సకలనీతికథానిధానము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము

క.

శ్రీకలితకుంట ముక్కుల
శ్రీకరపినబయ్యమంత్రిశేఖరహృదయ
క్ష్మాకల్పకభూరుహయు
ర్వీకమలాహృదయనాథ! వేంకటనాథా!


వ.

అవధరింపుము నారదుండు బలీంద్రున కిట్లనియె.


సీ.

భోజుఁ డీరీతిన పూర్వసింహాసన
        మున బలిపూజనములు ఘటించి
శుభముహూర్తంబున శుద్ధాత్ముఁడై దాని
        నారోహణము సేయ నందు నున్న
ప్రతిమలుఁ గదలి ముప్పదిరెండు జీవముల్
        వడసి భోజుని జూచి పలికె నపుడు
విక్రమార్కునిభంగి వితరణసాహస
        క్రమములు నీయందుగానరా(వు)


ఆ.

కాన గద్దె యెక్కగా నర్హుఁడవు గావు
నిలువుమనుచు నర్కనృపతి కథలు
చెప్పి దివికి నెగసి యప్పుడు భోజుని
కనిరి దివ్యమూర్తుల లవధరించి.

2


సీ.

చంద్రగుప్తక్షమాచక్రేశు తనయుండు
        చంద్రచందనకుందచారుకీర్తి
వాసవదత్త సింహాసనారోహణ
        పావనవైభవోద్భాసితుండు

సాహసోదారరక్షా విక్రమాఢ్యుండు
        ఘోరరిపువ్రాతకుముదహేళి
భూరగస్వర్లోకపూర్ణసద్గుణరాశి
        నిర్భయదాననిర్నిద్రమూర్తి


తే.

దానధర్మోపకారవిద్యాప్రతాప
సత్యశౌచక్రియాబలాశ్చర్యశౌర్య
భూషణుఁడు దీనయాచకపోషణుండు
విక్రమార్కుండు జగదేకవిశ్రుతుండు.

3


వ.

అని యతనిగుణంబులు ప్రశంసించి నీకతంబున శాపముక్తుల మైతి మనిన మీ కీశాపం బెట్లు వచ్చెననిన నాపుత్రికాస్త్రీ లిట్లనిరి.

4


క.

గిరిజకు సఖులగు మే మా
హరునిన్ మోహింప నెఱిఁగి యద్రిజ మమ్మున్
బరికించి శాపమిచ్చెను
పరుపడి నీగద్దెయందు ప్రతిమలు గాఁగన్.

5


వ.

అని చెప్పి యధాస్థానంబున కరిగిన భోజుం డాసింహాసనం బెక్కక యుమామహేశ్వరప్రతిష్ఠ గావించి కొలుచుచుండె ననిస నభ్భోజునిజన్మంబు చెప్పుమనిన నారదుం డిట్లనియె.

6


ఉ.

ముండికుడాప్రయాగ వసుముఖ్యము లొల్లక తీర్థవాసులన్
ముండన మాచరించునెడ ముగ్గురుముండలు వచ్చి యందులో
రండ యొకర్తి యాత్మపతి రాజుగ గోరి త్రివేణి గూలె నా
రెండవముండయుం బ్రియధురీణ మనోహరుగా దలంపుచున్.

7

ఆ.

ఆత్రివేణి గూలె నంత మూడవదియు
నాత్మభర్త కళల నధికుఁ డగుచు
జేరి మొగముఁ జూచువారెల్ల కవులుగా
గోరి యాత్రివేణి గూలుటయును.

8


క.

ఈముండలు మువ్వురకు
న్నే మగడం గాఁగవలయు నిహమున నని తా
నాముండియందు గూలుచు
భూమిపయిన్ ధరణి యేలె భోజుం డగుచున్.

9


వ.

అట్లు చెప్పి యిట్లనియె.


ఉ.

మానవలోకనాథుఁ డసమానచరిత్రుఁడు నందుఁ డంగనా
మానసవర్తియై విబుధమంత్రులకున్ గొలువీక యెప్పుడున్'
భానుమతీకపోలకుచభారముఖోరువిలోలనేత్రస
న్మానమనస్కుఁడై ధరణిమండల మేలుచు నుండె నంతటన్.

10


వ.

ఇవ్విధంబున స్త్రీలోలుండై భూపరిపాలనంబునం బ్రమత్తుండై యున్న నతనికి బహుశ్రుతుం డిట్లనియె.

11


ఆ.

జాతిసంకరములు జరగంగ నీయక
భూతలంబు జనులరీతు లెఱిఁగి
శత్రుమిత్రనృపతిచర్యలు పరికించి
ధరణి యేలవలయు నరవరుండు.

12


క.

లోలాక్షులు మనసీయరు
శ్రీలక్ష్మీస్థితులు చెదరు చేరిన మనుజుల్
వేళగని వెళ్ళఁజూతురు
స్త్రీలోలుఁడు పాపి యనుచుఁ జెప్పుదు రార్యుల్.

13


వ.

అని మంత్రి హితంబు చెప్పిన నిట్లనియె.

14

క.

హరుఁడును హరియును నజుఁడును
శిరమున నురమునను వదనసీమల యందున్
దరుణులఁ దాల్చిరి పాయక
నరు లెంతటివారు పాయ నారీజనులన్.

15


వ.

అనిన మంత్రి యిట్లనియె.

16


ఆ.

అధికు లాచరించు విధములు దలపంగ
నితరజనులు సేయ నెట్లు గలరు
దంతిపల్లనంబు ధరియింపఁ బొట్టేలి
కలవియగునె చూఁడ నవనినాథ.

17


వ.

అనిన సతీవిరహితుండనై యుండ లే నేమి సేయుదు ననిన బహుశ్రుతుం డొక్కచిత్రపటంబున భానుమతి రూపంబు చిత్రించి ముందట నిడి యీపటంబు చూచుచుం గొలువుండి భూమిఁ బాలింపు మనిన నతం డట్ల సేయుచుండ నంత నొక్కనాఁడు.

18


తే.

శారదానందుఁడను గురుస్వామి యొక్క
యవసరంబున నృపుఁ జూడ నరుగుదెంచి
పటమునన్ లిఖత యైన యాభానుమతిని
గాంచి శోభనలక్షణక్రమము లరసి.

19


క.

విలిఖంచఁ డేలకో యీ
లలనామణి వామజఘనలాంఛన మనుచు
బలికిన భూపతి యితఁ డీ
నెల వెఱుఁగుట యెట్లు! తప్పె నిజమా సతికిన్.

20


వ.

అని మంత్రి జూచి శారదానందుని వధియించుమని పంపిన బహుశ్రుతుం డట్లగా యని శారదానందునిం గొని చని యొక్కభూగృహంబున డాఁచియుండె నంత నొక్కనాఁడు.

21

ఆ.

నందభూమిపాలనందనుఁడు విజయ
పాలుఁడనెడువాడు పాదివేఁట[1]
యరుగదలఁచి సైంధవారోహణము చేసి
పురముగవని వెడలు దెరువునందు.

22


సీ.

యెండినతరువుననుండి కాకము గ్రోల్చె (?)
        వత్సకు నరచుచు వచ్చె గోవు
రజకుండు మలినవస్త్రపుమూటతో వచ్చె
        పట్టినఖడ్గంబు పడియెఁ బుడమి
చేలవిహీనయై బాలిక పొడచూపె
        తరుశాఖ విరిగి భూస్థలిని ద్రెళ్ళె
కుదిరలు వాపోయె కుడివంకదిక్కున
        ముందట గూకడె ముం..........


సవ్యబాహువు వణకెనశ్వంబు మ్రొగ్గె
కోట డెలిగించె బులుగుదాగుండ్ర తొలిపె
డబ్బు తొరజొచ్చి పరికె దబ్బిబ్బుగాఁగ
...............................

28


వ.

ఇవ్విధంబున నపశకునంబులైన మగుడ యారాజకుమారుండు మృగయావ్యసనపరాయణుండై చని యవ్వనంబున.

24


క.

మృగముల ౙంపుచు గోలము
దగులుచు వెనువెంటఁ దిరుగ తరణియు గ్రుంకెన్
ధిగధిగ నొకపులి తరిమిన
జగతీపతిసుతుఁడు తరువు సరసర బ్రాకెన్.

25


ఆ.

అట్లు మ్రాను వ్రాకి యగ్రశాఖకు జేర
నంతకపుడె ఋక్ష మందుమీద
నున్న కోహో యనుచునుండ భయంపడ
వలదటంచు నెలుగు వానిఁ బలికె.

26

క.

కోపించిన పులి దిగువం
జూపట్టగమీద నెలుగు నుడియఁగ నుభయా
టోపముల కులికి వడఁకెను
భూపజుఁ డడకత్తి లోనిపోకయు బోలెన్.

27


వ.

అంత క్రిందనున్న పులి మీఁదనున్న భల్లూకంబున కిట్లనియె.

28


క.

మనుజుం డస్థిరచిత్తుఁడు
తనునమ్మినవారి జెఱుచుఁ దరియగువేళన్
మనుజుండు పాపకర్ముఁడు
మనుజునివర్తనము లెల్ల మాయలు సుమ్మీ.

29


వ.

అని బోధించి యమ్మనుష్యునిం బడద్రోయుమనిన నయ్యచ్ఛభల్లం బిట్లనియె.

30


క.

తనునమ్మి శరణుజొచ్చిన
మనుజుని రిపునైన దుష్టమానసునైనన్
మనమున నొండు దలంపక
మనుపుటయే ధర్మ మనుచు మనుపుదు రార్యుల్.

31


వ.

అట్లుగావున నితం డెట్టివాఁడైన బడద్రోయనని నిద్రాలసుండైన యారాచకొమరనిం దొడమీఁద నిడుకొని. ...........నిద్రవోయి మేలుకొనిననంత భల్లూకం బతని హృదయం బెఱుఁగదలచి నిద్రించునదియుం బోలె నారాచకొమరునితొడ దలయంపిగా గన్నులు మూసికొన నాశార్దూలంబు రాచకొమరున కిట్లనియె.

32


క.

మృగములకును మానవులకు
నగునే చెలికార మెట్టియవసర మైనన్
మృగము (నరుమీఁద) దెగునట
మృగముపయి న్నరుఁడు దెగునిమిత్తము లేకే.

33

ఆ.

బల్లిదుండు గినిసి పైనెత్తి వచ్చిన
గ్రూరుఁడైన దన్ను జేరనిచ్చు
నతఁడు దలఁగిపోవ నప్పుడె భక్షించు
నమ్మదగనివాని నమ్మదగదు.

34


వ.

అట్లు గావున నీభల్లూకంబును బడద్రోచి నీవును సుఖంబునం బొమ్మనిన నతఁడును నట్ల చేసిన.

35


క.

ఋక్షంబు దిగువబడ కా
వృక్షము కొ మ్మదిమిపట్టి వెఱచిన యతని
న్వీక్షించి వెఱకుమనుచుం
బక్షంబున వలికె నట ప్రభాతంబైనన్.

36


ఉత్సాహం.

పులి దొలంగిపోవుటయును భూరుహంబు డిగ్గి యా
యెలుఁగు పలికె రాజతనయ యేను నిన్ను గాచితిన్
గెలసి నీకు మేలు సేయ గీడు సేయ జూచి తా
ఫలముచే ససేమిరనుచు బలుకుమని శపింపుచున్.

37


వ.

ఈనాలుగక్షరంబుల కర్థం బెవ్వఁడు చెప్పిన దానివలన శాపముక్తుండ వవుదు పొమ్మనె నతండును విభ్రాంతి వహించి వనంబున 'ససేమిరా' యనుచు దిరుగుచున్న తజ్జనకుండైన నందుండు దోడ్కొని చని వీనిజాల్మత్వం బెవ్వండు దీర్చిన నర్ధరాజ్యం బిచ్చెదనన మంత్రౌషధవిదు లెల్ల వచ్చి మాచేతంగాదని తొలంగిన బహుశ్రుతుం డిట్లనియె.

38


క.

అవిచారపరత విప్ర
ప్రవరులఁ ౙంపించు భూమిపతులకు నఘముల్
తవుల కవి ఱిత్త వోవునె
యవివేకము గాదె తెలియ కాజ్ఞాపింపన్.

39

తే.

నరనుతుండైన శారదానంద గురువు
నిట్టికార్యంబులకు ద్రోవ యెఱుఁగుననిన
కల్లగా జంపితిని వాని గాచి నిలువ
కనిన దాఁచిన మునిగొంచు పరుగు దెంచి.

40


క.

భూపతిముందటఁ బెట్టిన
నాపరమయతీంద్రు జూచి యనియె మునీంద్రా!
నాపుత్రు వెఱ్ఱి దీర్పుము
పాపాత్ముఁడ ననుచు మదిని బట్టక యనుచున్.

41


వ.

కుమారుని నిందించి శారదానందుని ముందర నిడిన వాఁడెప్పటియట్ల 'ససేమిరా' యని పలుకుటయును.

42


క.

సమరముల శత్రునృపతుల
సమయించుట గాక నమ్మి సామీప్యమునన్
శమమున నిద్రించెడుఋ
క్షము నిలబడ ద్రోచు టదియు శౌర్యమె తలఁపన్.

43


వ.

అని శారదానందుండు పలికిన సవర్ణంబు విడిచి "సేమిరా” యనుచుండె ననుటయును.

44


క.

సేతువు జూచిన గంగా
ప్రోతస్విని గ్రుంగ భూమిసురవరహత్యా
పాతక మణఁగు గృతఘ్నత
కేతీర్థమునందు గ్రుంక నేలాఁ తలఁగున్.

45


వ.

అనుటయు రెండవ యక్షరంబును విడిచి “మిరా" "మిరా” యని పల్కుటయును.

46

క.

మిత్రద్రోహి కృతఘ్నచ
రిత్రులు విశ్వాసపాతకికృతులా(...)భూ
....త్రాది నరకములు నా
గోత్రార్కము ఘోరదశల గుందుదు రెపుడున్.

47


వ.

అనిన మూడవయక్షరంబును విడిచి 'రా'యని పల్కుటయును.

48


క.

రాజును రాజకుమారుఁడు
తేజము మదిగోరి రేని దేవార్చనమున్
భ్రాజితదానము హోమము
రాజసమున విక్రమంబు రక్షయు వలయున్.

49


వ.

అనిన 'రా' యక్షరంబు విడుచుటయు తోడనే విభ్రాంతి బాసినకుమారునిం జూచి సంతోషచిత్తుండై యితం డడవిలో చేసినపని యెఱిఁగితి రనిన శారదానందుం డిట్లనియె.

50


క.

(దేవ)బ్రాహ్మణభక్తి
ప్రావీణ్యున కెఱుఁగవచ్చు భావంబున నీ
దేవితొడమచ్చ దెలిసిన
భావముననె యనుచు బలుక బార్థివు డంతన్.

51


వ.

శారదానందునకు నమస్కరించి కొనియాడి మంత్రియగు బహుశ్రుతునిం జూచి యిట్లనియె.

52


క.

హితవును బుద్ధియు గలిగిన
మతిమంతుఁడు మంత్రియైన మనుజేంద్రునకున్
గతియును రాజ్యము భోగ
స్థితియును గీర్తియును గల్గు సిద్ధము సుమ్మీ.

