Jump to content

శ్రీవేంకటేశ్వరవచనములు/వచనం

వికీసోర్స్ నుండి

శ్రీ వేంకటేశ్వర వచనములు.

1

శ్రీవేంకటగిరిదేవా! నా దేహంబు నీ వుండెడి నిత్యనివాసంబు; నా జ్ఞానవిజ్ఞానంబులు నీ యుభయపార్శ్వంబుల దీపంబులు; నా ముకుఁజెఱమలయూర్పులు నీ యిరుదెసలం బట్టెడి యాలవట్టంబులు; నా మనోరాగంబు నీకుఁ జెంద్రకావి వలువ; నీకుమ్రొక్క నెత్తిన నా చేతులు రెండును మకరతోరణంబులు; నాభక్తియె నీకు సింహాసనంబు; నామేనం బొడమిన పులకలు నీకు గుదులుగ్రుచ్చి యర్పించిన పూదండలు; నే నిన్ను నుతియించిననుతుల యక్షరరవంబులు నీకు భేరీభాంకార ఘంటా నినాదంబులు; నా పుణ్య పరిపాకంబులు నీకు నైవేద్యతాంబూలాదులు; మదీయ నిత్య సేవా సమయనిరీక్షణంబు నీకు సర్వాంగంబుల నలందిన తట్టు పునుంగు; నా సాత్త్విక గుణంబు నీకు ధూపపరిమళంబు; నీవు దేవుండవు; నే నర్చకుండను. ఈరీతి నిత్యోత్సవంబు నాయందు నవధరింపవే శ్రీ వేంకటేశ్వరా! మఱియును;

2

నందకాయుధధరా! నీ యాయుధంబులకు జయజయ; నీ వాహనంబులకు శుభమస్తు; నీ పరివారంబులకు క్షేమంబు గోరెద; నీకళ్యాణగుణంబులకు నిరంతరాభివృద్ధియగుఁగాక; నీ సత్త్వంబులకు శోభనపరంపరావాప్తియెసగవలయు; నీ దేవులకు మంగళ మహాశ్రీలగు; నీమహిమకు ననంతవివిధార్చనము; నీ భుజాబలమునకు నపరిమితస్తోత్రము; నీ చక్కఁదనంబునకుఁ బుష్పాంజలి; నీ యుదారతకు శరణంబు; నీ శ్రీవత్సకౌస్తుభాది చిహ్నంబులకు సంతతప్రార్థన; నీపాదం బులకు సాష్టాంగ నమస్కారంబు చేసెద. ఏమినిమిత్తంబు చేసెదవంటివా? నాలుగు యుగంబుల ధర్మంబులు, సకలజంతువుల పరిణామంబులు, కమలాసనాదిదేవతల బ్రదుకులు, నీ మూలంబునఁ గావున నీవు శుభంబున నుండుటే మేలు; శ్రీ వేంకటేశ్వరా!

3

అలమేలుమంగాపతీ! నిన్ను వెదకి వెదకి కనియెద మన నే మెంతవారము? నీ సుద్దులు పెద్దల నడిగి వైకుంఠవాసుండ వనఁగా నీ యూ రెఱింగితిమి. విష్ణువాసుదేవ నారాయణ నామంబులు విని నీ పేరెఱింగితిమి. శరణాగతరక్షకత్వము నీకుఁగలదనఁగా నీ గుణం బెఱిఁగితిమి. నీలమేఘశ్యామ లక్షణంబులు గలుగంగా నీవర్ణం బెఱింగితిమి. శ్రీవత్సకౌస్తుభాది చిహ్నంబులుచూచి నీగుఱు తెఱింగితిమి. శేషాచలనివాసంబుకతన నీ గోత్రం బెఱింగితిమి. పురుషోత్తమఖ్యాతిచేత నీ పౌరుషం బెఱింగితిమి. వేణునాదవినోదివని చెప్పంగా నీవంశంబెఱింగితిమి. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాద్యవతారంబులు విని నీ పుట్టు వెఱింగితిమి. నీకు మ్రొక్కెదము. అన్నింట నధికుండవని నిన్నుం గొలిచితిమి. ఇంక నీ మహిమలం గొనియాడెదము. పాడెదము. శ్రీ వేంకటేశ్వరా!

4

క్షీరాబ్ధిశయనా! కమలంబు సూర్యుని కెదురు సూచినయట్లు నా హృదయ పద్మంబు రవిమండలమధ్యవర్తి యైన నీ కెదురు చూచుచున్నది. కుముదంబులు చంద్రోదయం బపేక్షించినట్లు నా కన్నుం గలువలు భవద్దివ్య ముఖ చంద్ర దర్శనం బపేక్షించుచున్నవి. మయూరంబులు మేఘాగమనంబునకుం జెలంగినట్లు నా మనోమయూరంబు నీలమేఘవర్ణంబైన నీ తిరుమేను దలంచి యానందించుచున్నది. ముత్యపుఁజిప్పలు స్వాతిచినుకులకు నోరు దెఱచినట్లు నావదనశుక్తి మీ పాదతీర్థంబునకు వికసించుచున్నది. సర్పంబులు గానంబులు గోరి చొక్కి పడగలెత్తియాడినట్లు నా వీనులు నీ కథల నాలకించుచున్నవి. నీవు పరాత్పర మూర్తివి; నేను ప్రకృతిసంబంధంబులైన యంగంబులు ధరియించినవాఁడ; నది యెట్లు గూడు ననవలదు. ఆ ప్రకృతికి నీవు చైతన్యమవు. ఈ చుట్టఱికము తొల్లి కలుగఁగానే దీని కీయనురాగము గలిగి యున్నది. కన్నెఱుఁగకున్నఁ గడు పెఱుంగు నండ్రు లోకులు. ఇంతియకాని నిన్ను నెఱుంగ నే మెంతటివారము. నా యాస విన్నవించితి నింతియు కాని నిన్ను నేఁ గక్కసించినవాఁడఁ గానుజుమీ. శ్రీ వేంకటేశ్వరా!

5

దామోదరా! సకలతీర్థంబులు మీ కోనేటనే యాడితి. సకల తిరుపతుల విగ్రహంబులు మీ మూర్తియందే సేవించితి. సకలదానంబులు మీకు నొకకాసు కానుకవెట్టినయందె ఫలియించె. విహిత యజ్జాదికర్మంబులు మీ కైంకర్యంబుననే తీర్చితి. జపంబులన్ని మీ తిరుమంత్రమందె జపించితి. వేదపాఠంబులు మీ సంకీర్తమందె యభ్యసించితి. తపములు వైష్ణవాచారముల లభించె, నింక నేమిటం గడమలేదు. నా హృదయకమలంబున నీ వున్నాఁడవు. నా మనంబు శోధింపం బనిలేదు. నాణెంబైన టంకంబునకు వట్టంబు గొనరాదు. భండారంబునం బడినలెక్కకుఁ బరులు చాడిచెప్పం జోటులేదు. ఆరీతి నే నీసుముద్ర ధరించినవాఁడ, నగుటంజేసి, యేదోషంబులు నన్నుఁ బైకొనకుండఁ జేసి, రక్షింపవే శ్రీ వేంకటేశ్వరా!

6

హృషీకేశా! యేను బెక్కు జన్మంబు లెత్తియలసి పూర్వజాతిస్మరత్వంబు గలిగి యీపుట్టువున నిన్నుం గొలువవలయునని తలంచిన యుద్యోగంబునఁగాదు; శృంగారంబునకు నొసలఁ దిరుమణి వెట్టితి. మఱియు నాయుబ్బరితనంబున నీ సంకీర్తనలు నేర్చుకొంటె, నీ రీతి ప్రయత్నంబు లేక ఘునాక్షర న్యాయంబున నాచేఁతలు నీ దాస్యంబునకెక్కె. నీవు చక్కని మూర్తివిగావున నీ విగ్రహంబు నా యింటిలోపల నిడికొని నా వేడుకలకు దేవరంగాఁ గొల్చితిని. నా మీఁద దయదలంచి యకారణబంధుండవై యొక్కొక్క యుపాయంబున నన్ను నీడేర్చుకొఱకు నీమీఁదభక్తి పుట్టించితివి. నా జడత్వంబును నీ సర్వజ్ఞత్వంబును నిందులోనే చూపితివి. భళిభళీ శ్రీ వేంకటేశ్వరా!

7

మలనాభా ! మోక్షంబు గోరెడువారికి నీపై నిరంతర ధ్యానంబు గారణంబు. ఈరీతి ధ్యానంబు సేయుటకు నిర్మలంబైన మనంబు గారణంబు. నిర్మలంబైన మనంబునకుఁ బంచేంద్రియ నిగ్రహంబు గారణంబు. పంచేంద్రియనిగ్రహంబునకు శరీర శోషణంబైన తపంబు గారణంబు. తపంబునకు బాహ్యప్రపంచ విముక్తియైన వైరాగ్యంబు గారణంబు. వైరాగ్యంబునకు సంగరాహిత్యంబు గారణంబు. ఇన్ని మార్గంబులు నీ కలియుగంబున నెవ్వరికి సిద్దించును ? నీకు శరణుసొచ్చి నామంబులు పఠియించిన నీవే దయదలంచెదవుగాక. శ్రీ వేంకటేశ్వరా !

8

గోవిందా ! పుట్టిన యపుడే యేయేజాతి పక్షులకాయా విథంబులం గూఁతలువెట్ట నేర్పినవా రెవ్వరు? మృగంబులు గర్భంబులలో నుండి వెడలి తల్లులచన్నులం గుడువఁ గణంగుటెట్లు ? పశువులు కసువుమెసంగెడి చందం బెట్టిది ? నానావిధ వృక్షంబులు మొలచినయపుడు తమ తమ యాకారములు పుష్పదళములు గలిగి తతికాలం బెఱింగి చెలంగుటెట్లు ? అన్నియును నీ యాజ్ఞారూపంబులైన ప్రకృతిభావంబులె. మేమును నీ రీతినే నీకల్పితములైన దేహంబులు మోచుచున్న వారము; మానేర్పునేరములు, మాస్వభావంబులు, మాసంసారకృత్యంబులు నీ కల్పితములైన, నీ ప్రభావంబులే. మమ్ముఁ దప్పు లెంచఁ బనిలేదు. శ్రీ వేంకటేశ్వరా !

9

రమాత్మా ! ప్రపన్నుండైన యతం డా జీవితకాలంబు మీ లీలా విభూతిలో మీ కళ్యాణగుణంబు లనుభవించి భూమి పావనంబుగా సంచరించి, అర్చిరాది గమనంబునం బరమపదంబునం బొందెడునాఁడు నాభినుండి ప్రణవభూరినినాదంబు చెలంగ నీతోడం గూడి నిన్ను సేవించుకొని, హృదయగుహనుండి వెడలి, వాగాదీంద్రియంబులను మనంబుతోఁ గూర్చి, మనంబుఁ బ్రాణంబులఁ దగిలించి, ప్రాణంబుల జీవునిం గలపి, జీవుండైన తన్నుఁ బంచతన్మాత్రల నంటించి, యాజీవప్రకృతి నీయందుం బాదుకొల్పి నీయాధారంబున సుషుమ్నానాడి భేదించి, మూర్ధన్యనాడియైన బ్రహ్మరంధ్రంబున సూర్యకిరణంబులతో నిర్గమించి యగ్న్యహ శ్శుక్లపక్షోదగయనాబ్దాభిమాని దేవత లనియెడి యాతివాహిక గణంబులొండొకరిచేతి కందీయఁగా వాయువుఁ బ్రవేశించి సూర్యమండలంబు సొచ్చి చంద్రమండలంబు సొచ్చి మెఱుంగైయున్న విద్యుత్పురుషుని సహాయంబున వరుణేంద్ర బ్రహ్మలోకంబులు గడచి సువర్ణబ్రహ్మాండ కటాహంబుభేదించి పృథివ్యప్‌తేజోవాయ్వాకాశాహంకార మహత్తు లనియెడి సప్తావరణంబులనుం దాఁటి మూలప్రకృతి మీఱి విరజానది యుత్తరించి తేజోరాశియైన బ్రహ్మంబనియెడు నీ స్వరూపంబుం బ్రవేశించునట. ఎటువంటి క్రొత్తైన కథ వింటిమి. అహహా ! శ్రీ వేంకటేశ్వరా!

10

మురహరా ! ఆర్తులకు నభయంకరుండవు. సంసార సర్పదష్టులఁదేల్ప గరుడధ్వజుండవు. అజ్ఞానతిమిరస్థులకు సూర్యనారాయణుండవు. పాపమను మొసలిచేతఁ బట్టువడిన వారి బాధలు మాన్పఁ జక్రాయుధుండవు. దారిద్య్రదావానలంబార్ప గంగాజనకుండవు. దేవతలపాలింటి కల్పవృక్షంబవైన యశ్వత్థనారాయణుండవు. యోగీశ్వరులపాలికి చింతామణివైన కౌస్తుభవక్షుండవు. భక్తజనపాలకలక్ష్మీనాథుండవు. నీ ప్రతాపం బేమని వర్ణింపవచ్చు? నీ కల్యాణగుణంబు లెన్నియని లెక్కపెట్టవచ్చు? నీ మహిమ లేమని తెలియవచ్చు? మేము మా నోరికొలందిఁ గొంత చింతించెదము. చిత్తగింపవే శ్రీ వేంకటేశ్వరా !

11

రుడధ్వజా! యేమని చె ప్పె డి ది నీ ప్రభావంబు ? నీ నాభికమలంబునం బుట్టెనట; విరించి మీ మహిమం దెలియ శక్తుండు గాఁడట! నానావేదంబుల నీ మహిమలు చెప్పునట; నీ మూర్తి కడగుఱుతుం గానవట! రవిచంద్రులు నీ నయనంబు లట; నీ యపారతేజోమహిమంబు లెఱుంగలేరట! ఇంద్రాది దేవతలు నీ యాజ్ఞాధారులట; యొక్కొక్కమాఱును నీతోఁ గినిసి నిన్నెదిరించలేక నీ శరణు వేఁడుకొందురట! పంచమహాభూతంబులు నీ ప్రకృతిగుణంబులట; నీ స్వభావంబు లట్టివి యని తెలుపఁజాలవట! సముద్రంబులు నీ పాన్పట; నీ గుణంబుల లోఁతెఱుంగవట! మునులు భవదీయస్వరూప సూచకవాదులట; నీ మాయ దాఁటనోపరట! చరాచరజగత్తు నీ సృష్టియట; నిన్నుం జూపి చెప్పనోపదట! నా శక్తి యెంత? నేనెంత ? నే నీశ్రీపాదంబులు గతియని యుండఁగా నీవే దయదలంచెదవుగాక! శ్రీ వేంకటేశ్వరా!

12

గోపికావల్లభా! నేఁ దలపోయంగా ఫలియించిన మేలు, మఱియు నే వెదకంగా దొరకెడు పదార్థంబులు, నేఁ గోరంగా వచ్చు లాభంబు, నేఁ జదువంగాఁ దెలిసినయర్థంబు, నే గడియించుకొనంగా సిద్ధించిన ధనంబు, నా నేర్పువలనఁ దెచ్చుకొనియెడి సుఖంబు, నా చేతులఁజేసిన పుణ్యంబు, నా తపోబలిమిం గైకొను లోకంబు, నా పురాకృతఫలంబు, నా మనోరథంబు, నీవే. నా నుదుట బ్రహ్మదేవుండు వ్రాసినవ్రాలు, నే జన్మించిన జన్మకారణము, నా యంతరంగంబులో నున్న మూర్తి, నీవే సుమీ! నా కలిమి విన్నవించితి. శ్రీ వేంకటేశ్వరా!

13

పీతాంబరధరా! నీసాలోక్యంబు నాకు నీ భూలోకంబుననే సిద్ధించియున్నది; సామీప్యంబు హృదయకమలంబున లభియించె; సారూప్యంబు నీ ధ్యానంబున నిలిచినది; సాయుజ్యంబు నిద్రాసమయంబునంగలదు; నీకు శరణుసొచ్చినం బాపవిముక్తి సేతునంటివి గావున జీవన్ముక్తి సమకూడె. నీవు నన్నెడబాయకుండుటంజేసి సదానందానుభవంబు గలిగె. నీపై భక్తియొసంగినందువలన జన్మ శుద్ధియయ్యె. నాలుకకు మీ నామామృతం బొసగినకతన నమృతపానంబు దొరకె. మఱియు నీ దాసులసంగతిని యోగము నలవడె. ఇంక ని న్నడిగెడిదేమి? అన్నిటం గృతార్థుఁడనైతిని. శ్రీ వేంకటేశ్వరా!

14

శార్‌ఙ్గాయుధధరా! నిన్ను భజించి యేమియైననుం గోరి యడిగెద నంటినేని నీకంటె నుత్తమవస్తుపు లెక్కడ నున్నవి? నీయందే మూర్తిత్రయంబును, ద్వాదశాదిత్యులును నేకాదశరుద్రులును, నవబ్రహ్మలును, నేకోనపంచాశన్మరుత్తులును, వసువులును, దిక్పాలకులును, మునులును, సిద్ధగంధర్వపదంబులును; అణిమాద్యష్టైశ్వర్యంబులును, చతుర్దశభువనంబులును, కులాచలదిగ్గజ మహానాగములును, సింధుగంగానదీ ముఖ్యతీర్థంబులును, సకల సామ్రాజ్యంబులును నున్నవి. పరమపదంబున్నది. నీవుగలచోట నన్నియుం గలవు. నిన్ను నాత్మందలంచిన నాకు సకలసౌఖ్యంబులుం గలవు. శ్రీ వేంకటేశ్వరా!

15

నీలమేఘశ్యామలా! అణువులకు నణువవు; మహత్తులకు మహనీయుండవు; ప్రకృతిపురుషులకుం బరమాత్మవు; మూఁడు మూర్తులకు మూలమవు; చరాచరంబులకు సాక్షివి; ఊహించిచూచిన నొక్కండవే దేవుండవు; ఏర్పఱిచిచూచిన ననంతుండవు; తలఁచిన నభేద్యతత్పదుఁడవు; విచారించిన నిర్గుణుఁడవు; వినం గణంగినఁ గల్యాణగుణుండవు; కన్నులం జూచిన సాకారమవు; స్వరూపవ్యాప్తిని నిరవద్యుండవు; స్వాతంత్ర్యంబున జీవచైతన్యమవు; భక్తిపరులకుఁ బ్రసన్నుండవు; తుది విచారించిన జగత్కర్తవు; ఇట్టి నీ గుఱుతు తెలియంగ వచ్చునయ్యా! పెక్కురూపంబులు గలవాఁడవు; పెక్కునామంబులు గలవాఁడవు; వేదవాదులకును నగోచరుండవు; నిన్నుం కొలువనేరము, నీవే కరుణించి కావవే శ్రీ వేంకటేశ్వరా!

16

కోనేటినిలయా! విరజానదిపర్యంతంబును విడువని ప్రాకృతదేహంబును మోచిన జీవులు తమతమసామర్థ్యంబుల జీవన్ముక్తుల మయ్యెదమన నెట్లువచ్చు? ఇట్టి ప్రకృతిసంబంధంబున వచ్చిన యింద్రియంబులేల జయింపనిచ్చు? అందులకుఁ గారణంబైన మనస్సు నేరీతి నిర్మలంబగును? తన్మూలంబునం జేసినకర్మంబు లేల శాంతింబొందు? నయిన నౌఁ గా కేమి! ఎందులకు నేలా భయంబునొంద? నిందులకుఁ గారణం బిన్నివిధంబులం బ్రవర్తిల్లెడు నీమాయ. నిన్నుం గొల్చినవారికి నీ మాయ నుపసంహరింపనేర్తువు. తాళముచే యొకవంక నుండఁగాఁ దలుపుతోఁ బెనంగఁగా నేల? ఇది యెఱింగికదా మున్నిట్టివారలు కొందఱు నీదాసులయి నిన్నుం బొగడియు, నీకు శరణుసొచ్చియును మహాత్ములయిరి. ఏము నదియె యుపాయంబని యెఱుంగుకొంటిమి. శ్రీ వేంకటేశ్వరా!

17

అప్రమేయా! భువి నెన్ని మాయోపాయంబులు గలిగిన నీ దాస్యమునకు నీడురావు. చేయవచ్చు బహువిధపుణ్యంబులు; నీవు దేవుండ వని తెలియు విజ్ఞానమునకు సరిగావు. నేరం దగు యోగాభ్యాసంబులు; ఇవి నీభక్తితో సరిగావు. ఉండుఁగాకేమి పెద్దతనంబులు కొందఱికిని; నీ శరణాగత ధర్మంబుతోఁ బురుణింపరావు. వెలయుచున్నవి పెక్కుశబ్దంబులు; నీతిరుమంత్రస్తోత్రంబువలె ఫలంబు లొసగవు. ఇది యెఱుగుదు. ఇంక నానావిద్యలు నీ సంకీర్తనవిద్యంబోలవు. నిగుడెదరు ముప్పది మూఁడు గోట్ల దేవతలు; నీవంటి బలవంతులు గారు. నీ విచ్చు వరంబులకు హానిలేదు. నిన్నుఁ గొలిచినవారి పదవులు ధ్రువపట్టములు. ఇది లోకదృష్టాంతము. నీచరిత్రలు గణుతింప నలవిగావు. మఱియు నితరమార్గంబు లెండమావుల నీళ్ల వంటివి; మిణుంగురుఁబురువుల ప్రకాశము వంటివి; కాకిబేగడలసొమ్మువంటివి; కప్పచిప్పలవెండి వంటివి. ఇట్టి భ్రమలం బొరలక నీశ్రీపాదంబులే గతి యని యున్నవారలు ధన్యులు. శ్రీ వేంకటేశ్వరా!

18

నారాయణా! పుట్టువులు హేయమూల మనంగా నూరక రోయుటేకాని యని యెవ్వరికి నపకారకంబులని తెలియంబడవు. కర్మంబులు ఫలంబు లొసగునని చేయుటకాని యవి మాతో నొడంబడుటలేదు. సంసారభారంబున నూరక జడియుటకాని యది యెవ్వరికి నసహ్యంబని తోఁపదు. మోక్షంబు మంచి దనంగా నాసపడి వెదకుట కాని యది తొల్లి యనుభవించి చూచినది గాదు. నీవు సర్వేశ్వరుండ వనఁగా విని మ్రొక్కుట గాని నిన్ను నింతటివాఁడ వని తెలియ నలవిగాదు. ఏమని విన్నవించెద? నాజ్ఞానం బనఁగా నెట్టిది? తొలిజన్మంబున నామీఁదఁ గటాక్షం బేపాటి పెట్టితివో యీజన్మంబున నీ దాసుండం గాఁ గలిగె, శ్రీవేంకటేశ్వరా!

19

సకలలోకారాధ్యా ! అన్నిచోటుల నుండుదువు గావున మే మెచ్చటనుండి సంచరించి వచ్చినను నీయొద్ద నున్నవారమే; నీవు సకలలోకనాథుండవు గావున నిన్నుం గొలిచిన వారమే; కన్నుల యెదుట నున్న రూపంబులెల్ల నీ శరీరంబు గావున నిన్ను సదా సేవించినవారమే; మాలో నెప్పుడుఁ బాయకుండుదువు గావున నిన్నుం దలంచినవారమే. నేఁగొనియెడి యాహారంబులు నీ విచ్చినవి గావున నీ ప్రసాదోజ్జీవనమే; నేఁజేయుచున్న కృషిగోరక్షణవాణిజ్యాదులు నీ లీల కుపయోగంబులు గావున నవి నీ పూజలే; నన్ను నీవు పుట్టించినవాడవు గావున నీబాము నీవల్ల నీడేఱెడిదె. ఈ యర్థంబు మఱవ కాదరింపుమయ్యా! నే నెప్పుడు నీ సూత్రంబున నాడెడు బొమ్మను; నా విన్నపములు పదివేలు విన్నపములుగా విన నవధరించి నన్నుం గరుణింపవే శీృ వేంకటేశ్వరా!

20

హయగ్రీవా! కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రికృష్ణ యనియెడి చతుర్వింశతి నామంబులు పాపహరంబులు; పుణ్యంబుల కునికిపట్లు; నుతించువారికి వచనభూషణములు; కోరినవారికిఁ గొంగు బంగారంబులు; జ్ఞానులకు సిద్ధమంత్రంబులు; ఇహపరంబులకుఁ గామధేను కల్పవృక్ష చింతామణు లివి; శీృ వేంకటేశ్వరా!

21

ప్రహ్లాదవరదా! బదరికాశ్రమ నైమిశారణ్య సాలగ్రామపర్వతాయోధ్యా ప్రయాగ ద్వారావతీ పురుషోత్తమ సింహాచల శ్రీ కూర్మాహోబల సేతు కుంభఘోణ తామ్రపర్ణీ శ్రీరంగ కాంచీ నారాయణగిరులు మొదలగు పుణ్యక్షేత్రంబులు, నీ నూటయెనిమిది తిరుపతులు సేవించిన ఫలము నీ దాసులంగని యొకసారి నమస్కారంబు చేసినం బ్రసన్నుండవై యిత్తువు. నాలుగువేదంబులు, ఆఱు శాస్త్రంబులు, అష్టాదశపురాణంబులు చదివిన పుణ్యంబు 'నారాయణా' యనిన నొసగుదువు. అగ్నిష్టో మాతిరాత్ర వాజపేయ ద్వాదశాహ పౌండరీకాది క్రతువులు గావించిన సుకృతంబు నీ శ్రీపాదంబులపై నొక తులసీదళంబు సమర్పించినఁ గలిగింతువు. తులాభార హిరణ్య గర్భాది దానంబుల ఫలంబు మీ దాసుల మనినమాత్రంబ ప్రసాదింతువు. నీవు భక్తిసులభుండవు గావున నీ శరణార్థులకుం బ్రయాసంబులు లేవు; శీృ వేంకటేశ్వరా!

22

శ్రీజనార్దనా! శ్రీభూమీ నీళాసమేతా! శంఖ చక్ర గదా ఖడ్గ శార్ ఙ్గకాయుధధరా! చతుర్భుజా! శ్రీకౌస్తుభమణి శ్రీవత్స శోభిత వక్షా! పీతాంబరధరా! మణికిరీట మకరకుండలాభరణా! వైజయంతీ వనమాలాలంకృతా! పుండరీకాక్షా! అనేక బాహూదరశిరః పాణి పాదోరు జంఘావయవా! విశ్వరూపా! అనంతగరుడవిష్వక్సేనాది నాయకా! సనకసనందన సనత్కుమార సనత్సుజాత సల్లాపా! నారదగానప్రియా! నీలమేఘశ్యామలా! చతురాననజనన నాభీసరోజా! గంగానదీ కారణ శ్రీ పాదపద్మా! భక్తవత్సలా! వేదోద్ధారకా! వైకుంఠపురవరాధీశ్వరా! అసురశిక్షకా! అమరరక్షకా! జగన్నివాసా! జయ జయ, నీకు ననంత నమస్కారంబులు సేసెద. అవధారు; శీృ వేంకటేశ్వరా!

