్రతిపాదించే పట్టుల్లో ఈయన వచనాల తీరువేఱు' స్తుతిప్రశంసా పరాలైన వచనాల గమనం వేఱు, కథనపరారైన వచనాల నడకవేఱు. అన్నీ ఏకగతిలో ఉండవు' ఈ వచనం తీరు చూడండి.

దేవా

తనువులు మాయ
తలపోసి తలపోసి చెప్పేదనంటినా
కఱకఱల మోహమిది
ఆళల పాషాణంబిది
ఆతుకుల జల్లెడయిది
తన బ్రతుకు కొఱకు పోరాడి పోరాడి
యొరులంజెఱచెడు దుర్గంధపుడొంకయిది
నీరుబుగ్గ, ఊఁటచెలమ, తూంట్ల బాన.
తొడరి దుర్గంధమున బొలుచును
మాటలేకాని మఱి యెందును బసలేదు
నోటను మురికి, దంతంబులపాచి;
నాసికంబున ఊళె, నయనంబున పీళె;
చెవులోని గుల్మి, చెట్టలకొంప;
మూటగట్టుకొన్న మలమూత్రములతిత్తి
చీము నెత్తుటి జడిపురుగుల జలదారి
చిచ్చుటిరోత, పైత్యపు గోళ. పైగల పంచారంబిది
తోలుగప్పిన గొలుసుమ్మిది
నమ్మికలేదు నమ్మికలేదు .ఇది

61

నాటకములాడెడు జూటకముల బొమ్మ
అమ్మమ్మా యీ బొమ్మ!
ఉత్తమ గుణములెంచిచూచెదనంటినీ........

ఇట్లా సాగుతుందీవచనం.

పాటల్లో పల్లవిలాగ ఈ వచనవాక్యాల్లోనూ ఒక పల్లవిలాంటిది ఊతగా ఉంటుంది. దీనితో వచనంకూడా గేయధర్మి అవుతుంది.

"దేవా పెద్దతనంబుచేసి మిమ్ము మెప్పించెదనంటినా జాంబవంతుడు మీ సన్నిధినే యున్నాడే" అని వచనం మొదలౌతూ ప్రతివాక్యం పూర్వ ఖండం 'మిమ్ము మెప్పించెదనంటినా' అన్న దానితోనూ, ఉత్తరఖండం 'మీ సన్నిధినే యున్నాడే' అన్న దానితోనూ ముగుస్తుంది. దీనితో వచనానికి మంచి ఊపు, తూకంతోపాటు తాళగతీ కుదురుతుంది.

చిక్కని చెక్కడపు పనితోడి వాక్యాలూ తాళానుగమనంతో ఎక్కడికక్కడ తెగి అటు రాగభావం ఇటు తాళగతీ రెండూ 'సమతూకం'తో సరిపడేటట్లుండేవీ కొన్ని. ఈ వచనం చూడండి.

దేవా, మీకు మొఱ పెట్టి విన్నపము చేయుచున్నాడను. సంసారమోహ బంధముల దగులువడితిని. కర్మానుకూలంబులంబెనగొంటిని. కాంతలమీది కోరికలు డాసెను. కామాంధకారము కన్నుల గప్పెను. కర్మవారిధి గడువదయ్యెను. ఆపరకర్మములకు లోనై తిని. అజ్ఞానజడుండనై తిని అధమాధముండనై తిని అందని ఫలముల కట్టులు సాచితిని, దుష్ట దురాచారుండనై తిని మూడుండనై తివి. చపలుండనతిపాతకుండను." ఈ ఉపమానాలు పరికించండి——

“కూపములో బడిన శిశువువలెంగూయుచున్నాడను,
తల్లిలేని బిడ్డవలే కలవరించుచున్నాడను,
తైలములోని మక్షికము చందంబాయెను,
ఉరిబడ్డ మెకమువలె నుపాయమెఱుంగక ఉన్నవాడను,
పసిరికకాయ పురుగువలె తేలలేక."