53


వ.

అని మంత్రిఁ గొనియాడి శారదానందుని నర్థరాజ్యంబు గైకొనుమనుటయు.

54

క.

యతివరుఁడు రాజయోగ
స్థితినాథుఁడుగాక యిట్టిక్షితినాథుండే
మతి బరికింప గననియా
క్షితిపతి దీవించి చనియె స్వేచ్ఛాగతులన్.

55


వ.

అని నారదుండు యింక నొక్కయద్భుతంబు వినుమని యబ్బలీంద్రున కిట్లనియె.

56


క.

నరుఁ డెట్టికులజుఁ డైనన్
హరిచిహ్నలు దాల్చి నాట్యమాడిన నైనన్
హరి యుద్ధరించు వారికి
శరణంబై రాజ్యభోగ సంపదలిచ్చున్.

57


వ.

అట్లు గావున.

58


క.

మానవనాథుండు బృహ
త్సేనుండనువాఁడు తపము సేయగ శివుఁ డా
ధ్యానమున నిలిచి పలికెన్
భూనాయక! వరము వేడు పొసగఁగ నిత్తున్.

59


ఆ.

అనిన సంతతియును నాహవజయమును
కోరుటయును నొక్కకొమ్మ పుట్టు
దివ్యపురుషుఁ డట్టి తెఱవకై తనుదాన
వచ్చి పొంది నీకు వరదుఁ డగును.

60


వ.

అతనివలన నీకు శత్రుజయంబును కులాభివృద్ధియు నగునని వరం బిచ్చి శంకరుం డరిగిన ప్రతాపవిషయాధీశ్వరుం డటువంటికన్యకం గాంచి యది యౌవనవతియైన హరుం డానతిచ్చిన దివ్యపురుషుం డెన్నఁడు వచ్చునొకో యని సౌధాగ్రంబున నిడి యుండు నంత.

61

సీ.

కాళింగుఁ డనియెడు కంసాలి యొక్కండు
        సౌధాగ్రముననున్న చంద్రముఖిని
గనుగొని మోహించి కడువడి గీలుగా
        రచియించి శంఖచక్రములు దాల్చి
విష్ణుండని యవ్విధికి దత్సూత్ర. . .
        .................వ్వనిత యున్న
సౌధాగ్రముననున్న జలజాక్షి విష్ణుండ
        వచ్చితిని మూర్తివశుఁడ నగుచు


అనిననిజ.................
.........................
..................దగమ్రొక్కి
పితకు జెప్పిపంప నతఁడు వచ్చి.

62


క.

కాళింగు జూచి నిక్కమె
నాళీకాక్షుండె యనుచు................
బాలకి నర్పించుచు భూ
పాలుండు చని సతియు వానిపత్నై మెలగన్.

63


వ.

ఇవ్విధంబు నక్కన్యారత్నంబును భోగింపుచుండునంత.

64


క.

హరి దనకు నల్లుఁ డయ్యెన్
సరి యెవ్వరు నా కటంచు జగతీప(తియున్)
...........దొడగిన నభ్భూ
వరులందఱు నొక్కపెట్ట వచ్చిరి నృపుపై.

65


ఆ.

అతనియల్లుఁడైన హరిచేత జచ్చిన
కలుఁగు కీర్తిముక్తు లలర మనకు
ననుచు బురము దిరుగ నందఱు విడిసిన
క్షితితలేంద్రుఁ డధికచింత నొంది.

66

సీ.

తనభక్తు ప్రహ్లాదు దండిత ......
        ...తింపకున్న నిర్గుణుండు గాడె.
ప్రియభృత్యుడైన నీభీషణుముక్తిక
        జగతినిల్చిన యవిచారిగాడె
గురుచ.... .మెరబలివెండి
        మాటదప్పిన యప్పమాణిగాడె


తే.

యెవ్వ డెటువంటివాడన్న నవ్విధంబు
చూపనేర్చిన యాబహురూపిగాడె
శత్రుమి............గతుని
హరిని నెటుగాగనమ్ముదు నల్లు డనుచు.

67


సీ.

[2]వ్రేపల్లెలోపల గోపకాంతారతి
        ............గొరగాడె
తనపుత్రుడగు నరకుని జంపి
        అతనినిలలనల జేకొన్న ఖలుడుగాడె
నురవైవ శిశు.......
        కలన్య పెండ్లి యాడిన మహాపెద్దగాడె
కపటవిప్రులరూపు గైకొని మాగగు
        దునుమ బంచిన యట్టి దోషిగాడె


తే.

కాలయవనుని ముచికుందు పాలు చేసి
చంపజేసినయట్టి దుష్కర్మిగాడె
నాకు హరి యల్లుఁడని యెట్లు నమ్మవచ్చు
విష్ణుఁ డున్నాఁడు నాకని వెఱ్ఱినైతి.

68

వ.

అని దుఃఖంపుచున్న నతనికూతురు తనపెనిమిటియగు కుహకవిష్ణుపదంబులఁ బడి యేడ్చుచు నిట్లనియె.

69


తే.

అధిప విష్ణుండు తనయల్లుఁ డనుచు నస్మ
దీయజనకుండు నృపతుల ధిక్కరింప
వారు బలవంతులై మీఁద వచ్చినారు
నీ వుపేక్షింపదగునె యోనీరజాక్ష.

70


వ.

అని నతండు ఖిన్నుండై యిట్లని తలంచుచు.

71


క.

తమచేతగాని పనులకు
గ్రమ మెఱుఁగక యధికు మూర్తి గైకొన జనముల్
భ్రమియింప హాని యగు మా
నము బ్రాణము బోవు నిట్టి నడకలు నిజమే.

72


ఉ.

ఏవిధ మాచరింతు నిక నెక్కడికిం జనువాఁడ నెప్పుడుం
జావు నిజంబు నా కనిన సామజవత్సలు నార్తరక్షు ల
క్ష్మీవిభు నాత్మ నిల్పి యపకీర్తికి కీర్తికి హర్తకర్త య
ద్దేవుఁడె యంచు పల్కి యువతీమణి చూడఁగ బక్షివాహుఁడై.

73


చ.

హరి జనుదెంచితిన్ నృపతు లాజికి బాసి చనుండ పోవరే
జరతును వన్నెదప్ప కరచక్రహతి న్వడి నంచు దాకుచో
దురమున వీని వద్దనను దూరుదు రీక్షితిలోకులంచు నా
హరి యపకీర్తికి న్వెరచి యాతనిచక్రమున న్వసింపుచున్.

74


క.

అరినృపతుల చరణంబులు
శిరములు గరములును దునుమ జెడి హతశేషుల్
మరలక పరచిరి వాఁడుం
గరివరదునికరణ నాకు గలదని మగిడెన్.

75


వ.

అట్లు చనుదెంచిన బృహత్సేనుఁ డల్లునకు సాష్టాంగదండప్రణామం బొనర్చి యప్పటి యట్ల సేవించుచుండె గావున.

76

క.

దైవము కృపగల దినముల
(భావింప) గదృణము కనక పర్వతమగు న
ద్దేవుని కృపయే తప్పిన
దేవాద్రియు జిన్నతృణము తెరఁగై యుండున్.

77


వ.

అని నారదుండు చెప్పిన నబ్బలీంద్రుం డిట్లనియె.

78


ఆ.

విక్రమార్క (భూమి) విభుఁడు బేతాళుని
గట్టి తెచ్చె ననుచు గథలు చెప్ప
వినుచునుందు నెట్టివిధమున గొనితెచ్చె
నానతిమ్ము వల్లకీనినాద.

79


వ.

అనిన నిట్లనియె.

80


సీ.

విక్రమార్కుఁడు జగద్విఖ్యాతసత్కీర్తి
        జగము పాలించెడు సమయమునను
క్షాంతిశీలుండను సంయమి నిత్యంబు
        నొకపండు నృపతికి నుపద నీయ
నంతట నొక్కనాఁ డమ్మౌని యిచ్చిన
        ఫలము వానరుమీఁద బడగవేయ
నది మర్కటము విప్ప నందులో నొకమణి
        కనుపట్టుటయు ధరాకాంతుఁ డాత్మ


తే.

నద్భుతము బొంది ముని దెచ్చునవియు జూడ
నట్లయైయున్న యతికి నిట్లనియె నృపతి
యేమి యర్థించి తెచ్చితి రిట్టిమణులు
చెప్పుమనుటయు నిట్లని చెప్పదొడఁగె.

81


తే.

వచ్చు కృష్ణచతుర్దశీవాసరమున
నర్ధరాత్రంబు నాకడ కరుగుదెంచి
పితృవనమున నే చేయుకృతికి నీవు
సాధకుండవు గమ్ము భూజనవరేణ్య.

82

వ.

అని చనుటయు నారాత్రి యతనికడకుం జని యతని యనుమతి మౌనస్థుండయి దన్నికటవటజటలో దగిలి తలక్రిందయి వ్రేలుచున్న బేతాళునిం బట్టి కట్టి మూపున బెట్టుకొని వచ్చునప్పుడు.

83


క.

బేతాళుఁ డనియె వినుమో
భూతలవర మనకు నుబుసుపోకకు కథ లా
ఖ్యాతము చేసెద బ్రశ్నో
పేతంబుగ నుత్తరంబు లీవలయుజుమీ.

84


వ.

ఆప్రశ్నల కెఱింగి యుత్తరం బీకున్న వజ్రాయుధంబు తలద్రెంచు ననుచు గథ జెప్పదొడఁగె నది యెట్టిదనిన.

85


సీ.

(కర్ణోత్పలం) బనఁగల దొక్కనగరంబు
        తత్పురివరుఁడు ప్రతాపమకుటుఁ
డు రాజు వానికి నాత్మజన్ముఁడు వజ్ర
        మకుటుఁడునను సుకుమారమూర్తి
తన్మంత్రిపుత్రుండు దారుండు బుద్ధిశ
        రీరుఁ డాతఁడు సహచారి గాఁగ
విపినంబునకు వేట వెడలి తన్మధ్యకా
        సారంబునను నొక్కజలజవదన


తే.

యంబుకేలి జరింప నయ్యధిపసుతుఁడు
మదనపరవశుఁ డగుచు నాసుదతి జూడ
లలనకరకమలమున కమలము డిగిచి
జిలుగుశృంగారచేష్టలు చేయదలఁచి.

86


వ.

కమలద్వయంబు కర్ణద్వయంబు మోపిపుచ్చి[3] దంతంబుల ఖండించి చరణయుగళంబున వైచి మఱియొక్కకమలంబు కుచంబుల నదిమి కంపించి తలయూచి పురంబున కరిగిన వజ్రమకుటుం డవ్విధంబు సచివపుత్రునకుం జెప్పిన నతం డిట్లనియె.

87

సీ.

శ్రుతుల నంబుజములు సొనుపుట కర్ణోత్స
        లునిపురంబున నాకు నునికి యనుట
వనజంబు దంతఖండన మొనర్చుట దంత
        ఘాతకమంత్రిప్రసూతి ననుట
పద్మంబు తన పాదపద్మంబులకు మోప
        నాత్మనామంబు పద్మావ తనుట
యంబుజము కుచస్థలంబున నదుముట
        తన(కు నీ)వే ప్రాణనాథుఁ డనుట


తే.

కంప మొందుట నావెంట గదలుమనుట
తలగదల్చుట గూఢవర్తనము లనుట
యనుచు నెఱిఁగించి యన్మంత్రి యధిపు గొనుచు
నరిగె రత్నావ తనియెడు పురమునకును.

88


వ.

చని యొక్కభూసురవృద్ధాంగన గృహంబున వసియించి యది తదంతఃపురవర్తిని యగుట యెఱిఁగి యొక్కనాఁ డాయవ్వం బిల్చి తమవృత్తాంతంబు పద్మావతి కెఱిగింపుమని పంపిన.

89


ఉ.

ఆవిధవాశిరోమణి రయంబున నేఁగి రహస్యవేళ ప
ద్మావతి గాంచి రాజసుతుఁ డాడిన మాటల భంగి చెప్ప ల
జ్ఞావతి [4]ఘృష్టలిప్త(?) ఘనసారకరంబితగండపాలికల్
వావిరి వేసినన్ జరఠవామవిలోచన వచ్చి దుఃఖియై.

90


క.

యెన్నఁడు నాపై నలుగని
కన్నియ మీమాట చెప్ప గనలడరిననే
మిన్ననక వ్రేసెజెక్కులు
నన్నని చూపుటయు నృపతినందనుఁ డాత్మన్.

91


వ.

విరహభరాక్రాంతుఁడై యుండ మంత్రిసుతుం డిట్లనియె.

92

తే.

కానుపింపదె శుక్లపక్షంబు పదియు
దివసములదాక నిచట కేతేరవలవ
దనుచు ఘనసారయుతమృదుహస్తములను
[5]సౌంజ్ఞ చేసిన యదిగాని చెరపుగాదు.

93


వ.

అనిన నూఱడిల్లి యప్పదిదినంబులు గడపి పదునకొండవనాఁ డెప్పటియు నా విశ్వస్త నొడంబరచి చెప్పుమని పంపిన నది యట్లచేసిన.

94


క.

అమ్మగువ కుంకు మలదుచు
నమ్ముదుసలియురమునందు నంకితములుగా
ముమ్మడిరేఖలు నిలుపుచు
బొమ్మన్నను వచ్చి నృపతిపుత్రున కనియెన్.

95


తే.

ఎన్ని మాటలు చెప్పిన నియ్యకొనదు
మారుమాటాడ దింకనే మతమొకాని
కుంకుమాంకిత మృదుకరాంగుళుల నురము
వ్రేసెనని చూప భూపతి వివశుఁడైన.

96


వ.

బుద్ధిశరీరుం డిట్లనియె యిట్లేల పరవశుండవైతివి తా రజస్వలను దివసత్రయానంతరంబునం జనుదెమ్మని పట్టించుమనిన నర్ధాంగీకారంబున నుండె నంత.

97


తే.

దివసములు మూడు నరిగిన తెరవగరపె
యనుపుటయు బోయి యెఱిఁగింప నంగనకును
పొత్తిచీ రిచ్చి యిఁకరాకు పొలఁతి యనుచు
మాడు నెక్కించి త్రాట నమ్మగువ డించ.

98


వ.

అరుగుదెంచి అవ్విధంబు జెప్పిరండని యరిగిన మంత్రిసూనుండు రాజకుమారునిం జూపి నీకు నాగమనమార్గంబు నిర్దేసించెననియె నంత.

99

క.

రవి గ్రుంకి మధ్యరాత్రం
బవుటయు రజ్జువు గదల్చి యమ్మార్గమునన్
యువిద బొడగాంచి మదనో
త్సవలీలల మెలఁగుచుండె చతురత మెరయన్.

100


వ.

ఇవ్విధంబున పద్మావతీపరాయణుండై వజ్రమకుటుండు మంత్రిసుతుండైన బుద్ధిశరీరుని మఱచియుండు నాసమయంబున నొక్కనాఁడు.

101


క.

