సకలతత్వార్థదర్పణము/‌ద్వితీయ నిరుక్తము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

అస్మద్గురుభ్యోన్నమః.

శ్రీమ న్నారాయణ సచ్చిదానంద పరబ్రహ్మణేనమః.

సకతత్వార్థదర్పణము.

ద్వితీయ నిరుక్తము.

షట్‌సంఖ్యా ప్రకరణము.

1. భగవచ్ఛబ్దార్థ షడ్గుణైశ్వర్యములు.

2. మరియొకవిధ షడ్గుణైశ్వర్యములు.

3. మరియొకవిధ షడ్గుణైశ్వర్యములు.

4. షట్‌చక్రముల వివరము.

మూలాధారము, స్వాధిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధచక్రము, ఆగ్నేయచక్రము యీ5న్ను షట్‌చక్రము లనబడును. పుట:SakalathatvaDharpanamu.pdf/74 పుట:SakalathatvaDharpanamu.pdf/75 68

6. షడ్భావములు.

పదార్థము, భావమని అభావమని రెండు విధములు. అందు భావం బారు విధంబులుగా జెప్పంబడు. నదెట్లనిన,

ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయము ఇవి 6న్ను భావమని జెప్పబడును.

7. షడ్విధశక్తులు.

సర్వస్వతంత్రశక్తి, నిత్యమలుప్తశక్తి, అనంతశక్తి, అనాదిబోధశక్తి, సర్వజ్నత్వశక్తి, నిత్యతృప్తిత్వశక్తి యీ6న్ను షడ్విధశక్తు లనంబడును.

8. షడ్విధసమాధులు.

పుట:SakalathatvaDharpanamu.pdf/77
9. షడూర్ములు.

క్షుద, తృష్ణ, శోకము, మోహము, జననము, మరణము యీ 6న్ను షడూర్ము లనంబడును.

10. షడ్భావవికారములు.

జాయతే, అస్తితే, పరిణమతె, వర్ధతె, వివక్షయతె, వినస్యతె యీ6న్ను షడ్భావవికారము లనంబడు.

11. అరిషడ్వర్గములు.

కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము యీ6న్ను అరిషడ్వర్గము లనబడును.

12. షడ్విధ జితేంద్రియములు.

అజిహ్వుడు, షండుడు, పంగుడు, అంధుడు, బధిరుడు, ముగ్ధుడు యీ6న్ను షడ్విధజితేంద్రియు డనబడుదురు. 71

13. షడ్విధ లింగములు.

72
14. షట్కౌశికములు.

త్వక్కు, రుధిరము, మాంసము, అస్తి, మజ్జ, స్నాయువులు ఈ6న్ను షట్కౌశికము లనంబడును.

15. షష్టప్రకృతులు.

భూతపంచకము, జ్నానేంద్రియపంచకము, కర్మేంద్రియపంచకము, విషయపంచకము, అంత@కరణచతుష్టయము, సప్తధాతువులు యీ6న్ను షష్టప్రకృతులు.

16. షడ్గుణైశ్వర్యములు.

73
17. అరిష్డ్వర్గజననవినాశహేతువులు.

18. షణ్మతములు.

వైష్ణవము, శైవము, శాక్తము, గాణాపత్యము, సౌరము, కాపాలము ఈ6న్ను షణ్మతము లనంబడును. ఈ షణ్మతములచేత ఆత్మ దెలియబడదని తెలియుటే ఫలము. ఈ షణ్మతములకు తాత్పర్యము బహుళంబై యుండుటచే గ్రంథవిస్తారభీతిని నిందు దెలుపలేదు.

19. షట్కర్మలు.

యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దాసము, ప్రతిగ్రహము యీ 6 న్ను షట్కర్మము లనంబడును. ఈ షట్కర్మముల వలన మోక్షము లేదని తెలియుటే ఫలము.

20. షట్‌శాస్త్రములు.

తర్కము, వ్యాకరణము, ధర్మశాస్త్రము, మీమాంసము, వైద్యశాస్త్రము, జ్యోతిషము యీ6న్ను షట్‌శాస్త్రము లనంబడును.

21. షడ్రసములు.

మధురము, ఆమ్లము, లవణము, తిక్తము, కటు, కషాయము యీ6న్ను షడ్రసము లనంబడును. ఈ రసములను ఆత్మ సాన్నిధ్యమందుండు బుద్ధిరసేంద్రియ ద్వారా విభజించి యెరుగుచున్నదని తెలియుటే యీ విచారమునకు ఫలము. 74

22. షడభీజ్నత్వము.

దివ్యద్రుష్టి, దివ్యశ్రోత్రము, పూర్వనివాస్థానుస్మృతి, పరచిత్తజ్నానము, అప్రత్యక్షవిషయజ్నానము, వియద్గమనాగమనవియోగాది లక్షణమైన బుద్ధి యీ6న్ను షడభిజ్నత్వ మనబడును.

సప్తసంఖ్యా ప్రకరణము

1. సప్తధాతువులు.

రసము, రుధిరము, మాంసము, మేదస్సు, మజ్జ, శుక్లము, అస్తి యీ7న్ను సప్తధాతువు లనంబడును.

ప్రాణాయామాదియోగాభ్యాసమువలన ఈషధభిజిత్వముగలుగు నని తెలియుటే యీవిచారమునకు 
2. సప్తవ్యసనములు.

తనువ్యసనము, మనోవ్యసనము, ద్రవ్యవ్యసనము, రాజ్యవ్యసనము, విశ్వాసవ్యసనము, వుత్సాహన్యసనము, కలహవ్యసనము యీ7న్ను సప్తవ్యసనము లనంబడును.

3. సప్తావస్తలు.

అజ్నానము, ఆవరణము, విక్షేపము, పరోక్షము, అవరోక్షము, అనర్ధనివృత్తి, ఆనందావాప్తి యీన్ను సప్తావస్త లనంబడును.

అగ్నానము--భానుడయిన ఆత్మ సంసారమందాసక్తి గల
4. సప్తాజ్నానభూమికలు.

బీజజాగ్రము, జాగ్రము, మహాజాగ్రము, జాగ్రత్స్వప్నము, స్వప్నము, స్వప్నజాగ్రము, సుషుప్తి యీ7న్ను సప్తాజ్నానభూమికలు.
5. సప్తజ్నానభూమికలు.

సుఖేచ్ఛ, విచారణ, తనుమానని, సత్వాపత్తి, సంసక్తినామిక, పదార్థభావన, తురీయ్యము యీ7న్ను సప్తజ్నానభూమిక లనబడును.
6. సప్తవిధ బుద్ధనిరూపణ.

పండ, మేధ, చార్వి, చత్వ, గృహీత, శ్రౌతి, ప్రతిభ యని వక బుద్ధియే యేడు విధములుగా జెప్పంబడు.
7. మరియొకవిధ సప్తజ్నానభూమికలు.

సుఖేచ్ఛ, ఆత్మవిచారము, నిస్సంగము, వాసనాక్షయము, ఆనందిని, తూర్యము, తూర్యాతీతము యీ 7 న్ను సప్తజ్నానభూమిక లనబడును.

8. సప్తవిధ చైతన్యములు.

శుద్ధచైతన్యము, ఈశ్వరచైతన్యము, జీవచైతన్యము, ప్రమాతచైతన్యము, ప్రమాణచైతన్యము, ప్రమేయచైతన్యము, ఫలచైతన్యము యీ 7 న్ను సప్తవిధ చైతన్యము లనంబడును.
9. సప్తావరణములు.

10. సప్తావరణముల వివరము.

పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము యీ7న్ను సప్తావరణము లనబడును.

11. మరియొకవిధ సప్తావరణములు.

12. మరియొకవిధ సత్పధాతువులు.

చర్మము, రక్తము, మాంసము, మేదస్సు, శల్యములు, మజ్జ, శుక్లము యీ7న్ను సప్తధాతువులని కొంద రందురు.

13. మరియొకవిధ సప్తవ్యసనములు.

వేటాడుట, జూదమాడుట, సురాపానముజేయుట, స్త్రీలోలుడగుట, కఠినవాక్యంబు బలుకుట, కఠినదండంబు జేయుట, కానియీవియిచ్చుట యీ7న్ను సప్తవ్యసనము లనంబడును.

14. సప్తమండలములు.

