సాక్షి మొదటి సంపుటం/సారంగధర నాటక ప్రదర్శనము
4. సారంగధర నాటక ప్రదర్శనము
జంఘాలశాస్త్రి, సారంగధర నాటక ప్రదర్శనం చూసే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ ఉత్సాహంగానే, కర పత్రంలో నాటక ప్రదర్శన ప్రారంభం సరిగ్గా తొమ్మిది గంటలకే అని ,అచ్చయి వున్నందున - నాటకశాలకు వెళ్లాడు.
అయితే - ప్రదర్శన ప్రారంభం దేవుడెరుగు; వేషధారులింకా సిద్ధమే కాలేదు. వారి వారి మధ్య అంతర్గత కలహాలను కూడా జంఘాలుడు విని, చూడవలసి వచ్చింది. అలాగే ప్రదర్శనం చూడవచ్చిన ప్రేక్షకుల వైఖరికూడా ఎంత 'రసవంతం' గా వుందో, కంటితో చూశాడు
మొత్తంమీద ఎలాగైతేనేం సారంగధర నాటక ప్రదర్శనం ప్రారంభమైంది. ప్రతి రంగంలోనూ పాత్రధారుల నటన, కీర్తనల ధోరణి, ఎంత 'బీభత్సంగా ఉంటాయో వర్ణించి - జంఘాలశాస్త్రి ఒక అద్భుతమైన మాట అననే అన్నాడు - కన్నున్న వాడికి, మెదడున్న వాడికి, హృదయమున్న వాడికి, ఇంతకంటె భయ బీభత్స ప్రదమైన దర్శనమేదీ లేదు" - అని.
ఈ విశేషాలు చెప్తుంటే వాణీదాసు కలుగజేసుకుని - నాటకాలు వచనంలో తప్ప, వాటిలో పద్యాలుండకూడదా? అని ప్రశ్నించాడు. అలాగ నాటక సాహిత్యం గురించి జంఘాలుడు నోరు చేసుకోవలసిన అవసరం ఇంకా ఏర్పడింది. -
జంఘాలశాస్త్రి యిట్లుపన్యసించెను.
నిన్నను నేను నాటక ప్రదర్శనదిదృక్షాయత్తుఁడనై నాటకశాలకు రాత్రి తొమ్మిదిగంటలకుఁ బోయితిని. గ్రాముమునఁ బంచిపెట్టఁబడిన నాటకీయ కరపత్రములలో సరిగాఁ దొమ్మిదిగంటలకు నాకట సూరంభ మగునని వ్రాయఁబడియుండుటచేత నావేళకే పోయితిని. చమురు డబ్బామూఁత సూడఁదీయుటకై దానిమీంచ బీడుక, నిప్పుపెట్టి చాఁకలివాఁడు కాఁబోలు "సుఫ్ ఉఫ్” మనుచున్నాఁడు. నాటకరాజు కూరుచుండు కాకిబంగారు సింహాసనమున కూడినకా లదుకుచుఁ గుమ్మురి కాఁబోలు టక్కుటక్కు మనుచున్నాఁడు. ఎరవు దెచ్చిన బల్లలకుఁ గుర్చీలకు సడుగునఁ బేళ్లను, నాటకరంగాధ్యక్షుఁడు కొఁబోలు మసిబొగ్గుతోఁ బఱపఱ జాడించుచున్నాఁడు. అదివఱకు రాతిపై నూరినకత్తిని దోలుము క్క పై మంగలి కాఁబోలుఁ గంటికి జోడు పెట్టుకొని తటతటలాడించుచున్నాఁడు. "ఏకమే వాద్వితీయం బ్రహ్మ" అను వేదాంతన్యాయము ననుసరించి దురవగాహమై యజ్ఞాతతేజస్కమైన యొకదీపము కాఁబోలు పాకనడుమను ధుమధుమలాడుచున్నది. రంగస్థలమునఁ దెరదింపఁబడియేయున్నది. దానిలోపలినుండి "సఫేదుపొట్లమేదిరా? నీగొంతుకఁగోయ" యనియుఁ, “జాఁకలిముండకొడు కింక బట్టలు తీసికొనిరాలేదా?" యనియు, “గడ్డమున కీమాత్రపు మాపున్న నేమి? “పౌడర్" మీఁదఁ బఱచి పారిపోకుండ నుండునటరా? " యనియు, “దిక్కుమాలినగడ్డాలు! తగులఁబెట్టిననైన మెతకవాసన