Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికాఖండము-2దక్షిణము (భూగోళము)

వికీసోర్స్ నుండి

అమెరికాఖండము-2దక్షిణము (భూగోళము): దక్షిణ అమెరికా ఖండము ఉత్తరమున వెడల్పుగాను, దక్షిణమున సన్నముగాను, మేకుకొనవలెనున్నది. ఇది 70 లక్షల చ. మై. వై శాల్యముకలిగి ఇండియాకన్నను 5½ రెట్లు పెద్దదిగా నున్నది. పుదుచ్చేరియున్న అంశము పైన దీని ఉత్తరపుఅంచు, 55 దక్షిణ అక్షాంశముపైన దీని దక్షిణపు కొన ఉన్నవి. ఉత్తర అమెరికా సరస్సుల యొక్క తూర్పుఅంచులను తాకుచుపోవు 80° పశ్చిమ రేఖాంశముపై ఈ ఖండపు పశ్చిమపు అంచును, తూర్పు గ్రీన్లాండు గుండాపోవు 35° పశ్చిమ రేఖాంశముపై దీని తూర్పు అంచును కలవు. భూమధ్య రేఖ దాదాపు మెజాన్ నదీముఖ ద్వారమునంటి పోవుచున్నది. ఈ ఖండము యొక్క ఎక్కువభాగము ఉష్ణమండలములో నున్నది. కొద్దిభాగము మాత్రము భూమధ్య రేఖకు ఉత్తరముననున్నను, ఖండము దక్షిణార్ధగోళమున కుచెందినది. ఈ గోళములో నున్న భూభాగము లన్నింటికంటే ఈ ఖండమే ఎక్కువ దక్షిణమునకు వ్యాపించియున్నది. ఈ ఖండములోని పెంటాఎరినాస్ (Penta Arinas) అను పట్టణము దక్షిణార్ధగోళములో నన్నిటికంటె మిక్కిలి దక్షిణమున నున్నది.

నైసర్గిక స్వరూపము  : దక్షిణ అమెరికా యొక్క నైసర్గిక స్వరూపము శీతోష్ణస్థితులు, సులభగ్రాహ్యములు. ఆండీస్ పర్వత పంక్తి పశ్చిమతీరమునంతయు 5000 మైళ్లు వ్యాపించియున్నది. ఇందు చింబరోజో, కొటో పాక్సివంటి అగ్నిపర్వతములును ఎత్తైన పీఠభూములును, సరస్సును కలవు. ఇది మడతలుగానుండును. భూగర్భశాస్త్రజ్ఞులు ఇది ఇటీవలెనే ఉద్భవించినదందురు. పసిఫిక్ తీర పర్వతపంక్తి చిన్నది. ఇది దక్షిణ చిలీ దేశమునందలి శిలాద్వీపములలో నంతమగుచున్నది. ఖండమునకు ఈశాన్య భాగమున నున్న బ్రెజిలుగయానా ఉన్నత భూములు ఆండీస్ పర్వతముల కంటేను మిక్కిలి పూర్వము ఉత్పన్నమైనవి. ఇవి మిక్కిలి కఠినమైన పురాతన శిలలతో నిర్మితమైనవి. పై రెండింటికిని మధ్య ఉత్తర దక్షిణములుగా, వ్యాపించియున్న మైదానములు మరియొక విభాగము. ఈ మైదానములను తిరిగి ఒరినాకో. అమెజాన్, పేరానా— పెరాగ్వేనదీపరీవాహక మైదానములుగా విభజించవచ్చును. వాయవ్యమున కాకా— మాగ్డలీనా నదీప్రాంతములుకూడ మైదానములే. ఖండపు దక్షిణపు కొననున్న పెటగోనియా ఎడారి పీఠభూమి ప్రాంతము. ఇదిగాక పసిఫిక్ తీరము నంటియున్న సన్నని తీరపు మైదానము మరియొక విభాగము.

ఆండీస్ పర్వతములు పశ్చిమతీరముననే ఉండుట వలనను, వర్షమునిచ్చుపవనములు తూర్పుననుండి వీచుట వలనను, ఖండము వెడల్పునను ప్రవహించి ఏకరీతి నదులన్నియు అట్లాంటిక్ మహాసముద్రమును చేరును. ఇది దక్షిణ అమెరికా యొక్క విశేష లక్షణము. గయానా బ్రెజిలు ఉన్నతభూములు నదీమైదానములకు విభజన ప్రాంతములుగా నున్నవి.పసిఫిక్ తీరమున చెప్పదగిన నదులు లేవు.