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు యీ7న్ను సప్తమండలము లనబడును.

15. సప్తసంతానములు.

సత్కుమారుని గాంచుట, తటాకము వేయించుట, కావ్యంబు రచించుట, కోటికి పడిగెత్తుట, గుడి కట్టించుట, వనము వేయించుట, సద్బ్రాహ్మణులకు జీవనాధారంబులు గల్పించుట ఈ7న్ను సప్తసంతతు లనంబడును.

యీసప్తసంతతులతో నేదైననోకటిం జేసినవాడు తన నూటొక్క కులమువారిని నరక విముక్తులంజేసి స్వర్గంబునకు నడుపుట నిక్కమయినను కావ్యం బిన్నిటికి భూషణంబయినను వీరలకు స్వర్గాది భోగ ప్రాప్తియేకాని శాశ్వత ముఖంబయిన మోక్షంబు గలుగ నేరదని వేదాంతశాస్త్రసిద్ధాంతము.

అష్టసంఖ్యా ప్రకరణము.

1. అష్టప్రకృతులు.

2. అష్టవిధ వైరాగ్యములు.

3. అష్టాత్మలు.

జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్నానాత్మ, మహాత్మ, భూతాత్మ యీ8న్ని అష్టాత్మ లనబడును.

4. మరియొకవిధ అష్టతనువులు.

పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఆత్మ, సూర్యుడు, చంద్రుడు యీ8న్ని అష్టతనువు లనంబడును.

5. అష్టతనువుల అధిష్టానదేవతలు.

పృధికి భవుడు, జలమునకు సర్వేశ్వరుడు, అగ్నికి రుద్రుడు,
6. అష్టమదములు.

ధనమదము, విద్యామదము, కులమదము, శీలమదము, రూపమదము, యవ్వనమదము, రాజ్యమదము, తమోమదము యీ8న్ని అష్టమదము లనంబడును.

7. అంతరంగాష్టమదము.

పృథివిమదము, జలమదము, అగ్నిమదము, వాయుమదము, ఆకాశమదము, ఆత్మమదము, సూర్యమదము, చంద్రమదము ఈ8న్ని అంతరంగాష్టమదములు.
8. అష్టాంగయోగములు.

యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి ఈ8న్ని అష్టాంగయోగము లనంబడును. పుట:SakalathatvaDharpanamu.pdf/92 పుట:SakalathatvaDharpanamu.pdf/93 పుట:SakalathatvaDharpanamu.pdf/94
10. అష్టపాశలక్షణము.

దయము, జుగుప్సము, మోహము, భయము, సంశయము, కులము, బలము, శీలము యీ8న్ను అష్టపాశలక్షణ మనబడును.
11. ప్రణామోష్టాంగలక్షణము.

ఉదరము, శిరము, ద్రుష్టి, మనస్సు, వచనం, పాదములు, హస్తములు, కర్ణములు యీ8న్ని ప్రణామోష్టాంగలక్షణ మనంబడును.

12. అష్టవిధానందవేశనము.

బ్రహ్మానందము, వాసనానందము, విషయానందము, ముఖ్యానందము, ఆత్మానందము, అన్వయానందము, నిజానందము, విద్యానందము యీ8న్ని అష్టవిధ ఆనందము లనంబడును.

13. అష్టవిధగురువులు.

బోధక, వేదక, నిషిద్ధ, కామ్యక, సూచక, వాచక, కారణ, విహిత యీ8న్ని అష్టగురువు లనంబడుదురు.
14. ప్రాణాష్టవిధలక్షణము.

తత్వసంఖ్య, శ్వాససంధి, స్వరచిహ్నము, షానములు, తత్వవర్ణనములు, ప్రణవము, స్వరసంయుక్తము, గతిలక్షణము యీ8న్ని ప్రాణాష్టవిధము లనంబడును.

15. అష్టవిధదేవసర్గములు.

విబుధులు, పిత్రుదేవతలు, సురాదులు, గంధర్వాప్సరసలు, యక్షరక్షస్సులు, భూతప్రేతపిశాచంబులు, సిద్ధచారణవిద్యాధరులు, కిన్నరకింపురుషులు యీ8న్ని అష్టవిధదేవసర్గము లనంబడును.

