శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 14

వికీసోర్స్ నుండి

(14)

కర్మయోగమే యజ్ఞము.

(గీత: అధ్యాయములు 4, 5, 6.)


వేదములో యజ్ఞముచేయవలెనని విధింపబడియున్నది. యజ్ఞము లేక వేల్మిలోని ముఖ్యాంశము త్యాగము. స్వార్థమును ఆశను వీడుటయే యజ్ఞసారము. కావున వేల్మి అను నది పలువిధముల జేయగూడిన దైవపూజ. ఇట్లు పలువిధ ముల జేయబడిన హోమములకు వేదములలో జెప్ప బడిన ఫలముండును. మోక్షమును గోరువాడు కార్యమును జేయుట విడిచిపెట్టి యూరకుండవలెనని తలపక, తప్పక సకల కార్యములను యజ్ఞముననే చేసికొని విముక్తినిజెందవచ్చును. స్వార్థమును విడిచి చేసినకర్మ మొక యజ్ఞమే యగును.


యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనం
నాయంలోకో౽స్త్యయజ్ఞస్య కుతో౽న్యః కురుసత్తమ.


హోమము చేయగా మిగిలినది అమృతమగును. దానిని సేవించువారు మరణములేని పరమపదమును పొందుదురు. వేల్వనివారి కీలోకము లేదు. ఇక వారికి పరలోక

మెక్కడిది! 4-31


ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే
కర్మజాన్ విద్ధితాన్ సర్వానేవమ్ జ్ఞాత్వా విమోక్ష్యసే.


వేదములలో పలువిధములగు యజ్ఞములు వివరముగ చూపబడి యున్నవి. అవి యెల్ల కర్మములను జేయుటవలన నేర్పడినవి. దీనిని దెలిసిన విముక్తి బొందుదువు. 4-32


శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప
సర్వం కర్మా ఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్య తే.


ద్రవ్యములతో చేయబడిన వేల్మికంటె జ్ఞానముతో జేయబడిసయజ్ఞమే మేలైనది. ఎట్టిపనియైనను జ్ఞానమునందు ముగింపు నొందుచున్నది. 4-33

జ్ఞానయజ్ఞ మనునది జ్ఞానముతో జేయబడిన వేల్మి. నేయి మొదలగు ద్రవ్యములులేకయే జ్ఞానమనుద్రవ్యముతో చేయబడుయజ్ఞము జ్ఞానయజ్ఞము. అనగా లౌకిక వ్యవహార మునకు కావలసినపనులను విధిగ జేయుట. ఏకర్మముజేసినను ఆకర్మము ఫలమును గూర్చి యాశను విడిచి, మనస్సును నిలుకడ పరచునదే జ్ఞానము. దీనిచే రానురాను భేద భావములుపోయి, సకలజీవులందును తనయాత్మ నిలుచుట చూచును. అట్లే యెల్లజీవులును పరమాత్మ యందడగి నిలుచుటయును జూచును. దీనిని చూడచూడ నిష్కామియై కర్మమును చేయుట సులభమగును. కర్మమును చేయునపుడు దానిని ప్రేరేచు నుద్దేశమును బరిశుద్ధము చేసికొనినయెడల పాపమును, కర్మబంధమును మనలను చేరవు. ఇట్టి పరిశుద్ధ మైన యుద్దేశము గలిగి చేయుటయే జ్ఞానము.


యథైధాంసి సమిద్ధో౽గ్ని ర్భస్మ సాత్కురు తే౽ర్జున
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా.


బాగుగ మండుచున్న యగ్ని కట్టెల నెట్లు బూడిదగ చేయునో, అట్లే జ్ఞానాగ్నియనునది ఎల్లకర్మములను కాల్చి బూడిదగ జేయును. 4-37


నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
తత్స్వయం యోగసంసిద్ధః కాలే నా౽౽త్మని విందతి.


జ్ఞానమువలె పవిత్రమైన వస్తువు యీలోకమున వేరేదియు లేదు. యోగములో బాగుగా నిలిచినవాడు తగిన కాలమున నీజ్ఞానమును తనకు తానే పొందును. 4-38


యోగసన్న్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ.


యోగమార్గమును గొని తానుచేయు కర్మములందు సంగమునువిడిచి, జ్ఞానముచే సంశయమును పోగొట్టుకొని, తన్ను తానే కాచుకొనిన వానిని కర్మములు కట్టచాలవు. 4-41


తస్మా దజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసి నాత్మనః
ఛిత్వైనంసంశయం యోగ మాతిష్ఠోత్తిష్ఠ భారత.

కావున అజ్ఞానముచేగలిగిన సంశయమును. జ్ఞానమను

కత్తితోకోసి, యోగము నవలంబించి, కర్మములను చేయ నిశ్చయించి నిలువుము. 4-42

ఈజ్ఞానమును మనము పొందినపిదప, సాంఖ్యమార్గమునకును, యోగమార్గమునకును, అనగా జ్ఞానమార్గమునకును నిష్కామయోగమార్గమునకును గల భేదమంతయు విడిపోవును. జ్ఞానమును కర్మమును చేరినచో కర్మయోగమగును. సన్న్యాసమును, స్వార్థమును విడిచి యాచరించు కర్మయోగమును, ఒక్కటేయగును.


సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః
ఏక మప్యాస్థిత స్సమ్య గుభయోర్విన్దతే ఫలం.


సాంఖ్యమును యోగమును వేర్వేరనిచెప్పువారు తెలి యని పిల్లలవంటివారు. తెలిసినవారట్లనరు. వీనిలో నేదొ యొకదానియందు బాగుగానిలిచిన వాడు రెంటిఫలమును పొంద గలడు. 5-4


అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
స సన్న్యాసీ చ యోగీచ న నిరగ్ని ర్న చాక్రియః


ఫలమునెదురుచూడక, చేయవలసిన దానిని చేయు వాడె త్యాగి; యోగియునతడే. అగ్ని నారాధించుట మానిన

వాడునుకాడు. కర్మములచేయనివాడునుకాడు. 6-1


యం సన్యాసమితి ప్రాహు ర్యోగం తం విద్ధి పాండవ
న హ్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన.


దేనిని సన్యాసమని అందురో యదియే యోగమని తెలిసికొనుము. దీనిని పొందుటకు దీనిని చేసెదను, దానిని పొందుటకు దానిని చేసెదను, యను తలపును విడువనివా డెవడును యోగి కాజాలడు. 6-2


(15)

కర్మయోగమే సన్న్యాసము.

(గీత: అధ్యాయములు 5, 18.)


ఒకడు స్వార్థదృష్టిని, ఆశాబంధమును విడిచి, లోక మంతయు నొకటే యనుజ్ఞానమును పొందినపిదప సకల లౌకికకర్మలను చేసికొనుచునే యున్నను వాడు సన్న్యాసియే యగును.


యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వ న్నపి నలిప్య తే.


యోగముతోగూడి యాత్మశుద్ధి నొందినవాడు, తన్ను తాను గెలిచినవాడు జితేంద్రియుడు ఎల్లప్రాణులును తానే