సాక్షి మొదటి సంపుటం/నాటక ప్రదర్శనము

వికీసోర్స్ నుండి

5. నాటక ప్రదర్శనము

ప్రసంగం కూడా ఒకవిధంగా సారంగధర నాటక ప్రదర్శన విమర్శతోనే ప్రారంభమైంది. ఈ ప్రసంగంలో విపులంగా చర్చించిందేమి టంటే నాటకాలలో, ఎన్ని దిక్కుమాలిన మలుపులు, మెలకువలు చూపించి అయినాసరే, నాటక కవి దానిని సుఖాంతంచేసి తీరాలా? అని ప్రశ్న. కవికే ఇంత నియమం ఎందుకు? ప్రకృతిని అనుసరించి పోవలసిన అతను భరతవాక్య మాంగళ్యంకోసం ఎందుకు ప్రాకులాడాలి?

ప్రపంచంలో మనుషుల జీవితాల నడక, వారి వారి కష్టాల కలయిక, కదలిక, ఒకలాగ వుంటూంటే - జీవితం సుఖమయంగా వుందనుకోపడం, ఉంటుందనుకోవడం ఆత్మ వంచన కాదా?

అయితే - మనవారు సుఖాంత నాటకాలను రచించడంతో ఉద్దేశం ఏమై ఉంటుంది, మనమే పూర్వం పడిన కష్టాల్ని ప్రస్తుత సుఖావస్థలో తలుచుకుంటే తాత్కాలికంగా కొంత మనస్సు కలతపడినా, వర్ణనాతీతమైన ఒక ఉత్సాహం ఔన్నత్యంతో కూడిన ఒక విచిత్రానందం మన మనస్సుల్లో మొలక వేస్తుంది.

మనకు కష్టాంత నాటకాలు లేకపోవడం లోటే - కష్టాంత నాటక దర్శనానుభవం వల్ల ప్రజలకు మనస్సులో సంతృప్తి, ప్రాపంచిక వైరాగ్యం, దైవంమీద మనస్సు మరలడం, మోక్షం సంపాదించాలనే కృషి వంటి పరమ సద్గుణాలు పుడతాయి అని - జంఘాలశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

క్రిందటిసారి యుపన్యాసమున సారంగధర చరిత్ర ప్రదర్శనముఁ గూర్చి పలికితిని. కరపాదఖండనము నొందిన సారంగధరుఁడు యమసదనమునకుఁ బోవుటకు బదులుగా నాలుగవయంకమునఁ దండ్రి సదనమునకే పోయెను. ఖండింపఁబడిన కాలు సేతులు యథాస్థా నముల నదుకుకొనినవి. పరలోక ప్రయాణసన్నద్ధమైన యాతని ప్రాణము దిరుగఁ జిలుకకొ య్యకు మూటదగిలించి స్థిరపడినది. చావక తప్పనివానిని జావనీయకుండ నేల? చచ్చినవాని నిగూడఁ దిరుగ దేవతామాహాత్మ్యముల బ్రతికింప నేల? సావిత్రీసత్యవంతుల చరిత్రములో సత్యవంతుఁడు సంపూర్ణముగఁ జావలేదా? చిత్రవిచిత్ర సృష్టికర్మ కళాకలనాకోవిదుఁడగు

కవిబ్రహ్మ తిరుగనాతని ముక్కున నింతయూపిరి యతనిధర్మమా యని పోయలేదా?