పూర్వజన్మ వాసనవలె వదలదురా" యనియు. "కంతిసాని గళ్లచీర, కమ్మలజత ఎరవుదీసికొని వచ్చినవాఁ డెవఁడురా? " యనియుఁ, “బూసలకోటు నన్ను వేసికోనీయనియెడల నే నీరాత్రి వేషమువేసిన యెడలఁ దల్లికి మగఁడు" ననియు, "కోటులో నే మున్నదిరా? గాడిదె గుడ్డు! నోటిలో నుండవలయునురా" యనియుఁ బలువిధములగు రసములతోఁ బలువిధములగు రవములు, కీచు, బొంగు, వెలితి, నలీ, లొడుగు మొదలగు జాత్యుపజాతి లక్షణములతో నాటకశాల దాఁటి నాలుగువీథులు దాఁటిపోవునట్టి ఝంకారములతో బయలువెడలినవి. “ అందర్ ఖామూష్" అని నాటకరంగాధ్యక్షుఁడు నాగుండె లదరున ట్రాక్క చావుకేక వైచినాఁడు. ఇంతలో నంగవస్త్రధారియైన యొక్కఁడు దళముగ బూడిదపట్టించిన మొగముతోఁ ధలకట్టుత్రాళ్లు మెడప్రక్కల వ్రేలాడుచుండఁ గృత్రిమ స్తనసౌభాగ్యమును గుసుంబారవికలో నడచి బిగించి, పైంట లేకుండ నోటిలో లొడితెడు చుట్టను సింగారించి త్రిలోకానందకర దివ్యమంగళ విగ్రహములతోఁ దెరప్రక్కనుండి వెలుపలకు వేంచేసి " ప్రాంప్టింగునకు రెండవపు స్తకముఁ దీసికొని రావైతివి. చావుమంటివాయేమి? నీ స్టేజిమేనేజరీ యేడ్చినట్లే యున్నది." అని తీండ్రించి పలికి యంతలో నన్నుఁజూచి యట్టె సిగ్గుపడి చేతులు రవికకద్దు పెట్టుకొని నోటిచుట్టతోడనే తుర్రున లోనికిఁ బోయెను. “అప్పుడే టిక్కెట్ల యమ్మక మారంభించిన “రాస్కెల్" నిటు చెవిఁబట్టుకొని లాగుకొని రమ్ము, పండ్లు రాలఁగొట్టెదను." అని యధికారికావరమున నాటకాధ్యక్షుఁడు కాఁబోలు లోనుండి యజచెను. ఇంతలో నొకతెరప్ర క్కనుండి యరగడ్డమొకటి కొంతసందేహించుచు వెనుకకు ముందునకు దట పటాయించు చున్నది. ఇంకొకప్రక్కనుండి యొక బొర్రముక్కులో మూఁడు పావులవంతు మట్టునకు మరియొక తెరప్రక్కనుండి లటుకునఁ బొటకరించి యడ్డబాసనున్న కల్లకెంపుతో జగజిగ మెఱయుచుండెను. తళుకుమనునంతలోఁ దుసుక్కు మని తుమ్మెకటి యాద్వారద్వయగ హ్వరము నుండి బాగుగ దట్టింపని “తూటా" సంబంధమగు బుసబుసోద్రేకగుంఫనారబ్దహ రాజ్ఞటిల ధ్వానముతో బయలువెడలఁగఁ గెంపుటడ్డభాస నిరాఘాట పవనధాటిచేఁ గాఁబోలుఁ గ్రిందఁబడిపోయెననుకొంటిని. కాని నాది పొరపాటు. అది ముక్కు పట్టులేకజారిన సింగారము కాదు. నోటి పట్టు లేకజారిన సిగరెట్టు. నటకులను బాహాటముగఁ జూడఁదలఁచి నేను రాఁగా నాప్రారబ్దవశమున నటకులు నన్నిట్లు దొంగపోటునఁ జూచుచుండిరి. దీపాలు పెట్టకుండనే పాకలోనికి దాపురించిన నాటకపు మొగమెరుఁగని యీ యనాగరకవ్యక్తి యీపల్లెటూరి వెర్రివేసము, ఈ యాంగ్లేయ భాషాజ్ఞానశుంఠ యెక్కడనుండి విచ్చే సెనో యని నన్నుఁ జూచి కాంబోలు వెంటనే “హి హి హి" యని సకలింప మొదలు పెట్టిరి.