16. అష్టావధానములు.

చతురంగము, కవిత్వము, వ్రాయుట, చదువుట, గణితము, సంగీతము, యుక్తిజెప్పుట, వాగనిపుణము ఈ8న్ని అష్టావధానము లనంబడును.

17. అష్టదళపద్మములు.

18. సిరోస్థితాష్ట దిక్పాలకుల పట్టణములు.

భ్రూమధ్యమున దేవేంద్రుని పట్టణము, కుడినేత్రమందు అగ్నిదేవుని పట్టణము, కుడిచెవియందు యమధర్మరాజు పట్టణము, కుడిచెవియొక్క పార్శ్వమున నైరుతి పట్టణము, పశ్చిమభాగంబున వరుణుని పట్టణము, దానికి సమీపమున వాయుదేవుని పట్టణము, యడమచెవియందు కుబేరుని పట్టణము, యడమనేత్రమందు యీశాను డైన యీశ్వరుని పట్టణము ఈ8న్ని సిరోస్థితాష్టదిక్పాలకుల పట్టణములు.

19. మాయాశక్తాష్టవిధము.

పృథివితన్మాత్ర గంధగుణము, ఉదకతన్మాత్ర రసగుణము, అగ్నితన్మాత్ర రూపగుణము, వాయుతన్మాత్ర స్పర్శగుణము, గగనతన్మాత్ర శబ్దగుణము, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ8న్ని మాయాశక్తాష్టవిధ మనబడును.

20. శోకకారణాష్టకము.

ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము. సమానము, వాక్కు, మనస్సు, బుద్ధి ఈ 8 న్ని దుఃఖములకు కారణము7 లగుటచే శాకకారణణాష్టకమనబడును.

21. వుర్యష్టకము.

జ్నానేంద్రియంబులును, కర్మేంద్రియంబులును, అంతఃకరణచతుష్టయంబును, ప్రాణాదిపంచకంబును, వియదాదిపంచకంబును, కామమును, కర్మంబును, తమస్సు యీ8దియును వుర్యష్టక మనబడును.

22. అష్టతనువులు.

స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము యీ4న్ను జీవసంబంధమైన తనువులు.

విరాద్రూపశరీరము, హిరణ్యగర్భశరీరము, అవ్యాకృతశరీరము, మూలప్రకృతిశరీరము యీ4న్ను ఈశ్వరసంబంధమైన శరీరములు. ఈ అన్నియుంగూడి అష్టతనువు లనంబడును.అందు, స్తూలము--ఇరువైఅయిదుతత్వములతో గూడియుండునది స్తూలమనంబడు.

ఇందు కవస్ద, జాగ్రత్త, నేత్రములు స్దానము, యుక్తభోగము, క్రియాశక్తి, రాజసగుణము, విశ్వు డభిమాని, అకారముమాత్రుక, ఆత్మ జీవాత్మ.

సూక్ష్మశరీరము -- పదియేడుతత్వములతో గూడి యుండునది సూక్ష మనబడును.

ఇందు కవస్ద, స్వప్నము, కంకస్దానము, ఇచ్చాశక్తి, తెజనుండభిమాని, సాత్వికగుణము, ఉపకారము మాత్రుక, స్వేచ్చాభోగము, ఆత్మ అంతరాత్మ.

కారణశరీరము -- సర్వేంద్రియ వ్యాపార శూన్యమైయుండునది కారణమనంబడును.

ఇందు కవస్ద, సుషుప్తి, హ్రుదయస్దానము, ప్ర్రాజ్ఞ డభిమాని, ద్రవ్యశక్తి, ఆనందభోగము, తామసగుణము, మకారము మాత్రుక, యిందులన్యాప కాత్మ పరమాత్మ యీ సౌజ్ఞలు గలది. కార్యరంగము.

మహాకారణశరీరము -- పంచబ్రహ్మలు, పంచశక్తులు,పంచకళలు, పుట:SakalathatvaDharpanamu.pdf/100
23. అష్టతనుచక్రము.

నవసంఖ్యా ప్రకరణము.

1. నవవిధ సంస్కారములు.

