సర్వలక్షణసారసంగ్రహము
ప్రథమాశ్వాసము
|
నగజాఘనస్తనవిసృత్వరసంకుమదైణనాభిపం
కానిశవాసితస్ఫుటభుజాంతరు డిందుసుధాపయస్సదృ
గ్భూనుతకీర్తి పీఠపురకుక్కుటలింగమహాప్రభుం డశే
షానతభక్తపాలనపరాయణుఁ డీవుత మా కభీష్టముల్.
| 1
|
క. |
రాణించుభక్తిఁ బొగడెదఁ
బాణిద్వంద్వంబు మోడ్చి పరిపాలితగీ
ర్వాణి న్సమ్ముదితాంత
ర్వాణి న్మదరాజకీరవాణిన్ వాణిన్.
| 2
|
చ. |
కరములు దోయిలించి కుతుకంబున నిచ్చలుఁ బ్రస్తుతింతు భా
స్వరగుణవంతుని న్సకలసత్కవిజాలవనీవసంతునిన్
జిరకరుణానిశాంతుని విశిష్టజనానవతానిశాంతునిన్
సురతరుమంజరీనిభయశోహరిదంతుని నేకదంతునిన్.
| 3
|
క. |
చిరభక్తి న్బొగడెద మ
ద్గురునాథుని చెందులూరి కులపాననుని
న్గరుణానిధి నపరాంతక
హరమూర్తిని ఘనుని లింగనారాధ్యమణిన్.
| 4
|
గీ. |
నన్నపార్యుని శ్రీనాథు నాచిరాజు
సోము నమరేశుఁ దిక్కన సోమయాజి
శంభుదాసుని భీము భాస్కరుని మఱియు
గణుతి కెక్కిన సుకవిపుంగవులఁ దలఁతు.
| 5
|
వ. |
అనియిష్టదేవతాప్రార్థనంబును వాణీగణేశ్వరస్తవంబును గురుచర
ణస్మరణంబును మహాకవివర్ణనంబునుం గావించి.
| 6
|
సీ. |
కౌండిన్యగోత్రవిఖ్యాతుఁడ కూచిమం
చ్యన్వయాంభోధనీహారకరుఁడ
గంగనమంత్రిశేఖరునకుఁ బరమపా
వనియగులచ్చమాంబకును సుతుఁడ
వెరవొప్పురుక్మిణీపరిణయంబును సింహ
శైలమాహాత్మ్యంబు నీలపెండ్లి
కథయును రాజశేఖరవిలాసము నచ్చ
తెనుఁగురామాయణంబును మొదలగు
|
|
గీ. |
కృతులు రచియించి పార్వతీపతికి భక్తి
తోడ నప్పన మొసఁగినవాఁడఁ గంద
రాడపురసంస్థితుఁడఁ గడుఁబ్రోడ నేను
దిమ్మకవిచంద్రుఁడను జగద్వినుతయశుఁడ.
| 7
|
క. |
జగదుపకారార్ధము క్రొ
త్తగ లక్షణలక్ష్యములు వితర్కించి బుధుల్
పొగడఁగఁ గృతిఁ జేసెద నెర
వగు లక్షణసారసంగ్రహాహ్వయ మొనరన్.
| 8
|
గీ. |
తెలుఁగునకు మున్ను లక్షణంబులు మహాక
వీశ్వరులు పెక్కు రచియించి యిడిరిఁ కేల
గూర్పవలెనన్నఁ బ్రౌఢిమకొఖక నాకుఁ
దెలిసినతెరంగు నొకకొంత తేటపఱుతు.
| 9
|
క. |
నన్నయభట్టాదులు గృతు
ల న్నిలిపినలక్ష్యములును లక్షణములు యు
క్తి న్నెమకి కృతి యొనర్పుచు
మున్నుగ నాంధ్రంబుచందము న్వివరింతున్.
| 10
|
క. |
కరతలధృతసారంగా
చిరతరకరుణాంతరంగ సింధునిషంగా
కరిదైతేయవిభంగా
గురుతరగోరాడ్తురంగ కుక్కుటలింగా.
| 11
|
|
ధాత్రిపై దత్సమంబును దద్భవంబు
నచ్చతెనుఁగును దేశ్య గ్రామ్యంబు నాఁగఁ
దెల్లమగు నైదుతెఱఁగులఁ దెనుఁగుబాస
దనపుఁ దద్విధ మెఱిఁగింతు విను మహేశ.
| 13
|
గీ. |
హరుఁ డనంగ హరి యనంగ గురుఁ డనంగ
గురు వనఁగ నంబ యనఁ మహేశ్వరి యనంగఁ
|
|
|
గర్త యన భర్త యనఁగ సంహర్త యనఁగఁ
దత్సమంబులు చెల్లు భూధరనిశాంత.
| 14
|
ఆ. |
సవిత సవితృఁ డనఁగఁ జను విధాత విధాతృఁ
డనఁగ నొప్పు నాత్మ యాత్ముఁ డనఁగఁ
గృతులఁ దత్సమములు వితతంబు లగుచుండు
ధనదమిత్ర చారుధవళగాత్ర.
| 15
|
సవితృఁడనుటకు
క. |
సమరంబున భటులు గడున్
శ్రమ మొంది తమముగవిసిరినంగాని సము
ద్యమసంరంభుఁడు గవ్వడి
సమయంబని తొలఁగినట్లు సవితృఁడు గ్రుంకెన్.
| 16
|
విధాతృఁడనుటకు
గీ. |
అతనికీర్తిప్రతాపంబ లవనిఁ గలుగ
నేల యివి యంచు మదిలోన నెపుడు దలఁచు
నపుడు పరివేషమిషమున నబ్జసూర్య
మండలముల విధాతృండు గుండలించు.
| 17
|
గీ. |
హా! యుధిష్ఠురుఁ డెచ్చట నడఁగియున్న
వాఁడొ భీముని పార్థుని వర్తనంబు
|
|
|
లెయ్యెడల నేమిచందంబు లయ్యెనోక
టా! విధాతృండ! కవ లెందు డాగిరొక్కొ.
| 18
|
క. |
అలరఁగ భూ దివ్ శబ్దం
బులు భువి దివి యనఁగఁ బరగు ముక్పదమునకున్
జలముక్కులు రై నౌ పద
ములు రో నావ లగుఁ గృతులఁ బురదైత్యహరా.
| 19
|
క. |
హనుమద్భగవత్పదములు
పనివడి హనుమంతుఁ డనఁగ భగవంతుఁ డనన్
హనుమానుఁడు భగవానుఁడు
ననుచుఁ బ్రయోగింపఁజెల్లు నంబరవసనా.
| 20
|
సీ. |
భుక్పదమునకు భూభుజులు భూభుక్కులు
వాక్పదంబున కగు వాకు వాక్కు
జిత్పదంబున కింద్రజి త్తింద్రజిత్తుండు
విత్పదంబున కగు వేదవిదుఁడు
ద్విట్పదంబునకు వి ద్విషుఁ డనంజెల్లు భూ
భృత్పదంబునకు భూభృత్తు లయ్యె
రాట్పదంబునకును రా ట్టగు మఱియును
రాజపదం బొప్పు రా ౙనంగఁ
|
|
గీ. |
దనరు విద్వత్పదంబు విద్వాంసుఁ డనఁగ
నప్కకుచ్ఛబ్దముల కిల నప్పులునుగ
కుప్పు లనఁదగు దిక్పదం బొప్పుచుండు
దిక్కు లన దిశ లనఁగను ద్రిపురవైరి.
| 21
|
సీ. |
శ్రేయో మనో యశస్తేజఃపదంబుల
కొనరంగ శ్రేయము మనము యశము
తేజమునాఁగ వర్తిల్లును మఱియు శ్రే
యస్సు మనస్సు యశస్సు నాఁగఁ
దేజ స్సనఁగ నొప్పు నోజఃపయోంభస్స
రశ్శబ్దములకుఁ జేరదు మువర్ణ
మరయ నోజస్సు పయస్సు నంభస్సు స
ర స్సనఁ దనరు బూర్శబ్దమునకు
|
|
గీ. |
పురము కిమ్ శబ్దమునకును బొసఁగఁ గిమ్ము
జగ మనంగ జగ త్తనఁదగు జగత్ప
దంబునకు నిట్లు విలసిల్లుఁ దత్సమములు
కుంభిదైతేయమదనాశ కుక్కుటేశ.
| 22
|
గీ. |
వరధనభుజంగకీరశాక్వరపదములు
వనము ధనము భుజంగము నొనర గీర
మును మఱియు శాక్వరము ననఁ దనరుచుండు
దురితభయనాశ రజతభూధరనివేశ.
| 23
|
క. |
దూతపదము స్త్రీలింగము
రీతిం బుంలింగమట్లు గృతులఁ దనర్చున్
దూత యన దూతుఁ డనఁగా
భూతేశ మహేశ నిఖిలభువనాధీశా.
| 24
|
దూతయనుటకు
సీ. |
నిత్యసత్యవ్రత నిషధేశ నీవు మా
కమరంగ దూతవై యభిమతంబు... ....
| 25
|
ఉ. |
దైన్యము దక్కి దూత యుచితంబుగఁ బాండునృపాలు పాలు రా
జన్యవరుండు ధర్మజుఁడు సమ్మతి వేడెడునన్న లోకసా
మాన్య ... ... ... ...
| 27
|
దూతుఁడనుటకు
క. |
తనకడకు వచ్చి మొగమో
డనివాఁడగు దూత పల్కుటకుఁ గోపింపన్
జనదు జననాథునకు దూ
తునిఁ జంపుట నరక మౌట ధ్రువమని రార్యుల్.
| 28
|
ముద్దరాజు రామన్న కవిజనసంజీవినియందు దూత యనే కాని దూతుఁడని లేదనెను గాని రెండును గలవు.
వ. |
ఇది తత్సమప్రకారం బింకఁ దద్భవప్రకారం బెఱింగించెద.
| 29
|
సీ. |
అర్ఘ మగ్గువ యాజ్ఞ యాన కుబ్జుఁడు గుజ్జు
భంగంబు బన్నంబు ప్రౌఢ ప్రోడ
విష్ణుండు వెన్నుండు వీర్యంబు బీరంబు
పుస్తంబు పొత్తంబు భూతి బూది
గుణములు గొనములు కులము కొలమ్మును
బృందంబు బిందంబు పృథివి పుడమి
సంజ్ఞకు సన్నయ శంబునకున సంబు
తాంబూలమునకును దమ్మలంబు
|
|
గీ. |
స్నిగ్ధమునకును నిద్దంబు శ్రీకి సిరియుఁ,
జంద్రమశ్శళబ్దమునకును జందమామ
పీఠశబ్దంబునకుఁ బీట పేర్మి నిట్లు
తద్భవంబులు చెల్లు భూతలశతాంగ.
| 30
|
సీ. |
విను యకారమునకుఁ దెనుఁగునఁ దద్భవం
బై జకారము నిల్చు ననువు మీఱ
యజ్ఞంబు జన్నంబు యత్నంబు జతనంబు
యత్రంబు జంత్రంబు యముఁడు జముఁడు
జవ్వని యువతికి జక్కులౌ యక్షులు,
యోధులు జోదులు యోగి జోగి
యాత్రకు జాతర యయ్యె శయ్యకు సజ్జ
కార్యశబ్దమునకు గర్జమయ్యె
|
|
గీ. |
నిట్టు లాద్యంతముల కొన్నియెడలఁ జెల్లు
చుండుఁ బూర్వకవీంద్రప్రయోగసరణిఁ
జిరకృపాపాంగ కరతలాంచితకురంగ
కాశధవళాంగ శ్రీకుక్కుటేశలింగ.
| 31
|
క. |
దోసము రోసము వేసము
బాసలు తోసంబునంచుఁ బలుకఁగవలయున్
భాసురగతిఁ గృతులం బల
శాసకపూజితపదాబ్జ షాలకు నరయన్.
| 32
|
సంతోసమనుటకు
ఉ. |
శ్రీసతికి న్మురారికిని సేసలు వెట్టిన పెండ్లిపెద్ద ల
బ్జాసనుఁ డంబుజోదరమునందు జనించిననాఁడు చేరి యు/
|
|
|
ల్లాసము పల్లవింప నుపలాలనఁ జేసినయెమ్మెలెల్ల సం
తోసమున న్ముకుందుపయి దోడులు తత్పురి పుణ్యభామినుల్.
| 33
|
గీ. |
సరవితో శబ్దమధ్యావసానములను
క్షాకు ద్విత్వకకారంబు గదిసి నిలుచు
నాక్షకారంబుతోడ హ ల్లంటెనేని
రాదు ద్విత్వకకారంబు రాజభూష.
| 34
|
గీ. |
ఋక్షమునకు రిక్క యక్షులు జక్కులు
పక్షి పక్కి యయ్యె లాక్ష లక్క
యక్షరమున కరయ నక్కరంబగు మఱి
లక్ష్మి లచ్చి యగు నిలాశతాంగ.
| 35
|
ఆ. |
శిఖయు ముఖము ననఁగఁ వెలఁగుశబ్దములకు
సిగయు సికయు మఱియు మొగము మొకము
నాఁగఁ గృతులఁ జెల్లు నాగేంద్రకేయూర
దురితదూర పీఠపురవిహార.
| 36
|
సిగయనుటకు
క. |
సిగ సంపెగపూ లొసపరి
వగ కస్తురినామ మొఱపు వలెవాటౌరా. . .
| 37
|
సికయనుటకు
సీ. |
వనిత యొక్కతె ధూపవాసన యొడఁగూర్చె
నొకకొమ్మ విరిదండ సికను జుట్టె
| 38
|
సీ. |
ఒకయింత యొఱగినసీకమీఁద ముడి పువ్వు
టెత్తులు వలయు తాయెతులఁ జుట్టి
| 39
|
మొగమనుటకు
సీ. |
అలచెందొనలవిందు చెలువెందు వెలి జిందు
మొగమున కొకవింతజిగి దొలంకె
| 40
|
సీ. |
పురుషునీగికి స్వల్పముననె సంతోషింతు
మొగ మెత్తనేరవు మగనియెదుట.
| 41
|
క. |
సగరసుతు లట్లు జగముల
కొగి బాధలు సేయుచున్న నోడి మరుత్ప
న్నగవరు లరిగిరి నాలుగు
మొగములుగల వేల్పుకడకు మునిసంఘముతోన్.
| 42
|
చ. |
విక విక నవ్వి యక్కపటవిప్రకుమారుఁడు మేలు లెస్సవా
నికినయి రాగబంధమున నిల్పె మదిం దరలాయతాక్షి మీ
సకీయ వివాహవేళఁ బురశాసనుపాణిఁ బరిగ్రహించుచో
మొకమున బుస్సురంచు నహి మోగిన నెట్లు భయంబు నొందునో.
| 43
|
క. |
ఒకమాట చక్కెరలపా
నకమా చనుసౌరుసౌమనసకందుకమా
తృకమాయానాతుకమా
నికమా మొకమా సరోజినీరిపురకమా.
| 44
|
క. |
మొక మెఱుకగలదుగదవే
మకరాంకునియసుగుమేనమామకు నీకున్
జికమకలు సేయవలదను
మకటా! మేడపయి కేగి నపుడైన చెలీ.
| 45
|
లక్షణము
ఆ. |
ఇల శవర్ణమునకుఁ దెలుఁగులయందు స
కార మొదవు నొక్కకడల దాని
నేత్వ మెక్కుచుండు నిందుకళాధర
భుజఁగహార పీఠపురవిహార.
| 46
|
ఆ. |
శంఖమునకు సంకు శాణంబునకు సాన
శయ్య యనెడు చోట సజ్జ సెజ్జ
శల్యుఁ డనెడుచోటఁ జర్చింప సెల్లుఁడు
శక్తి సత్త యయ్యెఁ జంద్రజూట.
| 46
|
సెజ్జయనుటకు
ఆ. |
సెజ్జయందు మేను సేర్చి యర్జున కార్య
చింత పలుకకుండి కొంతవడికిఁ
బవ్వళించి కురునృపాలక జలశాయి
|
|
|
దారుకుండు గొలువ నూరకుండె.
| 47
|
ఆ. |
చెట్టయొడసిపట్టి సెజ్జకుఁ దివియుచో
నడుగు బిగ్గఁద్రొక్కి యతివ యపుడు
కూర్మ విభునిమీఁదఁ గొనయ మెక్కించుచో
నల్లపంగుమరునివిల్లుఁబోలె
| 48
|
సీ. |
శేషపన్నగరాజు సెజ్జగా నాతఁడు
వాల్చినాఁ డీతఁడు దాల్చినాఁడు.
| 49
|
'కవిలోకబ్రహ్మ శివజ్ఞానదీపిక
సీ. |
సెజ్జపెఁ బఱచిన చేమంతిరేకులు
కలయ నిందీవరదళము లయ్యె.
| 50
|
సజ్జయనుటకు
చ. |
తళుకుపసిండియోవరలు దంతపుఁబావడ లర్చనాగృహం
బులు గుడినీరుమేడలును భోజనశాలలు గెంపుటోడుబి
ళ్ళలు గరిడీల్ సుశీతలశిలాతలముల్ భవనేశ్వరంబు లు
జ్వలజలయంత్ర ధామములు సజ్జలు దాటి ధరావతీర్ణనై.