శీతొష్ణస్థితి - సహజవృక్ష సంపద : పైన పేర్కొన్న విధమున ఆండిస్ పర్వతముల యునికియు, ఖండము చాల భాగము ఉష్ణమండలమున నుండుటయు శీతోష్ణస్థితి పైనను, వర్షపాతముపైనను, ప్రాబల్యమును వహించు చున్నవి. జూలై నెల, అనగా దక్షిణార్ధ గోళపు శీతకాలములో ఈ ఖండపు ఉత్తర భాగము వేడిగా నుండి దక్షిణమునకు పోయినకొలది క్రమముగా వేడిమి తగ్గుచుండును. పర్వతములలోను ఉన్నత భూములలోను ప్రాంతీయ శీతలము వ్యాపించి యుండును. జనవరి నెల అనగా దక్షిణార్ధ గోళపు వేసవిలో ఉష్ణమండలము దక్షిణముగా మధ్య బ్రెజిలు యొక్క పల్లపు ప్రాంతము లకు జరుగును. కాని దావుననేయున్న ఉన్నత భూముల యందు ఆండీస్ పర్వత ప్రాంతములయందు శీతము

కనిపించును. రెండు కాలములయందును పెరూ శీతల జల ప్రవాహము వలన పశ్చిమతీరము చల్లగాను, బ్రెజిలు ఉష్ణజల ప్రవాహము వలన తూర్పు తీరము వెచ్చగాను ఉండును.నిరంతరము వీచు ఈశాన్య ఆగ్నేయ వ్యాపార పవనములు ప్రధానమైనవి. ఇవి ఆండీస్ పర్వతముల ప్రతిబంధకముచే అమెజాన్ పరీవాహక ప్రదేశమునకును, తూర్పు ఉన్నత భూముల ప్రతిబంధకముచే అట్లాంటిక్ తీరమునకును, బ్రెజిలు ఆగ్నేయ భాగమునకును సంవత్సరము పొడుగునను వర్షము నిచ్చును. ప్రాంతీయ ఋతుపవనముల వలన

వాయవ్యముననున్న కొలంబియా దేశపు పసిఫిక్ ప్రాంతమునను, పశ్చిమ పవనముల వలన దక్షిణ చిలీ దేశమునను, సంవత్సరమంతయు వర్షము పడును. తక్కిన బ్రెజిలు దేశమందును, ఉత్తరముననున్న దేశములందును, ముఖ్యముగా వేసవిలోనే వర్షము పడును. ఉత్తర పసిఫిక్ తీరము ఆండీస్ పర్వతములకు పశ్చిమమున వ్యాపార పవనములకు చాటున నున్నది. అందుచేనిది పొడిగనుండును. అందుచేత అటకామా (Atacama) ఎడారి యేర్పడెను. అదే విధమున పశ్చిమ పవనముల మార్గములో ఆండీస్ పర్వతముల చాటుననున్న ఖండపు దక్షిణ ప్రాంతము వర్షములేక ఎడారిగా నున్నది. దీనినే పెటగొనియా యెడారి యందురు. వాల్పరయిజో పట్టణమునకు దక్షిణముగా మధ్య చిలీ దేశములో కొంత భాగమున్నది. అది సూర్యాను గుణముగా శీతకాలములో నుత్తరముగా చలించు పశ్చిమ పవనములకును వాటి వర్షపాతమునకును శీతకాలమున లోనగు చుండును. ఈ ప్రాంతమున మధ్యధరా శీతోష్ణస్థితి కనిపించును.

