Jump to content

శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 60

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 60

                 1
హనుమ కథనమును విని వాలిసుతుడు
అంగదు డిట్లనె, ఆర్యను లక్షిం
చియు తోడ్కొనిరాక , యిపుడూరకిటు
లిక్ష్వాకుల కడకేగుట యుక్తమె.
               2
సీతనుకని భాషించితి, మామెను
కొని తేలేదనుచు నివేదించుట,
మీక యుక్తమని నాకుతోచెడిని,
ఆలోచింపుడు ఖ్యాతవిక్రములు.
                3
సోదర వానరశూరులార! మన
కీడు కానరా రెవ్వ రెందును, ప్ర
తాప పరాక్రమ దర్పధైర్యముల
దైత్య దేవకుల ధామములందును.
                  4
అదిగా కట, హతమార్చి వచ్చె మన
హనుమ దైత్యనాయకుల నెందఱినొ,
ఇక నేమున్నది యేగి జానకిని
కొనివత్తము సంకోచము లెందుకు?

               5-6
మన మటుపోయి, సమస్త రాక్షస బ
లములను నిర్మూలముచేసి, మఱలి
వచ్చి, చూడబోవచ్చు రామ ల
క్ష్మణ సుగ్రీవుల కడకు సీతతో.
               7
కృతనిశ్చయుడై యిట్టు లంగదుడు
పలుకగ విని, హరివంశ వర్ధనుడు,
జాంబవంతు డుచితంబుగ అర్థా
నర్థ వివేచన నరసి పల్కె నిటు.
               8-9
ప్రాజ్ఞుడ ! ఇది మన పనికా, దంపిరి
దక్షిణ సీమలు తడవగ నంతియె;
సీతను తెమ్మని చెప్పలేదు, కపి
రాజుగాని రఘురాముడే నపుడు.
              10
ఎటులో పోయి జయించి రాక్షసుల,
సీతను కొనివచ్చిన, రామున కది
ఇష్టార్థము కాదేని, క్లిష్టమగు,
స్వాభిజాత్యరక్షకు లిక్ష్వాకులు.
              11
అదియటుండ, మన యందఱి ముందు ప్ర
తిజ్ఞ చేసే రఘుతిలకుడు సీతా
విజయంబును కావించెద స్వయముగ
ననుచు; కల్ల చేయునె తన శపథము.
               12
వ్యర్థ కార్య నిర్వాహం బగునిది,
తుష్టియు కలుగ దనిష్ట కార్యమున,
ఊరక యేటికి వీర విజృంభణ ?
పరిశీలింపుడు వానరోత్తములు.

                13
కావున శీఘ్రముగా పోదము, మన
ప్రభువర్యునితో రామలక్ష్మణులు
ఉన్నచోటి, కఖిలోదంతమును స
విస్తరంబుగ నివేదింత మచట.
                 14
రాజపుత్ర ! నీ యోజన మిప్పుడు,
సముచితముగ తోచదు నాబుద్ధికి,
రాము డేప్రకారము నియమించునొ
అట్లు నడచి విజయము సాధింపుము.