కులమును నాచారంబును
చెలికానిని గురువు బుత్రుజేరినవానిన్
తలిదండ్రుల బాంధవులను
తలఁపరు కామాంధజనులు తత్పరవృత్తిన్.

102


తే.

అనుచు పద్యము లిఖయించి యతివచేత
ననుప భూపతీసుతుఁడు పద్యంబు చదివి
మఱచితిని మంత్రిసుతుని నీమర్మ మెల్ల
నాకు నెఱిఁగించి నట్టివివేకనిధివి.

103


వ.

అనినఁ బద్మావతి యిట్లు బుద్ధిశరీరుని యిన్నిదినంబులుదాక యెఱిఁగింప కిట్లేల చేసితివని భక్తి గలదియును బోలె నొక్కనాఁడు.

104


ఆ.

భవ్యభోజ్యలేహ్యపానీయచోష్యప
దార్థములను గరళ మావహించి
మంత్రిసుతున కనుప తంత్ర మాతఁ డెఱింగి
తగరు కిడిన జచ్చె తన్నికొనుచు.

105


వ.

అవ్విధంబున వజ్రమకుటు నట్లుగ లిఖించి (?) పద్మావతి హారంబులు పుచ్చికొని స్తనమధ్యంబున నఖక్షతత్రయంబు నిలిపిరమ్మని పత్రిక పంపిన నారాజకుమారుండు అట్ల చేసి యేతెంచుటయును.

106

ఆ.

అంతఁ దెల్లవార నామంత్రిపుత్రుఁడు
సిద్ధుఁ డగుచు నృపుని శిష్యు జేసి
పురము రుద్రభూమి యిరవుగాఁ గూర్చుండి
హార మమ్ము నృపకుమారు బంప.

107


దోదకము:

అంగడిహారము లమ్మెదననుచున్
సంగతిగా వెడజట్టులు సేయన్
దొంగని బట్టిన దోడ్కొనిపో య
య్యం గనిపించిన నాతఁడు వల్కెన్.

108


క.

మీభూపతి యరుదెంచిన
నీభావము చెప్పువాఁడ నిట తెండనినన్
భూభుజున కెఱుకచేసిన
నాభరణము చూచి వచ్చె నాతని కడకున్.

109


సీ.

వచ్చి యీభావంబు వచియింపు మనవుండు
        దంతఘాటకునకు దనయ యగుచు
యీప్రేతభూమికి నేతెంచి నిశివేళ
        శవభుక్తి గొనుచు నాసన్నిధిని
వచ్చిన మాచేతి వాడిశూలమున హృ
        ద్భేదంబు చేసి యీపేరు పుచ్చు
కొంటిమి యది మహాక్రూరపుపడుచుల
        ............పెద్దలబట్టి మెసఁగు


తే.

కంటి గనుగొందు నురమున గానవచ్చు
యనిన జని చూచి యది నిక్క మనుచు బురము
వెడలగొట్టింప నదియును వెళ్ళిపోవ
గూడుకొని యాత్మపురికిని గొంచుజనిరి.

110

ఆ.

దంతఘాటకుండు తనయకు దుఃఖంచి
(?) చచ్చి నతనిసతియు జిచ్చుచొచ్చె
పాప మెవ్వరికిని బ్రాపించు ననవుఁడు
సనియె సాహసాంకు డాత్మ దెలిసి.

111


వ.

బుద్ధిశరీరుండు స్వామిహితంబునకు గపటంబు చేసిన దోషంబు లేదు అవిచారంబున నారాజు ప్రధానినందనను వెళ్ళగొట్టించెం గావున నాప్రధానమరణదోషంబు రాజునకు ప్రాప్తం బగునని పలికిన మరలి వటంబునకు బరచి యప్పటియట్ల వ్రేలుచున్న నివ్విక్రమార్కుఁడు.

112


క.

వెంటనె చని బేతాళుని
నంటంగా బట్టి తొంటియట్లనె చనుదే
నొంటిజన దెరువు జరగదు
వాటిన్[6] గథ యొకటి గలదు వినుమని పలికెన్.

113


సీ.

బ్రహ్మశంఖాగ్రహారంబువ నగ్నిషో
        మీయుని నందన మీననయన
మందారవతియను నుందరి వరియింత
        మని విప్రనందను లరుగుదేర
నంత నక్కన్య కాలాంతంబు నొందిన
        విడిచిపోవఁగ లేక విప్రులందు
నొకఁ డస్థి గొనుచు గాశికి నేగె నొక్కండు
        కాటిబూడిద భక్తి గాచియుండె

114


తే.

యొకడు దేశాంత్రియై చని యొక్కవివ్రు
నింట భుజియించనున్న నాయింటిగృహిణి
కొడుకు గోపించి యయ్యగ్నికుండము నను
వైచుటయు మృతినొందిన వానిఁ జూచి.

115

క.

శిశుహంతవు నీగృహమున
నశనము భుజియింపననిన నతివచికిత్సా
వశమున బ్రాణము వడసిన
శిశువుం గని భోజనంబు చే సిట్లనియెన్.

116


క.

ఈసంజీవని నాకి
మ్మోనరసిజనేత్ర యనిన నుపదేశించెన్
భూసురుఁ డదిగొని కాశి మ
హీసురునిం గూడి శవమహీస్థలిఁ జేరెన్.

117


ఆ.

అట్లు చేరి తొల్లి యచ్చట గాపున్న
భూసుతుండు చూడ భూమిమీఁద
సిద్ధమంత్రజలము చిలికినఁ గన్నియ
బ్రదుకుటయును చెట్టవట్టి యపుడు.

118


క.

మువ్వురు తమతమ సతియని
చివ్వకు బెనగుదురు రాజశేఖర యది దా
నెవ్వనికి బ్రాప్తమగు నన
నవ్విక్రమసూర్యుఁ డనియె నాతనితోఁడన్.

119


తే.

అస్థి గొని చన్నవాఁడు తదాత్మజుండు
ప్రాణ మెత్తిన విప్రుఁ డప్పణఁతి తండ్రి
కాటిఁగాపున్న ద్విజుఁడె యాకాంతనాథుఁ
డనిన బేతాళుఁ డెప్పటి యట్ల యరిగి.

120


వ.

పట్టితెచ్చు నెడ నిట్లనియె.

121


సీ.

వాలిపుత్రాఖ్యమౌ పట్టణమ్మునను వి
        క్రమసింహుఁడనెడి ధరాధిపతికి
నాత్మసంభవుఁడు పరాక్రమకేసరి
        యను నాతఁ డొకచిల్కఁ బెనుప నదియు

నాగతాతీతమనాగతంబు నెఱింగి
        విరచింపనేర్చు వివేకశాలి
నడిగె నాకింకఁ బ్రియాంగన యెవ్వతె
        యనిన మాగధరాజతనయ చంద్ర


తే.

కాంతయనుకన్య యనుచు శుకంబు చెప్పె
నట్లు మగధేశుసుతయు తా నాడుజిలుక
నడుగ, జెప్పెఁ బరాక్రమహరి యటంచుఁ
బెద్ద లంతట నిరవురఁ బెండ్లి సేయ.

122


వ.

నాచంద్రప్రభయుం బరాక్రమకేసరియుం క్రీడాగృహంబున రతి(పరాయ)ణులై యున్న సమయంబునఁ బంజరద్వయంబుననున్న కీరద్వయంబునందు రాచిలుక శారికం జూచి యిట్లనియె.

123


ఉ.

ఊరక యేలయుండ మనమో శుకరత్నమ యస్మదీయసం
చారవినోదముల్ కలసి సల్పుదుమన్న తలంకుచున్నచో[7]
కీరమపూరుషుల్ బహులకిల్బిషదారు లసత్యభాషణుల్
క్రూరులు వారితోఁడ నొనఁగూడి మనంగలరే వధూమణుల్.

124


వ.

అని విడనాడిన కీరంబు శారికం జూచి యిట్లనియె.

125


చ.

తరుణుల నమ్మవచ్చునె వృథాకలహాత్మలు కల్మషక్రియా
భరితలు చంచలాక్షులు కృపారహితల్ పరభోగవిభ్రమా
భరణలు మానదూరలును భావవిహీనలు క్రూరకర్మని
ష్ఠురబహుభాషణల్ కలయఁజూచిన దోషము రాకయుండునే.

126


క.

అని యిరువురు వాదడవఁగ
మనుజేంద్రుఁడు చేరి వాదు మానుఁడు మీవ
ర్తనములు చెప్పుం డనవుఁడు
ననియెన్ శారిక మహీవరాత్మజుతోఁడన్.

127

సీ.

అంతిపురంబున నర్ధరథుండను
        వైశ్యపుత్రుఁడు ధనవంతుఁ డనెడు
నతఁ డాత్మభార్య లోకాంతర మరిగిన
        విటవిదూషకవృత్తి విత్తమెల్ల
బోకార్చుకొని సర్వభూములు దిరుగుచు
        నందనపురమను నగరి చేరి
యందు హాటకగుప్తుఁ డనువైశ్యుఁ డాత్మజ
        బింబోష్ఠి నతనికి బెండ్లి సేయ


ఆ.

.......................
బ్రియము చెప్పి యింట బెట్టుకొనిన
నతడు కొన్నిదినము లరిగినఁ దనపత్ని
నమ్మజూపి తెత్తు ననుపు మనిన.

128


ఆ.

కొడుకు మారుగాఁగ గోరి నాయింటిలో
పెద్దతనముచేత బెట్టుకొంటి
ననుచు దుఃఖపడిన నాతని నమ్మించి
యెల్లివత్తు ననుచు నిచ్చగించె.

129


వ.

అల్లునిం గూఁతును ననేకవస్త్రాభరణభూషితులఁ జేసి యొక్కదాసి నిచ్చి యనిపిన పత్నీసహితుండై చనుచుండి యొకగహనమధ్యంబున నయ్యాభరణంబు లన్నియుం బుచ్చుకొని తనభార్యను నద్దాసిని నొక్కప్రానూఁతం బడండ్రోచి యెందేనియుం జనుటయు.

130


క.

ఇరువురును మొఱలువెట్టగఁ
దెరువరు లరుదెంచి పెద్దతీఁగలచేతన్
దరుణిని వెడలగ దివియుచు
మఱి దాసిన్ దివియబోవ మరణమునొందెన్.

131

వ.

ఆవైశ్యకన్యకయుఁ బధికులంగూడి పితృగృహంబున కేతెంచినం దలితండ్రు లాశ్చరచిత్తులై పోయివచ్చిన తెఱం గెరిగింపు మనిన నిట్లనియె.

132


క.

నట్టడవిలోన మమ్మున్
బెట్టినసొమ్ములు హరించి పెదపెదదొంగల్
కట్టి మము నూఁత ద్రొబ్బుచు
నట్లే నీయల్లుఁ గొనుచు నరిగిరి తండ్రీ.

133


వ.

అనిన నల్లుండు చోరులచేతఁ దగులువడుటం జేసి వణిజుండు దుఃఖంబున నుండినంత గొన్నిదినంబులకు నాసొమ్మంతయు వెచ్చించి ధనవంతుఁడు తనమామకుఁ గూఁతురు చావు చెప్పి తత్పరలోకక్రియార్థంబు కొంతధనమ్ము పుచ్చుకోదలచి మామగృహంబుసకు వచ్చునపుడు.

134


ఆ.

ఇంటిలోన మెలఁగు నిందునిభాననఁ
బత్ని జూచి డిల్లపడిన నింతి
వెఱవకుండు నీదువివరంబు మాయయ్య
యెఱుఁగ డనుచుఁ గాళ్ళ కిచ్చె నీరు.

135


వ.

మామయు నల్లునిరాకకు సంతోషించి తొల్లిటియట్ల కలపుకొని యుండునంత.

136


క.

కొన్నిదినము లరుగ నన్నీచవర్తనుం
డర్ధరాత్రినిద్ర నబల పొంద
తొడవు లెల్ల గొనుచు మెడ గోసి యెందేనిఁ
బోయె నేమి చెప్పఁ బురుషు ననియె.

137


వ.

అనినరాజకుమారుండు తనకీరంబు జూచి నీ వేమి చెప్పెద ననిన నచ్చిలుక యిట్లనియె.

138

సీ.

హర్షపురంబున కధిపతి ధర్ముండు
        వసుధ యేలగ ధనవంతు డనెడి
కోమటి గారాపుగూఁతురు వసుమతి
        కోమలి నొకవైశ్యు కొడుకు కిచ్చి
తనకు బుత్రుఁడు లేమి తనపుత్రి యింటనె
        యుండంగ కన్య దా యువతి యగుచు
నొకవిప్రతనయుతో నొనగూడి మెలగంగ
        నంత నప్పతి వచ్చి[8] యత్తమామ


తే.

లల్లు నొద్దకుఁ గూఁతును ననుపుటయును
నధిపు గవియక నిద్రితుండైన తరిని
బ్రాహ్మణుం డున్నచోటి కబ్భామ నడచె
తస్కరుఁ డొకండు వెంటనె తగిలి చనఁగ.

139


వ.

ఉద్యానంబు ప్రవేశించు నంతకుమున్న యవ్విప్రునిం జోరులు మక్కించినం గొనప్రాణములతోనున్న విప్రకుమారుని గౌఁగిలించుకొని చుంబింపంబోయిన నతండు ముక్కు గరుచుకొని మరణంబు నొందిన నింటికి వచ్చి మగండు ముక్కు గోసెనని కుయ్యువెట్టుటయును.

140


క.

నేరం బెఱుఁగని మత్సుత
గ్రూరుండై మగడు ముక్కు గోసె నటంచున్
భూరమణున కెఱిఁగించిన
క్ష్మారమణుఁడు వైశ్యపుత్రు జంపగ బంపెన్.

141


ఆ.

దొంగ నృపతి కనియె దోషి గాఁ డీతఁడు
ద్విజశవంబుతోఁడ వెలఁది పెనఁగ
ముక్కు గరచి ప్రాణముల బాసె విప్రుండు
వానినోట జిక్కె వనితముక్కు.

142

వ.

అని విప్రశవవదనంబు చూపిన భూరమణుండు గోపించి యజ్జారిణికి గర్ణచ్ఛేదనంబునుం జేయించి యాచోరుణికిం దళవాయిపట్టంబు నిచ్చెనని కీరద్వయంబునుం గథలు చెప్పి శాపముక్తులై చనిరి. స్త్రీపురుషులలో పాపం బెవ్వఁరిదని యడిగిన.

143


క.

వనితలకు సాహసంబును
ననృతంబును మార్జుతనము నదయతయును న
ర్మనమును మాయయు ఖలవ
ర్తనమును నిస్స్నేహితయును దప్పనిగుణముల్.

144


వ.

పురుషుండు పాపభీరుం డయ్యును పాపంబునకు జొచ్చెం గావున పురుషుం బేతాళుం డెప్పటియ ట్లన్యగ్రోధంబు నాశ్రయించిన పట్టితెచ్చునెడ నిట్లనియె.

145


సీ.

శరభాంకపురి యేలు శౌద్రకుండను రాజు
        సోమప్రభానామ సుదతి దనకుఁ
బత్నిగా ధర యెల్లఁ బాలింప మాళవ
        ధరణివిప్రుఁడు వీరవరుఁ డనంగ
కరవాలధారియై యరుదెంచి శూద్రకు
        చేజీతమంది యిచ్చిన ధనంబు
దేశభూదేవతాతిధియాచకులకు రూ
        కలు చతుశ్శతము నిక్కముగ నొసఁగి


తే.

