సకలతత్వార్థదర్పణము/‌ప్రథమ నిరుక్తము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

అస్మద్గురుభ్యోన్నమః.

శ్రీమన్నారాయణ సచ్చిదానంద పరబ్రహ్మణేనమః.

సకలతత్వార్థదర్పనము.

ప్రథమ నిరుక్తము.

ఇష్టదైవ స్తోత్రము

రాజయోగ విద్య వి
చారాత్మక జనపయోధీ చంద్రమ భవసం
సారాటవి సుచి లక్ష్మీ
నారాయణ నిన్ను నామనంబున దలతున్.

దేవతా స్తనము

క. హరచతురాననల బొ దరులను లక్ష్మీహిమాద్రి తనయల మఱియున్

పరికించి శారదాంబను ; వరమతి నుతియింతు కావ్య వర్ధనమునకై.

కులగురుస్తుతి

క. పరికింపగాను మత్కుల గురువగు సల్లానికులయ కూపార నిశా

కరుడనగ వినుతిగాంచిన గురువరు రామానుజార్యు గొలిచెద నెపుడున్.

కారణాచార్య సన్నుతి.

చ. మాయను బాపి మోక్షపథమార్గము జూపగ జాలినట్టి నా

రాయణ మంత్రరాజము నిరామయ తత్వము దెల్పి నాపయిన్

చాయని కూర్మిగల్నిగ కృపాకరు వెంకటరామయార్యులన్

నాయదలోన నిల్పియు యనారతమున్ వినుతింతు భక్తితోన్

సుకవివినుతి

గీ. సకలలోకోపకారంబు సలుపగోరి కావ్యములు జేసి సత్కీర్తిగాంచినట్టి

వ్యాసవాల్మీకికవి కాళిదాసబాణ పరమయూరులకును జేతు వందనములు.

కవిస్తుతి

సందడి రామాహ్వాయ ప్రియ నందనుడను విష్ణుభక్తి నైష్టికుడను సా
నందుడ నాగన నాముడ పొందగ వేదాంతవిధుల బొగడెడివాడన్.

అట్టినేను,

గ్రంథోత్పత్తి దేశకాలనిర్ణయము

సీ. శ్రీకరంబగు మర్త్యలోకంబునందున భరతఖండమున సిరులదనరు
బందరు విషయంబునందు నందిగ్రామ సీమలో మిక్కిలి చెలగుచున్న
జగ్గయ్యపేట కీశాన్యమం దున్న దబ్బాకుపల్లెను వురవరమునందు
వెలయు మరుత్పుత్రు వినుతించి శాలివాహనశకమున మతంగాంతరిక్ష
హస్తిశశిసంఖ్యనడువతటస్థమైన పార్థివాబ్దంబునందు సంభ్రమముతోడ
సకలతత్వార్థదర్పణసౌఙనొప్పు శాస్త్ర్రమును జెప్పబూనితి శౌరికృపను.

త్రిసంఖ్యాప్రకరణము

1. వాసనాత్రయము.

లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన యీ 3 న్ను వాసనాత్రయ మనబడు.

లోకవాసన - లోకముతోపాటుగా సంచరించవలయుననియును, లోకులందరు తన్నుస్తోత్రము సేయవలయుననియును మనస్సుయం దుండి ప్రవర్తించుట లోకవాసన యనంబడు, - దీనికి నివృత్తి. ఈశ్వరునకు కూడా నింద లేకుండా జరగకపోయినది, గనుక, అజ్నానులు నిందించిన స్తోత్రమువేసిన ఆ స్తుతినిందలు శరీరమునకేకాని, ఆత్మకు లేవని విచారించినట్టయితె లోకవాసన బోవును.

దేహవాసన - సమస్తతీర్థములయందు స్నానము చేసిన పవిత్రుడననియును, ప్రాణాయామాది యోగంబులు చేసిన కాయసిద్ధిగలదనియును మనస్సుయందుండి వర్తించుట దేహవాసన యనంబడు. - దీనికి నివృత్తి. రక్తమాంసపూరితము శరీర మనిన్ని, మిగుల నిర్మలుడు జీవు డనిన్ని, శరీరము మాయాసంబంధమనిన్ని, అనిత్యమనిన్ని విచారించినట్టయితే దేహవాసన బోవును.

శాస్త్రవాసన - శాస్త్రపద్ధతిని కర్మచేయడము, శాస్త్రములు సాకల్యముగా చదువవలెనని మనస్సుయం దుండి ప్రవర్తించుట శాస్త్రవాసన యనంబడును. - దీనికి నివృత్తి. కర్మము అజ్నానమును వృద్ధిజేయుననిన్ని, వెనుక జదివిన దానికి మరువగలదనిన్ని, చదివి పరుల వంచించినను తానువోడినను దు:ఖమేననిన్ని విచారించినట్టయితె శాస్త్రవాసనబోవును. (అని వాసుదేవమననము)

2. ఈషణత్రయము.

దారీషణ, ధనీషణ, పుత్రీషణ యీ 3 న్ను యీషణత్రయమన బడును.

దారీషణ:- కామధర్మాదిసకలసుఖములు, భార్య గలిగినం గలుగునని, భార్యయం దాసక్తి గలిగియుండుట దారీషణ యనబడును. -దీనికి నివృత్తి. తాను దరిద్రుడైయుండినను, లేక దీర్ఘవ్యాధులచేత తపింపుచుండినను, యెల్లప్పుడు భార్య తనను దూషింపుచుండునని విచారించినట్టయితె దారీషణ బోవును.

