Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అష్టోత్తర శతతాళములు

వికీసోర్స్ నుండి

అష్టోత్తర శతతాళములు  :- భారతదేశమునందు సంగీతము సమగ్రముగా విలసిల్లినది. సంగీతమునందు గేయ వాఙ్మయము, వర్ణగణబద్ధమును, మాత్రాగణమూలకమునై యున్నది. పెక్కురీతుల గణములకు పెక్కు విధము లయిన తాళము లుండును. మనదేశమున వివిధ గేయములకు గల తాళములు ఇతరదేశములందు కానము. ఇతరదేశములవారికి మన తాళములు ఆశ్చర్యకరములును, ఆదర్శప్రాయములును అగును. ప్రాచీన కాలముననే మన సంగీతశాస్త్రమునందలి · అష్టోత్తర శత తాళములు బహువ్యాప్తినొంది, ఇప్పుడు అజ్ఞాతవాసమున నున్నవి. అట్లయ్యు నివి క్లిష్టములు, అసాధ్యములు, అగ్రాహ్యము లనదగదు. ప్రజ్ఞావంతులగు సంగీత విద్వాంసులకు ఇవి కొట్టిన పిండివలె నుండును.

సంగీతమందలి రాగములు, గమకరీతులు మున్నగు వాటివలె తాళములు ఒక్కరీతిగ నుండక దేశ కాల పరిస్థితుల ననుసరించి మారుచుండుట విదితము. ప్రాచీనము లయిన భరతుని నాట్యశాస్త్రమునందలి చచ్చత్పుటాదులు తరువాత శార్జదేవుని కాలమున (1210-1247) మార్గ తాళములుగ చెప్పబడెను. వీటిని పాలకుర్కి సోమనాథుడు శుద్ధము లనెను. శార్గదేవుడు తన సంగీత రత్నాకరమున వింశత్యధికళతతాళములను పేర్కొనగా సోమనాథుడును, తక్కినవారును అష్టోత్తరశతతాళములను మాత్రమే చెప్పిరి. కోహలుని తాళలకుణము, తాళకళావిలాసము, తాళప్రకరణము మున్నగు గ్రంథములందు 108 తాళములే లిఖింపబడెను. శార్ణదేవుడు స్వకల్పితము అయిన తాళములను కొన్ని చేర్చినట్లు దీనిచే విదితము. నారదుడు 108 తాళములనే చెప్పెను.

అష్టోత్తరశత తాళములు :ప్రాచీన కాలమునుండియు బహువిధ గేయములందు విలసిల్లినట్లు శార్ణ దేవాది సంగీత శాస్త్రవేత్తల ప్రబంధములందలి ప్రబంధరీతుల ననుసరించి తెలియుదుము. గీత ప్రబంధములు ఛందస్సు, తాళము, నాదము, లయ మున్నగువాటితో కూడియుండును. తాళములచే ధాతుమాతువులు (స్వర సాహిత్యములు) వర్ధిల్లును. తాళాంగములు తాళమును నిరూపించును. మాతువు మాత్రావృతమై ఆయా తాళాంగములను గుర్తింపజేయజాలును, అనుభవమున మాతువు ననుసరించి గేయము, త్రిపుట,రూపకము, ఝంప మున్నగుతాళములు కలవని ఎంచనగును. గీతము తాళము నధిష్ఠించి తాళా వర్తములతో పెరుగుచుండును. ఈ విధముగా కలిగినవే అష్టోత్తర శతతాళములు, శార్ణ దేవుడు త్రివిధ ప్రబంధములను చెప్పి అష్టవిధ సూఢలు పేర్కొనుచు, మఠ్య తాళము ద్వితీయ తాళము, కంకాళ తాళము, ప్రతితాళము మున్నగు వాటిని వివరించెను. ప్రబంధ విధముల ననుసరించి తాళముల కీ పెళ్ళేర్పడెను. అభిసంశ్రయ ప్రబంధములందు తురంగలీల, గజలీల, ద్విపద, పంచతా ళేశ్వరము అనువాటిని, విప్రకీర్ణ ప్రబంధముల ననుసరించి శ్రీరంగము, విజయ, త్రిపద, చతుర్ముఖ, సింహలీల, హంసలీల, దండకము, ధవళము మున్నగువాటిని చెప్పెను. ఈ వేళ్ళతోనే తాళములుకూడ వెలయింపబడెను.