యున్నరూకలు నూటగృహోచితంబు
తీర్చు నేనూరురూకలు దినదినంబు
నృపతి వెట్టంగ బగలురాత్రియును గొల్చి
నిద్ర యెఱుఁగక యుండు దా నేర్పు మెరసి.

146


వ.

అంత నొక్కనా డర్ధరాత్రసమయంబున.

147

లయవిభాతి:

మెఱుపులును నుఱుములును దఱచు వడగండ్ల
        బైదఱచు పిడుగులు దొరఁగ నఱిముఱి జగంబుల్
గిఱిగొనగ వాన వెఱచరవఁ బవనాహతిని నుఱక
        కుఱియంగ దిశ లెఱుగఁబడకుండన్
తెఱపిగొనలేక కనుగొఱపులగతిన్ జనము
        లుఱక మిఱుపల్లముల నుఱికి పెనుబాటన్
బొఱలఁగ బశువ్రజము లొఱలఁగ ధరిత్రిపయి
        దఱచుగనువాన వెనుచరచి వడిగురియన్.

148


మత్తకోకిల:

భూత మొక్కటి యూరివెలుపల భోరుభోరున నేడువన్
భూతలేశుఁడు మేడవాకిలి భూమిగాచుక యున్నవాఁ
డాతనిం గని యడుగ విప్రుఁడ నాయుధోద్ధతహస్తుఁడన్
వీతభీతుఁడనున్నవాఁడను వీరవర్యుఁడ నావుడున్.

149


తే.

పురము బహిరంగణంబునఁ బొలఁతియొకతె
యడలుచున్నది పోయి నీ వరయుమనిన
వీరవరుఁ డరిగి యాయేడ్చువెలఁది బిలిచి
యెందు కడలెద వనిన నయ్యింతి వలికె.

150


వ.

ఏ నీశూద్రకభూపాలు భుజంబున వసించిన భూదేవిని యతండు మూడుదినంబులకు మృతుండు కాఁగలఁడు. ఇతనిపిదప నన్యు నాశ్రయింపనొల్లక యేడ్చెదననిన వీరవరుం డిట్లనియె.

151


క.

ఈతం డతిదీర్ఘాయురు
పేతుండగు వెఱవు నెద్ది పృథివీవనితా!
నాతోడ నానతిమ్మన
భూతన్వియు (బలికె విప్రపుంగవుతోఁడన్).

152

తే.

ఈ మహాశక్తికిని భవదీయసుతుని
శిరము బలియీయఁ బతి చిరంజీవి యగును
సేయుమనవుండు నింటికి బోయి నంద
నునకు నెఱిఁగింప సమ్మతించిన నతండు.

153


వ.

పుత్రునిం దోడ్కొని యరగువాని తల్లియుం జెల్లెలును తోడనె యరుదేర నమ్మహాశక్తి గుడి కరిగి యిట్లని స్తుతియించె.

154


వనమయూరము:

అంబికృపాత్మ (జగదంబ) శుభమూర్తీ
కంబునిభకంఠ! శశికంధరుని రాణీ
బుంబరవిపక్షకులశక్తి పరమూర్తీ
అంబుధర(వర్ణ! నిను) నాత్మ భజయింతున్.

155


వ.

అని కరవాలంబున కంఠంబు దునిమినం దల్లియును సహోదరమరణంబు సహింపనోపక చెల్లెలును ప్రాణంబులు విడిచిన నవ్వీరవరుండు.

155


క.

కరవాలధారచే దన
శిరమును ఖండింప వెనుకఁ జేష్టలుచూడన్
జరి(యించెడుపతి) వీనికి
సరిగలఁడే భృత్యుఁ డనుచు సాహస మొదవన్.

156


ఆ.

ఇట్టి బంటు లేని యీ రాజ్య మేటికి
నను(చు ఖడ్గ మెత్తి) యాత్మశిరము
తునుమదలచునంత దుర్గ ప్రత్యక్షమై
నలువురకును బ్రాణములు (ఘటించె).

157


వ.

ఈ శూద్రకుండును వా రెఱుఁగకుండ నాత్మసదనంబునకుం జనియె వీరవరుండును ఆమువ్వుర (నింటి కనిపి తాను) భూపతిద్వారంబు గాచికొని యుండునంత ప్రభాతం బగుటయును.

158

క.

వీరవరు జూచి శూద్రకుఁ
డారాత్రిది యేడ్పువివరమది యెట్టిదినాన్
భూరమణ యొకపిశాచము
దారోదన మదియు నడఁగె నన చెప్పుట(యున్).

159


వ.

అతనివలన సంతోషించి యారాత్రివృత్తాంతంబు నమాత్యుల కెఱంగించి యతనికి మఱియు ననేకపదార్థంబు లిచ్చి (పుచ్చి రాజ్యమ్ము సేయు)చుండె నని చెప్పి బేతాళుం డిట్లనియె.

160


క.

ఈ యేవురిలో సాహస
మేయతనిది యన్న భటున కిది ముఖ్యము, భూ
నాయకుఁడు దెగదలంచుట,
నీయందఱియందు నధికుఁ డితఁ డని పలుకన్.

161


వ.

ఎప్పటియట్ల తిఱిగి పరచినం బ్రతిక్రమ్మరం దెచ్చిన బేతాళుం డిట్ల యంగదేశాధిపతి(కడకు) విష్ణుస్వామి యనునతనిసుతులు ముగ్గురు వివేకనిధానులు గొలువంబోయిన మీ రేమిటి కెఱుఁగుదు రనిన భోజనశయనారీవారిసంగుల మనిన నభ్బూవరుండు.

162


క.

భోజనసంగునకును దగు
రాజనమన్నంబు పెట్ట బ్రాహ్మణసుతుఁ డ
బ్భోజన మొల్లకడించెను
వ్యాజంబునఁ గమరుకంపువలచిన దనుచున్.

163


వ.

(భూపాలుండు) వీని పరీక్షించునపుడు స్మశానక్షేత్రంబున పండినధాన్యం బని యెఱింగి సంతోషించె మఱియును.

164


క.

నారీసంగునికడ కొక
నారీమణి బంప బాన్సునం బడువేళన్
చేరంగనీక దానిని
వారించెను మేకగదరువలచినదనుచున్.

183

వ.

..........భూపాలుండు పరామరిశించునపుడు, మేకచన్ను గుడిచి పెఱిగినదని విని విస్మితుండయ్యె మఱియును.

166


క.

శయ్యాసంగున కొకమృదు
శయ్యాస్థలి చూపనందు శయనించెడుచో
శయ్యాధస్థలరోమం
బయ్యడ మే నొత్తె ననిన నదియును నడుగన్.

167


చ.

ఆభూపాలుండు వానిశరీరంబుననున్న తదీయలాంఛనంబు చూచి మువ్వుర సంతోషించి యేలె, మువ్వురియందును సుకుమార వివేకు లెవ్వరని యడిగిన విక్రమార్కుం డిట్లనియె.

168


క.

వనితాసంగుండును భో
జనసంగుఁడు బుద్ధిచేత సాధించిరి శ
య్యను క్రింద నున్న రోమము
తనులాంఛన మగుట నధికతమ మన్నిటిలోన్.

169


క.

పుట మెగసి మూ పుడిగి య
చ్చటికిన్ బేతాళుఁ డరుగ జనపతి చని యు
ద్భటవృత్తి బట్టి(కొనిరా)
(నట నొక)కథ చెప్పదొడఁగె నద్భుతభంగిన్.

170


వ.

అది యెట్టి దనిన.

171


సీ.

ఉజ్జయినీపురి నొక్కవిప్రుఁడు హరి
        స్వామి, వేదస్వామి నామసుతుని
సోమప్రభానామసుతను గాంచిన నది
        వయసైన దగుపట్టి వరని నరయ
జ్ఞానియు మఱియు విజ్ఞానియు శూరుండు
        ననువారు ముగురు దత్తనయ నడుగ
జ్ఞానికి దండ్రి విజ్ఞానికిఁ దల్లియు
        శూరున కక్కన్య సోదరుండు

ఆ.

నిత్త మనుచు వారి నింటికి గొనివచ్చి
యొకని కిత్త మతివ కొకఁడు వరుఁడు
గాక, యనుచు దెంపలేక, వాదడువంగ
నైదువాసరంబు లరుగుటయును.

172


క.

ఇవ్విధమున మువ్వురు నా
మువ్వురకును గన్య నుడిగి ముద ముడిగినచో
నవ్వనిత నొక్కరక్కసుఁ
డువ్వెత్తుగ గొంచు బోయె నొకగిరిగుహకున్.

173


వ.

ఇట్లు వోయిం జననీజనకసహోదర లతిదుఃఖతులయిన జ్ఞాని తదీయమార్గం బెఱింగించె విజ్ఞాని రథ మలవరించె నంత.

174


క.

శూరుఁడు రథ మెక్కి మహా
వీరుని రక్కసుని దునిమి వెలఁదిని దెచ్చెన్
వీరలలో నెవ్వఁడు క
న్యారమణుం డనిన శూరుఁడని యెఱిఁగించెన్.

175


వ.

తిరిగినం బట్టి తెచ్చు నెడ నిట్లనియె, మాలావతీపురంబున ధవళుం డనురజకుండు కోడలిం దోడితేర కొడుకుం బంపిన నతం డత్తవారింటికిం జని తత్సహోదరుం డనుప రా, భార్య ననిపించుకొని వచ్చు నప్పుడు.

176


చ.

తెరువున నున్న దుర్గ గని దేవికి మ్రొక్కిన మొక్కు దీర్ప భీ
కరకరఖడ్గ మెత్తి తనకంఠము ద్రెంచిన, దేవరుండు నా
కరపున నాత్మమస్తకము గ్రక్కున దెంచిన జూచి దుఃఖియై
తరుణియు నాత్మకంఠమునఁ ద్రాడు గదల్పగ నంత దేవియున్.

177

క.

మెచ్చితి బతిఁసోదరులకు
నిచ్చితి బ్రాణములు వీరి యీబొందులపై
దెచ్చి తల లదుకు మనవుడు
నచ్చేడియ వీడుపడగ నతికె శిరంబుల్.

178


క.

పెనిమిటితల, యనుజునకును
పెనిమిటికిని ననుజుతలయు బెరశిన వా రు
బ్బున లేచి నిల్చి రిద్దఱు
వనరుహముఖి వెరఁగుపడియె వరుఁ డెవ్వడొకో?

179


వ.

అని యడిగిన "సర్వస్యగాత్రస్యశిరః ప్రధానం" బను వాక్యంబు గలదు గావున శిరంబున్నవాఁడె యింతికి వరుం డగునని బేతాళుం డెప్పటియట్ల చనినం బట్టి తెచ్చునెడ నిట్లనియె.

180


సీ.

రమణఁ బ్రలిప్తపురం బేలుచుండు సిం
        హుండను భూవరుఁ డొక్కనాఁడు
వేఁటగా జని ఘోరవిపినమధ్యంబున
        క్షుత్పిపాసలఁ జిక్కి సొగయుచున్న
కార్పటికుండను గహనచారుఁడు చేరి
        యామలకద్వయం బందియిచ్చి
తెరువు దప్పిన దెచ్చి తెరువు చూపిన మెచ్చి
        యెద్ది నీవాంఛిత మిత్తు ననిన


తే.

గాలనేమితనూజ పాతాళసిద్ధ
కనకపురముననున్న తక్కన్య దెచ్చి
పెండ్లి సేయుము నాకు నభీష్ట మిదియ
యనిన నగుగాక యనియె ధరాధరుండు.

181

క.

కల మెక్కి యరిగి, భీకర
జలనిధిలో నురికి, నాగజగతికి జని, యు
త్పలనేత్ర కనకరేఖనుఁ
బిలము న్వెడలించి హితుని బెండిలిచేసెన్.

182


క.

ఉపకారపరునకునుఁ బ్ర
త్యుపకారము సేయఁడేని నుర్వి గృతఘ్నా
ద్యుపపాతకములు దగులును
కపటుండని భూజనంబు గైకొన రతనిన్.

189


వ.

అట్లు గావున నిందు నెవ్వరి దుపకారం బనిన నిష్కారణం బుపకారంబు చేసిన కిరాతుం డధికుం డనిన నెప్పటియట్ల బేతాళుండు వటవిటపికిం జనిన బట్టితెచ్చు సమయంబున నిట్లనియె.

184


సీ.

లక్షణపుర మేలు లఘుభుజుండను రాజు
        తనకూఁతు మణిరేఖ దగినపతికి
నిచ్చెదనన నొకయిలఱేఁడు చనుదెంచె
        జంతుభాష లెఱుంగు శాస్త్రవిదుఁడు
వాని కిచ్చినఁ గన్య వరియించి తనభూమి
        కరిగి రాజ్యము సేయు నవసరమున
సతియును దానొక్కశయ్యపైఁ బవళించి
        యున్న పిపీలికాయూధ మొకటి


ఆ.

యరుగుదేరఁ బథము కడ్డమై మంచము
కోడు నిల్చియున్నఁ గొంకు భటుల
కనియె జీమనాయుఁ డదియేల నిలిచితి
రన్న, శయన చరణ మున్న దనిన.

185

క.

అది యెత్తివైచికొనుచుం
బదడన నొక సతియు, బతియుఁ, బడియున్నా రె
త్తుదుమో, వలదో, యనవుడు
ౙదురునకును నృపతి నవ్వ సతి యిట్లనియెన్.

186


వనమయూరము:

ఏమిటికి నవ్వితి మహీశ! యని పల్కన్
రామ యిది చెప్పుకొనరాదనిన నాపై
ప్రేమముడివోయె నిక బెట్టుకొనియుండన్
నామనసుఁ, బ్రాణమును నాథ! యనిపల్కన్.

187


ఆ.

చెప్పకున్న నీవు జీవంబువిడుతువు
చెప్పినపుడె నాకు జీవహాని
చెప్పి మున్ను నేను జీవంబు విడిచెద
నీవు చన్నపిదప నిలువలేను.

188


వ.

అని స్మశానంబునం జితి బేర్పించుకొని యందుమీఁదం బవ్వళించి పత్ని కెఱింగించి ప్రాణంబు విడిచెద నను సమయంబున.

189


తే.

ఒక్కచింబోతు తనమేక నుపచరించి
తన్ను బ్రార్థించి నూఁతిలోనున్న గఱిక
తెచ్చియిడుమన్న నూఁతిలో చొచ్చినపుడె
చత్తు, నీ వేల నా కని చనియె దొలఁగి.

190


క.

మతి నెఱిఁగి భూమిపాలుఁడు
చితి నుండక లేచి వచ్చి చిగురుంబోణిన్
పతిభక్తి గలుగు జక్కని
యతివ న్వరియించె దొంటి యంగనయడలన్.

191


వ.

ఇమ్మేషనృపతులలో నెవ్వరు వివేకు లనిన తిర్యగ్జంతువయ్యును చింబోతు స్త్రీమోహంబు విడిచెం గావున నదియె వివేకి యనిన బేతాళుం డెప్పటియట్ల వటంబునకుం జనుటయును.