నాటక ప్రదర్శనము

31


అల్పాయుష్యము నాతనినుదుట వ్రాసిన యా బ్రహ్మలేఖనమును బెరుమాళ్లసెట్టి పెన్సిలుతోఁ గొట్టివైచియీభూలోకబ్రహ్మ పూర్ణాయుష్యమును గటాక్షింపలేదా?జగత్సృష్టి కర్తయగు బ్రహ్మమాట యెవరియొద్దనైన సాగును గాని గ్రంథసృష్టికర్తయగు కవిబ్రహ్మయొద్ద సాగునా?తనయిష్టమే యిష్టము! తనమాటయే మాట! తన ప్రాంతయే వ్రాఁత! నిరాఘాటవచః పాటవసంపన్నుఁడు. నిరంకుశ క్రియాచరణదీక్షాదక్షుఁడు. పుట్టనివారినిఁ బుట్టించును. గిట్టనివారిని గిట్టించును. గిట్టినవారిని బ్రదికించును. సృష్టిచక్రము నిట్లు సవ్యాపసవ్యములతో జోక్యము లేకుండ నిష్టానుసారముగఁ ద్రిప్పుచుండును. బ్రహ్మాదిదేవత లతనికలమునకు బదులు తన నాటకపాత్రములలో నెవ్వరికైన నసాధ్యకష్టావసరము సిద్ధించునెడలఁ దన యిష్టానుసారముగ నేదైన నొక్కదేవతను జెవులు నులిపి ప్రత్యక్షపఱచి యానాటకపాత్ర మహాకష్టము లన్నియు మంచు విడిపోయినట్లు చేయును. యోగాభ్యాసమునకు, మహాతప స్సునకు, భక్తి విజ్ఞానములకు లొంగని దేవతలంద ఱితని బాతుటీఁక కధీనులయియుందురు. ఈతని మనస్సు మిక్కిలి కనికరము గలది. నాటకాంతమున నెవ్వరిని గష్టములలో నుంచఁడు. యథోచితముగ నందజ కేదియో యొక్క సాహాయ్య మాచరించి వారియిడుము లను గడపి మఱి రంగమునుండి పొమ్మనును గాని కష్టముల నెత్తినెత్తికొని, చింత హృదయమునఁ గట్టుకొని, కంట నీరు పెట్టుకొనిమాత్రము పొమ్మఁనడు. చరిత్రకు విరోధ మని జంకఁడు. సత్యమునకు దూరమేమోయని సందేహింసఁడు. ప్రకృతినైజమునకు వ్యతిరేక మేమో యని టొంకఁడు. ప్రాపంచికవైఖరికి భిన్నమేమో యని తటపటాయించండు. క్రిందిభూమినిఁ బై కెగఁ ద్రోచియో, పైయాకాశమును గ్రిందికి లాగియో, మనుష్యులకు నాకాశగమన మిచ్చియో, పక్షులకు వచన రచనాపాండిత్య మిచ్చియో, పశువులకు బ్రబలధిష ణాచణత్వ మిచ్చియో, కనఁబడని దేవతలఁ గానఁబఱచియో యేదియో ప్రళయోద్దండమగు నొకపన్నుగడఁ బన్ని పర్యవసానమునఁ బాత్రలకు ద్రష్టలకుఁ బరమానంద మిచ్చును. ఇచ్చి తీరును. అన్యథా యెన్నఁడఁ జేయఁడు.