ఆదినమున గ్రామమునఁ బశువుల సంత యగుటచే రసాదరణ పరిపోషణ పటిష్ఠమగు నితర గ్రామకర్షకలోకము కొంత నాటకదిదృక్షచే వచ్చినది. పాఠశాలలలోఁ జదువుకొను బాలురుగూడఁ గొందరు వచ్చి యటునిటు నా సమీపముననే కూరుచుండిరి. వారిలొ వారేమి మాటలాడుకొనుచుండిరో నాకు బాగుగ వినఁబడలేదు. కాని నడుమనడువ మాత్రము కొన్ని కొన్ని మాటలు, “పట్టుపలుపులు” “పంపరపనాసడిప్పలు” “పగలు” రాత్రి యెరుఁగని ప్రాంతచదువులబాపనయ్య “Arrogant Fellow” యనుచు నింకేమేమో వినఁబడెను. ఇంతలో “డొక్క చీల్చిజాలు గొట్టెదను” అని పెద్దయిగిలింపుతో నొక కేక వినవచ్చినది. స్త్రీలకుఁ బ్రత్యేకముగ నుంచినస్థలమున కున్న ద్వారమునొద్ద “నేను గూరుచుండెదను. నేను గూరుచుండెద” నని యిద్దరునటకులు లఘువులయినమాటలచే నూతన సమర సమవాకారమునకు నాందీపూజ చేసి గురువులగు గ్రుద్ధులచే భరతవాక్యము చెప్పిరి. వారిద్దజను గాకుండ మరియొకని నక్కడ గూరుచుండుటకు నధ్యక్షుఁడు నియమించెను. కాని గడియగడియ కొక నటకుఁడు–ఖండకరకార్పాసకూర్వాసము వాఁడ్ హేమాంచలరోచమాన కాచనేత్రములవాఁడో వృశ్చికపుచ్చచ్చ-వివిచ్ఛేదిశ్మశ్రులతా రశ్ములవాఁడో-కమఠపృష్ఠ పరిపాటీసమ శిరోవాటివాఁడో-స్త్రీలున్న యాస్థలమునకు వచ్చి “మీ కన్నియు సరిగా నున్నవికదా!” యనియు, “దగ యగునెడల సోడా” సిద్ధముగనే యున్నదనియు, “మీ రటునిటు పోఁదలఁచినయెడలఁ బ్రత్యేకముగ మీసదుపాయముకొఱ కుంచిన యాస్థలమునకుఁ బోవచ్చు” ననియు, “మీకుఁ క్రింది భాగమున నున్న గోతినిదాఁటిదూలముచేఁ గప్పి పైన గడ్డి బాగుగ వేయించి చాఁపలు పఱపించినను మీకేమైనం గ్రుచ్చుకొనునేమో యని భయపడుచున్నా” ననియు, నిటు లేదో యొక్కొక్కఁ డొక్కొక్క క్షేమ సమాచారవార్త నాకాంతలకు విన్నవించుచుండెను. కాని యొక్కఁ డయిన స్త్రీలసౌఖ్యమునుగూర్చి యశ్రద్ధగ నుండలేదు. నవనాగరక మాహాత్మ్యముచేతఁ గాంతలయెడఁ బురుషు లిట్టి యాదరణమును-ఇట్టి దయను-ఇట్టి భక్తిని ఇట్టి గౌరవమును-ఇట్టి విశ్వాసమును-ఇట్టి ప్రపత్తిని-గనఁబఱచుచుండి రని నే నానంద మొందితిని. ఇంతలో “మీ రాఁడుతోడునఁ బుట్టలేదా? మీరూపములు గాలిపోను. మీసరసములు మాయెదుట నేనా?” యని యేమేమో కొన్ని కాంతాకంఠరవములు వినఁబడెను. ఒక్క పరుగున నెవ్వండో వచ్చి నా ప్రక్కను గూరుచుండిన రక్షకభటాధికారితో “అయ్యా! తమ యాఁడువా రింటికిఁ బోయెద మనుచున్నారు. నటకులు నాట్యాంగనలతోఁ జేయు సరససల్లాపములు సంసారిణులకు శ్రవణపుటఛేదనములుగ నున్నవి." యని చెప్పఁగ నాతఁడు “Scoundrels" అనుచు నహంకారమున లేచి వారి కధికారియగు “మేనేజరును” బిలిపించి యింగ్లీషుభాషతో నేమేమో చెప్పెను. ఆమాటలలో “ప్రాసిక్యూటు” మాత్రము నాచెవినిఁబడెను. పెద్దకోను సాని మనుమరాలయినట్టియు, నూతనముగ రజస్వలయయి విటలోకమునంతయు నట్టుడి కినట్లువేధించునట్టియుఁ, బ్రసిద్ధ కీర్తిస్వరూపిణియు నగు చిన్నకోనసాని దేహపరిమళసౌభా గ్యమునకై సంకల్పింపఁబడి నటకులలో నొకనిచే వినరి వైవఁబడిన కర్రడబ్బిలోని యత్తరువు సీస ప్రక్కను గూరుచున్న రక్షకభటాధికారివితంతుపుత్రికయొక్క నున్నని తలపై లింగముమీఁదఁ జుట్టపీఁక పడినట్టు పడుటచే నీగడబిడ జరిగిన దని తెలిసినది. ఇంతలో దలపగిలినధ్వనియును, మొర్రో యను కేకలును వినఁబడుడుటచే నేను దహతహపడితిని గాని కొబ్బెరకాయను గొట్టి లోననటకులు దేవిని బ్రార్థించుచుఁ బాడుచున్నా రని తెలిసి నాలో నేను నిమ్మళపడితిని. ఇఁక వేళపాకువేసము వచ్చునని నా ప్రక్కను గూరుచున్న యొకనాయండు-నాయీదువాఁడు ఉబలాటముతోఁ జంకలుఁ గొట్టుకొనుచుండెను. లోనిగంట గణగణ లాడుచుండ నెదుటితెర స̃ఱపఱలాడుచుఁ బైకిఁ బోవుచు నడుమఁ గారణాంతరముచేఁ గొంత యాఁగెను. లోనుండి కొందరు నటకు లెగుడుదిగుడులను సవరించి జబ్బపుష్టి నెటులో దానిఁ బైకిఁ ద్రోసిరి. అంత నొకనటకుఁడు ప్రవేశించి సభకు నమస్కరంచి “అమ్మలారా! అయ్యలారా! నేను దమతో సెల వీయఁబో-ఉcహు! మనవి చేసికొనఁబోవున దే దనఁగా యీదినము కాదు, ఈరాత్రి సరిగా పందొమ్మిది ఆC-తొమ్మిదిగంటలకు నాటకము మొదలుపెట్టుదు మని డప్పుముఖమున వెల్లడించితిమి. కాని యాంతరకారణములచే ఆ? ఆఁ! కారణాంతరములచే నట్లు జరుపలేకపోయితిమి. కాన మీరు క్షంతవ్యులుకాదు. మేమేకాఁబోలు" నని పలికి పోయెను. “ఇప్పుడయినఁ ద్వరగ నారంభింపనియెడల మీరు హంతవ్యు” లని యెవ్వఁడో సభనుండి కేకవైవఁగ “చుప్రహో' యని తెరచాటునుండి మఱుకేక వచ్చెను. వేఁపాకువేస మీదినము రాదు కాఁబోలు నని నాయఁడు బెంగ పెట్టుకొనెను. అంతట గ్రామసంచారమునఁ గృతార్థులయి నల్వురు రక్షకభటులు “టిక్కట్లు" లేకుండ లోనికి వచ్చిరి. వారినెత్తిపాగల యెఱుపునుబట్టియుఁ, జేతిదుడ్ల నలుపును బట్టియుఁ, బడపమటిచెప్పుల కిఱ్ఱునుబట్టియుఁ వారి కీ యనన్యసానూన్య గౌరవము గలిగిన దని నింటిని. అనాఁటిరాత్రి సారంగధరనాటక ప్రదర్శనము". ఆలస్యకారణమున నాందీప్రస్తావ నలు విడువఁబడుటచేఁ దన్నాటకకవి యెవ్యఁడో తెలియలేదు. గ్రామమునఁ బంచిపెట్టుబ డిన కరపత్రములలోఁగూడఁ గవిప్రశంస లేదు.
మొదటి యంకమున రాజరాజసరేంద్రుఁడు, నతనిప్రధానుఁడు నుద్యానవనమునఁ బ్రవేశించి వేదవిహితకర్మములఁ గూర్చియు వర్ణాశ్రమధర్మ పరిపాలనముఁ గూర్చియు జనులక్షేమముసు, గర్షకుల పంటలఁగూర్చియు, ధాన్యములధరఁగూర్చియు ముచ్చటించు కొనిరి. రాజకార్యవిముఖుఁడై విలాసముగ నుద్యానవమస నున్న రాజు కీసంభాషణ మెందు లకో నా కిప్పటికిని బోధపడలేదు. అంతటఁ జిత్రాంగియు నొకదాసియు నచ్చటకు వచ్చిరి. వారచ్చట కెందులకు వచ్చిరో వారికిఁదెలియదు. వారిని బుట్టించిన బ్రహ్మకును దెలియదు. అంతట రాజు తొందరతో లేచి ప్రధానుని జేయి పట్టుకొని-
కీర్తన "చూచితే? దానిసాగను చూచితే? నాచునంటి కేశచయము.
త్రాచులాగు నెనుకవ్రేలు-చూచితే?"
అని కాలితోఁ దాళమును దాటించుచుఁ బాడెను.
ఈకీర్తననే ఫిడేలుపైఁ దెరలో నొకఁడు వాయించుచుఁ బాడుచుండెను. నేను దెల్లఁబోయి కూరుచుంటిని. కాంతలయందలి యత్యంతానురాగ మొకప్పుడు మనుజులను దాత్కాలికముగఁ గవులను జేయఁగల దనియు, నట్టివారు తాము వలచినవారి సౌందర్యమును గానమొనర్తు రనియు నేను వినియుంటిని. అట్టిమాఱు పే దైన నీరాజులలోఁ గలిగినదేమో: యని సర్దుకొని యూరకుంటిని. ప్రధానుఁ డాకీర్తననే దొరకబుచ్చుకొని-
"చూచితిన్ దానిసొగసు - చూచి
మిన్నువంటి నడుముగల్గు
చిన్ని చనుల వన్నెలాడి - చూచితిన్. "
అని ప్రత్యుత్తరమిచ్చెను. “నేను వలచినకాంత యవయవములను నీ వట్లు వర్ణిం పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/40 రెండవయంకమున మొదటిరంగమున సారంగధరుఁడును, మంత్రి పుత్రుఁడును, మఱికొందఱు బాలురును బ్రవేశించిరి. కొంత సేపు వారుకుండబంతి నాడిరి. కాలిబంతి యెగిరి ప్రమాదవశమునఁ బైన వ్రేలాడుదీపమును బగులఁగొట్టెను. లోపలిచమురు భగ్గుమనెను. పాక కాలిపోవునని భయపడితిమి. కాని యట్లు జరుగలేదు. తరువాత మంత్రిపుత్రుని చేతినుండి గోటి బిళ్ల యెగిరి సభలో నున్న యొకకోమటి పిల్లవాని కణఁతకుఁ దగులుటచే నాతఁడు సొమ్మసిల్లి పోయెను. అంతటనాతని తండ్రి గోలుగోలున నేడ్వసాగెను. కోమటిమాత్రము నాటకపద్ధతికి విరుద్ధముగాఁ బాటలతో నేడ్వక మాటలతోడనే యేడ్చుచుఁ బిల్లవాని నింటికిఁ దీసికొవీపోయెను. అంతఁ గోతికొమ్మచ్చినాడు చుండగా సారంగధరుఁడు చెట్టుమీఁ దనుండి పడెను. వెంటనే తెరకూడఁ బడెను.