ధనీషణ:- ధనము గలిగియుండిన యజ్ఞ దానాదిసత్కర్మములు జేసి స్వర్గాదిసుఖము లనుభవింపవచ్చునని ధనముగోరుచుండుట ధనీషణయనంబడు. -దీనికి నివృత్తి, ధనము సంపాదించుటయందు దు:ఖమనిన్ని, దాని సంరక్షణయున్ను దు:ఖమనిన్ని, కర్మవశముచే నాధనము పోయిన మిగుల దు:ఖం బనిన్ని, స్వర్గాదిభోగములు గలిగినను పునర్జన్మకారణమనిన్ని విచారించినట్టయితే ధనీషణ బోవు.

పుత్రీషణ:- పుత్రులు లేనిది నరకవిముక్తిన్ని, స్వర్గాదిభోగములున్ను, యిహమందు ప్రతిష్ఠయున్ను లేదని పుత్రులు గావలెనని గోరుచుండుట పుత్రీషణ యనబడును.-దీనికి నివృత్తి, పుత్రులు గలుగక మునుపు తపో దాన తీర్థయాత్రాది క్లేశములున్ను, దైవవశంబుమం గలిగి వినయవివేకంబులు లేక మూడుండైయున్న అపకీర్త్యాది దు:ఖంబులును, కాల వశంబున మృతించిన సకల దు:ఖములును కుమారుడు గలుగ జేయు నని విచారించినట్టయితె పుత్రీషణ బోవును. (అని వాసుదేవమననము)

3. మలత్రయము.

యణవమలము, మాయామలము, కార్మికమలము యీ 3 న్ను మలత్రయ మనంబడు.

యణవమలము:- పరమాత్మకు దెలియలేక సంసారియై నేను జీవుడను, అజ్ఞానుడను అని తలంచుచుండుట యణవమల మనబడును.

మాయామలము:- పరులకు మనోవాక్కాయములచేత అపకారంబు జేయుచు పరులు నేనును భిన్నభావంబు గలిగియుండుట మాయామల మనబడును. 4 కార్మికమలము:- పుణ్యపాపములచేత స్వర్గనరకములున్ను, జననమరణములున్ను గలవని నిశ్చయించుకొని కర్మశీలుం డగుట కార్మికమల మనంబడును. (అని సకలార్థగురుబోధసారము.)

ఈమలత్రయము జ్ఞానమునకు ప్రతిబంధము. గనుక, సర్వావస్థల యందును బుద్ధియం దెక్కనీక తోసివేయవలయునని శాస్త్రసిద్ధాంతము.

4. ఇచ్ఛాత్రయము.

స్వేచ్ఛా, పరేచ్ఛా, అనిచ్ఛ యీ 3 న్ను యిచ్ఛాత్రయ మనంబడును.

స్వేచ్ఛ:- తాను వకకార్యమును మనస్ఫూర్తిగా కోరి చేసి దాని వలన వచ్చిన సుఖదు:ఖముల ననుభవించుట స్వేచ్ఛ యనంబడును.

సరేచ్ఛ:- తాను వకకార్యమున్ను కోరి చేయక పరులచే ప్రేరేపింపంబడి చేసి అందుచే గలిగిన సుఖదు:ఖముల ననుభవించుట సరేచ్ఛ యనంబడును.

అనిచ్ఛ:- తాను వకకార్యమున్ను కోరిచేయక పరులచేతనున్ను ప్రేరేపింపంబడిచేయక దైవీకమువల్లవచ్చిన సుఖదు:ఖములనను భవించుట అనిచ్ఛ యనంబడును.

జ్ఞానికి స్వేచ్ఛ నీచ మనిన్ని, సరేచ్ఛ మధ్యమ మనిన్ని, అనిచ్ఛ వుత్తమమనిన్ని వేదాంతసిద్ధాంతము.

5. కర్మత్రయము.

పుణ్యకర్మము, పాపకర్మము, మిశ్రకర్మము యీ 3 న్ను కర్మత్రయ మనంబడు.

6. కరణత్రయము.

మనస్సు, వాక్కు, కాయము యీ 3 న్ను కరణత్రయ మనబడును. ఈకరణత్రయముచేత మొదటికర్మత్రయము జేయబడుచుండును,

మనస్సుచేత జేయబడిన పుణ్యకర్మ సవిశేష నిర్విశేష చింతయు, భక్తిజ్ఞానవైరాగ్యచింతయు, పరోపకారము మొదలయినవి మనస్సుయందుండుట మనస్సుచేత జేయబడిన పుణ్యకర్మ మనబడును.

2. మనస్సుచే జేయబడిన పాపకర్మ సర్వదా విషయచింతయు, పరులకుద్రోహము జేయగోరుటయు, పరలోకము లేదనుటయు యీ మొదలుగాగలవి మనస్సుచేత జేయబడిన పాపకర్మములు 5. 3. మనస్సుచేత జేయబడిన మిశ్రకర్మ నిర్వికల్ప సవికల్ప సమాధులు మొదలయినవానియందు విషయచింతయు, పరద్రోహచింతయు మొదలయినవి మనస్సుచేత జేయబడిన మిశ్రకర్మము లనబడును.

వాక్కుచేత జేయబడిన పుణ్యకర్మ వేదశాస్త్ర గీతానామసహస్ర పఠనంబును, గాయత్ర్యాది మంత్రజపంబును జేయుట వాక్కుచేత జేయబడిన పుణ్యకర్మ యనంబడు.

2. వాక్కుచేత జేయబడిన పాపకర్మ పెద్దలను దూషించుటయు, అసత్యములుబలుకుట మొదలుగాగలవి వాక్కుచేత జేయబడిన పాప కర్మము.