192

ఆ.

అవనినాథుఁ డెప్పటట్లనే కొనితేర
దనుజుఁ డొక్కకథ విధంబు చెప్పె
వీరబాహుఁ డనెడువిభుఁ డంగదేశంబు
పాలనంబు సేయఁ బట్టణమున.

198


సీ.

ధనదత్తుఁడను వైశ్యు తనయను మదనస
        యనుదాని ధర్మదత్తాఖ్యుఁ డొకఁడు
కామించి పట్టఁదగరుటయు (?) నది పల్కె
        మును దనతండ్రి సముద్రదత్తు
నకు నిచ్చె ననిన, దైన్యమున నాతఁడు పట్ట
        వచ్చిన వలదు నావరుని ముదల
మును వచ్చి నిను బొంది చని, పతి గూడుదు
        ననిన వాడు నగుచు నట్లు సేయు


ఆ.

మనిన నాఁటిరాత్రి యది పతి గదిసినఁ
దనదుబాస చెప్పి తరళనయన
ధర్మదత్తుఁ గూడ నర్మిలిఁ జనుచుండ
పట్టిదొంగ సొమ్ము వెట్టుమనిన.

194


క.

తనవర్తనంబు దొంగకు
వనరుహముఖ చెప్పి మగుడి వచ్చియు మఱి నీ
మనమున కిష్టముఁ జేసెద
నని సమ్మతుఁ జేసి చనియె నాతనికడకున్.

195


ఉ.

వచ్చిన, కాంతఁ జూచి యిటు వత్తురె నాథుని డించి యన్న నీ
కిచ్చిన బాసకై యనిన యిందునిభానన! సత్యవాక్యమున్
మెచ్చితిఁ దోఁడబుట్టువవు మీనవిలోచన యంచు నొక్కసొ
మ్మిచ్చిన సమ్మ(తించి)యది యేఁగెను తస్కరుఁ డున్నచోటికిన్.

196

క.

వాఁడును సూనృతయగు పూఁ
జోడిని మఱపించి సొమ్ముపుడుకక తానుం
బోడిమిచేయుచు ననిపినఁ
బోడిమిచెడ కరిగె నాత్మవురుషుని కడకున్.

197


క.

మువ్వురిలోపల నధికుం
డెవ్వఁ డెఱిఁగింపు మనిన హృదయేశ్వరుఁడై
యవ్వనిత ననిపి తిరుగా
నవ్వెలఁదిం గూడుపురుషుఁ డధికుం డనియెన్.

198


వ.

తిరిగి వటంబునకుం బారిన పట్టితెచ్చునెడ, బేతాళుం డిట్లనియె.

199


సీ.

ధారాపురంబున ధర్మధ్వజుండను
        రాజునంగనలు తారావళియును
నబ్జరేఖయును, మృగాంకదత్తయు నను
        వారలు సుకుమారవనజవదన
లందులో నొక్కతె యంగంబు వెన్నెల
        బొక్క నొకక్కెతె మేను పువ్వు సోఁకి
చిడిసె మఱొక్కతె చేతులు ముసలరా
        వము విన్నఁ బొక్కె నీవనితలందు


తే.

కోమలంబైన తనువు దేకొమ్మ యనిన
నాతు లిద్దఱికినిఁ గారణంబు గలదు
ముసలనినడంబు విన గరములకుఁ బొక్కు
లెగయు కాంతయే సుకుమార యెక్కు డనిన.

200


వ.

బేతాళుండు న్యగ్రోధంబున కరిగినతోఁడనే పారిపట్టితెచ్చునెడ విక్రమార్కున కిట్లనియె.

201

సీ.

రత్నకాంచీపురిరాజు యశఃకేతు
        డనునృపుఁ డంగరాజాధివరుఁడు
దీర్ఘదర్శనుమంత్రి తెరువు చెప్పిన సము
        ద్రము సొచ్చి పాతాళతళమునందు
నిర్జనపురమునఁ (నెలఁత) నొక్కతెఁ జూడ
        నట భూతతిథి నొక్కయసుర మ్రింగ
రాక్షసుజఠరంబు వ్రచ్చి యక్కాంతను
        వెడలింప నృపునకుఁ బడతి యనియె


తే.

పొత్తునకు రాక తా నన్నభుక్తిఁ గొనక
నన్ను శపియించె తండ్రి దానవుఁడు మ్రింగు
ననుచు మఱి వానిఁ జంపిన యతఁడు నీకు
రక్తుఁ డని పల్కి శాపవిముక్తి యొసఁగె.

202


క.

అది గావున నను గైకొను
మిది నాయభిలాష యనిన నింతిని గొనుచుం
బదపడి పురి కేతెంచిన
నది మంత్రికుమారుఁ డెఱిఁగి యసువుల బాసెన్.

203


వ.

అమ్మంత్రి మరణంబునకు గారణం బెద్ది యనిన విక్రమార్కుం డిట్లనియె.

204


క.

ఆదివ్యకాంతఁ గలసిన
భూదయితుఁడు మత్తుఁడగుచుఁ బొరిగొను నన్నున్
భేదించు మంత్రి తమ్మును
శ్రీ దరుగఁగఁ జేయునని యచేతనుఁడయ్యెన్.

205


వ.

అనవుండు.

206

క.

భుజము డిగి దానవుఁడు వట
కుజమునకుం బరవ బట్టికొనితేరఁగ నా
రజనీచరుండు పలికెను
విజయోన్నతకథ వచింతు వినఁదగుననుచున్.

207


వనమయూరము:

శ్రీమెరయ వార(ణసి సీమ గల వేద)
స్వామి తనయుండు హరిస్వామి యొకశయ్యన్
వేమరునుఁ బూర్ణశశి వెన్నెలలు గాయన్
కామినియు దాను (రతికాంక్షులగు వేళన్).

208


ఇంద్రవజ్రము:

గంధర్వుఁ డక్కామినిఁ గాంచి బాహా
సంధానుఁడై కొంచును జన్నవాఁడున్
సింధువ్రజస్నానము చిత్తవృత్తిన్
సంధించి వేగంబున జాఁగివెళ్ళెన్.

209


తోటకము:

ధరణీసురుఁ డత్తరి నొక్క(పురిన్)
సరసీరుహలోచన వెట్టినశ్రీ
కరభిక్షము భుక్తము సేయఁగ న
త్తరుపై నొకగృధ్రము తుండమునన్.

210


ఆ.

పాము జేరుటయను పాఱుండు భిక్షంబు
గుడుచుచోట విషము పడియెనందు
పుచ్చనెఱుఁగ కతడు భుజియించి విషమెక్కి
చచ్చె నచట విధివశంబుచేత.

211


వ.

భిక్షంబువెట్టిన గృహిణించూచి గృహస్థు నీ వావిప్రుని కేమి పెవెట్టితివో యతండు చచ్చె నీముఖంబు చూడ దోషం బని భార్యను వెడలంగొట్టె నాబ్రహ్మహత్య యెవ్వరి దని యడుగుటయును.

212

క.

దోషంబు లేని యాని
ర్దోషిని దోషాత్ముఁ డనుచు దూషించిన యే
దోషములకు నధికంబగు
దోషం బనికొండ్రు సకలదోషవిధిజ్ఞుల్.

213


వ.

కావున దోషం బొకని కాపాదించినవానికి దోషంబు దగులుననిన బేతాళుం డెప్పటియట్ల మఱ్ఱికిం జనిన విక్రమార్కుండు చనిపట్టితెచ్చుసమయంబు నొక్కకథ వినుమని యిట్లనియె.

214


సీ.

వీరకేతుం డనువిభుఁ డేలుతఱి నయో
        ధ్యాపురంబున రత్నదత్తుఁ డనెడు
వైశ్యునిసుత వీరవతి యనుకన్యక
        నధిపతి యడిగిన నతని కీక
తనయింటనున్ప నత్తరి చోరుఁ డిలు చొరం
        జూచి పేదని తనసొమ్ము లీయ
వచ్చిన నొల్లక వరియింపఁ గోరినఁ
        జచ్చెద వరుగు నీ వచ్చినట్ల


ఆ.

యనిన మరునిచేత నటు చచ్చుకంటెను
జామ నీకు గాను చచ్చు టురువు
నాఁదలారు లెఱిఁగి నరపతి కెఱిఁగించి
విభునియాజ్ఞఁ గొఱఁత వేయఁ గాంచి.

215


క.

వారిజముఖి జనకునకునుఁ
జోరునికథఁ దెలిపి యగ్నిఁ జొచ్చెద ననుచున్
జేరినఁ దజ్జనకుండు కు
మారిక విడువంగ లేక మతివడ (లొదవన్).

216

క.

జనపతి సమ్ముఖమునకుం
జని భూవర వీని నేల చంపగ నీకున్
ధన మెంతైనను నిచ్చెద
ననుటయు విన కతండు తత్పురాంగణసీమన్.

217


తే.

కొఱ్ఱు వాతించి తస్కరుఁ గొఱఁత వేయ
వాఁడు దుఃఖంచి నవ్వి జీవంబు విడువ
నంత నాధీరవతియును నగ్గిఁ జొరఁగ
దగ్గరుటయును శివుఁడు బ్రత్యక్షమగుచు.

218


తే.

అతనిప్రాణంబు గృపచేసి హరుఁడు చనియెఁ
గొఱితిపై నుండి దుఃఖంబు గుడిచి పిదప
నవ్వె నేటికి జెప్పుమా నరవరేణ్య!
యనిన విక్రమసూర్యుం డిట్లనుచు బలికె.

219


క.

ధనమెంత తనకు నిచ్చిన
వినఁడయ్యెను, నృపతి, దనకు విధియని యేడ్చెన్
వనజాక్షి యగ్ని చొరగాఁ
జనజూచిన నవ్వె నిదియ (సత్యం) బనినన్.

220


వ.

ఎప్పటియట్ల తిరిగి పరచినం బట్టితెచ్చునెడ బేతాళుఁ డిట్లనియె.

221


సీ.

నేపాళదేశమహీపతియగు కీర్తి
        కేతునిసుత (యొప్పు) గీరవాణి
చంద్రిక నాగ వసంతోత్సవంబున
        వనితఁ జూచెను ఘనస్వామియనెడు
విప్రకుమారుండు వెలఁదియు నవ్విప్రు
        దగఁజూచె మోహ మిద్దఱికిఁ బొడమె
నతివ యంతఃపురి కరుగ ఘనస్వామి
        చెలిమూలదేవుడన్ సిద్దయోగి

తే.

యొ(కఁడు ఘు)టి కిచ్చి విప్రుని నువిద జేసి
నృపతిముందట నిది నాకు నిజతనూజ
తీర్థయాత్రకు జని యల్లుఁ దెచ్చుదాక
(పోషణ)ముచేయుమని చెప్పి పోయె నతఁడు.

222


క.

ఆరాజన్యుఁడు నాత్మకు
మారికకడ నిలుప రాత్రి మగవాఁడై యా
వారిజలోచనఁ బొందును
సూర్యోదయ[9]మైన మగుడ సుందరి యగుచున్ ?.

223


వ.

అంత నారాజకుమారికయు గర్భిణియైన నాలోన.

224


ఆ.

మంత్రిసుతుఁడు రాజమందిరంబున నొక్క
పగలు కపటవిప్రభామఁ జూచి
మోహి యగుచు నృపతి ముఖ్యున కెఱిఁగింప
నతని కిచ్చె నింతి నాలి గాఁగ.

225


క.

ఆమంత్రిసుతుఁడు కృత్రిమ
కామినిఁ గలయంగ బిలువఁ గల దొకవ్రతమో
భూమిసుర! తీర్ధయాత్రకు
బోమఱి యేతెంచి నన్ను బొందెద వనుడున్.

226


ఆ.

అతఁడు తీర్థయాత్ర యరిగినన దత్పూర్వ
పత్నిఁ బొందుచుండెఁ బగలురేలు
నంత మంత్రితనయుఁ డరుదెంచు టెఱిఁగి య
ప్పొలఁతి గొంచుపోయెఁ బురము వెడలి.

227


వ.

అంత నమ్మూలదేవుండను సిద్ధయోగి కపటశిష్యునిం దెచ్చి రాజునకుం జూపి మత్పుత్రిని నితనికి వివాహంబు సేయవలయు దెప్పించుమనిన భూపాలుండు.

228

క.

ఆమూలయోగి పెట్టిన
భామినిఁ దావెచ్చపెట్టి భయవిహ్వలుఁడై
భూమిపతి తనదుపుత్రిక
నామాంత్రికశిష్యునకుఁ బ్రియాంగన జేయన్.

229


వ.

అతఁ డక్కాంత దోడ్కొని గృహంబునకు వచ్చుటయును.

230


తే.

పడఁతి నని మున్ను సతికి గర్భంబు చేసి
నట్టివిఫ్రుండు తనకాంత యనుచుఁ బట్టఁ
దండ్రియగు రాజు నాకిచ్చె దారవోసి
యనుచు నిరువురు జగడింప నత్తపస్స్వి.

231


వ.

జగడంబు దీర్పలేడయ్యె నది యెవ్వరిసతి యగు ననిన విక్రమార్కుం డిట్లనియె.

232


క.

తలిదండ్రు లీక వనితన్
దలపొలమున గూడికొనినఁ దా ధవుఁ డగునే
తలిదండ్రు లిచ్చువాఁడే
యలివేణికి నాథుఁ డితరు లగుదురె నాథుల్.

233


వ.

అనిన నెప్పటియట్ల వటంబునకుం జారిన పట్టితెచ్చుసమయంబున నొక్కకథ వినుమని యిట్లనియె.

234


ఉ.

యాచకనూత్నమేఘుఁడు సమంచితమానధనుండు గాఢబా
హాచటులప్రతాపసముదగ్రవినిర్జితశాత్రవుండు శా
స్త్రోచితమార్గలక్షణగుణోదయుఁ డాత్మవిచారుఁడైన యా
ఖేచరనాథుఁ డొప్పు జనకీర్తితకీర్తికళామహోన్నతిన్.

235


వ.

ఆగంధర్వశేఖరుండు కామగమనంబైన(?) విమానారూఢుండై లోకములం జరియించుచుండుకాలంబున.

236

క.

గరుడుం డుద్ధతబలుఁడై
నురుగుల భక్షింపుచుండ నురగము లెల్లన్
గరుడనికిలు వరుసగ ని
చ్చిరి ఖగవల్లభుఁడు నట్ల సేయుచునుండన్.

237


వ.

అంత నొక్కనాఁడు.

238


ఆ.

శంఖచూడుఁడనెడు సర్పకుమారుండు
తల్లి కొక్కరుండ తనయుఁ డగుట
పక్షినాథునకును భక్షింప నిలువర్స
వచ్చెననుచు ఫణులు వానిఁ జూప.

239


వ.

తదీయజనని దుఃఖావేశంబున నిట్లని తలంచు.

240


క.

ఒక నేత్రము నేత్రంబే
యొకపుత్రుఁడు పుత్రకుండె యూహింపంగా
నకట బహుసుతులఁ గానక
యొకసుతునిం గనుట, లేకయుండుటగాదే!