కవి కింతనియమ మెందులకు? ప్రకృతి ననుసరించి పోవలసిన యాతఁడు భరతవాక్య మాంగళ్యమునకై ప్రాకులాడ నేల? ఇది చిత్రముగనే యున్నది. అవనిలో నందఱచరిత్రము లానందపర్యవసన్నములేనా? లోకమునఁ గన్నులు లేనివా రెందజఱు! కాళ్ళు చేతులు లేనివారెందఱు!నపుంసకు లెందఱు! అల్పబుద్ధులెందఱు! పశుప్రాయు లెందఱు! భర్తలచే నిష్కారణముగ విడనాడఁబడిన వనిత లెందఱు! భార్యలు పెట్టిన విషయముచేఁ జచ్చిన భర్త లెందఱు!ధూమశకట మయోమార్గమునుండి దొరలిపోవుటచేఁ దలలు పగిలి, కాళ్లుచే తులు తెగి, చర్మము లూడిపోయి, సంధులు విఱిగి పొడియై రక్తమున ముద్దలై నామరూప ములు లేకుండునట్లు భయంకరమరణము లొందినవా రెందఱు!మహాక్షామములందు నన్నము లేక, కాయ గనరు లేక, త్రాగ మంచినీరు లేక, చింతయంబలి త్రావి, రేగడమంటిబురద ద్రావి, యదియును లేక కడుపు మాండిపోవ, పస్తుపడి నకనకలాడి, యస్థిపంజరములై, మహావ్యాధిపీడితులై, శవస్వరూపములఁ దాల్చి, సశువులవలే గడ్డి తినుటకయినఁ దలపడిన నదియును దొరకక ❝యలో❞ యనుచు, నేడ్చి, తమ రక్తమును దాము ద్రావి, తమ పచ్చినూంసమును దాము తిని, గుండె లార్చుకొనిపోవఁ, గన్నులు లొట్టలువడఁ, గడుపులు వెన్ను నంటఁ, గాళులు లబలబలాడఁ, గడుపులు నింపుకొనుటకయి కన్నబిడ్డలను గాల్చుకొని తినుటకు సిద్ధమయి దిక్కుమాలిన ప్రాణము లెంతకును బోక, ❝చావో చావో❞ , పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/50 బాధ నవిచ్ఛిన్నముగఁ బడుటకే పరమాత్మ మనల సృజించెనా? అతఁ డంత నిర్దయాత్ముఁడా కాదు. ఈ కష్టములన్నియు మనము. తెచ్చుకొనినవే మన మనుభవింపదగినవే-వానిని నివారించుటకు భగవండుఁడైనఁ బ్రత్యక్షము కాఁదగినదే-

ఆ!ఆ!అదెట్లు? సుఖమునే యెల్లప్పుడు కోరుకొనునరుఁడు కష్టమును గోరుకొనునా? అది ప్రకృతి సిద్ధముఁ గాదే? కాన నట్లూహించుటకు వలనుపడదే? ఇంతకంటే విరుద్ధముండునా? ధూమశకటమును నిర్మించిన మహాధీశాలికైన నీదినమున నిన్నిగంటలకు శకటము తిరుగఁబడు ననియుఁ, దన్మూలకముగ జననాశన మగు ననియు గ్రహించుటకు బుద్ధి గలిగియుండునా? అట్లెఱుంగక యాతఁ డెక్కియుండినఁ జావఁగూడదా? ఈమరణము బుద్ధిపూర్వకముగనే తెచ్చికొనినదా? అట్లు చచ్చిన జనులంద ఱెఱిఁగియుండియే చచ్చుచున్నారా? నావలు మునుఁగఁ జచ్చిన వారందఱు చావు నపేక్షించియే సముద్రయానమునకు సమకట్టిరా? వ్యాధులచేఁ జచ్చినవా రందఱు మనఃపూర్వకముగనే మరణించుచు న్నారా? అయ్యయ్యో!మన మీట్లోనర్చిన నట్లు మానినఁ జత్తుమని యెఱుఁగుదుమా? స్వప్నమందైన నట్టితలంపు మనకు లేదే!అట్టిచో మన కష్టములను మనమే తెచ్చుకొంటి మని పలుకుట సమంజసముగ నున్నదా? సాహసముగ నున్నట్లు లేదా?

