సకలనీతికథానిధానము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ

సకలనీతి కథా నిధానము

ఎఱ్ఱయ ప్రణీతము

శ్రీలలనాధినాథుఁ డతసీకుసుమాంచితమూర్తి యష్టది
క్పాలకిరీటరత్నరుచిభాసి పదాబ్జుఁడు మిత్రసర్వభూ
పాలుని గుంటముక్లపినభైరవపాత్రుని నేలు సత్కృపా
లోలుఁడు వేంకటేశ్వరుఁడు లోకము లెప్పుడుఁ బ్రోచుగావుతన్.

1


ఉ.

గోత్రతనూభవోరుకుచకుంభపటీరసుగంధిపక్షుఁ డ
క్షిత్రయశోభి శంకరుఁడు శ్రీకరు గంగయభైరపాత్రునిన్
బాత్రవరేణ్యు నేలు శశిభాసికిరీటుఁడు, బ్రోచు గాత లో
కత్రయవాసులన్ సకలకాలము వాంఛితభవ్యసిద్ధులన్.

2


ఉ.

బ్రహ్మమయుండు భారతికిఁ బ్రాణసఖుండు పదాంబుజాశ్రిత
బ్రహ్మ మునీశ్వరుండు [1]సితపంకజమందిరుఁ డప్పరాశర
బ్రహ్మకులాధినాథుఁ బినభైరవునిన్ మహపాత్రశేఖరున్
బ్రహ్మముగాఁగ నేలు వరభావుఁడు లోకముఁ బ్రోచుగావుతన్.

3


ఉ.

కొక్కటె[2] వాహనంబు తలకుం గుసుమంబటె లేతచందురుం
డొక్కటి యట్టెదంతము సముజ్వలమై వెలుగొందుమూర్తిచే
మ్రొక్కినవారి కిష్టఫలముల్ గృపసేయు గణేశ్వరుండు సొం
పెక్కగఁ బిన్నబయ్యన హృదీశుఁడు మర్త్యులఁ బ్రోచుగావుతన్.

4

క.

వాల్మీకిఁ దలతు నపగత
కల్మషరఘురామ కావ్యఘటశీలుం బు
ణ్యోల్మ ? విహీనుం బ్రజ్వలి
తోల్ముకనిభనేత్రు బ్రహ్మయోగపవిత్రున్.

5


క.

వేసరక గొల్తు నిగమా
భ్యాసుని శ్రీరమణపాదపంకజసేవా
వాసున్ ముక్తీ ? పురపద
వీసంచరదృష్టివాసు వేదవ్యాసున్.

6


క.

భారవిని గాళిదాసున్
చోరున్ జయదేవు మాఘు సూర్యకవీంద్రున్
బేరెన్నికగల సంస్కృత
సారకవీశ్వరులఁ దలతు సజ్జనఫణితిన్.

7


చ.

వినుతి యొనర్తు వాంధ్రసుకవీంద్రుల నన్నయభట్టుఁ దిక్కయ
జ్వను నమరేశ్వరుం జెదలువాడమహాత్ముని మారనార్యు నా
చనసుతు సోము భాస్కరుని జక్కయనుం[3] గవిసార్వభౌమునిం
వనరుహపుత్రసన్నిభుల వర్ణిత కావ్యకళావిధిజ్ఞులన్.

8


ఉ.

నూతనశబ్దబంధములు నోటికి శక్యముగాక బొంతగా
బాతులుగూయు కైవడిని పాఁచి కవిత్వము లల్లి వాడలన్
గూఁతలు గూయు దుష్కవులకు వశమే కరఁగింప నీటిపై
వ్రాతలువోలె బోవు కవివైఖరులున్ విలసిల్లనేర్చునే.

9


క.

సుకవులు చెప్పిన కవితా
నికరములు శిలాక్షరముల నిలుకడ గాంచున్
గుకవులు చెప్పిన కవితా
నికరములు జలాక్షరముల నీచత నణఁగున్.

10

వ.