అష్టోత్తర శతతాళములు దశ ప్రాణాత్మకములు. ముఖ్యముగ నివి కాల, మార్గ, క్రియా, అంగ, గ్రహ, జాతి,కళాలయ - యతి ప్రసారయుతములు, మార్గకళలు ప్రాచీన చచ్చత్పుటాదులందే కలవు. శార్గ దేవుని, కాలపు దేశీయతాళములందు చతురశ్ర, త్రిశ్ర అను రెండు జాతులే కలవు. శార్జదేవు డిట్లు చెప్పెను: "చతురశ్ర స్తథా త్య్రశ్ర ఇతి తాళో ద్విధా మతః". పూర్వము ద్రుత, లఘు, గురు, ప్లుతాంగముల ప్రస్తావముచే అష్టోత్తర శతతాళము లేర్పడెను. అట్లయ్యు నీ తాళములు క్రమ ప్రస్తారమున లేవని తెలియగలము. కొన్నిట ప్లుతము లేదు. ఇట్టివి 67 తాళములు గలవు. ఒక ద్రుతము, రెండు, నాలుగు, ఆరు ద్రుతములు గలట్టివియు, ఒక లఘువు, రెండు, నాలుగు లఘువులు గలట్టివియు తాళములు గలవు. ద్రుత, లఘువులు మాత్రము గలట్టివి 35 తాళములు కలవు. ఈ సంఖ్య చొప్పుననే ఇప్పటి మన సూళాదులున్నవి. ద్రుతములేకయే లఘు, గురు, ప్లుతములు గలవి 43 తాళములు కలవు. మూడు, ఆరు అక్షరకాలము లెంచుటకు ద్రుతవిరామము, లఘు విరామము అను తాళ - అంగములు కూడ చేర్పబడెను. అందుచే పెక్కు అంగములతో తాళము లెంచవలసి యుండెను. అనంతరము "తాళలక్షణమ్" "తాళ కళా విలాసమ్" మున్నగు గ్రంథముల కాలములందు ఈతాళములు కొన్నిటియందు అనుద్రుతమును చేర్చి చెప్పబడెను. తాళములందు అంగముల పేళ్ళు చేర్చి పేర్కొనుటకు మారుగ వాటికి అంగసంజ్ఞ లేర్పరచి, వాటినివివరించుట ప్రాచీన కాలమునుండి తెలియుదుము ఒక అక్షర కాలము

