శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 6

వికీసోర్స్ నుండి

మును, తపస్సును కావలెను. తపస్సనగా బాహ్యకరణములను, నంతఃకరణములను స్వాధీనముచేసి మనస్సు నేకాగ్రముగ నిలుపుట. శరీరమును కష్టపెట్టుట కాదు.

(6)

ఏల గమనింపవలెను ?

“అంతయు సరియే కాని బుద్ధికగోచరమయిన యిట్టి తత్త్వమును మానవు డేల గమనింపవలెను? తెలియరాని విషయమును గూర్చి చింతించియు పరిశోధించియు నేమి ఫలము?” అను ప్రశ్న యుదయించును. దీనికి సమాధాన మేమనగా :- భౌతికశాస్త్రవిచారమునకు గురికానిదయి నంతమాత్రమున, నుండవలసినవన్తు వుండకపోదు. మనము తాకి, కని, మూచూచి, విని, ఆలోచించి, గ్రహించిన విష ములకు పైగా నంతటికి నాధారమైన మొదలికారణము ఒకటున్నదనుట నిశ్చయము. దానిని తాక వీలులేదు; దాని రూపమును తెలియ వీలులేదు; దాని గుణములు బుద్ధికి గురికావు. అయినను నది యెల్లెడల అన్ని విష యములందును కలిసి నిలిచియుండును. సకలపదార్థములను సకలశక్తులును మనుష్యుని స్వరూపమునందుండు అంతయు నీయరయరాని వస్తువుచే నావరింపబడియుండుట నిజము. ఇట్టి యొక గొప్పతత్త్వమును గమనింపక యెట్లుండవచ్చును? కావున నాపరవస్తువును గమనింపక విడుచుటకు వీలులేదు. చీకటిగదియందు ఫలానిదియున్నదని తెలియ వీలులేదుగదా! అయినను దానిలో నొక ముఖ్యమయిన వస్తువు రూఢిగా నున్నదని తెలిసియున్నయెడల నాచీకటిగదిని గమనింపక విడువవచ్చునా?

గణితశాస్త్రజ్ఞులను బ్రశ్నించినయెడల ననేకవిషయము లలో గణితపథకములను లెక్కవేసి చూపుటకు సాధ్యము కాదని చెప్పుదురు. అయినను ముఖ్యములగుననేకవిషయము లను గణితముచేయుచు వచ్చుచున్నారు. అట్టి గణితమునాధా రముగాగొని కట్టడములనుకట్టియు, యంత్రములను చేయుచు న్నారు. వృత్తముచుట్టుకొలతకును, దానిమధ్య రేఖకొలతకును గల పరస్పరసంబంధ మేమి? ఒక సమచతుష్కపు భుజమునకును దానికర్ణమునకునుగల పరస్పరసంబంధ మేమి? అనిననిట్టి సాధారణవిషయములను గూడ గణితముచేసి సంఖ్యారూప ముగ తెలియ జేయుటకును వీలులేదు. నాలుగునకు వర్గ మూలమురెండు, తొమ్మిదికి వర్గమూలము మూడు, అనిచెప్పి నట్లు, రెంటికివర్గమూల మేమనియడిగినయెడల దశాంశములలో నైనను, సాధారణ భిన్నములోనైనను సరిగా గణితముచేసి చెప్పవీలులేదు. అయినను నీతెలియరాని లెక్కలమేర నతిక్ర మించి గణితశాస్త్రజ్ఞులు కట్టడములు, పెద్దవంతెనలు, ఆన కట్టలు మొదలైనవానిని కట్టుటకు నిపుణులగుచున్నారు. అదేవిధముగా దైవము. ధర్మము అనునవి పరిశోధనకులొంగ వను కారణమునుబట్టి వానినిగూర్చి విచారింపక విడిచిపెట్టుట సరికాదు. వేదము, ఉపనిషత్తులు, గీత మొదలైన గ్రంథము లందు చెప్పబడిన విషయముల మితి, ఆధారము, రూపము మొదలగువానిని నిరూపించి, నిశ్చయింప వీలులేకున్నను నవి చాలముఖ్యములైన విషయములు; జీవితమునకు మిగుల నావశ్యకములు.

గణితము, భౌతికశాస్త్రము, రసాయన శాస్త్రము మొదలైన విజ్ఞానశాస్త్రముల ప్రథమాధ్యాయములో నెట్టి స్పష్టములగు భావములు తెలుపబడియున్నవో యంత స్పష్టముగా గీతయందును, నుపనిషత్తులందును గూడ తెలుప బడియుండలేదని యివి యాధార రహితములగు గ్రంథము లని యెంచగూడదు. ఇంద్రియాతీతములగు అధ్యాత్మవిషయ ములను విచారించి, జ్ఞానమును సంపాదించుటకు మన తెలివి యు, బుద్ధియు మాత్రము చాలవు. వీనికి జోడుగ భక్తి, మనశ్శుద్ధి, తపస్సు, ధ్యానములును నావశ్యకములు. ధ్యాన మును, తపస్సును గలవారికీగ్రంథము దారి చూపించును.

కాయశుద్ధితోడను, మనశ్శుద్ధితోడను ధ్యానించి పరమాత్మను ప్రార్థించినయెడల, ప్రథమమున విపరీతముగను పరస్పరవిరోధములుగను, అర్థరహితములగు పదములుగను తోచినవికూడ, తరువాత అర్థరహితములై కాన్పించును. మన స్సునకు గురియైనవిషయము ప్రకాశముపొంది ప్రజ్వలించును. ఆవిధమున భగవంతునిదయను పొంది యంతరాత్మనుండి కని యానందించు విషయము నితరులకు వ్యక్తము చేయుటకు శక్తిలేకపోయి యుండవచ్చును. కాని యట్టి యనుగ్రహ మును, ఆనందమును సత్యములే.

(7)

శాస్త్రమును పఠించు క్రమము

ఏమతమునై నను సంప్రదాయమునై నను సరిగ తెలిసి కొనుటకు ద్వేషము, తిరస్కారము కల బుద్ధితో ప్రవర్తింప కూడదు. ఒకవిషయమును ద్వేషించిన నావిషయతత్త్వము గోచరింపదు. "మోసగాండ్రయి మనలను వంచించుటయే వీరి యుద్దేశమై యున్నది. ఏదో లాభముకొరకసత్యమును, మోసమును చేర్చి మతముల నేర్పరిచి, స్మృతు లను పురాణములను పూర్వులు వ్రాసినా" రనిపఠింప తొడగితిమేని నొకటియు తెలియదు. ఇట్లెంచుట మూఢ త్వము. మన కిప్పుడున్న జ్ఞానమును, జాగ్రతయు, సందేహ భావమును నాకాలపు జనులకు నుండెను. వారంద రును మూఢులనియు, మిక్కిలి సులభముగ వలయందు చిక్కిపోయిరనియు నెంచుట తప్పు. మనకున్న బుద్ధి. చురుకు