ద్వితీయరంగారంభమున మంత్రిపుత్రుఁడును, సారంగధరుఁడును బావురముల నెగరవైచుచుఁ బ్రవేశించుచు నిట్లు పాడిరి.
❝పావురాల నెగరవైచి పట్టుకొందమా?
మావరాలమూటలైన శ్రీవరాంగసుషమ మీరు❞ ‖పా‖
ఇట్లు పాడియెగరవైచిరి. నాటకగాథ ననుసరించి పావుర మొక్కటి ప్రక్కనున్న చిత్రాంగిమేడమీఁద వ్రాలి కూరుచుండుటకు బదులుగా నెదుటనున్న మాశిష్టుకరణము మేజస్ట్రీటుగారి నెత్తిమీఁదవ్రాలి రెట్టవైచెను. ఆకస్మికమైన మైలవార్త విన్న యాతఁడువలె నతఁడు సల స్నానమునకై పోయెను. ప్రక్కగోతిలోఁబడి పావుర ముండఁగా నది చిత్రాంగిమేడమీఁదనే యున్నట్టు భావించి సారంగధరుఁ డిట్లు పాడెను.
❝పొగరుబోఁత? మా కపోతమా!
తగదు వడిగ తిరుగ తిధిగకున్న పొగ రడంతు❞ ‖పొగరు ‖
పావురము రాకపోవుటచే సారంగధరుఁడు చిత్రాంగి యింటికి వెళ్లుటకు స్థిరపఱచుకొనెను. మంత్రిపుత్రుఁడు మలయమారుతములోఁ గొంత మందలించెను గాని దానిని సారంగధరుఁడు శరకరాభరణముతోఁ జప్పఁబఱచెను. రెండవరంగము నిట్లు ముగిసెను.
మూఁడవరంగమున సారంగధరుఁడు చిత్రాంగి మేడలోఁ బ్రవేశించెను. చిత్రాంగి యాతనిఁ జూచుటతోడనే లేచి గొంతుక బొంగు సవరించుకొని ❝ఆ❞ యని ప్రక్కనున్న శ్రుతితోఁ గంఠమును గలిపి ❝ఊ❞ యని పిడేలువానికిఁ గీర్తనకై తలయెగుపుతో సంజ్ఞ చేసి-
బిలహరి-ఆది.
❛ఒకసారి కౌంగిట నొత్తిన న్నేలరా! ఓరీ! మారాకారా!
తెకతెకను నుడకఁగ తొగలరోయఁడు! పొకపొకల గ్రమ్ముచు
నొడలుపొక్కెను అకట! యింక ❝బ్రదుకంగఁజాలను!
నికటమున న నృట్టి గట్టిగ ‖నొక‖
సారంగధర నాటక ప్రదర్శనము
25
సీ. ❝ నీకుఁ గోపం బేల? నాకుఁ జెప్పుము నాతి! ❞ యనఁగ నదివఱకు మాటలకు లొంగనికాంత పాటకు స్వాధీనయై పైయర్ధపాదమును.
❝నాతోడఁ బలుక కోభూతలేశ!
యనియెను.
రా-నిన్నుఁ బ్రాణసమముగా నేఁ జూచుకొంటిని.
చి-నేను నీయిల్లాలను గాను బొమ్ము.
రా-రత్నాంగి విడిచి నీప్రాపుఁ జేరినవాఁడ.
చి-నేను జచ్చితి నంచు నెంచు మింక.
రా-బిగువైనకౌంగిటఁ బెనంచి ముద్దీయవే?
చి-కోడల నంటకో కుతలనాథ?
రా-కోడ లంటివి? యది యేమి? కోమలాంగి!
చి-కొడుకు నుంపుడుకత్తెఁ గోడ లనఁదగదె?
రా-ఏమి? వానిని దెగవ్రేతు నీక్షణంబ
చి-నన్నుఁ జంపుము మామయ్య! మన్ను ఱేఁడ!
ఇట్లు వీరిద్ద ఱొకరి దొకరుఁ బుచ్చుకొనిన తరువాత మిగిలినదానిని వేరొక రానందభైరవితో సాగఁదీయుచు నొకచెంపను వీరుగొట్ట నొకచెంపను వారు గొట్టుచు వేపారుల యుఠాణిలోవలె నొకతములపాకుచుట్ట నొకరు కొరికి ❝థూ❞ యన, దాని యర్ధమును వేరొకరు కొరికి తిరుగఁబడి ❝థూ❞ యనుచుఁ బగులఁ గొట్టుటలతో నరుకుటలతోఁ ద్రెంపులతో ముడిఁబెట్టుటలతో సర్ధపాదార్ధపాదాన్యోన్యసాహాయ్యా వృతుల తో దిక్కుమాలిన శవము నిద్దరు చెరివైపు సాయపడి బుజములు గలిపి శ్మవానవాటికకడకుఁ జేర్చినట్లు సీసపద్యమును నానాస్వర సాంకర్యముతో సంపూర్తిఁజేసిరి. అంతటఁ దెర దిగెను.