62

“ఆధునిక వచన పజ్యా"లమాతృక

అంత్యప్రాస ఘటితాలై న ఆధునిక వచన గేయాలకు మాతృకా ప్రాయమైన యీ వచనం అవలోకించండి.——

అంకిలియనియెడి తెవులింటికి దిప్పు
అసత్య కృతమే ముప్పు
తగవు ధర్మము నడిపినదె యొప్పు
అనాధపతీ నరహరీ మిమ్ముదలపనిదే తప్పు"

ఇంతటి మహత్త్వ బృహత్త్వాలు గల కృష్ణమాచార్యులవార్ని గురించి సింహగిరి వచనాలను గురించీ చెయ్యవలసిండి, చెప్పవలసిందీ ఎంతేనా ఉంది.

రెండేళ్ళ కిందట కృష్ణమాచార్య సంకీర్తన జయంతి ఉత్సవానికి సింహాచలం వచ్చిన మాన్యమిత్రులు శ్రీమాన్ కులశేఖర రావు గారు సింహాచల దేవస్థానంవారు సింహగిరి వచనాలను ముద్రించవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పిన మీదట అప్పుడున్న కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ ఎస్.చిట్టిబాబు గారు నా పీఠికతో నేను సేకరించిన మరికొన్ని వచనాలతో గ్రంధాన్ని ముద్రింపచేయటానికి సిద్ధపడి పూర్వరంగం ఏర్పరిచినారు.

తరువాత వారి స్థానంలో వచ్చిన మాన్యమిత్రులు శ్రీమాన్ జి. వి. నరసింహమూర్తి గారు ఈ కార్యభారాన్ని స్వీకరించి నేటికి కృతకృత్యులయినారు,

ప్రకృత ముద్రణంలో శ్రీమాన్ కులశేఖరరావుగారు ముద్రించిన వచనాలను వాల్తేరు లిఖితప్రతి సాయంతో సంప్రదాయాన్ని అనుశీలిస్తూ అవసరమయినచోట్ల పరిష్కరణం చేసేను. ఇంకా చేయవలసినవే ఎన్నో ఉన్నాయి.

తిరుపతిలోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంనుంచి నేను సేకరించిన వానిలో కొన్ని వచనాలను ఇందులో మొదటి అనుబంధంగా చేర్చేను. తిరుపతి ప్రతులు (1) R, 206 (2) R 1034 మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం వ్రాత ప్రతులనుంచి వరుసగా 1914-15, 1933-34 సంవత్స

63

రాలతో ఉద్దరింపబడినవి. ఇవి రెండూ ఒకదానికొకటి ప్రత్యంతరాలు.(3) R 447- B ప్రతిలో ఒక వచనమే ఉంది. అది తులసీమాహాత్మ్య ప్రతిపాదకం. దానిలో సింహగిరి ముద్రలేదు. అంచేత దాన్ని వదలి పై రెండు పుస్తకాలలోని వచనాలనే తీసుకున్నాను. పై ప్రతులలో మొత్తం 8 వచనాలున్నాయి. మొదటివచనం ముద్రిత ప్రతిలోని 34వ వచనానికి విస్తృత రూపం కావటంచేత దీన్ని గ్రహించలేదు. నాలుగవ వచనం ముద్రితప్రతిలోని 3వ వచనాన్ని కొంతవరకూ పోలిఉండటంవల్ల దీన్ని గ్రహించలేదు. ఆరవవచనం ముద్రిత ప్రతిలోని 40వ వచనంతోనూ, ఎనిమిదవ వచనం ముద్రిత ప్రతిలోని 7వ వచనంతోనూ సంవదిస్తూండటం వల్లా వీట్నీ తీసుకోలేదు. మొదటి అనుబంధంలో మొత్తం 4 వచనాలు చేర్చేను.ఇవి కృష్ణమాచార్య సంకీర్తనలే అనటంలో సందేహం అక్కరలేదు. వీట్ని ప్రస్తుతానికి యథాతథంగానే చూపించేసు. పరమపద వర్ణనాత్మకమైన వచనం, దశావతాన వృత్తాంత వచనం ఎంతగానో పరిశీలించి వివరణం వ్రాయవలసినవి. ఇందులో చివరవచనం శ్రీ ఆరుద్రగారు పేర్కొన్న వచనమే.