| 51
|
సీ. |
ఉండు నేవీట మార్కండేయమునిరాజు
సజ్జలింగ మనంగ శాసనుండు
| 52
|
సెల్లుఁడనుటకు
చ. |
వెరవును లావుఁ జేనయును వీరల కారయ నొక్కరూపు సు
స్థిరభుజశక్తి ధర్మజుఁడు సెల్లునిరూ పడగించి యివ్వసుం
ధర గొనునొక్కొ నే డితని దా సమయించి సమస్తమేదినీ
శ్వరుఁడుగఁ జేయనోపునొకొ శల్యుఁడు గౌరవరాజనందనున్.
| 53
|
ఆ. |
సెల్లుఁ డట్టుల నేల ద్రెళ్ళి చెచ్చర లేచి
యొడలు దుడుచుకొనుచు నొయ్యనరిగె
వానిఁ జూచి నడుచు మానుగా విప్రులు
భూరిసత్వు భీముఁ బొగడి రోలి.
| 54
|
క. |
నృప నీవు మదీయంబగు
జపముఫలం బడిగితేని సమ్మతి నీగా
విపరీతఫణితు లాడిన
సెపియింతుం జుమ్మి యెఱుఁగఁజెప్పితి నీకున్.
| 55
|
లక్షణము
క. |
ఓలి కచటతపవర్గల
నాలవయక్కరము లెల్ల నవి కబ్బములన్
గ్రాలుచునుండును మూఁడవ
వ్రాలై రెండవవి మొదలివ్రా లగు శర్వా.
| 56
|
చతుర్థవర్ణములు తృతీయవర్ణములగుటకు
శా. |
ఏడక్షోహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షోహిణుల్
|
|
|
రూడిన్ గౌరవసైన్య మీయుభయమున్ రోషాహతాన్యోన్యమై
యీడ న్బోవక వీఁక మైఁబొడువఁగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్ ధాత్రీశమంతపంచకమునం దష్టాదశాహంబులన్.
| 57
|
ఉ. |
జాదురజాదురంచు మృదుచర్చలు గీతులు వారుణీరసా
స్వాదమదాతిరేకమునఁ జంద్రిక గాయఁగ దక్షవాటిలో
వీదులవీదులం గనక వీణలు మీటులు పాడి రచ్చరల్
మోద మెలర్పఁగా భువనమోహనవిగ్రహు భీమనాథునిన్.
| 58
|
ఉ. |
బీదశచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మఱున్
బాదలు పెట్టఁగాఁ జెఱలు బట్టఁగ నుండుట భారమంచు రం
భాదిమరున్నివాస లసదప్సరసల్ చనుదెంచివచ్చిరో
నాదరఫుల్లపద్మవదన ల్విహరింపుదు రప్పురంబునన్.
| 59
|
అంగరబసయ్య యిందుమతీకల్యాణము
క. |
కాదేని బిరుదులాడక
సాదులమై వినయ మొప్పఁ జని కురునాథుం
డేది పనిచినం జేసి ద
యాదృష్టి నతండు చూచున ట్లుండఁదగున్.
| 60
|
క. |
విదురుఁడు తండ్రియుఁ దనకున్
బదివేల్విధములను జెప్పఁ బాటింపక దు
ర్మదమునఁ దగియెడుబుద్ధులు
విది మూడిన మర్త్యుఁ డేల విను నుచితోక్తుల్.
| 61
|
ద్వితీయవర్ణములు ప్రథమవర్ణములగుటకు
క. |
అతఁడు మఱి తీర్థయాత్రా
వ్రతవశమున వచ్చె మాపురంబు తెఱవుగాఁ
గతలుగ మాసంసార
స్థితులన్నియుఁ జెప్పె నేమి సెప్పుదు నబలా.
| 62
|
శా. |
ఒచ్చెం బింతయు లేక హంసనడతో నొయ్యారముం జూపుచుం
బచ్చ ల్దాపినకీల్కడెంపునగతో బాగైననెమ్మోముతో
నచ్చంబైన మడుంగుఁ గట్టి చెలితో నామాటలే చెప్పుచున్
వచ్చెంబో కుచకుంభముల్ గదలఁగా వామాక్షి దా నీళ్ళకున్.
| 63
|
కడమయన్నిటికి నీలాగుననె తెలిసికొనునది. ఇది తద్భ
వప్రకారం బింక నచ్చతెనుంగుం జెప్పెద.
అచ్చతెనుంగుప్రకరణము
క. |
సూరిజను ల్లోకవ్యవ
హారంబగుబాస దేశ్య మం డ్రదియె హితం
బారఁగ నచ్చతెనుంగని
యారూఢిగఁ గొంద ఱంద్రు రగజాధీశా.
| 1
|
గీ. |
తగిలి వర్ణంబు లెక్కువతక్కువలుగ
నియమ మెడలించి పల్కు నవియె తలంప
గ్రామ్య మగుచుండె నొరుల దెగడెడుచోట్లఁ
జెప్పఁదగు నది కలధౌతశిఖరిసదన.
| 2
|
ఆ. |
ప్రాకటముగ గృతుల నాకడ నీకడ
యనుచుఁ బల్కుచోట నాడ నీడ
యనిన వర్ణలోప మగు ఫలములకు ఫ
లా లనంగ హెచ్చు నీలకంఠ.
| 3
|
ఇటువంటి గ్రామ్యపదంబు లయినను సుశబ్దంబు లగుట కుదాహరణ మహాకవి ప్రయోగము.
చ. |
అసమున మీఁ దెఱుంగక మహాగ్రహవృత్తిఁ గడంగి చెచ్చెరం
బసులను గాయఁగాఁ జనియె బాపఁడు గౌరవసేన యేడ యొం
టి సనుట యేడ నా కిది కడిందివిచారము పుట్టె సైన్యమున్
వెసఁజని తోడు గావలయు వేగమె పంపుడు చాలునట్లుగన్.
| 4
|
చ. |
అని మది మెచ్చి యొచ్చ మొకయందును లేని మనోహరాంగముల్
గనుఁగొని మౌనికావ్రతముఁ గైకొనియుండెడినన్ను నేల తో
డ్కొని యిటఁ దెచ్చెనీ వెడగు కోమలి భూజగ మేడ మారుతా
|
|
|
శనజగమేడ నెంత ఘనసాహస మింతుల కంచు నెంచుచున్.
| 5
|
సీ. |
ఏడఁబోయెనోగదా పేడలోమంజిష్ఠి
పెనుబండుగందు బైఁబెట్టఁజాల
| 6
|
వర్ణాధిక్యమగుటకు
సీ. |
రమణులార పలాలు రాల్చిన కీరపో
తములప్రాణాలకుఁ దప్పినారు
| 7
|
శా. |
తల్లీ యిన్నిదినాలకేనియు సుభాధారాలవస్యందియై
యుల్లంబుం దినియింపఁజేయుపలు కెట్లో వింటీ నివ్వీటిలో
బెల్లాగొన్నకతాన నేనొకడనే భిక్షానకు న్వత్తునో
యెల్లన్ శిష్యుల గొంచువత్తునొ నిజం బేర్పాటుగాఁ బల్కుమా.
| 8
|
ఫలములకు ఫలాలును దినములకు దినాలును నివి వర్ణాధిక్యములు.
లక్షణము
క. |
మల్లెయు లంజెయు గద్దెయు
నొల్లెయు ననుపగిది పలుకు లొప్పవటంచుం
బొల్లెను మారయకేతన
తెల్లంబుగ నవియుఁ గలవు త్రిపురారాతీ.
| 9
|
మల్లెయనుటకు
రగడ. |
రం తేమిటికిఁ గొఱంతే మల్లెల |
|
|
రగడ. |
మూలమూలల మల్లె లెంతటి - మోహమో హరిణాక్షి డాచితి
యేల యేలకిపొదలు వెదకెద - వింతవింతలె యెందుఁ జూచితి.
| 11
|
గీ. |
మెండుమీఱినపగటిపేరెండ దాకి
యొల్లఁబోయిన పెన్బొండుమల్లెపొదల
| 12
|
లంజెయనుటకు
క. |
అంజెదవుగా కనను చెం
తంజేరఁగనీక యెంత తగ్గిన మిరియా
లుం జొన్నలు సరిగానే
లంజెతనమునందు కొమరులం గెలువనొకో.
| 13
|
ఆ. |
లంజెతల్లు లనఁగ లక్షింపఁగానిట్టి
కట్టడులను నలువ కరుణ లేక
బాతిమాలినట్టి పతుకుల నిడుపఁగాఁ
జేసి విటులగోడు వోసికొనియె.
| 14
|
గద్దెయనుటకు
.
గీ. |
చంద్రికాపాండుకౌశేయశాటియైన
యతనుజగజంపుగొడు గెవ్వఁ డవ్విభుండు
|
|
|
పెద్దగాలంబు ముత్యాలగద్దె యెక్కి
వసుధఁ బాలించు నేకోష్ణవారణముగ
| 15
|
ఒల్లెయనుటకు
గీ. |
నారికేళాసవపుఁదీపు టూరు పొలయ
వలిపె యొంటొల్లెతో నురస్థలులఁ గూరు
ప్రియలఁ దేకువతో నెచ్చరించి కలసి
రెలమి ధన్యులపరపు వెన్నెలబయళ్ళ.
| 16
|
సూ॥ ఏదంతతాచనామ్నామన్యతరస్యామియాంతానాం॥
అని శబ్దశాసనసూత్ర మున్నది గనుక మల్లె, లంజె, గద్ది, ఒల్లె యని యనవచ్చును.
లక్షణము
ఆ. |
చనియెఁ గనియెఁ గొనియె ననుటకుఁ జనెఁ గనెఁ
గొనె నటంచుఁ జెప్పఁగూడదనుచుఁ
బలికె నూత్నదండి పరికింప నివియును
గలవు కృతుల శిశిరకరవతంస!
| 17
|
చనెననుటకు
క. |
అని మందోదరి దెల్పిన
విని దైత్యుఁడు సిగ్గునొంది వెలఁదియుఁ దానుం
జనె నభ్యంతరమునకున్
|
|
|
మనమున జయకాంక్ష మిగుల మల్లడి గొనఁగన్.
| 18
|
చ. |
మగఁటిమిఁ జంద్రుగు డ్డురక మట్టిన వామపదాంబుజంబునై
నిగళమున న్సురాసురల నించినయందియ ఘళ్ళుఘళ్ళనం
బొగడలు బొండుమల్లియలు పొన్నలు పాగడ నెల్లియంబున
న్నిగిడిచి వీరభద్రుఁడు చనెన్ శశిమౌళిసమీపభూమికిన్.
| 19
|
ఉ. |
భీమునిజానుదేశముల భీషణవాయువు లుప్పతిల్ల సం
గ్రామతలంబున న్విసరఁగాఁ జతురంగసమస్తసైనిక
స్తోమము నభ్రమండలముతో నొరయంజనె బొందితోడ సు
త్రామునివీటి కేగెడువిధంబున దివ్యులు చోద్య మందఁగన్.
| 20
|
కనెననుటకు
క. |
వరకన్యకయఁట నేనఁట
వనమున గాంధర్వమున వివాహంబఁట నం
దనుఁ గనెనఁట మఱచితినఁట
వినఁగూడునె యిట్టిభంగి విపరీతోక్తుల్.
| 21
|
ఉ. |
అంత సుమిత్రయుం గనె ననంతవిలాసుల ధర్మశాస్త్రసి
ద్ధాంతరహస్యకోవిదుల ... ... ... ...
| 22
|
గీ. |
సవతి కద్రువ శేషతక్షకులు మొదలు
గాఁగ వేవురు భుజగపుంగవులఁ గాంచె
నండముల రెంటిఁ గలధౌతగండశైల
సన్నిభంబులఁ గనెఁ బుణ్యసాధ్వి వినత.
| 23
|
కొనెననుటకు
మ. |
అసమస్థేమకిరీటి పాశుపతదీక్షారంభముం గైకొనెన్.
| 24
|
ఉ. |
పూని ముకుందునాజ్ఞ కనుబొమ్మనె గాంచి యజాండభాండముల్
వాననుమీఁదఁ బోవ నడవంగొనెఁదన్న ననగ్రనిశ్చల
త్వానుచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతనల్
గా నుతి కెక్కు సైన్యపతి కాంచనవేత్రము నాశ్రయించెదన్.
| 25
|
ఇది పంచవిధాంధ్రలక్షణం బింక తద్వర్ణప్రకారంబుఁ జెప్పెద.
వర్ణప్రకరణము
సీ. |
అఇఉలు ఏఓలు నవి దీర్ఘసహితంబు,
లైఔలు కగచజ లరయ టడణ
తదనలు పబమలు దగ యరలవసహ
ళఱలును దెనుఁగున వఱలుఁగాని
తక్కినవర్ణముల్ దగులవు పదముల,
మొదల వాకుత్వోత్వములు గలుగవు.
లే దెయ్యెడలను శబ్దాది యకారంబు,
వచ్చు నచ్చుల తుది యచ్చున కది
|
|
గీ. |
తుదల క్రియదక్క నేత్వ మెందులను దాని
కెనయనేరదు సత్కవు లిటు లెఱింగి
కావ్యములు గూర్పవలయు విఖ్యాతి మీఱ
నిభదనుజభంగ కుక్కుటాధీశలింగ.
| 1
|
సూ॥ వికృతిపదాదౌ ప్రథమాంతస్థతృతీయానునాసికౌ నస్తః।
కృతిరపి నస్త ఉదోతౌ దంతోష్ఠభవస్య వికృశబ్దాదౌ॥
అని శబ్దశాసనుఁడు చెప్పినాఁడు గనుక వకారమున కుత్వోత్వములును యకారమును దెనుఁగునఁ బదాదిని లేవు.
లక్షణము
|
వాలాయంబుగఁ దెనుంగువ్రా లయ్యుఁ గృతుల్
గ్రాలుచునుండును దొడ్డగు
వ్రాలై దేశ్యంబులగుట వలన మహేశా.
| 2
|
సీ. |
జాణ రాణువ రాణ గాణ విన్నాణంబు
కాణాచి యనెడుదీర్ఘములమీఁదఁ
గాని హ్రస్వముల ణా గలుగదు రవణము
రమణయతక్క నాంధ్రములయందుఁ
బడఁతుక మడఁతుక యడఁకువ యడఁచుట,
కడఁగుట తోడఁగుట పొడఁక కడఁక
పడుకులు వడఁకుట వెడఁగును మడుఁగును
దొడఁకున కడిఁదియు వెడఁద బెడఁద
|
|
గీ. |
యనఁగఁ బరగెడుపదములు నర్ధబిందు
యుతము లైన డకారము లొనరియుండు
కనకశైలేంద్రకోదండ కమలజాండ
భాండసంఘాతపూరిత పటుపిచండ!
| 3
|
లక్షణము
క. |
సిద్ధము సాధ్యము ననఁగఁ బ్ర
సిద్ధములై యిరుదెరగులఁ జెల్లును గృతులం
దిద్ధరణి ననుస్వారము!
లుధ్ధతరిపుదర్పహరణ యురగాభరణా.
| 4
|
ఆ. |
చంద మంద మనెడు సహజబిందువులు సి
ద్ధంబులగు నొయారపుంబడంతి
యన నకారమున నాదేశమై వచ్చు
నవియె సాధ్యములు సురాద్రిచాప.
| 5
|
క. |
అఱసున్న లొదవు నిడుదల
నెఱసున్నలె గద్యములను నిలుచుఁ గృతులలో
నఱసున్నలు నెఱసున్నలు
గుఱుచలపై గలిగియుండుఁ గుక్కుటలింగా.
| 6
|
సీ. |
కొంటిమి తింటిమి వింటివి కంటివి
మని రని రనెడుతిఙ్మధ్యములను
గూఱ్చియన్న ద్వితీయకును శేషషష్ఠికి
వనము ధన మ్మను ప్రథమలందు
నౌర యోహో యనునద్భుతార్ధముల న
క్కట యయో యని వగచుటల నించు
కరవంత యనియెడు కడల బళా మజ్ఝ
యను బ్రశంసనములఁ జని హరించి
|
|
గీ. |
యనెడిచో మిన్న కూరక యనెడుచోట
నప్పు డిపు డనుచో నిన్నె యనెడిచోట!
నరిగెనట యనుచో నేమి యనెడుచోట
మొదలుగాఁ బైనకారంబు లొదవ వీశ.
| 7
|
క. |
కళ లనదగు నివి మఱియు మి
గిలినపదంబులు ద్రుతప్రకృతు లనఁబరగున్
లలిఁ బొల్లు నకారముపైఁ
గలిగి వసించుటను గృతుల గౌరీరమణా.
| 8
|
ఇది సంజ్ఞాప్రకరణం బింక సంధిప్రకరణం బెఱింగించెద.
సంధిప్రకరణము
సీ. |
ఆనతిచ్చుటయు మేనత్త యేమయ్యెను
మగనాలు పురటాలు మగువలిండ్లు!
బండెద్దుడు పెండ్లాడి వెండుంగరంబు పై
డందెలు చనకుంట యఱువదాఱు
నూటొక్కటియుఁ దొమ్మనూటాఱు పాలిండ్లు,
తండ్రేడి యొంటొల్లె దాసరయ్య
యింకేమిటికిఁ బుట్టినిల్లు రావాకు మ
ఱేమి వెల్లేనుఁగు కోమటక్క
|
|
గీ. |
యనఁగఁ బరగెడు నుడువులయందు సంధు
లడఁగుఁబొడముచునుండు ని ట్లాంధ్రకవుల
యనుమతంబున శైలకన్యాహృదీశ
దురితభయనాశ పీఠికాపురనివేశ.
| 1
|
1 ఆనతిచ్చుట. ఇకారవికల్పసంధి.