మూఁడవయంకమున రెండవరంగమున న్యాయాధిపతియు, న్యాయవాదులు, నేరగాఁడగుసారంగధరుఁడు, సాక్షులు, సేవకులు ప్రవేశించిరి. సర్కారువైపున నున్నన్యాయ వాది నాదనామక్రియతో నేరగానినేరము నంతయు నుపన్యసించెను. నేరగాఁడు భైరవివర్ణమునఁ దననిర్దోషత్వమును హర్మోనియము సాహాయ్యమునను, జప్పతాళపు సాహా య్యమునను స్థిరపరచెను. సాక్షులందరు కలిసిపాడిరి. సారంగధరునివంకనున్న న్యాయవాది సరససంగీతరచనాచమత్కారముగల యొక్క స్వరగతిని జల్లుజల్లునఁ బాడి సంగతులపై ' సంగతులు లేత ముదురు పట్టు జారు సాపు వరివిక చౌకము దురుసు మంద్రము తారకము బొంగు కీఁచు మొదలగు వివిధ భేదసంప్రదాయములతో విసరి వెదఁజల్లి వర్షించి వినువారితల లను బలాత్కారమునఁ బులిమి సారంగధరుని సత్యసంధతను నౌరోజున నటతాళమున నుపన్యసించెను. వెనుకటి కాలము కాదు. వెనుకటియుగము కాదు. వెనుకటిమనుజులు కారు. వెనుకటి సృష్టి కాదు. అంతయుఁ గ్రోత్త! సరిక్రొత్త! సాక్షిచట్ట మంతయుసంగీత.
సర్వార్థసారసంగ్రహమే! శిక్షాచట్ట మంతయు గాయనగాయనీ జనపారిజాతమే. న్యాయవాదులందఱు గాయకులే! సాక్షు లందఱు సరిగమాధ్యయనశీలురే! బిళ్లబంట్రోతులందఱు పిళ్లారిగీతములయినఁ బాడఁగలవారే! సారంగధరుని నేరము స్థిరపడిన దనియుఁ, గరపాద పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/44 సారంగధర నాటకప్రదర్శనము
27
చున్న మహావైరాగ్య విజ్ఞానభాగధేయమైన యొక్క కొడుకుపై-నవమాసములు మోసి కాంచిన తల్లియైన రత్నాంగికి-మగనికోఁత సవతిరోఁత గలిగిన రత్నాంగీకి-కొడుకును జూచుకొని సంతోషించుటకంటె వేరువేడబమే లేని రత్నాంగికి-కత్తికోఁతకంటెఁ గాలసర్పదశనఘాత కంటే గహనాగ్నికీలికాసంహతీకంటెఁ గడుపుచిచ్చే భరియింపరానిదై యుండఁదగిన రత్నాంగికి-అదరు లేదు-బెదరులేదు-మొగమున దైన్యము లేదు. కంట నీటిచుక్క లేదు. గొంతుకలో బిగింపు లేదు. గుండెలో దడలేదు. లోకసంగ్రహార్థ మేడువవలయు ననుచింతయయినలేదు. ఏమియు లేదు. ఎంతమాత్రమును లేదు. మొద్దు! మొఱఁడు! అయ్యయ్యో! మొద్దులాగుండినను నేను సంతోషింతునే! నేను ❝బళి❞ యని సుతింతునే? కొడుకు దుఃఖమును భరింపలేక కొఱుడు పాఱిపోయిన దని యొకరితోఁ జెప్పి నాలో నేననుకొని సంతుష్టి జెందియుందునే! అయ్యయ్యో! ఆమాత్ర మవకాశ మయినఁ గలుగనీకుండ ముద్దులొలుకఁ బాడుచున్నదే! ముక్తాయించుచున్నదే! ఆహా యిది యెంత ప్రారబ్ధము! అంతటితల్లు లిట్టివారయినఁ బ్రపంచ మొక్క పగటిలోఁ బ్రళయావస్థ నొందియుండునే? అంతట సారంగధరుఁ డొకకీర్తన పాడినాఁడు. దానితో మూఁడవయంకము పూర్తియయినది.
నాలుగవయంకము ప్రథమరంగమునకై తెరయెత్తఁబడఁగ సారంగధరుని మరమం చముమీఁదఁ బరుడఁబెట్టి యిద్దఱు తలారులు గండ్ర గొడ్డళ్లతోఁ గాలు సేతులు నటకుచున్నారు. ఆరాజపుత్రుని దీక్ష-పరాకాష్ఠ-యేమోకాని, యట్టభయంకరావసానసమయమందైన -నాబాలునకు-రాగ మెక్కడ సంకర మగునో, తాళ మెక్కడ ధ్వంస మగునో యను మహాందోళనమే కాని మఱియేచింతయు లేడుగదా? ఆతని చేతులను దలారులు ఖండించుచుండఁగ నాతఁడు పాడుచున్న యెదురెత్తులయ గలపాటలోఁ దాళ మెక్కడఁ జెడిపోవునోయని కాలిమడమతో మంచపు పట్టెమీఁదఁ దాటించుచునేయున్నాఁడు. తాళము పోవుబాధ,ప్రాణము పోవుబాధకంటె నెక్కువది కాదా? లయ బ్రహ్మమని చెప్పుటచేఁ దాళము చెడఁగొట్టిన బ్రహ్మహత్య దోషము సిద్ధింపదా? తెర తన యిష్టానుసార మప్పుడు దిగెను.