ఉన్నట్లే యున్నది. కాని యథార్థముగ లేదు. జీవు లనాదులు. అయినను దైవసృష్టిలోనివారు. పశువులకంటె భిన్న జ్ఞానశక్తిగలవారు. మంచి యేదో చెడ్డ యేదో-కాసుబంగారమేదియో కాకిబంగారమేదియో-గుల్ల యేదియో గట్టి యేదియో-పైతళుకేదో లోని సారమేదో –అపథ్య మేదో పథ్యమేదో-భగవత్పృసాదితజ్ఞానతేజో లేశమునఁ గనిపెట్టి నిరాకరణీయ మును నిరాకరించి, యవలంబనీయము నవలంబించి కృతార్థులు గాఁదగినవారు. అట్టివారు మొగము మెఱుఁగులకు మోసపోయి, రంగుతళుకునకు రంజిలి, పైబింకములే పరమార్థశాశ్వత చిహ్నము లని నమ్మి, దిగుడుబావియే యాకాశపుష్పక మని తలఁచి మజువఁదగినదానిని వల్లెవేసి పఠించి, పఠించవలసిన గ్రంథమును బాజవైచి, కొఱవిదయ్యమును గృహదీపముగ భావించి, యాంతరాకాశవాణి ననాదరించి; బుద్ధిపూర్వకముగ-సదసద్విజ్ఞాన సాహాయ్య శూన్యముగఁ దద్భోధనా వ్యతిరేకముగఁ గూడఁ దప్పులు మనము చేయునపుడు తత్ఫలము లనుభవించ నక్కఱలేదా? స్వయంకృతాపరాధసంభూత కష్టసంతతిలో మనకు భగవంతుఁడు-కవికల్పనము ననుసరించి తోడుపడి మనల నానందముగ నోలలార్చునా? దూలగొండిగింజలు చల్లి తులసిమొక్కలకయి కాంక్షింపఁదగునా? తండ్రినిఁ జెప్పుతీసికొని తన్నిన కొడుకు దేవతల పుష్పవృష్టికయి తలయెత్తం దగునా? ❝అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ❞ మ్మని పెద్దలు పలుకలేదా? కర్మ బద్దుల మగు మన మీ జన్మమునఁ బ్రారబ్ధకర్మ మనుభవింపవలసినవారము కామా? ఈజన్మ-ప్రస్తుత కార్యస్థలమైనను బూర్వ మునకు ఫలస్థలము కాదా? జనులలో బుద్ధిమంతులకంటే బుద్ధిహీనులు ప్రబలసంఖ్యగలవారయి యుండుటచే సత్కర్మాచరణులకంటె దుష్కృతికర్త లధికసంఖ్య గలవారని చెప్పవలయునా? కావున సుఖపర్యవసన్న జీవులకంటెఁ గష్టపర్యవసన్న జీవులే మిగుల నేక్కువ సంఖ్యగలవారని తేలుచున్నదే? అదిగాక కష్టములయినను సుఖములయినను స్వయంకృత పూర్వకర్మ ఫలములే కాని మనల బాధించుటకై కాని, సుఖపెట్టుటకై కాని పరాత్పరునిచే నీయఁబడనట్లుగూడ గొంచెము గోచరించుచున్నదా? దుష్కర్మము ప్రబలము గాఁగ దాని పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/52 నీలోకమునగుఱ్ఱాలతోఁకలజాడింపులతో నెగిరిన జోరీఁగల కాటులుగాని — దాతమొగమున శాశ్వతలోకమునందు దేవతాకాంతల పూలసురటులయూపులతో విరియు పారిజాతమకరంద బిందుసందోహములపాటులు కాదా? అట్టి మహానందసదవి యాతనికిఁ బరాత్పరుఁడు శాశ్వతముగ నీయ సంకల్పించియుండ నింతలోఁ గవి— పాపము! తొందరపడి యాతనికిఁ గాసులగంగాళమును సమర్పించు టెందులకు? దానివలన ప్రయోజనమేమి? దిక్కుమాలిన సంసారపు మిడిమేలములోఁ జర్వితచర్వణముగ గంతులు వేయించుటకేకాక మఱియెందుల కది యక్కఱకు వచ్చును? శాశ్వతసుఖ మొందనున్న వానికిఁ దుచ్ఛసుఖమీయఁదగునా? వారణాసిలో సన్న్యసింపఁదలఁచుకొని పోవువానికి వారకాంతను బారితోషికముగ నీయవచ్చునా? సతీలుఁడు (పైని చెప్పినయాతఁడు) ప్రాణములఁబాసి కైలాసమున కేఁగి నిత్యానందమున శంకరసన్నిథానమున వసియింపవలసిన పుణ్యాత్ముఁడు కదా! అట్టి యాతనికిఁ గవి యెట్లాచరించినాఁడు? ఆతనికి దేహసంబంధము వదలి పోవుటతోడనే కానఁబడఁదలచిన శంకరదేవుని రెండు గడియలకుఁ బూర్వమే కొనఁబఱచినాఁడు. అట్లు చేయుటయేకాక, శంకరుచే నాతనికిఁ గైలాసగమన ప్రతిబంధమునుగూడఁ గలుగఁజేయించి యీపాడులోకముననే యింక నిలిపినాఁడు. అది యాతని కుపకార మగునో యపకార మగునో కవి యాలోచించుకొనుట కవకాశములేని సంభ్రమముతో నెటులయిన నాతని బ్రతికింపవలయు నను పట్టుదలతో శంకరు నిప్పుడు తీసికొనిరావచ్చునా? ఆతఁడెవనికైన నిట్టియవస్థలో నీదినమునఁ బ్రత్యక్షమయ్యెనా? దేవతల నిట్లు మనయిండ్లలోని పెద్దబంట్లవలెఁ ద్రిప్పుట సహజవైఖరికి విరుద్ధముగ నుండునేమో యనుసంగతు లేవియు నాలోచింపక కవి యల్గొనర్చెను.