23

జేంద్రవరదా! నీవు మాకుం గల వని యొరులం దీవింతుఁగాని యా దీవనఫలము నొసగ శక్తుండనుగాను. నీవు నాయందుఁ బ్రవేశించి యున్నావని మ్రొక్కించుకొందుంగాని రాజసమున మ్రొక్కించు కొన్నవాఁడనుగాను. నీ దాసుండనని పెద్దలలో దొరలుచున్నవాఁడం గానీ నా తపోమహత్త్వంబున నధికుండనని యహంకరించినవాడం గాను. నీవు మనుష్యునిం జేసి ప్రవేశింపఁ బుట్టితింగాని నా స్వతంత్రంబునం బుట్టినవాఁడను గాను. నే నెంత జడుండైన నెన్నివిధంబుల విడువందగునె నన్ను? శీృ వేంకటేశ్వరా!

24

ప్రద్యుమ్నా! నీ పాదంబులు మనంబునఁ దలఁచెదను; వాక్కునం గొంత నుతించెదను; నా చరణంబుల మీకుఁ బ్రదక్షిణంబు వచ్చి చేతులెత్తి మ్రొక్కెదను; నాకుం గలిగిన యుపాయంబు లవియ; కాన బహువిధానంబులు పెంచి కర్మంబులు చేసి మిమ్ము మెప్పించ శక్తుండఁ గాను. మీకు దయ యుండ నతి ఘోర తపంబుచేసి హర్షించి వరంబు లడుగనేర. ఉద్ధవునిరీతి గోపికలకు మీకు నెడమాటలాడి మిమ్ము నభిముఖునిఁ జేసికొన సమర్థుఁడంగాను. సుగ్రీవునిగతి సేనలం గూర్చుకొని మీ యవసరమునకుం గొలువ బలవంతుండంగాను. నా పురుషార్థం బీపాటి. నన్నుఁజూచి 'వీఁడేల తగిలెడు' నని కలంగకు; పరుండువానికి భూమి యాధారంబు; నదులకు సాగరంబే గతి; పక్షులకు వృక్షంబే వసియింపఁజోటు; సస్యములకు వర్షంబు; నాకు నీవు. శీృ వేంకటేశ్వరా!

25

సంకర్షణా! నీ మాయామాత్రంబున మానవులకు నీవు దారులోహపాషాణమృణ్మయంబులైన రూపంబులు వహించుకొని గుళ్లలోపలను ఇంటింటివారిచేతను బూజలుగొని వారు గోరిన వరంబు లొసగుచున్నాఁడవు. ఏమియు నెఱుంగనివారి కెంత సులభుండనై యున్నాఁడవు? నీ వితరణ గుణంబు ని న్నటువలెఁ జేసినదియో? ఈగతిం గరుణించుట నీ వ్రతంబో? నీ కది స్వభావగుణంబో? దీనులఁ గాచుట కీర్తియో? రామరామ! అరు దరుదు నీ మహత్త్వంబు! నీ చరిత్రంబు విని వెఱఁగయ్యెడు. మేలు మేలు! ఎట్లెన నింక నాజన్మములు ఫలించె; మనోరథంబు లీడేఱె. సంతోషంబు పరిపూర్ణంబయ్యె; శీృ వేంకటేశ్వరా!

26

దానవారీ | తొల్లి నే నుత్తమగుణంబు లెఱుంగను. నామీఁదం గృపపెట్టి పెద్దలు న న్నచారవంతుం డందురను నభిమానంబు రేఁచి నన్ను సాత్త్వికుంగాఁ జేసితివి. ఒరులు నన్నుం జెనకుదురోయని పిఱికితనంబుఁ బొడమించి శాంతునిఁగాఁ జేసితివి. కాంతలు ధనం బపహరింతు రనియెడు లోభంబు పుట్టించి జితేంద్రియునిఁగాఁ జేసితివి. అలమటలం బొంది ధనం బార్జింప వేసటనొందించి విరక్తునిఁగాఁ జేసితివి. నరకభీతి నివారించుటకై నీమీఁద భక్తి పుట్టించి నీ శరణు సొరం జేసితివి. ఈరీతి ననాదిసంసారసక్తుండనైన నన్ను ' నొక్కొక్క యుపాయంబున నీ కభిముఖునిఁగా దిద్దుకొంటివి. మఱి యింక నేఁ బ్రార్థించి నీకుం జేయు విన్నపము లేమియున్నవి? నీ దైవిక ప్రయత్నంబు ముందఱ నా మానుషప్రయత్నంబులు పచరింప సిగ్గయ్యెడిని. బాపురే! నిన్ను మెచ్చి నీ కేమి యొసగెదము? నిన్నుం బొగడుటే మాచేత నైనపని; శ్రీ వేంకటేశ్వరా!

27

పురుషోత్తమా ! వేదంబులు రత్నాకరంబులవంటివి; తమలోని యర్థంబులు బయలుపడనీయవు. పురాణంబులు గంటవేఁటకాండ్రవంటివి ; నానార్థంబులు చాటిచెప్పి భ్రమియింపంజేయుఁగాని యొకట నిశ్చయంబు దేటపడవు. భాట్టప్రాభాకరాది శాస్త్రంబులు నన్యోన్యశత్రులవంటివి; ఒండొంటిఁ ద్వేషించుఁగాని నీమీఁదిభక్తి బోధింపవు; దానంబు లింద్రజాలంబులవంటివి. ఒకటి పదియాఱై యనుభవింపఁ జేయుఁగాని ము క్తికిం దెరువుఁ జూపవు. ఇతర కర్మంబులు చేనిపంటలవంటివి; జన్మపరంపరకు హేతువులై దేహముల మొలపించుంగాని వై రాగ్యంబుఁ బొడమనీయవు. వీనిచందంబు లిట్టివి; ఏమిటం దెగు సంశయంబు? నిక్షేపంబు, వెట్టినవాఁడు చూపక కానంబడదు; నీవు సర్వజ్ఞుండవు; నాకు నుచితార్థంబు లిట్టివని తెలుపఁగదవే; శ్రీ వేంకటేశ్వరా!

28

పరమపురుషా : నేను దుర్జనుండ నని యెవ్వరు మఱుఁగుపడ విన్నపంబు సేయుదురో? యిప్పుడే నా నేరములు నేనే చెప్పుకొనియెద. మండాడుకొనియెద. తప్పుకొనియెద. అదీ యె ట్లంటివేని; నేఁ జేసిన పాపంబులు నన్నుం జుట్టుకొనియెనేని నీ నామోచ్చారణంబు చేసి తప్పించుకొనియెద. నీచేతఁ గల్పితంబులైన విషయంబులు బాధింప వచ్చెనేని నా మదిలో నీ పాదంబులు దలంచి నీ మఱుఁగున డాఁగెదను. పురాకృతకర్మంబులు నన్ను ననుభవింపవలయునని పట్టుకొనియెనేని నీవాఁడ నని బలిమిం ద్రోచెదను. యమకింకరులు నా తెరువు వచ్చిరేని నా భుజంబులనున్న శంఖ చక్ర లాంఛనంబులు చూపి వెఱపించెదను. సంసారపాశంబులు నన్నుఁ దగిలెనేని నీకథలు విని పరాకు చేసికొనియెదను నీమాయ నన్ను ముంచుకొనియెనేని నీ దాసులకుం జెప్పి నీకు విన్నపంబు సేయించెద. నా యపరాధంబులు చిత్తంబునం బెట్టకుమీ; శ్రీ వేంకటేశ్వరా!

29

స్వామీ! నీవు రక్షింపఁదలంచిన బ్రహ్మశాపం బేమి సేయఁగలదు? ధ్రువునిఁ జిరకాలజీవునిఁ జేసితివి. బ్రహ్మాస్త్రం బేమి సేయఁగలదు? పరీక్షితుని బ్రదికించితివి. బ్రహ్మమాయ యేమి సేయఁగలదు? గోవత్సబాలకుల నిర్మించితివి. మృత్యు వేమి సేయఁగలదు? సాందీపని కొడుకులం దెచ్చితివి. పాపం బేమి సేయఁగలదు? అజామీళు నుద్దరించితివి. అన్నింట బలవంతుఁడవగుట నీ చేఁతలం గానంబడియె. నీ దాసులైన వారికి నేభయంబు నొందకుండం గాతువు. నీ ప్రతాపం బేమని వర్ణింపవచ్చు? శ్రీ వేంకటేశ్వరా!

30

పుండరీకాక్షా ! అజ్ఞాన జంతువులైన మేఁకపోతు లింద్రాది దేవతలకుఁ, బశుపురోడాశం బయిన సంబంధమునఁ దమ్ముంగాచు గొల్లవానితోఁ గూడి స్వర్గాది భోగంబుల ననుభవించునట! రాజ్యలోభంబునఁ గ్రోధంబు పెంచి సమరరంగంబున నన్యోన్యహింసాపరులైన వీరపురుషులు సూర్యమండలంబు సొచ్చి పోయి దివ్యపదంబు లనుభవింతురట! కామాతురలైన సతులు పతులం బాయలేక కళేబరంబులు కౌఁగిలించుకొని యనలంబుఁ బ్రవేశించి యుత్తమగతులం బొందుదురట! సమ్యగ్జ్ఞానసంపన్నులై నీదాసులై దేహంబులందు నీ లాంఛనంబులైన తప్త శంఖచక్రముద్రలం బరిశుద్దులై, కామక్రోధపశువుల జ్ఞానాగ్నిలో వేల్చి, తులసీయుక్తమైన నీ శ్రీపాదతీర్థసోమపానంబునం బాపంబులు విదల్చి, నీ ప్రసాదమనియెడి పురోడాశంబు నారగించి, యాచార్యోక్తిముఖంబున నీ తిరుమంత్ర యజమాన పాఠంబులు జపియించి, నీకు బ్రీతిగా శ్వేతమృత్తికా శ్రీచూర్ల ధారణంబుఁ జేసి, పద్మాక్ష తులసీమాలికలు పూని, నీపైఁ దలంపుం బెట్టుకొని నీ పూజాయాగంబు నిత్యంబును జేయు వైష్ణవోత్తముల భాగ్యంబు లేమని వర్ణింపవచ్చు? శ్రీ వేంకటేశ్వరా!

31

పద్మనాభా! నీకు మ్రొక్క నెత్తిన కేలి నమస్కారంబు ముంజేతికంకణంబు; నీ లాంఛనంబులైన తిరుమణి పదంబుల జోడు మంగళసూత్రంబు; ఇతరంబుమాని నిన్నే కొల్చుట పాతివ్రత్యధర్మంబు; నీ దాసులసంగతి మెలంగుట కులాచార నియమము; నీపై భక్తినిష్ఠకుంజొచ్చు టుంకువధనం బందుకొనుట; నీదాస్యమే మానంబు; నీ కైంకర్యంబు సేయుట కాపురము సేయుట; నీ మూర్తి సేవించుటే సదానుభవంబు; నీ ముద్రలు ధరియించుటే చక్కఁదనంబు; ఆచార్యోపదేశంబే యావజ్జన్మసంపద; యని నిన్ను భజియించువారలు శ్రీవైష్ణవులు. ఇటువంటి వారలకు నీవు వరదుండ వని వింటిమి; మేము వీరిలోనివారమే. నీ చిత్తంబునఁ బెట్టుమీ; శ్రీ వేంకటేశ్వరా!

32

కోటిసూర్యప్రకాశా! లీలావినోదంబులకు నీవు గడియించుకొనిన ద్రవ్యంబులు లవణేక్షు సురా దధి ఘృత క్షీరాదులు సముద్రంబులై యున్నవి; కాంచన రజత ముఖ్యలోహంబులు పర్వతంబులై యున్నవి; సకలధాన్యంబులు నిచ్చఁ గ్రొత్తపంటలై రాసు లగుచున్నవి; పద్మరాగ వైడూర్య రత్నసంఘంబులు భూగర్భంబున నిక్షేపంబులై యున్నవి; పుణ్యనదులు నీ రాజ్యంబునకుఁ గట్టు కాలువలై యున్నవి; పుష్పఫలసమేతంబులు కాననంబులు నీ శృంగారపుఁ దోఁటలై యున్నవి; గజ వాజి రథ పదాతి సమూహంబులు పట్టణంబు లెందుఁజూచిన నీ ఠాణంబులై యున్నవి; జగదేక కుటుంబివైన నీవు సంసారంబు సేయఁగాఁ జూచి నోరూరుచున్నది. ఇతరులు మోక్షంబడుగ నెట్లు సమ్మతించెదరు? నీతోడి కాపురంబు గోరెదరుగాక! వారివలనం దప్పేమి? శ్రీ వేంకటేశ్వరా!

33

బలిబంధనా! దేహధారులకు రాగద్వేషంబు లుడుగ నెట్లు వచ్చు? బొందితో స్వర్గంబునకుఁ బోయిన ధర్మరాజును నున్నతపదంబున నున్న దుర్యోధనాదులం జూచి కనలిపడియెనట; మే మనంగా నెంతవారము? దేవా! నీవు పంచేంద్రియంబులు పఱియ విడిచి, ప్రాణుల నజ్ఞానమున ముంచియెత్తి భ్రమియింపంగా నీతో నెదిరించి వాని నణంపశక్తులమె? నీకు శరణని నీ నామసంకీర్తన చేయంగ నీ చిత్తము! మాభాగ్యము! ఎట్లు చేసిన నీ చేతిలోనివారమే! శ్రీ వేంకటేశ్వరా!

34

వేదవేద్యా! నీవు లోకవ్యాపారంబున నానాజీవులఁ బోషింపుచుండ

నే నొక్కవంక నీ మూర్తి నా మనంబున భావించి చిక్కించుకొని నీతో బట్టబయలు మాటలాడుచు నానామనోరథంబులం గాలక్షేపంబు సేయుచున్నాఁడను. ఇది నీవు సేయు నుద్యోగంబునకుం బరాకుసేయుట గాదుగదా! కాదులే. విశ్వతోముఖుండవు గావున నందఱతో మాటలాడ నోపుదువు. పరిపూర్ణుండవు గావున నన్నిచోటుల నుండనోపుదువు. మా కపచారము లేదు. అనంత శక్తిధరుండవు, ననేకమహిమలవాఁడవు, నపరిమితోదారగుణుండవుఁ గావున నిట్టి నీ మాహాత్మ్యంబునకు శరణంబు; శ్రీ వేంకటేశ్వరా! 

35

దేవదేవా! నిన్ను నేఁ బలుమాఱు దలఁచిన వీఁ డేమి కోరి తలఁచుచున్నాఁడో యని నీ చిత్తంబున నుండునని యొకానొకసారి నిన్నుఁ దలంపుదును. మఱియును మేనిం బడలించి తపంబు సేసిన నంతరాత్మవైన నిన్ను బడలిక సోఁకునో యని యూరకుందును. పేరుకొని నిన్నుఁ బిలిచిన నన్నిపనులు విడిచివత్తువో యని మౌనంబున నుండుదును. జగత్తున నీ వుండుట భావించిచూచిన నిన్ను శోధించిన ట్లయ్యెడినోయని పరాకుచేసికొందును. నీ చరిత్రంబులు సారెసారెకు వినం గడంగిన రహస్యంబులు బయలఁ బడునో యని యాలకింపను. నీ కొలువు సేసి పాదంబులకు మ్రొక్కంగా మందెమేల మయ్యెడినో యని యంతట నింతట నుండి సేవింతును. ఇది యెఱింగి నీవే దయంగావుము; శ్రీ వేంకటేశ్వరా!

36

వైకుంఠనాథా! హిరణ్యగర్భాదులకుఁ దండ్రివైన నిన్ను, సనకాదులకు నేలికవైన నిన్ను, దివిజులకు రక్షకుండవైన నిన్ను, మునులకు వరదుండవైన నిన్ను, జ్ఞానులకుఁ బరదైవతంబవైన నిన్ను, జగంబులకు మూలకారణమవైన నిన్ను యశోదానందగోపులు పుత్రుండవని పెంచిరి; గోపికాజనంబులు పతి వని తలంచిరి; పాండవులు బావమఱఁదివని భావించిరి. వీర లటువంటి మమకారంబు లనుభవించిరి. మఱికొందఱు ముచికుంద దధిభాండ కమలాకర భీష్మాదులు పరతత్త్వమైన నారాయణుండవని భజియించి బ్రహ్మపదంబునం బొందిరి. ఇన్నివిధంబులవారికి నీ వొక్కండవే గుఱి. ఎటువలె భావించిన నటువలె నౌదువు. వివేకింప నేర్చినవారి పాలిటి నిధాన మవుదువు; శ్రీ వేంకటేశ్వరా!

37

సత్యసంకల్పా! ప్రపన్ను లైనవారికి మీదాసుల శ్రీపాదతీర్థంబు శిరసావహించుట సకల పుణ్యనదీస్నానములు; త్రికాలంబుల నాచార్యవందనంబులు సంధ్యావందనంబులు; అభ్యాగత శ్రీవైష్ణవుల నుపచరించిన వాక్యంబులు గాయత్రిమంత్ర జపంబులు; పూర్వాచార్యోక్త స్వరూపగ్రంథానుసంధానంబులు వేదసారాయణంబులు; జ్ఞానాగ్నియందుఁ గామక్రోధంబులనుసమిధల వేల్చుట యౌపాసనంబు, ఆర్తులైనవారికి శ్రీవైష్ణవమార్గంబు లుప శించుట లతిధిసత్కారంబులు; తాతముత్తాతలమాద్రి నుండుటే దేవ పితృ సంతర్పణంబులు; మీ తిరువారాధన సేయుటే సకలయజ్ఞంబులు చేయుట; వేదోక్తంబైన కర్మనియమంబులు ఫలంబులు నిలువలె సిద్దించె. నిదియ పరమార్థంబు. నిన్ గొల్వవచ్చు; పాపముంబట్టి నిర్దహింపవచ్చు; నిన్ను ముట్టి మెప్పింపవచ్చునే! శ్రీ వేంకటేశ్వరా!

38

నిగమగోచరా! నామనంబు ధ్యానయోగంబు సేయంగడంగినఁ జండాల గార్దభ సూకర కాంతలు తలఁపున బాఱెడిని. అంతట నది విడిచి పురాణంబులు చదువం జూచినఁ దాటకా శూర్పణఖా విరాధ కబంధ రావణ కుంభకర్ణాదినామంబులు నోటం దొరలెడిని. అది మాని జపంబు సేయంబూనిన నిద్రయు, నావులింతలు, నలసత్వంబులుఁ బొదలెడిని. అది చాలించి తీర్థయాత్రకు గుతూహలినైన దుష్ట చోర వ్యాఘ్ర మకరాదిభయంబులు వణఁకం జేసెడిని. ఈరీతుల నా ప్రయత్నంబు లెక్కడ కెక్కు. నేనొకటి దలంచిన వేఱొక్క చందంబున నీ మాయ భ్రమియింపుచున్నది. ఏ యుపాయంబున నిన్ను నావశము చేసికొనియెద? నా చందము నాకు బోధింపవే; నీవు జగద్గురుండవు; నా మర్మము నీచేత నున్నది; శ్రీ వేంకటేశ్వరా!

శ్రీ వేంకటేశ్వర వచనములు

39

గధరా ! తరులతా పాషాణాదులైన కొన్ని జీవశరీరంబులు నరపశుపక్షి మృగాదులైన కొన్ని జీవజంతువులకు నాహారంబులై యున్నవి. విచారించి చూచిన నెవ్వరి 'కెవ్వరు చుట్టము లయ్యెదరు? ఋణానుబంధంబునం దగిలినవారు పుత్రమిత్ర కళత్రాదులు; ప్రాకృతసుఖంబులకుఁ దోడైనవారలు వీరు. స్వామి ! జగదేక కుటుంబివి నీవు. మోక్షసుఖంబునకుం దోడైనవారు నీ దాసులు. ఇహపరలోకంబులకు సాధనంబులై న బంధువులు మీరు. మీ నామములు సకల దురిత నివారణములు; మియాయుధములు మాకు సర్వరక్షకములు; మీ పాదంబుల పై భక్తి మాకు వజ్రపంజరము; శ్రీ వేంకటేశ్వరా !

40

విష్ణుమూర్తీ! నేనెంతమూఢకఠినచిత్తుండనై న నీవు నామీఁదఁ గృపవెట్టిన సాత్త్వికుండ నగుదును ; అది యె ట్లంటివా ? ఱాతిమీఁదం గడువ వెట్టినం గుదురుగాదె ! కమరునం జవ్వాజి పూసినఁ బరిమళంబు పుట్టదే! చిల్కకుం జదువు చెప్పినఁ జదువనేరదే! అడవియిఱ్ఱికి వేట నేర్పినఁ బంపు సేయదే ! ఇట్టు గావున నీవు నామీఁద దయఁదలఁచి తల్లి బిడ్డలం బిలిచి యాహారంబు వెట్టునట్లు, యజమానుండు దన పనులం దోలి తెచ్చి యింటఁ బోషించినరీతి, నన్ను నీ చిత్తంబున దయఁదలచి నీకింకరునిగాఁ జేసికొనవే;శ్రీ వేంకటేశ్వరా !

41

గోవర్ధనోద్దారా ! నేను గరచరణాద్యవయవంబులు దాల్చి మాతృగర్భంబునందుండి వెడలి పెరిగి బుద్ది నెఱింగి యీజగంబులకుం గర్త యెవ్వండోకో యని వెదకి వెదకి పురాణంబులవలన నీవైభవంబులు విని నిన్నుం గనుంగొన శక్యంబుగాక యెవ్వండవోకొ యని విచారించి నిన్ను శ్రీ వేంకటేశ్వర వచనములు నెఱుంగ నలవిగాక తిరుమల వరుస వెంటం జని వేంకటాచలం బెక్కి, గరుడ స్తంభంబు చెంత జనులకు నీవొసగు వరంబులు సూచియుఁ, బాపవినాశనంబునఁ దీర్ధంబులాడువారి పాపంబులు నీరై పాఱుటంజూచియు, ఆకొండమీఁదవృశ్చికసర్పాదిజంతువులు నిర్గతవిషంబులగుటం జూచియుఁ జోద్యంబు నొంది యచట నీ మూర్తి దర్శించి తొల్లింటి యజ్ఞానంబు విడిచి సందేహంబులు మాని నీవే యేలిక వనియు నే నీబంట ననియుం దెలిసి శ్రీ వైష్ణవుండ నైతి రక్షింపవే; శ్రీ వేంకటేశ్వరా !

42

ఉపేంద్రా ! నీవు నాకు దేవరవై నాలోనుండఁగా నే నీదిక్కు సూడక యేకాంతంబని సంసారంబు చేసి బిడ్డలం గంటిని. అదియునుంగాక యేలిక వైన నీవు నన్నుఁ జూచుచుండ బ్రమసి యెవ్వరుం గానరని చేయరాని, పాపంబులు చేసితిని. మఱియు నీవు నాకుఁ దోడవై రక్షకుండవై యుండఁగా మఱచి యొంటి నున్న వేళ నొక్కండనే యని సంశయించి భూతంబులకు వెఱచితిని. క్రమ్మఱ నీవు నా మనంబులోఁ బంచేంద్రియములలో విహరింపఁగా వెఱవక, మందెమేల మని యెంచక, మంచము పై నిద్రించితి. ఒక్కొక్క వేళఁ దలిదండ్రులైన మీ రాత్మభోగంబుల నొసగుచు బాహ్యాంతరములం గాంచుచుండఁగాఁ గొంచించక సిగ్గు విడిచి మలమూత్రంబులు విసర్జించితి. ఎంచి చూచిన నా యపరాధంబు లెన్ని యైనం గలవు; అన్నియును నోర్చుకొనుము. నా తప్పులకుం బ్రాయశ్చిత్తంబుగా దండంబు పెట్టెద; శ్రీ వేంకటేశ్వరా !

43

చక్రపాణీ ! నీ మాయలకు లోనై నేను వ్యసనంబులచేతం జిక్కినప్పుడు నీబంట నని విడిపించుకొనుమీ ! ఆశాపాశంబులు నన్ను నలు వంకలకుం గుదియఁ దీసెనేని ప్రాతవాఁడనని వెనుక వేసికొనుమీ కామక్రోధాదులు సారెసారెకుఁ బట్టఁ గడంగెనేని నీ ముద్రలు మోచిన వాడ నని యడ్డంబు రమ్మీ! పురాకృతకర్మంబులు నన్నుఁ దగిలెనేని సంకీర్తన సేయువాఁడనని మన్నించి రక్షించుకొనుమీ ! నడుమ నడుమ నజ్ఞానంబు చిక్కించుకొనిన దానిం బరిహరించి నన్నుం జేపట్టుమీ ! మనసుపట్టలేక మునుపేవిన్నవించితి. నీ వనాథనాథుండవు; ఆర్తశరణ్యుండవు; సర్వ భూత దయానిధివి; నిర్హేతుక బంధుండవు; నీవు నా హృదయంబులోనివాఁడవు; నాకు దిక్కు. నీవే సుమీ; శ్రీ వేంకటేశ్వరా !

44

మాధవా ! మీ రర్జునునకు సాక్షాత్కారమై యుండి భగవద్గీత లేడు నూఱు గ్రంథంబులు బోధించితిరి. విశ్వరూపంబుసూపి ప్రమాణంబుచేసి మి మ్మెఱుంగు మని యుపదేశించితిరి. ఇంక మముబోఁటి జీవుల నెన్నిట బోధింపవలయునో యందులకే చింతించెదను. అవులే; ఇంకొక యుపాయంబు విచారించుకొంటి; తొల్లి వాల్మీకి "రామా" యను రెండక్షరముల నుడివి బ్రహ్మర్షి యై మీ కృపకుం బాత్రుండయ్యె. నారదుండు మీ సంకీర్తనంబు సేసి కృతార్థుఁ డయ్యె. విభీషణుఁడు మీకు శరణుసొచ్చి బ్రదికె. నాకు నిదియే మార్గంబు; శ్రీ వేంక బేశ్వరా !