సీ.గీ. |
తమ్మి కేలుండఁ బెరకేలు దండయిచ్చు
లేము లుడిపెడు లేఁజూపు లేముతోడఁ
దొలుకు దయఁదల్సు చిఱునవ్వుతోడఁ గల త
దాంధ్రజలజాక్షుఁ డిట్లని యానతిచ్చె.
|
|
క. |
ఆదిత్యమరుద్వసురు
ద్రాదిసురలు మునులు నంబుజాసనుఁ గని మా
|
|
|
కేది కరణీయ మీశ ద
యాదృష్టిని మమ్ముఁ జూచి యానతి యీవే.
| 3
|
2 మేనత్త యనుట. అకారవికల్పసంధి.
సీ.గీ. |
గరగరనివాఁడు నవ్వుమొగంబువాఁడు
చూడఁగలవాఁడు మేలైనసొబగువాఁడు
వావి మేనత్తకొడుకు గావలయు నాకు
నర్జునుండు పరాక్రమోపార్జనుండు.
| 4
|
3 మేనయత్త యనుట
.
ఉ. |
మంచిగ మేనయత్తలు సమాదరణం బడరంగఁ బెట్టిపు
త్తించిన మంచికజ్జములు తేనియ నేతనుఁ దోఁచి తోఁచి
| 5
|
4 ఏమయ్యె ననుట. ఇకారవికల్పసంధి.
గీ. |
అగ్ను లేమయ్యెనొక్కొ నిత్యంబులైన
కృత్యములఁ బాపి దైవంబు కినుక నిట్లు
| 6
|
5 ఏమియయ్యె ననుట
చ. |
హరిహయుఁ డేమియయ్యె నొకదామదనానలతాపవేదనఃన్.
| 7
|
6 మగనా లనుట. ఇకారవికల్పసంధి.
సీ. |
ఓర్మి మై నుప్పిడి యుపవాసముల నుండి
మగనాలి సరిఁబోల్పఁదగదు విధవ.
| 8
|
7 మగనియా లనుట
.
ఉ. |
ఆసమయంబున న్మగనియాండ్రును గన్యలు నాక సొచ్చి ధా
త్రీసురరాజవైశ్యులను దేకువసేయక యెట్లచోట్లనున్
| 9
|
8 పురటా లనుట. ఇకారవికల్పసంధి.
క. |
పురు డీబోఁటికి నిందిర
పురు డంబిక గాక యొరులు పురుడే యనుచున్
బురుటాలికిఁ బదిదినములు
పురుడు ప్రపర్తించి రెలమిఁ బుణ్యపుగరితల్.
| 10
|
9 పురిటియా లనుట
సీ. |
పొదివితేఁ గానక పొత్తులలో పట్లఁ
బోనాడుకొనిన లేఁబురిటియాండ్రు
| 11
|
10 మగువలిం డ్లనుట, అకారవికల్పసంధి
సీ.గీ. |
వారికన్నను నీమహత్వంబు ఘనమె
పవనపర్ణాంబుభక్షులై నవసి యినుప
|
|
|
కచ్చడా ల్గట్టుకొను మునిముచ్చులెల్లఁ
దామరసనేత్రలిండ్ల బందాలుగారె
| 12
|
11 పెండ్లాడి యనుట
.
గీ. |
పారుఁడొక్కఁడు పెం డ్లైనబాల దాను
బాల్యమున నీ మనను బెల్లుబడిని బుచ్చు
కొనిన తద్విధ మెఱిఁగి తజ్జనకుఁ డలిగి
తిట్టి వెడలిపొమ్మనుఁడు బార్థివసుతుండు.
| 13
|
12 'పెండ్లియాడి యనుట
.
ఉ. |
కోమలచారుమూర్తి పురు-కుత్సుఁడు నర్మదఁ బెండ్లియాఁడడే
| 14
|
13 వెండుంగరం బనుట
సీ. |
పంచాంగముష్టియుఁ బాణిపవిత్రంబు
నొకజుఱ్ఱవ్రేలివెండుంగరంబు!
| 15
|
11 రావియా కనుట. నిత్యసంధ్యనిత్యత్వము
సీ. |
అలరులు ఫణివీచు లభ్రంబు సుడిరావి
యాకుసైకతములు నంట్లు దొనలు
| 16
|
15 వెల్లేనుఁ గనుట. అకారవికల్పసంధి
ఉ. |
సైనికు లంత నంత రణసన్నహనం బెడలించి పాఱిన
న్నానయు నచ్చలంబు మది నాటుకొనంగఁ గపోలమండలీ
దాన మిళ ద్విరేఫనినదంబుల ఘీంకృతు లుల్లసిల్ల వె
లేనుఁగుమీఁద డీకొలిపి యింద్రుఁ డుపేంద్రుఁనిఁ దాఁకె నుద్ధతిన్.
| 17
|
వ. |
ఇటువలెనే కడమయన్నిఁటికినిఁ దెలిసికొనునది.
|
|
లక్షణము
క. |
ఇమ్ముగ శబ్దముతుది వ
ర్ణమ్ము దరి న్వచ్చునచ్చునకు యా యొదవుం
గొమ్ము గలహల్లు ప్రథమాం
తమ్మైన నడంగు నచ్చు ధవళశరీరా.
| 18
|
ఉదా. చ. |
హయరథదంతిసంతతి నిరంతరదుర్దమలీలఁ బేర్చి నే
ల యవిసి మూఁగిన ట్లగుబలంబులతోడఁ ద్రిగర్తు లెంతయున్
రయమున గోవులం బొదివి రక్షకు లొక్కట నార్చి తాఁకినన్
భయదమహాస్త్రశస్త్రపటుపాతపరంపరఁ దున్మి యుద్ధతిన్.
| 19
|
లక్షణము
క. |
ధరఁ బ్రథమమధ్యమోత్తమ
పురుషల బహువచనములను బొదలెడునచ్చుల్
బెరయుచు నెడయుచు నుండుం
|
|
|
గురుతరకరుణాంతరంగ కుక్కుటలింగా.
| 20
|
నిత్యమనుత్తమపురుషక్రియాస్వితః
అని శబ్దానుశాసనుఁడు సూత్రమును జెప్పినాఁడుగనుక నుత్తమపురుష గాక ప్రధమమధ్యమపురుషక్రియలమీఁది యచ్చులు శ్లిష్టమౌట సిద్ధమే.
16 విడియుండుటకు బ్రథమపురుషకు
సీ.గీ. |
చంద్రమౌళిభరద్వాజసంయములును
హంసపదియను నొకకిన్నరాంగనయును
నాప్రవాళోష్ఠిమగఁడు వేణీప్రియుండు
సిద్ధిబొందిరి యవిముక్తసీమయందు.
| 21
|
మ. |
బలభిడ్వహ్నిపరేతరాజవరుణుల్ పర్యుత్సుకత్వంబు సం
ధిలఁ గూర్చుండిరి యొండొరుం గదిసి యర్థిం దత్ప్రదేశంబుల
న్నలనాళీకమృణాలనాళలతికానవ్యప్రణాళీమిళ
ల్లలనాలాపకథాసుధానుభవలీలాలోలచేతస్కులై.
| 22
|
ఉ. |
కూడిరి యొండొరు ల్దొరసి కుంతలకాంతు లొసంగి వీడుజో
డాడిరి క్రేళ్ళు దాటిడుచునాళులతో వెలిదమ్మిధూళిగా
| 23
|
క. |
మనుజులలోపలఁ గర్మం
బొనరుచువా రెల్ల దండ్యులో వారలలోఁ
గనుఁగొనఁ గొందఱె దండ్యులొ
యనవుడు హరిభటుల కనిరి యప్పార్శ్వచరుల్.
| 24
|
మ. |
గురుభీష్మాదులు చూచుచుండ సభ మీకుం గీడు నాడట్లు ము
ష్కరులై చేసిరి యంత చేసియును బశ్చాత్తాపముం బొందనో
పరు వా రెన్నఁడు నట్టిచోటఁ గృపయున్ బంధుత్వముం దక్కు మె
వ్వరు గోపింపరె యాదురాత్మకులగర్వక్రౌర్యము ల్చూచినన్.
| 25
|
ఉ. |
కొంచెముగా నిజాంగకము గుంచి ధరిత్రికి నెంతయెంత లం
ఘించిన లేదు దంతిఁ బరికించుజనంబులుగొంద రాత్మ భా
వించిర సంధ్య వింధ్య పృథివీధరఘోరతరోదయంబుగా!
వించిరి యందుఁ గొందఱు త్రివిక్రమవిక్రమవిస్మయస్మృతిన్.
| 26
|
17 మధ్యమపురుషేకారమునకు వికల్పసంధి
చ. |
అదలిచినిల్వ వారిఁ గని యంతకకింకరు లెవ్వరయ్య మీ
రిదె యమునాజ్ఞఁ ద్రోచితిరి యెచ్చటనుం డిట వచ్చినార లె
య్యెది గత మడ్డుపెట్టుటకు నెవ్వరవార లెఱుంగఁజెప్పు డా
యదితితనూజులో సురలొ యక్షులో సిద్ధులొ కాక సాధ్యులో.
| 27
|
18 ఉత్తమపురుషకు వికల్పసంధి
క. |
విలువిద్య నొరులు నీ క
గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱపుదునని ము
న్వలికితిరి నాక కాదీ
త్రిలోకముల కధికుఁ జూచితిమి యొకయెఱుకున్.
| 28
|
క. |
తలఁపఁగ రిపులకు నిమ్మగు
కొలఁది గడచివచ్చితిమి యకుంఠితబాహా
బలము నెరపఁదరియయ్యెం
జలింపవలవ దింక మనకు శత్రులవలనన్.
| 29
|
లక్షణము
గీ. |
కృతులఁ దద్ధర్మములఁ జెప్పుక్రియలమీఁది
యచ్చునకు సంధి లేకుండు నిచ్చలముగ
మనుచు నీశ్వరుఁడని పల్క నొనరుఁగాని
తగదు మనుచీశ్వరుండన నగనివేశ.
|
|
ఉదా.క. |
గంగానది గంగానది
గంగానది యనుచు భక్తిఁ గడలుకొనంగా
గంగఁ గొనియాడునాతఁడు
భంగించు ననంతఘోరపాతకచయమున్.
| 30
|
వ. |
కొనియాడు నాతఁ డని యనవలెఁగాని కొనియా డాతం డని యనరాదు.
| 31
|
20 లక్షణము
గీ. |
వర్తమానార్థవిహితచు వర్ణమునకుఁ
గలిగియుండును లేకుండు నలర సంధి
నగు చరిగె నగుచు నరిగె నాఁగ నిచ్చు
చలరె నిచ్చుచు నలరె నా జలధితూణ.
| 32
|
ఉదాహరణ
గీ. |
అనుచు దొలినుడి యభిలాష మెనయమూఁగి
పలుక దరహాసనర్మగర్భంబు గాఁగ
నుత్తరము పల్లవశ్రేణి కొసఁగు చలరు
లమ్ముదురు పుష్పలావిక లప్పురమున.
| 33
|
గీ. |
హరునితోడ విరోధించి యంధకుండు
యుద్ధ మొనరించు చొక్కనాఁ డోహటించి
యజగవోన్ముక్తఘననిశితార్ధచంద్ర
బాణనిర్భిన్నవక్షఃప్రపాతుఁ డగుచు.
| 34
|
క. |
విమలస్ఫాటికహాటక
రమణీయదరీనిరంతరస్ఫీతనగేం
ద్రము మాల్యవంతమును ను
త్తమచరితులు చూచు చరిగి తద్విపినమునన్.
| 35
|
సీ. |
కానలోఁ దారు మృగంబులకైవడి
గైకొని యసమాస్త్రకర్మకలనఁ
దనరు చొక్కపురాణమునిదంపతులు
| 36
|
21 లక్షణము
క. |
అది యనుశబ్దముపై న
చ్చొదవెడుచోఁ గలయు నెడయుచుండును గృతులం
దది యేటి కదేటి కనన్
విదితంబుగ సంధి నిఖిలవిశ్వాధీశా.
| 37
|
ఉ. |
దక్కెను రాజ్య మంచు నకటా యిట సోదరరాజ్యభాగ్య మీ
వెక్కటి మ్రింగఁజూచె దిది యేటికి దక్కును మీనులోలతన్
గ్రక్కున నామిషంబు చవిఁ గాలముమ్రింగినచాడ్పుసువ్వె యి
ట్లుక్కివుఁడైన నీకొడుకు నుల్లమునం దిటు లోరయుండినన్.
| 38
|
ఇదేటి కనుటకు
ఉ. |
కొండగ నొండుచోటఁ బలెఁ గొంకక బింకముతో నరుండు భీ
ముం డని మాటిమాటికి సమున్నతి నెన్నఁడు కర్ణభీష్మకో
దండగురుప్రతాపవితతప్రధనోద్ధతి నొప్పుమద్భుజో
ద్దండత యించుకైన మది దార్ప విదేమిటి నేర్పు చెప్పుమా.
| 39
|
22 లక్షణము
ఆ. |
అనుచు వినుచు కనుచు ననువర్తమానార్ధ
పదనువర్ణమునకు బరగు లోప
మొదవి నిండుసున్న లొదవు నొక్కొకయెడ
నంచు వించు కంచు నన మహేశా.
| 40
|
అనుచు ననుటకు
గీ. |
అనుచుఁ దొలినుడి యభిలాష మెనయమూఁగి
పలుక దరహాసనహాసనర్మగర్భంబు గాఁగ
| 41
|
అంచు కంచు లనుటకు
శా. |
అంచు న్వేలుపుమించుబోఁడులు శుభోదర్కంబు గాన్పించ దీ
వించ న్వారిఁబ్రియానులాపములతో వీడ్కొల్పి గోకర్ణభూ
ప్రాంచద్ధూర్జటిఁ గొల్చి పశ్చిమసముద్రప్రాంతపుణ్యస్థలుల్
గంచు న్బోయి ప్రభాసతీర్థమున వేడ్కం గ్రీడి గ్రీడింపుచున్.
| 42
|
క. |
కాంచనపక్షంబగు రా
యంచం గనుఁగొని నృపాలుఁ డనురాగముతో
వంచించి పట్టికొనియెద
నంచుఁ దలఁచె దైవఘటన కనుకూలముగన్.
| 43
|
23 లక్షణము
గీ. |
ఒనర నపు డిప్పు డనుజప్పు డనెడు నుడుల
|
|
|
నుండెడు పువర్ణశృంగంబు లుడుపఁబడును
సరవి నప్డును నిప్డును జప్డు ననఁగఁ
గోటికోటీందుసంకాశ కుక్కుటేశ.
| 44
|
అప్డనుటకు
ఉ. |
తుమ్మినయప్పు డుంబురముత్రోవఁ జరించినయప్డు వారిపా
న మ్మొనరించినప్పు డశనంబు భుజించినయప్డు నవ్యవ
స్త్రమ్మున ధరించినప్డు దురితములు చూచినయప్డు పుణ్యకా
ర్యమ్ములయప్డు హేయముల నంటినయప్పుడు వారువందగున్.
| 45
|
చప్డనుటకు
గీ. |
మోసమోక ముశాసమ్మ ముద్దరాలు
తారె సడిసప్డు లేక పాతాళమునకు
దాను కొడుకులు నొకకొంత దడసెనేని
గుటిలపఱుపరె నృపుబంట్లు గుదెలవారు.
| 46
|
24 లక్షణము
గీ. |
పదముమీఁదటి యదియనుపదము మొదలి
యత్వ మఁడగుచు బొడముచు నలర సంధి
నమ్మ యదియున్న యదికాప-యదియనంగ
నమ్మయది యున్న దన కాపదన నుమేశ.
| 47
|
ఉదా. ఆ. |
కర్ణు పలుకు లోకగర్హితుఁ డగుద
నేను చెయిదికంటె శిఖియపోలె
|
|
|
నడరి నామనంబు నతిదారు క్రియ
నేర్చుచున్నయది మహీధరుండ.
| 48
|
ఉ. |
హాలహలద్వయంబు కలశాంబుధి పుట్టి వినీలపాండుర
జ్వాలలతోడ నం దొకవిషం బొకవేలుపు మ్రింగి నెందరే
వేలుపు లోలిమై ననుభవించిన రెండవయీవిషంబు ని
ర్మూలము గాకయున్నయది ముద్దియ పాంథులపాప మెట్టిదో.
| 49
|
25 లక్షణము
గీ. |
ఇమ్ము మీర భవిష్యదర్థమ్ముఁ జెప్పు
పదము నూమీఁదనేని యన్పదము నిలుపు
నపుడు సంధుల నగునేని యగునయేని
యనఁగ నొప్పు నగేంద్రకన్యాధినాథ.
| 50
|
ఉదా.గీ. |
అనలసంబంధవాంఛ నా కగునయేని
యనలసంబంధవాంఛ నా కగునుజువ్వె
చాలు సందేహవక్రభాషణము లింకఁ
దరుణచక్రాంగపాధఃపతంగశక్ర.
| 51
|
'
26 లక్షణము
ఆ. |
పడియెన న్పదంబు పరమునఁగల ప్రథ
మాంతశబ్దములకు నగు ముకార
మడఁగుఁ బూర్ణబిందు వగు భయపడి భయం
పడి యనంగఁ గృతుల ఫాలనేత్ర.
| 52
|
ఉదా.చ. |
వనజభవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోకము
న్వననిధిలోన ముంచినయవారితవీర్యుఁడు నిన్నుఁ దొట్టి య
య్యనిమిషు లెల్ల వానిక భయంపడుచుండుదు రట్టియుగ్రకో
పనుకడ కేఁగు మిప్పు డని పాడియె యిప్పని నన్నుఁ బంపఁగన్.
| 53
|
ఉ. |
క్రచ్చర నొక్కరక్కసుఁడ కాఁడు సురాసురులెల్ల నడ్డమై
వచ్చిన నీవ చూడఁగ నవార్యబలోన్నతిఁ జేసి వారలన్
వ్రచ్చి వధింతుగాక యిట వచ్చి శ్రమంపడియున్న వీరల
న్నిచ్చగ వీరిదైన సుఖనిద్రకు భంగము సేయనేర్తునే.
| 54
|
క. |
ప్రజ యేన కాను నన్నుం
బ్రజ సంరక్షించునని భరంపడి కోరం
బ్రజ విడిచెద నాయం దది
యజేయమును నవ్యయంబు నగుపద మిచ్చున్.
| 55
|
చ. |
అనుటయు మంత్రిమాటకు బ్రియంపడి యాతని నాదరించి య
మ్మనుజకులేంద్రుడు
| 56
|
భయపడి శ్రమపడి యనుట సులభము.