జ్నాత్రు, జ్నాన, జ్నేయము, కర్మ, కర్తృ, క్రియలు, భోక్తృ, భోజ్య, భోగము యీ9న్ని నవవిధసంస్కారము లనబడును.

2. పక్షాంతర నవవిధ సంస్కారములు.

ప్రాణపంచకము, జ్నానేంద్రియపంచకము, కర్మేంద్రియపంచకము, భూతపంచకము, అంతఃకరణచతుష్టయము, స్థూలశరీరము, త్రివిధకర్మలు, అవస్థాత్రయము, వీనికి కారణమైన అజ్నానంబునుం గూడి నవవిధసంస్కారము లనంబడు. దీనికే నవవిధప్రపంచమనియు పేరు.

యీ నవవిధ సంస్కారములు అహంకారంబునకే కాని, ఆత్మకు లేవని తెలియుటే యీ విచారమునకు ఫలము.

3. నవవిధ సర్గములు.

4. నవవిధభక్తులు.

శ్రవణము, కీర్తనము, స్మరణ, పాదసేవన, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము ఈ9న్ని నవవిధభక్తు లనంబడును.

5. నవరంధ్రబంధనక్రమము.

6. అంతఃశత్రునవకము.

దంభము, అభిమానము, హర్షము, క్రోధము, కార్యసౌరంభము, శోకము, మోహము, సుషుప్తి, స్వప్నము యీ 9 న్ని అంతఃశత్రునవకము.
7. ప్రణవసౌజ్నానవవిధము.

అక్షరత్రయాత్మకంబును, నాదబిందుకళాత్మకంబును, సృష్టిస్థితిలయకారణంబును, గుణత్రయాత్మకంబును, త్రిమూర్త్యాత్మకంబును, శరీరత్రయాత్మకంబును, ఈశ్వరత్రయాత్మకంబును, మంత్రత్రయాత్మకంబును, శక్తిత్రయాత్మకంబును యీ9న్ని ప్రణవసౌజ్నానవవిధ మనంబడును.

ఈ ప్రణవము యొక్క నవవిధములలోనే ప్రపంచ మంతయు నంతర్భూతమని తెలియుటే యీ విచారమునకు ఫలము.

దశసంఖ్యా ప్రకరణము.

1. దశేంద్రియములు.

శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వా, ఘ్రాణము, వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్త యీ10న్ని దశవిధేంద్రియము లనంబడును.

2. దశవాయువులు.

ప్రాణవాయువు, అపానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు, నాగవాయువు, కూర్మవాయువు, కృకరవాయువు, దేవదత్తవాయువు, ధనంజయవాయువు యీ10న్ని దశవాయువులు.
3. దశవాయుచక్రము.

4. దశనాడులు.

ఇడ, పింగళ, సుషుమ్నా, గాంధారి, అస్తిజిహ్వ, పూష, యశశ్విని, అలంబుష, లకుహ, శంఖిని యీ10న్ని దశవాయువు లనంబడును.


ఇడకు - చంద్రస్థానము, రుద్రుడధిదేవత,
పింగళకు - సూర్యస్థానము, విష్ణువధిదేవత,
సుషుమ్నకు - అగ్నిస్థానము, బ్రహ్మ అధిదేవత,
గాంధారికి - 2 కుడికన్ను స్థానము, వరుణుడధిదేవత
అస్తిజిహ్వకు - యడమనేత్రస్థానము, వరుణుడధిదేవత
పూషకు - కుడికర్ణస్థానము, దిగ్దేవత లధిదైవములు
యశశ్వినికి - యడమకర్ణస్థానము, పద్యోద్భవుండధిదేవత
అలంబుషకు - గుదనాళ్ళస్థానము, సూర్యుడధిదేవత
లకుహకు - మధ్యనాళస్థానము, భూమి అధిదేవత
శంఖినికి - నాభీస్థానము, భూమి అధిదేవత

5. దశనాడీచక్రము.

