Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికను సాహిత్యము

వికీసోర్స్ నుండి

అమెరికను సాహిత్యము  :- ఆంగ్లసాహిత్య శరీరమున కొక అంగముగ అమెరికను సాహిత్యము ఆవిర్భవించినది. ప్రప్రథమమున కొన్ని సంవత్సరముల వరకు అమెరికను విద్వాంసులు తమ జాతీయ జీవనమున సంస్కృతి యొక్కయు విద్య యొక్కయు వికాసమునకై ఆంగ్లసాహిత్య భాండారము పైననే ఆధారపడుచు వచ్చిరి. విప్లవమునకు పూర్వమే, వివిధ సాహిత్య ప్రక్రియలు విజృంభించియున్నను, అమెరికనుల స్వాతంత్య్ర యుద్ధ కాలములో వింద్యములై ఉద్రేకమును కలుగజేయునట్టి వీరగీతములు ప్రచురింపబడినను, అమెరికనులు నాటి తమ సారస్వతసాహిత్య ఆహారము కొరకు లండను, కొలనుల దేశము (Lake Country), ఆక్సుఫర్డు, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయములనే ఆధారముగా గై కొనసాగిరి.

వలసదినములు-తదనంతరకాలము  : విప్లవమునకు పూర్వమేర్పడిన సాహిత్యమునందు క్రీ.శ.17 వ శతా బ్ధి లో వర్జీనియా దేశీయుడై న కప్తానుజాన్ స్మిత్తు, గవర్నరు విలియం బ్రాడ్ ఫర్డు, జాన్ విన్ డ్రాఫ్ అనువారు వ్రాసిన చారిత్రక కథలు కలవు. ఇంతకుముందే ప్రప్రథమమున ఏ నీబ్రాడ్ స్ట్రీటు, మైకేల్ విగిల్ వర్తు, ఎడ్వర్డు టైలరు అనువారు కవిత్వమును వ్రాసిరి. వలసరాజ్యములపై క్రీ. శ. 1640 లో మొట్టమొదట ప్రచురింప బడినది “బేసామ్” అను గ్రంథము. ఆ దేశములోని మొదటిగొప్ప భావకవియైన ఫిల్ ఫ్ ఫ్రెన్యూ నాడు ప్రఖ్యాతమైన పత్రికా రచయితలలో నొకడు. 1704 లో బోస్టన్ లో "బోస్టన్ న్యూ లెటర్" అను మొట్టమొదటి వారపత్రిక వెలువడెను. 1783 లో మొట్ట మొద టిసారిగా "ఫిలడల్ఫియా ఈవినింగ్ పోస్టు” అను దినపత్రిక స్థాపింపబడెను. “సాటర్ డే ఈవినింగుపోస్టు" అనుదానికి స్థాపకు డైన బెన్ జమిన్ ఫ్రాన్ క్లిన్, సాహిత్యమునందు, పత్రికా రచన యందు ఉన్నతస్థానమును ఆక్రమించెను. థామస్ పైనీ, థామస్ జఫర్ సన్, అలెగ్జాండర్ హేమిల్ టను, జార్జివాషింగ్టను అనువారు వ్రాసిన వచనరచనలు నాటి రాజకీయ రచనలను వృద్ధిచేసెను. విలియమ్ హిల్ బ్రౌన్ మొట్టమొదటి అమెరికను నవల వ్రాసిన గౌరవము పొందియున్నను, చార్లెస్ ట్రాక్ట నుబ్రౌన్ అనునాతడు ఆ దేశపు మొదటి కవితావృత్తికి చెందిన నవలా రచయితగా పరిగణింపబడెను, కథలు, సంక్షేప చిత్రణములు అనువాటి ద్వారమున అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన మొదటి అమెరికను రచయిత వాషింగ్టను ఇర్వింగు అను నాతడు క్రీ. శ. పందొమ్మిదవ శతాబ్ద్యారంభమున విలియమ్ కల్లెన్ బ్రయాంటు కవులలో నగ్రేసరుడుగా పేరుపొందెను. ఎమర్సన్, లాంగ్ ఫెలో, విట్టర్, పో, మొదలగు కవుల రచనలు చాలవరకు ఆనాటి సాహిత్యా న్నత్యమునకు దోహద మొనర్చెను.