సహజ వృక్ష సంపదగాని, సహజమండలములుగాని, శీతోష్ణస్థితిపై ఆధారపడియుండును. అమెజాను పరీవాహక ప్రాంతములయందును బ్రెజిలు తూర్పు తీరము నందును ఖండపు టుత్తర తీరములయందున సెల్వాస్ అని పిలువబడు ఉష్ణమండలారణ్యములు వ్యాపించి యున్నవి. అల్ప వర్షపాతముగల ప్రాంతములలో ఉష్ణ అల్పవర్షపాతముగల ప్రాంతములలో మండలపు పచ్చిక బీడులు వ్యాపించి యున్నవి. వీటికే ఒరినాకో పరీవాహక ప్రాంతమున 'సవనా' లనియు, గయానా ఉన్నత ప్రాంతముల 'లానాలు అన్నియు, బ్రెజిలు ఉన్నత ప్రాంతముల 'కాంపోవ్' అనియు ప్రాంతీయముగా పేర్లుగలవు, కాంపోసుకు దక్షిణముగా పెరానా- పెరుగ్వేనదీమండలములో సమశీతోష్ణ మండ లారణ్యములు గలవు. వీటికి దక్షిణముగా వెరానా - ఉరుగ్వే నదీముఖమండలముల చుట్టూ- అర్జంటీనాలో పంపాస్ అని పిలువబడు మధ్య ఆక్షాంశపు పచ్చికబీడులు కలవు. దక్షిణచిలీలో సమశీతోష్ణమండల పత్ర విసర్జక (Deciduous) అరణ్యములు వ్యాపించి యున్నవి. దీనికి ఉత్తరమున మధ్య చిలీలో మధ్యధరా వృక్ష సంపద కలదు. ఇంకను ఉత్తరముగా చిలీ పెరూ దేశపు పసిఫిక్ తీరములు ఉష్ణమండలపు ఎడారులుగాను దక్షిణ అర్బంటొనాలో పెటగోనియా సమశీతలపు ఎడారిగాను ఉన్నవి. ఇవికాక ఆండీస్ పర్వతములలోని సహజవృక్ష సంపద శీతోష్ణస్థితి, దాని ఎత్తు, అందలి వర్షపాతము పీఠభూములును నియమించుచుండును.

ఉత్పత్తి  ; దక్షిణ అమెరికా, వ్యవసాయము ముఖ్యముగాగల ఖండము. వృత్తులనుబట్టి ఈ ఖండమును రెండు ప్రత్యేక ముండలములుగా విభజించవచ్చును. విరివిగా ఖనిజములను కలిగిన ఆండీస్ పర్వతములు, తూర్పుననున్న ఉన్నతభూములు ఒక భాగము; వ్యవసాయము, వ్యవసాయపరిశ్రమలు ప్రధానముగా గల అట్లాంటిక్ తీరప్రాంతములు, పెరానా పెరాగ్వే నదీమండలము, పసిఫిక్ తీరపు మధ్యధరా మండలము మరియొక భాగము.

దక్షిణ అమెరికాలో పెక్కు ప్రాంతములు జన సమ్మర్దము లేనివి. ఈ క్రింది ప్రాంతములు ఖండమున అక్కడక్కడ చెదరియున్నవి. వ్యవసాయము గాని గనుల త్రవ్వుటగాని అందలి జనుల వృత్తులు,

ఆండీస్ పర్వతపు లోయలలోను, పీఠభూములలోను, వెనుజులా దేశములోను, కొలంబియాలోని పర్వత భాగములలోను కాఫీ, మొక్కజొన్న పండును.

కొలంబియా యందలి కాకా, మాగ్డలీనా నదుల లోయలలో కోకో, చెరకు, ప్రత్తి, అరటిపండ్లు పండును. గయనాతీర భూములందు చెరకు, వరి పండును. బ్రెజిలు దేశపు తూర్పుతీరములలో ప్రత్తి, చెరకు, రబ్బరు, కాఫీ, పండును. దక్షిణ బ్రెజీలులో ఊరుగ్వే నంటియున్న ప్రాంతములలో పశుపోషణము జరుగును, పెరానా...పెరాగ్వే నదీమండలముల యందలి ఉష్ణమండ లారణ్య ప్రాంతములలో, స్వల్పముగా ప్రత్తిపండును. అర్జెంటీనాలోని పంపాస్ ప్రాంతములో గోధుమ విరివిగాపండును. అచ్చట ధాన్యపు మరలు, మాంసమును టిన్నులలో నమర్చు కార్ఖానాలు, నూలు వస్త్రముల మిల్లులు కలవు. అర్జెంటీనాలోని పంపాస్ కు పశ్చిమప్రాంతమున చెరకును. ప్రత్తిని, పొగాకును, జనపనారను పండింతురు. వ్యవసాయ పరిశ్రమలు ఉరుగ్వేలోను, పెరాగ్వేలోను కలవు. చెరకు, ప్రత్తి, పెరూ దేశపు పసిఫిక్ తీరమునందలి పంటలు. ట్రినిడాడు దీవిలో విలువగల నూనెగనులు వెనూజులాలో మకరైబో నూనెగనులు కలవు. కొలంబియా యందలి పర్వత భాగములలో నూనెగనులు లభించు ప్రదేశములు కలవు. అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత ప్రాంతములలో ఇటీవల ఏర్పడిన నూనెగను లున్నవి. పెరూ దేశమందలి ఉత్తల పసిఫిక్ తీరమండలమున నూనెగనులు కలవు. బొలివియాలోని మాంటనా పర్వతములలో నూనెగను లున్నవి. గయానా ఉన్నత భూములలో బంగారము, రత్నములు, బాక్సైటు లభించుతావులు కలవు. పెరూదేశపు ఆండీస్ పర్వతప్రాంతమునను టిటికాకా లోయలోను, పశ్చిమ బొలివియాలోను, వెండి, సీసము, బంగారము, రాగి, తగరము లభించును. అటకామా ఎడారిలో నత్రజము, అ యొ డిను,రాగి, వెండి దొరకును.