ప్రపంచము ప్రారబ్ధఫలానుభవస్థల మని యాలోచించినను, నూతన కర్మాచరణస్థల మని యాలోచించినను నది దుఃఖపూర్ణమైయున్నట్లు కనఁబడుచున్నది. సుఖ మనునది యున్నయెడల నది మిగులఁ దక్కువగ నున్నట్లు కనఁబడుచున్నది. ఇట్టి ప్రపంచనటనకు పరమార్థ ప్రతిబింబముగ నుండవలసియున్నప్పుడు సుఖాంతనాటకములకంటెఁ గష్టాంతనాటకము లెక్కువగ నుండవలసినట్లు కనఁబడుచున్నది. పోనిండు, అవియు నీవియు సమముగనైన నుండవలసినదా! అటు లున్నవా? పోని? ఆసేతుహిమాచలపర్యంత మున్నభాషలలో నొక్క కష్టాంత నాటకమైన నున్నదా? ఏల యుండకపోవలయును? మనవా రట్టిది యుండఁగూడ దనికూడ నియమ మేమైన నొనర్చిరా? అదికూడఁ జేసినారు. ❝మంగళాదీని మంగళనుధ్యాని మంగళాంతాని❞ యని ప్రబంధ లక్షణమును నిర్వచించినప్పుడు ప్రకృతిలో రూపాయకు పదునాలుగణాల భాగమును బనికిరానిదానిఁ గా మనవారు పరిహరించియే వైచినారు. మిగిలిన యీబేడకాసు నావరణమందును ❝మృచ్ఛకటికా❞ కారుని మొదలు నీసారంగధర చరిత్ర కారునివఱకు నందఱు గిరగిరఁ దిరుగుచు గుడుగుడు గుంచము లాడుచుఁ- బిష్టపేషణముగ వర్ణించిన ప్రకృతులనే వర్ణించుచుఁ-జెప్పిన వాక్యసందర్భమునే రవంత మార్చి చెప్పుచు—భాషాంతరీకరించుచు—శబ్దాభిప్రాయచౌర్యము లవలీలగ నొనర్చుచుఁ బ్రకృతిజ్ఞానమునఁ దప్ప మిగిలినయన్నియసందర్భములలో నన్ని యవకతవకలలో నొకనితల పై నొకఁడు దాఁటిపోవఁ బ్రయత్నించుచున్నారు. యూరోపు ఖండములోని గ్రీకు లేమి? ఇంగ్లీషువారేమి? ఇంకను మఱికొందఱు జాతివారేమి? సుఖాంతనాటకములు, కష్టాంతనాటకములు కూడ వ్రాసినారు. ప్రకృతి ననుసరించి వ్రాయువారందఱటులే వ్రాయఁ దగినదిగాఁ గనఁబడుచున్నది. కేవలము కష్టాంతరనాటకములను నిరాకరించుట హేతుసందర్భమునకు, శాస్త్రమునకు, సమాజవైఖరికిఁ బ్రపంచ ధోరణికి, నితర దేశనాటకకర్తల యాచారమునకుఁ గూడ మిగుల భిన్నముగ నున్నది. ఇట్టి కట్టుబాటు మనలో మాత్రమే యేల ముఖ్యముగ నుండవలయునో స్పష్టముగ గోచరింపదు. నాటకమధ్యమున నెన్నికష్టములున్నను నాటకాంతమున నాకష్టము లన్నియుఁ గడతేఱి తీఱవలయును గదా! ఇట్లుండుటకుఁ గారణములేమో కొంత యూహిం తుము. “కష్టదశలో జనులకు భగవంతుని సాహాయ్యమేదోరూపముగఁ దప్పకుండఁ గలుగవ లసినది. కష్టము లందుచే నివారింపవలసినవి. అట్లే చెప్పకుండునెడల మనుజులకుఁ గష్టములు సహింప శక్యము గావు. భగవంతుడు ఆపద్రక్షకుఁడు. తమ ప్రార్థనల విని తమదైన్యముఁ గాంచి యెటులో యొకటులు తమ్మాపదలనుండి