అయిదవయంకమున మీననాథుఁడు ప్రవేశించుటయు, నాతఁడు సారంగధరుని బ్రదికించుటయుఁ, దరువాతఁ గునూరునిఁ దల్లిదండ్రులతోఁ గలుపుటయు మొదలగు కథాభాగములన్నియు నేకైకచరణధురీణములగు చిన్నచిన్న పార్షిమట్లుగలపాటతో నాంధ్రికరణ మొందిన టుమీటప్పాలతోఁ బాటకు మిక్కిలి యుపయుక్తములగు వింతవింత వృత్తములతోఁ బల్లవిమార్గపుటందుకట్లతోఁ జౌకపుమార్గపుఁ గారుకమ్మచ్చులతీఁగ సాగింపు లతో ముగింపఁబడినవి నాటకప్రదర్శనము పూర్తి యగుటచే జనులు లేచిపోయిరి.
రూపకాలోకమునమనస్సు మిక్కిలి చెడుటచే శేషించిన రాత్రి బొత్తిగ నాకు నిద్రలేదు. సోదరులారా! ఇంతవింతనాటకమును జూచిన పాపము శాంతించునుగాక, పాపము శాంతించు నుగాక యని లెంపలు వైచుకొంటిని. నూనదుఁడు మేఁకలగొంతుకలను బఱబఱఁ గోయు చుండ మనసు చెదరకుండఁ జూడవచ్చును. మాదిగవాఁడు గొడ్డలి పుచ్చుకొని గొడ్డుతలను బళ్లునఁ బగులఁగొట్టి చర్మమొలిచి మాంసమును ఖండఖండములుగఁ జేయుచుండ గంటఁ దడిపెట్టకుండఁ జూడవచ్చును. కత్తులవ్రేటుతోఁ బల్లెపుఁబోటులతోఁ దుపాకి గుండ్లతో ఫిరంగియుపద్రవములతో మహాసంఘమరణ మొందినజనుల కళేబరములు నెత్తుటివఱదల పైఁ దేలి కొట్టుకొని పోవుచుండఁగ గుండెకొట్టుకొనకుండనైనఁ జూడమ చ్చును. కాని యుచితజ్ఞతా శూన్యుఁడైన కవి కలముమొనతోఁ బ్రకృతికాంతను హృదయకో శమునఁ బొడిచి చంపి చర్మ మూడఁదీసి సంధులు విఱుగఁ గొట్టి నరములఁ ద్రెంపి రక్తమును ద్రావి పచ్చిమాంసపు కండలను నోటఁబెట్టుకొని నడివీథి కెక్కి తెయితక్క లాడుచుండఁ జూడఁగ-నొడలు చావవలసినదే కన్నులు లొట్టపడిపోవలసినదే గుండెలు బ్రద్దలయి నీరు కారవలసినదే —కన్నున్నవానికి, మెదడున్న వానికి హృదయమున్న వానికి నింతకంటె భయ బీభత్స ప్రదమైన దర్శన మేదియు లేదు. మన మేపూర్వజన్మ పుణ్య లేశముననో మనుజులమై పుట్టితిమే అన్నము తినుచున్నామే గుడ్డ కట్టుకొనుచున్నామే – పెండ్లి చేసికొనుచున్నామే -పిల్లలఁ గనుచున్నామే - మనసులోని యూహములను మంచిచెడ్డ లెఱిఁగి వెలువరించుచున్నా మే వంటయింటిలోనికిఁ బోయి మనభార్యలతో నెప్పుడైన 'బీఱకాయ వేఁ గూరఁ జేయవే -సరిగమ గ రి' |॥ బీఱ | రవపులుసు వేసి || బీఱ! " అను సాయంతన పాకసామగ్రీ సందర్భ) మును సంగీతములో వెల్లడించియుంటిమా? అట్లే చేసియుండినయెడల మనయిరుగుపొరు గువారు మనచేతులు కాళ్లు గట్టి తలలు నున్నగ గొఱిగించి నిమ్మకాయపులుసుతో రుద్ది బెత్తముచే మోది యున్మత్తశాలలకుఁ బంపించియుండరా? అజ్ఞానస్వరూపమగు గ్రుడ్డయి నను గడుపునొప్పి రాఁగఁ గ్యారుక్యారున నేడ్చునుగాని సరళస్వరము పాడునా? ప్రొయ్యి యలుకుచుండఁగఁ దేలుచేఁ గుట్టఁబడిన వనిత మొట్టోమొట్టో యని యేడ్చునుగాని ముఖారి పాడి తాండవించునా? అట్లే చేసియుండిన యెడలఁ దేలుమాట యటుంచి దయ్యపుబాధ యని చీఁపురుగట్టలతో వీఁపు తట్టు దేరఁ జానఁ గొట్టియుండరా? కన్నకొడుకు మరణింపఁగఁ దల్లి తల కొట్టుకొని యేడ్చియేడ్చి