శ్రీరంగమాహాత్మ్యము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

కవివంశము

ఈశ్రీరంగమాహాత్మ్యమును వ్రాసిన కవి కట్టా వరదరాజేంద్రుండు. ఇతఁడు వేంకటేశ్వరభక్తుఁ యడనియు, యతిరాజస్వామి యను వైష్ణవగురువు శిష్యుఁ డనియు, హరిదాసరాజ కృష్ణాంబా సతీరత్నములకుఁ బుత్రుఁ డనియు నతని కృత్యాదివలనఁ దెలియవచ్చుచున్నది. ఈతఁ డొక ప్రభుఁ డైనట్లును, వ్రాతలోఁ గృత్యాదియందు స్వప్నవివరములు మొదలగునవి యాము క్తమాల్యద ననుకరించె ననియుఁ గూడఁ జూడ నగును. ఈఁతడు తాను సూర్యవంశమువాఁడ ననియు, కపికాళచోళవిభు, బిజ్జలరాజుల సంగతివాఁడ ననియుఁ చెప్పుకొనినాఁడు. కావున క్షత్రియుఁ డని చెప్పుకొనుట కవి మతఠము. ఇతఁడు దానచింతామణి యనియుఁ దెలియుచున్నది. ఇతఁ డళియరామరాజు పెదతల్లి కుమారుఁ డని శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు తాము ప్రకటించిన భైరవుని గ్రంథ పీఠికలో వ్రాసి యున్నారు. కాని దాని కాధారములు చూపరైరి.

కవికాలనిర్ణయము

ఇదివఱకు వ్రాసిన శ్రీరంగమాహాత్మ్యములను గూర్చియు, భైరవకవి, వరదరాజకవుల కాలనిర్ణయమును గూర్చియు శ్రీ వంగూరి సుబ్బారావుగారు హితకారిణి {29-12-17 ; 1_1_18) ఆంధ్రపత్రిక (రౌద్రి, పుష్య, బ 13 శనివారము) లలో విపులముగఁ జర్చించి యున్నారు.

భైరవుని కాలనిర్ణయమును గూర్చి శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు తద్గ్రంథపీఠికలో క్రీ॥శ॥ 1500 లకుఁ బూర్వుఁ డనఁగల్గిరి కాని శ్రీ వంగూరి సుబ్బారావుగారు ఆంధ్రపత్రిక సారస్వతానుబంధము (రౌద్రి, పుష్య, బ 13 శనివారము) లో నిట్లు వ్రాసిరి.

"కావునఁ బోతరాజు పై శాసనము ననుసరించి శా॥శ॥ 1298 లో నుండఁగా నాతని తమ్మునిపుత్రుఁడు గౌరనయు నాతనిపుత్రుఁడు భైరవుఁడును క్రీ॥శ॥ 1377 ప్రాంతముల నుందురు గాని పై మువ్వురు చరిత్రకారులును సూచించిన కాలములో నుండుట పొసగదు."

భైరవుఁడు గౌరనసుతుఁడే యైనచో దప్పక క్రీ॥శ॥ 1400 పై నున్నవాఁడనుట స్పష్టము. అనఁగా 15 వ శతాబ్దారంభమువాఁడు. వరదరాజు శ్రీ కవిగారు పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/3 పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/4 పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/5