విముక్తులఁ జేయు నను పూర్ణవిశ్వాసము మనుజులకు నశించును. జనులిట్లు భగవత్ప్రర్థనా విముఖులయి క్రమక్రమముగ నాస్తికుల గుదురు." ఇది యొకకారణమని యూహింతుము. కాలిమీఁదఁ గురువు క్రమక్రమముగ నెదుగవలయును. పలుకఁ బాఱ వలయును. చిదుకవలయును. క్రమముగ నారవలయును. అంతట. బాధతీరవలయును. అంతేకాని యీస్ పుగ నెన్నిప్రార్థనములో యాతఁడు చేసినన యిన వియోగ మున్నదా? అది యథారీతిగ మానుటకుఁ దీసికొను కాలములో నొక్కదినమైనఁ దగ్గించుట కెవరికయిన నవకాశమున్నదా? అటులే కర్మఫల మనుభవించి తీరవలయును. అనుభవకాలములో నొక్కతృటియైనఁ దగ్గించుకొనఁగ నెన్ని యేడ్పులేడ్చినఁ దగ్గదు. తగ్గించువాఁ డెవ్వఁడు లేఁడు. పూర్ణముగ ననుభవించవలయును. ఆ యనుభవపూర్తి యయిన పిమ్మట నాయాపత్తంత మందును. ఈయంశములు మనలో మహావేదాంతి మొదలు మందబుద్ధిశిఖామణి వఱకు సంపూర్ణముగఁ దెలియును. ఇట్టి యనుభవము నిత్యసంసారకృత్యముల గడియకొక్కసారి యయినఁ బ్రతిమనుజుని మన స్సునకుఁ దగులుచున్నది. తగిలి యట స్థిరముగ నిలువఁబడి మనస్తత్త్వములో నైక్యమగుచు న్నది. ఐక్యమై దినదినప్రబలమై మన స్సంతయు నావరించుచున్నది. మనలో-నెంత విద్యాహీనుఁడయిన నెంత మూఢుఁడయిన నెంత తుచ్చుఁడయినఁ - గష్టములఁ బడున ప్పుడు “నేను జేసికొనిన దేదో యనుభవించు చున్నాను. ఎంతపాప మొనర్చితినో యంతఫల మావగింజంతయయిన మిగులకుండ ననుభవించి తీరవలయును." అను నిశ్చయాజ్ఞాన ముతో నుండును. ఈజ్ఞాన మనునది యపరోక్షజ్ఞాని మొద లాలకాఁపరివఱకే కాక యధమమైన యంత్యజాతులవారివఱకుఁ గూడ దినదినానుభవములో నున్నది. కష్టములు రాఁగా నెట్టివాఁడయినఁ దన్ను దూషించుకొనునుగాని భగవంతుఁ డీకష్టము లిచ్చినాఁ డని కాని, తా నెట్లో తెచ్చుకొన్న కష్టములు భగవంతుఁడు నివారణము చేయలేదని గాని దైవము నెన్నఁడు దూఱఁడు. అన్నము లేక యేడ్చువాఁడు “పూర్వ మెవనికడుపు మాడ్చితినో. యని యేడ్చును. సంతతి లేనివాఁడు “పూర్వ మెవ్వని కొక్క కుళ్లుకాయనయిన నీయని నిర్భాగ్యుఁడనో" యని యేడ్చును. అంతియే కాని దైవమును దూఱువాఁ డెవ్వఁడును లేఁడు. "ఆపదలందు లొంగి పోకుండ ధైర్యమును గటాక్షింపు" మని భగవంతుని బ్రార్థించును. అంతేకాని కష్టములు - పరిమితి ననుసరించి పడవలసిన కష్టములు పడకతీరని కష్టములు-భగవంతుఁడు పాప లేదని ప్రార్థనావిముఖుఁడై యెవ్వఁడు నుండఁడు. జనులు సాస్తికు లగుదురేమో యను భయము కూడ నెంతమాత్ర మక్కఱలేదు.