అని యిష్ట దేవతా ప్రార్థనంబును బురాతనకవీశ్వరుల నమస్కారంబును గుకవితిరస్కారంబును నాచరించి యొక్క విచిత్రకథాప్రబంధంబు విరచింపఁదలంచి తన్మాతృకార్చనా[4]పరాయణుండనై యున్న సమయంబున.

11


సీ.

ప్రభవించె నేవీటి పర్వతాగ్రంబున
           వరిగిరీశ్వరుడు శ్రీనాయకుండు
వసియించె నేవీటి వర్ణితసాలాంత
           రమున మూలస్థానరాజమౌళి
యుదయించె నేవీటి యుత్తరాశాతట
           భూషణీకృతనింబ పుట్టలమ్మ
వరియించె నేవీటి వలదిశాకోణంబు
           నందు గుబ్బటల మైలారమూర్తి


తే.

వినుతిగాంచిరి యేవీటి విప్రరాజ
వైశ్యశూద్రాది బహువిధవర్ణసమితి
యట్టిపురరత్న మొప్పు భవ్యాంబుజాత
మండితామరతరువల్లి కొండపల్లి.

12


క.

ఇటువంటి కొండపల్లీ
పుటభేదనమంత్రిమకుటభూషణమరి(రా)
క్కటకవిభేదనఘటనో
ద్భటుఁడగు[5] కుటముక్ల పిన్నభైరవుఁ డొప్పున్.

13


క.

వనితాజనకందర్పుఁడు
ఘనదాన ఘనాఘనంబు కమనీయవిభా
దినకరుఁడు కుంటముక్కుల
వివభైరవమల్లమంత్రి పృథుతరకీర్తిన్.

14

పుట:సకలనీతికథానిధానము.pdf/10 పుట:సకలనీతికథానిధానము.pdf/11 పుట:సకలనీతికథానిధానము.pdf/12 పుట:సకలనీతికథానిధానము.pdf/13 పుట:సకలనీతికథానిధానము.pdf/14 పుట:సకలనీతికథానిధానము.pdf/15 పుట:సకలనీతికథానిధానము.pdf/16 పుట:సకలనీతికథానిధానము.pdf/17 పుట:సకలనీతికథానిధానము.pdf/18 పుట:సకలనీతికథానిధానము.pdf/19 పుట:సకలనీతికథానిధానము.pdf/20 పుట:సకలనీతికథానిధానము.pdf/21 పుట:సకలనీతికథానిధానము.pdf/22 పుట:సకలనీతికథానిధానము.pdf/23 పుట:సకలనీతికథానిధానము.pdf/24 పుట:సకలనీతికథానిధానము.pdf/25 పుట:సకలనీతికథానిధానము.pdf/26 పుట:సకలనీతికథానిధానము.pdf/27 పుట:సకలనీతికథానిధానము.pdf/28 పుట:సకలనీతికథానిధానము.pdf/29 పుట:సకలనీతికథానిధానము.pdf/30 పుట:సకలనీతికథానిధానము.pdf/31 పుట:సకలనీతికథానిధానము.pdf/32 పుట:సకలనీతికథానిధానము.pdf/33 పుట:సకలనీతికథానిధానము.pdf/34 పుట:సకలనీతికథానిధానము.pdf/35 పుట:సకలనీతికథానిధానము.pdf/36 పుట:సకలనీతికథానిధానము.pdf/37 పుట:సకలనీతికథానిధానము.pdf/38 పుట:సకలనీతికథానిధానము.pdf/39 పుట:సకలనీతికథానిధానము.pdf/40 పుట:సకలనీతికథానిధానము.pdf/41 పుట:సకలనీతికథానిధానము.pdf/42 పుట:సకలనీతికథానిధానము.pdf/43 పుట:సకలనీతికథానిధానము.pdf/44 పుట:సకలనీతికథానిధానము.pdf/45 పుట:సకలనీతికథానిధానము.pdf/46 పుట:సకలనీతికథానిధానము.pdf/47 పుట:సకలనీతికథానిధానము.pdf/48 పుట:సకలనీతికథానిధానము.pdf/49 పుట:సకలనీతికథానిధానము.pdf/50 పుట:సకలనీతికథానిధానము.pdf/51 పుట:సకలనీతికథానిధానము.pdf/52 పుట:సకలనీతికథానిధానము.pdf/53 పుట:సకలనీతికథానిధానము.pdf/54 పుట:సకలనీతికథానిధానము.pdf/55 పుట:సకలనీతికథానిధానము.pdf/56 పుట:సకలనీతికథానిధానము.pdf/57 పుట:సకలనీతికథానిధానము.pdf/58 పుట:సకలనీతికథానిధానము.pdf/59 పుట:సకలనీతికథానిధానము.pdf/60 పుట:సకలనీతికథానిధానము.pdf/61 పుట:సకలనీతికథానిధానము.pdf/62 పుట:సకలనీతికథానిధానము.pdf/63 పుట:సకలనీతికథానిధానము.pdf/64 పుట:సకలనీతికథానిధానము.pdf/65 పుట:సకలనీతికథానిధానము.pdf/66