అమెరికా దేశవు మొట్టమొదటి గొప్ప చారిత్రక నవలారచయిత జేమ్స్ ఫెనీ మోర్ కూపరు. క్రీ. శ. పందొమ్మిదవ శతాబ్ది ఆదిమ కాలములో విలియంగిల్ మోరుసిమ్సు, రోబర్టుబర్డ్ అను కవులు కూడ చారిత్రకము లయిన నవలలను వ్రాసియుండిరి.

అమెరికను సాహిత్యము యొక్క అభివృద్ధి విషయమున అనాటి ఆధ్యాత్మిక తత్త్వవాదులు చాలవరకు ప్రాముఖ్యమును వహించిరి. వారిలో రాల్ఫు వాల్డో ఎమర్సను, బోన్సన్ ఆల్ కాటు, హెన్రీ డేవిడ్ ధోరూ, మార్గరెట్ పుల్లరు, థియోడర్పార్కరు అనువారు ప్రముఖులు. వారు తమవర్గపు వేదాంతమును దాని ప్రభావమును విశేషముగా వ్యాప్తి నొందించుటకు మిక్కిలి కృషి చేసిరి. నెథేనియల్ హాథారన్ అరాచకమైన, తీవ్ర సమాలోచనాయుతమైన ప్రాచీన భావములను, హెర్మన్ మెల్విలి అనునాతడు కల్పనాపరములైన భావములను, తమ వివిధ విషయక మైన నవలా పరంపరలో ప్రతిపాదించిరి. నవలలు, పద్యములు, వ్యాసములు అను సారస్వత ప్రక్రియలందు ఆలివర్ వెండెల్ హోమ్సు అను కవి ఆంగ్లేయుల యొక్క మతజీవిత విధానమును చాలప్రస్ఫుటముగ చిత్రించెను. సంపాదకుడుగా, ఉపాధ్యాయుడుగా, కవిగా పేరుగన్న జేమ్సురస్సైలులో వేలు తన “బిగ్లో-పేపర్సు" అను రచనలలో దేశీయభాష నుపయోగించెను.

ఆ కాలమున అద్భుత కల్పనాశక్తికల ప్రముఖ కవి హెన్రీ వేగ్సవర్తులాంగ్ ఫెలో, అతడు వ్రాసిన హైయ వథా, ఎవఃజెలైన్ అను రచనలు సర్వులకు ప్రీతి పాత్రములై వెలసెను.

జాన్ గ్రీన్అఫ్ విట్టియరు యొక్క కవిత్వము వలనను, హారియట్ బీచెర్ స్టోవ్ యొక్క రచనల మూలమునను బానిస తనపు నిర్మూలనోద్యమమునకు ఎక్కువ ప్రోద్బలము చేకూరెను. హారియట్ వ్రాసిన “అంకుల్ టామ్స్ కేబిన్ " అను నవల బహుళ వ్యాప్తి నొందెను.

ఆధునిక కథానికా రచనకు సృష్టికర్తగా ప్రశంసింప బడిన ఎడ్గార్ ఎల్లెన్పో అను కవి ఈ కాలములో నే న్యూయార్కు, రిచ్మండులలో నివసించుచు రచనలు సాగించుచుండెను.

పందొమ్మిదవ శతాబ్ది యొక్క పరార్ధమునకు పిదవ అమెరికను కవులలో అగ్రగణ్యుడయిన వాల్ట్ లిట్మను ఆనాటి అంతర్యుద్ధములను అత్యుత్తమమైన కవితా రూపమున వర్ణించెను. 1886 సంవత్సరములో చనిపోయిన ఎమిలీ డికెన్సను అను నామె గణనీయములయిన గేయ కావ్యములు ఆ దినములలో వ్రాయుచుండెను. కాని క్రీ. శ. 1915 సంవత్సరము వరకు ఆమె రచనలు పాఠక లోకమునకు లభించలేదు. అంతర్యుద్ధానంతరము. ఆమె రికా రాజ్యములలో నాటి ప్రముఖములయిన చారిత్రక రచన లన్నింటియందును, యూరోపియన్ విద్యా సంప్రదాయము యొక్క ప్రభావము కనిపించును. కారణము అమెరికా యందలి నాటి రచయితలలోను, యువకులయిన పండితులలోను పెక్కురు, యూరపునందు విద్యోపార్జనము చేసియున్న వారయి యుండుటయే. విలియం హిర్లింగు ప్రెస్ కాటు, జాన్ లాద్రోవ్ మాట్లే, ఫ్రాన్సిస్ పార్కు మెను, జార్జి బాన్ క్రాఫ్టు మొదలైన వారి అనంతరియములైన చారిత్రక రచనలలోను యూ రపియన్ విద్యాప్రభావము గోచరించును.

