Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోట గణపాంబ (1241-1264)

వికీసోర్స్ నుండి

కో

కోట గణపాంబ (1241-1264) :

కోట గణపాంబ, క్రీ. శ. 13వ శతాబ్దిలో యావ దాంధ్ర దేశమును తన ఏకచ్ఛత్రాధిపత్యము క్రిందికి తీసి. కొనివచ్చి ఆతివైభవో పేతముగా పరిపాలించి కీర్తి గాంచిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి పుత్రిక. ఈమె అగ్రసోదరి కాకతి సామ్రాజ్యము నేలిన మహారాణి రుద్రమదేవి. గణపతిదేవ మహారాజునకు పుత్రసంతానము లేదు. తాను కష్టపడి నిర్మించిన సామ్రాజ్యమును తరు వాతి కాలములో పాలింప నర్హుడైన కుమారుడు కలు గని లోపము గణపతి దేవునకు చాల మనస్తాపము కలి గించినది. కాని ఇందువలన హతాశుడు కాకుండ ఈ మహారాజు తన పుత్రికలకు భావిపాలకులు కాగల యువకులకు ఇయ్యదగిన శిక్షణ నొసగి పుత్రులు లేని కొరతను తీర్చుకొ నెను. వీరిలో రుద్రాంబ రుద్ర దేవుడను నామముతో పురుష వేషముతో తన తండ్రి జీవిత కాలము లోనే సామ్రాజ్య నిర్వహణమున అతనికి తోడ్పడుచు వచ్చెను. ఆమె చెల్లెలు గణపాంబకూడా గొప్ప సామర్థ్యమును సంపాదించుకొనెను.

ఈ కాలములో ఆంధ్ర దేశములోని కోస్తా ప్రాంత ములో అనేక మాండలిక రాజ్యములు ఉం డెడివి. ఇవ న్నియు కాకతీయ సామ్రాజ్యములో చేరి యున్నప్పటి కిని నేటి గుంటూరు మండలములోనున్న భాగమునకు ప్రత్యేక ప్రాముఖ్యము ఉండెడిది దీనికి కారణము అంతర్జాతీయ ఖ్యాతిగల మోటుపల్లి అను రేవు పట్టణము ఇక్కడ ఉండుటయే కావచ్చును. అందువలన గణపతి దేవుడు ఈ ప్రాంతములో తగినంత కట్టుదిట్టము చేయ వలసి వచ్చెను. ఈ ప్రాంతమంతయు అప్పుడు ధరణికోట, ఎనమదల, తాడికొండ నగరములు కేంద్రములుగా పరి పాలన చేయుచు వచ్చిన కోట వంశీయుల అధికారములో ఉం డెడిది. కేవలము యుద్ధముల వలన నేకాక రాజనీతితో కూడిన వై వాహిక సంబంధముల మూలమున గూడ తన అధి కారమును స్థిరీకరించుకొనుచు వచ్చిన గణపతి దేవుడు మోటుపల్లి ప్రాంతములో సరియైన పర్యవేక్షణము లభించు నిమిత్తమై రాజనీతిని ప్రయోగించుచు తన రెండవ కుమా ర్తెయగు గణపాంబను ఎనమదల శాఖకు చెందిన కోట రుద్రరాజు కుమారుడగు బేత రాజునకు ఇచ్చి వివాహము చేసెను. తద్వారా ఈ ప్రాంతముమీద తన అధికారమును సుస్థిరము చేసికొనెను.