27 లక్షణము
గీ. |
తగ నుకారాంతముల కర్మధారయమున
షష్ఠి యగుచో బైనచ్చు సంఘటిల్లె
నేని సంధులయెఁడ న న్నిలుచు గొన్ని
యెడలఁ గలుగకయుండు మహీశతాంగ.
| 57
|
కర్మధారయమునఁ డకారము వచ్చుటకు
గీ. |
అగ్నిశిఖయపోలె నంటను డాయను
జూడగానియట్టి శుభచరిత్ర
నెఱుకలేని కరకుటెఱు కపేక్షించెఁ గా
దనక తనకు నాయు వల్పమైన.
| 58
|
మ. |
కమనీయద్యుతయోగ్యకీర్తనముల న్గన్పట్టు నాశ్యామ యా
సుమబాణింబకమాయమూల్యమణి యాచొక్కంపుఁబూబంతి యా
సుమనోవల్లరి యాసుధాసరసి యాసొంపొప్పుడాల్దీవి యా
కొమరుంబ్రాయపురంభ యాచిగురుటాకుంబోఁడి నీకే తగున్.
| 59
|
క. |
జననాథ నాడు మొదలుగ
ననయము బురరక్షణంబు నాహవసమయం
బున నస్తమునై యతనికి
ననలుం డిల్లటపుటల్లుఁడై వర్తించున్.
| 60
|
టకారము రాకుండుటకు
క. |
ఈనెలఁతుక గని మన్మథుఁ
డైనను జిగురాకుబువ్వుటమ్ములపొదలున్
లోనుగ సెజ్జలు సేయం
దా నియమింపండె విరహతాపము పేర్మిన్.
| 61
|
ఉ. |
ఎయ్యది గారణంబుగ మహీపతి యంచితధైర్యకంచుకం
బయ్యత నుండు సించెనలరమ్ములచే నది గారణంబుగాఁ
దొయ్యలి రాజనందనునితో గెడగూర్పఁదలంచియున్నయా
దయ్యమునెత్తికోలు తుదిదాఁకుటగానఁగ నయ్యె నయ్యెడన్.
| 62
|
సీ. |
చిగురాకుబోఁడి మైచెమటపన్నీటిలో
నానుట త్రిషవణస్నానమయ్యె
| 63
|
ఉ. |
తెల్లనిదీవితమ్మి నెలదేటివలెం దళుకొత్తువాగిడిన్
నల్లనివాని లచ్చి రతనంబును మచ్చ యెదం దలిర్ప రం
జిల్లెడువాని చుట్టలగుచిందము నంటినవాని నింపుసొం
పెల్లెడఁ గల్గుపాల్కడలి యిల్లటపల్లునిఁ గాంచి రయ్యెడన్.
| 64
|
షష్ఠికి నకారము వచ్చుటకు
గీ. |
చెంచునింటికిఁ బోయి చెంచితకుఁ బ్రియము
చెప్పి నమ్మించి తలమీఁదఁ జెయ్యి వెట్టి
| 65
|
నకారము రాకుండుట
గీ. |
తరుణి వైదర్భినీ వెట్టిధన్యవొక్కొ
భావహావవిలాసవిభ్రమనిరూఢి
గౌముదీలక్ష్మి యప్పాలకడలివోలె
నలరజేసితి నిషధరా జంతవాని.
| 66
|
ఉ. |
అల్లుఁడు రామరా జనుఁగుటల్లుఁడు గొబ్బురి యౌభళేశుఁ డా
హల్లకహారిఁగన్నఘను నల్లుఁడు పోషణబుద్ధి గట్టురా
జల్లుఁడు వింటినేర్పున సమంచితరూపమునందుఁ జందమా
మల్లుఁడు దేవకీరమణునల్లుడు శత్రుసమిజ్జయంబునన్
| 67
|
క. |
అన్నన్న మొగము వెన్నుని
యన్నన్న జయించుకన్ను లన్నన్నలినా
సన్నములు నడుము మిక్కిలి
సన్నము మాటలు సుధా ప్రసన్నము లెన్నన్.
| 68
|
28 లక్షణము
ఆ. |
రెండుమారు లుచ్చరించుశబ్దమునకు
నంత్యపదము మొదలియ చ్చడంగు
నన్న యన్న యనక యన్నన్న యేమేమి
యనఁగవలయుఁ గృతుల నగనివేశ.
| 69
|
అన్నన్న యనుటకు
,
క. |
అన్నగరిచిరుతయేనుఁగు
గున్నలపై నెక్కి నిక్కి కోయఁగ వచ్చున్
మిన్నేటిపసిడితామర
లన్నన్న మరేమి చెప్ప నందలికరులన్.
| 70
|
మాదయగారిమల్లన రాజశేఖరచరిత్ర
ఏమేమి యనుటకు
శా. |
ఏమేమీ యను విన్నమాటయ వినున్ వీక్షించు నెమ్మోము సాం
ద్రామోదంబునఁ బక్షముల్ నివురు హస్తాంభోజయుగ్మంబునన్
| 71
|
వ. |
అమ్మమ్మ అబ్బబ్బ మొదలయినవి యిటువలెనె తెలియునది.
|
|
29 లక్షణము
క. |
అహమనుచోఁగి మనునెడన్
విహితంబుగ నంత్యహల్లు ద్విత్వముఁ జెందున్
మహితప్రబంధములలో
నహమ్మనియుఁ గిమ్మనియును నంగజదమనా.
| 72
|
కిమ్మనుటకు
ఉ. |
కమ్మనికుందనంబు కసుగందనిమే నెలదేఁటిదాఁటులన్
బమ్మెర బోవఁదోలుఁ దెగబారెడు వెండ్రుక లిందుబింబముం
గిమ్మన నీదుమోము గిరిక్రేవులు మూవులు కౌను గానరా
దమ్మక చెల్ల వానివికచాంబకముల్ శతపత్రజైత్రముల్.
| 73
|
శా. |
ఆతన్వంగి యనంగఝాంకరణపజ్జ్యాముక్తచూతాస్త్రని
ర్ఘాతం బోర్వక తమ్ములంచు తటినీగర్భైకసంజాతకం
జాతవ్రాతముమాటుఁ జెంద నవి యెంచంజొచ్చె మున్నున్నుగా
జ్ఞాతిశ్చేదన లేవకిమ్మనెడి వాచారూఢి సత్యమ్ముగన్.
| 74
|
వ. |
కడమ యీలాగే తెలిసికొనునది.
|
|
30 లక్షణము
క. |
తొడరిన మశ్శబ్దాదుల
యెడ నచ్చుగ నచ్చు గదిసెనేని విసర్గల్
చెడు నచ్చు యకారంబగు
మృడపీఠపురవిహార మృత్యువిదూరా.
| 75
|
నమశ్శబ్దమునకు
సీ.గీ. |
మానమథనాయ మదనాయ మధుసఖాయ
మనసిజాయ నమోనమ యనుచు మ్రొక్కి
| 76
|
ఉ. |
పాయక దైత్యు లిట్లు బహుభంగుల బాధ లొనర్ప విష్ణుదే
వాయ నమో నిరంతవిభవాయ నమో జలజాలయాకళ
త్రాయ నమో నిశాచరహరాయ నమో యనుగాని క్రవ్యభు
ఙ్నాయకనందనుండు చలనంబును బొందఁ డొకించుకేనియున్.
| 77
|
గీ. |
కనమె కార్యార్థినః కుతో గర్వ యనఁగ
| 78
|
ఉ. |
నవ్యవిలాసరమ్యనలినంబని బాలముఖాబ్జసౌరభా
భివ్యసనంబునం బరచు భృంగికులోత్తమ తద్వియోగతా
పవ్యథఁ బ్రాణి నిల్వదు కృపాగుణ మేర్పడ బ్రాహ్మణో న హం
తవ్య యనంగ నొప్పు వచనస్థితి కుంద కెఱుంగఁజేయుమా.
| 79
|
31 లక్షణము
క. |
పొల్లులగు హల్లు లెల్లను
దెల్లమిగా వచ్చు బెరసి ద్విత్వము జెందుం
బెల్లుగ ననుకరణంబుల
హల్లకహత సుప్రకాశ హర పరమేశా.
| 80
|
శా. |
అత్మార్థం పృథివీం త్యజే త్తనెడు వాక్యం బశ్రుతంబే నృపా
| 81
|
న. |
కడమ నన్నియు నీలాగే తెలిసికొనునది.
|
|
32 లక్షణము
గీ. |
నాంతపదములపై సక్తమగు పదముల
కచటతప లైదు నగుచుండు గజడదబలు
పిఱిదిసా ల్సున్నలగు నినుఁ బిలచె నన ని
నుం గొలిచె నాఁగ దివిజసన్నుత మహేశ.
| 82
|
కకారమునకు
శా. |
సింగం బాకటితో గుహాంతరమునం జేట్సాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధమై వచ్చునో
జంగాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీడె న
చ్చం గుంతీసుతమధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్.
| 83
|
చకారమునకు
ఉ. |
అంజసమానవాయుగుణ మంతయు ఖంజతఁ జిక్క నజ్జవో
ష్మం జని యుబ్బు చిక్కనిసమానపువాయువులో నొకండు...
| 84
|
తకారమునకు
క. |
అందులకు ధరణిఁగలనృపు
నందమలందఱు ముదంబునం బోయెడు వే
డ్కందమలోఁ గలహంబును
గ్రందును లేకున్న వారు గడునెయ్యమునన్.
| 85
|
పకారమునకు
క. |
అంబాలికకును గుణర
త్నాంబుధి పాండురవిరాజితాంగుఁడు ప్రభవిం
చెం బాండురాజు కురువం
శంబు ప్రణమిల్ల ధర్మసత్యవ్రతుఁడై.
| 86
|
33 లక్షణము
క. |
తెల్లమిగ గజడదబమలు
పొల్లనకారంబుతోడఁ బొదలినయెడలం
బొల్లులె నిల్చును నొకచోఁ
జెల్లును నెఱసున్న లగుచు శ్రీగౌరీశా.
| 87
|
పొల్లునకారము నిల్చుటకు
శా. |
భారద్వాజపవిత్రగోత్రు విమలాపస్తంబసత్సూత్రు వి
ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచారభీమాంబకున్
గారామైనతనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యుఁ బిల్పించి స
|
|
|
త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ర్పౌఢిమన్.
| 88
|
క. |
త్వరితముగఁ జనుము సఖుఁడు
న్గురుఁడుఁగదా నీకు నర్జునుఁడు ప్రకృతిత
త్పరుఁడై నెగడుట నుత్తమ
పురుషులు వేచుతరి వచ్చె భుజశౌర్యనిధీ.
| 89
|
వ. |
కడమవన్నిఁటికి నీలాగే తెలిసికొనునది.
|
|
పొల్లు చెడి బిందు వగుటకు
గకారమునకు
క. |
తుంగమడువునఁ జెలగుమా
తంగమునకు మిగిలి యడవి దరికొను కార్చి
చ్చుం గడచి యచటిబలముల
భంగించె నరుండు ఘోరబహువిధగతులన్.
| 90
|
జకారమునకు
ఉ. |
అంజసమానవాయుగుణ మంతయు ఖంజతఁ జిక్క నజ్జవో
ష్మం జని యుబ్బు చిక్కనిసమానపువాయువులో నొకండు క
ల్మిం జనియించు దుర్యశము మేల్కని లేహనవేళ వాజులూ
ర్చం జెడు మాణిమంధనికరంబుల కాళిమపేరఁ దార్కొనన్.
| 91
|
క. |
అంజదవు గాక నను చెం
తం జేరఁగనీక యెంత తగ్గిన మిరియా
లుం జొన్నలు సరిగావే
లంజతనములందు కొమరులం గెలువనొకో
| 92
|
డకారమునకు
శా. |
చండాంశుప్రభ చిక్కతిమ్మయతనూజా తిమ్మవిధ్వస్తపా
షండంబైన త్రిలింగభాగవతషష్ఠస్కంధకావ్యంబు నీ
కుం డక్కెం జతురాననత్వగుణయుక్తుల్ మీర వాణీమనో
భండారోద్ధతచూరకారబిరుదప్రఖ్యాతి సార్ధంబుగన్.
| 93
|
దకారమునకు
స్రగ్ధర. |
తల పి ట్లుత్సాహమందం దనయజనపరిత్రాణ మర్ధించి యక్కం
దళితాపత్యానురక్తి న్మహిపు ననుగతిం దాను రాబూనకుండన్.
| 94
|
మకారమునకు
లయగ్రాహి. |
కమ్మనిలతాంతములకు మ్మొనసివచ్చుమధు
పమ్ముల సుగీతనినదమ్ము లెసఁగం జూ
తమ్ములసుగంధముల
| 95
|
లయగ్రాహి. |
అమ్మహిసురోత్తముఁడు నమ్మనుజభోజియును
నమ్ములను గ్రోధ మధిక మ్మగుచు మీఱన్
|
|
|
హుమ్మనుచు డాయుచు శరమ్ము లరిఁబోయుచు ర
య మ్మెసగనేయుచు జలమ్మొదవఁగా నొ
క్కుమ్మడిఁ బరాక్రమముల మ్మెరసి రక్తములు
గ్రమ్ముకొని మేను లగరమ్ము దిగజారన్
రమ్మనుచుఁ జీరుచు జవ మ్మెసఁగ నుగ్రసమ
ర మ్మపుడు చేసిరి బలమ్ములు చెలంగన్.
| 96
|
ప్రౌఢకవిమల్లన రుక్మాంగదచరిత్ర
మత్తకోకిల. |
అమ్మునీశనివాసశక్తి దదంగరాజ్యమునందు మే
ఘమ్ములెల్ల కెలంకులం గడుగ్రమ్మి సర్వజనప్రమో
దమ్ముగాఁ బ్రపతద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టి చే
సె మ్మహానదులు న్మహాసరసీవసమ్ములు నిండఁగాన్.
| 97
|
34 లక్షణము
క. |
అమరఁ గృతులందుఁ బ్రథమాం
తములపయిన్ నిలుచు కచటతపలకు నాదే
శము గసడదవ లగు న్ని
క్కమ యాత్మాస్మత్పదములు గాక మహేశా!
| 98
|
గీ. |
కాకు సంబోధనావ్యయకర్మధార
యంబులన చేతనంబుల నగు వికల్ప
మనియె మును ముద్దరాజు రామనసులక్ష్య
ములు వినము కాకు సంబోధనలకు భర్గ.
| 99
|
అవ్యయమున కాదేశము రానందునకు
మ. |
ధృతరాష్ట్రుండును బుత్రులున్ ననము కుంతీనందను ల్సింహము
ల్మతినూహింప నసింహమైనవనమున్ మర్దింతు రెందు న్వనా
వృతవృత్తంబులు గాని సింహములకు న్వేగంబ చేటొందుఁ గా
నతగం బొందుట కార్య మీయుభయము న్సంతుష్టమైయున్కికిన్.
| 100
|
ఉ. |
ఏచిన యాపురత్రయము నేకశరంబున రూపుమాపఁగాఁ
జూచినఁ బోవుఁగాని పెఱచొప్పునఁ బోవదు సంగరోన్ముఖుం
డై చనుదెంచెనేని మదనాంతకుచే నది చెల్లు నొర్లకుం
గోచర మెట్లగుం జనుఁడు గొబ్బున మీరు మహాత్ముపాలికిన్.
| 101
|
ఆదేశము వచ్చుటకు
క. |
ప్రదర ప్రవాహమున న
మ్మదవద్విరదంబు పటుగమన ముడిపి ముదం
బొదవిన సాత్యకివిలుబి
ట్టు దునిమె నమ్మగధనాథుఁడు మహోగ్రుండై.