అంతర్యుద్ధము లయిన పిదప స్థానిక వాతావరణమును వర్ణించునట్టి లేక ప్రాంతీయ సాహిత్యము వ్రాయునట్టి రచయితలు వెలువడిరి. వారి రచనలు ప్రజలలో కొందరికి గాఢమైన అభిరుచిని పుట్టించెను. దేశములోని క్రొత్త ప్రాంతములను గురించి వ్రాయబడిన కథానికలు, కావ్యములు, నవలలు ముఖ్యముగా పశ్చిమమునుండి శీఘ్రముగా వెలువడినవి. పశ్చిమమునందలి ఎడ్వర్డు ఎగిల్ట్స్ న్, జాక్విన్ మిల్లరు, బ్రెట్ హార్టె దక్షిణమునందలి జార్జి డబ్ల్యు కేబులు, థామస్ నెల్సన్, పేజి, జోయెల్ చాండ్లెర్, హారిసు, జేమ్సు లేన్ ఎల్లెన్; న్యూ ఇంగ్లండునందలి సారా ఆర్నె జ్యూయెటు, ల్యూసాయమ్ ఆల్ కాటు మేరీ, యిఫ్రీమను ; మధ్య పశ్చిమ దేశము నందలి జేమ్సువిట్, కూంబ్ రిలే మున్నగు రచయిత లీ వర్గమునకు చెందిన వారై యున్నారు.

ఆ శతాబ్ది అంతిమ కాలములో అమెరికను సాహిత్యమునకు ఔన్నత్యము చేకూర్ప సమర్థులయి రాజకీయ ఆర్థిక ధృక్పథములు కలిగిన నవలా రచయితలు కొందరు ఉద్భవించిరి. ఎడ్వర్డు బెల్లమీ, రెబెక్కా హార్డింగు, డేవిసు హెలెన్, హంటి జాక్సను, హెరాల్డు ఫ్రెడరికు, డేవిడ్ రాస్ లాకె మున్నగువారు ఈ కవిబృందమునకు చెందిన వారు. ఈ కవిబృందపు రచనలు బలవత్తరమైన ప్రభావము అప్టన్ సింక్లేరు, ప్రాంక్ నారిసు, థియోడార్ డ్రీజరు వ్రాసిన నవలలపై ప్రసరించెను. హెన్రీజేమ్సు, ఎడిత్ వార్టను అనువారు వ్రాసిన నవల లొకజాతికి చెందినవి. వాటియందు నిశితమైన పాత్ర పరిశీలనము కాననగును. అందుచే నవి సాదరముగ జనులచే పఠింపబడెను.

అంతర్యుద్ధానంతరము వ్యాప్తిచెందిన పత్రికా రంగమున కథానికా రచనకు గిరాకీ ఏర్పడెను. ఇట్టి అవసరమును గురించి కథానికలు రచించినవారు ఓహెన్రీ, రిచర్డ్ హార్డింగ్, డేవిను, ఏంట్రోసు, బియర్సు, బ్రైట్ హర్పే అను కవులై యున్నారు.

పందొమ్మిదవ శతాబ్ది అంత్యకాలమునందును, ఇరువదవ శతాబ్ది ప్రథమ దినములలోను, ప్రముఖ సాహిత్య సంపాదకుడు గాను, నవలారచయితగాను,విలియమ్ డేన్ హొవెల్సు సుప్రసిద్ధి నొందెను.