గల అనుద్రుతమునకు గుర్తును, ఇట్లే రెండక్షరముల కాలముగల ద్రుతమునకు ౦ గుర్తును, నాలుగక్షరములు గల లఘువునకు గుర్తును, ఎనిమిది అక్షరములుగల గురువునకు ఏ గుర్తును, పండ్రెండక్షరములుగల దానికి గుర్తును చెప్పబడెను. విరామమును ఎంచుటకు అంగ సంజ్ఞకు శిఖరము చేర్చి 89 గుర్తులు చెప్పబడెను. క దేశీయములగు పూర్వపు అష్టోత్తరశత తాళములు అంగసంజ్ఞలతో నిట్లున్నవి : (1) ఆదితాళము 1 (2) ద్వితీయతాళము OOl (8) తృతీయతాళము 008 (4) చతుర్థ తాళము 110 (5) పంచమ తాళము 00 (6) నిశ్శంకలీల తాళము SSSSI (7) దర్పణతాళము OOS (8) సింహవిక్రమ తాళము SSSISISS (8) రతి లీల తాళము ISS (10) సింహలీల తాళము 0001 (11) కందర్పతాళము OOISS (12) వీరవిక్రమ తాళము TOOS (18) రంగతాళము 00005 (14) శ్రీరంగ తాళము IISIŚ (15) చచ్చరితాళము ంగ్ ంగ్ ంంంగ్ ဝပ်ဝပ်ဝပ်ဝပ်၊ (18) ప్రత్యంగ తాళము SSSI (17) యతిలఘ్న తాళము 01 (18) గజలీల తాళము Iii (18) హంసలీల తాళము (20) వర్ణభిన్న ణ IISS తాళము OOIS (21) త్రిభిన్న తాళము ISS (22) రాజ చూడామణి తాళము OlliOOS (28) రంగద్యోత తాళము SSSIS (24) రంగప్రదీపిక తాళము SSISక (25) రాజ తాళము SSOOSIS (28) త్రిభ్రవర్ణ తాళము 11OO11 (27) మిశ్రవర్ణ తాళము 000000000006 SSOOSIS (28) చతురశ్రవర్ణ తాళము Sloos (29) సింహవిక్రీడిత తాళము ! SSSSSISSIS (30) జయ తాళము ISHOOS (81) వనమాలి తాళము 00001 OOS (82) హంసనాద తాళము ISOOS (88) సింహ నాద తాళము ISSIS (84) కుడుక్క తాళము 00ll (85) శురంగలీల తాళము 6000 (88) శరభలీల తాళము ||౦౦౦౦॥ (37) సింహనందన తాళము SSISISOOSSIŚISS॥ (88) త్రిభంగి తాళము (89) రంగాభరణ తాళము SSIIS (40) మఠ్య తాళము IIS (41) కోకిలప్రియ తాళము SIS (42) నిస్సారుక తాళము li (48) రాజ విద్యాధర తాళము ISOO (44) జయమంగళ తాళము ISIS (45) మల్లి కామోద తాళము 110000 (48) విజయనందన తాళము IISSS (47) క్రీడ తాళము 60 (48) జయశ్రీ తాళము SISIS (49) మకరంద తాళము lll (50) కీర్తి తాళము ISSIŚ (51) శ్రీకీర్తి శాళము SSII (52) ప్రతి తాళము 1100 (58) విజయ తాళము SSSI (54) బిందు మాలి తాళము SOOOS (55) సమతాళము ॥వర్ (56) నందనతాళము 100S (57) మంఠిక తాళము SOS (58) దీపక తాళము OOllSS (59) ఉదీక్షణ తాళము IIS (60) ఢంకీ తాళము SIS (61) విషమ తాళము 0000000Ö (92) వర్ణమంఠిక తాళము (88) అభినంద తాళముHOOS (84) నందీ తాళము lOOIISS (86) మల్లతాళము IIంగ్ (88) పూర్ణకంకాల తాళము 0000SI (87) కందుక తాళము IIIIS (68) కుముదతాళము 1OOIIS (69) ఏక తాళము O (70) చతుస్తాల తాళము 5000 (71) ఖండ ប కంకాళ తాళము OOSS (72) డోంబులి తాళము (78) అభంగ తాళము IS (74) రాయబంగాళ తాళము SISOO (75) వసంత తాళము HISSS (78) లఘు శేఖర Soś Ilooĺoo 397 తాళము i అష్టోత్తర శతతాళములు తాళము కంఠ (77) ప్రతాప శేఖర (78) ఝంపతాళము రీ61 (79) గజఝంప రాళము sooo (80) చతుర్ముఖ తాళము ISIŚ (81) మదన తాళము OOS (82) ప్రతిమఠ్య తాళము ॥SSI (88) పార్వతీలోచన తాళము SSSISSSOO (84) రతి తాళము IS (86) లీలా తాళము Olf (86) కరణ యతి తాళము 0000 (87) లలిత తాళము OOIS (88) గారు తాళము 0008 (88) రాజనారాయణ OOISIS (80) లక్ష్మీళ తాళము Oois తాళము r (91) లలితప్రియ తాళము ISIS (92) శ్రీ నందన తాళము SIIS (98) జనక తాళము HISSISS (94) అనంగ తాళము ISIS (95) వర్ధన తాళము OOIS (96) షట్ తాళము 000000 (97) అంత ర క్రీడ తాళము OOS (98) ఉత్సవ తాళము 15 (99) విలో కిత తాళము SOOS (100) వర్ణయతి తాళము 1100 (101) కరణ తాళము S (102) స్కంధ తాళము SISOOSS (103) అడ్డ తాళము Oll (104) కలధ్వని తాళము IISIŚ (105) సమకంకాళ తాళము SSI (108) విషమ కంకాళ తాళము ISS (107) ఖండ కంకాళ తాళము OOSS (108) సింహ తాళము IOIII. శార్ణదేవుడు దేశీయ శాళములందు మరి పండ్రెండు స్వకల్పితములను చేర్చి 120 తాళములను చెప్పెను. ఈయన చెప్పిన హంస, గజ, సారస, చండ, చంద్రకళ, లయ, దండా, ద్వంద, కువింద, గౌరీ, సరస్వతీ కంఠా భరణ, భగ్న, రాజమృగాంక, రాజమార్తాండ, నిళ్ళంక శారదేవాది తాళములను తదితరులు చెప్పలేదు. పూర్వో క్తములయిన తాళము లిట్లు కాలానుసారముగ గొంత మార్పునకు లోనగుచుండెను. నారదుడు తెలిపిన జనత, మల్ల, కంకాళములు అను తాళములను శార్ణ దేవుడు చెప్ప లేదు. ఇంచుమించు శారదేవుని కాలమునాటికి పాలకుర్కి సోమనాథుడు (క్రీ. శ. 1190-1265) ఆంధ్రదేశము నందు విశ్రుతములని కాబోలు మిశ్రవర్ణ చతురశ్రవర్ణ, ప్రభృతి తాళములు వేరు పేరులు గలట్టి వాటిని, భిన్న " విధమున చెప్పెను. ఈతడు చచ్చత్పుటాదులను ప్రథమ సప్తకములుగ జెప్పి యిరువదియేడు శుద్ధ తాళములను, 74 దేశీయ తాళములను పేర్కొనెను ఈతని ధ్రువలయ ధ్రువ, మఠ్య తాళములు నేటి ధ్రువతాళాదులకు కారణముగ గన్పట్టును. వివిధ కంకాళములు, మఠ్యలు చతురశ్ర, తిశ్ర, మిశ్ర, ఖండవర్ణ తాళములు ఈతడు పేర్కొనుటచే ఆ కాలమున ఆంధ్రదేశమున ఈ తాళములు వ్యాప్తియం దుండినట్లు తెలియుచున్నది. మరియు సోమనాథుడు రూపక తాళమును చెప్పుట చేతను, శార్ణ దేవుడు ఈ రూపక తాళమును పేర్కొనకపోవుటచేతను ఔత్తరీయ సంగీత విధానమున నీ తాళము లేకుండినట్లు ఎంచనగును. ఆంధ్రప్రాంతమునకు చేరువనున్న ఉత్కళ దేశము నందు జయదేవుడు రూపక తాళమును తెలిసి అష్టపదు లందు వాడినాడు.