241


వ.

అని విలాపించుసమయంబున జీమూతవాహనుండు మార్గవశంబున నచ్చటికిం జనుదెంచి దయాళుండై యప్పుడు.

242


ఆ.

శంఖచూడుఁ దిగిచి సౌపర్ణుముందట
నిలిచి భుక్తి గొను మనింద్యచరిత
యనినఁ బక్షివరుఁడు ఘనవాహు దేహంబు
భుక్తి గొనఁగఁ జేరఁ బురుషవరుని.

243


చ.

వలదని శంఖచూడఫణి వారణ సేయఁగ మేఘవాహు ను
జ్వలతరదేహమాంసములు, చంచుపుటంబున నొల్క నెత్తురుల్
జలజల ధారలై తొరఁగ సాంగుబళా యని దేవసంఘముల్
పలుమరు ప్రస్తుతింప ఫణిప్రాణము గాచెను దారశీలియై.

244

క.

ఆతని యుదారమహిమకుఁ
బ్రీతుండై మెచ్చి ఖగవరిష్ఠుండు సుధా
ప్రీతునిగఁ జేసి ఫణిసుతుఁ
జేతః ప్రియ మలరఁ గాఁచె చిత్తం బలరన్.

245


క.

మెచ్చితి నంబుదవాహన
యిచ్చెద నే మడుగు దనిన నిది మొదలుగ, నీ
కిచ్చయని ఫణుల మెసఁగకు
చచ్చిన యురగములఁ దినుము శాంతాత్ముఁడవై.

246


వ.

అనిన నిచ్చితినని గరుడుండు యధేచ్ఛం జనియె గరుడ జీమూతవాహనులలో నెవ్వం డధికుం డనిన విక్రమార్కుం డిట్లనియె.

247


ఆ.

అధికదాతయైన యంబుదవాహనుఁ
డిచ్చు ప్రాణమైన నేమి చెప్ప
నాకలైన మెసఁగ నరుదెంచు గరుడుండు
దినక కాచునదియె ధీరగుణము.

248


వ.

అనినం బరచినం బట్టితెచ్చునెడ నిట్లనియె.

249


సీ.

కనకపురంబునఁ గలఁడు విశారదుం
        డనురాజు వైశ్యుని యముఁగుదనయ
కామిని జూచి యభ్బూమినాధుఁడు పెండ్లి
        యాడెద లక్షణ మరయుఁ డనిన
దీని బెండ్లాడిన మానవేంద్రుఁడు రాజ్య
        తంత్రంబు నుడుగును దగదటంచు
నవనినిర్జరు లది యవలవణం బన్న
        రా జొలకున్న నారాజు మంత్రి

ఆ.

పెండ్లియాడుటయును బృథివీశుఁ డొక్కనాఁ
డతివఁ జూచి మన్మథాగ్నిఁ బొరల
మంత్రి దెలిసి తనదు మగువ నొప్పించిన
నన్యకాంత పాపమని తలంచి.

250


వ.

కైకొనక విరహతాపంబునం బ్రాణంబువిడిచె నమ్మంత్రియుం దనస్వామి మృతుండయ్యెనని తానును నట్లయయ్యె వీరిలోన నధికుం డెవ్వఁ డనిన విక్రమార్కుం డిట్లనియె.

251


క.

చక్కనిదైనను గుణములు
మిక్కిలిగా హృదయమిచ్చి మెలఁగెడిదైనన్
మక్కువ సేయక పరసతి
దిక్కుగనుంగొనినవాఁడె ధీరుఁడు సుమ్మీ.

252


వ.

అట్లు గావున రా జెక్కుఁడనిన బేతాళుం డెప్పటియట్ల న్యగ్రోధంబున కరిగినం బట్టితెచ్చుసమయంబునఁ గథ వినుమని యిట్లనియె.

253


ఆ.

పుష్పపురమునందు భూసురుండొక్కఁడు
సూర్యదేవళంబు చొచ్చి యందు
క్షుత్పిపాస నొగులఁజూచి యోగీశ్వరుం
డతని కన్న మిడుదు నని దలంచి.

254


వ.

ఒక్కపురంబు నిర్మించి యొక్కబాలిక చేత నన్నము పెట్టించినం దృప్తుండై యయ్యోగీంద్రున కిట్లనియె.

255


క.

ఈవిద్య నాకు నొసఁగుము
ధీవల్లభ! యనిన నీవు స్థిరచిత్తుడవై
సేవింపక ఫలియింపదు
నావుడు నేనట్ల సేతునని కైకొనుచున్.

256

వ.

తదీయోపదేశక్రమంబున జలంబులు చొచ్చి జపంబు సేయుచు ధ్యాననిద్రావశంబునఁ దా వివాహంబై పుత్రులం గాంచి ముద్దాడుచున్నాఁడని కలగాంచి జలంబులు వెలువడివచ్చి యప్పుడు.

257


క.

అనలంబుఁ జొచ్చి భార్యయుఁ
దనయులు దుఃఖంపఁ గాంచి దహనముకొలనై
తనువు ఘటించిన వెలువడి
మునివరునకు మ్రొక్కి విఫలముగ వినుతింపన్.

258


వ.

అయ్యోగీశ్వరుండు చింతింపుచుండె నిది సఫలంబుగాని కారణం బేమి యనిన విక్రమార్కుం డిట్లనియె.

259


క.

జపములు జేసెడువారును
తపములు తగజేయువాడ తత్తత్క్రియలన్
విపరీతచిత్తులైన
న్నపగతఫలసిద్ధు లగుదు రందురు నార్యుల్.

260


వ.

అనిన నెప్పటియట్ల వటమునకు నరిగిన బేతాళుని బట్టి కట్టికొని తెచ్చునప్పుడు విక్రమార్కునకుఁ గథ వినుమని యిట్లనియె.

261


ఆ.

ఒక్కవైశ్యుతనయ యుత్పలదళనేత్ర
తండ్రి జచ్చుటయునుఁ దల్లివెంటఁ
బురము వెడలిపోవఁ దెరువున నొకచోట
శూలనిహతుఁడైన చోరుఁ డొకడు.

262


క.

సంతానము సుఖహేతువు
సంతానము మోక్షసిద్ధిసాధన మగుటన్
సంతతి వడయగ వలయును
సంతానము లేమి నరకసాధన గాదే!

263

వ.

అని కించిత్ప్రాణావశేషుండైన తస్కరుం డక్కన్య తల్లికిం గన్నుదనియధనంబు తననిక్షేపంబు నిచ్చి దానిఁ దా వరియించినవాఁడై యిట్లనియె.

264


ఆ.

సూర్యదీప్తిపురము చొచ్చి మత్సఖుఁడైన
యక్కుమారదత్తునాలయమున
నిలిచి యొక్కవిప్రువలన సంతానంబు
వడయు నాకు సుగతి ఫలము వొంద.

265


వ.

అని చోరుండు ప్రాణంబు విడిచె దల్లియుం గూఁతురు ధనంబు గైకొని తత్సఖుగృహంబునకు వచ్చియుండునంత నొక్కనాఁడు కూతుం జూచి విప్రునివలన సంతానంబు వడయుమనిన సమ్మతిలకున్న నిట్లనియె.

266


క.

వరుని యనుజ్ఞను వేఱొక
పురుషునియెడనైన వనిత పుత్రునిఁ బడయన్
బరమును దప్ప దిహంబును
బొరినిందయు రాదు వాఁడు పూజ్యం డగుటన్.

267


వ.

అని యొడంబరచుటయును.

268


క.

హేమస్వామి యనంగను
భూమీసురవరుని బొంది పుత్రునిఁ గని య
క్కామిని సిగ్గునఁ బెంపక
భూమిశారామవీథిఁబుత్రునిఁ బెట్టిన్.

269


క.

వనపాలకుచే విని య
జ్జనపతి తెప్పించి వాని సల్లక్షణముల్
కని తా నపుత్రుఁ డౌటనుఁ
తనయునిగాఁ బెంచి వాని ధరణిపుఁ జేసెన్.

270

వ.

అంతఁ గొంతకాలంబున కారాజు మృతుండైన నక్కుమారుండు.

271


ఆ.

గయను పిండ మిడుచు గంగ నస్థులు నిల్ప
సుతున కిహముఁ బరము జూర యబ్బు
నతనిఁబుత్రుఁ డనుచు నందురు బుధు లట్లు
గానివాఁడు సుతుఁడు లేనివాఁడు.

272


వ.

అని తలఁచి గయకుం జని పిండప్రదానంబు సేయు నప్పుడు.

273


క.

హస్తములు పిండభుక్తికి
శస్తముగా మూడు దోచె జనపతిసుతుఁ డే
హస్తమున నిడుదునో యని
నిస్తరణము సేయలేక నివ్వెఱపడియెన్.

274


వ.

ఇందు నెవ్వరిహస్తంబునఁ బిండం బిడవలయుననిన విక్రమార్కుం డిట్లనియె.

275


ఆ.

పోషకుండు భూమిభుజుఁడు గూఢాచారి
విప్రుఁ డట్లు గాన వీరు గారు
ధనము పెవెట్టి కన్యఁ దస్కరుండు వరించె
దండ్రి యతఁడె పిండదానమునకు.

276


వ.

అనిన బేతాళుం డరిగి పరచినఁ బట్టి కట్టితెచ్చుచో నొక్కకథ వినుమని యిట్లనియె.

277


సీ.

చిత్రకూటం బేలు క్షితిపతి యొకనాఁడు
        వేఁటగాఁజని యటవీస్థలమున
గణ్వునకును మేనకకునుఁ జనించిన
        కన్యక నతడీయఁ గామి యగుచు

గుంజరాశన[10]తరుకుంజాంతరంబున
        రమియింప నొకబ్రహ్మరాక్షసుండు
జనపతి కనియె బ్రాహ్మణపుత్రుఁ దలిదండ్రు
        లలమిపట్టఁగ నాకు బలియొనర్పు


ఆ.

మిట్లు సేయకున్న నిప్పుడె భక్షింతు
నిన్ను ననిన వేగ నృపతి యపుడు[11]
కనకపురుషునొకనిఁ గల్పన సేయించి
విప్రనందనునకు వినిమయముగ.

278


వ.

ఇచ్చి తదీయజననీజనకులచేత శిరఃపదంబులు వట్టించి ఖడ్గం బెత్తి వేయ డగ్గరిన నవ్విప్రకుమారుండు నవ్వె నేమిటికిం జెప్పుమనిన విక్రమార్కుం డిట్టులనియె.

279


ఆ.

తల్లిదండ్రు లలర ధరణీశుచేఁ దెగ
వేతఁబడగఁ జేసె విప్రు నన్ను
బళిరె విధి యటంచుఁ బకపక నవ్వె వా
డనినఁ బ్లక్షమునకు నరిగె నసుర.

280


వ.

ఎప్పటియట్ల పట్టితెచ్చునెడ నొకకథ వినుమని యిట్లనియె.

281


ఆ.

వసుధ నొక్కపురము వైశ్యుండు తనకూఁతు
పిన్నవయసునందె పెండ్లి సేయ
యావనమున జారయై విప్రుఁ గలయంగఁ
తొంటినాథుఁ డరుగుదెంచి యపుడు.

282

క.

మామ నొడఁబరచి తనప్రియ
భామిని ననిపించికొనఁగఁ బయనము సేయన్
భూమిసురుఁ బాయజాలక
కామిని మృతిబొందె నట్ల కడచెన్ ద్విజుఁడున్.

283


క.

సతి ననుపు మనుచు వచ్చిన
యతఁడు ప్రియన్ బాయ లేక యసువులు విడిచెన్
మృతులగు మువ్వురలోపల
క్షితివర యే దద్భుతంబు చెప్పవె యనినన్.

284


ఆ.

భూమిసురుఁడు వైశ్యపుత్రియు సమరతిఁ
గలసి పాయలేమిఁ గలిగె చావు
అతివమగఁడు దానియనుభోగ మెఱుఁగక
విరహముననె తెగుట విస్మయంబు.

285


వ.

అనిన బేతాళుం డెప్పటియట్ల చనినఁ బట్టితెచ్చునెడ నొకకథ వినుమని యిట్లనియె.

286


సీ.

బ్రహ్మస్థ లాగ్రహారమున విష్ణుస్వామి
        సుతులునల్వురు భూమిఁ జూడ నరిగి
వచ్చుచో నొకయోగివరునిచే సంజీవ
        నాదివిద్యలు నేర్చి యడవిలోన
నొక్కసింహము చచ్చియున్న నందొకరుండు
        నస్థులు గూర్చె దానంత నొకఁడు
చర్మంబు గప్పి మాంసమును రక్తంబునుఁ
        బుట్టించెఁ బ్రాణంబుఁ బోసె నొక్క


తే.

డిట్లు నలువురు దమవిద్య లెఱుఁగుకొరకు
నాచరించిన గేసరి లేచి వారి
నలువురను బట్టి తినియె నాఁకలి యడంగ
వీరిలోఁ బాపి యెవ్వఁడు విక్రమార్క.

287

వ.

అన నిట్లనియె.

288


క.

హీనమతు లెందఱైనను
గానంగా లేక సేయుకార్యము లెల్లన్
మానప్రాణార్థంబుల
హాని వెసం జేయు ననిరి యార్యజనంబుల్.

289


వ.

అట్లు గావున ప్రాణంబు వోసిన విప్రుసకు పాపంబు దగులుననిన దిరిగిచనినం బట్టితెచ్చునెడ నొక్కకథ వినుమని బేతాళుం డిట్లనియె.

290


సీ.

యజ్ఞశూలంబను నగ్రహారంబున
        యజ్ఞసోమద్విజు నాత్మజుండు
మృతిబొందుటయు (నుఁబరేతభూమికిఁ దెచ్చి)
        వనరంగ వామనుండను తపస్వి
యతనిదేహమునచొచ్చి యడలు మాన్చెదనని
        తలఁచి యప్పీనుఁగు తనువు చొచ్చి
నపు డేడ్చి పాతరలాడి ప్రవేశింప
        దనయునిఁ దోకొని చనియెఁ దండ్రి


తే.

తపసి యేటికి నేడ్చె నృత్యంబు సలిపె
ననిన నవ్విక్రమార్కుఁ డిట్లనియెఁ దన్ను
దల్లిదండ్రులు వెంచిన తనువు ముదిసి
విడువఁబడెనంచు నేడ్చెనప్పుడు తపస్వి.

291


వ.

బాలశరీరంబు చొచ్చి భోగింపఁగలిగెనని సంతసంబున నటియించె ననిన బేతాళుం డెప్పటియట్ల చనినం బట్టితెచ్చుసమయంబున నిట్లనియె.

292

సీ.

తామ్రశేఖరమనఁ దనరు పురంబున
        వృషకేతుఁ డనియెడు వృషలసుతుఁడు
హరికూఁతురగు కందుకావతి మోహించి
        తోకొని మఱియొకత్రోవ నరుగ
నడవిలోఁ దస్కరు లడ్డగించిన వారి
        వధియించి యొకపురవరము చేరి
కోమలి నొకపాడుగుడిలోన నునిచి యా
        కటికి నన్నముఁ దేర గవని చొచ్చి


తే.