45

నందనందనా !. చేయంగల పాపంబు లన్నియు జేసితి; నా కర్మంబే మనుచున్నదో యెఱుంగను. దేవర్షి పితృతర్పణంబులు సేయకుంటిని; యమకింకరు లే మనుచున్నారో యెఱుంగను. ఎక్కడ లేనియుద్యోగంబులు సేయుచున్నాఁడను; విధి యేమనుచున్నదో యెఱుంగను. అన్నపానాది భోగంబు లనుభవించుచున్నాఁడను; చిత్రగుప్తు ! డేమీ వ్రాయుచున్నాఁడో యెఱుంగను. బాల్య కౌమార యౌవన గతులం బెరుగుచున్న వాఁడను; కాలం బేమనుచున్నదో యెఱుంగను. ఇన్ని యపరాధంబులకు గుఱియైనవాఁడ నగుట నాభయము నివారింతు వని నీమఱుఁగుసొచ్చితి. చేయంగల విన్నపంబు లెల్లఁ జేసికొంటి; నీ చిత్తం బెట్లున్నదో యెఱుంగను. శ్రీ వేంకటేశ్వరా !

46

ఆదిమూర్తీ : నేను భూలోకంబున నా కర్మంబు లనుభవింపం బుట్టితిఁ గాని నిన్ను గుఱు తెఱింగి కొలిచెద నని పుట్టినవాఁడను గాను. ఇంతలో నీవు నిర్హేతుకలీలం గరుణించి, నన్ను బంటుగా నేలితివి. నా భాగ్యంబు లేమని పొగడెద ; నిన్నుం బొగడుటేకాక! నే నేమితపంబు చేసితినో యది దలంపనేల? నీమహిమ దలఁచుటగాక! నా బుద్ది నేమి మెచ్చుట ? నీ సంకల్పంబు మెచ్చుటగాక ! దప్పిగొన్న యతండు జలముల వెదకుచుండ భాగీరథీజలంబబ్బినట్లు, కృషికుండు తనచేనుదున్నుచో నాఁగంటికొన బంగారు కొప్పెర దొరకినట్లు, పులిజూజంబాడెడువాఁడు ఱాలేఱుతఱి మాణిక్యంబు చేకూడినట్లు నీవు నాకుం దొరకితివి ; శ్రీ వేంకటేశ్వరా !

47

మత్స్యావతారా ! అవధారు ! దేవ, నాలోని పాపపురుషుండు విజృం భించి తఱుముకొని రాఁగా నీ మఱుంగు సొచ్చితి. అంతలో నీ యభయదాన పురుషుండు వచ్చి యతనితో దారుణ యుద్ధంబు సేయఁ దొడంగెను. అరిషడ్వర్గంబు లనియెడి చుక్కలు డుల్లె; "తాపత్రయం బనియెడి పిడుగులు రాలె; చింతాసముద్రంబు గలంగె; నిర్దయ యనెడి ధరిత్రి వణఁకె ; దుర్గుణంబు లనియెడి దిక్కులు చలియించె; దురాశాపర్వతంబులు గ్రుంగె; అతిఘోరసమరంబునఁ బాపపురుషుండు నోడిపాఱె; మీయభయదాన పురుషుండు గెలిచె; ఈ మేలువార్త "మీకు విన్న వించితి; శ్రీ వేంకటేశ్వరా !

48

కమలనాభా ! నే నీవేగువాఁడనై విన్నపంబు నేయవచ్చితి ; ఏకాంతంబున విన నవధరింపుము, భువిలో శరీరం బనియెడి మాయాపట్టణంబు గలదు. అందు కహంకారం బనియెడి రాజు; చలం బనియెడు ప్రధాని; విషయంబు లనియెడి కరితురంగంబులు; పాపంబు లనియెడి వీరభటులు; కోరిక లనియెడి కాపులు; రతిసుఖంబు లనియెడి ధనధాన్య భండారంబులు గలవు. ఈరీతిఁ గోటలోనివారలు ఆశలనియెడి నిశాసమయంబుల నేమఱి నిదురవోవుచుందురు. జ్ఞానంబనియెడి నీ యూడిగపు దొరతో నన్ను బుద్ధి వైరాగ్య శమదమంబు లనియెడి బలము వెంటఁ గూర్చి యంపితేని ఆకోటగొని యందు ఠాణంబుండి పగవారి నందఱను గెలిచి పట్టితెచ్చి యప్పగించెదం బంపు వెట్టవే; శ్రీ వేంకటేశ్వరా !

49

సుదర్శనధరా ! జీవులునేసిన పుణ్యపాపంబులు చిత్రగుప్తులు వ్రాయుదురట; నామీఁద నేమి వ్రాయుదురో యెఱుంగను. నేఁ జేసిన పుణ్యంబులు మీకు సమర్పించితిని; పాపంబు సేయించిన యింద్రియంబుల మీముందటం బెట్టితి; మనంబు మీకు నప్పగించితి; భక్తి మీకుం గానుకగాఁ బెట్టితి; శ్రీ వైష్ణవుండనై మీదాసుల మఱుంగు సొచ్చితి. అన్నింట నా కొఱంతలు దీర్చుకొంటిని. ఇంక నామీఁదఁ జిత్రగుప్తులు నిలువలు వ్రాయంబని లేదు. ఇందుకు సాక్షియు నీవే; ఎఱుకయు నీవె; విన్నవించితి. శ్రీ వేంకటేశ్వరా !

50

రంగధామా ! నీవు నీటిపైఁ గొండలఁ దేలించిన బలవంతుండవని,క్రోఁతులచేత రాజ్యంబు సేయించిన నేర్పరి వని, రాతికిం బ్రాణంబు లిచ్చిన యుదారుండ వని, కొండ గొడుగుగాఁ బట్టిన సత్త్వ సంప న్నుండవని, ఒక గజముమాట వినివచ్చి కాచిన భక్తసులభుండవని, ఆఁడుదాని మొఱాలకించిన దయాళుండ వని, ప్రహ్లాదుని ప్రతిజ్ఞ చెల్లించిన భక్తపరిపాలకుండ వని, పదియాఱువేల నూటయెనమండ్రు దేవుల కందఱ కన్ని రూపులై వినోదించిన నెఱజాణవని నీకు మ్రొక్కితి ; నిన్నుం గొల్చితి ;భవంబులం గెల్చితి; సంతోషంబున నృత్యం బాడెదను; శ్రీ వేంకటేశ్వరా !

51

రావణాంతకా ! నీవు దేవసంరక్షణార్థమై పాయసంబులోఁ బ్రవేశించి కౌసల్యాగర్భంబున జన్మించి తాటకాహరణంబును, సుబాహు రాక్షసవధయును, కౌశికయజ్ఞ సంరక్షణంబును, అహల్యాశాపమోక్షణంబును, ధనుర్ భంగంబును, సీతావివాహంబును జేసికొని పరశురాముఁడు మింటికిం గట్టిన త్రోవలు దెగ నేసి దశరథుండు పట్టంబుగట్ట సమకట్టినఁ గై కేయిచేతఁ బదునాలుగేం డ్లరణ్యావాసంబునకు మితి చేసి కొనిన కారణం బేమి ? అవులే; దశకంధరునికిఁ బదునాలుగేం డ్లాయు శ్శేషము నాఁటికిఁ గలిగెఁ గాఁబోలును; తావత్పర్యంతమును, శూర్పణఖా నాసికాచ్చేదనంబును, మారీచ కబంధ ఖరదూషణాది హననంబును, వాలి నిబర్హణంబును, సుగ్రీవాదివరణంబును, వానర నియోగంబును, సముద్ర బంధనంబును జేసి యంతట రాక్షససంహారంబు గావించి, లంక విభీషణున కిచ్చి సీతాసమేతుండవై యయోధ్యాపట్టంబుఁ గట్టి కొంటివట ! ఎంత కపటనాటకసూత్రధారివి ? శ్రీ వేంకటేశ్వరా !

52

కేశవా ! నీవు విరక్తులకు మోక్షసుఖంబవై యుందువు; ప్రాకృతులకు సంసారంబవై యుందువు ; నిన్ను ధ్యానంబు సేయువారలకు సాకారంబవై యుందువు ; ఇతరులకు మువ్వురిలో నొక్కండవై యుందువు ; మూఢులకు నవేద్యుండవై యుందువు ; దనుజులకు సహంకారంబవై యుందువు ; దేవతలకు బ్రహ్మపదంబవై యుందువు ; ఈరీతి వారివారికిఁ దగినట్లు నీరుకొలఁది తామరవై యుందువు. ఓపిన వారి కోపినంత భాగ్యంబవు; నీకు శర ణన నేర్చినవారిని నీవే రక్షింతువు ; నీవలనఁ గొఱత లేదు ; శ్రీ వేంకటేశ్వరా !

53

అచ్యుతా ! మిమ్ము నేమియు నడుగ ననియెడు నహంకారంబు గలవాఁడఁగాను; మీ పనుల యెడ నపరాధంబు లేకుండెడు నట్టు కొలుతు ననియెడు గర్వంబు గలవాడం గాను; మిమ్ము నమ్మితి నని సారెసారెకుం గొసరెడివాఁడఁ గాను; మీకు విశ్వాసి నని యెమ్మెలం బొరలెడివాఁడఁ గాను; వేద శాస్త్రంబు లెఱుంగుదు నని పెద్దల ధిక్కరించెడువాఁడఁ గాను; ఆశ్రమాచారంబులు చూపి యుత్తమలోకంబులు చొరఁబాఱి సరిగెల్పు నెఱపెడివాఁడఁగాను; మీమీఁదిభక్తి గలదని బలిమి చూ పెడివాఁడఁగాను; 'శేషత్వ పారతంత్య్రముల మఱుఁగున నిల్చి మిమ్ము సేవించు మీ దాసానుదాసుండ నని యెఱుంగుమా; శ్రీ వేంకటేశ్వరా !

54

భుజగేంద్రశయనా ! లక్ష్మీసమేతులరై యేమేమి సేయుచుంటిరో మీ యవసరం బెఱుంగక మిమ్ముఁ దలంపరాదు. రుక్మిణీ దేవితో నెత్తంబు లాడెడువేళ ద్రౌపది “హా కృష్ణా' యని తలంచిన నక్షయం బని పాచికలు వైచితిరట; కరీంద్రుండు మిమ్ముం దలంచిన వైకుంఠభోగంబు లటువెట్టి వచ్చితిరట; ప్రహ్లాదుండు కంబంబునం జూపెద ననినఁ జించు కొని వెడలితిరట. ఈరీతి మీచరిత్రంబులు విన వెఱఁ గయ్యెడిని, మీవేళచూడక తలంచిన నపచారంబుగదా ! మీయంత మీరెప్పుడు నన్ను మన్నించ విచ్చేయుదురో యని మీ శ్రీ పాదపద్మంబులచప్పుడు నాలకింపుదును. మీకై నేనేవేళనైనను హృదయంపు వాకిళ్లు గాచు చుండెద; శ్రీ వేంకటేశ్వరా !

55

పరంధామాధిపా ! మీ మహిమసముద్రమునకుఁ గారుణ్యంబు జలంబు; మీ కల్యాణగుణంబులు తరంగంబులు; మీ నిగ్రహానుగ్రహంబులు తిమితిమింగిలంబులు; మీ శ్రుతులు ఘోషంబులు; మీ గాంభీర్యంబులోఁతు; మీ ప్రతాపంబు బడబానలంబు; మీ కపటనాటక వ్యాపారంబులు మకరకచ్చపాది జంతువులు ; ఇట్టి మీ మహిమ సముద్రంబు మీ దాసులు మిమ్ముఁ గూడి తరవఁగాను భక్తియను కామధేనువు వొడమెను; జ్ఞానం బనియెడి చంద్రోదయం బాయె; ఆనందంబని యెడి యైరావతంబు, సాత్త్వికంబనియెడి పంచతరువులు, అనంతనామంబు లనియెడి యప్సరః స్త్రీలు ; తిరుమత్రం బనియెడి యమృతంబునుం బొడమె ; మీ యష్టాక్ష రామృత మనుభవించుచున్నాము ; శ్రీ, వేంకటేశ్వరా !

56

కాలాంతకా! బ్రహ్మాండకోట్లఁ గుక్షింబెట్టుకొన్న నిన్ను గర్భంబునమోచె నట దేవకీ దేవి; విశ్వరూపుండవైన నిన్నుఁ గౌఁగిలించుకొన్నారట గోపికలు; సర్వతోముఖుండవైన నిన్ను ముద్దాడెనట యశోద; అపరిమిత బ్రహ్మంబైన నీకు ద్వారకానగరంబు గట్టెనట విశ్వకర్మ; సర్వవ్యాపకుండ వైన నీకు రథముఁ గడపెనట దారుకుండు; అనంతనామంబులు గల నీకు నామకరణంబు చేసెనట గర్గుండు; వేదాంత వేద్యుండవైన నీకుఁ జదువు చెప్పెనట సాందీపుండు; ఇది యెటువంటి యద్భుతంబు; విన నగోచరం బయ్యెడిని. అబ్లేకదా, నీకంటె నీదాసు లధికులౌట తేటపడె. శ్రీ వేంకటేశ్వరా !

57

జగదేకవీరా ! నాయర్థాతురత్నంబున నిన్ను 'దైవమా' యని దూఱి సొలసితి ; ఐశ్వర్యగర్వంబుచేత ఈ గుళ్ల ముందఱ వాహనంబు దిగనైతి; మీ సన్నిథిని "దాంబూలచర్వణంబులు చేసితి; బాల్య యౌవన కౌమార గతులచేత మీకు మ్రొ క్కనైతి; మఱియును గొన్ని యేమియపరాధంబులు చేసితినో? నేఁ జేసిన యపరాధములకు క్షామక ముగానిప్పుడే మీ తిరుమంత్రోచ్చారణంబు చేయుటచేతను చంచలత్వంబు విడిచి చిత్తము 'శాంతమునం బొందె. మీరే పరతత్వం బని తెలిసి శరణాగతుండనై మీ దాసులలోఁ జేరితిని; నేఁజేసిన యపరాధ ములకుఁ బరిహారముగా మిమ్ము నాకుం జాటి చెప్పిన యాచార్యుల శ్రీపాదతీర్థవిశేషములకుంజేయొగ్గెద; మీదాసుల పాదరక్షలు మోచెద; మీదాసానుదాసుల సేవకుండ నయ్యెద; మీదాసదాసీ జనంబులకు నీళ్లు మోసెద; మీ లెంకలకు లెంకతనంబునఁ జొచ్చి యచ్చువేసికొనియెద; నాసర్వాపరాధంబులు క్షమింపవే; శ్రీ వేంకటేశ్వరా !

58

లంకాపహారీ ! వైష్ణవజ్ఞానం బనియెడీయంజనంబు చేత నీ వనియెడి నిధానం బెత్తికొంటి అదియునుంగాక నీపై భక్తి యనియెడి నావచేత సంసార సముద్రంబు దాఁటి వైరాగ్యంబనియెడి పదార్థంబు నీకు సుంకంబు పెట్టక బలిమిం దెచ్చుకొంటిని. నీ పాదంబులమీఁది తులసీ మాలిక చేత నజరామరపదంబుఁ జాఱగొంటిని. ఇవి నాదుర్జనకృత్యంబులు; నీవు భూమీశుండవు. కనుకఁ నీవునన్నుఁ బ్రమోషంబు సేయకయున్నప్పుడే విన్నవించితి. నేఁ జేసిన చేత లివి; ముందు నీచిత్తం బెట్లుండునో? ఇదిగో నీకు విన్నవించితిని, మఱవక విన నవధరించి రక్షింపవే; శ్రీ వేంకటేశ్వరా !

59

ముచికుందప్రసన్నా ! సంసారధర్మంబు లనియెడు నంగళ్ల లోపల నీతి సంగతులనియెడు వ్యవహారులు కోరిక లనియెడు సరకులు పచరించు కొని అగ్గువతో నమ్మఁగా నేను బహుళంబుగా సంపాదించుకొంటిని. ఆ కోరికలను నొడిఁగట్టుకొని యనుభవించనే వేడుకయగుచున్నది. నిన్ను ధ్యానంబు నేయంజనదు నామనస్సు క్రొత్త కోడెవంటిది. జ్ఞానంబని యెడు కంబంబునఁగట్టి వైరాగ్యంబనియెడు సాదుపసరముతో లంకె వైచి నీ కృషికి దిద్దుకొనవే ; శ్రీ వేంకటేశ్వరా !

60

హిరణ్యగర్బా : నీకుఁ బాన్పైన శేషుండు బ్రహ్మాండం బెత్తుకొనియె; నీకు వాహనం బయిన గరుత్మంతుం డమృతంబుఁ గొని చనియె; నీకూతురైన గంగాభవాని హరుశిరస్సు నెక్కె; ధ్రువుండు బ్రహ్మలో కంబతిక్రమించె; నారదుండు సురలకుఁ బోరువెట్టుచున్నాఁడు; రుక్మాం గదుండు యమలోకంబుంబాడుచేసె; శకుండు వైరాగ్యంబు చూఱఁగొనియె; ఇందుచేతను నీదాసులు నీకంటె నధికులౌట తేటపడియె; శ్రీ వేంకటేశ్వరా !

61

రామరామ : లోకంబెల్ల నొకపాదంబునఁ గొల్చితివట; నీరూపం ' బేమని చెప్పుదును? అనంత వేదంబులు నిన్నుం బొగడునట ! నీ గుణంబు లెన్ని యని యెన్నుదును ? నీ రోమకూపంబుల నజాండకోట్లు నిండుకొన్నవట ! నిన్ను నేమని వర్ణింతును ? నీవు సర్వదేశ సర్వకాల పరిపూర్ణుండవై యుండఁగాను నీప్రభావం బేమని పొగడుదును? పురాణ పురుషుండవట; నీతుద మొద ళ్లెఱుంగువా రెవ్వరు? నిన్నుఁ దెలియ నుద్యోగంబుఁ జేసెద. నాయాస లేమని చెప్పుదు ? నంతయు నీ వెఱుంగుదువు: శ్రీ వేంకటేశ్వరా !

62

శరణాగతవజ్రపంజరా ! నీవు లోకసంరక్షణార్థంబై నీ స్వతంత్రంబున నెత్తిన రామావతారంబున నీ శక్తిని నీవె యెఱుంగ వని యందురు గొందఱు. హరువిల్లు నెక్కు పెట్టి విఱిచినదియును, పరశురాముఁడు గడియించిన స్వర్గ సోపానంబులం దెగవ్రేసినదియును, సుగ్రీవునికి వాలిం జంపెదనని ప్రతిజ్ఞ చేసినదియును, శరణుసొచ్చిన విభీషణునకు మున్నుగా లంకారాజ్యంబునకుఁ బట్టంబు గట్టినదియును, సీతను వెదకంబోయిన వానరులలోన హనుమంతుచేతికి నుంగరం బొసంగినదియును, జలధిపై విల్లు దొడిగినదియును నీ భుజబలిమియకాదె ! నీ ప్రతాపంబు నీ వెఱుంగని దేమి ? నీవు సర్వజ్ఞుండవు. నిన్ను నెఱుంగనివారలె యజ్ఞులు గాక ! శ్రీ వేంకటేశ్వరా!

63

కౌసల్యానందనా ! ఈ మనుష్య జన్మంబు నీవె నా కొసంగి పుట్టించితివి.ఇది నాకిచ్చిన వారకపు శరీరము. ఇందుల యాభరణంబులు, నన్నపానాది భోగంబులు, నీ కరచరణాద్యవయవంబులు చేసిన పుణ్య పాపంబులు నీకె సెలవు. నేనేమిటివాడను? అణుమాత్రపు జీవుండను. ఈ తనువు నామీఁద నదనంబు వెట్టితివి. రాచముద్రకుం బెట్టిన లంచంబు రాజునకు సమర్పణంబె కాదా ! అది యెట్లంటివా? ఆత్మ నీవుండెడి నెలవు. నీ వున్నచోటను నూటయెనిమిది "తిరుపతు లును సకల పుణ్య క్షేత్రంబును నుండును. న న్నజ్ఞానంబు లంటనీయకు ; శ్రీ వేంకటేశ్వరా!

64

సుగ్రీవరాజ్యస్థాపనా ! నే నొకవేళ నీ దాస్య మనియెడి గజస్కంధమందారూఢుండనై చరియింతు. మఱియొకపరి నీవు నాకుం గల వనియెడి విశ్వాసం బను తురంగంబు నెక్కి యాడెదను. ఇంకొకప్పుడు మీ కథలు విని యానందరథంబు పై విహరింతును. ఆ తర్వాతను వినయవిధేయవర్తనంబు లనియెడి చరణ త్రాణంబులతోడఁ బదాతినై మీ యవసరంబు గాచుకొని ముందఱఁ గొలువు చేయుదును. ఈరీతి చతురంగ బలంబులతోఁ దోడుసూపంగల బంట నీకు ; నామీఁద నేమి యపరాధంబు గలిగిన నోర్చుకొనుము ; శ్రీ వేంకటేశ్వరా !

65

ఆనందనిలయా ! మిమ్ము దర్శించుసమయంబున నొక కానుక గావలసి యపూర్వ వస్తు వెట్టిదో యని వెదకి వెదకి మఱియుఁ గొందఱు నడుగంగాను, వార లొండేమి యడుగుచున్నాఁడ వని హుంకారధిక్కా రంబులచేత భర్జింపగాను వారలం దిరిగి కోపింపక యందులకు నొదిఁగి శాంతి గైకొని వర్తించితి. అంత నీ కామక్రోధ విరహితం బయిన శాంతమే కా యుత్తమ వస్తు వని నా మనోవీథిం గంటిని. అది నీకుఁ గానుకగాఁ దెచ్చితిని. అది యమూల్యము. తులాభార హిరణ్య గర్భాది మహాదానంబు లిందులకు సరిగావు. అష్టాంగ యోగంబుల సిద్ధులు నిందులోనే యున్నవి. తపంబునఁ బొందెడు మహిమయును దీన సిద్దించును. నీ విందులకు సంతోషింతు వని యిది మేలై న వస్తువు గనుక సర్వేశ్వరుండ వయిన నీ ముందరం బెట్టక పోరా దని సమ్ముఖం బున నిల్పితిని, నా హృదయం బనియెడి భండారంబులోఁ బెట్టి పదిలంబుగా దాఁచుకొనుము, కొనుము; శ్రీ వేంకటేశ్వరా !

66

జ్యోతిర్మయా! నా కాఁపురంబు నీకు విన్నవించెద. మా పెద్దలు గడియించిన పూర్వాచార్యోక్త గ్రంథంబు లనియెడి వృత్తులు గలవు. అవి పలుమాఱు ద్రవ్వి త్రవ్వి నానా దేశంబుల శ్రీ వైష్ణవుల కృప లనియెడి పంటకాల్వలఁ బాఱించుకొని వ్యవసాయంబు సేసి ముందరగా నీ కైంకర్యమనియెడి మొలకలను విత్తి పైరుకొల్పి నీ యనుగ్రహమను కొల్చు పండించి మన స్సనియెడి కణఁజంబునం బెట్టితి. భాగవత ధర్మంబు లనియెడి పాఁడిపశువులను బరిపాలించుకొనుచుంటిని. నీ ధర్మం బున సుఖంబున్నాఁడను. దీన నిఁక నీ సారూప్యంబనియెడి ధనంబు గడించుకొనఁగలను; శ్రీ వేంకటేశ్వరా !

67

శంఖపాణీ ! నా దేహం బొక నెత్తవుంబలక. నా పంచవింశతి తత్వంబులు సారెలు. నా యుచ్చ్వాసనిశ్వాసంబులు పాచికలు. నా పుణ్య పాపంబులు పన్నిదంబు లొడ్డిన ద్రవ్యంబులు. ఈరీతిఁ దన్ను కాడెడి,జూజగాఁడను. నీ మాయతో నింతగాలము నాడియాడి యోడి మఱి యొక్కొక్క జన్మంబునను మగుడ సూడుగొని యీ యాటలె యాడు చున్నాఁడను. గెలుపెట్టిదో, యెప్పుడో యెఱుంగను. నీవు నన్నేలిన యేలికవు. బంటు జయించినజయ మేలికదె కదా ! నాకుంగాను సూడు వెట్టి గెలిపింపుమా ! శ్రీ వేంక టేశ్వరా !

68

అభేద్యవిక్రమా ! కన్నులు మూసిన లయంబును, దేఱిచూచిన జగం బును, మేలుకొనిన నందు జననంబును, బరస్త్రీగమనంబున నరకంబును, స్వపత్నీ సంతానంబున స్వర్గనివాసంబును, క్రోధంబున 'రాక్షసత్వంబును, ననాచారంబునఁ బాపంబును, నాచారంబున పుణ్యంబును, నసత్యంబునఁ గీడును, సత్యంబున మేలును నీరీతి నందఱకుఁ గానవచ్చు. మఱపు పుట్టించుచున్నది నీ మాయయే యని యీయర్దం బెఱుంగుదురుగాని బ్రమియనివారు లేరు. ఇంతగాలంబున నే నెత్తిన జన్మంబులుం గోటానఁ గోట్లు గలవు. అన్నియు సంసారంబునకే సమర్పణం బయ్యెం గాని యిందులో నొక జన్మమైనను మీకు సమర్పణంబు గాదయ్యె. దేవా, యింక నా నేరంబు లెన్ని యని యెంచెద ! గతజల సేతు బంధనంబు. అట నీమాయ నిగ్రహించెద ననిన నది యశ క్తి దుర్జనత్వంబు. నా మూఢత్వంబు చూచి యీ జన్మంబున నీవే దయదలఁచి నన్ను దాసునిగాఁ జేసితివి. నీ కుపకారంబు దక్కెను. నా మనోరథంబు నీడేఱెను; శ్రీ వేంకటేశ్వరా ! 

69

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ! సకల ప్రాణుల శరీరంబులు నీకు క్షేత్రంబులు. నీవు క్షేత్రజ్ఞుండవు. జీవులు నీ కమతీలు. ఇంద్రియంబులు నీకు నేరు కలపలు. ఇహపర సౌఖ్యంబులు కాఱు వేసంగిపంటలు. దేహానుభవంబులు నీవు వెట్టెడి జీతంబులు. లోకులు చేసిన ధ్యానానుష్ఠానఫలంబులు కొల్చు భండారంబులు. ఈరీతి ముందరికిని సందఱ హృదయంబులను జ్ఞానభక్తి వైరాగ్యంబు లనియెడి బీజంబులు మొలవం బెట్టింపుము ; తొల్లి బలభద్రరాముండవై నాఁగలి ధరియించి దున్ని కాళింది కాలువలు దీర్చితివట ! శ్రీ వేంకటేశ్వరా !