కొయ్యవాఱిపోవలసినది కాని మొల గట్టుకొని యుత్కంఠమునఁ బాడిపాడి ముక్తాయించితీరవలసినదా? దూడవచ్చిన యావైన దిగులు పడి, డిల్లపడి, గడ్డిమాని, నీరు మాని, దూడను ముట్టెతో స్పృశించి కంట నీరు పెట్టుకొని తహతహచే గింజుకొని "యంబా" యని యఱచునే- మన మంతకంటే నధనుస్థితి నుండవలసి వచ్చెనే! ఎంతమహా ప్రారబ్ధము పట్టినది! పాట కొఱకే మన మప్పుడప్పుడు పాడుకొనుచున్నాము. పాడించుకొనుచున్నాము. కాని ప్రాపంచిక సర్వవ్యాపారములును బాటలతోఁ గాక మాటలతోడనే మనము నిర్వహించుకొనుచుంటి మని మన మంద తెఱిఁగినయంశమేకదా? ఇట్టి మన సాంసారికన్యాపారములలో రాజకీయవ్యాపారములలో నాముష్మిక వ్యాపారములు మొదలగు నన్ని వ్యాపారములలో మనము మన సంబంధులంద జీతో సంభాషించిన సంభాషణకుఁ, జేసినచేఁతలకు, నడచినడతలకుఁ దలంచిన తలఁపులకుఁ బ్రత్యక్షమైన, స్వచ్ఛమైన యాదర్శముగ నుండవలసిన నాటకములలో నీదరువు లేమి? ఈతాండవము లేమి? ఈపాట లేమి? ఈయాటలేమి? ఈయడుకులదంపు లేమి? ఈమిడి మేలము లేమి? ఆహా! మనుష్యత్వము పశుత్వముకంటె నేడాకులు తగ్గిపోయినదే! ప్రపంచము తలడ్రిందయినదే! ప్రకృతిని మంటఁ బెట్టిరే? ఏమి? ఎట్టు? రోగశయ్యపై రాగాలాపములా? ప్రభుసభామధ్యమునఁ బల్లవి దబాయింపులా? భార్యల ప్రక్కలలో బాఠాంతరము లొందిన జావళీలా? తండ్రిగారి దర్భశయ్యపైఁ దానపు బజాయింపులా! కత్తి కంఠముపై ఖసిక్కునఁ బడఁబోవుచుండఁగఁ గారువాతీఱికలా? ఓహో! ఓహో! కాళిదాసుఁడు మనదేశమునఁ బుట్టినవాఁడేకదా! షేక్సుపియరు నాటకములు చదివినవారము కదా! కన్నులు పెట్టుకొని నిత్యము ప్రకృతినిఁ జూచుచున్న వారము కదా! ప్రశస్తకవులకు విరోధముగఁ-మన మిట్టు లేల వ్రాయవలయును? చేతఁగాదందురా! పోనిండు. ప్రకృతిగొంతుక నులిమి గ్రంథమును వ్రాసి ప్రజను బాధ పెట్టనేల? నాయనలారా! కవిత్వమే చెప్పినఁగాని కాలము గడువదా? బ్రతుకుట కెన్నిసాధనములు లేవు? చేసికొనుట కెన్ని పనులు లేవు? అయినను గవిత్వమువలన నీదినములలో జీవనము గడచునా? ఎట్లయినను నాటకకౌక్షేయకమునఁ బ్రకృతిని జంపిన బ్రహ్మహత్యగూడ మనకెందులకు? ఇఁక మీరు కవిత్వమును మానుఁడు. నేనుపన్యాసమును మానేద-
వాణీదాసుఁడు—మీరు చెప్పిన ధోరణినిబట్టి నాటకమున వచనమే కాని పద్యమైన నుండఁగూడనట్లు స్పష్ట మగుచున్నదికాదా?
జంఘా—కాదన్న వారెవ్వరు?
వాణీ—కాళిదాసాదులు తమనాటకములలో శ్లోకములు చేసిరి కాదా?
జంఘా—వారెందులకుఁ జేసిరో యెట్లు చేసిరో యదియంతయు ముందరియుపన్యా సములఁ జెప్పనా? విషయము బహువిపుల మగుటచేత నొక్కయుపన్యాసమున సర్వము పూర్తియగునా? నాటకశైలి యెట్లుండవలెనో, పాత్రా చిత్య మనఁగ నేమో, యుక్తిప్రతియుక్తివైఖరి యెటులుండవలయునో, నాటకమునఁ బద్యము లుండవచ్చునో లేదో, ఉండిన నేపద్యము లెట్లుండవచ్చునో, శుభాంతకష్టాంతనాటకముల తారతమ్య మెట్టిదో యీమొదలగు నంశము లింకఁ గ్రమముగ నాకుఁ దోఁచినట్లు మనవిచేసికొందును. ఆలస్య మైనందులకు క్షమింపుఁడు.