| 102
|
క. |
ఆసభ నమ్మెయి నీదు
శ్శాసనుఁ డప్పాండుపుత్రసతిఁ గ్రూరాత్ముం
డై సీరలోలిచి పెద్దయు
గాసిం బెట్టంగ నెఱిఁగి కలఁగినమదితోన్.
| 103
|
చ. |
అసమునమీ దెఱుంగక మహాగ్రహవృత్తిఁ గడంగి చెచ్చరం
బసులకుఁ గూయిగాఁ జనియెఁ బాపఁడు కౌరవసేన యేడ నొం
టి సనుట యేడ నా కిది కడిందివిచారము పుట్టె సైన్యముల్
వెసఁ జని తోడు గావలయు వేగము పంపుఁడు చాలినట్లుగన్.
| 104
|
కర్మధారయమునకు నాదేశము రానందుకు
చ. |
అకుటిలుఁ డార్యవర్తనుఁ డహంకృతిదూరుఁడు నీతినిర్మలా
త్మకుఁ డనవద్యశీలుఁడు సుధర్ముఁడు భీముఁడు కుంతి ముద్దుసే
యుకొడుకు మేను లేఁత తనయుల్లము మెత్తన యిట్టియీతఁ డె
ట్లొకొ యొరు నాశ్రయించు విధి యోపఁడె యెవ్వరి నిట్లు సేయఁగన్.
| 105
|
ఆదేశము వచ్చినందుకు
చ. |
తెగి మన కగ్గమై యలుఁగు దెంచినవాఁ డితఁ డల్క నింక నొం
డుగడకుఁ బోవకుండఁగఁ గడున్వెస డగ్గరి యేకపాలముం
బగులుతునో గదానిహతి బార్థవత్ప్రకటప్రతిజ్ఞకై
తగదని మాచె దీని నిశితప్రదరంబులఁ ద్రుంపు కంఠమున్.
| 106
|
క. |
వేసేతులు నిడుపగు బా
ణాసనము గుణస్వనోగ్ర మగునట్లుగ ను
ల్లాసంబునఁ ద్రిప్పుచు ఘో
రాసురుఁడు వరాహుఁ డొప్పె నఖిలధ్వజినిన్.
| 107
|
క. |
నగరులలోపలిమాటలు
తగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడ న్బుట్టినపతి విన
నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్.
| 108
|
అచేతనమునకు ఆదేశము రానందుకు
క. |
నాపతులగు గంధర్వుల
చే పడి మృతిఁ బొందె వీఁడె సింహబలుం డీ
పాపాత్మునిఁ జూడుఁడు దు
ర్వ్యా పారఫలంబుఁ గాంచె నని పలుకుటయున్.
| 109
|
ఆదేశము వచ్చినందుకు
క. |
కావలియై సురరాజ్య
శ్రీవాలింపంగఁ దగువిశేషంబున సం
భావితుఁడు నహుషుఁ డనఁ జని
యావిభుఁ గని తారు వారు నధికప్రీతిన్.
| 110
|
క. |
పిదపఁ గలికాళచోళుం
డుదయంబై జలధిపరిమితోర్వీవలయం
బు దనకుఁ బంటపొలమ్ముగ
నెదు రెందును లేక పేర్మి నెసఁగన్ బెసఁగన్.
| 111
|
క. |
కైసేసి మదవికారో
ల్లాసంబున మేనుపొంగ లఘుగతి నుత్కం
ఠాసవపానవిధాన
వ్యాసంగతరంగితాంతరంగుం డగుచున్.
| 112
|
వ. |
ఒకానొకచోఁ గ్రియాపదములకు నాదేశము వచ్చును. అందుకు,
|
|
చ. |
కుదురు సమస్తధర్మములకు న్విను సత్యము యోగమోక్షస
తృదములు సత్యకార్యములు పాప మసత్యముకంటె నొండు లే
దు దలఁప నశ్వమేధములు తొమ్మిదినూరులు వెండినూరునై
యొదవిన నీడు గాదు భరతోత్తమ సత్యముతోడ నారయన్.
| 113
|
ఆదేశము వచ్చుటకు
చ. |
డిగకుఁడు వాహనంబులు కడిందిమగంటిమి గోలుపోవ మీ
రు గడఁక దక్కిపెట్టకుఁడు రూపర నాయుధముల్ మహాస్త్రశ
క్తి గెలుతు సంపతత్కులిశతీవ్రశరంబుల ధీరబుద్ధిబా
రి గను విహారభంగుల నరిప్రకరంబులు పిచ్చలింపఁగన్.
| 114
|
నవికృతశబ్దాత్పరతస్సాంస్కృతికానాం భవంతి గసడదవాః॥
అని శబ్దశాసనసూత్రము.
35 లక్షణము
ఆ. |
శబ్దశాసనుండు సంస్కృతశబ్దంబుఁ
దెలుఁగుపదముమీఁద నిలుపునప్పు
|
|
|
డరయ ప్రథమలందు నాదేశ మొదవఁద
టంచు సూత్రమున విధించియుంచె.
| 115
|
అందుకు సంస్కృతపదము తెనుఁగుపదముమీఁద నాదేశము వచ్చుటకు
క. |
అవిముక్తం బవిముక్తం
బవిముక్తం బనుచుఁ బ్రాతరారంభములం
దనధానపరత నెవ్వం
డు పఠించును వాఁడు ధన్యుఁడు మునిప్రవరా.
| 116
|
క. |
అది మొదలుగాఁగ విష్ణుని
మది నిల్పి యతండు నాకు మగఁ డగునని యి
ట్లు దపంబు సేయుచుండెద
నిది నా తెరఁ గనిన దానవేశ్వరుఁ డనియెన్.
| 117
|
మ. |
వివిధోర్వీపతులం జగన్నుతుల ము న్వీక్షింపమో వారిపెం
పు వరీక్షింపమొ నింపమో చెలిమి యేభూపాలురందైన నీ
భువనత్రాణపరాయణోద్భటభుజాభూరిప్రతాపంబు నీ
జవనాక్షీణబలంబు గంటిమె వసుక్ష్మామండలాఖండలా.
| 118
|
36 లక్షణము
క. |
విదితముగఁ దాను నేనను
పదములు ప్రథములయి నాంతపదము లగుటఁ దాఁ
|
|
|
జదివెను నేఁ జదివితినని
వదలక యిరుదెరఁగుఁ బలుకవచ్చు మహేశా.
| 119
|
ఆదేశము రానందుకు
క. |
నీ చెప్పిన పెద్దలు ద్రో
ణాచార్యులు మొదలుగాఁ గవని కొల్లనివా
రై చన్న వారలంగొని
యేచక్కంబెట్టువాఁడ నేపాండవులన్.
| 120
|
ఆదేశము వచ్చుటకు
క. |
ఏఁగోరిన చెలువుఁ డెనను
దాఁ గవలెనంచు వచ్చి డగ్గరి వేఁడన్
గౌఁగిలి యియ్యక వచ్చితి
నౌఁ గాదని పెనఁగి యెంతయవివేకమయో.
| 121
|
37 లక్షణము
క. |
తెనుఁగుఁగృతిఁ గొన్నియెడలం
దనరఁగ వాక్యాంతగతపదముల నకారం
బునకు లోపంబొదవును
ఘనతరఘోరాట్తురంగ కలుషవిభంగా.
| 122
|
నకారము లోపించుటకు
,
గీ. |
మత్పితామహు ధీపితామహునిఁ దలఁతుఁ
గలితకావ్యకళాలాభుఁ గమలనాభుఁ
జంద్రచందనమందారసదృశకీర్తి
|
|
|
సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి
| 123
|
38 లక్షణము
.
ఆ. |
ఏఁడునూ రనంగ మూఁడునా ళ్ళనఁగ ను
బాడును య్యనంగఁ బరగుశబ్ద
ముల నకారములును వలనొప్పడూలతో
శ్లిష్టమగుచునుండు శ్రీమహేశ.
| 124
|
సీ. |
కాశికానగరోపకంఠదేశము డాసి
యేణ్నూరుముఖముల నేగె జలధి.
| 125
|
గీ. |
ఇంక రెణ్నాళ్ళు జూచి నీవంకఁ దెగువ
గలుగకుండిన బ్రజయూళ్ళు దలఁగిపోవు
మౌనివగుటొండె యొండె విహీనసంధి
నతనిఁ గనుఁగొంటగా కొండుమతము గలదె.
| 126
|
39 లక్షణము
గీ. |
సంస్కృతపదంబుఁ దగ విశేషణము జేసి
సంధిఁ గూర్పంగ నాలనుశబ్దమునకు
మొదల రేఫము గదియును సదయురాలు
పుణ్యురా ల్ధన్యురా లన భుజగభూష.
| 127
|
గీ. |
ప్రియము గల్గిన నంగీకరింపవలదు
ముండదీవెన రేపాడి మొగముఁ జూచి
|
|
|
బైసిమాలిన పరమనిర్భాగ్యురాలు
విధవ దా నిచ్చునాయువు విషసమంబు.
| 128
|
సీ. |
ఒక్కింతశంకింపకున్న సాహసురాల
వేటికి వెరపు నీ కిత్తెఱఁగున
| 129
|
వ. |
కడమవానికి యీలాగే తెలుసుకొనునది.
|
|
40 లక్షణము
గీ. |
ఉందు రందురు కందురు కొందు రనఁగ
నుంతు రెంతురు తగ భుజియింతు రనఁగ
దగుఁ గ్రియలమీఁది రేఫలు దాపలిదెస
యక్కరముతోడ శ్లిష్టమై యలరు నభవ.
| 130
|
ఉందు రనుటకు
గీ. |
మమ్ము రక్షించి తనియేల మాటిమాటి
కభినుతింపంగ దక్షవాటాధినాథ
తల్లిదండ్రులు రక్షింపఁదలఁపకుండ్రి
ప్రజల భీమేశ బహువిధోపద్రవముల.
| 131
|
అందు రనుటకు
సీ. |
వట మండ్రు గొందఱు వటమేని యూడలు
వారిమండల మెల్లఁ ప్రబలవలదె
| 132
|
అనుభవింతురనుటకు
ఆ. |
తగిలి రుజయు జరయు దైవవశంబున
నయ్యె నేని దాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యారెంటిఁ జే
కొందురయ్య యెట్టికుమతులైన.
| 133
|
గీ. |
బలముగలవానిఁ బలువురు బలవిహీను
లొక్కటై కూడి నిర్జింప నుత్సహింత్రు
మధువుఁ గొననుత్సహించినమనుజూఁ బట్టి
కుట్టి నిర్జించుమధుమక్షికులమునట్లు.
| 134
|
41 లక్షణము
క. |
బాలులు నరపాలులు గుణ
శీలులు నను లులకు రూలు జెందుం గరుణా
శాలులు దృఢతాలులు నన
గాలిలులకు రూలు రావు కాయజదమనా.
| 135
|
గీ. |
దేవతాభర్త శంభుప్రతిష్ఠఁ జేసి
సురగణంబుల లోకపాలురను జూచి
యనియె మీరును భీమనాయకునివీట
సిద్దశివలింగములఁ బ్రతిష్ఠింపవలయు.
| 136
|
మ. |
మరుదంభోరుహనేత్ర లంబరధునీమధ్యంబున న్నిల్వ ని
ష్ఠురతత్పీనపయోధరాహతిజలస్తోమంబు నల్వంకలం
|
|
|
దెరల న్నాభిచయంబు లోఁగొనియె వానిం జాలగాంభీర్యశీ
లురు సంక్షోభమునొందువారి నెచటన్ లోఁగొంచు వర్తింపరే.
| 137
|
క. |
ఇరువదియేవురుపాంచా
లురు నూర్వురుకేకయులును లూనాంగకులై
ధర దొరిగి వీరరక్తము
కరినికరము రొంపిఁబడినగతి నుండె నృపా
| 138
|
42 లక్షణము
క. |
మల్లులనుశబ్దమునకున్
మల్లులు మల్లురని కృతుల మానుగఁ బలుకం
జెల్లును గవియనుమతి నహి
వల్లభకేయూరదురితవారవిదూరా.
| 139
|
మల్లు లనుటకు
చ. |
వలసిన నేలు మేను బలవంతుఁడఁగారెనుబోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లగా
దలమును లావు విద్య మెయి దర్పము బేర్చి పెనంగు జెట్టిమ
ల్లుల విరుతున్ మఱిన్ గడియలో నన చూడ్కికి వేడ్క సేయుచున్.
| 140
|
మల్లు రనుటకు
మ. |
అరరే యయ్యలురామరాజు పెదతిమ్మాధీశు బాహాభయం
కరకౌక్షేయకధార భోరనఁ గడంకం ద్రెవ్వు వీరారిమ
|
|
|
ల్లురకున్ మట్టియ గుందదీయ బళధూళు ల్సంగడాలౌ వియ
చ్చరకాంతాస్తనపాళివిన్గరడి కాశ్చర్యంబు చర్చింపఁగన్.
| 141
|
43 లక్షణము
క. |
విన్నారరు కన్నారరు
నున్నారరు ననుచుఁ బలుక నొప్పుం గృతులం
జెన్నగు మధ్యమపురుషకుఁ
బన్నగకులరాజహార భవభయదూరా.
| 142
|
ఉన్నార రనుటకు
క. |
గురుఁడును నీవును మద్రే
శ్వరుఁడును గర్ణుండు గృపుఁడు సౌబలుఁడున్ నన్
ధర యేలింపఁగ నున్నా
రరు నీకుం జనునె సంగరములోఁ గలఁగన్.
| 143
|
44 లక్షణము
క. |
నులుడులునడుమంగలపద
ములయుత్వము లడఁగుఁ గావ్యములఁ జిల్క యనం
జిలుక యనఁ గిన్క కిను కన
నలి గా డ్పన గాడు పనఁగ నందితురంగా.
| 144
|
చిల్క యనుటకు
ఉ. |
చంపకగంధి మోవి సరసంబగుబింబ మటంచుఁ బట్టి తే
లింపుటెలుంగుతోఁ దమిఁ దలిర్పఁగఁ బల్కినఁ జెక్కు గీటినన్
|
|
|
న్నింపున ముద్దు వెట్టుకొని యెప్పుడు మన్నన చేయనున్నదో
పెంపుడుజిల్క నిన్ను మరపింతుఁ జుమీ చెలి నన్ను నేలినన్.
| 155
|
గాడ్పనుటకు
క. |
చిచ్చునకు గాడ్పు తోడై
వచ్చినగతి మరున కబ్జవైరియుఁ దోడై
వచ్చె నడియాస వలదిఁక
మచ్చికఁ దలపోసి నన్ను మది మరువకుమీ.
| 156
|
45 లక్షణము
ఆ. |
కలికి కొలికి ములికి కడిగి యడిగి యనంగఁ
కలిమి బలిమి చెలిమి తెలివి యనఁగ
నునికి మనికి వినికి యనుపదంబులకడ
యక్కరములు శ్లిష్ట మగు మహేశ.
| 147
|
కల్కి యనుటకు
సీ. |
గరళాంజనము కల్కి క్రాలుగన్నులఁ దీర్చి
మధుపానమున నుబ్బు మదికి నొసఁగి
| 148
|
కొల్కి యనుటకు
చ. |
చిలుకలకొల్కి కంధర భజింపఁగఁ జెల్లదె కంధరాంకమున్
| 149
|
ముల్కి యనుటకు
ఉ. |
మంపెసఁగన్ గటాక్షలవమాత్రముచేతనె ముజ్జగంబు మో
హింపఁగఁజేయు భార మిఁక నీవు వహించితి గాక కేళినీ
చంపకగంధి బిత్తరపుఁజన్నులమీఁద సుఖించుకొంచు నా
సంపెంగమొగ్గముల్కి గడుసా మరి సోమరి గాక యుండునే.
| 150
|
కడ్గి యనుటకు
చ. |
అడుగులు గడ్గి ప్రీతి యసలారగఁ దద్దయు నెమ్మబల్కి ర
ప్పుడు మది పల్లవింప మునిపుంగవుఁ డాతని కాత్మభాగ మె
క్కుడగువిభూతిఁ జూపి
| 151
|
వ. |
కడమ అన్నీ యీలాగే తెలియునది.
|
|
46 లక్షణము
గీ. |
యుష్మ దస్మ త్పదంబులం దొనర ఘనుఁడ
వైన నీవును నధికుఁడనైన నేను
ననెడుచో ఘనుఁడైన నీ వధికుఁడైన
నే ననంగ వునుల్ వాయు నీలకంఠ.
| 152
|
యుష్మత్పదంబునకు
శా. |
శీఘ్రం బేటికి వచ్చి సంసృతిభవశ్రీసౌఖ్యగంధంబు దాఁ
నాఘ్రాణింప నిమిత్తనూజుల దురాత్మాభిక్షులం జేసినన్
శుఘ్రదివ్యవమగ్నుఁ జేసితి కృపాశూన్యుండవై గోముఖ!