యరుగుచో సుమ యనియెడు నాఁటదొకతె
యన్న మిడియెదరమ్మని యతనిఁ గొనుచుఁ
దనకు నేలికసానైన తరుణిఁ గూర్చ
నిందురేఖను గలిసి వాఁ డింతి మఱువ.

293


తే.

కందుకావతి యాగుడికడనె యుండ
వైశ్యుఁడొక్కఁడు గొనిపోయి వనితఁజూడ
యెలుకలను జంపి తనసత్త్వ మెన్నుకొనిన
బూర్వనాథుని విజయంబు బుద్ధి దలఁచి.

294


వ.

వైశ్యుం డధముండని వానిఁ గలయరోసి ప్రాణంబు విడిచిన వైశ్యుండును దనధనంబు రా జపహరించునని దానంబుచేసి యర్థనాశం బయ్యెనని చచ్చె నంత.

295


ఆ.

ఇందురేఖ మఱచి కందుక మఱచు ట
న్యాయ మనుచు శూద్రుఁ డాత్మఁ దొరఁగె
నింతటికిని హేతు వేనని నిలువక
దోసమునకు వెఱచి దాసిచచ్చె.

296


వ.

వీరిలో నెవ్వరిమరణం బధికం బనిన విక్రమార్కుం డిట్లనియె.

297

..........................
..........................
...........................
...........................

298


వ.

అనిన బేతాళుండు తిరిగిపరచినం బట్టితెచ్చునెడ నొక్కకథ వినుమని యిట్లనియె.

299


సీ.

జనపతి యొకఁడు రాజ్యభ్రష్టుఁడై తన
        సతియుఁ బుత్రియు వెంటఁ జనఁగ నొక్క
యడవిలోన జనంబు లధిపతిఁ గొట్టినఁ
        దల్లియు సుతయు నద్దారి నరుగ
నవ్వల నొకనృపుం డాత్మజుండును దాను
        నడవి నాకాంతల యడుగుచొప్పు
కని పిన్నయడుగులకాంత సుతుండును
        బెద్దయడుగులయింతిఁ బృధ్విపతియుఁ


తే.

గోరఁ బదములు పెద్దవి కూఁతునకును
దానితల్లికి చిన్నపాదములు నగుట
మాటదప్పక వరియింప మానినులకుఁ
బుట్టుసుతులకు నేవావి పుట్టుననిన.

300


క.

తెలియక భూపతి యూరక
నిలిచిన బేతాళు డర్కునికిఁ బ్రీతుండై
పలికెఁ గొనిపొమ్ము వచ్చిన
నలసితిగా యనుచు నొకరహస్యము చెప్పెన్.

301


తే.

వీని నమ్మకు కపటాత్ము వీఁడు నిన్ను
జంపదలపోసి నను దేరఁ బంపె నిన్ను
వాఁడు వధియింపకయె మున్ను వానిఁ జంపి
సిద్ధి పడయుము దేవతచేత ననుచు.

302

క.

భూతలగతిఁ గొనిచన న
బ్బేతాళుం డరుగ యోగి ప్రియ మంది మహా
భూతమున కెఱఁగు మన వసు
ధాతలపతి వలికె నెఱుఁగ దండము వెట్టన్.

303


క.

ఏలాగునఁ బెట్టుదునన
నీలాగునఁ బెట్టుమనుచు నిలపై వ్రాలన్
వాలునఁ దలఁ దెగ నడచినఁ
గూలెన్ యతి దేవి మెచ్చఁ గుంభినినాథున్.

304


వ.

మెచ్చి యాతని సాహసౌదార్యగుణకీర్తు లాచంద్రార్కంబుగా వరం బిచ్చి యనిపినఁ బురంబున కరిగె బేతాళుండును శాపముక్తుండై చనియె ననిన బలీంద్రుండు నారదున కిట్లనియె.

305


క.

శాపం బెవ్వరివలనం
బ్రాపించెను వాని కనిన భవుని రహస్య
వ్యాపారకథలు దుమ్మెద
రూపంబై వీఁడు తనతరుణి కెఱిఁగించెన్.

306


తే.

అది ప్రకాశిత మైన నయ్యభవుఁ డెఱిఁగి
ఖచరుఁ గనుఁగొని బేతాళుగా శపించె
నెవ్వఁ డీప్రశ్న కుత్తర మిచ్చు నీకు
శాపమునుఁ బాయు మపుడనం జనియె వాఁడు.

307


వ.

అని నారదుం డింక నొక్కకథ వినమని యిట్లనియె.

308


మ.

రవివంశంబున నుద్భవించి లవణే(రావత్తదంత)క్షమా
భువనం బొక్కఁడ యేలె వైరినరరాడ్భూరిప్రభావాటవీ
దవవై(శ్వానర)కీలసంతుభితదిగ్దంతిస్ఫురత్కుంభదృ
గ్దివిజాధీశతరంగిణీవిహగుడై కేయూరబాహుం డొగిన్.

309

క.

ఆరాజు మంత్రివర్యుఁడు
దారప్రతిభాసునీతితత్త్వజ్ఞుఁడు గం
భీరమణి భాగురాయణి
శూరగ్రేసరుఁడు చిత్తశుద్ధుం డగుచున్.

310


ఆ.

వసుమతీశుఁ డాత్మవల్లభ యగురత్న
సుందరీరతాభినందుఁ డగుచు
రాజ్యతంత్రవిధులు పూజ్యము గావించి
మత్తుఁ డగుచునున్న మంత్రి యపుడు.

311


క.

ఏకరసమత్తుఁ డయ్యెన్
భూకాంతుం డన్యరుచుల బోధింపఁగ నేఁ
జోక నొకవిధము చూపి వి
వేకము పుట్టింతు ననుచు వేఁగులవారిన్.

312


సీ.

పనిచిన వారు వేచనివచ్చి వినిపించి
        రట చంద్రవర్మ లాటాధివరుఁడు
పుత్రసంతతి లేక పుత్రిక గల్గిన
        పుత్రుగాఁ బెనిచి విచిత్రముగను
వానిపేరు మృగాంకవర్మని యిడియుండఁ
        బ్రతిచూతునని మహారాష్ట్రవిభుఁడు
పైనెత్తివచ్చిన భయఁపడి యున్నవాఁ
        డని చెప్ప విని మంత్రి యతనికడకు


ఆ.

బాంధవంబు దలఁచి బలములఁ దోడుగా
ననిపె చంద్రవర్మ యనుఁగుఁబుత్రుఁ
డచట నుండవలవ దిచటికిఁ గొనుచురం
డనుచు పంప వారు నట్ల సేయ.

313

వ.

భాగురాయణుం డక్కుమారుని వెంటనిడుకొని యక్కన్యం బొందినవాఁడు సార్వభౌముం డగునని విన్నవాఁడు గావున రహస్యంబు వెలిఫుచ్చకయుండి యొక్కనాఁడు.

314


క.

ఆరత్నసుందరీపరి
చారఁ గళావతినిఁ దనవిచారంబునకుం
గోరి సహాయముగా గొని
యారమణికి సరవిఁ జెప్పి యనిపిన నదియున్.

315


వ.

రత్నసుందరికడకుం జని యిట్లనియె. మీ పినతల్లికొడుకు మృగాంకవర్మ తండ్రిపంపునం జనుదెంచి భాగురాయణి యింట నున్నాఁడని చెప్పి యామెయనుమతి వడసి తిరిగివచ్చి భాగురాయణి కెఱింగించుటయును.

316


శా.

అమ్మంత్రీశుఁడు రాజమందిరములో హర్మ్యయంబు గట్టించి య
క్కొమ్మం బెట్టి తదీయచర్య వెలికిం గూఢంబుగా జేసి త
తృమ్మంధంబున రత్నసుందరియు హృత్సంతుష్టి బొందంగఁ దా
నమ్మార్గంబు ఘటించె దూతిక రహస్యాచారగా నిచ్చలున్.

317


వ.

వర్తింపుచుండ భాగురాయణి మేనల్లుఁడయిన సోమదత్తుండనువాఁ డంత నొక్కనాఁడు మామకు నీతికథలు వినుపింవుచు నిట్లనియె.

318


ఆ.

కాంచి వైశ్యు డొండు సంచిబియ్యము వట్టి
సరికి నూనె వోయుసతులు గలరె!
యనుచుఁ దిరగ బురిని నతివలు నవ్వుచుఁ
దైలమిడకయున్నఁ దత్ క్షణమున.

319


వ.

నిప్పచ్చకుండను కోమటిభార్య తైలంబు బోసెదనని వానిం బిలిచి పళ్ళెరంబున బియ్యంబు గొల్చికొని తానును నాపళ్ళెరంబుననే నూనె గొలిచి లాభంబు వొందె గావున.

320

క.

వెలఁదులకు నరులకంటెను
నలుమడి బుద్ధియన ధర వినంబడుచుండున్
దలఁప సుబుద్ధులు గలిగిన
పొలఁతిసుమీ కాపురంబు పొందుగ సేయున్.

321


ఆ.

బుద్ధి గలుగవలయుఁ బురుషున కదియుఁ ద
త్కాలవృత్తియైనఁ గలుగు ఫలము
తలఁచినపుడెబుద్ధి తలకొనకుండిన
హానివచ్చుగాన నది యబుద్ది.

322


వ.

అదియెట్లనిన.

323


క.

దక్షుఁడను విప్రుఁ డొకతెను
వీక్షించిన మ్రొక్క, దానివిభు డెఱిఁగి ద్విజున్
లక్షించి చంపఁజూచిన
నక్షణమున నెఱిఁగి మ్రొక్కె నాశలకెల్లన్.

324


క.

అది జపముతోఁడి మ్రొక్కని
మది దలఁచిన భటుఁడు చనియె మానినియును స
మ్ముదమును బొందెను జూచిన
నదివో! తత్కాలబుద్ధి, హాని నడంచున్.

325


క.

తమకార్యము నడపెడును
త్తముఁ డీతం డనుచు జనులు తము నాసింపన్
తమకార్య మెపుడు వదలక
తమకార్యమె నడుపుచుండ్రు దత్త్వవిధిజ్ఞుల్.

326


వ.

అది యెట్లనిన.

327

సీ.

పీఠికాపురమున బింబోష్ఠిచతురిక
        యనువారసతి దానియనుఁగువిటులు
మంత్రిపుత్రుండు కోమటినందనుండును
        దలవరిసుతుఁడును దస్కరుండు
గలరు నల్వురు గజగమన యందఱకును
        గూరిమిగల యట్ల కూట మిచ్చు
నీరీతి మెలఁగంగ నిందఱికిని నొక్క
        ధరణిసురుండు ప్రధానసఖుఁడు


తే.

గలఁడు వాఁ డొక్కనాఁడు తత్కాముకులను
కాంత కెవ్వరిపై కూర్మిగలదు నలువు
రందునని యొక్కరొకని నేకాంతమునను
జెప్పుమనుటయు వేర్వేఱఁ జెప్పి రపుడు.

328


క.

వారిజముఖి తనమీఁదనె
కూరిమి గలదనుచు దాని గుణములు వొగడన్
వారల నడిగినరీతినె
వారాంగన నడుగ విప్రవరునకు ననియెన్.

329


సీ.

కౌఁగి లొక్కని కిచ్చుఁ గామించు నొక్కని
        నలుఁగు నొక్కనితోఁడఁ గలియు నొకనిఁ
బలుకు నొక్కనితోఁడఁ బులకించు నొక్కని
        దక్కించు నొక్కనిఁ దగులు నొకని
నొకని రమ్మిని పిల్చు నొకని కాసలు చూపు
        కనుసన్న నొకనికిఁగాఁక సేయు
నమ్మించు నొకనిఁ బంతము చెప్పు నొకనికి
        మ్రొక్కు వేఱొక్కనిదిక్కు చూచుఁ

తే.

తడవు నొక్కని మనమునఁ దలఁచు నొకని
వన్నె యొకనికి నొకనికి వలపుఁ జెప్పు
నింట నొకఁడుండ నొకని బొన్నింట(?) గలయు
వారవనితలఁ దెలియ నెవ్వారు గలరు.

330


క.

పెక్కుబొజుంగుల మెలఁపిన
యక్కామి యేలఁ దక్కు నన్యునకును దా
దక్కఁగఁ దలఁచిన పసిఁడికి
దక్కును నది లేకయున్నఁ దక్కకతక్కున్.

331


శా.

సాక్షా న్మన్మథుఁ గూడి యిష్టగతులన్ సంభోగముల్ సల్పినం
దాక్షిణ్యంబునఁ గూడియున్నతఱి భేదంబొంది హేమాంబరా
పేక్ష న్నిల్వ కుబేరునిం గలసి చూపెం గూర్మి కామాంధయై
దాక్షారామమునందు నొక్కసతికాంతల్ పేదకుం గూర్తురే.

332


వ.

అట్లు గావున ధనంబుదక్క దక్కినమోహంబులు లేవనిన విప్రుండు నవ్వుచుం జనియె నంత.

333


సీ.

జనపతిచెలికాఁడు చారాయణుఁడు రత్న
        సుందరిదూతితోఁ గందువెట్టి
యిరువురు జగడింప నింతు లిద్దఱుఁ గూడి
        తమలోనఁ దలపోయఁ దరుణి యోర్తు
పలికె నిట్లని భూమిపతిసఖుతోఁడ మే
        ఖల కేల కలహింపఁ గారణంబు
పోరినయిండ్లనుఁ బొరుగులు మనవని
        చెప్పెడుమాట నిశ్చితముగాదె


తే.

వీరిజగడంబు మాన్ప నెవ్వారితరము
సరట[12]గజయుద్ధమునఁ దొల్లి జైనపల్లె
తోఁడ గూడంగఁ గాసారతోయజములు
నాశమును బొందె ననిన నన్నాతి యనియె.

334

వ.

అది యెట్లనిన.

335


ఆ.

గంధదంతి యుకటి కాసారతటమునఁ
గరము నిలుప (నొక్క)సరట మెగిచి
సరభసమునఁ బారి గరితుండరంధ్రంబుఁ
జొచ్చుటయును దంతి చురుకుపుట్టి.

336


శా.

కాసారంబు గలంచి వారిరుహసంఘాతంబు భేదించి త
ద్గ్రాసంబుల్ విదళించి జైనచయమున్ ఖండించి పంకేరుహా
వాసం బప్పుడు (జొచ్చినన్) సరట మావ్యాజంబుగాఁ బాసినన్
నాసాద్వారము నొప్పి మానుటయు నన్నాగంబు బోయె న్వడిన్.

337


వ.

అనిన మఱియొక ర్తిట్లనియె.

338


క.

అధములకైనను గలహపు
విధ మొప్పదు కీడు పుట్టు వినుమా యొకచో
మధుబిందుకలహమున జన
వధ ప్రాప్తంబైన యట్లు వసుమతిలోనన్.

339


వ.

అది యెట్లనిన.

340


సీ.