జయదేవుడు ఇరువదినాలుగు అష్టపదులలోను, యతి తాళమును పదకొండు గేయములందును, ఏక తాళమును ఆరింటియందును, రూపక తాళమును ఐదింటియందును, అష్టతాళమును, నిస్సారుక తాళమును, ఒక్కొక్క గేయము నందును చేర్చినాడు, అష్టతాళమును అడ్డ తాళములుగ నెంచ నగును. ఈతని నిస్సారుక తాళము పది మాత్రలు కలదిగను, యతితాళము 1100 ఇట్లు 12 మాత్రలు కలదిగను ఎంచబడును. ఇటీవల కుంభరాణ అనునతడు కొన్ని గేయములందు ప్రతితాళమును చేర్చి అష్టపదులకు వ్యాఖ్యానము రచించెను. ప్రతితాళము శార్ణదేవుడు చెప్పినట్లు 1100 ఇట్టి అంగములతో నుంటచే నిది మన అటతాళమునకు తుల్యమగుచున్నది. ప్రతి అను తాళము ఆ కాలమున ప్రాధాన్యమును వహించినట్లు కుంభరాణ తెలిపినాడు.

కోహలుని తాళ లక్షణము, "తాళ ప్రకరణము” "తాళకళావిలాసము" "తాళదీపిక" మున్నగు గ్రంథము లందు చెప్పబడిన సమకంకాళ, విషమకంకాళ ఖండ కంకాళ, పరాక్రమ, చలమంఠిక, సగుణమంఠిక, వక్ర,గరుడ, కుంభ, భరణమంఠిక తాళములను శార్గదేవుడు చెప్పలేదు. వీటిని కొన్ని సోమనాథుడు చెప్పెను. వక్ర, గరుడ, కుంభ, ప్రభృతి తాళములు అంత వ్యా ప్తినొంది యుండలేదు.


రాగములవలె తాళము లన్నియు ఏకాలమం దయినను వ్యాప్తియం దున్నట్లు ఎంచవీలులేదు. కొన్ని కల్పితములుగ నుండి విజ్ఞానవంతులగు నేర్పరులకుమాత్రమే సువిదితము లగుచున్నవి. అందుచే అట్టి వాటిని అసాధ్యములుగను, అవేద్యములుగను చెప్పుటకు వీలు లేదు. అష్టోత్తర శతతాళము లిట్టివే. ఇవన్నియును ఏకాలమందయి,నను విశేష వ్యాప్తిగలవానిగ నెంచ నేరము. కొన్ని ఆది, మఠ్య, ఝంప, యతి, ఏక, ప్రతి, నిస్సారుక, రూపక, అడ్డాది తాళములు బహుళ వ్యాప్తినొందియున్నవి. ఇట్లే ఆధునిక సూళాదు లన్నియు బహుళ వ్యాప్తి నొందినవి కావు. ఆట, త్రిపుట మున్నగు తాళములు తెనుగు గేయములందు మిక్కిలి వాడుకలో నున్నవి. వీటిలో ఖండ, మిశ్ర, సంకీర్ణ జాతులతోగల తాళములు ప్రచారము అల్పముగ నున్నది.