వ్యాఘ్రం బింతియగాక నీవు ఋషివే యాహా వితర్కింపఁగన్.
| 153
|
మ. |
జయలక్ష్మీధవుఁ డైననీవు దగ మత్సామ్రాజ్యభోగంబుల
న్నియు నర్సించితి నీ కృపారతి శరన్నీరేజపత్రాయతా
క్షు యదూత్తంసు మునీంద్రమానసరిరంసుం గంసవిధ్వంసు న
వ్యయు నద్వైతు భజించి యవ్విభుని సేవం గాంతు నిష్టార్థముల్.
| 154
|
మ. |
జననంబొందితి దుగ్ధవారినిధి నాసర్వేశుజూటంబుపై
జను లేప్రొద్దుఁ బ్రశంస సేయ నవతంసంబైతి నీ ప్రాభవం
బునకుం బాంధజనాపకారియగు నాపూవిల్తునిం గూడి వా
రనిదుష్కీర్తిగ తిట్టునం బడకు చంద్రా రోహిణీవల్లభా.
| 155
|
పిల్లలమఱ్ఱి వీరన్న శకుంతలాపరిణయము
చ. |
అరుదుగ నీవిమానము బ్రజాధిపుడుం బురుషోత్తముండు శం
కరుఁడును దక్క నన్యులకు గా దధిరోహ మొనర్ప వారిసు
స్థిరకరుణావిశేషమున జిష్ణుఁడనైఁ గయికొంటి దీని నే
నరవర సర్వసద్గుణగణంబులప్రోవగునీ కొసంగితిన్.
| 156
|
క. |
ఏ నీకు నొకటి చెప్పెద
దానవకులముఖ్య దేవతలకు నవధ్యుం
డైన నినుబోఁటివాఁ డీ
మానవుల జయింప విక్రమమునుం గలదే.
| 157
|
అస్మత్పదంబునకు
గీ. |
అధికతాపపరీతాత్ముఁడైన నాకు
నెట్లు వచ్చితి చలిగాడ్పునట్లు నీవు
|
|
|
పూర్వజన్మమహాతపస్ఫురణ నాకు
నీదుసన్నిధి సమకూరె నిధియపోలె
| 158
|
."
సీ.గీ. |
రండు నను గూడి యోపరివ్రాట్టులార
వత్సలత మీఱఁ మీ రేల వత్తురయ్య
పరమనిర్భాగ్యుఁడైన నాపజ్జ దగిలి
కటకటా సౌఖ్యజలరాశిఁ గాశిఁ బాసి.
| 159
|
చ. |
హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్నసత్కవీ
శ్వరులను భ క్తిఁ గొల్చి తగ వారికృపం గవితావిలాసవి
స్తరమహనియ్యుఁ డైననను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
వరుఁడు దగంగ రాఁబిలిచి వారనిమన్నన నాదరింపుచున్.
| 160
|
చ. |
వరమునఁ బుట్టితి న్భరతవంశముఁ జొచ్చితి నందు పాండుభూ
వరునకుఁ గోడ లైతి జనవంద్యులఁ బొందితి నీతివిక్రమ
స్థిరులగు పుత్రులం బడసితి న్సహజనులప్రాపుఁ గాంచితిన్
సరసిజనాభ యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్.
| 161
|
47 లక్షణము
గీ. |
యుష్మదర్థంబు బహువచనోక్తిఁ బలుకు
నపుడు ఘనులు బ్రసిద్ధులు ననుపదముల
కలర ఘనులరు కడుఁబ్రసిద్దులరు మీ ర
నంగఁ జను గావ్యములయం దనంగదమన.
| 162
|
చ. |
భరతకులప్రసిద్ధులరు భాసురశస్త్రమహాస్త్రవిద్యలం
గరము బ్రసిద్ధుఁడై పరగు గౌతముశిష్యుల రిట్టిమీరు దు
ష్కరముగ నూతిలోఁ బడిన కాంచనపీడఁ గొనంగనేర కొం
డొరులమొగంబు జూచి నగుచుండఁగ జన్నె యుపాయహీనతన్.
| 163
|
క. |
మీరును గుంతియు సహపరి
వారమహామాత్యభృత్యవర్గులరై నా
నారాజ్యలీలతోఁ జని
సారమతిం జేయుఁ డందు సతతోత్సవముల్.
| 164
|
సీ. |
వడముడియును నీవు వాయు వాసవు లశ
క్తులు ధరియించిన దుర్జయులరు
| 165
|
48 లక్షణము
క. |
నురులుఱులు పొల్లు లగుచుం
దిరముగఁ బైహల్లు గదిసి ద్విత్వముఁ జెందు
న్సరవి నవి వేఱె యుండున్
గరిదైత్యవినాశ శైలకన్యాధీశా.
| 166
|
వ. |
నులులకు సులభమే కనక దురులకుఁ జెప్పుచున్నాము.
|
|
ఉ. |
త్యాగులు బాతకేతరులునై నుతి కెక్కఁగ నాకలోకలీ
లాగరిమంబు నంబురము లాగు దనర్చిన సంస్కృతోల్లస
ద్వాగభియుక్తి నాత్మవిభుధత్వము సిద్ధత నొందఁగా సుధా
యోగము నొందుదు ర్శ్రుతిపయోధి మధించి రసజ్ఞులై కవుల్.
| 167
|
క. |
వినుము రిచివునకు తనయుం
డనఘా యతితారనైజుఁ డతనికి మువ్వు
ర్తనయులు సుమతియు ధృఢుడును
ఘనుడు ప్రతిరథుఁడు ననఁ బ్రకాశితతేజుల్.
| 168
|
సీ. |
శాకపాకములతో సంభారములతోడఁ
బరిపక్వమగు పెసర్పప్పుతోడ
| 169
|
క. |
భూతప్రేతపిశాచ
వ్రాతములుం దోడుగాఁగఁ బ్రమథులు పగలున్
రాతిరియును నష్టాదశ
జాతిప్రజలకును దుర్దశలు సంధింతున్.
| 170
|
మ. |
పరిహాసంబునఁ దేలి భృత్యులయెడన్ బ్రహ్లాదము న్బొందుభూ
వరునాజ్ఞం జన రీగి మెచ్చరు పని న్వంచింతు రెగ్గాడజొ
త్తురు కౌతూహలవేషభాషణములుం దుల్యత్వముం బొంది యే
తురు వారెల్లపదంబు వేడుదు రుసింతు ర్భూమిమారొండునన్.
| 171
|
శకటరేఫకు
సీ. |
మగడు ద న్మొత్తుచో మాఱ్మొత్తునలివేణి
వ్యాఘ్రియై చరియించు వనములోన
| 172
|
49 లక్షణము
ఆ. |
లేవనెత్తుటయును చావకయుండుట
వెఱవకుండుటయును మఱువకుంట
నొవ్వనేయుట నెడు నుడువులఁ గలవకా
రమ్ము లోప మొందు రాజమకుట.
| 173
|
లేనె త్తనుటకు
మ. |
తనతో నల్గినవాణిపాదములమీఁదన్ వ్రాల లేనెత్త నొ
య్యన పాశ్చాత్యనిజాస్యతన్ముఖములం దన్యోన్య మొక్కప్డు చుం
బన మబ్బంగ జతుర్ముఖత్వము ఫలింపం జొక్కు పద్మాసనుం
డనవద్యాయురుదీర్ణుఁ జేయు చికతిమ్మాధీశు తిమ్మాధిపున్.
| 174
|
చాకుం డనుటకు
శా. |
ఆకేశధ్వజుఁ డంత నానృపునిరాజ్యంబెల్ల జేరన్ ఫలం
బాకాంక్షింపఁగ గెల్తు మృత్యువు నవిద్యం బుట్టకుండం దుదం
జాకుండన్వలెనంచు యోగనిరతిన్ జ్ఞానాశ్రయుండై మహా
నీకంబున్ రచియించుచుం డొకటికిన్ దీక్షించి తానున్నచోన్.
| 175
|
క. |
చాకున్న నీదుముక్తులు
శ్రీకాశీక్షేత్ర మెవ్వరికి నిది నిక్కం
బీరుధరమిచ్చు శిఖరా
లోకనమాత్రమున ముక్తులు కురంగాక్షీ.
| 176
|
క. |
నాలుగుదిశలను దాప
జ్వాలావలి గదిసె మ్రంది చానోపఁ గృపా
|
|
|
లోలా నన్నొక్కసరి
త్కూలముఁ జేరంగ నెత్తికొనిపొమ్ము దయన్.
| 177
|
వెఱకుండుటకు
గీ. |
చెంచునింటికిఁ బోయి చెంచెతకుఁ బ్రియము
చెప్పి నమ్మించిత తలమీఁదఁ జేయి వెట్టి
వెఱకుమని తన్ముఖంబున నెఱుకుఱేనిఁ
గాంచియాతనితోడ సఖ్యంబుఁ జేసి.
| 178
|
నోనేయుటకు
సీ. |
అర్జునుపైఁ గూర్మి నతని నోనేయఁడు
సచరాచరంబైన జగము నెల్ల
| 179
|
గీ. |
బలము నచ్చెరువందున ట్లలవు మెరయ
నీసుతుం డనిలజుఁ దాకి నిశితిసాయ
కముల నొప్పించి రథతురంగముల నొంచి
నూతు నోనేయఁ గ్రోధవిస్ఫూర్తి నతఁడు.
| 180
|
50 లక్షణము
గీ. |
మూఁడులింగంబులకును సముచ్చయార్ధ
ములఁ దెనుంగునఁ గలపదములకు నెల్ల
యునులు వచ్చు నికారాంతమున కొకొక్క
తరినిఁ బొల్లనకారంబు దొరియు నభవ.
| 181
|
చ. |
అనలుఁడు రెండుమూడు యముఁ డాసురనాథుఁడు నాలుగైదు తో
యనిధిపుఁ డాఱు గంధవహుఁ డర్ధపుఁ డేడు మహేశుఁ డెన్మిదిన్
ఘనవిశిఖంబు లేయ మురఘస్మరుఁ డన్నియుఁ ద్రుంచి శార్ఙసం
జనితమహోగ్రభల్లముఖజర్ఝరితాంగులఁ జేసె నందఱన్.
| 182
|
చ. |
ఎఱుఁగవు గాక యొక్కపు డొకించుకమాఱ్మొగ మిడ్డకూర్మికిం
గొఱతయె యెంత చెప్పినను గోమలి నేరవయల్కఁ దెచ్చుకో
నెఱియ నధీన మౌ టెఱిఁగి నేడిది గైగయికోమి మిక్కిలి
న్పెఱపె నతండు నీవు విననేర్చెదె మాపలు కిప్పుడేనియున్.
| 183
|
శా. |
వాలిం గీలియు వాయుపుత్రుసరియే వాఁ డాత్మశక్తిజ్ఞుఁడై
| 184
|
చ. |
వలసిన నేలు మేను బలవంతుఁడఁ బోరుదు. . . . . . మ
ల్లుల విరతున్ మరిం గడియలో నన చూడ్కికి వేడ్కసేయుచున్
| 185
|
క. |
అనుజులకు నడ్డపడి యే
మిని జేయఁగలేమిఁ జూచి మెచ్చితిగా నీ
వును సాదు రేగెనేని
న్వినుదలపొలమునన కాని నిలువదు సుమ్మీ.
| 186
|
51 లక్షణము
క. |
తివరిచి యొనరిచి యమరిచి
యనుపదముల రీలు సంధి నడఁగున్ బొడము
|
|
|
న్వినుము తనర్చి యొనర్చియు
ననఁగ నమర్చియు ననంగ నంగజదమనా
| 187
|
క. |
బొమలు ముడివడఁగఁ బిడికిలి
యమరిచి కోపంబుతోడ నౌడు గఱచుచున్
జముచాడ్పున నాహరి ను
గ్రముగాఁ బయిఁబడుట దా మొగంబున వ్రేలున్.
| 188
|
అమర్చి యనుటకు
ఉ. |
లాలసరీగజాంకుశతలంపులసొంపులతమ్మిచూలి యీ
సేలయు నింగి దట్టముగ నిండ నమర్చిన యయ్యసంబుచే
| 189
|
52 లక్షణము
గీ. |
తాయెదయు నుయ్యెలయుఁ బయ్యెదయు ననంగఁ
గలుగ దత్వంబు మధ్యయకారమునకు
ననుచు మును ముద్దరాజు రామన వచించెఁ
గాని యత్వంబుఁ గృతులందుఁ గలదు శర్వ.
| 190
|
తాయెదయని యెత్వము వచ్చుటకు
సీ. |
ఒకయింత యెరగినసికమీఁదముడి పువ్వు
టెత్తులవొలయ తాయెదలు జుట్టి
| 191
|
ఉయ్యెల యనుటకు
చ. |
కలి దమయంతి పోప సమకట్టి పొరింబొరిఁ బాయనోపఁ డా
లలనను దీర్ణసౌహృదబలంబున నిట్టులు రెంటియందు న
|
|
|
న్నలుఁడు విమోహరజ్జుల బెనంగి గతాగతకాయ యయ్యె ను
య్యెలయునుబోలె నూరకయ యెంతయుఁ బ్రొద్దు వినిశ్చితాత్ముఁడై.
| 192
|
పయ్యెద యనుటకు
సీ. |
వలఁబడ్డ జక్కవల్ బలెనున్న జిలుగుబ
య్యెదలోన గుబ్బపాలిండ్లు మెరయ
| 193
|
మ. |
పదముల్ దొట్రిలఁ గౌను దీన వెలయింపం గేశముల్ దూలఁ బ
య్యెద వక్షోరుహపాళి చేర కనుదోయి న్బాష్పముల్ గ్రమ్మ గ
ద్గదకంఠంబున వాక్యము ల్దడఁబడన్ దద్గేహముం జొచ్చి యా
సుదతీరత్నము గాంచెఁ బాలుని మనశ్శోకానలజ్వాలునిన్.
| 194
|
ఉయ్యలయని అత్వము వచ్చుటకు
సీ.గీ. |
ఆడుచున్నవి పిప్పళ్ళ నంబరమున
సేయుచున్నవి త్రిభువనాశ్లేషకంబు
లబ్జనాభునితూగుటుయ్యలలు గంటె
వేనవేలు పయోరాశి వీటిఘటలు.
| 195
|
క. |
పలుమరుఁ దలయంటి తగ
న్నలుగిడి దోయిళ్ళ జలమునం బోర్కాడిం
చి లలిం జన్నిచ్చుచు ను
య్యల నూఁపుచుఁ బెనుపఁదొడఁగె నావరశిశువున్.
| 196
|
శా. |
శ్రీలీలాత్మజికృష్ణరాయసమరోర్వి న్నీదువైరిక్షమా
పాటు ల్వీఁగి హయాధిరూఢు లగుచున్ బార న్వనీశాఖశా
ఖాలగ్నాయితకేశపాశలయి తూగం గేకిస ల్గొట్టి యు
య్యాలో జొంపము లంచుఁ బాడుదురు భిల్లాంభోజపత్రేక్షణన్.
| 197
|
పయ్యదయని అత్వము వచ్చుటకు
చ |
కదిరినవేడిబాష్పములు గ్రమ్మి పయింబయిఁ బర్వ భీతి మై
నదరుచు విన్ననైన హృదయంబునఁ బొల్పగు హారయష్టి ప
య్యద దడియంగఁ గానఁబడె నంచితనిర్మలరత్నభూస్థలిన్
దదుదితదృశ్యమానమణిదామసముజ్వలభాాతిఁ దోపఁగన్.
| 198
|
53 లక్షణము
క. |
ఇల నాయీయేలగుపద
ముల పైఁ బెర వ్రాలు గదియ మొదలవిసాగుల్
లలిగ్రుంగుఁగ్రుంగు నెడవల
పలి వ్రాలకు జడ్డ లొదవుఁ బర్వతనిలయా.
| 199
|
ఆ. |
ఆకుమారి యనఁగ నక్కుమారి యనంగ
నీగయాళి యనఁగ నిగ్గయాళి
యేచెనంటి యనఁగ నెచ్చెనంటి యనంగఁ
జెల్లుఁ గృతులయందు శ్రీమహేశ.
| 200
|
క. |
ఆరయఁ దచ్ఛబ్దాదుల
పై రేఫోష్మములు మొదలబడు పదము లిడన్
జేరవు హ్రస్యద్విత్వము
లారాఘవుఁ డాశరంబు లన నొప్పుశివా.
| 201
|
క. |
తగఁ గృతుల గకారమునకు
నగు నొక్కొకచో వకార మాంధ్రపదములన్
|
|
|
నగ రనఁగ నవ రనంగాఁ
పగడము పవడం బనంగఁ బర్వతనిలయా.
| 202
|
క. |
వివిధోత్పాతంబులకును
నవళ్ళలో దోఁచుకీడునకుఁ దోడ్తో శాం
తివిధానమున నిరసనం
బవును పురోహితునిచేత ననవద్యముగన్.
| 203
|
క. |
అవయవము లెట్లు కూర్మము
నివుడించును లోని కడఁచు నెరి నట్లన భూ
తవితతి భూతాత్ముండును
బ్రవర్తననివర్తనములఁ బాల్పడఁజేయున్.
| 204
|
54 లక్షణము
క. |
కావింపుట కావించుట
భావింపుట మఱియు దీని భావించు టనన్
గా వెలయుఁ గృతులఁ దుహిన
గ్రావసుతాప్రాణనాథ ప్రమథసనాథా.
| 205
|
కావింపుట సులభమే. కావించుటకు.