క్రీ.శ. 1890 సంవత్సర ప్రాంతమున వాస్తవిక వాదులును, ప్రకృతి (తత్త్వ) వాదులునయిన కవులు రచించిన నవలా వాఙ్మయము 20 వ శతాబ్ది ఆరంభమునుండి రచింపబడిన నీరసమును, వాస్తవికతాయుతమును ఐన నవలా రచనకు పూర్వరంగముగ నుపకరించెను. అందు పాత్రల మానసిక వృత్తి పరిశోధనము ఉపలక్షిత మగు చుండును. ఇట్టి సాహిత్యపు తెన్నులు జాన్ డాస్ పాససు, ఎర్స్కిన్ కాల్డ్వెల్లు, విలియమ్ ఫాక్ నర్, జేమ్సు టి ఫారెలు, ఎఫ్ స్కాట్ ఫిడ్జి గెరాల్డ్, ఎర్నెస్బు హెమింగ్ వే, థామస్ వుల్ఫు మున్నగువారి రచనలలో గోచరించును. ఆ కవుల రచనలయందలి పాత్రల మానసిక వృత్తి చిత్రణములు, పాత్రల సంభాషణములు అత్యుత్తమములు. అమెరికను విప్లనమునకు పూర్వమునందే ఆరంభమయిన అమెరికను సాహిత్యమునందలి వ్యాసరచన పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరభాగమునందు జాన్ బట్టోసు, జాన్ మ్యూరు అను కవుల రచనల ద్వారమున అభివృద్ధిచెంది ఉన్నతస్థాయిని పొందెను. ఇరువదవ శతాబ్దియందు డొనాల్డుకల్రాసు పిట్టి అను నాతడు వ్యాసరచనమున ఈ రంగములో విశిష్టమైన రచనలు కొనసాగించెను.

జార్జినం తాయనా, విలియం జేమ్సు, జోసియారోయిస్, జాన్ డ్యూయీ మున్న గువారి రచనలు వేదాంతశాఖ యందు అమెరికను సాహిత్యమునకు ఔన్నత్యమును చేకూర్చెను. క్రీ. శ. 1880, 1890 ప్రాంతమున కొన్ని అమెరికను నగరములలో నేర్పడిన దుష్ట రాజకీయ పరిస్థితులపై విప్లవరూపముగా వ్యాపించిన ఒక మూఢమైన వాస్తవికతయే, హేమ్లిన్ గార్లెండు, స్టెఫీన్ క్రేన్ రచనలలోని అల్పవాస్తవికతకును, తరువాత థియోడార్ డ్రీజరు, షెర్వుడ్ యాన్ డర్ నను వ్రాసిన నవలలలో ప్రతిబింబించిన సహజత్వ సిద్ధాంతమునకు కారణభూతమయినది.

జాక్ లండను, ఛార్లెస్ మేజరు, మేరీజాన్ స్టను, యస్. వీక్ మై కేల్, పాల్ లీ స్పర్ ఫోర్డు, ఎఫ్. మేరియన్ క్రాఫర్డు విన్స్టన్ చర్చిలు, ఓవెన్ విస్టరు మున్నగువారు ఈలోపల కాల్పనిక తాయుతమైన నవలారచనను పెంపొందించిరి.

పందొమ్మిదవ శతాబ్ది చరమకాలమున అమెరికను సాహిత్యమునందు హాస్యయుత కావ్యరచయితలకు ఒక ప్రముఖస్థానము చేకూరెను. వారిలో మార్క్ ట్వెన్ అగ్రగణ్యుడు. హాస్యరచనారంగమున ఆక్టిమస్ వార్డు, పెట్రోలియమ్ బి. నస్బీ, పిన్లేపీటర్ డన్నీ, జాన్ బిల్లింగ్సు, సీబాస్మిత్తు మున్నగువారును; జార్జి ఆడె, డాన్ మార్క్విసు, యూ నేఫీల్డు, ఆగ్డన్ నామ, జేము ధూర్బరు మున్నగు వారు వార్తాపత్రికా- వ్యాసరచనా- పత్రికారచనా రంగములందును క్రీ. శ. 1940, 1950 సం. ప్రాంతమున కృషి యొనర్చిరి.

ఇరుపదవ శతాబ్దిలో, నవలా రచయితలకు ప్రాంతీయత్వమునందు అభిరుచి హెచ్చయ్యెను. మేరీ ఎల్లెన్ ఛేజు, విల్లా కేథరు, బూత్ టార్కింగుటను, సింక్లేర్ లెవిసు, జె. పి. మార్క్వర్డు, ఎడ్గా ఫెర్బరు, జాన్ స్టీన్ బెక్ అను కవులు యీ జాతి రచనకు ఉత్తమ ప్రతినిధులు.