క్రీ. శ. 15 వ శతాబ్దియందు కుంభరాణా అనునతడు (క్రీ. శ. 1433-1468) ఝంప, ఆది, ప్రతిమఠ్య, అడ్డ, చతుర్మాత్ర మఠ్య, పర్ణయతి, నవమాత్రమఠ్య, నిస్సారుక రూపక, ద్రుతమంఠిక, ప్రతి, ఏక, త్రిపుట, అను 13 తాళ ములను చెప్పెను. ఆ కాలమునాటి గోపీంద్రతిప్పభూపాలుడు రచించిన "తాళదీపిక" అను గ్రంథమందుకూడ ఈ విషయము కలదు. ఆ కాలమునుండి వెలువడిన గేయ వాఙ్మయ రీతులయందలి యక్షగానములు, కురవంజులు మున్నగుపాటలు ఆది, అడ్డ, తివడ, ఏక, మఠ్య, రూపక, ఝంప తాళములలో చెప్పబడినట్లు తెలియుచున్నది. క్రీ. శ. 16 వ శతాబ్దియందలి తాళ్లపాక వారి గేయము లందును రూపక, ఝంప, తివడ, పంచఘాత, మఠ్య, అట, ఏక, చావు, చేతాళము అనునవి గలవు. 17 వ శతాబ్దియందలి సుగ్రీవ విజయము మున్నగు యక్ష గానములందు అట, ఏక, రూపక, ఝంప, ఆది, తివడ తాళములు చెప్పబడినవి. కంకంటి పాపరాజుగారి యక్ష గానమున త్రిపుట తాళము ఎక్కువగా వాడబడెను. ఆది, ఝంప తాళములును కలవు. తంజావూరు రఘునాథరాయలు (క్రీ. శ. 1614 -1637) ఆది, ద్వితీయ,జయమంగళ, రంగ, శ్రీరంగ, రతి, హంసలీల, కంకాళ, ఖండ, కుడుక్క, టెంకిక, జయనందన, విజయము అను తాళములను పేర్కొనెను. ఇట్లు ముఖ్యములగు కొన్ని తాళములు బహుళ వ్యాప్తిలోనికి వచ్చుచుండెను. అష్తొత్తర శతములందలివి కొన్ని ఇప్పటి మనసూళాదులందు కలవు. ఇప్పటి ఆది, మఠ్య, అడ్డ, ఏక, ఝంప, రూపక తాళములు ప్రాచీన తాళములందు తెలియవచ్చినను, ఇప్పటి తాళములందలి అంగములు వాటి యొక్క మాత్రాకాలములు పూర్వపు తాళములందుకంటె భిన్నములుగ నున్నవి. ఆదితాళ మిప్పుడు 100 అంగములతో ఎనిమిది అక్షరములు కలిగియున్నది. కాని పూర్వ మియ్యది ఒక్క లఘువును మాత్రము కలిగియుండెను. ఇప్పటి అట 1100 అంగములతో నుండగా పూర్వమియ్యది 10 మాత్రలుగల 0౹౹ అంగములు గలదై యుండెను. ఇప్పట ఏక తాళము ఒక్క లఘువుతోనుండగా పూర్వము అది ఒక్క ద్రుతమునే కలిగియుండెను. ఇప్పుడు మఠ్య తాళము 101 అంగములతో నుండగా పూర్వము ఇది SOS ఇట్లు అంగములు కలిగియుండెను. మన ఝంప తాళము IUO అను అంగములతోనుండగా పూర్వమున నిది 10 మాత్రలు గల SSI అను అంగములతో నుండెను.