ఈ గ్రంధముద్రణం జరుగుతున్న సమయంలో యాదృచ్ఛికంగా కంట పడింది. "సింహగిరి నరహరి వచనములు" అన్న మరో లిఖితప్రతి. తిరుపతి ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారంలో ఉన్న దీవి ప్రతి వాల్తేరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు గ్రంథాలయంలో R1255 గా ఉంది. ఇందులో 43 వచనాలున్నాయి. వీటిలో ఆరువచనాలు 'దేవా' అన్న సంబోధనతో ప్రారంభం కావటంలేదు వచనాల చివర సింహగిరి ముద్రకూడా కొంచెం భిన్నంగానే ఉంది. 'నమోనమో దయానిధీ'— అన్నది వీటిలో లేదు. 'అనాధపతి'గా కాక సింహగిరీనరహరి వీటిలో “అనాదిపతి'గా గోచరిస్తాడు. చాతుర్లక్ష ప్రసంగం వీటిలోనూ ఉంది. కృష్ణ కువ్వారుస్వామి, యతివరులూ వీటిలోనూ ఉన్నారు. ఐతే ఈ వచనాలభాష కొంచెం సరళంగా మనకు దగ్గరగా కనబడుతుంది, ఇవి సింహగిరి నరహరివచనాలే. అందుకు సందేహం లేదు. వీని కర్త కూడా కృష్ణమాచార్యులే, ముద్రితవచనాల శైలితో కొంచెం విభేదిస్తున్నా మరికొన్ని వచనాలు ఇంకాబయటపడి అన్నిటిపై సమగ్రమైన పరిశోథనం జరిగినతరువాతకాని ఒక నిర్ణయం - వీటిపై చెయ్యటం సాధ్యంకాదు. ఏమైనా ఇవీసింహగిరి వచనాలే. ఇవీ కృష్ణమాచార్య కర్తృకాలే అన్న ప్రత్యయంతో వీట్ని యథాతథంగానే ఇందులో రెండవ అనుబంధంగా చేర్చేను. సహృదయ విమర్శకులు వీటినిఆదరించి వివరాలు, విశేషాలూ వెలికితేవాలి.

సింహాచల దేవస్థానంవారు ఈ సింహగిరివచనాల ముద్రణ భారాన్ని, బాధ్యతను వహించటం ఎంతో ముదావహం. సింహాచలం వచ్చి కృష్ణమాచార్యులవారిపై ప్రసంగించి ఈ వచనాల ముద్రణకు దేవస్థానంవార్ని ప్రోత్సహించిన మాన్యులు, ఆచార్యమిత్రులు, శ్రీమాన్ కొర్లపాటి శ్రీరామమూర్తి, శ్రీమాన్ కులశేఖరరావుగారలకు ప్రణామాలు. వచనాల సేకరణలో పరిష్కరణలో ప్రూఫులు సరిచూడటంలో నాకు తోడ్పడిన నా రెండవ కుమారుడు చి. శ్రీనివాసరామానుజము(ఎం. ఏ., (సంస్కృతం: ఎం. ఏ., (తెలుగు);)నకు ఆశీస్సులు.

కృష్ణమాచార్యులవారిపై విశేష గౌరవాదరాలుకల నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ సింహాచల దేవస్థానం వారికి కృతజ్ఞత నివేదించు కొంటూ కృష్ణమాచార్యవాఙ్మయ పరిశోధనకు విశేషావకాశాలు కల్పించ గోరుతూ ప్రస్తుతానికి సెలవు తీసుకొంటున్నాను.

విభవ - ఆషాఢ - శుక్ల. ద్వాదశి.

శ్రీరామచంద్రాచార్య

  1. 1 మాన్యులు శ్రీ కోదండ రామయ్యగారు పరమ పదించక ముందు వ్రాసినది యీ పీఠిక.
  2. 2 శ్రీ ఆరుద్రగారిచ్చిన వచనం తిరుపతిలో ఉన్న R 1034 'కృష్ణమాచార్య సంకీర్తనము' అన్న ప్రతిలో ఉన్నది. 1978లో తిరుపతి నుంచి యీ ప్రతిని నేను వ్రాయించి తెప్పించుకొన్నాను.