3. వాక్కుచేత జేయబడిన మిశ్రకర్మ వేదాధ్యయన జపాదికాలములయందు లౌకికవార్తయు, ప్రమాణములు మొదలయినవి జేయుట వాక్కుచేత జేయబడిన మిశ్రకర్మము లనబడును.

కాయముచేత జేయబడిన పుణ్యకర్మ పుణ్యతీర్థస్నానంబును, గురుదేవతానమస్కారంబును, బ్రహ్మచర్యంబు మొదలయినవి కాయముచే జేయబడిన పుణ్యకర్మ మనంబడును.

2. కాయముచే జేయబడిన పాపకర్మ పరులపీడించుటయును, పరస్త్రీసంగమము, పరిధనహరణము మొదలైనవి కాయముచే జేయబడిన పాపకర్మ మనంబడు.

3. కాయముచే జేయబడిన మిశ్రకర్మ పరులను బాధించి వారల ద్రవ్యంబు దీసుకొని దేవాలయములు మొదలయినవాటికి ఖర్చుపెట్టుట కాయముచే జేయబడిన మిశ్రకర్మ యనంబడు.

యెల్లప్పుడు కరణత్రయముచేత పుణ్యకర్మంబే చేయవలయు, లేదా మిశ్రకర్మమునైనా జేయవలయునుగాని పాపకర్మము ఒకప్పుడు జేయగూడదని బుధజనాభిప్రాయము.

7. అంగత్రయము.

స్థూలాంగము, సూక్ష్మాంగము, కారణాంగము యీ 3 న్ను అంగత్రయ మనబడును.

ఇదియే శరీరత్రయము మొదలయిననామములచే చెప్పబడును.

స్థూలాంగము:- పంచవింశతి తత్వములతో కూడి స్తంభమువలె కనుపడుచున్నది స్థూలాంగ మనబడును. 6

సూక్ష్మాంగము:- పది హేడుతత్వములతో గూడియుండునది సూక్ష్మాంగ మనబడును.

కారణాంగము:- ఈస్థూలసూక్ష్మములు రెండింటికి హేతుర్భూతమై అజ్ఞానస్వరూపమై యుండునది కారణాంగ మనంబడును.

యీవిచారమునకు ఫలంబేమనిన, ఆత్మ సాన్నిధ్యమునవున్న సూక్ష్మశరీరము చేతనే స్థూలశరీరద్వారా కర్తృత్వభోక్తృత్వములు జరుగుచున్నవని తెలియుటేఫలము.

8. అవస్థాత్రయము.

జాగ్రదావస్త, స్వప్నావస్త, సుషుప్త్యావస్త యీ 3 న్ను అవస్థాత్రయ మనంబడును.

జాగ్రదావస్తయనగా - మేలుకొనియుండుట.

స్వప్నావస్తయనగా - కలలుగనుట.

సుషుప్త్యావస్తయనగా - సుఖముగా నిద్రబోవుట.

ఇందుకు ఫలం బేమనిన, యీఅవస్తాత్రయమునకు ఆత్మ సాక్షియై యున్నాడని దృడముగా తెలియుట.

9. జీవత్రయము.

విశ్వుడు, తైజనుడు, ప్రాజ్నుడు యీ 3 న్ను జీవత్రయ మనబడును.

విశ్వుడు - జాగ్రదావస్తవాసుడు

తైజనుడు - స్వప్నావస్తవాసుడు

ప్రాజ్ఞుడు - సుషుప్త్యావస్తవాసుడు. గనుక, జీవత్రయమునకు ఆత్మసాక్షియై యున్నాడని తెలియుటయే ఫలము.

10. స్థానత్రయము.

భ్రూమధ్యము, కంఠము, హృదయము యీ 3న్ను స్థానత్రయ మనబడును.

11. అంగత్రయవిభజనచక్రము.

అంగత్రయము స్థూలము సూక్ష్మము కారణము
అవస్థాత్రయము జాగ్రత స్వప్నము సుషుప్తి
జీవత్రయము విశ్వుడు తైజనుడు ప్రాజ్ఞుడు
స్థానత్రయము భ్రూమధ్యము కంఠము హృదయము
7
12. తాపత్రయము.

అధ్యాత్మికము, అధిభౌతికము, అధిదైవికము యీ 3 న్ను తాపత్రయములు.

వాత పైత్య శ్లేష్మములవల్లవచ్చెడిదు:ఖము ఆధ్యాత్మిక మనంబడు,

సర్ప వృశ్చిక వ్యాఘ్ర చోరాదులచే వచ్చెడు దు:ఖము అధిభౌతిక మనంబడు,

గాలి, వాన, పిడుగులు, రాళ్లు మొదలయినవానిచే గలిగెడు దు:ఖము అధిదైవిక మనంబడు,

యీతాపత్రయము అంత:కరణముతో గూడిన శరీరమునకేకాని, ఆత్మస్వరూపుడౌ తనకు లేదని వేదాంతసిద్దాంతము.

13. వ్యాధిత్రయము.

వాతము, పైత్యము, శ్లేష్మము యీ 3 న్ను వ్యాధిత్రయ మనబడును.

వాతమునందు బుట్టినరోగములు 10,

పైత్యమునందు బుట్టినరోగములు 82,

శ్లేష్మమందు బుట్టినరోగములు 224, కూడారోగములు 38

ఇట్టిరోగముల కాలయమైన యీశరీరమందు భ్రాంతి లేక ఆత్మావలోకనము జేయుచుండవలెనని సిద్దాంతము.

14. ప్రతిబంధత్రయము.

భూతప్రతిబంధము, వర్తమానప్రతిబంధము, భావిప్రతిబంధము యీ 3న్ను ప్రతిబంధత్రయ మనబడును.