వ్యవసాయమే ప్రధానముగా కలిగి ఖనిజోత్పత్తి యందు ప్రారంభదశయందున్న ఈ ఖండములో వాహక సౌకర్యములు చాలతక్కువ. సమశీతల మండలపు పచ్చిక బీడులయందలి వ్యవసాయపు పంటలను విదేశముల కెగుమతిచేయుటకై బాహియా, బ్లాంకా, బ్యూనస్, ఏయిర్స్ రేవులకు తీసికొనిపోవుటకై అర్జెంటినా దేశమున రైలు మార్గములు పెక్కులు నిర్మింపబడియున్నవి. ఇచ్చట నుండి ఊరుగ్వేదేశమునకును, జనసంఖ్య విశేషముగాగల బ్రెజిలు తూర్పుతీర ప్రాంతమునకు రైలుమార్గ సౌకర్యములు కలవు. ఈశాన్యముననున్న బ్రెజిలులో తీరప్రాంతములకు పోవు సౌకర్యములు అచ్చటి నదులు లోయలగుండా ఏర్పడుచున్నవి. అర్జెంటైనానుండి ఖండాంతర్గతమైన బొలీవియా దేశమునకును, అచ్చటినుండి చిలీలోని పసిఫిక్ రేవగు అరికా పట్టణమునకును, పెరూలోని పసిఫిక్ రేవగు మొలెండో పట్టణమునకును రైలుమార్గములు వేయబడినవి. అర్జెంటీనానుండి మరియొక రైలుమార్గము, ఆండీస్ లొని ఉప్పల్లటాక నుమ క్రింద చేయబడిన సొరంగము ద్వారా, చిలీలోనికి ప్రవేశించి వాల్పరయిజొ పట్టణమునకు పోవుచున్నది. చిలీ దేశములో, పసిఫిక్ తీరము పొడవునను ఉత్తరపు సరిహద్దునుండి దక్షిణమున నున్న వాల్విడియావరకు రైలుమార్గముకలదు. తక్కిన ప్రాంతములలో నదులలోని స్టీమర్లపై మంచి ప్రయాణ సౌకర్యములు ఏర్పడియున్నవి. ఉత్తర అట్లాంటిక్ సముద్రము నుండి అమెజాన్ నది ఎగువన 1000 మై. దూరములో నున్న మన్నావోస్ పట్టణము వరకును స్టీమర్లు పోగలవు. అట్లే పెరానా పెరాగ్వేనదులు దాదాపు పెరాగ్వే దేశమువరకును చిన్న స్టీమర్ల ప్రయాణమునకు అనువుగా నున్నవి.

దక్షిణ అమెరికాఖండము ముఖ్యముగా వ్యవసాయోత్పత్తిని విదేశముల కెగుమతి చేసి వాటిస్థానే తయారయిన వస్తువులను, యంత్రములను, దిగుమతి చేసికొను చున్నది, అందుచేత దీని విదేశవర్తకము, విశేషించి, అట్లాంటిక్ తీరస్థములయిన పారిశ్రామిక దేశములతోను, జర్మనీతోను జరుగు చున్నది.

రాజకీయ విభాగములు  :- అమెరికన్ ఇండియన్లు అని పిలువబడు పసుపురంగు జాతివారు, ఈ ఖండమునందలి ఆదిమనివాసులు. వీరిలో ఇన్కాసులను తెగవారు నాగరకులు. తక్కినవారు చొరరానిదట్టమైన అమెజాన్ అరణ్యములందు నివసింతురు. ఆదిమనివాసుల సంఖ్య క్రమముగా సన్నగిల్లు చున్నది. తోటలలో పనిచేయువారు ఆఫ్రికానుండి తీసికొనిరాబడిన నీగ్రో బానిసలు.