70

అసురకులసంహారకా ! నేను జన్మం బెత్తి వయోమదోద్రేకంబున యుక్తాయుక్తంబు లెంచక మనస్సుం బాఱవిడిచి నానాభోగంబు లనుభవించి యందువలనఁ బుణ్యపాపంబుల యిఱుకునం జిక్కి కర్మబద్దుండనై విడిపించుకొన శక్తుండఁగాక బందెదొడ్డిం జిక్కిన పసరంబువలెను, పాశమునం బడిన మర్కటంబుపగిదిని, జోగిచేతం జిక్కిన సర్పంబురీతిం, బసిరికాయలోని కీటంబువలె, నుండి నీవు సర్వలోకనాథుండ వగుటం జేసి విన్నవించితిని. నే నీకుం దగులై నవాఁడ నగుట నీవు నన్నుఁ గరుణిం చి నీ ముద్రవేసి నీ దాసునిఁగాఁ జేసికొంటివి. ఈ సంతోషంబున నిన్నెంతయుఁ గొనియాడెద నోహోదేవరా ! శ్రీ వేంకటేశ్వరా !

71

. అమృతమధనా ! మహాపురుషులు మిమ్ముంగోరి యతి ఘోర తపంబులు సేయు వేళలఁ బక్షులు దేహంబులం గూళ్లం బెట్టునట ! ఇటు వంటి నియమంబున మిమ్ము నే నెట్లు ధ్యానంబు చేసి బ్రత్యక్షంబు సేసికొని మెప్పించెద ? ఇంత లేసి పనులకు సమర్థుండనా ? మీకుఁ జేతు లెత్తి మ్రొక్కంగలవాడ నింతేకాని తొల్లి మీరు రామావతారం బైనవేళ వనంబున సంచరించునప్పుడు, కృష్ణావతారంబై నవేళ నందవ్రజంబున సంచరించునప్పుడు పాషాణతృణగుల్మల తాదులు మీ పాదంబులు సోఁకి పావనంబయ్యెనట ! అవి యే తపంబులు చేసినవి ? మాకు మీ శ్రీపాదములే గతి ; శ్రీ వేంకటేశ్వరా !

72

వైజయంతీవనమాలికాధరా ! ఈ బ్రహ్మాది దేవతల యైశ్వర్యంబులు నీ దేవుల కటాక్షవీక్షణంబులోఁ గించి న్మాత్రంబువలనం బొడమినవి. మహాపురుషుల మాహాత్మ్యంబులు నీవిచ్చు వరంబులలో లవ లేశంబులు. అన్ని సదువుల ప్రభావంబులు నారాయణాష్టాక్షరంబులలోని సహస్రాం శంబులు. ఉత్పత్తి స్థితి లయంబులు నీ మాయాశక్తి సంకల్పమాత్రంబులు. నీ మహామహిమలం దెలియ నెవ్వరివశము ? అగోచరములు ! తర్కవాదముల కభేద్యుండవు; యుక్తుల కసాధ్యుండవు; భక్తులకు సులభుండవు; నిన్ను నీవే యెఱుంగుదువు గాక యితరులకు నెఱుంగఁ దరమా; శ్రీ వేంకటేశ్వరా !

73

నరకాసురవైరీ ! ఈ కల్పంబున బ్రహ్మ దేవునికి నేఁబది యేండ్లు చెల్లెనట ! అతని యొక్క దివసంబున స్వర్గంబునఁ బదునలువురు దేవేంద్రు లేలుదురట. ఇప్పు డేడవ దేవేంద్రుఁ డేలుచున్నాఁడట. నేను నాఁట నుండి యెన్ని జన్మంబు లె త్తితినో ? యేయేజాతులం బుట్టితినో ? నేను మనుష్యుండ నని చెప్పుకొను టెట్లు ? పుట్టువులు వేఱుగాని యప్పటి జీవుండనే నేను, ఇప్పుడు బ్రాహ్మణజన్మంబునం బుట్టించి శ్రీ వైష్ణవునిం జేసి యేలితిరి. నాయంత నే నెఱింగి మీకు విన్నపంబు చేసిన వాఁడఁగాను. నాకుఁగా వేఱొకరు మీతోఁ బంతం బాడి యొడంబఱ చినవారు లేరు. మీయంతనే మీరు దయం దలఁచి నన్నుం బావ నంబు చేసితిరి. మీరు నిర్హేతుక దయానిధు లౌట యిందులోనే విశదం బాయె ; శ్రీ వేంకటేశ్వరా !

74

సోమకాసురభంజనా ! భూమిమీఁద సస్యంబులు పండి నానాధాన్యంబులుఁ గొండలు కోట్లునై, కుప్పలుపడుచున్నవి. సస్యంబులకు బీజంబు లొక్కటియును ఫలంబు లధికంబులునై యున్నవి. ఇంత సామర్థ్యం బాబీజముల కెక్కడిది? మీమహిమకెకాక. మీరు గలుగుట కిది లోక దృష్టాంతంబు. మిమ్ము నితరు లెఱుంగరానియట్లు వీపు గానరా దాఁగెదరు. మీ రెటువలె నుండినను, వేదశాస్త్రంబులు మిమ్ముఁ జాటి చెప్ప కేల మానెడిని ? మహాత్ములై నవారు మిమ్ము నెఱింగి కొలువ కేల మానెదరు? మీకరుణ యిందఱమీఁదఁ బాఱ కెట్లుండెడిని ? మీదివ్య తేజః ప్రకాశంబు లెటువలె మూసి పెట్టవచ్చు? చాలుం జాలు నింక మీ వినోదంబులు బయలుపడెను. విభాండకునికిఁ బ్రత్యక్షంబైనయట్లు, ముచికుందునికిఁ బ్రత్యక్షంబై నయట్లు, ఉదంకునకుఁ బ్రత్యక్షంబై నట్లు నాకు మీరు ప్రత్యక్షంబుగండు శ్రీ వేంకటేశ్వరా !

75

అయోధ్యాపురాధీశ్వరా ! యేరీతి మసస్సు పట్టుదునో యే చందంబున మెప్పింతునో యేరీతిఁ గృప నామీఁదం బాఱునో యెటువలె నా కభిముఖము చేసికొందునో యేక్రమంబున మీకుఁ జనవరినై బ్రదుకు దునో యని మానసంబునం గోరుచుందును. నీవు నాయంతరంగంబులో జేరువనే యున్నాఁడవు. బ్రహ్మాది దేవతలకు దుర్లభుండవై న నీవు నా కెట్లు సులభుండ వయ్యేవంచుఁ జాతక పక్షులు మేఘంబులలోని జలంబుల కాసపడినయట్లు, ఆకాశంబున నున్న సూర్యునితో గమలంబులు చుట్టఱి కంబులు చేసినట్లు, చంద్రోదయంబునకు సముద్రంబు పొంగినట్లు, వెన్నె లకుఁ జంద్రకాంతంబులు గరఁగినట్లు నేను మీదర్శనంబునకు వీక్షింపుచున్నాఁడ. అయితే నేమి కొఱంత ? ఊరకున్న కీటంబుఁ దెచ్చి తుమ్మెద తనుఁ జేయుచున్నది. ఈ భ్రమరకీటన్యాయంబు దక్కింపనింక దేవరచి త్తము, నాభాగ్యము; శ్రీ వేంకటేశ్వరా !

76

వాసుదేవా ! దేవకీనందనా ! గోపాలమూర్తీ! లక్ష్మి మనోహరా ! భూకాంతాప్రియా ! గోపికావల్లభా! రుక్మిణీ ప్రాణనాయకా ! సత్యభామామనోహరా ! జాంబవతీసుముఖా ! కాళిందీసరససల్లాపా ! మిత్రవిందాభోగాలోకైకరతా ! భద్రాకుచకుంభవిహారా ! నీ రాసగ్రహాది సరససత్కథా ప్రసంగంబులు భాగవత పురాణంబులు. ఈ కథలు విన్న వారికిఁ బుణ్యంబు లనంతంబులై పరలోక సాధనంబు లగునటే ! యివి యెటువంటి విచిత్రంబులు ! నీ కౌతుక క్రీడలు మోక్ష సాధనంబులట ! శ్రీ వేంకటేశ్వరా !

77

ధ్రువవరదా ! నాకు నెటువలెఁ బ్రత్యక్షం బయ్యెదవో? విభుని, రాకకుం గాచుకొన్న విరహిణిచందంబున మీ రాకకు నెదురు చూచుచున్న వాఁడ. చన్నుఁబాలకు దేవుఱు స్తనంధయుని బోలి మీ భుక్త శేషంబు వెదకుచున్నవాఁడ. పొలముననుండి మేసివచ్చు ధేనువు రాకకుఁ గ్రేపుచందంబున మీ దేవుల కటాక్షంబునకు నేఁకారుచున్న వాఁడ, హంసతూలికా తల్పంబుమీఁద శయనించు రాజురీతి మీ పాదంబులకు సాష్టాంగము సేయం గాచుకొన్న వాఁడ; నివి నాగుణంబులు. అపేక్షించిన వారి నుపేక్షింపరాదని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. అది యట్లుండనిమ్ము. ఏలిక మన్నించుకొలఁదినే కానీ బంటునకుం గొనరఁగా నడుగరాదు, నీవు నా హృదయంబున నెప్పుడును నేమఱకుమా! అన్నియు సమకూఱెడు ; శ్రీ వేంకటేశ్వరా ! | 

78

హలాయుధధరా ! మన్మథుం డనియెడు నింద్రజాల విద్యలవాఁడు సుందర స్త్రీ, పురుషులచేత నింద్రజాలవిద్యల నాడింపుచున్న వాఁడు. అన్యోన్యావలోకంబుల కమల కల్హార పుష్పంబులు గురియింపుచున్నవాడు. మోహసముద్రముల నాకర్షించి బట్టబయల యీఁదింపు చున్నాఁడు. తుఱుమునఁ జీకట్లును ముఖంబునఁ జంద్రోదయంబును గాత్రంబున మొయిలులేనివానలును పరస్పర విహారంబుల నగ్నిస్తంభనలును రతిబంధంబుల సిద్ధవిద్యలునుం జూపుచున్నవాఁడు. ఈ యాటలకు లోనై సమ్ముఖంబులనున్న జీవులము మిమ్ము నెఱుంగ వెఱంగందు చున్న వారము ; గాని, నీ వీ మాయలకు లోనుగాక చిఱునవ్వుతో వీక్షింపుచున్నవాఁడవు. ఆతని కీవిద్యలు నేర్పిన గురుండవు నీవె కాఁబోలుదువు. నీకు వినోదంబైన నాయెఁగాని మమ్ము బ్రమియింపకువే ; శ్రీ వేంకటేశ్వరా !

79

ఖరదూషణవైరీ ! నీవు కల్పించిన 'వేదో క్తధర్మంబు లించుకంత దప్పక నడచెనా పాపంబులు చెందవు. అటమీఁద పరకాంతలు పరధనంబులు వేడుక పుట్టించుచు ముందఱఁ బొదలంగా జీవులము చంచలచిత్తులము గనుక నా పాపంబులం దగిలి చేయక మానలేము. చేసినకర్మంబులు బలవంతంబులు. అనుభవింపక తీఱదు. దాన మాకు సౌఖ్యంబు గాదు. మేము గావించు నేరములు మామీఁద నుండంగాను మీకు నేమి విన్నపంబు చేసెదము? మీ యాశ్రయ మనియెడి వజ్రపంజర మున్నది. మీ నామస్మరణ మనియెడి ఖడ్గమున్నది. మీపై భక్తి యనియెడి కవచమున్నది. మీకృప యనియెడి సహాయంబున్నది. నా యాచార్యులచేత సకల మీదురితములను గండలుగాఁ గొని తునియలు చేసి పాఱవేయించెదవో కాక నీవే మాపై దయదలంచెదవో; శ్రీ వేంకటేశ్వరా ! 

80

చాణూరమర్దనా ! మిమ్ముం బేర్కోని పిలిచి యావాహనముచేసి మా యింటిలోపలఁ బీటపైఁ బెట్టి పూజించుచున్నవాఁడను. సముద్రుని కర్ఘ్య పాద్యా చమనీయంబుల నిచ్చినట్లు మేరుపర్వతంబునకు భూషణంబులు పెట్టినట్లు మలయాచలంబునకు గంధం బొసంగినట్లు వసంతునికి బుష్పంబులు సమర్పించినట్లు కస్తూరి మృగంబునకు ధూపం బిచ్చినట్లు సూర్యునికి దీపారాధన చేసినట్లు అమృత ప్రదుండవైన నీకు నై వేద్యం బిచ్చినట్లు నీరీతి మిమ్ము నలంకరించి యర్చింపుచున్నవాఁడ. నా చేతలకు మీ రేమని నవ్వుచున్నారో లజ్జింపక యుపచరింపుచున్నాఁడను. అయినం గానిమ్ము. తొల్లి, మీరు కృష్ణావతారంబై యుండెడు వేళ మిథిలానగరంబున శ్రుతదేవుం డనియెడి బ్రాహ్మణుండు మి మ్మింటికిఁ దోడ్కొనిపోయి పూజింపఁడె? మత్స్యావతారంబైన నాడు సత్యవ్రతుండను రాజు అర్ఘ్యము సమర్పించి మీరూపు దర్శింపఁడె? కుబ్జ మీకు గంధంబు లొసంగి సౌందర్యంబు వొందదా? మాలాకారుండు పువ్వులదండ లొసంగి మీచే మన్ననలు చేకొనఁడె? విదురుండు విందు వెట్టి వెలయఁడె? ఇవి చూచి మాకుఁ గొంచింపం బనిలేదు. నీవు భక్తసులభుండవు, మే మేపాటి యారాధించినం జేకొందువు. శ్రీ వేంకటేశ్వరా !

81

దేవచూడామణీ ! నీ పట్టినవి శంఖచక్రంబులు, ఎక్కినది గరుడవాహనము, తాల్చినవి చతుర్భుజంబులు, నీవు కావించిన కృత్యంబులు కంస కాళియ ముర నరకాసుర మర్ధనంబులు. ఇటువంటి నీవు నీలమేఘశ్యామవర్ణంబుతో విష్ణుస్వరూపుండవై నటియింపుచుండఁగాను నిన్నుఁజూచి దేవకీ వసుదేవులు నెటువలె బ్రమిసిరి? తపంబు సేయు చుండెడి వ్యాసవాల్మీకాది మునీంద్రులు మిమ్ముం జిక్కించుకొని మోక్షం బడుగ నేరీతి నేమఱిరి? శాస్త్రంబులు చదువుచుఁ బరబ్రహ్మం బును వెదకెడి బ్రాహ్మణోత్తములైన విద్వాంసుల వివేకంబు లెందువోయె? బ్రహ్మేంద్రాది దేవతలు మిమ్ము సేవించి మీ సాయుజ్యంబుఁబొందరైరి. వారి భాగ్యంబు లెక్కడనుండె? అది యట్లుండనిమ్ము; అనాది దేవుండనై యిప్పు డిందఱ హృదయంబులలో నున్నాఁడవట ! నిన్ను భావించి మఱచియున్నారము ; శ్రీ వేంకటేశ్వరా !

82

వరాహావతారా ! నిన్ను వెదకివెదకి వేసారితిని. నీవు పుట్టించిన బ్రహ్మండంబునకు నమస్కారంబు. అట్టి బ్రహ్మాండమునకు నాధారంబయిన నీ రోమకూపంబునకు దండంబు. అజాండములోని నీ విశ్వరూపంబునకు సాష్టాంగంబు. నీ తిరుపతులకు వందనంబు. చరాచరంబైన నీసృష్టికి నభివాదనంబు. నీ రూపంబు లయిన విగ్రహంబులకు మోడ్పుగేలు. 'నీ యంతర్యామిత్వంబునకు జోహారు. నీ వున్న శేషాచలంబునకు వందనంబులు సేయుచున్నవాఁడ. అందున్న నీ మూర్తికి శరణు. నన్ను నీ కరుణాదృష్టి నవలోకింపుము. నా యజ్ఞానంబు చెఱుపుము. నీ పాదంబులపై భక్తి నా కెల్లపుడుం బాయకుండఁ జేయుము. శ్రీ వేంకటేశ్వరా!

83

అమితకల్యాణగుణాకరా ! జాతికులశీలవిత్తంబులచేత నాకు గర్వంబు రేపుచున్నది నాచిత్తంబు ; దీనికి బుద్ది చెప్పుము, నాకు వశంబుగాదు. లోకంబులో వర్తమానంబు విచారించిచూచిన దాసీజనంబులకుం జెల్లునే యహంకారంబు; షండునకు వచ్చునే కామోద్రేకంబు; కార్యాతురునకుఁ గూడునే లోభంబు; దీనున గున్న దే బలిమి; ఆఁకొన్న వాని కుండునే మదంబు; అశక్తునకు వెలయునే మత్సరంబు; ఇటువంటి వారికెల్లను వారివారికి నాయాగుణంబులు సహజంబులు చేసి యిప్పించితివి; ఇవియెల్ల నసంభవబ్రహ్మచర్యంబులు. అందులకేమి ? నాకు నీ దర్శనంబు చూపి నా స్వతంత్రంబున నాతపో రాజ్యం బీడేర్పుము. నీ వెట్లు చేసిన నట్లౌను, నీవు నాలోపల నున్నాఁడవు. శ్రీ వేంకటేశ్వరా!

84

అధోక్షజా ! ఎవ్వనిరోమంబున నజాండకోట్లు వొడమె; నే మూర్తి నాభికమలంబున బ్రహ్మ జనించె; నే మహాదేవుని పేర " శ్రీమహా - విష్ణోరాజ్ఞయా ” యని మహాసంకల్పంబు చెల్లుచున్నది; ఏవస్తువుఁ బురాణపురుషుం డని చెప్పెదరు; ఏబలవంతుని దానవనై రి యండ్రు; ఏఘనుండు సముద్రంబుద్రచ్చి యమరుల కమృతంబు పంచి పెట్టె; నేపురుషునకు ప్రహ్లాద నారద వసిష్ఠాదులు దాసులు; ఏ ఘనునకు సూర్యచంద్రులు కన్నులు; లక్ష్మీపతి యెవ్వండు ; సర్వరక్షకుం డెవ్వండు; యజ్ఞ కర్త యెవ్వఁడు; యజ్ఞభోక్త యెవ్వండు, మోక్షం బియ్య గర్తయెవ్వండు; అతండవే నీవు. అట్టి నీకు ననంతనమస్కారములు సేసెద; చిత్తావధారు. శ్రీ వేంకటేశ్వరా !

85

యోగేశ్వరా ! పరమజ్ఞానులైనవారికిఁ గామ క్రోధ లోభ మోహమద మాత్సర్యంబు లడంగవలయు. అవి యెటువలె నుడుగ వచ్చు? ఎండ నుండిన యతండు నీడకుం బోవఁదలంచిన నదియె కోరిక యయ్యెడిని ; ఈగ తనమీఁద వ్రాలినఁ జోఁపుకోఁగణంగిన నదియే క్రోధం బయ్యెడిని. తన మంత్ర మొరులకుఁ జెప్పకుండిన నదియె లోభం బయ్యెడిని. పరులు దండంబు పెట్టిన వేళ దీవించిన నదియెమోహం బయ్యెడిని; భిక్షాన్నంబు భుజియించి తృప్తి బొందిన నదియె మదం బయ్యెడిని ; శిఖలోపలఁ బేలు దిరుగం గ్రోఁకికొనిన నదియె మాత్సర్యం బయ్యెడిని. ఈ ధర్మంబు లెల్లఁ దప్పకుండ నడపెద నని యెంచిచూచిన నావలన నన్నియుం దప్పులే; సర్వాపరాధంబులుం జేసి నీమఱుగుఁ జొచ్చితి నన్నుం గావవే; శ్రీ వేంకటేశ్వరా ! 

86

సీతాపతీ ! మీ యాకారంబు కనులఁజూడ నెవ్వరి వశము ? మీ భక్తవాత్సల్యాది గుణంబులు దలంచుకొని కొంతదడవు జయ వెట్టి మీ కల్పించిన జగత్తు చూచి కొంతదడ వాశ్చర్యంబు నొంది నర్వమైనవారికి వరంబు లొసంగెడి మీ యుదారత్వంబు కొంతదడవు చింతించి మెచ్చి యహల్యా ద్రౌపదీ ప్రహ్లాదాదులకుఁ బ్రసన్ను లరైన మీ మహిమ కొంతదడవు దలపోసి పొగడి 'రావణకుంభకర్ల ముఖ్య దానవులఁ జెండాడిన మీ ప్రతాపంబు కొంతదడవు దలంచి విభీషణ హనుమత్ప్రభృతుల మన్నించిన మీకీ ర్తి కొంతదడవు పెద్దలచే విని మీకుఁ జేతులెత్తి మ్రొక్కి పరబ్రహ్మంబనై విలసిల్లు మీ ప్రభావంబు కొంతదడవు దలపోసి కొనియాడఁగలవారము. ఈరీతిం గాలక్షేపంబు చేయఁగా మీరు మాకుఁ బ్రత్యక్షంబై న ట్లుంటిరి. శ్రీ వేంకటేశ్వరా !

87

సర్వేశ్వరా ! అవధారు ; జగంబు నీ నాటకశాల; నేనెత్తిన తొలుజన్మంబులు నీముందర నాడెడి బహురూపంబులు; దారసుత బంధు జనంబులు మేళగాండ్రు; నిన్ను నుతించిన 'వేదశాస్త్ర పురాణంబులు తూర్యత్రయంబు. మాపాదప్రచారంబులు నాట్యంబు సేయు చేతలు ; ఆడెడిమాటలు క్రియాభాషాంగంబులు; భోగవస్తువులు మీరు మెచ్చి యిచ్చిన యీవులు ; ఈరీతి నెంతగాలంబు మీకు వేడుక యంతగాలంబు నాడెదము. మీ కొలువు నర్తకు లైనవారము మీకు వినోదము చేసికొని బ్రతుకవలయుఁగాని నెమ్మది మోక్షంబున నుండెద మనుట యే సంగతి ? మీర దయదలంచి కృపచేసిన నపు డయ్యెడుఁగాక, యెఱుక గల యేలికఁ గొల్చినవారికి నడుగ నేదిపని, ఇంక నన్నిట నన్నిట మన్నింపవే; శ్రీ వేంకటేశ్వరా !

88

మదనజనకా ! మిమ్ము నే ధ్యానంబు సేయునెడ మీ యవయవ సౌందర్యంబు దలంప నేరకుండినను మీకు శతకోటి జన్మాధారమైన చక్కదనంబు దాఁచరాదు. మీ తిరుమేని కది సహజంబు. మీ పరాక్రమంబు నేఁ బొగడ నేరకుండినను శంఖచక్రాద్యాయుధంబులు భుజంబుల ధరియింపవలయుఁ గాని మానరాదు. మిమ్ము నే శృంగారింప నేరకుండినను మీ కిరీట కుండల పీతాంబరాభరణంబులు లోకాలంకారంబులు గాకపోవు. శ్రీదేవియు భూదేవియు మీ యుభయపార్శ్వంబుల నుండ నేను మీ కైంకర్యంబు సేయ సమర్ధుండఁ గాకుండినను అనంతగరుడ విష్వక్సేనాది పరివారంబులు మీ కొలువు సేయుదురు. ఇంక నప్రయత్నంబున మీ పేరు నుడివిన మీరు చనుదెంతురు. మీ వెంట నన్నియుఁ జనుదెంచును. మాకు బహువిచారంబుల నలయ నేల ? మిమ్ముఁ బేరుకొనుటే యన్నింటికి మూలము. నిత్యానుసంధానం బిందులనే కలిగె. శ్రీ వేంకటేశ్వరా !

89

ఈశ్వరేశ్వరా ! చదువం జూచిన సంశయంబులే పుంఖానుపుంఖంబులై తోఁచును. చదువ కూరకుండిన జ్ఞానంబు వొడమదు. మఱి నిన్నుఁ బలుదిక్కుల వెదకెదమని కన్నులం దెఱచిచూచిన లోకవ్యాపారంబులు భ్రమలం బెట్టెడిని. ఱెప్పలు మూసికొన్నను బలుచింతలు ముంచుకొనును. పుణ్యంబులు చేసియైన నిన్నుం గనియెద మనిన నవి బంధకంబయ్యెడిని. చేయకుండిన సర్వనా స్తికుండ నయ్యెద ; నీ యర్థంబొరులతోడ నే యోజించి చూచిన బహుకుతర్కములు వొదలెడి ; మానిన సర్వసిద్దాంతంబులు దెగవు. జగంబు బహుసందేహకారణంబు. తత్వం బేగతి నిశ్చయింపవచ్చు? కావున నేమి సేయంగా నేమి యగునో నీదాసులు వోయిన త్రోవ నడచి వారల యభిమానమునంబొదలి నీకు శర ణంటిని; నీవే వహించుకొని నన్నుం గాచెదవు. శ్రీవేంకటేశ్వరా! 

90

శేషశయనా ! నే నీమీఁద నేవలన నీ చి త్తంబు వెట్టెద ? నా యోగంబులు కాంతా సంయోగంబులు; నా నియమంబులు రేపుమాపు నన్న పానంబులు గొనుటలు ; నానిత్యకర్మంబులు సంసారకృత్యంబులు ; నా వ్రతంబులు రాత్రి నిద్రించుటలు; నా ధర్మంబులు శరీరభోగంబులు ; నా పదవులు బాల్య కౌమార యౌవనావస్థలు ; నా ఘటనలు పుణ్య పాపంబులు ; నా వేదపాఠంబు లన్యోన్యధిక్కారంబులు; నా పంచ యజ్ఞంబులు పంచేంద్రియ వ్యాపారంబులు; ఇవి మా వర్తనలు ; ని న్నెంచి చూచిన సకలలోకోన్నతుండవు; నిన్నుఁ బరికించి చూచిన నంతరమహాంతరంబుల నాలోనుండి రక్షించుచున్నాఁడవు; నీ గుణంబు లరుదయ్యెడి ; శ్రీ వేంకటేశ్వరా !