భూతప్రతిబంధ మనగా:- బహుకుటుంబిని యగు నొక బ్రాహ్మణుడు జీవనార్ధమునకై నొక యెనుమును సంపాదించుకొని దానివలన కుటుంబసంరక్షణ జేయుచుండెను. అంత కొంత కాలంబునకు కర్మవశంబున పుత్రమిత్రకళత్రాదులున్ను యెనుమున్ను నశించెను. అప్పుడా బ్రాహ్మణుండు విరక్తుండై సద్గురు సాన్నిధ్యంబున శ్రవణాదులుచేసెను. అంత నొక సమయంబున నతనిగురుండు చేరంబిలిచి నీవు బహుదినంబుల నుండి శ్రవణాదులు చేసితివే కృతకృత్యత నీకున్ దోచియున్నదా యనిన, అతను మరి యేమియుంగానను. పూర్వము ఒక యెనుమును సంపాదించికొనియుంటిని. అది నాడె మృతించెను. అయినప్పటికిని శ్రవణమనననిధి ధ్యాసకాలంబులయందు ఆయెనుమే సాక్షాత్కారమై యున్న దని యధార్థంబుగా విజ్ఞాన 8

15. సంశయత్రయము.

సంశయము, అసంభావన, విపరీతభావన యీ 3న్ను సంశయత్రయ మనబడును. 9

16. ప్రత్యగాత్మ విషయమైన సంశయత్రయము.

ప్రత్యగాత్మ విషయమైన సంశయము, ప్రత్యగాత్మ విషయమైన అసంభావన, ప్రత్యగాత్మ విషయమైన విపరీతభావన యీ 3 న్ను ప్రత్యగాత్మ విషయమైన సంశయత్రయము అనంబడును. 10

17. మాయాత్రయము.

అవిద్య, అవరణము, విక్షేపము యీ3న్ను మాయాత్రయ మనబడును.

18. అహంకారత్రయము.

సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము యీ 3 న్ను అహంకారత్రయ మనబడును.

19. స్వర్గతాపత్రయము.

క్షయము, అతిశయము, సాహసము యీ3న్ను స్వర్గతాపత్రయములు. 11

20. నాడీత్రయము.

ఇళనాడి, పింగళనాడి, సుషుమ్ననాడి యీ3న్ను నాడీత్రయములు.

21. మండలత్రయము.

సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము యీ3న్ను మండలత్రయములు.

22. వేణీత్రయము.

గంగా, యమునా, సరస్వతి యీ 3 న్ను వేణీత్రయములు.

23. నాడ్యాధిపతిత్రయము.

బ్రహ్మ, విష్ణు, శివుడు యీ 3 న్ను నాడ్యాధిపతిత్రయము.

24. వర్ణత్రయము.

అకారము, ఉకారము, మకారము యీ 3 న్ను వర్ణత్రయములు.

25. భాగత్రయము.

కుడిభాగము, ఎడమభాగము, మధ్యభాగము యీ 3 న్ను భాగత్రయములు.

26. పదత్రయము.

త్వంపదము, తత్పదము, అశిపదము యీ 3 న్ను పదత్రయములు.

27. మూర్తిత్రయము.

బ్రహ్మ, విష్ణు, శివుడు యీ 3 న్ను త్రిమూర్తులు.

28. హంసచక్రము.

12
29. వర్ణత్రయచక్రము.

30. తూర్యావస్తత్రయము.

జననము, వృద్ధి, మరణము యీ 3 న్ను తూర్యావస్తత్రయ మనబడును.

31. త్రివిధపరిచ్ఛేదములు.

వస్తుపరిచ్చేదము, దేశపరిచ్ఛేదము, కాలపరిచ్ఛేదము యీ3న్ను త్రివిధపరిచ్ఛేదము లనంబడును. 13

32. కాలత్రయము.

భూతకాలము, భవిష్యత్కాలము, వర్తమానకాలము యీ3న్ను కాలత్రయ మనబడును.

33. ఆగామిసంచితప్రారబ్ధత్రయము.

ఆగామి, సంచితము, ప్రారబ్ధము యీ3న్ను ప్రారబ్ధత్రయ మనబడును. 14

34. ప్రాణాయామత్రయము.

ప్రాకృతము, వైకృతము, కుంభకము యీ 3 న్ను ప్రాణాయామత్రయ మనంబడు.

35. లక్ష్యత్రయము.

అంతర్లక్ష్యము, బాహ్యలక్ష్యము, మధ్యలక్ష్యము యీ 3 న్ను లక్ష్యత్రయ మనబడును. 15

36. గంధ్రత్రయము.

సుగంధము, దుర్గంధము, మిశ్రగంధము యీ 3 న్ను గంధత్రయ మనబడు.

37. భక్తిత్రయము.

బాహ్యభక్తి, అనన్యభక్తి, యేకాంతభక్తి యీ 3 న్ను భక్తిత్రయములు.

38. ద్రుష్టిత్రయము.

అమావాస్యద్రుష్టి, పాడ్యమిద్రుష్టి, పౌర్ణమిద్రుష్టి యీ 3 న్ను ద్రుష్టిత్రయ మనబడును.

39. అద్వయితత్రయము.

భావాద్వయితము, క్రియాద్వయితము, ద్రవ్యాద్వయితము యీ 3 న్ను అద్వయితత్రయ మనబడును. 16

40. లక్షణత్రయము.

జహల్లక్షణము, అజహల్లక్షణము, జహదజహల్లక్షణము యీ 3 న్ను లక్షణత్రయ మనబడును. 17 18

41. లోకత్రయము.

స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళలోకము యీ 3 న్ను లోకత్రయము.

42. పాతిత్వత్రయము.