నాళ్ళు స్థానములు పక్షాంతర స్థానములు అధిదేవతలు
ఇడా యడమ నాసాబిలము చంద్రస్థానము రుద్రుడు
పింగళా కుడి నాసాబిలము సూర్యస్థానము విష్ణు
సుషుమ్నా మధ్యదేశము అగ్ని బ్రహ్మ
గాంధారి వామనేత్రము కుడికన్ను వరుణుడు
అస్తిజిహ్వ కుడి నేత్రము యడమ కన్ను వరుణుడు
పూష కుడికర్ణము కుడికర్ణము దిగ్దేవతలు
యశశ్విని వామకర్ణము యడమ చెవి పద్యోద్భవుడు
అలంబుష వక్త్రము గుదము సూర్యుడు
కుహు లింగ దేశము మధ్యనాళము భూమి
శంఖిని మూలాధారం నాభి భూమి
ఈదశనాడులయందు ఏతత్ పూర్వోక్త దశవాయువులు ప్రవహిం
6. దశనాదములు.

చిణీనాదము, చిణిచిణీనాదము, ఘంటానాదము, మృదంగనాదము, మేఘనాదము, శంఖనాదము, వీణానాదము, తాళనాదము, వేణునాదము, భేరినాదము యీ10న్ని దశనాదము లనంబడును.

7. దశవిధ మండలములు.

వియన్మండలము, తమోమండలము, మేఘమండలము, విద్యున్మండలము, తారామండలము, జ్యోతిర్మండలము, సూర్యమండలము, చంద్రమండలము, వహ్నిమండలము, హిరణ్మయమండలము యీ10న్ని దశవిధమండలము లనంబడును.

8. దశవిధ సిద్ధులు.

చిరజీవత్వము, వాయువేగము, అదృశ్యత్వము, వస్తునిర్మాణము, పరభావత్వము, దూరదృష్టి, నిరాహారత్వము, వాక్యసిద్ధి, దూరశ్రవణము, కామరూపము యీ10న్ని దశవిధసిద్ధు లనంబడును.
9. దశావతారములు.

మచ్చావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, శ్రీరామావతారము, బలరామావతారము, బుద్ధావతారము, కలికావతారము యీ10న్ని దశావతారము లనంబడు.

10. జ్నానదశాచిహ్నములు.

అక్రోధము, ఆరోగ్యము, జితేంద్రియత్వము, దయ, క్షమ, జనప్రియత్వము, అలోభత్వము, ధాత్రుత్వము, అభయము, నైర్మల్యత్వము యీ10న్ని జ్నానదశాచిహ్మము లనంబడు.

ఫలము స్పష్టము.

11. దశబలములు.

బుద్ధి, క్షాంతి, వీర్యము, ధ్యానము, జ్నానము, కృప, శీలము, బలము, దానము, ఉపేక్ష యీ10న్ని దశబలము లనంబడు.

ఫలార్థములు స్పష్టము.

12. భాగవతదశలక్షణము.

సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరము, ఈశానుచరిత్రము, నిరోధము, ముక్తి, ఆశ్రయము యీ10న్ని భాగవతదశలక్షణము లనంబడును.
13. దశవిధ బ్రాహ్మణులు.

ఆంధ్ర, కర్ణాట, ద్రావిడ, ఘూర్జన, మహారాష్ట్రులు, ఉత్కల, మైధుల, గౌడ, కనోజ, సారస్వతి, సార్వర్యులు యీ 10 న్ని దశవిధ బ్రాహ్మణు లనంబడుదురు.

14. దశవిధ వైష్ణవులు.

యామునేయులు, కులశేఖరులు, త్రైవర్ణికులు, చాత్తరులు, నంబిళ్లు, నంజియ్యరులు, తళఘులు, గౌణులు, కైవర్తులు, వాచ్చాంబిళు ఈ10న్ని దశవిధవైష్ణవు లనంబడుదురు.

ఏకాదశసంఖ్యా ప్రకరణము.

1. ఏకాదశేంద్రియములు.

జ్నానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు 1 ఈ 11 న్ను ఏకాదశేంద్రియము లనబడును.

ద్వాదశసంఖ్యా ప్రకరణము.

1. ఆత్మద్వాదశలక్షణము.

2. ద్వాదశాంగుళన్యూనప్రత్యేకఫలము.


త్రయోదశసంఖ్యా ప్రకరణము.

1. త్రయోదశేంద్రియములు.

జ్నానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనోబుద్ధ్యహంకారములు 3 యీ13న్ను త్రయోదశగుణము లనంబడును.