నాటకదర్శనమున నంతనమొందవలయునని విచ్చేసిన ద్రష్టలను నాటకమధ్యమున నేడ్చించి నాటకాంతమునఁగూడ నేడ్పించి యేడ్పుతో నింటికిఁ బంపించుట బాగుగ నుండదని మనవారు నుఖాంతనాటకములే యొనర్చి యుందురా? అదికూడఁ గారణము కాదని తోంచుచున్నది. మనమే పూర్వమునఁ బడిన కష్టములను బ్రస్తుత నుఖావస్థలోఁ దలఁచుకొనఁగఁ దాత్కాలికముగఁ గొంత మనస్సు కలఁత నొందినను వర్షనాతీతమైన యొక యుత్సాహము-నౌన్నత్యముతోఁ గూడిన యొక విచిత్రానందానుభవము-మనమనస్సున నంకురించును. ఇతరులు పూర్వమునం బడిన కష్టములు మనము సుఖస్తితిలోఁ బ్రదర్శింపఁ బడఁగఁ జూడఁగ నటులే యంతకంలు నెక్కువగ నొక్కన్వల్ప చింతాచ్చాయావృతమగు నానందము వైరాగ్యగంధిల మగు నొకచి[త్ర మనశ్శాంతి యుదయించును. ఇట్టి యనుభవము మనకు లేదు, దానికిఁ గారణము మనలోఁ గష్టాంతనాటక శూన్యతయే. ప్రాపంచిక జన సంఘార్హశేముషీనాథుండని చెప్పఁబడిన Aristotle అను నాతండిట్లు తలఁచెనని Addison వ్రాయుచున్నాఁడు. Aristotle considers the tragedies that were written in either of these kinds and observes that these which ended unhappily had always pleased the people and carried away the prize in the public disputes of the stage from those that ended happily. Terror and commiseration leave a pleasing anguish in the mind and fix the audience in such serious composure of thought as is much more lasting and delightful than any little transit of joy and satisfaction యిదిగాక Sencea యనునాతఁ డిట్లు చెప్పెనని Addison చెప్పుచున్నాఁడు. A virtuous man struggling with misfortunes is such a spectacle as gods might look upon with pleasure and such as it is when one meets within the representation of a well-written tragedy. Diversions of this kind wear out of our humanity is the ornament of our nature. They soften in solace to the affliction and subdue the mind to the dispensations of Providence.