వ.

తొల్లిటి యట్ల మంచ డిగ్గి యప్పటిగుయ్యిడిన భోజుండు విస్మితుండై యమాత్యుని నడుగుటయును నతండిట్లనియె.

353


క.

విత్తంబుమీఁదనుండిన
మత్తుండై పలుకునట్టి మానవుఁడైనన్
విత్తము ప్రలాపయుతమని
చిత్తంబునఁ దలఁచి వ్రయము సేయుదు రార్యుల్.

354


వ.

అట్లుగావున నితండెక్కిన మంచెక్రింద నధికధనం బుండ బోలు నది శోధింపవలయు ననిన నబ్భోజుండు.

355


క.

[6].......త్రమునకు
భూవరుఁడును ద్విగుణమిచ్చి భూఖనికులకున్
క్ష్మావిభుఁడు మంచెక్రిందను
భూవివరము సేయుమనుచు బొందుగ బలికెన్.

356


క.

జనపతియానతిచే నా
ఖనికులు ధర ద్రవ్వ నచట గనుపట్టె లస
త్కనకమణిరుచులు వెలుగును
ఘనసింహాసనము పుత్రికాసహితంబై.

357


వ.

అది మోయించుకొని ధారాపురంబునకుం జనియెననుటయును.

358


తే.

అట్టిసింహాసనము భోజుఁ డాత్మపురికి
యివ్విధంబున గొనిపోయి యేమిచేసె
నద్బుతంబయ్యె నది నాకు నానతిమ్ము
బ్రహ్మఋషివర్య! ఆదిమబ్రహ్మపుత్ర!

359ఉ.

వేంకటనాథపుణ్యపదవీ గతయోగసనాథ విస్ఫుర
త్పంకజనేత్ర భైరమహపాత్రమనోంబుజ మిత్రశంక చ
క్రాంకిత బాహు[7]పద్మనిగమాంత మనోహరపద్మకౌస్తుభా
లంకృతపీనవక్ష కమలాముఖ లగ్నకటాక్షవీక్షణా!

360


క.

కుటిలసుర విమత మదహృ
త్పుటచటుల విఘటనచక్ర భూషణ బాహా
కటితటఘట నాహాటక
పటరాజిత కుంటముక్ల భైరవు వరదా!

361


వనమయూరము:

శ్రీమహితరూప! పదసేవితసురేంద్రా!
క్షేమకర! తల్పగత! శేషగత శోభా!
భామహిత గంగవిభు భైరవసుధి హృ
ద్ధామ! తిరువేంకటనిధాన! జగదీశా!

362


గద్య.

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకల నీతికథా నిధానంబునం బ్రథమాశ్వాసము.

363

  1. రణ
  2. ఒక్కట గ్రంథపాాతము
  3. జెన్నయుని అని పాఠాంతరము
  4. తన్మాతృకాన్వేషణా
  5. పుట భేదనమంత్రి వాకుట భూషణమరిరా
    ట్కటకవిభేదనఘటనోద్భటుఁడను
  6. ఆవిప్రక్షేత్రమునకు
  7. పాణి