అర్ధప్రబుద్ధత్వము, ఆరూఢపాతిత్వము, వాచావివేకత్వము యీ 3 న్ను పాతిత్వత్రయ మనబడును.

43. భావత్రయానుభవము.

దేహభావానుభవము, మనోభావానుభవము, ఆత్మభావానుభవము యీ 3 న్ను భావత్రయానుభవ మనబడును. 19

44. దీక్షాత్రయము.

స్వస్తికారోహణదీక్ష, స్పర్శదీక్ష, వేదదీక్ష యీ 3 న్ను దీక్షాత్రయములు.

45. త్యాగత్రయము.

కామ్యకర్మత్యాగము, కర్మఫలత్యాగము, సర్వకర్మత్యాగము యీ 3 న్ను త్యాగత్రయ మనబడును.

46. త్రిగుణములవేనైన సృష్టివివరము.

పుట:SakalathatvaDharpanamu.pdf/28 పుట:SakalathatvaDharpanamu.pdf/29 పుట:SakalathatvaDharpanamu.pdf/30 పుట:SakalathatvaDharpanamu.pdf/32 పుట:SakalathatvaDharpanamu.pdf/33 26
47. గుణత్రయము.

సత్వగుణము, రజోగుణము, తమోగుణము యీ 3 న్ను గుణత్రయము లనంబడును. 27

48. త్రిగుణముల వివరము.

సత్వగుణము, రజోగుణము, తమోగుణము యీ 3 న్ను త్రిగుణము లనంబడును. 28

49. ప్రస్థానత్రయము.

ఉపనిషద్భాష్యము, గీతాభాష్యము, సూత్రభాష్యము యీ 3 న్ను ప్రస్థానత్రయ మనబడును.

50. జ్నానత్రయము.

సాత్వికజ్నానము, రాజసజ్నానము, తామసజ్నానము యీ 3 న్ను జ్నానత్రయ మనబడును.

51. కర్తత్రయము.

సాత్వికకర్త, రాజసకర్త, తామసకర్త యీ ముగ్గురున్ను కర్తత్రయములు.

52. బుద్ధిత్రయము.

సాత్వికబుద్ధి, రాజసబుద్ధి, తామసబుద్ధి యీ 3 న్ను బుద్ధిత్రయ మనబడును. 29

53. సుఖత్రయము.

సాత్వికసుఖము, రాజససుఖము, తామససుఖము యీ 3 న్ను సుఖత్రయ మనబడును.

54. మరియొకవిధ సుఖత్రయము.

ప్రియము, మోదము, ప్రమోదము యీ 3 న్ను సుఖత్రయ మనబడును.

55. శక్తిత్రయము.

జ్నానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి యీ 3 న్ను శక్తిత్రయము. 30

56. బంధత్రయము.

సాత్వికబంధము, రాజసబంధము, తామసబంధము యీ 3 న్ను బంధత్రయ మనబడును.

57. మరియొకవిధ బంధత్రయము.

మూలబంధము, ఒడ్యాణబంధము, జాలంధరబంధము యీ3న్ను బంధత్రయ మనబడును.

58. శ్రద్ధాత్రయము.

సాత్వికశ్రద్ధ, రాజసశ్రద్ధ, తామసశ్రద్ధ యీ 3 న్ను శ్రద్ధాత్రయ మనబడును. 31

59. ఆకాశత్రయము.

మహాకాశము, చిత్తాకాశము, చిదాకాశము యీ 3 న్ను ఆకాశత్రయ మనంబడును.

60. అంహాదీత్రివిధపాపములు.

అంహా, ఆగా, ఏనస్సు యీ3న్ను అంహాదిపాపత్రయ మనంబడు.

61. మౌనత్రయము.

వాజ్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనము యీ 3 న్ను మౌనత్రయ మనంబడు.

62. త్రివిధాధ్యయనము.

వాచికము, ఉపాంశు, నూనసికము యీ 3 న్ను త్రివిధాధ్యయనములు.

63. తాదాత్మ్యత్రయము.

సహజన్యతాదాత్మ్యము, కర్మజన్యతాదాత్మ్యము, భ్రాంతిజన్యతాదాత్మ్యము యీ 3 న్ను తాదాత్మ్యత్రయ మనబడును. 32

64. వృత్తిత్రయము.

శాంతవృత్తి, ఘోరవృత్తి, మూఢవృత్తి యీ 3 న్ను వృత్తిత్రయ మనబడును.

65. మరియొకవిధ దీక్షాత్రయము.

ద్రుగ్దీక్ష, వాగ్దీక్ష, స్పర్శదీక్ష యీ3న్ను ముక్తిత్రయ మనంబడు.

66. ముక్తిత్రయము.

క్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి యీ 3 న్ను ముక్తిత్రయ మనంబడు.

67. బాహ్యాంతరమధ్యత్రిపుటులు.

కర్త, హేతు, క్రియలు యీ 3 న్ను బాహ్యత్రిపుటులు.

68. వర్ణత్రయము.

ధర్మము, అర్థము, కామము యీ 3 న్ను వర్ణత్రయ మనబడును.

69. ఈశ్వరత్రయము.

విరాట్టు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు యీ3న్ను యీశ్వరత్రయములు.

70. జీవత్రయనామములు.

నిశ్వుడు, తైజసుడు, ప్రాజ్నుడు యీ 3 న్ను జీవత్రయ మనబడును. 32

71. గతిత్రయము.

ఊర్ధ్వగతి, మధ్యగతి, అధోగతి యీ3న్ను గతిత్రయ మనబడును.

72. త్రివిధప్రసాదములు.

ఇది అతిరహస్యమవుటచేత నిందు దెలుపలేదు.