2. రాగద్వేషాది త్రయోదశ దుర్గుణములు.

రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారము యీ13న్ను రాగద్వేషాదిత్రయోదశదుర్గుణము లనంబడును. పుట:SakalathatvaDharpanamu.pdf/112

చతుర్దశసంఖ్యా ప్రకరణము.

1. చతుర్దశ కరణములు.

శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము, వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్త, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ14న్ను చతుర్దశ కరణము లనంబడును.

2. చతుర్దశాధి దేవతలు.

దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు, వహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, చతురాననుడు, చంద్రుడు, బ్రహ్మ, జీవుడు, శివుడు యీ14న్ను చతుర్దశానుదేవత లనంబడుదురు.

3. చతుర్దశ కర్మములు.

శబ్దము వినుట, శీతాదుల యెరుంగుట, చూచుట, రుచిగొనుట, ఆఘ్రాణించుట, పలుకుట, పనులుజేయుట, నడుచుట, మలమూత్రవిసర్జనంబొనరించుట, ఆనందించుట, చలించుట, నిశ్చయించుట, చింతించుట, అభిమానపడుట యీ14న్ను చతుర్దశకర్మ లనంబడును.

4. చతుర్దశ మహావిద్యలు.

5. చతుర్దశ భువనాత్మక విరాడ్రూపము.

పంచదశసంఖ్యా ప్రకరణము.

1. పంచదశ యోగాంగములు.

యమము, నియమము, త్యాగము, మౌనము, దేశము, కాలము, ఆసనము, మూలబంధము, దేహసామ్యము, దృక్త్సితియు, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి యీ15న్ను పంచదశ యోగాంగము లనంబడును. పుట:SakalathatvaDharpanamu.pdf/116

షోడశసంఖ్యా ప్రకరణము.

1. షోడశ వికారములు.

జ్నానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనోబుద్ధి అహంకారములు 3, రజస్సత్వతమోగుణములు 3 ఈ16న్ను షోడశవికారము లనంబడు.

2. మరియొక షోడశ వికారములు.

3. మరియొక షోడశ వికారములు.

జ్ఞానకర్మేంద్రియములు 10, పృధివ్యాది భూతేములు,5, మనస్సు 1, ఈ 16న్నూ షోడశవికారములు లనబడున్

సప్తదశసంఖ్యా ప్రకరణము.

1. సప్తదశలింగభౌతికము.


అష్టాదశసంఖ్యా ప్రకరణము.

1. అష్టాదశ పురాణములు.

బ్రహ్మము, పద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, కూర్మము,

ఏకోనవింశతి ప్రకరణము.

1. ఏకోనవింశతి తత్వాత్మశరీరము.

వింశతిసంఖ్యా ప్రకరణము.

ఏకవింశతిసంఖ్యా ప్రకరణము.

1. భవతంతుని ఏకవింశ త్యవతారములు.

చతుర్వింశతిసంఖ్యా ప్రకరణము.

1. చతుర్వింశతి గురువులు.

2. చతుర్వింశతి తత్వములు.

ద్వాత్రింశతిసంఖ్యా ప్రకరణము.

1. సత్యాదిసద్గుణ ద్వాత్రింశతి.

షట్‌త్రింశతిసంఖ్యా ప్రకరణము.

1. షట్‌త్రింశతిత్వములు.

షణ్ణవతిసంఖ్యా ప్రకరణము.

1. షణ్ణవతి తత్వములు.


గద్య.

ఇది శ్రీమ న్నారాయణ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మ వర

ప్రసాదలబ్ధ కవితా విలాస సందడి నాగదాస ప్రణీతంబైన

సకల తత్వార్థ దర్పణ మను వేదాంతశాస్త్రంబు

నందు షష్ట, సప్తాష్ట, నవ, దశ, ఏకాదశ,

ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ,

పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ,

ఏకోనవింశతి, ఏకవింశతి, చతుర్వింశతి, పంచ

వింశతి, షడ్వింశతి, సప్తవింశతి, ద్వాత్రింశతి, షట్రిం

శతి, షణ్ణవతిసంఖ్యా ప్రకరణంబులున్ గల

ద్వితీయ నిరుక్తము సంపూర్ణము.