బోయ యొక్కఁడు లాటపురవీధిఁ దేనియ
        కుండఁ దేరఁగ మదకుంజరంబు
దరిమిన వాఁడు దత్తరమున దలఁగఁగఁ
        దొలఁకి యాతేనియ చిలుకఁజేరు
మక్షికంబులబట్టి భక్షింప నొకయీఁగ
        పులి చేర బల్లి యప్పులినిఁ దిన్న
నాబల్లి నొకపిల్లి యాహారమునుఁ జేయ
        నాపిల్లి నొకకుక్క యలమి కఱచె

తే.

నాఖుభుక్కునుఁ బెంచిన యతఁడు కుక్క
బొడిచె నాకుక్క నేలిన బోయవాఁడు
కుక్కఁబొడిచిన యాతని మక్కఁజేసె
పోరు ఘనమయ్యె నప్పు డప్పురము నడుమ.

341


క.

క్షితిపతి పో రుడుపఁగఁ దా
నతివేగమె సైన్యసహితమై వచ్చిన భూ
పతికిని బురజనులకు సం
యతి[13]ఘోరంబైన మడసి రందఱు నచటన్.

342


క.

పలువురు గలహము సేయఁగ
నిలిచి కనుంగొనఁగవలదు నేరమి వచ్చున్
గలహించువారిఁ గూడిన
బలవంతునకైన మానభంగము దెచ్చున్.

343


వ.

అట్లు గావున మన మచ్చట నుండవలదని ప్రధాని కవ్విధం బెఱిఁగించుటయును.

344


ఆ.

సచివశేఖరుండు చాగణరాయనిఁ
బిలువఁబంచి వానిఁ బ్రీతుఁ జేసి
పూని మేఖలకును మానభంగము సేయు
మనిన వాఁడు చనియె నక్షణంబ.

345


విలసితము:

కపటసఖ్యమునుఁ గామినితోఁడన్
(శపథ)యుక్తముగ జాగణరాయం
డుపమ మీరి సరసోక్తుల తోఁడన్
నృపతి యాత్మగరుణింపగ జేసెన్.

346


వ.

అంత నొక్కనాఁడు.

347

ఆ.

తనదుపుత్రుఁ డనుచు దాసిపుత్రునిఁ దెచ్చి
ప్రేమ మేఖలకునుఁ బెండ్లి సేయఁ
బడఁతి యెఱిఁగి మానభంగంబునకు రోసి
రత్నసుందరియును రాజు గూడి.

348


వ.

ఉన్నయవసరంబున నడుగులం బడి తనమానభంగంబు విన్నవించిన నూరకున్న నది రాజకృత్యంబని కోపించి రత్నసుందరి యతఃపురంబున కరిగిన నక్కేయూరబాహుండు విరహభ్రాంతచిత్తుండై మధ్యమకుడ్యకుహరస్తంభవేదికాస్థలంబున విచారనిద్రాలసుండై యున్న సమయంబున నిద్దఱుదూతికలు తమలో నిట్లనిరి.

349


క.

చారాయణుండు మెల్లన
నారీమణి మేఖలకును నచ్చినగతి నే
పోరామి చేసి మానము
దూరము గావించె నిట్టిధూర్తుడు గలఁడే.

350


వ.

అనిన మఱి రెండవ దిట్లనియె.

351


ఆ.

చేరఁదగనివానిఁ జేరుచుకొన్నను
ప్రాణమానహాని ప్రాప్త మగును
కాకిఁ జేర్చుకున్న గాదె హంసకు మున్ను
ప్రాణహాని యగుట పద్మనయన!

352


వ.

అది యెట్లనిన.

353


ఆ.

చిత్రకూటనగము(శిఖరము)నందును
హంస లున్నవేళ నచటి కొక్క
కాకి చేర నచటఁ గా లూఁదనిచ్చిన
రెట్టవెట్ట మఱ్ఱిచెట్టు మొలిచె.

354

వ.

కాలక్రమంబునం బెరిగి యూడలుదట్టి భూస్థలంబువమోఁచి యుండుటయును.

355


ఆ.

ఒక్కబోయ యెక్కి యురియొడ్డి హంసలఁ
బట్టి మెడలు దునిమి చట్టిబెట్టి
బంధుజనులుఁ దాను భక్షించె గావున
చేరదగనివానిఁ జేర్పఁదగదు.

356


వ.

అనిమఱియు నిట్లనియె.

357


క.

అతివినయం బత్యంతము
వ్రతపరిచయ మధికమిత్రవాత్సల్య మతి
స్తుతి చేయుట యివి ధూర్త
ప్రతతికిఁ జిహ్నములుఁ దెలియరా దెవ్వరికిన్.

358


వ.

అది యెట్లనిన.

359


సీ.

ఒక్కబ్రాహ్మణుపత్ని యుత్పలదళనేత్ర
        పతి దప్పఁగను గొల సుతునినైన
నని నేత్రములు గట్టికొని పతి కనయంబుఁ
        బ్రతిలేనివినయసద్భక్తి సలుప
నతఁ డెచ్చటికినైన నర్థింపఁబోయిన
        గోకలు గుంజు నచ్చాకివానిఁ
బొందుచునుండ నప్పొరుగువార లెఱింగి
        విప్రున కెఱిఁగింప విధము దెలియ


తే.

నూరి కరిగెద ననుచు నయ్యువిద యెఱుఁగ
కుండ నట్టుగుమీఁద గాచుండు? నంతఁ
గోక దెచ్చిన చాకలిఁగూడఁ జూచి
విప్రుఁ డక్కాంత నక్కడ విడిచిపోయె.

360

వ.

అని సల్లాపంబులు సేయుచు మఱియొకర్తి యిట్లనియె.

361


క.

అవివేకి పొందుకంటెను
వివేకముగల జనుతోడి విరసం బొప్పున్
భువనామరు రక్షింపఁడె
వివేకమునఁ దస్కరుండు వింధ్యవనమునన్.

362


వ.

అది యెట్లనిన.

363


ఆ.

బందుగుండు రాఁగ బ్రాహ్మణుఁడొక్కండు
ధనము లేక నతని తమ్ముఁ డున్న
పురికి నరిగి లేమి పరిపాటి నెఱిఁగించి
ధనము వేడుటయునుఁ దమ్ముఁ డపుడు.

364


వ.

ఒక్కయమూల్యం బైనరత్నం బొసంగి పొమ్మని యనిపిన నతం డారత్నంబు మ్రింగి పయనంబై పోవ నొక్కపాటచ్చరుం డెఱింగి పథంబున బ్రాహ్మణు వధియించి రత్నం బపహరింతునని వెంటనె చనుచున్న చోరుండు బ్రాహ్మణుం జూచి యిట్లనియె.

365


ఆ.

నీవు మ్రింగినట్టి నిర్మలరత్నంబు
నాకు నిమ్ము యీక యూరకున్న
పొట్ట వ్రచ్చియైనఁ బుచ్చుకొందునుఁ దాని
నన మలిమ్లుచునకు ననియె ద్విజుఁడు.

366


క.

నీకడువు రత్నదశకము
నాకీయకయున్న నడుము నరకెద ననుచున్
వాకోపవాక్యములఁ బెను
పోకలు పోవంగ నచటఁ బొందిన చోరుల్.

367


వ.

ఇరువురిమాటలు విని దొంగం జంపి పదిరత్నంబులును, బ్రాహ్మణుఁ జంపి రత్నంబునుం బుచ్చుకొందమని యాయిద్దఱినిం బట్టికొనుటయు.

368

క.

తనచావు దప్ప దీబ్రా
హ్మణు గాచెదఁ జావకుండ నది యెట్లనినన్
మును విప్రుఁ జంపి మణి గొని
నను జంపకమానరని మనంబున దలఁచెన్.

369


వ.

అని తలంచి యచ్చోరుండు దొంగలతో నిట్లనియె.

370


ఆ.

బ్రాహ్మణుండు నాకు బావ నేమఱఁదిని
హాస్యభాషణంబు లాడుకొనఁగ
సత్య మనుచు దలఁచి చంపెదరైతి
నన్నుఁ జంపి మణులు గన్న పిదప.

371


క.

మఱి విప్రుఁ జంపుడనఁ ద
స్కరునిన్ వధియించి వానిజఠరములోనన్
వరమణులు లేకయుండిన
ధరణీసురు గాఁచి చనిరి తస్కరజనముల్.

372


క.

అవివేకి చెలిమికంటెను
వివేకి యెడ వైర మొప్పు విపినంబున భూ
దివిజుని గాచెం జోరుం
డవనీశుఁడు క్రోఁతిచేత హతముం బొందెన్.

373


వ.

అది యెట్లనిన.

374


సీ.

ఒకనాఁడు నృపతి వేఁటకు నేఁగి మర్కట
        శిశువునుఁ దెచ్చి పోషింపఁ బెరిగి
యదియు వర్ధన బొంది యధిపతిహితచర్య
        వర్తింప నాసన్నవర్తిఁ జేసి
ఖడ్ల మొక్కటి దానికరమున కందిచ్చి
        యేనిద్ర బొందెద నీవు నన్ను
బోతుఁటీఁ గైననుఁ బొలయంగ రాకుండ
        గాచుండు మెవ్వరేఁ గదిసిరేని

ఖండనము చేయుమనిన నక్కపియు నట్ల
యుండి భూపతి నిద్రింప నొక్కయీఁగ
ముట్టుటయు ఖడ్గమున దాని బెట్టుగొనిన
గళము దెగుటయుఁ బ్రాణసంగతికిఁ బాసె.

375


వ.

అట్లు గావున.

376


క.

అవివేకి చెలిమికంటెను
వివేకి యెడవైర మొప్పు విపినంబున భూ
దివిజుని గాచెనుఁ జోరుఁడు
ప్లవగముచే నృపతి చచ్చె భవనమునందున్.

377


వ.

అట్లు గావున నవివేకియైన మేఖలతోఁడిపొందు చారాయణునికి[14] వలదని చెప్పుకొని రంత.

378


ఆ.

భాగురాయణుండు పనిచెం గళావతి
కపటవర్తనంపుగతులు చెప్పి
యదియు నామృగాంక కవ్విధం బెఱిఁగించి
లలితమణులచే నలంకరించి.

379


సీ.

అల్లనఁ దోకొని యరిగి భూపతి నిద్ర
        చెందినయవ్వేదియందు నిల్పి
నీమణిహారంబు నృపతికంఠమ్మునఁ
        బెట్టు మాతఁడు నిన్నుఁ బట్టెనేని
రత్నసుందరికి వెఱతువు నీవని, బోలు
        గంభంబుఁ జొచ్చి చీఁకటిని నిలువు
మనుచు బోధించియు నామృగాంకను బాసి
        చని కళావతి యొక్కచక్కి నున్న

తే.

నామృగాంకయు నటువలె నాచరించి
తలఁగుటయు లేచి యభ్బూమితలవిభుండు
రత్నసుందరిమీఁదను రక్తి గొంత
వదలి యక్కాంతపై నిలువంగ జేసె.

380


వ.

అంత ప్రభాతంబైన సర్వసఖుండైన చారాయణుని రప్పించి రాత్రివృత్తాంతం బెఱంగించిన నతం డిట్లనియె.

381


మాలిని:

లాటనరేశ్వరపుత్రుఁడు గా దది లక్షణభార్యవిశేషలస
త్పాటలగంధి మృగాంకవతీయను పద్మవిలోచన దేహకళా
హాటకరేఖ మనోహరరూప బ్రియంబున బెండిలియాడుము నాఁ
జాటకునిం గొనియాడి తదీయవిచారము చేయుచునున్నతఱిన్.

382


వ.

భాగురాయణుండు కళావతిం బిలిపించి రత్నసుందరికి హితుండునుఁ బోలె మేఖలామానభంగంబునకుం బ్రతీకారంబుగా మృగాంకవర్మను నాడురూవు గాఁబన్ని కేయూరబాహునకుం బెండ్లి జేయుదమని రత్నసుందరికి వినుపింపుమని పంచుటయును.

383


క.

అది పోయి యట్ల చెప్పిన
మది సంతస మంది యిదియ మార్గం బనుచున్
మదవతి మృగాంకరేఖను
విదితముగా బెండ్లి చేసి విభునకు నంతన్.

384


క.

తనయుఁడని మున్ను మీ యొ
ద్దను బెట్టినవాఁడు గన్య తత్కన్యను మీ
జనపతికి నిమ్ము నా కొక
తనయుం డుదయించె నీకుఁ దమ్ముం డగుచున్.

385


క.

అని లేఖఁ ౙదువ నాసతి
విని లజ్జాఖేదదశల విస్మయపడుచున్
జనుని వెఱపింతు తాఁ
................................

386



వ.

అని రత్నసుందరి ధైర్యంబవలంబించియుండెఁ గావున.

387


క.

రాజును రాష్ట్రము నిల్పెను
రాజితముగ మంత్రి భాగురాయణుఁడు మహిన్
బూజయుఁ బుణ్యముఁ బడసెను
నైజముగా నెల్లవారు నమ్ముచు నుండన్.

388


ఉ.

హాటకనేత్ర! నేత్రకలితాబ్జ దివాకర! వాకరక్రియా (?)
పాటవరూప! రూపజితబంధుర కంధర! కంధరావృతా
చ్ఛోటితరత్న(?) రత్ననిధిసుందర భవ్యనివాస! వాసవ
క్ష్మాటన! కుంటముక్ల పినభైరవమానసపద్మభాస్కరా!

389


క.

శ్రీమద్వేంకటశైలమ
హీమండల సార్వభౌమ! హేమాంబర! సు
శ్రీమహిత! పిన్నభైరవ
ధీమానసనాథ! వినుతధిషణసనాథా.

390


కవిరాజితము:

కమలవిలోచన! కౌస్తుభభూషణ! కంజభవా
ద్యమరగణార్చిత! నాకమునీశసమాశ్రయ! శ్రీ
రమణి మనోహర! రాక్షససంహర! రక్షణ చి
త్రముదిత గంగయభైరవపాత్ర శుభస్థిరదా.

391


గద్య:

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయ ప్రణీతంబైన సకలనీతికథా నిధానంబను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

392

  1. పెంపుడుపక్షులను విడిచి పట్టెడు వేఁట.
  2. [వ్రేవిల్లెలోగల గోపకాంతారతి తేర జూరాడినదిట్టకాఁడె
    తన పుత్రుడగు నరకుని జంపి యాతని లలనలజేకొన్న ఖలుఁడుగాఁడె
    ఉరవుగ చైద్యునకొసగినకన్యక పెండ్లియాడినమహాపెద్దగాఁడె
    కపటవిప్రుని రూపు గైకొని మాగధు దునుమబంచినయట్టిదోషిగాఁడె]
  3. మానిపుచ్చి
  4. ఘర్మలిప్త
  5. చేసినది సన్న యది గాని చెఱపు గాదు
  6. వింటే
  7. తలింకిశారియో
  8. రాగ
  9. సూర్యోదయ అనుటలో ప్రాస చెడినది, “ సూరోదయ" అనుట బాగుగనుండును.
  10. కుంజరాశన = రావిచెట్టు
  11. "నిన్ను ననిన నృపతి శీఘ్రమునను" అని గ్రంథపాఠము యతిభంగముగా కన్పించుచున్నది.
  12. సరట = తొండ
  13. జయతి = యుద్ధము
  14. చారాయణుఁడే చాగణరాయఁడు.