ఉ. |
మంచిగ మేనయత్తలు .................................పు
త్తెంచిన................................................................భ
క్షించుచుఁ దల్లిదండ్రి తనచిన్నకరాంగుళి వంచి.......యూ
ఱించుచు నాడె మిన్నగమి ఱేఁడుకుమారకుఁ డింటిముంగిటన్.
| 206
|
|
చంచలత్వంబు మది బ్రకాశించుచుండె
బాల యాలీల నభ్యసింపంగ బోలు
రమణదూతపతంగచం-క్రమముతోడ|.
| 207
|
ఉ. |
చంచలనేత్ర దాల్చు జలజాతమృణాళసరంబు లేవస
ళ్ళించిన బారుతెంచి కబళించితదూష్మకు నంగలార్చు రా
యంచకు చేష్ట గాంచి యిఁకనైనను గందుమొ యంచు మోము వీ
క్షించఁగదోచు లేనగవు చేరుచు బోట్ల కొకింతప్రాణమున్.
| 208
|
మహాస్రగ్ధర. |
పరభూభృత్ప్రాప్తి నబ్ధిం బడు రవిహరులం బ్రౌఢి వాటించ వెందున్
సరిగాఁ దద్ఘ్రీంకృతుల్ సైసకరవిహరిగా జాయకున్ రానడంచున్.
| 209
|
శా. |
అంచున్ రాయడివన్నెరాల్ పులుగుఱేఁ డాసీను లూత ల్గొనం
బంచాస్యంబులు గల్గు పాపదొర గ్రామ్యబ్రహ్మచారుల్ దువా
ళించన్ బచ్చనవ్రాత లూడిపడు మేల్కీల్గుఱ్ఱమన్యంబులౌ
చంచద్వాహము లుంచు మంటపముపంచం జేరి విశ్రాంతుఁడై.
| 210
|
కాకమానురాయని బహులాశ్వచరిత్ర
ఉ. |
వంచన జేసి యిట్లు చెలువం గొనిపోవు బ్రలంబవైరి సై
రించునె దుర్మదాధిపవరేణ్యుల భూములు గొట్టి ధూళిగా
వించఁడె పిండిపిండిగను వీరవిరోధికిరీటరత్నముల్
దంచఁడె ఘారశీరముసలంబులు వ్యర్ధములే ధరించుటల్ .
| 211
|
మత్తకోకిల. |
పంచసాయక సాయకంబులబారి కోర్వఁగఁజాల కే
నంచయాన వరించునప్పు డొకప్పుడున్ మిము గూడి వ
ర్తించరాదని
| 212
|
కడమ తెలుసుకొనునది. ఇది సంధిప్రకరణం బిఁక విభక్తిప్రకరణం బెఱింగించెద.
విభక్తిప్రకరణము
1 లక్షణము
గీ. |
మహి నకారాంతములు తత్సమంబు జేయు
నెడల ప్రథమకు వచ్చుడుల్ చెడుసమాస
ములను కొక్కెడ ఘను సేయు పుణ్య మనిన
నదియె కొందఱు షష్టి యంచండ్రు శర్వ.
| 1
|
చ. |
అమితజగద్భయంకరువిషాగ్నియు నప్రతిహన్యమానవీ
ర్యము గలయట్టి సర్పముల కాజనమేజయు సేయు సర్పయా
గమున నుదగ్రసావకశిఖాతతిలో మెరుగంగ గారణం
బమలచరిత్ర యేమి చెపుమయ్య వినం గడువేడు కయ్యెడున్.
| 2
|
చ. |
అనుపమతేజు డున్నతభుజాగ్రుడు దుర్జయవైరినిగ్రహుం
డనఘుఁడు వాయుసూనుఁడు నిజాగ్రజు సేసిన సత్యపాశబం
ధనమునఁ జిక్కి ....................................................
| 3
|
గీ. |
అపుడు రాధేయు డమ్మైయి ననుజు పడుట
జూచి యేనుంగునకు సిళ్ళు చూపినట్లు
| 4
|
ఉ. |
ఆధృతరాష్ట్రు సేసిన యనర్ఘ్యమణిప్రవరానుబద్ధశో
భాధృతి నొప్పుచున్న సభ
| 5
|
అల్లుడు తమ్ముడునను తెనుగు పదాలకున్ను డుకారలోపము వచ్చును.
గీ. |
తమ్ము సేసినదురితంబు దలగఁబూని
ధర్మబుద్ధివై వ్రతముల బేర్మి జేసి
తనఘ నీకు నభీష్టంబు లైనవరము
లడుగు మిచ్చెద మీమెచ్చు గడపనగునె.
| 6
|
ఈలాగే ప్రథమాంతాలు అన్నిటికి తెలుసుకొనునది.
2 లక్షణము
గీ. |
ప్రాణిపదములు గాని శబ్దముల కిల వి
భక్తులందు ద్వితీయకుఁ బ్రథమ వచ్చు
మరి ద్వితీయము నొకొకచో నెరయు నరద
మెక్కె నరదంబు నెక్కె నా మృగధరాంక.
| 7
|
ద్వితీయకు ప్రథమ వచ్చుటకు
గీ. |
పసిఁడిరథ మెక్కి విపులవైభవము మెరయ
చూపరుల కెల్ల వ్రేకంబు చోద్య మొదవ
సాంగమై వచ్చు భాగధేయంబువోలె
మామయింటికి వచ్చె జామాత యపుడు.
| 8
|
రెండవవిధము ద్వితీయ నిలుచుటకు
చ. |
అరదము నెక్కి కేతనపటాంచలచంచలమైన తాల్మితోఁ
దురగజవంబు మున్గడనఁ ద్రోచి కడంగెడు తత్తరంబుతోఁ
దిరిగెడుబండికండ్లపగిదిన్ భ్రమియించుమనంబుతోడ నా
|
|
|
హరి చనుదెంచె సత్యసముదంచితకాంచనసౌధవీథికిన్.
| 9
|
చ. |
అరదము నెక్కి లోచనసహస్రము కాంతి వెలుంగఁబొల్చు ని
ర్జరపతి గన్నులారఁ గని సంతసమందెడువారితోడి మ
చ్చరముననొక్కొనా నుదయశైలముమీఁద సహస్రదీధితి
స్ఫురణ దలిర్పనొప్పు రవిసొంపున జృంభణఁ బొందె నబ్జముల్.
| 10
|
గీ. |
విహగపతి నెక్కి వైష్ణవి ప్రహరి దిరుగు
బంచమియును జాముండయు సంచరించు
నాత్మవాహనముల నెక్కి యహరహంబు
ననఘ శ్రీకాశికాపురాభ్యంతరమున.
| 11
|
క. |
విమలమణిమయములగు దూ
లములం గంబముల గోడలను వేదుల గు
ట్టిమముల జుట్టిన ప్రాకా
రములం గడునొప్పుచుండ రచియించె సభన్.
| 12
|
చ. |
తలిరుల నెల్లఁ గోసి కరతామరసద్యుతి వెల్లిఁగాల్పఁగా
నలరుల నెల్ల గోసి నఖరాంచలదీప్తులు పైని గుప్పఁగాఁ
జిలుకల నెల్లఁ దోలి తమచిన్నియెలుంగులభంగిఁ జూపఁగాఁ
జెలువము కొత్తయై సతులచే వనవాటిక యొప్పె నయ్యెడన్.
| 13
|
3 లక్షణము
ఆ. |
కూర్చియను ద్వితియ్యకును నొక్కషష్టికి
|
|
|
పైవిభ క్తి గానఁబడఁగ రాక
యడఁగియుండుఁ గృతుల నాచార్యు బ్రణమిల్లె
రాజుకొడు కనంగ రాజమకుట.
| 14
|
కూర్చియను ద్వితియ్యకు
ఉ. |
ఇమ్ముగ సర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాంశుబిం
బమ్మున నుద్భవంబయిన భారతవాగమృతంబు గర్ణరం
ధ్రమ్మనునంజలిం దవిలి త్రావుదు రట్టిమునీంద్రు లోకవం
ద్యుమ్మరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.
| 15
|
చ. |
అని తగ నేకవాక్యత బ్రియంబున నాతనితోడ నీవు మున్
గనినది విన్నయట్టిది బ్రకామకుతూహలచిత్తుఁ డైనకృ
ష్ణుని వినుపింపు నావుడు మనోజ్ఞకథాకథనంబునందు వే
డ్క నిగుడ నమ్మునీంద్రుడు వికాసమునన్ మొగ ముల్లసిల్లగన్.
| 16
|
గీ. |
సమయసముచితమృదువాక్యసరణి వెలయ
గోరి సుఖగోష్టి నప్పుడు కొంతప్రొద్దు
జరపి కుంతీసుతాగ్రణి సంయమీంద్రుఁ
బలికె నిట్లని వినయసంపదలు వొలయ.
| 17
|
ఒక్కషష్టికి
మ. |
అకటా జుత్తెడునేలకుం దగడె సప్తాంభోధివేష్టీభవ
త్సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోపల
ప్రకరానేకవినిర్గళత్కరణశుంభత్పాదుఁ డైనట్టి రా
|
|
|
జుకుమారుం డని యేడ్చె కన్నుగవ నశ్రుల్ కాల్వలై పారగన్.
| 18
|
4 లక్షణము
గీ. |
సప్తమికిని తృతీయ కెంచన్ ద్వితీయ
వచ్చువని జేరె హేతిని వ్రచ్చెననగ
నందు జేతననందగు నట్టియెడల
పన్నగాధీశకేయూర భయవిదూర.
| 19
|
మ. |
హరి మైసాదిసిరంబు సాదిమయి జాత్యశ్వోత్తమాంగంబు గూ
డ రణోర్విన్ రఘునాథశౌరి యసిఁ జెండన్ దివ్యమందారబృ
ష్టి రహిం బాణయుతంబులై గగనవాటిం బర్వి గంధర్వకి
న్నరరూపంబులు దాల్చి సారె నవి యానందించుఁ దచ్ఛౌర్యమున్.
| 20
|
5 లక్షణము
క. |
కై యనఁగఁ గ'కారముపై
నై యనఁగ విభక్తు లొప్పు నరయఁగఁ గృతులన్
బాయక నెపుడుఁ జతుర్థికి
కాయజదుర్దర్పహరణ గౌరీరమణా.
| 21
|
కొఱకు కై చతుర్థ్యాస్తః
అని చతుర్థికి కొఱకు కైలు వచ్చునని నన్నయభట్టు చెప్పినాడు.
అందుకు కై వచ్చుటకు
ఉ. |
నావుఁడు వాయునందనుఁడు నందన పొమ్ము చమూవధూటినీ
కైవశమైన లెస్స యటుగాకని నుందల మీఱెనేని దౌ
|
|
|
దౌవున నిల్చి మద్ఘనగదాపటువిక్రమతాడనంబులం
జేవయడంతు నెందు గురుశిక్షగదానుతి గాంతు రంగనల్!
| 22
|
కకారముమీఁద నై వచ్చుటకు
ఆ. |
ఆరణి నగ్ని వొడముకరణి దేవకియందు
విప్రయజ్ఞకర్మ వేదగుప్తి
కై జనించె నెవ్వఁ డవ్వసుదేవనం
దను భజింతు నేకతానిరూఢి.
| 23
|
6 లక్షణము
గీ. |
లలితృతీయాదులగు విభక్తులకు నెల్ల
గలుగు మధ్య నకారంబు దొలఁగుచుండు
రాముచే రాముకొఱకు శ్రీరాముకంటె
రాముకును రామునందనరాజభూష.
| 24
|
తృతీయకు నకారలోప మగుటకు
ఉ. |
హాటకగర్భుచేత గమలాసనుచే జతురాస్యకంథశృం
గాటకవీథికాకృతవిగాహచతుశ్రుతిచేత దేవతా
కోటికిరీటసంఘటితకోమలసాదసరోజుచే జగ
న్నాటకసూత్రుచేతఁ గృతినాథుఁడు గాంచు జిరాయురున్నతుల్.
| 25
|
చతుర్థికి
గీ. |
నతు లొనర్చెదఁ బార్వతీనాథుకొఱకు
| 26
|
క. |
తనయుఁడు తనయుని గదియుం
దనయునిచేఁ దనయుకొఱకుఁ దనయునివలనన్
| 27
|
పంచమికి
క. |
పదియేనేడుల బాలుని
సదమలగుణుఁ గాక పక్షసంయుతు నే ని
ట్లదయతఁ బుత్తేజాలను
సదయుఁడ వగు రామువలన సంయమివర్యా.
| 28
|
సీ. |
రాత్రి మైదాకి క్రూరతఁ బోరి మగటిమి
బాసినయంగారపర్ణుకంటె
| 29
|
షష్ఠికి
ఉ. |
లాలనఁ గ్రొత్తబెబ్బులి కళాసము వెట్టిరి యాసనంబుగా
గోలయు సాధునైన యొకకోకటికిన్ నిషధేంద్రు బచ్చుకున్.
| 30
|
క. |
రామునిశుభచరితంబుగ
రామాయణమున్ రచించి ప్రాచేతసుకున్
బ్రేమ నెఱిఁగించి తగ నిజ
ధామమునకు నారదుం డుదారత జనియెన్.
| 31
|
సీ. |
నీతూపు కోర్వక నిటలాక్షుఁడును తనూ
ఫలకంబుచాటునఁ బాయఁ డెపుడు
| 32
|
సీ. |
సహదేవనకులవాసవసుతభీములఁ
గ్రమమున నలువురఁ గౌరవేంద్రు
కొక్కొక్కయేటున నుక్కివంబున నొడ్డి
యోడి తన్నును నొడ్డి యోటువడిన
| 33
|
ఉ. |
వంతుకు వచ్చు సత్యగరువ మ్మిఁక జెల్లదటంచు మానినీ
| 34
|
చ. |
అహిమరుచిప్రతాపుఁడగు నాకుశనాభుఁడు బ్రహ్మదత్తుకున్
దుహితృశతంబు నీ నతఁడు దోడ నవారిగ్రమంబు సంగర
గ్రహణము సేయ
| 35
|
వ. |
సప్తమికి న ము నందనికద్దు షష్టికిఁ గొందఱు నకారలోపము లేదందురు. అనినను "టాదివిభక్తౌనిర్ణేత్యే కే" అన్న శబ్దానుశాసనసూత్రమునకును, రాముచేత, రాముకొఱకు, రామువలన, రాముకు, రామునందు అని కలదని వ్యాఖ్యానము వ్రాసిన బాలసరస్వతి వ్రాఁతకును భంగమువచ్చును గనుక రాముకు అని చెప్పవచ్చును.
|
|
7 లక్షణము
క. |
పెల్లడరఁ గొన్నిపదములఁ
దెల్లమిగాఁ జేతనను తృతీయకుఁ గృతులం
|
|
|
జెల్లును మైయనుట మరు
త్కల్లోలపతీభుజంగ క లుషవిభంగా.
| 36
|
సీ. |
దుగ్ధాబ్ధికన్యక తోటికోడలు గాఁగ,
నొరిమ మైనుండ నీ కొప్పుఁ గాదె
| 37
|
సీ. |
ఓర్మి మై నుప్పిడియుపవాసముల నుండి
మగనాలి సరిబోల్పఁదగదు విధవ
| 38
|
మ. |
అమలోదాత్తమనీషమై నుభయకావ్యప్రౌఢి బాటించు సి
ల్పమునం బారగుఁడన్ విదుఁడ
| 39
|
8 లక్షణము
క. |
గురుఁ డన జనకుఁ డనందగు
పురుషాఖ్యల డులు దొలంగి పొదవు నికి నకుల్
పరికింపఁగ షష్టికి సుర
పరివృఢపరిపూజితాంఘ్రిపద్మమహేశా.
| 40
|
క. |
సకలభువనములు నరచే
తికిఁ దేరంజాలినట్టి ధీమంతుఁడు దే
వకికొడుకు గలఁడు ధర్మజు
నికి నాతం డెత్తిరాక నిలుచునె యధిపా.
| 41
|
క. |
వివిధమణిమయరథంబులు
జవనాశ్వంబులును భద్రసామజములు ర
|
|
|
త్నవిభూషణములు దాసీ
నివహంబులు జాల గృష్ణునికి నే నిత్తున్.
| 42
|
క. |
దశకల్పసహస్రంబులు
నిశి యంతయె దివస మిది సునిద్రారతికిన్
విశదప్రబోధమునకున్
వశగతకాలములు విష్ణునకు విమలమతీ.
| 43
|
9 లక్షణము
క. |
ప్రథితముగఁ కృతుల షష్ఠికిఁ
బ్రథమవిశేషణము జెల్లుఁ బరిపంథిమదో
న్మథనుఁడు రామున కెనయే
పృథివిం జిఱుదొర లనంగ వృషపతిగమనా.
| 44
|
చ. |
తనుతరమధ్యయాగమవిధానము దప్పక యుండ మౌనిచే
ననుమతి గాంచి మొక్కి వినయంబున నందఱ నామతించి క
ల్పనగము క్రొవ్విరుల్ గనకపాత్రికలం దగనించి యిచ్చె వా
యనములు రుక్మిణీప్రభృతు లైనసతుల్ బదియాఱువేలకున్.
| 45
|
క. |
అపరాహ్ణసమయమున ని
ట్లుపమాతీతానుమోదయుద్ధం బయ్యెన్
విపులభుజబలుఁడు భీమున
కపరిమితబలుండు గౌరవాధీశునకున్
| 46
|
క. |
మీపనుపున రాజ్యముపా
లీపాండుతమూభవులకు నీకున్న భుజా
టోపభయంకరుఁ డర్జును
కోపానల మడరి ముట్టుకొనదే వారిన్.