73. జాగరావస్తోల్లాస మహావాక్యత్రయము.

జాగరములో జాగరము, జాగరములో స్వప్నము, జాగరములో సుషుప్తి యీ3న్ను జాగరావస్తోల్లాస మహావాక్యత్రయ మనబడును. 35

74. ఆత్మనిశ్చయబుద్ధిత్రయము.

దేహాత్మనిశ్చయబుద్ధి, జీవాత్మనిశ్చయబుద్ధి, పరమాత్రనిశ్చయబుద్ధి యీ 3 న్ను ఆత్మనిశ్చయబుద్ధిత్రయ మనబడును.

75. భేదత్రయము.

స్వజాతియ్యభేదము, విజాతియ్యభేదము, స్వగతభేదము యీ3న్ను భేదత్రయ మనబడును. 36

76. పరమాత్మనామత్రయము.

ఓం, తత్, సత్ యీ 3 న్ను పరమాత్ముని స్మరింపదగిన నామత్రయములు.

77. భోజనత్రయము.

సాత్వికభోజనము, రాజసభోజనము, తామసభోజనము యీ3న్ను భోజనత్రయ మనబడును. 37

78. స్వప్నభేదత్రయము.

గ్రాహ్యము, అగ్రాహకము, గ్రాహయితృత్వము యీ 3 న్ను స్వప్నభేదములు.

చతుస్సంఖ్యా ప్రకరణము.

1. సాధనచతుష్టయము.

నిత్యానిత్యవస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాదిషట్కసంపత్తి, ముముఖ్సుత్వము యీ 4 న్ను సాదనచతుష్టయ మనబడు.

2. అంతఃకరణచతుష్టయము.

మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, యీ3న్ను అంతఃకరణ చతుష్టయ మనబడును.

మనస్సునకు హృదయము, పాగళాంతమస్థానము, సంకల్పవికల్పములు కార్యము, చంద్రు డధిష్టాన దేవత. 38

3. అంతఃకరణ చతుష్టయచక్రము.

4. కర్మచతుష్టయము.

విధియు, నిషేధము, ప్రాయశ్చిత్తము, కామ్యకర్మ యీ 4 న్ను కర్మచతుష్టయ మనబడును.

5. చతుర్విధ శిశ్రూషలు.

ఆత్మశుశ్రూష, అంగశుశ్రూష, స్థానశుశ్రూష, సద్భావశుశ్రూష యి4న్ను చతుర్విధశుశ్రూష లనబడును.

6. రూపచతుష్టయము.

రక్తము, శ్వేతము, పీతము, కృష్ణము యీ4న్ను రూపచతుష్టయ మనబడును. 39

7. జీవాంగచతుష్టయము.

రక్తము, శ్వేతము, పీతము, కృష్ణము, యీ4న్ను జీవాంగచతుష్టయ మనబడు. చక్షుస్థితమైన యీనాల్గువర్ణములున్ను ప్రత్యేకము. జీవాంగములని తెలియవలయు.

8. ఆత్మాంగచతుష్టయము.

స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము యీ4న్ను ఆత్మాంగచతుష్టయ మనంబడును.

9. మహావాక్యచతుష్టయము.

అహంబ్రహ్మోస్మి, ప్రజ్నానంబ్రహ్మ, ఆయమాత్మబ్రహ్మ, తత్వమసి యీ4న్ను మహావాక్యచతుష్టయ మనబడును. పుట:SakalathatvaDharpanamu.pdf/48 41

10. మహావాక్యోద్భవచక్రము.

11. చతుష్పధనిర్ణయము.

ఘ్రాణరంధ్రములు రెండు, కర్ణరంధ్రములు రెండు; ఇవి నాలుగు మార్గములు గూడినచోటు చతుష్పధ మనంబడు. ఇదియే శృంగాటక మనియునుం జెప్పబడును. పైజెప్పిన నాలుగు మార్గములును భ్రూమధ్య మండలంబు దిగువ న్గలసియుండునని తెలియవలయు.

12. యోగచతుష్టయము.

మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము యీ4న్ను యోగచతుష్టయ మనంబడును. 42

13. చతుర్విధప్రమాణములు.

ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శాబ్దము యీ 4 న్ను చతుర్విధప్రమాణము లనంబడును. 43

14. అంగచతుష్టయము.

అంగము, ప్రత్యాంగము, సాంగము, ఉపాంగము యీ 4 న్ను అంగచతుష్టయ మనబడును.

15. స్పర్శచతుష్టయము.

శీతము, ఊష్ణము, మృదువు, కఠినము యీ 4 న్ను స్పత్శచతుష్టయ మనబడును.

16. చతుర్విధబ్రహ్మవేత్తలు.

బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుండు యీ4న్ను చతుర్విధబ్రహ్మవేత్త లనంబడుదురు. 44

17. చతుర్విధపురుషార్థములు.

ధర్మము, అర్థము, కామము, మోక్షము యి 4 న్ను పురుషార్థములు, నివియే చతుర్వర్గమనియునుం జెప్పబడును.

ఈ పురుషార్థములు నాలుగింటిలో పరమపురుషార్ధమైనది మోక్షమని తెలియుటే ఫలము.

18. న్యాయవిద్యాచతుష్టయము.

అన్వీక్షకి, త్రై, వార్త, దండనీతి యీ4న్ను న్యాయవిద్యాచతుష్టయము. 45

19. చతుర్విధభూతములు.

జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు యీ4న్ను చతుర్విధభూతము లనబడును.

జరాయుజము లనగా మావి వలన బుట్టిన మనుష్యులు మొదలైన ప్రాణులు.