దక్షిణాఫ్రికాయందలి శ్వేతజాతులు, శతాబ్దముల క్రిందనే వలసవచ్చిన స్పెయిన్, పోర్చుగలు దేశీయుల సంతతివారు. వీరి తరువాత ఇటీవలనే వలసవచ్చిన ఇటాలి యనులు, జర్మనులు, కొలదిమంది హిందూ దేశస్థులు చైనావారుకూడ ఇచ్చటకలరు. అందువలననే బ్రెజిలు దేశమునందు పోర్చుగీసు భాషయు, తక్కిన దేశములందు స్పానిష్ భాషయు మాట్లాడబడును.

ఈ ఖండమును కనుగొని ఆక్రమించిన తరువాత 14, 15 వ శతాబ్దములలో పోర్చుగల్, స్పెయిన్ దేశములవారు ఈ ఖండమును తమమధ్య పంచుకొనిరి. ఇప్పటి బ్రెజిలు దేశము పోర్చుగల్ వాటాకును, తక్కిన భాగము స్పెయిను వాటాకును వచ్చెను. కాని 19 వ శతాబ్ది ఆరంభములో. వలసవచ్చిన ప్రజలు తమ మాతృ దేశములతో సంబంధమును తెంచుకొని తమ స్వతంత్ర ప్రజాప్రభుత్వమును ప్రకటించుకొనుచుండిరి. అయినప్పటికీ ఈనాటికికూడ ఉత్తరముననున్న మూడు గయానా రాష్ట్రములు బ్రిటిష్, ఫ్రెంచి, డచ్చి, వలస రాష్ట్రము లుగా నున్నవి. ఇవి తప్ప తక్కిన దేశములన్నియు స్వతంత్ర ప్రజాప్రభుత్వములే.

ముఖ్యముగా నాల్గుప్రాంతములు మాత్రము విశేషమైన జనసంఖ్యతో నలరారుచున్నవి. (1) అర్జంటీనాలోని సమశీతోష్ణపు పచ్చిక ప్రాంతములు. (2) బైబిలు తూర్పు తీరప్రాంతము. (8) చిలీలోని మధ్యధరా ఉద్భిజ్జమండల ప్రాంతము. (4) కొలంబియా పశ్చిమ ప్రాంతములు.

ఈ ఖండమునందలి దేశములు ఈ క్రింద పేర్కొనబడినవి :-

బ్రెజిలులోని ఉష్ణమండల స్వతంత్ర దేశములు : (3,275,510 చ. మై. వైశాల్యము; రియోడి-జనీరో ముఖ్యపట్టణము,) వెనిజులా (363,728 చ.మై. వైశాల్యము: కారకాస్ ముఖ్యపట్టణము.)

కొలంబియా : (439, 997. చ.మై, వైశాల్యము; బగోటా ముఖ్యపట్టణము)

ఈక్విడారులోని ఆండీస్ ప్ర జా స్వా మ్యము లు : (226,000 చ. మై వైశాల్యము; క్విటో ముఖ్యపట్టణము); పెరూ (532,616 చ.మై. వైశాల్యము:(లిమా ముఖ్యపట్టణము). బొలీవియా (514,400, చ. మై వైశాల్యము; లాపాజ్, ముఖ్యపట్టణము).

చిలీయందలి సమశీతోష్ణ ప్రజా స్వామ్యములు : (296,717 చ. మై, వైశాల్యము; సాంటియాగో ముఖ్యపట్టణము). అర్జంటీనా : (1,079,965 చ.మై. వైశాల్యము; బ్యూనజ్ ఎయిర్సు ముఖ్యపట్టణము). ఉరుగ్వే : (72,153 చ. మై. వైశాల్యము; మాంటివీడో ముఖ్యపట్టణము). పరాగ్వే : (153,447 చ.మై వైశాల్యము.అసంసియన్ ముఖ్యపట్టణము). బ్రిటిషు గయానాలోని వలసరాష్ట్రములు : బ్రిటిష్ గయనా (83,000 చ. మై. వైశాల్యము; జార్జిటవున్ ముఖ్యపట్టణము).

డచ్ గయానా: (పరమారిబో ముఖ్యపట్టణము.) ఫ్రెంచిగయానా: (కా యెన్ (Cayenne) ముఖ్య పట్టణము), టీరాడెల్ ఫ్యూగో ద్వీపమున కెదురుగా నున్న ఫాక్ లెండు దీవులును, ఉత్తరమున ఒరినాకోనది ముఖద్వారమున కెదురుగానున్న ట్రినిడాడు దీవియు, బ్రిటిష్ వారి అధీనములో నున్నవి.

జె. స.

[[వర్గం:]]