| 47
|
శా. |
భారద్వాజపవిత్రగోత్రు విమలాపస్తంబసత్సూత్రు వి
ద్యారాజీవభవుండు మారయకుఁ బుజ్యాచార భీమాంబకున్
గారామైనతనూజు.....................................................
| 48
|
10 లక్షణము
క. |
కదిసి ముకారాంతములగు
పదములపై సప్తమీవిభక్తి యొదవుచో
హ్రదమున హ్రదమునయందున్
హ్రదమందున్ హ్రదమునందు ననఁ జను శర్వా.
| 49
|
చ. |
ఉరమునయందుఁ గన్నులు పృథూదరదేశమునందు నోరు బ్ర
స్ఫురితభుజద్వయంబు గులభూమిధరోన్నతభావముం గరం
బరుదుగ నుగ్రమైనవికృతాకృతితోడన శేషసత్వఘ
స్మరుఁడగుచున్నవానిఁ బటుసత్వుఁగబంధుని గాంచి రచ్చటన్.
| 50
|
మ. |
హరుఁడా తారకశైలదుర్గమున నధ్యాసీనుఁడై రాజశే
ఖరవిఖ్యాతి వహించు చంద్రగిరిదుర్గంబందు శ్రీవేంకటే
శ్వరుఁ డొప్పున్ బహురాజశేఖర సదా సంసేవ్యుఁడై యారయన్
|
|
|
ద్ధరబంటేలికవాసి తద్గిరులకున్ దద్వల్లభశ్రీలకున్.
| 51
|
సీ. |
అవిముక్తమందు ను పాస్యుఁ డాత్మ యటంచు
యాజ్ఞవల్క్యుం డత్రి కానతిచ్చె
| 52
|
మ. |
హరిదశ్యాన్వయమందు దాశరథినై యస్మత్పదాంభోజత
త్పరుఁడైయుండు విభీషణాఖ్యునకు మద్ధామంబు శ్రీరంగ మే
గరుణాధీనత నీ నతండు గొనిరాఁ గావేరిలోఁ జంద్రపు
ష్కరణీతీరమునందుఁ గైకొనియెడుం గల్పావధిస్థైర్యమున్.
| 53
|
11 లక్షణము
ఆ. |
విన్ను మన్ను కేలు వీడు ప్రో లనునెడ
వింట మంట కేల వీట ప్రోల
ననఁగ నొప్పును మఱియు నటులె యుత్వముపై న
కార మొదవుఁ గొన్నికడల నీశ.
| 54
|
నకారము వచ్చుటకు
ఉ. |
విన్నున నేఁగు తామరల విందుకిలాతపునీడ లెప్పుడున్
వెన్నెలరాచరాలఁ గని...........................................
| 55
|
వీడున అనుటకు
క. |
వీడు చదివించె నయ్యెడ
వీడనివేడుక బలారి విబుధులతో లే!
|
|
|
వీడు మణు లనఁగఁ దగు తన
వీడునఁ గలమానికములు వివిధాంబరముల్.
| 56
|
ప్రోలున అనుటకు
క. |
కనకమయమైన యాప్రో
లున దమసుతు లాహవంబులో నమరులచే
తనవధ్యులు గా మఱి య
వ్వనజజుజేఁ బడసి రసురవనితలు గరుణన్.
| 57
|
12 లక్షణము
గీ. |
నోరు నీరును గోరను నుడువులకును
నోట నీటను గోటను నోర నీర
గోర నన మఱి నోరున నీరున నన
గోరున ననంగఁజను మేరుకుథరచాప.
| 58
|
నోర ననుటకు
గీ. |
నోర మానిసితలలు వేసారిక డఁపు
బొండముల్బోలె పీల్చుచు భువనభయద
| 59
|
క. |
నకులుఁడు సహదేవుండును
బ్రకటభుజాస్ఫురణము నన రాతిబలము నే
|
|
|
లకు గోలకుఁ దెత్తురు నో
రికి వచ్చినయట్టు లాడిరే యిబ్భంగిన్.
| 60
|
నీర ననుటకు
ఆ. |
నీర నగ్నియునికి యారయ విస్మయం
బనుచు బాడబాగ్ని కడలి యప్పు
రంబు బొల్చెనొక్కొ రత్నాకరము మణు
లనఁగఁ జెలువ మమరు నాపణములు.
| 61
|
చిమ్మపూడియమరేశ్వరు విక్రమసేనము
ఆ. |
నీరిలోన కాండ తారకప్రతిబింబ
మొక్కొ యనఁగ వెలుఁగుచున్న నపుడు
రాచకొడుకు లెల్లఁ జూచుచునుండిరి
దానిఁ బుచ్చుకొనువిధంబు లేక.
| 62
|
."
నీట ననుటకు
సీ. |
నీటఁ దేలు శరంబు పాట దేలు సరంబు
బట్టఁగాఁ బట్టఁగాఁ బుట్టలేని
| 63
|
గీ. |
పాలఁ బుట్టినమాత్రాన మేలిగుణము
నేడు నీ కేల గల్గునో నీరజారి
నీటఁబుట్టినవాఁడు గాడోటువహ్ని
కాల్చుచున్నాఁడు జగమెల్ల కరుణ లేక.
| 64
|
గోరునకు
ఉ. |
కారణ మేమి రక్కసు నఖంబుల వ్రచ్చితి నాడు నీకుఁ బెం
పార కుఠార మబ్బదొ పురారివిరించులు చేరి యేఁటికిన్
గోరున బోవు సేఁతలకు గొడ్డలియన్న దొరంగితో వినం
గోరెదనన్నయిందిరకు గోరిక లిచ్చుముకుందుఁ గొల్చెదన్.
| 65
|
కంచిరాజు సూరయ కన్నప్పచరిత్ర
వ. |
కడమ యీలాగే తెలుసుకొనునది.
|
|
13 లక్షణము
క. |
ఒనరఁ దృతీయకు సప్తమి
కిని యొక్కడఁ బ్రథమ వచ్చుఁ గృతుల సుఖంబుం
డెను చిచ్చురికె ననంగా
ఘనతరగోరాట్తురంగ కలుషవిభంగా.
| 66
|
తృతీయకుఁ బ్రథమ వచ్చుటకు
సీ.గీ. |
బ్రహ్మరతులు దపస్వులు భవ్యతీర్థ
సేవకులు సద్ర్వతులును నిస్పృహులు మొదలు
గాఁగ నొప్పెడు తత్పుణ్యకర్మపరులు
వీరె కనుగొందు సుఖమున్నవార లిందు.
| 67
|
సప్తమికిఁ బ్రథమ వచ్చుటకు
గీ. |
ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవు
దివ్యవర్షంబు లన్ని మోదించు సాధ్వి
నాకభువనంబునం దాత్మనాథుఁ గూడి
|
|
|
వెర పొకింతయు లేక చి చ్చురికెనేని.
| 68
|
సీ. |
తరిచూచి యిచ్చె నెద్దానిఁబట్టికిఁ దల్లి
జూద మోడిన పైడి చుట్టుకొనిన
| 69
|
14 లక్షణము
గీ. |
వనము కాలము ప్రాణము ధనము డెంద
మన ముకారాంతములకు నా లెనయు నొక్క
తరిని మూ ల్వోయి దీర్ఘము ల్దాపలిదెస
వర్ణములకు విభక్తులు వచ్చు నభవ.
| 70
|
క. |
మానుగ ధృతరాష్ట్రుఁడు ప్రా
ణానం గలుగంగ బంధునాశము రాజ్య
శ్రీనాశము నుద్దామయ
శోనాశముఁ జేయ నేల చూచెదు చెపుమా.
| 71
|
సీ.గీ. |
ఇంక ననుబోటి దొడరిన నింతకంటె
నెడరు వాటిల్లు వేగ బొ మ్మింటికడకు
హరియు పార్థుండును న్నెడకైన నేగు
మేను దెగ నీదుప్రాణాన కింత నిజము.
| 72
|
ఆ. |
వెండిపింజతోడి వెడదయమ్ముల జిత్ర
సేనధరణినాథు శిరము ద్రుంచి
వాడినారసం బవర్మునినిటలాన
నాటనేసె దివిజనాథసుతుఁడు.
| 73
|
15 లక్షణము
క. |
ఇల గొన్ని యచేతనముల
నలరఁ దృతీయాదికంబు లైనవిభక్తుల్
నిలిపెడుచోట నకారం
బలవడ నేకవచనముల నగజాధీశా.
| 74
|
చ. |
అనుపలు కంకుశంబున క్రియం గుదియించిన నిల్చి భూరుహం
బున దెసవోక మత్తగజపుంగవుచందమునన్ సమీరనం
దనుఁడు శరీరదోహలవిధాపరిశోభితవిక్రమోద్యమం
బున విలసిల్లి యిట్లనును భ్రూకుటి ఫాల మలంకరింపఁగన్.
| 75
|
16 లక్షణము
గీ. |
భువి నికారాంతములకు సంబుద్ధియొదవు
సపుడు విష్ణుఁడ విష్ణుఁడా యనఁగ నొప్పు
మఱియు విష్ణూ యటంచుఁ గొందఱు ప్లుతంబు
నల్కుదురు శైలకన్యకాప్రాణనాథ.
| 76
|
సూ॥ డుఙదౌతునప్లుతస్యూత్సంబుద్ధావిత్యుతాం విధుః కేచిత్॥
వ. |
అని వాగనుశాసనునిసూత్రమును జరత్కారూ మునిశ్రేష్ఠ యని ఆయన ప్రయోగమును నున్నది.
|
|
సీ. |
శ్రీకంఠ ధర్మధురీణ శంభూ కమ
లాధిప యీశాన యదుపతి మృడ... ...
| 77
|
17 లక్షణము
గీ. |
పదములకు నెల్ల నారయన్ బలుకు కృతులఁ
బొదవు బహువచనముల సంబోధనలకు
స్త్రీపురుషశబ్దముల కొకచెంత నార!
దొలఁగి ప్రథమాబహూక్తియ ట్లడరు నభవ.
| 78
|
వ. |
మృగములార, ఖగములార, నరులార, తరులార యని ఆర వచ్చుట సులభము.
|
|
ప్రథమాబహువచన మట్లు వచ్చుటకు
క. |
ఒప్పులు గలిగిన మెచ్చుడు
దప్పులు గలిగిన నెఱింగి తగఁదీర్పుఁడు ద
ప్పొ ప్పనకుఁ డొప్పు తప్పని
చెప్పకుడీ కవులు పాస్తి జేసెద మిమ్మున్.
| 79
|
చ. |
అనఘ మదియ్యవర్తనమునం దొకదోషము గన్నవారొ నా
యనుజుడు లక్ష్మణుండు దన కర్హము గానిగతిం జరించెనో
జనకతనూజ నాకుఁ బరిచర్యలు సేయుతరిన్ దపస్వినీ
జనపరిచర్య లేమరెనొ సంభ్రమకారణ మేమి సంయముల్.
| 80
|
."
వ. |
ఈలాటిప్రయోగములు బహుళముగా గలవు.
|
|
18 లక్షణము
క. |
ఓరి యనెడుసంబోధన
పేరునఁ బెక్కండ్ర నొకనిఁ బిలువఁగ ననువౌ
|
|
|
నోరి జనులార యనగా
నోరి జనుండా యనంగ నుడుపతిమకుటా.
| 81
|
ద్విపద. |
ఓరి రాక్షసులార యుర్విపై నేను
శూరత విలసిల్లు సుగ్రీవుబంట.
| 82
|
రంగనాథుని రామాయణము. సుందరకాండ
19 లక్షణము
.
గీ. |
మొనసి కృతుల నుకారాంతములఁ దెనుంగు
సేయునెడలను వూల్వచ్చు చెడు నొకొక్క
తరిని రాహువు బాహువు తరు వనంగ
రాహు బాహును తరు నన రాజభూష.
| 83
|
రాహుశబ్దానకు
క. |
ఉర్వీచక్రము వడఁకెను
పర్వము లేకయును రాహు భానునిఁ బట్టెన్
| 84
|
గీ. |
తతతనువు రాహు సోమామృతంబు మ్రింగె
చక్రి దునిమిన మెడ గంటిచాయ బొలిచె
| 85
|
బాహుశబ్దానకు
గీ. |
నేల నాలుగుచెరఁగుల నృపులకొలువు
లందు నేనును వర్తింతు నవనినాథ
యగ్గళించి నాయెదుట బా హప్పళించి
|
|
|
గడువఁజాలెడుమల్లులఁ గాన నెందు.
| 86
|
ఊరుశబ్దానకు
చ. |
ఉరుతరవజ్రకర్కశతయున్ గుధరోన్నతియున్ గుచంబులన్
సరసిజసంవికాసమును జంద్రవిలాసము నెమ్మొగంబునన్
గరికరలక్ష్మియున్ గదలికాతరువిస్ఫురణంబు నూరులం
బొరయుట చిత్రమయ్యె నృపపత్రిక కాయలజవ్వనంబునన్.
| 87
|
రఘుశబ్దానకు
మ. |
రజనీనాథకులైకభూషణుఁడవై రాజర్షివై ధారుణీ
ప్రజనెల్లన్ దయతోడ ధర్మచరితం బాలింపుచుం దొంటి ధ
ర్మజు నాభాగు భగీరథుం దశరథున్ మాంధాత రామున్ రఘున్
విజయు న్బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షతా.
| 88
|
తరుశబ్దానకు
సీ. |
అరిగెడిరయమునఁ దరులు బాల్పడి మ్రొగ్గఁ
బదఘట్టనంబునఁ జదిసిరాలు
| 89
|
జంతుశబ్దానకు
మ. |
హలికుం డెంతయు నోజ దున్నఁగను సీరాగ్రంబునన్ జోకి ప్రా
ణు లనేకంబులు జచ్చు హింస యది యౌనో కాదొ వేయేల మ
ర్త్యులు నేలంజరియించుచోఁ బదములం ద్రొక్కంబడుం బెక్కుజం
|
|
|
తులు హింసావిధి గా దనంగ వశమే దోషజ్ఞ యూహింపుమా.
| 90
|
20 లక్షణము
క. |
జడపద తిర్యక్పదముల
కడరఁగఁ బుల్లింగ మట్టులగుఁ గొన్నిఁటి కొ
క్కెడల సముద్రుం డన నుర
గుఁ డనన్ వాయసుఁ డనంగఁ గుక్కుటలింగా.
| 91
|
ఉరగుఁ డనుటకు
చ. |
అరిది తపోవిభూతి నమరారుల బాధలు బొందకుండగా
నురగులనెల్ల గాచినమహోరగనాయకుఁ డాననుత్సురా
సురముకుటాగ్రరత్నరుచిశోభితపాదుఁడు నద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి నాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్
| 92
|
క. |
మృగయార్థ మరిగి హిమవ
న్నగభూములయందుఁ బవననందనుఁ డొకప
న్నగుచేతఁ బట్టువడి యి
మ్ముగ ధర్మతనూజుచేత మోక్షితుఁడయ్యెన్.
| 93
|
వాయసుఁ డనుటకు
క. |
తలకొని జలముల బక్షం
బులు దుండము దోఁక జోఁకఁ బొరిఁబొరి నెగయన్
బలమరి మై దిగఁబడఁగా
|
|
|
సొలసి యెగయలేక వాయసుఁడు వెగ డొందన్.
| 94
|
21 లక్షణము
క. |
అమరఁగ నొక్కొకయెడ క
బ్బములఁ బ్రయోగింపఁజెల్లు బరికింపఁగ హం
సము లన హంస లనంగా
గుముదాప్తనిభోజ్వలాంగ కుక్కుటలింగా.
| 95
|
హంసము లనుటకు
క. |
బలశాలియైన హంసము
బిలచితి బురణించి పారఁ బెలుచదనమునన్
గలవే యింతకుమును హం
సలతో బురణించు వాయసంబులు జగతిన్.
| 96
|
ఉ. |
దుందుభివాద్యనిస్వనముతోఁ దులందూఁగెడు బక్షపాతమం
దందయతర్కతోపనతమై వినఁబడ్డ విహారలీలలం
జెంది పరాకున న్మెలగు చిత్తము లుద్దవిడిం గలంగఁగా
నిందునిభాస్య లప్పుడు సమీక్షణ జేసిరి రాజహంసమున్.
|
|
హంస లనుటకు
గీ. |
వీరసేనసుతుఁడు వీరుండు హంసల
నడబెడంగు జూచి నగుచు వాని
|
|
|
నెగిచి యెగిచి వేడ్క నెగయకుండఁగ నొక్క
హంసఁ బట్టుకొనియె నతిరయమున.
| 98
|
శా. |
పారావారనిషంగసంశ్రితజనప్రాంచత్కృపాపాంగదు
ర్వారాఘౌఘతమఃపతంగఘనసంగ్రామాంగణాభంగనీ
హారక్షీరపటీరహీరమనసారాభ్రాపగాహారక
ర్పూరేందూపలశోభితాంగసతతప్రోద్యద్భుజంగాంగదా.
| 99
|
గద్య.
ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్య
ధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర
కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తి
మ్మయనామధేయ ప్రణీతంబైన సర్వలక్షణ సార
సంగ్రహంబనుకృతియందుఁ బ్రథమాశ్వాసము
సంపూర్ణము.