మరియు నిప్పటి కొన్ని నూళాదులకును పూర్వపు తాళములకును కొన్నిపోలికలు కలవు. కొన్ని అంతర్భూతములుగ నుండునట్లు ఎంచనగును. శార్గ దేవుడు తెలిపిన యతిలఘ్న ఇప్పటి రూపకముకు తుల్యముగ నున్నది. ప్రతి అనుతాళము ఇప్పటి అటతాళమునకును, ఝంప తాళము ఇప్పటి మిశ్ర ఝంపతాళమునకును, తురంగ లీల తాళము ఇప్పటి ఆదితాళమునకును, సమచావు తాళమునకును తుల్యముగ నున్నవి. తక్కిన తాళములను గూడ ఇట్లే పోల్చి ఎంచనగును.

ధ్రువతాళము గీత ప్రబంధమునందలి ధ్రువఖండము ననుసరించి గ్రహింపబడియుండును. సోమనాథుడు ధ్రువలయ, ధ్రువమఠ్యలు అనువాటిని తెలిపెను. ఆధునిక తాళములందు ఇవి చెప్పబడినను గీతములందు మాత్రమే వీటిని మనవారు చేర్చిరి.

త్రిపుట లేక శివడ (తేవడ) అన్నమాచార్యుల కీర్తన లందు ప్రప్రథమముగ చెప్పబడెను. పద ప్రబంధమున కను గుణముగ నీతాళము చెప్పబడియుండును. ఇది శార్గ దేవుని తృతీయలేక తురంగలీల తాళమునకు తుల్యమగును. తాళ్ళపాకవారు చెప్పిన చౌ తాళము, చౌ జౌత్తరీయ తాళములందు కలదు. ఇయ్యది 1100 అను అంగములతో నుండుటచే దీనిని మన అటతాళమునకు తుల్యముగ నెంచనగును.

నేడు సూళాది సప్తతాళములు వాడుకలో నున్నవి. పూర్వపు అష్టోత్తరశత తాళములు మరుగుపడినను అయ్యవి అంతరించినట్లు ఎంచుటకు వీలులేదని తెలిపితిమి. శతవర్షములకు ముందుండిన రామస్వామి దీక్షితులు సప్తతాళములతో మరి యేబదినాల్గు తాళములను అష్టోత్తరశత తాళములనుండి జేర్చి అరువదొక్క తాళములతో రాగమాలికను పాడి విశ్రుతుడయ్యెను. పూర్వపు తాళములు అసాధ్యము లను వారి కయ్యవి సుసాధ్యములని ఇతడు ప్రకటించుచు, వాటితో రాగమాలికను నేర్పుతో చెప్పగలుగుట ఇతని వైశిష్ట్య మన చెల్లును. ఈరాగమాలికయందలి తాళములు (1) ధ్రువ (2) మఠ్య(3) రూపక (4) ఝంప (5) త్రిపుట (6) అట(7) ఏక (8) లలిత, (9) లక్షణ (10) రతిలీల (11) జయ, (12) దర్పణ (13) రాజచూడామణి (14) మదన (15) రతి (16)రాజ (17) కీర్తి (18) కుందర (కందుక) (19) మదన (20) క్రీడ (21) విజయనందన (22) రంగ (23) ఆనంగ (24) వీరవిక్రమ (25) సింహ లీల (26) పరిక్రమ (27) సంపద్వేష్ట (28) సమ (29) సింహ విక్రమ (30) చతుర్ముఖ (31) శ్రీనందన (32) విషమ (33) లఘుశేఖర (34) వసంత (35) వన మాలి (36) శ్రీ కీ ర్తి · (37) తృతీయ (38) అంతర క్రీడ (39) అభంగ (40) పార్వతీ (లోచన) (41) కోకిల ప్రియ (42) హంసనాద (43) కందర్ప (44) శ్రీరంగ (45) ప్రతాప శేఖర (46) రాగవర్ధన (47) లలిత (48) శ్రీకీర్తి (49) విలోకిత (50) ముకుంద (51) రాజ విద్య (52) చతుర్థ (53) కుడుక్కు (కుటుంబ) (54) విజయ (55) తురంగలీల. (56) మకరంద (57) నందన (58) రాజబంగాళ (59) నంది (నది)(60) కళ (61) శ్రీ అను పేళ్ళతో నున్నవి. ఇందు లక్షణ, శ్రీ కళ అను తాళములు అష్టోత్తర శతతాళము లందు లేవు. ఈ తాళములందలి అంగములకు సశబ్ద. నిశ్శబ్ద క్రియలను పాటించుచు గానము చేయుట విద్వాం నుల కే సాధ్యపడగలదు.ఆ విధముగా గానము చేయబడినపుడే వాటికి ప్రయోజనము కలదు.

వి. వ. న.

[[వర్గం:]]