ఇట్టి యుపయోగము లున్నట్లు బుద్దిమంతులు చెప్పుచున్నారు. అది యంత యుపయోగప్రదమైనప్పుడు-నది ప్రకృతి కెంతమాత్రము భిన్నముకాని దైనప్పుడు- నట్లూచరింపక్షపోవుట యేల?

ఇదిగాక ఒక కవి యిట్లు పలుకుచున్నాండు.

గీ. మానిసికి నున్నదేదైన. లేని దగును!
లేనిదే యుండఁదగినది; లేనిదాని
కేడ్వఁదగినది యుండి లేకేడ్పులేక
లేకయేడుపే బ్రతుకగు లోకమందు

గీ. ధనమొ రాష్టమొ కీర్తియొ తరుణిమణియొ
యేదొ పైంబడ దని యెప్పు డేడ్వవలయు
వస్తు వెద్దానికా బ్రతుకువాఁడె కాని
బ్రతుకుకొఱకునె బ్రతికెడువాఁడు లేఁడు.

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/56

6. నాటక ప్రదర్శనము

నాటకాల్లో పాటల్ని పెట్టడం విషయంలో జంఘాలశాస్త్రికి కంపరం ఎక్కువ. ఆ భావాన్ని అతను ఎక్కడా దాచుకోడు సరికదా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆ పాటలలో విరుపులవల్ల సాగతీతలవల్ల వచ్చే అనర్ధాలకు అతను మండి పడతాడు. నాటకాలలో రస, భావాలను మంటగ లిపే సంగీతమంటే, జంఘాలశాస్త్రి తనకున్న మంటను బయట పెట్టాడు.'' ప్రజలు—అందునా పామరులు ఈ పాటలనాటకాలపట్ల చూపించే ఆదరణ అభిమానం, వేలం వెర్రి ఎంత అర్ధరహితమైనవో, ఖండించి పాశ్చాత్యగాన నాటకాల ప్రసక్తి తెచ్చి, వాటికీ, వీటికీ తేడా చెప్పాడు. ఒక్క భక్తిరస ప్రధాన నాటకాలలో, సందర్భ శుద్ధినిబట్టి పాట ముఖ్యంగా ఉండాలిగాని, ఇతర రసాలలో మిగిలిన పాత్రలుచేత పాటలు పాడించకూడదు. నాటకరంగంమీద గానానికి ఏ మాత్రం చోటీయకూడదని జంఘాలశాస్త్రి తీర్పు.

జంఘాలశాస్త్రి యి ట్లుపన్యసించెను.

ఈనడుమ నాటక ప్రదర్శనముఁగూర్చి రెండుపన్యాసము లీయఁబడినవి. వానిలో మొదటి యపన్యాసమునఁ బాటల నాటకముల యుప్రాశస్త్యము వెల్లడి చేయఁబడినది. దాసరిభాగవతములవలె, దాదినన్ముకలాపములవలె, గరిటెనాటకములపలె, రచ్చబల్ల గొల్లవేసపు గోలలవలెఁ బాటల నాటకములు పామరరంజకమాత్రములు, నోటనున్నధూమ చ్ఛదపుఁదూటకట్టెలఁ గర్ణాలంకారములుగఁ జేసి, నెత్తినున్న చినుఁగుల గుడ్డల నెగదీంత కప్పుఁ గల శ్రేణీమండలము క్రింద సుఖాసనములుగఁ జేసి భామాకలాపపుఁబందిరి కెదురు గను అక్కలను వరుసలేక, క్రమము లేక, బొట్టనవ్రేళ్లపై, మడమల పై, ముంగాళ్లపై, బిఱ్ఱల పై, నొంటియొంటితొడల పై, మోఁకాలిచిప్పల పైఁ గూలఁబడి తలలెత్తి నోళ్లను దెఱచుట కవకాశమున్నంతపట్టున శక్తివంచనము చేయకుండఁ దెఱచి పందిరిక్రిందఁ బండు క్రోఁతివలేఁ బండ్లి గిలించుచున్న హాస్యకరుని కోరుకుళ్లాయి పై నున్న బడ్జెపంగనామములు ❝పెట్టినవా? కుట్టినవా?❞ యను పూర్వపక్ష సిద్ధాంతములు చేయుచు దీని సిగఁదఱుగను! భామవేసమింకఁ బైటఁబడ దేమిరా? యని భామాకథాకలాపాకర్లనోత్కంఠా కుంఠతను నెల్లడించుచు , నీనడుమ ననాహూతుఁడై యన పేక్షితుఁడై వెట్టివేసముతో వేంచేసిన వేణుగో పాలస్వామినిఁ జూచి "అమ్మ" ముండకొడుక! గంపెఁడుగుడ్డలతో గంగిరెద్దువలె నుంటి విరా! ఓరీ! నీవటరా! పట్టుసాలిదాని కూడుతిన్న బాపనపద్దన్నవా! చాలుచాలు! ఈపాటికి .