91

నరహరీ ! మొదలనే నోరు మాటలపుట్ట ; మౌనం బెట్లు సిద్ధించు ?వీనులు గిరిగుహలవంటివి. ఎవ్వరు మాటలాడినఁ బ్రతిధ్వనులవలె సాదింపుచుండు; అవి వినకుండ నెట్లుండవచ్చు. కన్నులు రూపంబు లకు నద్దంబువలె నున్నవి. ఇందు సకలంబును ప్రతిఫలించుచుండఁగాఁ జూడకుండ నెట్లుండవచ్చు ?. నీ దేహంబు నాఆకలి దినదినము పీడింపఁగాఁ జవులుగొన కెట్లుండవచ్చు? ముక్కున నొక్కొక్కదినము పదియొక్క వేయున్నా ఱునూఱుల యుచ్చ్వా సములు గలుగఁగా, వాసనలు గ్రోల కెట్లుండవచ్చు? నన్నియు నే ననుభవించిన నేమి నీవు రక్షకు డవై యుండఁగా; నేను నీకు గుఱి; నీ పాదంబులు నాకుగుఱి ; నన్ను నీ వెల్ల విధంబుల రక్షింతువుగాక ; శ్రీ వేంకటేశ్వరా !

92

ద్వారకావాసా! దేవుండవైన: నీకు. నాచర్మ మాంసాస్థిమయంబులైన కరంబుల మ్రొక్కుచున్న వాఁడను. పరమపావనం బైన నీ తిరు

మంత్రము నాయెంగిలినోర నుడువుచున్నాఁడను. గోపికలు నీవు రహస్యంబున వినోదంబులు సలిపిన సుద్దులు నావీనులను వినంగడం గెదను. ఏకాంతంబున లక్ష్మీ సమేతుండవైన నిన్ను వేళయెఱుంగక సేవింతును. కోమలంబైన నీ తిరుమేను నాకఱకుం జూపులఁజూచెదను. నీచిత్తంబు దెలియక యావాహనంబు చేసి పూజించెద; నిది యపచారమో యుపచారమో యెఱుంగ; నేమిచేసినను నీదాసులకు నేర మెంచ నిది నీగుణము. నీవు కలవని వెఱవకుండ మందెమేలమున నపరాధములు చేసెద నోర్చుకొనుము; శ్రీ వేంక టేశ్వరా !

93

విట్టలేశ్వరా ! సాహసం బెట్టిదో కాని నిన్ను నడుగ రాని ఫలంబు లడుగఁగోరెడునామనంబు, జిహ్వ నాకుందగని పదార్థంబులు నిన్న డుగ నిశ్చయింపుచున్నది. నాగుణం బభేద్యంబైన నీ మనస్సుశోధింప గడంగెడు. నాబుద్ది తెలియరాని రహస్యోద్యోగంబులు వెదకుచున్నది. 'నాహృదయంబు నందరాని పదంబులకు నాయ త్తపడుచున్నది. నా వేడుక. నావలన నీకు నయ్యెడు. భోగంబు విలోకించును. నన్ను నీవు సంత తంబునుం బాయక నానాభోగంబు లిచ్చి యుపకారంబు లెంచుకొన జేసిన మే లెఱుంగనివాఁడ నపరాధిని; ఏమనివిన్నపంబు చేసెదను ? లోక జననియైన నీ దేవిం జూచియైనను కరుణానిధివైన నిన్నుఁ జూచుకొనియై నను నన్నుం గావవే; శ్రీవేంకటేశ్వరా ! జ్ఞై

94

త్రివిక్రమా ! మీరు సాలగ్రామ చక్రపాణి దేవపూజా శ్వత్ధతులసీ సేవాగో బ్రాహ్మణవందన తీర్థస్నాన వేదపాఠ తపోయజ్ఞై కాదశీ వ్రత దాన సంకీర్తనాదుల చేతం గృతార్థులు గండని జనులకుఁ బుణ్యంబుల చూఱ లిచ్చితిరి. ఎదుటఁ గానవచ్చిన మీమూర్తుల నాశ్రయింప నేరక కొందఱు శ్రీ వేంకటేశ్వర వచనములు

కానరాని పరమపదంబున నిన్నుఁ జూడఁగోరెదరు. అది మా కెంత దుర్లభంబు ? ప్రత్యక్షం బైన మిమ్ముఁ గొలిచినఁ బరోక్షంబు మీరే యిచ్చెదరుగాక వేగిరింప నేటికి మీ రుభయవిభూతి నాయకులరు. మిమ్ము నింతశోధింప సమర్థుండనా ? మీదాస్యమే నేఁగోరం గలవాడ గాక; శ్రీ వేంక టేశ్వరా ! "

95

నరసింహా ! నేను భూలోకంబున నెనుబదినాలుగులక్షల జంతువుల గర్భం బులందు వెడలిననేమి ? నాకు నలయిక లేదు. నీవు నా కంతరా త్మవై వెను వెంటఁ దిరుగంగా నీ శ్రీపాదంబు లెంత బడ లేనోయని విచారిం చెద. అదియునుగాక మున్ను స్వర్గ నరకాదిలోకంబుల సుఖదుఃఖంబు లనుభవించెడి వేళలో నీవు నాలోనుండి నామీఁద దయ 'నేమనుచుం టివో యనీ తలంచెద. నే నుపవాసములుండి శీతోష్ణంబుల సహించి తపంబులు సేయుతఱిని నీకు బడలిక సోఁకదుగదా యని యూహించెద. నీకుఁ దిరువారాధన సేయుచో నాహ్వానంబు సేసి యారగింపుసేయు సమ యంబున నేమి చవిగాకుండునో యావేళ యెటువలె నుండునో యెఱుం గక కొంకెద. కొండంతవాని నిన్ను సూక్ష్మంబుగా జేసికొని యాత్మ లోఁ దలంపఁగా నీకుఁ గక్క సంబయ్యెడినో యని వెఱుచెద ; నా సర్వా పరాధంబులు క్షమింపవే ; శ్రీ వేంక టేశ్వరా !

96

భీమవిక్రమా ! జ్ఞానంబనియెడి శృంగారంపుఁ దోఁటలోఁ గామక్రో ధంబు లనియెడి ' వరాహంబులు రెండు గుద్దలింపుచున్నవి. శమ దమంబు లనియెడి యోదంబులు ద్రవ్వి , వానిం బడఁద్రోచెద నంటినా నా పూర్వజన్మ ప్రతి బంధంబు లనియెడి భల్లూకంబులు రెండు నందు లోనే ఘోషించుచున్నవి. నీమీది యాశాపాశంబు లనియెడు త్రాళ్ళు దీసి వానిం గట్టిత్రోయుము. తొల్లి నీవు మాయామృగంబు నేసిన వేఁటకాఁడవు గనుక విన్నవించితి. శ్రీ వేంకటేశ్వరా ! . ________________

శ్రీ వేంక టేశ్వర వచనములు

97

త్రిదశవంద్యా ! ఈప్రాణు లనేక కాలంబులవారు బహు కల్పంబులంజేసిన బహువిధకర్మంబు లసంఖ్యంబులు గలవు. అనుభవింపక శక్యముగాదు. వంశంబులం దొక్కరుండు శ్రీవైష్ణవుం డై తేను కుల కోట్లెల్ల ను గృతార్థు లగుదు రని పురాణంబులు సెప్పుచున్నవి. ఒక్క సారి మిమ్ము మనస్సునఁ దలంచిన దురవస్థలై న యాపదలు గడచునట ! ఫలపుష్పంబులు మీ పాదంబుల పై వేసిన నానాపుణ్యంబులు చేకూడు నట ! మీ మహిమ లతివిచిత్రంబులు; చెఱువునీళ్లు చల్లి ఫలము గొన్నట్లు ధేనువులు తృణములమేసి దుగ్ధములు పిదుకునట్లు బిడ్డఁడు తల్లి దండ్రులతో ముద్దులంగురిసి సంరక్షణ సేయించుకొన్నట్లు పెద్దలకుఁ జేతు లెత్తి యొక్క దీవనగొన్నట్లు నీరీతి సులభోపాయంబుల మిమ్ముమెప్పించుకొని మీచేమెప్పులు పుచ్చుకొనియెదము. మాకుం బ్రసన్నుం డవు గమ్ము; శ్రీ వేంకటేశ్వరా !

98

వాసుదేవా ! నీవు సముద్రంబు పై ఁ దేరు వఱపి కులాచలంబులు క్రుంగఁద్రోక్కి చక్రవాళ పర్వతంబు దాఁటి చీకటి నఱకి దివ్య తేజంబు చొచ్చి పోయి బ్రాహ్మణుని కొడుకును దెచ్చితివట ! తలఁచినప్పుడే గరుడవాహనంబును శంఖచక్రాద్యాయుధంబులును రప్పించి యనేక భుజంబులతో వెలుఁగొందుదువట ! సూర్యునికిఁ జక్రంబు మఱుంగు వెట్టి సైంధవుని సంహరింపించితివట!! గోవర్ధనోద్దారణంబును ద్వారకా నిర్మాణంబును. మొదలై న యతిమానుషకృత్యంబు లెన్ని వలసినం గలవు. నీ మహిమలు చెప్పెద నన నవాజ్మనసగోచరంబు లవి. చాలదే నవనీత చోరత్వంబును, వత్సబాలహరణంబును, గోవత్సపరిపాలనంబును, దామోరూలూఖల బంధనంబును. కుబ్జా ప్రాణ నాయకత్వంబును ; ఇవియే కీర్తులు నెగడించు ; శ్రీ వేంకటేశ్వరా !

99

సీతావల్లభా ! నా కవితాకన్యకు నీవు వరుండవు. డైనమానుషంబులు గణపొంతనములు. నా జిహ్వయే పెండ్లి పీఁట. నా మనస్సే తెర. నా సంతోషకళలే బాసికంబులు, నా భ క్తియే కంకణంబు. అక్షరంబులే తలంబ్రాలు. శబ్దంబు లే వాద్యఘోషణంబులు. స్మృతిస్వరంబు లే పేరం టాండ్రపాటలు. చూపులే మంగళ హారతులు. నా వాక్యంబు లే పువ్వు దండలు. నీ సహస్రనామములే బంధువులు. నీ యాత్మగుణంబు లే శోభన ద్రవ్యంబులుగాఁ గై కొని యీరీతి వివాహం బై తివి. ఇంక నా కర్మబంధంబు లూడెఁగదే నీ విట్టు పాణిగ్రహణంబు చేసికొంటివిఁక నీ దేవులు నీవును చిరంజీవులై యుండి సంగీత సాహిత్య నానాలంకారాది పుత్ర పౌత్రాభివృద్ధి వెలయుచు నీ దాసుల రక్షింపవే ; శ్రీ వేంకటేశ్వరా !

100

శ్రీపురుషోత్తమా ! కరిరాజుం గాచితివి. కొలువులోపల ద్రౌపది మానంబు నిల్పితివి. ప్రహ్లాదునిమాట లాలించితివి. శరణుసొచ్చిన విభీషణుని రక్షించితివి. రావణకుంభకర్ణాదుల వధియించి లంక నేలిం చితివి. పాతాళంబు బలికి నొసగితివి. ధ్రువునికి ధ్రువంబుగాఁ బట్టంబు గృపచేసితివి. నిన్నెవ్వ 'రెఱింగి నుతింతురు వారికి నీ పదవు లిచ్చి రక్షింతువు. శ్రీ వేంకటేశ్వరా !

101

కరుణాకటాక్షా ! ఎవ్వరెవ్వరి జన్మంబులు వారివారికి హితవులై తోచు చుండం జేసితివి. దేహత్యాగంబులు నిర్బంధముల వెడలిన తెఱంగున మనసులను సమ్మతింపఁ జేసితివి. పాపమూలం బయిన క్రీడనసమయం బులు నన్న పానాదిరుచులు స్త్రీ భోగంబులు సుఖంబులై తోచుచుండం 'జేసితివి. కర్మానుభవంబులై న పరలోక సౌఖ్యంబులు, తదనుగుణంబు లైన దివ్యశరీరంబులు నిచ్చుచున్నాఁడవు. ఈరీతి సర్వజంతుల కవ్యా జాంతరసుఖంబులు గలుగఁగా మాకు నెక్కడ నున్న నేమి ? శ్రీ వేంక బేశ్వరా !

102

వేణునాదప్రియా !. నేను బంట నై నందుకు నీ కేమిగుఱి ? నా నుతుల వల్ల నీ కేమిలాభంబు గల్గె ? మఱియు నే మ్రొక్కంగా నై నఫలము నీ కేమిటికి ? నిన్నుఁగూర్చి యుపవాసతపంబులు చేయఁగా నీవు గట్టు కొనియెడిది యెంత ? మా నియమవ్రతంబుల చేత జన్మంబులు మఱియును 'మొలపించుచున్నాఁడవు, జీవునికి జన్మ మరణంబులు నిర్బంధం బులై తోచవు. ఇన్నిటికి నీవు కలుగంగా జంతువులకు సుఖదుఃఖంబు లనుభవింప సులభం బాయెను. నీవు దయానిధివి. నిన్నుం గొల్చిన వారికి నీవు కామధేను కల్పవృక్ష చింతామణులై :ఫలియింపం గంటిమి. శ్రీ వేంక టేశ్వరా !

103

యజ్ఞరక్షకా ! పాపంబు లూరకే యజ్ఞానులమై చేసితిమిగాక మీఁదదాఁచి పెట్టితిమా? పుణ్యంబు లని కొన్ని వినోదించి నీ కృపం జేయంగా ననుభవించెదముగాక మేము ఫలంబులు మొలవం బెట్టితిమా? యీ రెండు మాలోనుండి చేయించంగాఁ జేసిన సేఁతలు, అది మీ రెఱింగి యుండియును నిష్ఠురము గట్టుకొనక దాక్షిణ్యంబున కర్మంబు లనుచుమొదళ్లు కుదుళ్లు గదలించి మాయలు చేసెదరు. మీ దాసులైన వారు మిమ్ముఁ దలఁచిన మాత్రంబున దోషంబు లపహరించెదరు. మీ రెట్లు చేసిన నట్లౌను; లోకంబున 'రాజానుమతో ధర్మ' యనియండ్రు; మీ యనుగ్రహంబు మాకు మంచిది రక్షింపవే; శ్రీ వేంక టేశ్వరా ! .

104

కాళింగమర్దనా ! జ్ఞానంబును నమ్మి కర్మంబులు విడువంగా నీ యాజ్ఞ నుల్లంఘించినట్లగునో యని మనంబున శంక పుట్టెడిని. కాక విహిత కర్మంబులు చేసి చేసిన ఫలంబు నీకు సమర్పించెద నన నీ వవా ప్తసకల కాముండవు. ఇది నీ కేమి ఖ్యాతిగా నోసంగెదనని సిగ్గయ్యెడిని. లోక దూషణంబులకు లొంగి కర్మంబులు సేయఁగా బంధకంబు లయ్యెడినో యని చింత పుట్టెడిని, ఇందుల కొకమాట కర్మంబులు జ్ఞానసాధనంబు లంటివి. 'వేఱొకమాట జ్ఞాన మెక్కు డని యానతిచ్చితివి. లోకులకు. రెండుమాటలు కర్మకాండ, జ్ఞానకాండలవలె నిశ్చయించితివి గానీ, యొకటి నిశ్చయింపవై తివి. ఇందుకు వివేకియైన పురుషుఁడు దన కెంత మాత్రమునకు నధికారము కలిగె నటువలెం జేసికొనియెడిని. నీ వలనం దప్పులేదు ; శ్రీ వేంకటేశ్వరా !

105

శ్రీధరా ! దేహధారియైనవాఁడు దివంబున సంసారమత్తుండే రమి యించి రాత్రివేళ పగలింటియాందోళనంబు కలలోపలం గని వెఱఁగునొంది. సంసారం బిట్టిది గదా యని, వైరాగ్యనిష్టుండనై యుండెద నని యొక పుణ్య క్షేత్రంబున వసియించి యచ్చట నొకానొక వేళఁ దొల్లి పుత్రమిత్రకళత్రాదులతో వినోదించిన చందంబు దలంచి యామనోరథం బుల నోలలాడి మనస్సు కరఁగఁజొక్కి తెలిసి చూచి యెవ్వరింగానక బట్ట బయలు బ్రమిసితిం గదా యని నిర్వేదనం బొరలుచుండు. నటుగావున గట్టిగా పట్టరాని దీమసం బిట్టి దెకదా! ఉల్లి వాసన యంటిన పదార్థంబునఁ గస్తూరిపరిమళం బంటనేర్చునే? ప్రాకృతిక వాసన యందినవాఁడుమోక్షసుఖం బెట్లు వెదకు ? .మీ మాయాప్రపంచం బిట్టిది గెలువరాదు. మీరే దయఁజూడవలయు ; శ్రీ వేంక టేశ్వరా !

106

అనిరుద్దా ! నిత్యంబును జీవులు నిద్రాసమయంబున నంతర్యామివై సంతుష్టుఁడవై యున్న నీయందుఁ బ్రవేశించి యందే. నీవు సృష్టింపగాఁ గలలుగని మేలుకొని యింద్రియ ద్వారంబుల లోకవ్యాపారంబులు చూచిబ్రమయుదురుగాని నీయందు నుండియు నిన్నెఱుంగరు. గర్భంబులలో నున్న శిశువులు తల్లుల రూ పెఱుంగనియట్లు నిన్నుఁ దెలియ నేరక చదు వులలో వెదకుదురు, నీ వున్న నెలవు తమ యంతఃకరణం బని యెఱుం గరు. నే మెటువలె నుండిన నేమి ? నీవు. పూసలలో దారమై యున్నాఁ డవు. నీ సన్ని ధానంబున నున్న వారిని నీవే కరుణింపవలయు; శ్రీ వేంక టేశ్వరా !

107

శ్రీహరీ : భువిలోన శునకసూక రాదుల వానివాని జన్మంబులు సుఖంబు లౌనట్లుగా నడపుచున్నాఁడవు. నరకబాధ లనుభవించు వారికి యాతనాదేహంబు లలవరించి ఛేదన తాడనాదులచేఁ దదంగం బులు మఱియును దొలిపించుచు బాధ ననుభవింపఁ జేయుచున్నాఁడవు. శరీరంబులు నిర్బంధంబులు గావున నిన్నిటికిని నీవు గలుగంగా సుఖదుఃఖంబు లనుభవించుటలు సులభంబాయెను. నీవు దయా నిధివి. నిన్నుఁ గొల్చినవారికి నీవు కామధేనుకల్పవృక్ష చింతామణులై ఫలియించుట గంటిమి; శ్రీ వేంకటేశ్వరా !

108

శ్రీకృష్ణా ! నిన్ను గోపికావల్ల భుండ వని నియమంబున జపియించిన వారికిం బ్రసన్నుండ వగుచున్నాఁడవు, అవులే; నీ జారత్వంబుం దడవిన నీకు వేడుకపుట్టెడినో కాక నీ మర్మంబు దడవినవారల నుపచరించుటో కాక యిట్టి ప్రసంగంబులం దలంచిన మనస్సు కరంగునో కాక యహల్వా జారుండ వని నొడివిన నింద్రుండు మెచ్చుచో నీవును నుపేంద్రుండ నని వంశానుచారంబైన వ్రతంబు జరపుటో తెలియరాదు. మాకు నిన్నింత శోధించి యడుగం బనియేమి? నీకు నిష్టంబు సేయుటే మాకుఁబ్రయోజనంబు. నీకెంత కాముకత్వంబు ప్రియంబై నంబోలు ! "నేఁటనుండి మేము నిన్ను శ్రీ భూమినీళాసమేతుండవని, వ్రజాంగనానాథుండవని, అష్టమహిషీప్రాణవిభుండవని, శతో త్తరపోడశ సహస్ర కాంతారమణుండ వని నుతించెదము; శ్రీ వేంకటేశ్వరా ! .

109

భూపతీశా ! భూలోకంబున నన్నుఁ బలుమాఱు పుట్టించెదనని నీకేమైన వ్రతంబా? నాకు నన్ని వేడుకలు నొసంగెదననియెడు నుదా రత్వగుణంబుగాక? నీప్రకృతి నన్ను సతతంబుఁ బాయకుండెడి; నాతోడి దిఛలంబా, సకలభోగంబులు నన్ను ననుభవింపఁ జేసెద ననియెడు మాతృవాత్సల్యంబుగాక, ఈరీతి మిారు పాలించి సంసార సౌఖ్యంబులు ప్రసాదింపఁగా నుల్లంఘించి మోక్షంబు గోరెడు మంకుతనంబు నాకుఁ దగదు. మీరు నియమించినట్లు నిచ్చలు మెలంగు టే నాకు ధర్మంబు. అయినం గాని యింకొకవిన్నపంబు చేసికొనియెద విన 'నవధరింపుము. నామనంబులో మీరుండవలె, కన్ను లను మీ మహోత్సవంబులఁ జూడ వలె; వీనుల మీకథలు వినంగావలె. నోటికి మీకీర్తనంబు కృపచేయవలె. నిదియె నాకుఁ బరమపదంబు; శ్రీ వేంకటేశ్వరా !

110

శ్రీనివాసా ! దేహంబులై పొదిగెడిది నీ మాయయట. అందులోని చైతన్యంబు నీవట, కోరికోరి సుఖదుఃఖంబు లనుభవించువారు జీవులట, ఇన్ని చందంబులం గలిగెడు ఫలంబులు స్వర్గనరకంబులట. ఇవీ యెన్నటికి దెగని కర్మబంధంబులట, ఈ సంసారంబు చేసి కూడఁ బెట్టంగా మిగిలిన లాభంబులు పుణ్యపాపంబులట. ' ఇవి నీకు లీలావినోదంబులట. దీనికి తుద యేది మొదలేది? ఇటువలె ననాదియై సత్యమై జరగుచున్నదిప్రపంచంబు. ఈ యర్ధంబుఁ దెలియఁ దరముగాదు. ఇంక నేమని విన్న వించవచ్చు? మీచిత్తంబు నాభాగ్యము! శ్రీవేంక టేశ్వరా!

111

పరమేశ్వరా ! నాశరీరంబు నాకు రథంబు. నాపుణ్య పాపంబులే గుఱ్ఱంబులు. నాయాసలే పగ్గంబులు. నాకామక్రోధంబులే యాయుధంబు లుగాఁ గైకొని జన్మపరంపరల నిహపరలోకంబుల సంచరించిన విజయ పురుషుండ నేను. నీవు జగన్నాథుండ వనఁగా విని యిప్పుడు నిన్నుం, గొల్చితిని. సుజ్ఞానధనంబు జీతంబు పెట్టి యేలుము. ఇంతకాలంబు నీమా యలం బరగిన మర్మజ్ఞండ నేను నీకు సేవకుండనై యుండుట నీకు మేలు; శ్రీ వేంకటేశ్వరా !

112

రాధావల్లభా ! సకల యజ్ఞంబులకంటె జ్ఞానయజ్ఞం బధికంబనియును, అందులఁ గర్మఫలంబు లన్నియు సమాప్తంబులై పోవుననియును, అది నీ వెఱుంగుమనియును, తత్వవేత్తలకు దండంబు వెట్టి ప్రార్థించి యడిగితేను వారు నీ కీజ్ఞానంబుపదేశించెద రనియును, ముందర నీయాత్మ లో నీవే యెఱుంగుదువనియును అర్జునునకు పెద్దలం జూపి చెప్పితివి మొదల; నా తర్వాత నీవే వహించుకొని అన్ని ధర్మంబులు నంటు పెట్టి నాకు శరణుసొచ్చిన మాత్రాన 'నే రక్షింతు నని సత్యంబు చేసి యిది యెవ్వరికిఁ జెప్పకుమని యితర తత్వము మాని నిన్నె కొలువంగట్టడ చేసితివి. అటుగాన కేవలజ్ఞానులకుఁ గర్మంబులు చేయనిదోషంబులు లేవను టాయెను. ద్విజాతులు నీయాజ్ఞా కైంకర్యంబులు సేయుదురు. కాన యవియును వారలకు బంధకంబులుగావు. నీవు పెట్టిన చిక్కు నీవే తీర్చితివి; శ్రీ వేంకటేశ్వరా !

113

పాంచజన్యధరా ! అనాది కాలంబున నుండియు జీవులం బాయలేక ఆత్మలోనుండుదు వది యంతకంటెను లాభంబింక నేమి వెదకెడిది? జీవులంటిమా నిత్యులు. వారీ కై చింతింపవలదు. నీ లీలార్థంబైన శరీరంబులు మోచినవారలుం గావున ప్రాకృతవి కారంబులైన సుఖదుఃఖము లనుభవించిన మంచిదే యేలినవారి పనులయెడం బంటునకు నేమీ వాటిల్లిన నేలిక కేకలవు. నీవే రక్షించెదవుగాక అందులకు వెఱవఁబని లేదు. నీవు గలవని నమ్మి నిర్భయత్వంబున నుదాసీనత్వంబున నుండవలసి నది. నీదాసులైన వైష్ణవులకు పరమపదంబు సిద్ధంబు. ఆడ్యులై మిమ్ము మఱచినవారికి సంసారమేగతి. ఇటువంటి లోకుల నీడు పెట్టుకొనవలదు. ప్రపన్ను లై నవారలకు నీవు రక్షకుండవు; శ్రీ వేంకటేశ్వరా !

114

పురాణపురుషా ! అప్రతిహత ప్రతా పుండవు. అవాప్త సకలకాముండవు. అఘటనఘటనా సమర్థుండవు. అపార కృపానిధివి, అశరణశరణ్యుం డవు. అసంఖ్యాతకల్యాణగుణుండవునైన నీ వల్లభవాండంబు నీపాదంబు గోట గీరిన నీరై పాఱెను. నీవు గావలయుననిన నర్జునుని ప్రతిజ్ఞ కోఱకుఁ బగలు రాత్రి యయ్యెను. ఇటువంటివి నీమహిమలు. ఘంటాకర్లుండు నెక్కడ 'మొఱలిడె? కుబేరుపట్టం. బెక్కడఁ గరుణించితివి ? సరయూ తీరంబున పరమపదంబు చూఱలిచ్చితివి. ఇప్పుడు శేషాచలంబునందు వరంబు లొసంగెదవు. నీవు గరుణించిన నీకసాధ్యంబేది ? నీకిది సహ జంబు; శ్రీ వేంక టేశ్వరా !