పందొమ్మిదవ శతాబ్ది ప్రప్రథమ దశయందు జేమ్సు పెన్నీ మోర్ కూపరు అను నాతడు చారిత్రక నవలలను రచించెను. అంతకుపూర్వముననే ఇట్టి రచనలయందు అమెరికాలో పాఠకలోకమునకు విశేష ప్రీతి ఉదయించి ఉండెను. ఆ దేశమున ఇట్టి అత్యుత్తమమైన నవలలను, హెర్వే ఎల్లెన్, మార్గరెట్ మిఛెలు, స్టెఫెన్ విన్సెంటు బినెటు, ఈస్టర్ పోర్బ్బు, జేమ్సుబోయిడు, కెన్నెత్ రొబర్టు, మాక్ కిన్లే కాన్ టరు, స్టార్క్ యంగు అను కవులు రచియించిరి.

అమెరికా సంయు క్త రాష్ట్రములలో కథానికా రచన యండు అగ్రగణ్యులుగా వెన్నబడిన వారు డొరోత్ పార్క్ రు, విలియం డేనియలు స్టీలు, కేథరైన్ అనీ పోర్టరు, విలియం సారోయన్ అను కవులైయున్నారు.

నేడు అమెరికన్ సాహిత్య జీవితములో కవిత్వమునకు గొప్ప గౌరవమేర్పడియున్నది. క్రీ.శ. 1912 వ సం. లో హారియట్ మన్రో అనునామె “పొయిట్రీ" అను పద్యమయమైన పత్రికను స్థాపించెను. అందు ఆనాటి కవితయందలి క్రొత్త లెన్నులు మూర్తీభవించేను.

ఈ పత్రికా ప్రచురణము కవిత్వమునందు గాఢమయిన ఆసక్తిని కల్పించెను. ఆ పత్రిక యందు పెక్కు మంది రచయితలకు తమ రచనలను ప్రచురించుటకు అవకాశములఖించెను. స్వల్పపరిమాణము అల్పజీవితము గల పత్రిక లనేకములు వెలువడెను. అంతకుమున్ను తమ కవితను ప్రచురించు భాగ్యమెరుగని రచయితలకు కూడ తమ రచనలను వాటియందు ప్రచురించుట కవకాశము కలిగెను. ఆ యుద్యమము సృజనాత్మకములయిన అశేష కవితా ప్రక్రియల ఉత్పత్తికి గొప్ప దోహద మొసగెను. ఎమీలో వెలు, వాచెల్ లిండ్సే, కార్ల్ పాండ్ బర్గు, ఎజ్రా పౌండు, టి. యస్. ఇలియట్, జాన్ గోల్డు ఫ్లెచరు, కాన్రాడ్ ఎయికెను, కార్ల్ షపీరో, వాలెస్ట్ స్తీ వెన్సు, ఇ. ఇ. కమ్మింగ్సు - వీరందరు ఆ శతాబ్ది యందలి అమెరికను కవిత్వమునందు గణనీయమైన వివిధ సారస్వత ప్రక్రియలకు ప్రతినిధులుగా నున్నారు.

ఎడ్గార్ లీమాస్టర్సు, రోబర్టుఫ్రాస్టు, రోబిన్సన్ జెఫర్సు, ల్యూసా రెటు అను రచయితల కవిత్వములలో ప్రాంతీయత్వము ముఖ్యమైన విషయమయ్యెను.

ఈ శతాబ్దియందు అమెరికను కవిత్వమునందు ప్రముఖ సంప్రదాయవాది యయినవాడు ఇ. ఎ. రోబిన్సను. ఈ సంప్రదాయమునకు చెందిన ఇతరులు విలియమ్ ఎల్లెరీ లీనార్డు, ఎలీనోర్ వైలీ, సారాటిస్ డేలు, హార్ట్లుక్రేను, ఎడ్నా సెంటు, విల్సెంటి మిల్లే. ఆర్చిబాల్డు మేక్లీషు అను వారై యున్నారు.

నీగ్రో కవులు కూడ అమెరికను కవిత్వమును తమ విశిష్టమైన రచనలచే పెంపొందించిరి. పాల్ లా రెన్సుడన్ బారు అను రచయిత యీ వర్గమునకు చెందిన కవులలో విశిష్టతను గన్న వాడు. కౌంటీకల్లైను, జేమ్పు వెల్డెన్ జాన్సను, లాంగ్ స్టన్ హ్యూసు అను వారి ప్రాముఖ్యము గణనీయమైనది.

పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరభాగమున. అనామకముగా పడియున్న అమెరికను. నాటక రంగము క్రొత్త యుగమున ప్రబలమైన పాత్రను వహించెను. ఇరువదవ శతాబ్దినుండి ఈ సారస్వత కళారూపము అత్యున్నత స్థానము నాక్రమించుకొనెను. యూనీ ఓనీలు అనునతడు నాటక రచయితలలో నగ్రగణ్యుడు. మాక్స్ వెల్ యాండర్ సను, ఫిలిప్ బారీ, మార్కు కోనల్లీ, బెన్ హెక్టు, రాచల్ క్రాధర్సు, సిడ్నే హోవర్డు, జార్జియస్, కాఫ్ మను, క్లిప్ఫర్డ్ ఆడెట్సు, ఎల్మర్ రైను, టెన్నెస్సీ విలియమ్సు, థారన్ టన్ వైల్డరు అను వారుకూడ ఉత్తమమైన నాటకములను వ్రాసిరి.

ఇరువదియవ శతాబ్ది మొదటి దశకములో, ఇర్వింగ్ బాబిటు, పాల్ ఎల్మర్ మోరు, డబ్ల్యు. సి, బ్రాంవెలు అనువారి నాయకత్వమున హ్యూమనిస్టు సంప్రదాయము పెంపొందెను. అదికారణముగా సాహిత్యవిమర్శనము విశేషముగా పాఠకులదృష్టి నాకర్షించెను. వాన్ విక్ బ్రూక్సు, హెచ్. ఎల్. మెం కెను, రాండాల్ఫుబోర్ను, హెన్రీ సీడెల్ కాన్ బీ మొదలగు వారితో కూడిన ప్రతిపక్ష వర్గము, పైవారి హక్కులతో పోటీ యొనర్చిరి. లూయీ మమ్ ఫర్డు, మాల్కోమ్ కౌలే, ఎడ్మండ్ విల్సను నూతన వాస్తవికతోద్యమమునకు సుముఖులుగానుండి, (అమెరికా) జాతీయ సాహిత్యమునందలి సాంఘిక భావముల విషయమున మార్క్సిస్టు దృక్పథమును అవలంబించిరి. క్రీ.శ. 1930 సం. ర ప్రాంతమున ఈ దృక్పథమును, మాక్స్ ఈస్ట్ మను, వాల్డోఫ్రాంకు, గ్రాన్ విల్లిహిక్సు అనువారు బలపరచిరి. తరువాతి దశాబ్దిలో వెలువడిన రచనలందు విమర్శనకళయే ప్రధానవిషయమయ్యెను. ఈ కాలములో ఎజ్రాపౌండు, టి. యస్. ఇలియటు, ఆర్. పి. బ్లాక్ మూరు, ఐ. ఎ. రిచర్డు అనువారు ప్రధానముగా విమర్శనాత్మక రచనలు కావించిరి. ఇరువదవ శతాబ్దిలో జూన్ ఫిస్కీ, హెన్రీ ఆడమ్సు, థియోడార్ రూజ్వెల్టు, వుడ్రో విల్సను అనువారు వ్రాసిన రచనల ద్వారమున (అమెరికను) చారిత్రక వాఙ్మయము మిక్కిలి అభివృద్ధి చెందెను. కాలక్రమమున చారిత్రక సంఘటనలను, సాంఘిక ...మానసిక తత్త్వరూపముల వ్యాఖ్యానించుటకు చరిత్రకారులు ఎక్కుడు ప్రాముఖ్యము నొసగిరి.

ఈ కాలమునందు ఛార్లెస్ బీర్డు, ఫ్రెడరిక్ జాక్సన్ టర్నరు, జేమ్సు హార్వే రోబిన్సను అను కవులు విస్తారముగా చారిత్రకరచన లొనర్చిరి. క్రీ. శ. 1920 వ సం. మొదలుకొని చరిత్ర రచనయందు అగ్రగణ్యులుగా వెలువడినవారు, కారల్ టన్ జే. హెచ్. హేసు, ఆల్లన్ నేవిన్సు, ఆర్థర్ ప్లేసింగరు, ఆర్థర్ ప్లేసింగరు జూనియరు. హెచ్. యస్. కామ్మాగరు, యస్. ఇ. మా రి స ను మున్నగువారై యున్నారు.

డా. ఓడెల్

[[వర్గం:]]