అండజము లనగా, గ్రుడ్డు వలన బుట్టిన పక్షులు మొదలైన జంతువులు.

స్వేదజము లనగా, చమట వలన బుట్టిన యూకములనే కీటకములు మొదలైన ప్రాణులు.

ఉద్భ్హిజము లనగా, భూమిని వ్రక్కలించుక పుట్టిన వృక్షములు మొదలయిన ప్రాణులు. 48

20. సద్గుణచతుష్టయము.

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష యీ4న్ను సద్గుణచతుష్టయములు.

మైత్రి అనగా, సాధుసాంగత్యంబు జేయుచుండుట.

కరుణ యనగా, దుఃఖితాత్ములయందు పరితపించుట.

ముదిత యనగా, పుణ్యకారులయందు సంతోషించుట.

ఉపేక్ష యనగా, పాపాత్ములయందు రాగద్వేషములు లేకయుండుట.

21. చతురాశ్రమధర్మంబులు.

బ్రహ్మచారి, గృహస్తు, వానప్రస్తు, సన్యాసి యీ4న్ను చతురాశ్రమవాసులనంబడుదురు. 47

22. భక్తిహేతుచతుష్టయము.

ఆర్తి, జిజ్నాస, అర్ధాసక్తి, జ్నానము ఈ4న్ను భక్తిహేతుచతుష్టయము. 48

23. చతుర్యుగపరిమాణవత్సరము.

24. చతుర్యుగపరిమాణవత్సరచక్రము

25. ద్వారచతుష్టయబంధనక్రమము.

పాణిద్వారబంధము, ఉపస్తద్వారబంధము, ఉదరద్వారబంధము, వాణిద్వారబంధము యీ4న్ను ద్వారచతుష్టయబంధన మనబడును. 49

26. చతుర్విధదైవోపాసకులక్రమము.

ద్విజాతులు, మునులు, అల్పబుద్ధులు, విదితాత్ములు యీ 4 న్ను చతుర్విధదైవోపాసకు లనంబడుదురు.


పంచసంఖ్యా ప్రకరణము

1. పంచభూతములు.

పృథివి, జలము, అగ్ని, వాయు, ఆకాశము యీ 5 న్ను పంచభూతము లనబడును.

2. పంచభూతస్థానములు.

పృథివికి గుదస్థానము, జలముకు లింగస్థానము, అగ్నికి నాభిస్థానము, వాయువునకు హృదయస్థానము, ఆకాశమునకు కంఠస్థానము.

3. పంచభూతరూపములు.

పృథివి పీతవర్ణము, జలము శ్వేతవర్ణము, అగ్ని రక్తవర్ణము, వాయువు కృష్ణవర్ణము, ఆకాశము నీలవర్ణము.

4. పంచభూతబీజములు.

పృథివికి లం బీజము, జలమును వం బీజము, అగ్నికి రం బీజము, వాయువుకు యం బీజము, ఆకాశమునకు హం బీజము. 50

5. పంచబ్రహ్మలు.

సద్యోజాతముఖబ్రహ్మ, నామదేవముఖబ్రహ్మ, అహోరముఖబ్రహ్మ, తత్పురుషముఖబ్రహ్మ, ఈశాన్యముఖబ్రహ్మ యీ 5 న్ను పంచముఖబ్రహ్మ లనబడుదురు.

6. పంచకర్తలు.

బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు యీ5న్ను పంచకర్త లనబడుదురు.

7. పంచశక్తులు.

క్రియాశక్తి, జ్నానశక్తి, ఇచ్ఛాశక్తి, పరాశక్తి, సహజశక్తి యీ 5 న్ను పంచశక్తు లనబడును.

8. జ్నానేంద్రియపంచకము.

శ్రోతము, త్వక్కు, చక్షు, జిహ్వా, ఘ్రాణము యీ 5 న్ను జ్నానేంద్రియము లనబడును. 51

9. పంచభుతచక్రము.

52
10. కర్మేంద్రియపంచకము.

వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్త యీ 5 న్ను కర్మేంద్రియము లనబడును.

11. వాయుపంచకము.

ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు యీ5న్ను వాయుపంచక మనబడును.

12. విషయపంచకము.

శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము యీ 5 న్ను విషయపంచక మనబడును. ఇదియే పంచతన్మాత్రలనియునుం జెప్పబడును.

13. పంచీకరణచక్రము.

14. పృథివిపంచగుణములు.

నరములు, యెముకలు, చర్మము, గోళ్లు, రోమములు, మాంసము యీ5న్ను పృథివిపంచగుణములు. 53

15. జలపంచగుణములు.

శ్లేష్మము, మూత్రము, రక్తము, శుక్లము, చమట యీ5న్ను జలపంచగుణములు.

16. అగ్నిపంచగుణములు.

ఆకలి, దప్పి, నిద్ర, ఆలస్యము, సంగమము యీ5న్ను అగ్నిపంచగుణములు.

17. వాయుపంచగుణములు.

చలించుట, వ్యాపించుట, సొలయుట, వ్రాలుట, అగలుట యీ5న్ను వాయుపంచగుణములు.

18. ఆకాశపంచగుణములు.

రాగము, ద్వేషము, భయము, లజ్జ, మోహము యీ5న్ను ఆకాశపంచగుణములు.

19. పంచభూత పంచీకరణ కదంబములు.

ఆకాశకదంబము, వాయుకదంబము, అగ్నికదంబము, జలకదంబము, పృధివికదంబము యీ5న్ను పంచభూత పంచీకరణ కదంబములు.

20. పంచకోశములు.

అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయకొశము, విజ్నానమయకోశము, ఆనందమయకొశము యీ5న్ను పంచకోశము లనబడును. 54

21. పంచావస్థలు.

జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తూర్యావస్థ, సహజావస్థ యీ5న్ను పంచావస్థ లనంబడును.

యీ అవస్థలు ఆత్మకు లేవనుటయే యీ విచారమునకు ఫలము.

22. పంచావస్తల స్థానములు.

జాగ్రదావస్తకు భ్రూమధ్యస్థానము, స్వప్నావస్తకు కంఠస్థానము, సుషుప్త్యావస్తకు హృదయస్థానము, తూర్యావస్తకు నాభిస్థానము, సహజావస్తకు గుహ్యస్థానము యీ5న్ను పంచావస్తల స్థానము లనంబడును.

23. పంచభ్రమలు.

భేదభ్రమ, కర్తృత్వభ్రమ, సంగితభ్రమ, కారిత్వభ్రమ, సత్యత్వభ్రమ యీ5న్ను పంచభ్రమ లనబడును. 55

24. పంచప్రళయములు.

నిత్యప్రళయము, అవాంతరప్రళయము, దైనందికప్రళయము, బ్రహ్మప్రళయము, అత్యంతికప్రళయము యీ5న్ను పంచప్రళయములు. 56

25. ముక్తిపంచకము.

సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, కైవల్యము యీ5న్ను ముక్తిపంచకము లనబడును.

26. పంచక్లేశములు.

అవిద్యాక్లేశము, అభినవక్లేశము, అస్థితక్లేశము, రాగక్లేశము, ద్వేషక్లేశము యీ5న్ను పంచక్లేశము లనబడును.

27. పంచాకాశములు.

హృదయాకాశము, గుణరహితాకాశము, పరాకాశము, మహాకాశము, తత్వాకాశము యీ5న్ను పంచాకాశము లనబడును. 57

28. పంచముద్రలు.

ఖేచరి, భూచరి, మధ్యలక్ష్యము, షణ్ముఖి, శాంభవి యీ 5 న్ను పంచముద్ర లనబడును.

29. పంచాగ్నులు.

ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని యీ 5 న్ను పంచాగ్ను లనబడును. 58

30. వివేకపంచకము.

ద్రుగ్ద్రుశ్యవివేకము, పంచకోశవివేకము, పంచభూతవివేకము, నామరూపవివేకము, తత్వవివేకము యీ5న్ను వివేకపంచక మనబడును.

31. కర్మకారణపంచకము.

దేహము, అహంకారము, శ్రోత్రాదికరణములు, ప్రాణాపానాది వ్యాపారములు, సూర్యాద్యధీ దైవములు యీ5న్ను కర్మకారణములు.

32. పంచమహాపాతకములు.

స్వర్ణస్తేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీగమనము యీనలువురి యొక్క సహవాసము యీ5న్ను పంచమహాపాతకము లనంబడును. ఇవి ప్రాణాంతకాలమం దైనను జేయగూడ దని పండితులు వచింతురు.

33. పంచకమలములు.

ఆధారకమలము, యొనికమలము, నాభికమలము, హృదయకమలము, ముఖకమలము యీ5న్ను పంచకమలము లనబడును. 59

34. పంచప్రయోజనములు.

జ్నానరక్ష, తపస్సు, సర్వసంపాదనము, దుఃఖసంచయము, సుఖావిర్భావము యీ5న్ను పంచప్రయోజనము లనబడును.

35. అంశపంచకము.

ఆస్తి, భాతి, ప్రియము, నామము, రూపము యీ5న్ను అంశపంచకము లనబడును.

36. పంచగవ్యములు.

గోమూత్రము, గోమయము, గోఘృతము, గోదధి, గోక్షీరము యీ5న్ను పంచగవ్య మనంబడును.

37. పంచామృతము.

ఉదకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె యీ5న్ను పంచామృతములు. 60

38. పంచయజ్నములు.

పాఠము, హోమము, సపర్య, తర్పణము, బలి యీ 5 న్ను పంచయజ్నము లనంబడును.

39. ప్రమోదితజనన్యాదిపంచకము.

జనని, జనకుడు, సద్గురు, అగ్నిహోత్రుడు, ఆత్ముడు యీ ఐదుగురినిన్ని ప్రమోదింపజేసి వారల ప్రసాదంబు వడయుట మేలని తాత్పర్యము.

40. ఏకోత్తరపంచభూతగుణములు.

ఆకాశమునకు శబ్దము, వాయువునకు శబ్దస్పర్శలు, అగ్నికి శబ్దస్పర్శ రూపములు, జలముకు శబ్దరూపరసములు, పృథివికి శబ్దస్పర్శరూప రసగంధములు గుణములని తెలియవలయు.

41. పంచభూతలయకాలనిర్ణయము.

పుట:SakalathatvaDharpanamu.pdf/69 62
42. పంచతత్వ బహిర్గమన ప్రమాణములు.

43. పంచతత్వ ఆకారములు.

44. పంచతత్వ గమన స్వరూపములు.

45. పంచతత్వ రసములు.

46. పంచతత్వ స్పర్శములు.

47. పంచతత్వాంశములు.

63
48. తత్వపంచకచక్రము.

49. పంచమలములు.

గద్య.

ఇది శ్రీమన్నారాయణ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మ వర

ప్రసాదలబ్ధ కవితా విలాస సందడి నాగదాస ప్రణీతంబైన

సకల తత్వార్థ దర్పణ మను వేదాంతశాస్త్రంబు

నందు త్రిసంఖ్యాప్రకరణము, చతుస్సం

ఖ్యాప్రకరణము, పంచసంఖ్యా

ప్రకరణంబులున్ గల

ప్రథమ నిరుక్తము సంపూర్ణము.