115

భక్తవత్సలా ! కన్ను లెదుట గోచరించిన వన్ని యును నీరూపంబు లే. శబ్దంబు లన్నియు నీయనంతనామంబులే, జలంబు లన్నియు నీ శ్రీపాదతీర్థంబు లే, ఫలమూలాదు లన్నియు నీప్రసాదంబు లే జీవకోట్లు నీదాసులే. తలంపున నిల్చినవి నీధ్యానంబులే. చేతులఁ జేసినవన్నియు నీకైంకర్యంబు లే. జగంబు వైకుంఠంబే. యజ్ఞ ంబులు మహాత్సవంబు లే. సకలసంపదలు నీ యుపకరణంబు లే. ఇటువలే భావించియేకదా నీభాగ వతులు భవంబులు గెల్చిరి, ఇహపరములు చెందిరి; శ్రీవేంకటేశ్వరా !

116

గదాధరా ! బుద్ధిమంతుఁడైన యతండు దేహధారణమాత్రంబులు సుంతభోగంబులు గైకొని యితరంబు 'లేమియుఁ గోరక అంతరంగంబు నకు నిఖిలవస్తులాభంబులు నీపాదంబు లేయని తలంచుకొని తృప్తింబొంది యేకాంతంబునందే కాని సంసారంబు చేయుచుండి కాని నిన్ను ధ్యానంబు 'సేయుట యోగరహస్యంబు. ఇదియే తపంబు, ఇందులనే సకలసిద్ధులును సిద్దించు. తొల్లిటి మును లీరీతినే నిన్ను భజియించి ఘనులై రి.' మఱి కొంద ఱీమార్గంబున నేమియుం గోరక మీ శరణుసొచ్చి మిమ్ముఁ గొల్చి ముక్తులైరి. కావున మునుపడి సేవించు నుద్యోగంబులు జీవులవి. తర్వాత రక్షకత్వంబు నీది; శ్రీవేంక టేశ్వరా !

117

త్రిగుణాతీతా ! చతుర్భుజాకారా! కానరాని బ్రహ్మము నెవ్వరుఁ జూప లేరు, కానవచ్చియున్న నీమాయ లెవ్వరు మాన్పలేరు. కలది భక్త సులభుండవని చదువులలో నిన్నుఁ జెప్పంగాఁ జెవులు చల్లంగా వినుటయొకటి, కన్నుల పండువుగా నీమూర్తులు దర్శించుట యొకటి, నీరూ పులు మనంబునఁ దలపోయు టోకటి, కరంబుల నీకు మ్రొక్కు టొకటి, నీనామంబులు జపియించు టొకటి. ఇంతియ కాని వేఱోక్క యుపాయంబు మఱి లేదు. విచారించిన నాత్మ పరమాత్మదర్శనంబు లసాధ్యంబులు, కర్మంబులు కోరి చేసిన బంధంబులగు. కోరక చేసిన నిన్నుఁ గనుఁగొను టకు; నన్ని చందంబుల మీకు శరణనుట మేలు; శ్రీవేంకటేశ్వరా ! .

118

రుక్మిణీవల్లభా ! మహాపాతకంబులు చేసిన జీవులు పాషాణంబులై వృక్షంబులై తృణగుల్మలతాదులై పుట్టుదురని చెప్పుదురు. జగం బంతయు నివియ నిండుకొనియున్నవి. బ్రహ్మాండంబును పాపంబు నిండు కొన్నది. చెప్పవే, యెట్లాయహల్య నీపాదంబుసోకి పాషాణత్వం బుడిగి పావనం బయ్యె? నిటువంటి యీ చరాచరముల నంతర్యామివై నిండుకయుండఁగా నీ జీవుల పాపంబు లప్పుడే పోయిన బాధి తానువృత్తి నున్నవి 'యో కాక వారి నిర్బంధంబులు దోఁచకుండంజేసి మీ లీలకుం గైంక ర్యంబు గొనుచున్నాఁడవొ కాక మీ ధ్యానకల్పన ఘటియించుకొన్నాఁ డవో; శ్రీ వేంక టేశ్వరా !

119

దేవచూడామణి ! మీస్వరూపంబు. మితి వెట్టి తెలియంగారాదు. తెలియకుండిన నాకు, బ్రహ్మజ్ఞానంబు సిద్దించు టెట్లు ? శాస్త్ర మార్గంబున యుక్తులు వెదకిన మీఁద మీఁదఁ బెరుగుచున్నవి గాని యవధి లేదు. నాగరిమ మెట్లు నిశ్చయిఁపవచ్చు ? మీరుండుత్రొవ లెఱుంగరానివని సందేహింప నేటికి , అన్నిట మీదాసుండనని యుండు టేచాలు ; నదియే సులభోపాయం బని నిశ్చయించి చెప్పితివి. మున్ని టి పెద్ద లిందు వలననే నీచి త్తంబు గరఁగఁగొల్చిరి. ఇదే పరత త్వజ్ఞానంబునకు మూలం బని నామనంబున సన్ను తించి పతివ్రతాభావంబున దాస్వంబునకుఁ గంక ణంబు కట్టుకొంటిని. ఇది నావిన్నపంబు; శ్రీ వేంక టేశ్వరా !

120

లక్ష్మీవల్లభా ! నీ వజాండంబున కాధారకూర్మంబవట. మీఁదట నీ బంటు శేషుని ఫణంబులమీఁద సకలలోకంబులు నున్నవి. ఆదివరా హంబవై న నీకొమ్మున భూమి నెలకొన్నది. మత్స్యావతారంబున 'నీచేత వేదంబు లుద్దరింపఁబడెను. సకలై శ్వర్యంబులకుం గారణంబయిన శ్రీదేవి నీదేవి. సూర్యచంద్రులు నీ కన్నులు. మూఁడులోకంబులు నీ పాదంబునఁ గొల్చినవి. బ్రహ్మ నీకొడుకు. ఇటువంటి బ్రంహ్మాండంబులు నీ రోమ కూపంబుల ననంతంబులై యున్నవి. ఇటువంటి దైవంబు లెవ్వరున్నారు? నీకీ ర్తిప్రతాపంబుల కెదు రేది? శ్రీ వేంకటేశ్వరా !

121

శ్రీ తులసీవల్లభా ! ఇంద్రజూలములు చూవువాఁడు బట్టబయలు సముద్రంబుగా నీఁదును. 'దివాంధములు పగలు చీకటిగాఁ దలఁచును, బ్రమసినవాఁడు రజ్జువు సర్పంబుగాఁ దెలియును. నీ మాయచేత మోహి తుండై నవాఁడు 'నీప్రభావం బెఱుంగక తన సామర్థ్యంబు లని యహంక రించును. నీయవతారంబులు మానుషంబులుగా నెంచును. ఇటువంటి వారలకు నీపరత త్త్వము తెలియదు. నీవు పుట్టించిన " నా స్తికులై నవారి

వినిపింప నెవ్వరితరము? మీరె కరుణించినప్పుడు మధురమయ్యెడుఁగాక! శ్రీ వేంక టేశ్వరా !

122

సామగానప్రియా ! లోకరక్షణార్థంబు నీ వవధరించిన రామకృష్ణావతారంబులను కర్మపాశబద్దులై నవారు తమసాటిగాఁ దలఁతురు. వారు మీతో సరి యేల యయ్యెదరు ? సర్వోత్కృష్టుండవని యెఱుఁ గనివారికదియేల రుచియించును? సర్పదష్టులై నవారి కేమి దినినఁజప్ప నుండినట్లు మాయాసర్పములు తల కెక్కిన తమ్ముతామేఱుంగక నిన్నుఁ దమసాటి కెంచుకొంచున్నారు. కటకటా! యేమి యందు. సకలరక్ష కుండవని మహాపురుషులు నిన్నుఁగూర్చి తపంబులు సేసి మహ త్వంబులు వొందుచున్నారు. మాఘనత కిదియె దృష్టాంతంబని యెంచఁదగును; శ్రీ వేంకటేశ్వరా !

123

శ్రీ వత్సలాంఛనా ! నీవు బలవంతుండవు. ఎట్లు చేసిన నట్లగు. గౌతమీ నది జలంబులకుం దగిలినశాపంబు పరిహరింప శబరిస్నానతీర్ధంబు గారణంబు చేసితివి. ఇదేమిచిత్రమో? బ్రహ్మర్షి యైన దుర్వాసు నాపద మాంప నీభక్తుండైన యంబరీషుని గుఱి చేసితివి. హీనాధిక్వంబులు విచారించిన నెంత కెంత యంతరము! మీదాసులప్రభావంబు లిట్టివని లోకులకుం దెలిపితివి. 'ఏమని నుతియింతుము నీమహిమ ! శ్రీ వేంక టేశ్వరా !

124

తాటకాంతకా ! నేను రాజస తామసగుణంబులం దగిలి మదోన్మతుం డనై యున్న వాఁడ; నే బుద్ధిమంతుండ నౌటయెన్నఁడు ? పూర్వజన్మం బున నే ననుభవించిన సుఖదుఃఖంబులు దలంచియైనను, గొంత చక్క'టికి వచ్చెదనంటినేని, జాతిస్మరత్వంబు లేదు. నరక బాధలఁ దలఁచుకొని యెదనంటినేని నవి నాఁడె మఱచితిని. భువిలోపల శునక సూకరాదులను సంసార బాధలం బడెడివారి తర్జనభర్జనాదులుచూచి విరక్తుండనయ్యెద

శ్రీ వేంకటేశ్వర వచనములు ననినఁ బురాణవై రాగ్యంబెకాని దృఢంబుగాదు. నా మూఢత్వంబు 'విచా రించెదవో ! ఇన్నింటికిం బ్రేరేపకుండవు గనుక నీమఱుంగు సొచ్చితిని. నీవె నన్ను శుద్ధసత్త్వసంపన్నుఁ జేయవే; శ్రీ వేంకటేశ్వరా !

125

సుబాహుదైత్యమర్దనా ! నేను మంత్రసిద్ది పడయుట కొఱకుఁ గుత్తుకబంటి జలంబులలోపల నుండెదననుచు, ఋషియయ్యెడు కొఱకు వనంబులలోపలఁ దపంబుచే సెద ననుచు, గాయసిద్ది వడయుకోఱకు సత్త్వౌ షధంబులు చేసి సేవించెద ననుచు,సిద్ధగంధర్వపదంబునం 'బొందెడు కొఱకు మహాయోగంబులు సాధించెద ననుచు, ననేకోపాయంబుల యాశలం బొరలితిని నావివేకం బేమని చెప్పెడిది ? ఇవి యన్నియు నిర్బం ధంబులై న బంధంబులెకాని, మోక్ష మార్గంబునకుం 'బ్రయోజనపడవు. చిరంజీవుండనై యుండుదుఁ గదాయని యాసపడి యెన్నాళ్లుండినను, మీ మాయయైన జగత్తునఁ ద్రిమ్మటలే. కాని బ్రహ్మలోకంబు దాఁట రాదు. ఇందుల కింతపనియేల యిప్పుడు బుద్ధిమంతుండనై తిని. మిమ్ముఁ గొల్చి మీ రేగతియని యుఁడంగా, మీరు వలసినట్లు చేసెదరు ; శ్రీ వేంక టేశ్వరా !

126

యదుకులతిలకా ! కర్మంబులుచేసి మిమ్ముం గనియెద మనిన నది ఘన తిమిర మధ్య దర్పణావలోకనంబు, చదువులు చదివి మిమ్ముఁబట్టెద మనిన నది ఒక బంధనప్రయాసంబు, తపంబుచేసి మిమ్ము వశంబు చేసికొనియెదమని తలంచిన నది శేషమ స్తకమాణిక్యగ్రహణంబు. ఉపవాస వ్రతంబుల మిమ్ము నాదరించెద మనిన నది సముద్రసేతుబంధనంబు. దానంబు లొసంగి మిమ్ము నాకరించెదమనిన నది యాకాశపాశబంధ నంబు, నీ వీ యుపాయంబులచేత నసాధ్యుండవు. నీవొక్క భ క్తిచేతనే సాధ్యుండవు. ఇందుకు దృష్టాంతంబు మీకు శరణుసొచ్చిన ప్రహ్లాద నారద శుక భీష్మ విభీషణ కరి శబరీ గుహాక్రూర విదుర, హనుమత్ర భృతులైన పరమభాగవతులు లోకంబులం ప్రఖ్యాతులయిరి. నిన్ను నొక్కని భజియించి నిశ్చింతనుండెదము; శ్రీ వేంకటేశ్వరా ! "

127

గోపాలబాలకా ! నిన్ను నేఱుంగనిశుష్క జ్ఞానంబు పాషాణ కంటక క్రూరసర్ప వరాహ శార్దూల భల్లూకాక్రాంతంబైన యరణ్య మధ్యంబువంటిది. ఈ దేవాలయంబులు లేనిచోట్లు కఠిన కర్కశతిమిర దురవగాహపిశాచశునకావాసంబుల వంటివి. మీకు విరహితంబులైన పూజలు నిబిడ నిర్ఘాత విద్యుత్పాత జంఝామారుతవర్గంబులైన సముద్ర మధ్యంబులవంటివి. మీ కథలు లేని పురాణ శ్రవణంబులు భీకరాకార కాకమూకకంకగృద్ర ఝల్లీ పాషాణ గుహలలోని ప్రతిధ్వనులవంటివి. ఇవి యెల్ల ను మహాత్ములగువారు దలంపరు. 'మిమ్ము నమ్మి సర్వశుభం బులు మాయం దె ఘటియించుకొందురు. వివేకు లయిన మీదాసులకు నిదియె యుపాయంబు, శ్రీ వేంకటేశ్వరా !

128

పూతనాశిక్షకా ! గ్రహణకాలంబునంజేసిన స్నానంబునకు గంగాస్నా నంబు సరియని చెప్పుదురు. పుణ్య క్షేత్రంబుల నుండెడివారిని ఋషి సమాను లనీ యంద్రు. సత్పురుషు లైనవారి హస్తంబునం బెట్టిన సువర్ణంబు మేరుసమానంబని పలుకుదురు. కాలకృతంబులై న యనుష్టా నంబులు సఫలంబులని వచియింతురు. అన్నిటి మాహాత్మ్యంబు మీయం దే యున్నది. గంగాజలంబు మీపాదతీర్థంబు. ఋషిత్వంబు మిదాస్యంబు. దానఫలంబైన సువర్ణంబు శ్రీమహాలక్ష్మి ప్రసాదంబు, అనుష్టానజపం బులు మీనామస్మరణ సులభంబులు. ఇన్ని యును మీవలననే మాకు సిద్దించె. ఇన్ని టం బరిపూర్ణులమై యున్నారము. వెన్న చేతఁ బెట్టుకొని నేతి కై వెదక నేమిటికి ? పరుసవేది యింట నుండగా బంగార మడుగ వలెనా ? మాకు మీరు గలరు. ధన్యులమైతిమి శ్రీ వేంకటేశ్వరా !

129

లోకనాథా ! నేను జ్ఞానం “బెవరినై న నడిగి తెలిసికొనియెద నంటినేని శాస్త్రాధీనుండు బ్రాహ్మణుండు. గృహస్థుండు పుత్ర మిత్ర కళత్రా


ధీనుండు. రాజు రాష్ట్రాధీనుండు. ప్రధాని కార్యాధీనుండు, జపిత మంత్రా ధీనుండు. తపస్వి దై వాధీనుండు. ఈరీతిని వారు వారు మనస్సులు తమ తమ కర్మంబులందే యొడంబడ వర్తింతురు. కాని నిన్ను నొక్కనినే కొలిచి తేను నీవలన నన్నియుం గలవనియెడు విశ్వాసంబు వారికిఁ గలుగ నేరదు. వారు నన్ను నెట్లు బోధించెదరు. విత్తోకటి పెట్టినఁ బెట్టు వేఱో క్కటి మొలచునా ? అవి నీకృత్యంబులు. నేను వైష్ణవుండను. ఆచార్యా ధీనుండను. నీవు భాగవతాధీనుండవు. నన్నుం గరుణా దృష్టి, నవలోకిం పవే. శ్రీ వేంక టేశ్వరా.

130

ఆదిమధ్యాంతరహితా ! ఆకాశంబున భూమిం బురుడింప వచ్చును. అనంతమైన నీమహిమకు నీడు లేదు. సముద్రంబు సెంచి మేరుపర్వ తంబుఁ బోలించవచ్చు. నీకరుణా సముద్రంబునకు సరి చెప్ప నలవిగాదు. సూర్యుని తోడఁ జంద్రుని జోడు చెప్పవచ్చును. నీ కోటిసూర్య తేజం బునకుం బ్రతి లేదు. బడబాగ్ని నగ్ని దేవునిఁ బోల్పవచ్చును. నీప్రతా పాగ్నికి సాటి యుపమింపరాదు. చుక్కలను జ్యోతిశ్శాస్త్రంబుల లెక్కింపవచ్చునుగాని యపారంబైన నీ నామంబుల ప్రభావంబులకు నేమియు మితి వెట్టరాదు. ఏకోదకంబై నపుడు నీవొక్కడవే నారాయ ణుండనై యుండుదువట నీకు నీవే యీడు. ని న్నెంతని కొనియాడు దుము. అందఱకు నీ వొక్కరుండవే గతి. శ్రీ వేంకటేశ్వరా !

131

భక్తచింతామణీ ! నేను విలాససంకల్ప బాధితుండనై యజ్ఞానం బనీ యెడియగాథ. జలంబులలోన మాయావర్సాగమనంబునం దపంబు సేయు చున్న వాఁడ. అంగ నాలింగ నాకాశ మధ్యంబుననుండి వదన చంద్రునిపై దృష్టినిలిపి 'యూర్థ్వబాహుండనై తపస్సు చేయుచున్న వాఁడ, అష్టాశీతి బంధంబుల యాసనంబులనుండి మదనదై వతాగమంబున నిట్టూర్పుల ప్రాణాయామంబులం దపంబు చేయుచున్న వాడ. క్రోధాగ్ని పాత కేం ధనంబులు దరికోల్పి తపంబు సేయుచున్న వాడ. ద్రవ్యార్జనచింతాది


కామ్యకర్మ ఫలాహారినై తపంబు సేయుచున్నాఁడ. ఆశాపర్వతంబు మీద నతిదై న్యసూచ్యగ్రంబునం దపంబు సేయుచున్నవాడ. సంసారంబనియెడి పుణ్య క్షేత్రంబునను పుత్రదారాదు లనెడి సాకారులగు నిధులు కన్ను లెదుటం జూచి చూచి ధ్యానయోగంబుతోడుతం దపంబు సేయుచున్నవాడ. విచారించి చూచితే యిన్ని చందంబుల నుండెడి వాఁడవు నీవే. ఈతపంబులన్నియు గల్పించినవాడవు నీవే ఈతపంబులన్నియుఁ జల్పించినవాడవు నీవే గురుండవు దైవంబవు రక్ష కుండవు నీవే మమ్ముఁ గరుణింపుము. శ్రీ వేంక టేశ్వరా !

132

దయానిధీ ! నీవు మన్నించి భాండారంబు దెఱచి భూరిదానంబు లొస 'గంగా సకల వైష్ణవులును నీ పై భ క్రిసంపదను తమ తమ యాత్మమంది రంబులలోన బాతర పెట్టుకొనిరి. నీనుతులు మూటగట్టి వదనసౌధంబుల లోన తూగ వేసికొనిరి. నీనామాంకితంబులు దేహముతో లంకించి తిరుమణి గుఱుతులు వేసికొనిరి, నీమూర్తిధ్యానంబు మనస్సనియెడి గోడల నంటించిరి. నీ పూజాంగంబులు పిడికిళ్ల ఁ బట్టుకొని యున్న వారు, నేను వారిలోని వాఁడనే, నీకృపాదృష్టి మాపై గురిసె . ఇంక మాకు ననావృష్టి దోషంబు లేదు. నీధర్మంబున పరిణామంబున నుండెదము. శ్రీ వేంకటేశ్వరా !

133

విజయప్రకాశా! కార్యాతురుండనై మం దెమేలంబున , మాటిమాటికి నిన్నుఁ దలంపుచున్న వాఁడను. నిన్ను దలంచి చూచి తేను బ్రహ్మ దేవునిలోని సామర్థ్యంబు నీవ. ఇంద్రునిలోని యైశ్వర్యంబు నీవ. సూర్యునిలోని తేజంబు నీవ. చంద్రునిలోని కళలు నీవ. వాయువు లోని వేగంబవు నీవ. సకల దేవతలలోని ప్రాభవంబులు నీవ. అన్ని తీర్ధంబులలోని పుణ్యంబులు ప్రభావంబులు నీవ. యజ్ఞదాన కర్మాను ష్ఠానంబులు నీవ: " ఇటువంటి నిన్ను సాధించ నెట్లు వచ్చును. నేను మనుష్య మాత్ర దేహిని, నా రెంత నేనెంత, ఊరకే మిమ్ముఁ గొలిచిన

శ్రీ వేంకటేశ్వర వచనములు బంటనని పెద్దఱికంబులకుఁ జెప్పుకొనియెదనుగాక, మిమ్ముఁగనుఁగొన నెంత సమర్ధుఁడను. నా యగ్గలికకు నేను నన్ను నవ్వుకొనుచున్న వాడను. నా యాస చూచి నన్నుఁ దయదలంచి యేలుకొనవే శ్రీ వేంకటేశ్వరా !

134

మధుకైటభాంతకా ! జంతువులము మేము ఆహార నిద్రలతో నోల లాడుచున్న యెడ నీన్ను నొకానొకపరి మా పాలింటి దైవమవని తలంచుచున్నారము. మాజ్ఞూనంబు లల్పంబులు ననాచారబహు ళంబులు నయినట్లున్నవి. మాయునికి పెక్కు రంగుల చెట్లలో నొక జిల్లేడు జెట్టువలె నున్నది. బంటులకు నీవేమి చేసెదవో ! నేము మిమ్ము సదా సేవింప 'నేరమి చింతింపుచున్నారము. నిన్ను నిర్హేతుక దయానిధివని పెద్దలు చెప్పుదురు. నీ బిరుదులు దలంచుకొని మాపై కృపాకటా క్షము దయసేయుము శ్రీ వేంక టేశ్వరా !

135

విభీషణస్ఠాపకా ! ఈ మనుష్యలోకంబున రవి చంద్ర గ్రహ తారకంబులవలన నుదయా స్తమయంబులును పూర్వదక్షిణ పశ్చిమోత్తరం బులును నేర్పడియున్నవి. ఇంద్రాదులకు దేవమానంబున నివియే శత గుణంబులై యున్నవి. అట మీద బ్రహ్మకు బ్రహ్మమానంబున ననంత గుణితంబులై యున్నవి. ఇందులకు జ్యోతిశ్శాస్త్రంబునం జెప్పెడి కాలంబునకు , నేకవాక్యతఁ గల్పించి యేలాగున సరిపఱిచి చెప్పవచ్చును. శాస్త్రంబులు కల్లనరాదు. అయితే వీనిక తంబున నీవే గాలాత్ముండవై ఇక్కడనక్కడ నిన్ని చందంబులతోడఁ జూ పెడి నీ స్వతంత్రంబు గానం బడియెను. జగత్తంతయును నీ మహిమనే యున్న దను నిశ్చయము తేట తెల్లమాయెను. సర్వంబు నీ కల్పితం బై చెల్లుబడియవుట, నిశ్చ యంబు. పుట్టించుటకు రక్షించుటకు నీ వొక్కరుండనే కర్తవు. పరమేశ్వరుండవు. అఘటనా ఘటన సామర్థ్యంబు నీకకలదు. నీచేఁతలు పొగడుచున్నారము శ్రీ వేంక టేశ్వరా !

136

ఉద్దవ వినుతా ! సర్వమైన వారికి నీవాహారంబు గొను వేళను ఆయా పదార్థంబులరుచులు జిహ్వలకొకరీతి వె. తరుణీ సంగమంబులు నొక్క చందంబులె, వీనుల వినియెడి వినికియును నొక్క జాడయె. ముక్కులా ఘ్రాణించు పరిమళంబును నేత్రంబులం జూచిన తెలివియును నొక్కతీరె. విచారించితే అనుభవంబులయెడ నేక సూత్రంబె అవుచున్నది. " ఓహో ! నీ ఘటన యత్యాశ్చర్యంబు, అన్నిట నేర్పరి వౌదు శ్రీ వేంకటేశ్వరా!

137

కంసమర్దనా ! నీవు ఆదివిష్ణుండవు, నీ యాత్మసంభవుండై న బ్రహ్మదేవుండపరవిష్ణుండు, అతనిచేత సృజింపఁబడ్డ వారందఱు వైష్ణవులే. " సర్వం విష్ణుమయం జగత్" అందురుగావున నందఱును మీయధీ నులే. వారి వారి పూర్వజన్మానుగుణ్యంబునం గొందఱు శైవులగుదురు. కొందఱు మాయావాదులగుదురు. అందులకు నింక నోక్క విశేషంబు గలదు. దేవతాంతర మతాంతర సాధనాంతర ప్రయోజనాంతరములు విడిచి తదేకనిష్ఠులై మిమ్ముఁ గొలిచినవారు పరమవైష్ణవులు. విదురుని యంతరంగులు. ఇతర మతంబులవారునిన్నె ఱింగిన నెఱుంగకుండిన సకల దేవతలును నీ యంశసంభవులుగనుక నా దేవతలఁగొల్చినవారును నీవారే శ్రీ వేంక టేశ్వరా'!

138

అహల్యాశాపవిమోచనా ! నీవు సర్వంబునకు నాధారంబని వేదంబులు చెప్పుచున్నవి. నీకు నాధారం 'బెయ్యదియో యెఱుంగను. నీవొక్కం డవే పరబ్రహ్మవట ! పురాణంబులు సెప్పెడి, తక్కిన మూర్తి భేదంబు లెవ్వరెవరో యెఱుంగను. నీవేమిటం బొరయనివాఁడవట ! ఈ ప్రపంచం బెవ్వరికొఱకుఁ బ్రకాశింపుచున్నయదియో కానఁబడదు. ఇవి యన్ని యును విచారించి చూతమనిన నీవ భేద్యుండవు. ఇటువంటి నీ మహిమకు నేము నాశ్చర్యంబు నొందుట గాని యొక యర్థంబు నిశ్చయింప నలవి గాదంటిని, తిలలలోని తై లంబువిధంబునఁ, గాష్ఠంబులోని యనలంబు చందంబునఁ, బుష్పంబులోని పరిమళంబుపోలిక, బీజంబులలోని వృక్షం బుల కైవడి నీరీతి జగంబులలోన నీవును, నీలోన జగంబులును; బాహ్యాంతరంబుల నీవు పరిపూర్ణుండ వై యున్నాఁడవు. నీవు వలసినట్లుం డుము. నీకు శరణని బ్రతికెదము. శ్రీ వేంకటేశ్వరా !

