Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 15

వికీసోర్స్ నుండి


యం సన్యాసమితి ప్రాహు ర్యోగం తం విద్ధి పాండవ
న హ్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన.


దేనిని సన్యాసమని అందురో యదియే యోగమని తెలిసికొనుము. దీనిని పొందుటకు దీనిని చేసెదను, దానిని పొందుటకు దానిని చేసెదను, యను తలపును విడువనివా డెవడును యోగి కాజాలడు. 6-2


(15)

కర్మయోగమే సన్న్యాసము.

(గీత: అధ్యాయములు 5, 18.)


ఒకడు స్వార్థదృష్టిని, ఆశాబంధమును విడిచి, లోక మంతయు నొకటే యనుజ్ఞానమును పొందినపిదప సకల లౌకికకర్మలను చేసికొనుచునే యున్నను వాడు సన్న్యాసియే యగును.


యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వ న్నపి నలిప్య తే.


యోగముతోగూడి యాత్మశుద్ధి నొందినవాడు, తన్ను తాను గెలిచినవాడు జితేంద్రియుడు ఎల్లప్రాణులును తానే యని యెంచువాడు, పనులను చేయుచున్నను అవి యతని నంటవు. 5-7


కాయేన మనసా బుద్ధ్యా కేవలై రింద్రియై రపి
యోగినః కర్మ కుర్వన్తి సంగం త్యక్త్వా౽త్మశుద్ధయే.


యోగులు స్వార్థమును సంపూర్ణముగవిడిచి యాత్మ శుద్ధికొరకు శరీరముతోను, మనసుతోను, బుద్ధితోను, కేవల మింద్రియములతోనుగూడ పనులను చేయుచుందురు. 5-11

కర్మములను సంగములేక చేయుట, సన్న్యాసమార్గము ననుసరింప ప్రయత్నము చేయుటకంటెను మేలైనమార్గమని గీతలో పలుచోట్ల పలువిధముల నొత్తి చెప్పబడియున్నది. కడపటి యధ్యాయమునకును పేరు 'సన్న్యాసయోగ'మని చెప్పియున్నను నాయధ్యాయము నారంభమందే భగవం తుడు ఇట్లు చెప్పుచున్నాడు.


కామ్యానాం కర్మణాంన్యాసం సన్యాసం కవయో విదుః
సర్వకర్మఫల త్యాగం ప్రాహు స్త్యాగం విచక్షణాః.


ఫలముల నాసించి చేయు పనులను విడుచుటయే సన్న్యాసమని జ్ఞానులు తెలిసికొందురు. కర్మముల ఫలములను మొదలంట విడుచుటయే త్యాగమని వారు చెప్పుదురు. 18-2


నియతస్యతు సన్న్యాసః కర్మణో నో పపద్య తే
మోహాత్తన్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః.

చేయవలసినపనిని విడుచుట తగదు. మోహముచేత

దానిని విడిచిపెట్టుట తమోగుణముచే గలుగునని చెప్పు దురు. 18-7


కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే౽ర్జున
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః.


నియమింపబడిన కర్మమును చేయునపు డిది చేయ వలసినదని చేయుచు సంగమును, ఫలమును, గణింపక యొకడు విడిచిపెట్టినయెడల నాత్యాగమే సాత్త్విక మన బడును. 18-9


నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మా ణ్యశేషతః
యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీ త్యభిధీయతే.


దేహధారిచే పనులను మూలముట్టుగ విడిచిపెట్ట వీలులేదు. ఎవడు తాజేయు పనులఫలమును విడుచునో వాడే త్యాగి యనబడువాడు. 18-11

దీనినే బాగుగ స్పష్టముచేసి లోకనాధుని యనుగ్రహమునే నమ్మి, సకలమునతని కర్పణముగా చేయవలెనని క్రింద చూపిన శ్లోకములలో జెప్పబడియున్నది.


సర్వకర్మా ణ్య పి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పద మవ్యయం.

నన్నే యాశ్రయముగ గొన్నవా డెల్లపనులను నెప్పుడును

జేసికొనుచున్నను తరుగని నిత్యపదవిని నాయనుగ్రహముచే పొందగలడు. 18-56


చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్త స్సతతం భవ.


చేయుచేతలనెల్ల నాకే యర్పణచేసి, నన్నే పర మావధిగ నెంచి బుద్ధియోగము నాశ్రయించి యెప్పుడును నన్ను చిత్తములో నిలిపియుండుము. 18-57


సుఖములేని త్యాగము.

(గీత: అధ్యాయము 3.)


మనస్సు సుఖముగానుండుట కడుగడుగునకునుధ్యానము చేయుట యావశ్యకము. ఆత్మ, లోకము, దైవము, వీని స్వరూపము నెల్లప్పుడు చింతించు చుండుటవలన మనస్సున గలుగు నుద్వేగము లడగిపోవును. కాని ధ్యానముమాత్రము చాలదు. దానితో బాటు తన కేర్పడియుండిన పనులను జేయుటయు నట్లే కర్మము నాచరించుటయందు స్వార్థమును, నాశయు విడిచి చేయుటయు మనస్సౌఖ్యమున కుత్తమమైన మార్గమగును. యోగమనిధ్యాసమునకు పేరు సాంప్రదాయి