క్రీ. శ. 1241 సం.లో రుద్రరాజు మరణించిన తరు వాత బేతరాజు ఎనమదల సింహాసనమును అధిష్ఠించెను. అంతవరకు దైనందిన జీవనములో సహధర్మచారిణిగా ఉండుచువచ్చిన గణపాంబ అప్పటినుండి రాజ్య పరిపాల నలోకూడ సహభాగిని అయ్యెను. తనతండ్రి తన కిచ్చిన శిక్షణమును, రాజకీయ విజ్ఞానమును ఉపయోగించి ఎన మదల రాజ్యమునకు వన్నె తెచ్చెను. గణపాంబా బేత రాజుల సంయుక్తపరిపాలన పది సంవత్సరముల కాలము సాగెను. శ. 1251 సం లో బేతరాజు తన మామగా రైన గణపతిదేవ చక్రవర్తికి సహాయుడుగా కాంచీ రాజ్యముపై దండెత్తి, అక్కడ జరిగిన యుద్ధములో మరణించెను. వైధవ్యమువలన కలిగిన శోకముతో క్రుంగి పోవుచున్నప్పటికిని, సంతాన రహితయగుటచేత ప్రజా క్షేమముకోసము రాజ్య భారమంతయు గణపాంబయే వహించవలసి వచ్చెను. అప్పటినుండి ఈమె పరిపాలన సుమారు 13 సంవత్సరముల కాలము సాగెను. ఈ కాల ములోనే గణపతిదేవ చక్రవర్తి మరణించుట, అతని కుమా ర్తెయు, గణపాంబకు సహోదరియు అయిన రుద్రాంబ కాకతీయసామ్రాజ్యమునకు రాణి యగుటయు జరగెను. మొదట గణపతిదేవుని తోడను, తరువాత రుద్రాంబ తోడను, ఈ కాలములోనే ధరణికోటకు పరి పాలకులైన కోట గణపతిభీమరాజుల తోడను, ఇతర రాజ్యముల తోడను సఖ్యమును పాటించుచు సంప్రదాయ సిద్ధమైన కోటవారి బిరుదావళిని ధరించి రాజ్యములో అంతఃక లహములు, సాంఘిక వైషమ్యములు లేకుండ శాంతి భద్రతలు నెలకొల్పి 'సర్వేజనాః సుఖినోభవంతు' అను సూత్రమును ఆధారము చేసికొని క్రీ. శ. 1264 వరకు గణపాంబ పరిపాలన చేసెను.

దక్షతకలిగిన రాణిగానే కాక, దైవభక్తి కలిగిన ఉత్తమ ధర్మ పరాయణగా గూడ గణపాంబ ఖ్యాతి గడించెను. దీనికి అన్ని మతములవారిని సమాన దృష్టితో చూచుచు ఈమె స్వయముగా చేసిన దానధర్మములు, ఈ మెకు పుణ్యముగా ఈమె ఆశ్రితవర్గములోనివారు చేసిన దాన ధర్మములు చక్కని తార్కాణములు. క్రీ.శ. 1258 లో ఉత్తరాయణ సంక్రాంతి పుణ్యకాలమున గణపాంబ, తనతండ్రి గణపతిదేవునకు పుణ్యముగా నేటి మాదల గ్రామములోని దేవాలయ పిరిచారకుల వద్దనుండి ప్రభుత్వ మునకు రావలసిన ఆయ సుంకమును గద్దు చేసినట్లు ఒక శాసనములో చెప్పబడియున్నది. క్రీ. శ. 1261 సం. లో ఈ మాదల గ్రామములోని సక లేశ్వర మహాదేవునిగుడిలో అఖండదీపమునకు ఏబదిఅయిదు గొట్టెలను గణపాంబకు ధర్మముగా ఈమె ఆశ్రితవర్గములోని వాడైన మన్మ బోయడు దానముచేసినట్లు మరియొక శాసనములో చెప్ప బడినది. ఈ సంవత్సరములోనే తన భర్త బేతరాజు ఎన మదలలో కట్టించిన గోపీనాథ దేవాలయమునకు ఒక నూనెగానుగను ఈమె దానము చేసెను. ఈ సందర్భము లోనే ఈమె ఎనమదలలో పెండ్లిసుంకమువలన వచ్చు ఆదాయమును విద్యావంతులకు దానముచేయగా వారు ఆ ధనమును గణపమ దేవికి పుణ్యముగా గోపినాథ దేవా లయమునకు దానమిచ్చిరి. నానా దేశములకు చెందిన అనేక వర్తక సంఘముల సభ్యులుగూడ గణపమదేవికి పుణ్యముగా " గోపీనాథ దేవాలయమునకు తాము వ్యాపారముచేయు వివిధ వస్తువుల విలువలో కొంత భాగమును దానము చేసిరి.

ఈ విధముగా దక్షతతో జయప్రదముగా రాజ్య పరి పాలన సాగించి, కోట గణపాంబ శాశ్వతమైన కీర్తిని ఆర్జించెను. ఈమె పరిపాలన అన్ని విధములచే ఈ మెసోదరి, కాకతీయ చక్రవర్తిని రుద్రాంబ పరిపాలనను జ్ఞప్తికి తెచ్చుచున్నది. ఆంధ్ర ప్రదేశమును పరిపాలించిన స్త్రీలలో కోట గణపాంబకు ఒక మాననీయమైన స్థానము కలదని నిస్సందేహముగా చెప్పవచ్చును.

ఆర్. న. రా.