139

కల్క్యవతారా ! మిమ్ముఁ గొలిచిన సాధుజనంబులకు వరదహస్తం బును, భయపడ్డ దీనులకు నభయహస్తంబును జూపుకొని సాకారమై నిలుచున్న వాఁడవు. శత్రుసంహారార్థంబై యొక శైలచక్రంబును విజయ ఘోషంబులందఱకును నెఱిఁగించుకోఱకు నొక చేత శంఖంబును బెట్టు కొని యున్నా ఁడవు. ఇంక నే మూహించి యాసపడి వేద కెడి దేమున్నది? కోరకే తొల్లి సర్వార్థంబులు నొసగ నంతర్యామివై కాచుకొని యున్నా ఁడవు. వెదకం బోయిన తీగ ముంజేతఁ దగిలినట్లు, వేడఁబోయిన యర్దంబు వేడుక వచ్చినట్లు, ఆడఁబోయిన తీర్థం బెదురుగా వచ్చినట్లు, తోల్లి చేయని పుణ్య ఫలంబులు చేతికి వచ్చినట్లు సకల 'తిరుపతులం బొడచూపు చున్నాఁడవు. సకలమైన వారికి బ్రదుకుఁద్రోవలు నీవుండిన యాకారంబు చెప్పుచున్నది. శ్రీ వేంకటేశ్వరా !

140

రవిచంద్రలోచనా ! షూ వేడుకకు నీప్రత్యక్షంబుఁ గోరెదము గాక నీవు ప్రత్యక్షంబయిన నెట్లు కనుఁగొన నోపుదుము. నీవు కోటిసూర్య ప్రకాశుండవట. ఒక సూర్యుండు దృష్టులకు మిఱుమిట్లు గొల్పెడిని నీ వెట్లు గోచరించెదవో యద్భుతంబు. శ్రీ వేంకటాద్రి మీద నీరూపంబు దర్శించితిమి. మాకు నిదియె బ్రహ్మ సాక్షా త్కారంబు శ్రీ వేంకటేశ్వరా!

141

జగత్ ప్రాణా! బ్రహ్మచర్యంబుననుండి సాధించు ఫలమును గృహస్థాశ్రమం బునంజేసి చెందెడి పుణ్యంబును, వానప్రస్థధర్మంబునం గట్టుకొనియెడి విశేషంబును, యతినిష్ట, చేతఁ బొందెడి యానందంబును నీదాస్యంబునన . సాధించుకొంటిని, నానా వేదంబులం జదివిన యాధిక్యంబును నీ నామో చ్చారణంబునఁ గలిగించుకొంటిని. అఖిలలోకంబుల సౌఖ్యంబులు మీ గుడిపంచనే దొరకించుకొంటిని. అమరత్వంబు వైష్ణవత్వంబునం గైకొంటిని. అన్ని తీర్థంబుల స్నానంబులును గంగాస్నానములో నిలిచినట్లు, మంత్రజపంబు లెల్లను బ్రణవంబులోఁ జిక్కినట్లు తపంబుల మాహాత్మ్యంబులు భక్తి చేతం దక్కినట్లు నీ కృపవలన నాకు సంభ వించెలే శ్రీ వేంకటేశ్వరా !

142

కూర్మావతారా ! బ్రహ్మాండం బొకటి, బ్రహ్మలు తొమ్మండ్రు, రుద్రులు పదునొకండ్రు, దేవతలు ముప్పదిమూఁడుఁగోట్లు. ఇందఱిలో నెవ్వరి ననుసరించెదము. అందఱకును మూలకారణం బైన యాదిమూర్తివి నీవని నిన్ను నొక్క నిం గొలిచితిమి. ఇంక నిందఱును దృప్తులై మాకుఁ బ్రసన్నమయ్యెదరు. అటేగదా వృక్షంబునకు మొదటం బోసిన నీరు కొనల కెక్కి తనివిఁబొంది ఫలించు; నటువలెనే నా చేత నిర్మింపఁబడిన దేవతలందఱును మిమ్ముఁజూచి మాకుఁ బ్రసన్న మయ్యెదరు. బహు మార్గంబులం దగిలితేను మనస్సు చలియించును. ఏకాగ్రబుద్ధిని మిమ్ము నేవించెదము, శ్రీ వేంకటేశ్వరా !

143

సముద్రసేతుబంధనా ! నీవలన నీసంకల్ప రూపం బైన ప్రకృతియున బ్రకృతివలన మహత్తును, మహత్తునలన నహంకారంబును, నహ కారంబువలన మనస్సును, మనస్సువలన సకలేంద్రియంబులును, బంచ తన్మాత్రలు జనించె. ఆ తన్మాత్రంబులవలన పంచమహాభూతంబులును బొడమె. కూడ నిరువదినాలుగు తత్వంబులయ్యె. ఆ యిరువది నాలుగు తత్త్వంబులైన జీవులలో నీవు వేంచేసియుండి ప్రకృతి భోగంబులన్నియు ననుభవింపఁ జేయుచున్నాఁడవు. నీవు ప్రాణబంధుండవై లోకంబు లేలుచున్నాఁడవు. నిన్ను వేడుకొనియెదము. నీకుఁ బ్రియంబుఁ జెప్పె దము. గురుముఖంబునను నీ కృపవలనను స్వామి నని నిన్ను నెఱింగికొంటిమి. నీవు పెట్టిన చెట్టు నీవే యీడేర్పవలయును. తరువాతి బుద్ధులు నీవే యనుగ్రహించి మమ్ముఁ గృతార్థులం జేయవే శ్రీ వేంకటేశ్వరా !

144

వాలినిగ్రహణా ! నీపై భక్తిఁ జేయునదెల్ల నన్ను నీవు రక్షింతువని యెడిన్వ కార్యంబు కొఱకే. నీవు మమ్ముఁ బాయక యంతర్యామియై, యుండెడిదంతయును నీవు మాకుఁ జేసిన పరమోపకారంబే, నే నస్వతం త్రుఁడ. నీవు స్వతంత్రుఁడవు, నే నగుణుండ. నీవు గుణాతీతుండవు. నే నశక్తుండ. నీవు సర్వశ క్తిధరుండవు. నే నిన్ను ధరించుకొననోప. నీవు నన్ను ధరింపనోపుదువు, నానేరుపు నేరము లెంచం బని లేదు. నీకీర్తి ప్రతాపంబు లెంచుకొని నీ మహిమలు మెఱసి నన్నుఁ బోషించుట నీకుం బుణ్యము. ఎలుఁగుబంటికి జూలు వ్రేగనరాదు. తీగెకుఁ గాయ భార మనరాదు. కామధేనువునకుఁ గొమ్ములు వేస టనరాదు. మా చిరభారం బులు నీవే దహించుకొనవే శ్రీ వేంక టేశ్వరా !

145

మారీచహరణా ! నీవు ధర్మసంస్థాపనంబు సేయు నెపంబువలన ననంతావతారంబులై యపరాధంబులు సేసిరని దుర్జనులైన రావణాదులను సంహరించితివి. ఊరకున్న జీవులచేతను బాపంబులు సెయింపనేల ? వారిని రాక్షసులుగాఁ బుట్టింపనేల ? నీవు జన్మంబు నొంద నేల ? మొదలనే సుజ్ఞానులం జేసిన నీకేమి వెలితియయ్యెడిని. నీవు స్వతంత్రుండవు. నీవు లేక జగంబులోనఁ దృణంబు సలింపదని యండ్రు. నిన్ను మీఱిన పను లేమియున్నవి. నీవు తప్పు చేయవనుతలంపున మే మొకటియెంచు గొంటిమి. దేవతిర్యజ్మనుష్య స్థావరాదులకు నీయవతారంబులు సేవించి బ్రతుకుం డనియెడి యుపకారంబు గాఁబోలు నియ్యది. శ్రీ వేంక టేశ్వరా !

146

శ్రీమన్నారాయణమూర్తీ ! శ్రీరంగంబునకుఁ బుణ్యజనుల వెంట నేఁబోయి కావేరీనదిలో స్నానంబుఁజేసి పాపంబులు విదిల్చి రంగనగ రంబుఁ జేరంబోయి స ప్తప్రాకారంబులు గడచి యాపిమ్మట మీ తిరు కోవిల సొచ్చి గారుడ స్తంభంబునకు సాష్టాంగ నమస్కారంబు సేసి యనేక సువర్ల నిర్మిత శోభనా లంకారంబైన తోరణంబులు దాటి పసిండి కవాటంబులకుం బన్నిద్దఱాళ్వారులకుం బ్రణమిల్లి యనంత భూషణం బైన మీ గర్భగృహద్వారమందు నిలిచి జయవిజయుల సేవించి సహస్రఫణిఫణామాలాలం కృతంబై న భోగీంద్రుమీఁదఁ బవ్వళించియున్న నీలమేఘవర్ణంబైన నీయాకారం బారఁ జూచి నీశిరస్సున మరకత మాణిక్య పద్మరాగ వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగోన్నతంబై న కిరీటంబును గర్లయుగ్మంబున' ముత్యపుఁజౌకట్లును మకరకుండలంబుల మెఱుపు కాంతులును, తిరుమణి శ్రీచూర్ణంబు లమరునుదురును, గంధ కస్తూరి కర్పూరంబు లలందిన వక్షంబును, వైజయంతీ వనమాలికయును, జతుర్భుజంబుల రత్నఖచితంబులైన భుజకీర్తులును, హార కేయూర కంకణకటకాంగుళీయకములును, బసిఁడిజన్నీ దంబును, బంగారు కంఠ హారంబును, 'బాదంబునఁ బసిఁఢీగజ్జెలును, నవరత్నమయభూషణం బైన దక్షిణ హస్తంబును, దలక్రింద వామహస్తంబును, నాజాను బాహుయుగ ళంబు మధ్యమున, నురముననున్న శ్రీ మహాలక్ష్మి పరకొంతవోలె నీ పాదంబు లొత్తుచుండఁ బది వేలకోట్ల సూర్యప్రభలు గలిగిన దిష్య మంగళ విగ్రహంబై న నీ యౌదార్యంబు నా కన్నుల కఱవు దీఱంజూఱీ రోమాంకిత పులకాంకిత శరీరుండనై నీ దివ్యపాదపద్మంబులు నా హృదయ కమలంబున నిలుపుకొని మ్రొక్కి కొనియాడి నీవు సకల లో కర్త వని, యచ్యు తేశ్వరుండ వని, యష్ట భుజ నారసింహుండ వని యుత్పత్తిస్థితిలయంబుల కధికారివని, శంఖ చక్ర గదా ఖడ్గ ప్రము బాహుండవని, యలమేలు మంగాపతివని, నిన్ను గొలిచితిమి, మమ్ము గాచి రక్షింపవే శ్రీ వేంకటేశ్వరా !

147

అఖిలాండకోటి బ్రహాండనాయకా ! ఆది మధ్యాంతరహితా !అంబుజాసనాది వంద్యా ! శ్రీయలమేలుమంగా మనోహరా ! నీనా మంబు లనంతంబులట ! నీ జన్మంబు లవాజ్మనసగోచరంబులట ! నీ గుణము లెవ్వరుఁ దెలియ సమర్థులుగారట ! నీ నాభికమలంబునం బుట్టిన బ్రహ్మ నాళంబునుంగానక శతవర్షంబులు తిరిగి నీ నామస్మరణంబున నిన్నుఁగ నేనట ! అయితే యిఁక నొకటికలదు. నీ దాసులు నిన్ను విశేషం చిన విశేషము లేమని విన్నవించెదను. మాటి మాటికి నీ నామంబులు విన్నవించెదను, విన నవధరింపుము. శ్రీపురుషోత్తమా ! శ్రీకూర్మము లోలార్కము, వైకుంఠము, రంగనాథము, సర్పవరము, కనక గిరి, కనకాం బరగిరి, గోవర్ధనగిరి, యంజనగిరి, హ స్తిగిరి, యాళ్వారులగిరి, పండరంగ గిరి, గరుడగిరి, మంగళగిరి, నీలగిరి, రామగిరి, హేమగిరి, వేంకటగిరి, శ్వేతద్వీపము, హిరణ్యాద్రి, కుంతాద్రి, వృషభాద్రి, మదనాద్రి, ఘటికాచలము, శ్రీరంగము, ప్రమోదూతము, సత్యలోకము, ఆకాశ నగరము, శబరీ ప్రకాశము, ద్వీపాంతరము, పంపాతీరము, ఉత్పల్లాపదము, అగస్త్యాశ్రమము, శరణాగతము, కదళీవనము, క్షీరాబ్ది, బదరికాశ్రమము, నారాయణాశ్రమము, నై మిశారణ్యము, వింధ్యారణ్యము, మహా రణ్యము, సుబ్రహ్మణ్యము, బృందావనము, భక్తిస్థలము, కపిస్తలము, పాదస్థలము, శ్రీనివాసస్థలము, అవంతి, వజ్రము, కాళికాహృదయము, గయ, గంగాసాగరము, 'చక్రవర్దనము, సాగరసంగము, చిత్రకూటము, మణికూటము, హరిక్షేత్రము, కురుక్షేత్రము, అహోబలము, శ్రీ వైష్ణవము, హిమవంతము, చూర్ల ప్రతీకము, కపిలము, హాటకము, నిఖిలసాగరము, మయూరము,, శ్రీమద్ద్వారము, కురుకాయకము, భద్రనందనము, రవిమండలము, ఆదిశంఖము, పూనమంబరము, భీమ శంఖము, మర్ధాచలము, వృద్ధాచలము. నాసికాత్ర్యంబకము, హరిహరే శ్వరము, ఆళఘరి, చెన్న కేశ్వరి, శ్వేతాద్రి, తోతాద్రి, శ్రీరామము, శ్రీ రాఘవము, దివాభవము, పాతాళము, శ క్తిసాగరము, అగ్ని పురము, వటారణ్యము, అనంతము, కుంభకోణము, అయోధ్య, ప్రయాగ, ద్వార కావతి, జింహిల, తామ్రవర్తి, కంచి, సింహాచలము 'మొదలైన యీ నూటయెనిమిది తిరుపతులయం దవతరించితి వని వింటిని. ఆ తిరపతులఁ జూచీ సేవించ సమర్ధుండఁగాను, ఇన్ని తిరుపతుల సేవాఫలంబులు నాకు నీ నీ సహాయమేగతి శ్రీ వేంకటేశ్వరా !

148

ఉభయవిభూతి నాయకా! ఉభయవిభూతులలో, నిత్యవిభూతి, మూఁడు లక్షల ముప్పది రెండు వేల యామడ దాటఁగా, నవ్వలనండజ బ్రహ్మాం' డంబు దాటఁగా నవ్వల నమరావతీ పట్టణంబు, నమరావతీ పట్టణంబు దాటగా నావల సూర్య మండలంబు, సూర్య మండలంబు దాటగా నావలఁ జంద్ర మండలంబు, చంద్ర మండలంబు దాటగా నావల నక్షత్ర మండలంబు, నక్షుత్ర మండలంబు దాటగా నావల బ్రహ్మ లోకంబు బ్రహ్మలోకంబు దాటగా నావలఁ గారణవై కుంఠంబు, కారణ వై కుంఠంబు దాటగా నావలం బ్రకృతి. ప్రకృతి దాటగా నావల విరజూనది. విరజానది దాటగా నావలఁ బరమపదంబు. పరమపదంబు దాటగా నావల నష్టాక్షరి యనెడికొలను గలదు. ఆ కొలనిలోపలఁ గమ లంబు గలదు. ఆ కమలంబులోపల నతి విస్తారమైన మంటపంబు గలదు. ఆ మంటపంబు లోపల వేయి శిరస్సులు, రెండు వేల జిహ్వలుగల యాది శేషుండు గొడుగై పానుపై యుండగా, భగవానులు పవ్వళించియుం డఁగా, శ్రీమహా దేవియు, శ్రీమహాలక్ష్మి యుఁ బాదంబులొత్తుచుండఁగాను, భగవానుల సన్నిధిని భాగవతులు తిరుకొట్టారునంబియుఁ దిరుమలనంబి యుఁ బెరియనంబియుఁ దిరుకచ్చినంబియు, మార్నూరునంబియు, శ్రీ యయిదుగురును మూఁడు వేళలఁ బసిండి పువ్వులఁ బూజసేయంగా భగ వాను లేమనుచున్నారు. నాదాసులు నిర్భయులు. నాదాసులద్వ యాధికారులు. నా దాసులు వేదాంత వేద్యులు. నా దాసుల నే నెఱుంగుట కాని నన్నెఱుంగుట కూడదు., భాగవతాపచారంబు పడ్డట్టాయెనా యాకాశంబు పగిలిన నదుకవచ్చును, భూమి పగిలినఁ బోదుఁగవచ్చును. సముద్రంబు పొరలినఁ గట్టవచ్చును. కాని యిటుకూడదు. భాగవతాప చారంబు దగ్గపటలంబు, అని వేదశ్రుతులు చాటుచున్నవి. వరవరముని మంత్రంబను విత్తనంబుఁ దెచ్చి, పరమపదంబను పాదిగట్టి, చల్లఁగా నీ తిరుమంత్రంబులను పన్నీట జలకమార్చి కాలువలు దిద్ది యష్టాక్షరి యనెడి మొలక మొలపించి స్వర వేదమంత్రంబనెడి తీగఁబాఱించిన, పరిపూర్ణకటాక్షంబనెడి పువ్వుపూచి, కాయగాచి, పండుపండి, ఫల మంది, పంచసంస్కార పరుండగుట నిన్ను నే గుఱు తెఱుంగుట. "అస్మద్గురుభ్యోనమః " అనియెడి మంత్రంబుఁ బోల మంత్రంబు లేదు. 'పూర్వాచార్యులఁ బోల మణి యాచార్యులు లేరు. పరమరహస్యంబుఁ బోల మఱి రహస్యంబు లేదు. శ్రీమహావిష్ణువుఁ బోల మఱిదై వంబు లేదు. ఇట్లు నా కెఱింగింపవే శ్రీ వేంకటేశ్వరా !

149

ఆదిమధ్యాంతరహితా ! అంబుజాసనాది వంద్యా ! 'వేదవేదాంత వేద్యా!అవధారు ! దేవా ! నా విన్నప 'మొకటిక లదు. విన నవధరింపుము, అతిఘోర సంసా 'రాంధకారం బనియెడి యడవిలోపల నా యజ్ఞాన జన్మ జీవుం డనియెడి గజంబున్నది. అది యెటువలె నున్నదంటివా? ఆశామోహంబు లనియెడి గజ సమూహంబులం గూడి పంచేంద్రియ విషయ భోగాదులం దగిలి కామక్రోధంబులం జిక్కి, తాప త్రయంబులచే ముందు వెనుకలు గాన లేక యీషణత్రయం బనియెడి ఘోర వనదుర్గ గహనంబులం దగిలి రేయుంబగళ్లు మితి లేని తిమిరం బునం జిక్కి, సన్మార్గసంచారంబు గాన లేక యున్నది. అట్టి 'గజం బునుబట్టి తెచ్చుటకు నొక్క యుపాయంబు గలదు. అది యెట్లన్నను నీయనుమతియను దివ్య పాశంబున నీవిజ్ఞానం బనియెడి వెంట యేనుఁగుతోఁగూడఁ బెన వేసి నీకృపాకటాక్షంబనియెడి సూత్రంబున బంధించి యరి షడ్వర్గంబు లనియెడీ యాశాపాశంబుల నూన్చి, నీపై భక్తి యనియెడు కంబంబునంగట్టి నీనామోచ్చారణ రహస్యార్థంబని యెడి 'మేపు మేపించి నీ తిరుమంత్రం బనియెడి జలంబుఁ బెట్టింది. భవ జరారోగ హరంబైన యాచార్య తళిగె ప్రసాదంబను కవళంబు మేపి, ద్వయంబనియెడి జూలు గట్టించి, యష్టాక్షరంబనియెడి ఘంటలు గట్టించి, రామానుజ సిద్దాంతం బనియెడు మురజఁ గట్టించి, కృష్ణ రాహుత్తుం డని యెడి మావంతు నొక్కించి భాగవత సజ్జారంబునం గట్టి, యితర కింకరదోష హరంబనియెడి తుళసిదండలు దిష్టి దండలుగాఁ బూన్చి, యితగం బనియెడి భారినిగళంబు విడిపించి, నీ చరమార్దంబనియెడి యంకు శంబుఁ జేతఁబట్టి యిట్టట్టు కదలనీయక, నీ తద్దాస సంసర్గ గతులకు లీలావినోదంబుగా నెక్కుడు శత్రుక్షయమిచ్చి క్షేమంబు పాలించుకొఱకునై పదునాలుగు దొంతర చెఱువులు దాటించి యావల బహుపాపహరంబైన విరజానది లో స్నానపానాదులు సేయించి పరిశుద్దాత్మునిఁగాఁ జేసి శంఖచక్రపీతాం బర వన మాలికా భరితునింగాఁ జేసి, యిందిరా స్తన్య పానం బనియెడి యుగ్గు పెట్టించి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదవు లిత్తు వని సర్వ లోక జనులు కొనియాడగాఁ బాడగాఁ బేరుకొనఁగా విని నీ వలమేలుమంగా లక్ష్మీ సమేతుండవు గావున నీ కనంతంబులైన విన్న ఫములు చేసికొని కొనియాడెదను. పాడెదను. శ్రీ వేంకటేశ్వరా !

150

అలమేలుమంగాపతీ ! అవధారు దేవా ! దేవా ! చిత్తావధారు ! నావిన్నపంబు విన నవధరింపుము. నిరాకారంబై వాయువు స్వరూపం బై యున్న జీవుని మాతృగర్భంబనియెడు నిరవుననుంచి శుక్ల పక్షంబున శుక్ల శోణితరూపంబున బదరీఫలప్రమాణంబునఁ జేసి, ద్వితీయ మాసంబునఁ గుక్కుటాండస్వరూపంబునఁ జేసి, తృతీయ మాసంబున మయూ రాండస్వరూపంబునంజేసి, చతుర్ద మాసంబున నారికేళ ప్రమాణంబునఁ జేసి, పంచమ మాసంబున శోణితాండరూపంబునఁ జేసి, పాణ్మా సంబునఁ బంచతంత్రంబులతోఁగూడిన దశవాయువుల స్వరూపం బై యున్న లింగశరీరంబున నున్న కర్మజీవునిం దెచ్చి తదీయ 'సూక్ష్మతనువందుఁ జొరఁదోలి మాంసశోణితంబు లాహారంబులు సేసితివట! సప్తమ మాసంబున జీవునిఁ ధత్వజ్ఞానవరునిఁ జేసితివట ! అష్టమ మాసంబుస జీవుండు గృతమిట్టి కర్మంబులుం జేసితినని తన పాపంబులు గుర్తించుచు నవమమాసంబున నారాయణ ధ్యాన పరుండగుచుఁ గరములఁ గర్ణ ంబులు మూసి, దశమమాసంబున ధరణిపై నుదయించి యజ్ఞానాంధకారం బనియెడి తిమిరంబుచేతఁ గప్పంబడి, కొన్ని వర్షంబులు స్తన్యపానంబునఁ గోన్ని వర్షంబు లన్నప్రాశనంబున, భక్ష్యభోజ్య లేహ్య చోష్యపానీయం బులచేతఁ బరితృప్తుండై యీవిధంబున ద్వాదశవర్షంబులు నజ్ఞాన కృత్యం బులఁ జేయుచు పోడశవర్షంబునఁ బంచేంద్రియంబులఁ బ్రబలుచు రాగమద మాత్సర్యంబున మత్తగజ గమనుం డగుచు జాతి వర్ణంబులు చింతింపక వర్ణాశ్రమ ధర్మంబుల వరుసలుదప్పి జీవుండు హింసా పరం దగుచు నేక వింశతివర్షంబుననుండి సంసారాంధకారంబునం దగిలి పుత్రేషణ దారేషణ ధనేషణంబు లనియెడి యీషణత్రయంబునం జిక్కు పడి నిన్నుఁ గానక యుండు. పంచాశద్వర్షంబున నుండి జవస త్త్వము లుడిగి జరాభారసంస్థలి తుండై యుండు. పంచస ప్తతి వర్షంబున నుండి శ్లేష్మ సంకలితుండై యంధకత్వంబును బధిరత్వంబునును దాసీనత్వంబును నుచ్చిష్టత్వంబును,గను. వాత పైత్య శ్లేష్మ సంకలితంబైన 'ద్వంద్వరోగంబులచేత మగ్నతఁబొంది శతవర్షంబులలో హతుండై యిహలోకంబునఁ గళేబరంబు విడిచి యాతనా శరీరధారుండగుచు యమలోకంబున కేఁగి యతి ఘోర మహా ఘోర బాధ లనియెడి నరక బాధలఁ గుందుచు ననసిప త్రవనంబులనియెడు వన భూములం గడుదుఃఖాత్ముండై తిరుగుడు వడుచుండునట. ఇవ్విధంబంతయు నే విని భయపడి, మీ యమిత కళ్యాణ గుణంబులు కొనియాడఁ దొడంగితి, నన్ను గృపఁజూచి రక్షింపవే శ్రీ వేంకటేశ్వరా ! -

151

దేవనారాయణా ! పరబ్రహ్మస్వరూపా!, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ! పురాణపురుషోత్తమా! పుండరీకవంద్యా ! కపటనాటక నూత్రధారీ ! అగణితమహిమావతారా ! సకలకల్యాణగుణవర్ణితా | సకలజగదాధారా ! ఆశ్రితకల్పభూజా ! శరణాగతవజ్రపంజరా ! " కారు ణ్యావతారనిధీ! భుక్తిముక్తి ఫలదాయకా! శంఖచక్రగదా శార్ జ్ఞాయుధ ధరా ! కోదండదీక్షాదిగురూ ! దశరథరాజతనయా ! కౌసల్యాగర్భ రత్నాకరసుధాకరా ! భరతాగ్రజా ! సౌమిత్రిభ క్తిప్రియా! శత్రుఘ్న నిరంతర సేవితా ! భక్తపరాధీనా ! ఇక్ష్వాకుకులతిలకా ! పక్షీంద్రవాహనా ! దేవాది దేవా ! 'తాటకాప్రాణాపహరణా ! విశ్వామిత్రయజ్ఞ ప్రతిపాలకా ! యజ్ఞకర్తా ! యజ్ఞభోక్తా ! 'సర్వం విష్ణుమయం జగట్' శ్రుతినికర ప్రవే శీతా ! అహల్యాశాపవిమోచనా ! పురహర కార్ముక ఖండనా ! సీతా వివాహా ! పరశురామ పరాక్రమహరణా ! చిత్రకూటాచల నివాసా ! విరాధ దైత్య సంహారకా! శరభంగదర్శనా! దండకారణ్య నిలయా! శూర్ప ణఖా నాసికాచ్చేదనా ! ఖరదూషణత్రిశిరాది చతుర్దశ సహస్ర దానవ శిరశ్చేదనా ! మారీచ మాయామృగ వేటకాఱా! యోజన బాహు ఖండనా ! జటాయు ముక్తిదాయకా ! శబరీ ప్రసన్నా ! పంచవటితీర నివాసా ! ఆంజనేయ ప్రియాలంకారా ! మాల్యవత్ ప్రవేశా ! వాలీ నిగ్రహణా ! లవణాంబుధి హల్లకల్లోలా ! దక్షిణసింధు రాజబంధనా !. విభీషణ రాజ్య స్థాపనాచార్యా ! సువేలాద్రి ప్రవేశా ! కుంభ నికుంభ మక రాక్ష ధూమ్రాక్ష 'విరూపా క్షాతికాయ మహాకాయ కంపనాకంపన ప్రహస్తరక్తవర్ణా గ్నివర్ణ సర్పరోమ వృశ్చికరోమాది రాక్షస శిర.శ్చే దనా ! ఇంద్రజిత్తుతలగొండుగండా ! రావణగిరి వజ్రాయుధా ! పం క్తికంఠ శిరశ్చేదనా ! కుంభకర్ణాపహారా ! ఛప్పన్న దేశ నిశ్చలపాలకా ! శ్రీ రాఘవేశ్వరా !.అవధారు ! శ్రీ వేంకటేశ్వరా !

152

అర్జునసఖా ! నీవు నిర్వచించిన పుణ్యంబు చేసిన దేవతల కూర్ద్వలో కంబును, పాపంబు చేసిన రాక్షసులకు నధోలోకంబును, పుణ్య పాప మిశ్రితు లయిన మనుష్యులకు మర్త్యలోకంబై న భూలోకంబును, సుజ్ఞాను లయినవారికిఁ బరమపదంబును గట్టడచేసి యొసంగి త్రిలోక బంధుండనై యున్నాఁడవు. ఎవ్వరికి నపకారము చేయువాఁడవు గావు. వారు వారు తమ తమ నేర్పు నేరముల మిమ్ముఁ గొందఱు మెప్పించి బ్రతి కెడివారును, " గొందఱు మీతో నిరోధించి పొలయువారును, ఇంతే కాని మీరు లో కోపకారులు. మీ ప్రభావంబు తెలియనివారు మిమ్ము దూరుదురు. ఎఱీఁగిన మహాత్ములు మిమ్ముఁ బొగడుదురు. ఫక్షా పరపక్షంబులు మీకు లేవు. ఇందులకు వేదశాస్త్ర పురాణేతిహాసంబులు సాక్షులు. మీదాసు లయినవారు మీకుఁగా నేప్రమాణంబయినం జేసెదరు. పంపు వెట్టు కొనుము. శ్రీ వేంకటేశ్వరా !

153

అనంతకల్యాణ గుణనిధీ ! నీవు భక్తవత్సలుఁడ వనుటకు సందేహమేలా ? అందులకుఁ బ్రహ్లాదుండే సాక్షి. శరణాగత వజ్రపంజర బిరు దుకు సందేహంబేలా ? అందుకు విభీషణుండే సాక్షి. దురితదూరుండ వను టకుఁ దర్క వాదంబు లేలా? అందు కహల్యయే సాక్షి. నీ యుదారగుణం బున కనుమానం బేల ? ఇందుకుఁ బాంచాలియే సాక్షి. ఆ ర్తజనపరాయ ణుండ వగుటకు శంక యేలా? ఇందులకుఁ గరిరాజే సాక్షి. అగణితము లయిన వేదనల నవసాదించుటకు సత్యంబు లేలా ? అందుకు ధ్రువుండే సాక్షి. ఇవన్నియు నీ మహిత ప్రభావం బగుట 'యెఱింగి నీ నామో' చ్చారణ కే శరణు సొచ్చితిని. శ్రీ వేంక టేశ్వరా !

154

ఇంద్రాదివినుతా ! నీ శరణాగతి ప్రభావంబు నెఱంగునట గౌతమ మహాముని. నీ నామకీర్తన యెఱుంగునట పార్వతి. నీ జిహ్వరుచి యెఱుంగునట విదురుండు, నీ మనోభావం బెఱుంగునట శ్రీకాంతామణి. నీ మహ త్వం బెఱుంగునట ధనంజయుండు. నీ యఖిలవిద్యా విశేషంబు నెఱుంగునట వేణునాదంబు, నీ యలంకారం బెఱుంగునట కౌస్తుభ శ్రీ తులశీవనమాలికలు. నీ జవం బెఱుంగునట వైనతేయుండు. నీ భుజ బలపరాక్రమం బెఱుంగునట శార్ జ్గ గదా ప్రముఖ దివ్యాయుధంబులు. నీ రూపవిభ్రమం బెఱుంగుదురట గోపాంగనలు. నీ భుజావి శేషంబు నెఱుంగునట వామ దేవుండు. నీ భక్తవాత్సల్యంబు వైష్ణవ భాగవ తోత్తము లెఱుంగుదురట ! నీ శౌర్యశాంత మహిమలు వైకుంఠసన్ని ధాను లెఱుంగుదురట! పూతనా హిరణ్యాక్ష రావణ కుంభకర్ణ జయ విజయాదులు నీ తేజం బెఱుంగుదురట ! నిన్ను నుతియింప సహస్ర జిహ్వుండై నను నేరండట ! శ్రీ వేంకటేశ్వరా !

155

స్వామీ ! నా ర క్తమాంనంబుల కొలందియే మదంబు; మదంబుకొలం దియే యింద్రియంబులు ; యింద్రియంబుల కొలందియే యాకా రంబు ; దీన ముదిమి ముంచుకొనిన నే నొరులకుఁ బ్రయోజనపడను. నా యత్నంబున కితరు లొడంబడకున్నఁ దామసభావంబులు తోచును. అంతట నా శరీరపోషణ బుద్దియు, దేవతాభ క్తియఁ బాపరహిత చింతయుఁ బుణ్య సంగ్రహమును యథాయథలగును. నా నేరము లేమని చెప్పుదును. నీవే దయతలంచిన నీడేరుదుముగాక ! శ్రీవేంకటేశ్వరా !

156

స్వస్తిసమస్త విస్తారా ! పురాణ పురుషో త్తమా ! శ్రీలక్ష్మి కళత్రా! కుంకుమాంకితవక్షస్ స్థల గాంభీర్యా ! సనక సనందన సనత్కుమార సనత్సుజాత నారదాది మునీంద్రవందితా ! బలివిభీషణ ప్రహ్లాదా ర్జునాం బరీషరుక్మాంగద గజేంద్ర గుహ భృగు మృడ భారద్వాజ మార్కండేయ గౌతమ దూర్వాసో వ్యాస వాల్మీకాది మునిగణ సేవితా ! శ్రుతిప్రియపూజితా ! బ్రహ్మాదిసురగణవందితా ! మృత్యుంజ యా ! త్రిమూర్త్యాత్మకా ! ఇంద్రా గ్ని యమ నిఋతి వరుణ వాయు 'కుబేరేశానా ఖ్యాష్త దిక్పాల కేశ్వరా ! క్షీరాబ్ధిశయనా ! ఉత్సాహోజ్వలా లంకార బింబా ! సమంచిత నవరత్న ఖచిత పాంచజన్య జ్వాలాభిరామా ! మత్స్యకూర్మవరాహ నారసింహ వామన శ్రీరామ రామ కృష్ణ బౌద్ధ కల్క్యా ద్యవతారా ! బలిబంధనా ! త్రివిక్రమమూర్తీ !! జమదగ్ని రామావతారా ! శంఖచక్రగదాశార్ జ్గశరాసననందకాయుధధరా ! కోదండపాణీ ! 'వేదాంత విద్యా ! మణిమయమకుటా ! పుండరీకాక్షా ! శ్రీపుణ్యకోటివరదా ! కావేటిరంగనాథా ! శ్రీ వేంకటేశ్వరా !

157

హాటకగర్భజనకా ! వేదవ్యాసవాల్మీకాది మునీశ్వరులునిన్ను సేవించి చిక్కించుకొని మోక్షం బడుగక యేరీతి నేమఱిరో ? శాస్త్రంబులు సదువుటతోఁ బరబ్రహ్మంబును వెదకెడి బ్రాహ్మణోత్తములైన విద్వాం సుల వివేకంబు లెందుఁ బోయెనో ? బ్రహ్మాది దేవతలు నిన్ను సేవించి నీ సాయుజ్యంబు వొందరై రే! వారి భాగ్యంబు లెందుఁబోయెనో ? అది యట్లుండ నిమ్ము. ఆది దేవుండై న నీ వీపు డందఱహృదయంబుల నున్నా వట ! నిన్ను భావించి వలచి యున్నారము శ్రీ మేకటేశ్వరా ! .

158

కరుణావరుణాలయా ! అతిప్రజ్ఞావిలసితము, అత్యంతమనోహరము, జీవనదీప్రవాహంబు చందంబున నెడ తెగక కల్పాంతంబుదాఁకఁ బాఱుచుండు నదియు నీ లీలా విభూతిమయము నగు నీ విశ్వమును బ్రవ్య కంబుగాఁ దోపించుచు జీవుల బ్రమయింపుచునో దేనా ! కర్తవైన నీ వేల యవ్య క్తుండవై యంతర్యామివై యందక పొందక యడఁగి యుఁటివన్నా ! అగపడినచో నార్డులయలజడి హెచ్చగునని వెఱపా ? వారికి నీవుగాక దిక్కెవ్వరు ? నోటిమాట చెవి వినునంతలో నార్తులమొఱనీ వాలకింతువట ! ధూర్తుల కెంతకు నందరానంత దూరమునమందు వట, ఆర్తత కెంతటి 'యోగ్యతనతికించితివి ! ఇంత దయతో మమ్ముఁ గాచుచున్న నినుఁగన్నులకరవుదీరఁ గనుఁగొనఁగోరు కొనుచున్నా రము. ఈ మనుగడనే మాకోర్కిఁగడ తేర్పవయ్యా శ్రీ వేంకటేశ్వరా !

159

ఆదిశేషశయనా ! ఉపవాసవ్రతంబుల నిన్ను సాధించెద మంటిమా యది సముద్ర సేతుబంధనంబు. నీ వేయుపాయంబుల చేతను నసాధ్యుం డవు, ఇందుకు దృష్టాంతంబుగ నీ శరణంబు సొచ్చి ప్రహ్లాద నారద శుక భీష్మ విభీషణ కరి శబర్య క్రూర విదుర హనుమ త్ప్రభృతులైన భాగ వతులు లోకంబులఁ బ్రఖ్యాతులై రి. ఇది మాకు దృష్టాంతంబని నిన్ను నొక్కని భజియించి నిశ్చింతంబున నుండెదము శ్రీ వేంక టేశ్వరా !

160

కరుణాకటాక్షా : నీ వుభయ సేనామధ్యంబున నిరాయుధుండవై యర్జునునకు సారథ్యంబు సేయునాఁడు నీ దాసుండైన భీష్ముండు నీచేతఁ జక్రంబు నెత్తించే. నీ కూతురైన గంగాభవాని హరుని జటామకుటం బెక్కె. నీకుఁ బానైన శేషుండు బ్రహ్మాండంబు నెత్తి కెత్తుకొనియె. నీకు వాహనంబై న ఖగేంద్రుం డింద్రాదుల నోడించి యమృతంబుఁ గొనియె. నీకుదాసుండై న ధ్రువుండు బ్రహ్మలోకంబు నాక్రమించె. నారదుఁడు దేవాసురులకుం బోరు వెట్టుచున్నాఁడు. రుక్మాంగదుండు యమలోకంబుఁ బాడుసే సె. శుకుండుముక్తిఁ 'జూరగొనియె. నీకు బంటైన యాంజనేయుం డమరుల క భేద్యమైన లంకానగరంబు దహనంబు సే సె. నీకు భక్తుండైన కుచేలుండు పిడి కెఁడడుకులు సమర్పించి సంపద లనుభవించే. ఈరీతి నీదాసులు నీవిచ్చిన సలిగను నీకంటెఁ బెచ్చు పెరుగుచున్నారు. 'నీ దాసులకిచ్చిన చనవులును నీ సేవాప్రభావంబులును లోకంబునం జెల్లుబడియై చెల్లుచుండఁ జేసితివి. నీ కింకరుల చరిత్రంబులును, నీ 'యుదారత్వంబును వినియు నిన్నుఁ బొగడుచున్నారము శ్రీ వేంక టేశ్వరా !

161

దేవా ! బ్రహ్మరుద్రాది దేవతలైన దేవతాగణంబులు రాక్షసుల ఖండించిన హింసా ధర్మంబు లంటవట ! అప్సరోగణంబుల వలసి నట్లనుభవించిన వ్యభిచారంబులు లేవట ! సోమపాన పురోడాశ భక్షణంబులు పుణ్యంబు లయ్యెనట ! ప్రసన్ను లైన మీదాసులకు నేమిచేసిన దోషంబు లేల కలిగెడిని. అందఱికిని నీవు గల్పించిన సాధారణ సహజ కర్మంబులవి. ఇందఱికి నీ వంతర్యామివి. నీవు విరహితంబుగాఁ జేసెడి కృత్యంబు లెం దున్నవి. పుణ్య పాపంబులు సెప్పెడి పురాణంబులు మహర్షులకు సువ్రతంబిచ్చిన నీ కింకరులకు దురితంబులు లేవని యప్పణ యియ్యవే శ్రీ వేంక టేశ్వరా !

162

స్వామీ ! అయస్కాంతంబునకు ముఖంబు చేసి చూచిన సూదులతి త్వరితంబు నంటుకొనినయట్లు స్త్రీలకుఁబురుషులకు నన్యోన్యావ లోకంబునకు నంటుకోనం 'జేయుచున్నది నీ మాయ. అది యెట్టు తప్పించు కొనవచ్చును ? తింత్రిణీశలాటువులు బాలకు నోరూర్చినట్లు సువర్ణంబునకుఁ జిత్తంబు లాసపడం జేయుచున్నది నీ ప్రభావంబు. ఇది యెట్లుగాదని త్రోయవచ్చు. దొంగిలించుక పోవంగాఁ దలవరులు 'పాశంబులఁగట్టి తెచ్చి ద్రవ్యంబులు దొంగల 'మెడఁ గట్టి యేఁగించినట్లు చేసినకర్మంబు లనుభవింపంజేయుచున్న నీ సామర్ధ్యంబు నేరీతిఁ దప్పించుకొనవచ్చు ? ఇంక నీజీవుల కే చందంబుగా నిక్కట్లు దీరికడతేర వచ్చు ? అమృతపుఁగుండ యొద్ద నుండఁగాను నాఁకట నలయ నేమిటికి ? నీవు నాకుఁ గలవు. నీ పాదంబులు గొలిచి బ్రతికెదను. శ్రీ వేంకబేశ్వరా !

163

నాగకంకణ చాపఖండనా ! తాను దొలుజన్మంబునం జేయు కర్మంబులనుభవింపక పోరాదు. అది మాకు శక్యంబుగాదు. మేము గావిం చిన నేరఁబులు మా మీఁద నుండఁగాను నీకు నేమని విన్నవించుకొని యెదము. నీ దాస్యం బను వజ్రపంజరమున్నది. నీ నామస్మరణంబు లని యెడి ఖడ్గంబులున్నవి. నీవే మాపై దయఁదలంచి విచారించెదవు. శ్రీ వేంక టేశ్వరా !

164

అమృతమథనా! మహార్హులు మిమ్ముఁ గోరి యతిఘోరతపంబుఁజేతురు. పశులు దేహంబుల గూళ్లు పెట్టి , నఖశిఖపర్యంతమును జీమల పుట్టలఁ బెట్టు నట ! ఇటువంటి నియమంబులు చేసికొని నిన్నెట్లు ధ్యానంబుఁ జేసి మెప్పించెదము. ఈ మార్గంబులు. మావంటివారికి నతిదుర్లభంబులు నీకుఁ జేతులెత్తి మ్రోక్కం గలవార మింతియగాని యింత లేసి పనులకు సమర్థులముగాము. నిన్ను నొడంబఱచి యొక విన్నపంబుఁ జేసెదము. నిన్నుఁ దెలియక మాయకు లోనైనంతగాలంబు నీ లీలకు లోనైన వారము. తెలిసితిమేని నీ దాసులయ్యెదము. అటుగావున యీ రెండు తెఱంగుల నీవారమే. ఈ విధంబుననుండి నీవుచేసిన చేఁతలయ్యె. నన్ను నీ వెప్పుడైన రక్షింపకతప్పదు. నీకు నాకు స్వామిభృత్య న్యాయంబు తప్పదు. సిద్ధంబు. ఇట నీ నామంబును మఱవనివాఁడను.. తొల్లి నీవు రామావతారంబున విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణంబుఁ జేసి జనకునింటికిఁ బోవుత్రోవను నహల్యయు దృణగుల్మల తాదులు నీ పాదంబులు సోకి పావనంబయ్వెనట ! అవి యే తవంబులఁ జేసినవి. మాకును నీ షాదంబులే గతి. శ్రీ వేంకటేశ్వరా !

165

మాయాశరీరధారీ ! కామాతురుండై న జీవుండు నీ పాదంబుఁ దలంచెనేని యాకాంతదేహంబకాని ప్రకాశమానంబైన నీ పాదంబు తనమనంబు లోపలికిరాదు. తాఁ దొల్లిఁ జూచిన రూపభావంబు లోపలికిఁ జూచిన విరహంబుఁ బుట్టించుఁ గాని ఫలంబులేదు. దీనికి బాహ్యంబులైన యింద్రియద్వారంబులు వెలుపలికి సాధనంబులు. తన మనస్సే తన్నుఁ లోనికింద్రిప్పు. అటుగావున నీ సాధనంబుల చేతను వెలుపల నీ మూర్తులు దర్శించి యా రూపంబులు, తన మనంబున ధరించి నిన్నుఁ గనుగొనుచుండెనేని బ్రహ్మానుభవమై విలసిల్లి ఫలియించును. ఇవి రెండును నీ మహిమలే. వివేకించి నేర్చినవారికి యరచేతిలోనిది ముక్తి. శ్రీ వేంకటేశ్వరా !

166

రమాకళత్రా ! నీవు విరజానదీతీరంబున వైకుంఠనగర వాసుండవై ముక్తా రత్న వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాద్యలంకార శోభితంబైన మేడమాడుగులయందు మాణిక్య శోభితంబైన సహస్ర 'ఫణంబులఁ బ్రజ్వరిల్లెడు నాది శేషుండు నీకుఁ బానుపై శోభిల్లఁగా,


శ్రీదేవీ భూ దేవీ నీళా దేవులు నీకుఁ గైంకర్యంబులు చేయఁగా, శంఖ చక్ర గదా శార్ జ్గ కోదండా ద్యాయుధంబులు రూపములు ధరియించి సేవసేయంగా, విష్వక్సేన వై నతేయాదు లుభయచామరంబులు; వేయగా, సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది భక్తులు సేవింపంగాఁ, దుంబురు నారదాదులు నిరతముఁ బాడంగా, సప్సరసలు నృత్యములు సలుపంగాఁ, గిన్నర గంధర్వగీర్వాణ యక్ష పన్నగ గుహ్యకులు స్తుతులు సేయంగాఁ,, బరమేష్టి. ఫాలలోచన పాకశాసనని వైశ్వానర యమ వరుణ వాయు నిరృతి కు బేరేశానాఖ్యాష్ట దిక్పాలకులును, నవబ్రహ్మలు, నేకా దశరుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, సప్తమరుత్తులు, చిత్రగుప్తులును, నవగ్రహంబులును, సప్తసాగరం బులును, సప్తనదులును, సప్తకులపర్వతంబులును, కృతయుగాది చతుర్యుగకన్యలును, వినయ విధేయతలం గొలువఁగా, సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యం బులం బొందిన పుణ్య పురుషులు మీ పురంబున మెండై చెలంగుచుండ నవనిధులు, నై రావతో చ్చెళ్ళవః కామధేను కల్పవృక్ష చింతా మణ్యాదులచే నయిన య షైశ్వర్యంబులు శోభిల్లఁగాఁ, బేరోలగంబునఁ పెద్దకొలువై కూర్చుండి మనవిచనవులు పాలింపుచు, నభయ ప్రదా నంబు లిచ్చుచు మందస్మిత వదనారవిందుండవై యుండియు, సర్వజీవ దయా పర్వతంబున సనంతరూపంబులు దాల్తునట ! మత్స్యావతారంబున సోమకాసురు మర్దించి వేదంబులు బ్రహ్మకు నొసంగితివట ! కూర్మావ తారంబున మందరగిరి మోసి నీ దాసులయిన సురలకు సకలైశ్వర్యం బులు సమకూర్చితివట ! వరాహావతారుండవై హిరణ్యకశిపు మర్దించి పృథివిఁ జాపచందంబునఁ బఱపితివట ! నరహరిరూపఁబుఁ దాల్చి హిరణ్యాక్షు మర్దించి నీ భక్తుఁడైన ప్రహ్లాదుఁ గాచితివట ! వామనావ తారంబున బలిని బంధించి పాతాళంబునకుఁ ద్రోచితివట ! ఫరశు


రామావతారంబునఁ గార్తవీర్యార్జునాదిచ్చప్పన్న దేశరాజుల మర్దించి వారలకళేబరంబులు స్వర్గసోపానంబులు చేసి పితృదేవతల మోక్షానకు నిలిపితివట ! రామావతారుండనై తాటకా ప్రాణాపహరణంబును, విశ్వా మిత్ర యజ్ఞ పరిపాలనంబును, నహల్యాశాప విమోచనంబును, శ్రీకంఠ చాపఖండనంబును, సీతావివాహంబును, భార్గవగర్వాపహరణంబును, యౌవరాజ్య విఘ్నంబును, గుహ సంభాషణంబును, జటావల్కల ధార ణంబును, భరద్వాజసంతోషణంబును, జిత్రకూటాద్రి నిలయంబును, భరతునకుఁ బాదుకాద్వయం బొసంగి మన్నించుటయును, విరాధవధ యును, శరభంగుం గాచుటయును, నత్ర్యనసూయల చేశఁ బూజల నందుటయును, నగ ప్త్య సుతీక్ష్ణ, మతంగాది సకల మునివరుల యాశ్రమం బులం బ్రవేశించుటయును, మునుల కభయప్రదానంబు లొసంగుటయును,బంచవటీతీరంబున నుండి శూర్పణఖా నాసికాచ్చేదంబును, ఖరదూషణాది చతుర్దశ సహస్రదానవాపహరణంబును, మారీచమారణంబును, జటాయువుకు మోక్ష మిచ్చుటయును, గబంధవధయును, శబరిచేఁ బూజలందుటయును, వాలి మర్ధనంబును, సుగ్రీవునికిఁ గిష్కింధా పట్టంబుఁ గట్టుటయును, దర్భశయనంబును, గంధినాథు నంపతుదికి దెచ్చుటయును, నేతుబంధనంబును, సువేలాద్రినిలయంబును, రావణ కుంభకర్ల మేఘనా దాతి కాయ మహాకాయ ధూమ్రాక్ష యూపాక్ష శోణితాక్ష మకరాక్ష ఖడ్గరోమ వృశ్చికరోమ సర్పరోమా గ్నివర్ల కంపనా కంపన ప్రహస్తాది సకల రాక్షసప్రాణాపహరణంబును, విభీషణ లంకా సామ్రాజ్య పట్టాభిషేకంబును, బుష్పకారూఢులై వచ్చి యయో ధ్యాధిపత్యంబున నేకాదశసహస్రవర్షంబులు పాలించుటలును, హల ధరావతారంబున దుష్ట రాక్షస సంహరణంబును, గృష్ణావతారంబున బాల క్రీడా వినోదంబులును, గోపాలకత్వంబును, బూతనా శకటాసుర కుక్కుటాసుర ధేనుకాసుర బకాసుర వత్సాసురాది దుష్టరాక్షస

గర్వాపహరణంబును, గోవర్ధనగిరి యెత్తుటయును, గోనిర్మితంబును, గోపాంగనా జారత్వంబును, గంస శిశుపాల నరకాసుర 'బాణాసురాది దుష్ట నిగ్రహంబును, ద్వారకా నిర్మితంబును,నర్జునసారథిత్వంబును, దుర్యోధనకులాంతకంబును, విదురా క్రూర ముచికుందాదీ భక్తజన కటాక్ష వీక్షణంబును,గల్క్యవతారంబున దుష్టనిగ్రహంబును, శిష్టప్రతి పాలనంబును, వర్ణాశ్రమ ధర్మంబులు నిర్ణయించుటయును, నిట్లు యుగయుగంబుల నవతారంబు లెత్తి ధర్మంబు నిర్వహించుటయును, సర్వజీవ దయాపరత్వంబునం దామ్ర శిలా మృణ్మయ దారువులందుల నుండి భక్తుల రక్షించుటయు, మఱియు గృహే గృహే తిరువారాధన రూపంబులై వెలసి భక్తులఁ గటాటింపుచుండుటయు జరపుదు వనిన నీ ప్రభావంబు లేమని వర్ణింపవచ్చును. అణు రేణుతృణకాష్ఠ పరిపూర్ణుండవై నిండియుండుదువట ! ఇటువంటి నీప్రతాపంబులు విని యిందున నొక యుపాయంబుఁ జింతించితిని. నకల జీవులయందును బరిపూర్ణుం డవు కనుక, నాయందు నీవుండుటం జేసి నాచేయు కృత్యా కృత్యములు నీవే చేయుటగా, నీకే ప్రీతియని నిశ్చయించి, యన్ని నేరములను నీ మీఁదనే మోపి నేను తేరకాఁడ నయితిని. కర్తా భోక్తా జనార్దన యను శ్రుతివచనము ప్రకారమునఁ జేకొని, నన్నఁ గటాక్ష వీక్షణంబుల నీ దాసానుదాసునిఁగా నెంచి రక్షింపుము. శ్రీ వేంకటేశ్వరా !