శృంగార మల్హణచరిత్ర/ప్రథమాశ్వాసము
శ్రీః
శృంగార మల్హణచరిత్ర
ప్రథమాశ్వాసము
| శ్రీలలితంబు సానునయశీతగుణంబును జారుపాదరే | |
ఉ. | శ్రీరమణీమనోహరుఁ డశేషసురస్తవనీయమూర్తి శృం | |
| చ్ఛారతి నేలుకృష్ణుఁ డనిశంబు సుఖాఢ్యునిఁ జేయుఁ గామినీ | |
ఉ. | “అంబుజసూతి, నీవు భువనావలిఁ బ్రోడవు నాదు వీణ భా | |
ఉ. | నిండి మహామునీశ్వరులు నిర్జరకోటులుఁ జూచుచుండఁగాఁ | |
| దండముఖుండు చుండిపురధామునిఁ గాళన ధన్యుఁ జేయుతన్. | |
సీ. | దంతకాంతినితాంతధాళధళ్యములైన | |
గీ. | ప్రణవవర్ణంబు దానుండు భద్రపీఠి | |
సీ. | కలశాంబురాశిలోపలఁ బుట్టి యేదేవి | |
| లోకమాత యనంగ లోకత్రయంబునఁ | |
మ. | తెలియంగా నట నీదుమస్తకమునందేకాదు భావింప నీ | |
ఉ. | శంభుజటాటవీతటవిశంకటసింధుతలప్రఘుంఘుమా | |
| రంభవిజృంభితధ్వనిధురంధరభూరితరప్రబంధవా | |
చ. | వినుతు లొనర్తు నాంధ్రసుకవిప్రభు నన్నయభట్టుఁ దిక్కయ | |
క. | వెండియు నాదృతమతినై | |
క. | చెలరేగి యంతకంతకుఁ | |
వ. | అని యిష్టదేవతాప్రార్థనంబును సత్కవికీర్తనంబును గుకవినిరసనంబునుం జేసి నవరసభావబంధురంబుగా నొక్కప్రబంధంబు రచియింపం దలంచియున్నసమయంబున. | |
సీ. | ఏమంత్రినునుఁజూడ్కి ధీమదాశ్రితదైన్య | |
| నృప మహాస్థానకవివర్ణనీయగుణుఁడు | |
సీ. | కనకాంబరముల శృంగారించి మించిన | |
క. | “శివభక్తినిధివి మంత్రివి | |
ఉ. | పాటిగలట్టి మేటి యెడపాటిపురాధిప, యెఱ్ఱనార్య, నీ | |
క. | మలహరుభక్తులలోపలఁ | |
చ. | అనుచుఁ బసిండికోరఁ బ్రియమారఁగఁ గప్రపువీడియంబు గాం | |
| ద్రునకును భక్తితోడఁ గృతి నూత్నగతిన్ సృజియింపఁ బూనితిన్. | |
ఉ. | ఇట్టిమహాప్రధానపరమేశ్వరమూర్తివి గాన నీవు చే | |
ఉ. | ఇమ్మహిఁ గల్గుమంత్రుల ననేకులఁ జూచితి మేము వారు మో | |
ఉ. | ధన్యతఁ జుండికాళన, యుదారయశోం౽గన నిన్నెకాని నే | |
సీ. | తనసముద్ధతకీర్తి దశదిశావిశ్రాంత | |
ఉ. | చెంపలగంధమున్ మెఱుఁగుఁజెక్కుల నొత్తిన మన్మథాంకపుం | |
సీ. | సంపూర్ణచంద్రుఁ డీసరసుఁడు కాళన | |
| మంత్రిరామయ కాళనామాత్యచంద్రుఁ | |
సీ. | పరకాంతఁ జూడఁడు పైత్రోవఁ జూచెనా | |
షష్ఠ్యంతములు
క. | ఈదృశగుణజలరాశికి | |
| భూదానభార్గవునకును | |
క. | బంధురవిక్రమశాలికి | |
క. | యోధాగ్రేసరునకు నుత | |
క. | అద్రీంద్రధైర్యునకు స్వా | |
క. | దుస్సంగదూరునకును న | |
క. | శ్రీమంతున కఖిలకళా | |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన మల్హణచరితం బను మహాప్రబంధమునకుఁ గథాక్రమం బెట్టిదనిన: | |
సీ. | కువలయకమలాభినవమనోజ్ఞం బయ్యుఁ | |
గీ. | కలితకైవల్యకల్యాణకటక మనఁగఁ | |
చ. | గములుగఁ బద్మరాగములఁ గమ్రమరీచులు చౌకళింపఁగా | |
క. | కురువిందవజ్రమయగో | |
క. | తలయెత్తి చూచినప్పుడు | |
| కులవార్త లనఁగ వినుతికి | |
క. | దైవతమూర్తులు తేజో | |
క. | వారణవారణసత్త్వులు | |
క. | జలనిధి రోహణశైలము | |
క. | బలభద్రులు శాత్రవనృప | |
క. | సటలాడింతురు సింహముఁ | |
క. | పిటపిట నడఁగెడు నడుములు, | |
క. | గళదండతుండగండ | |
క. | వరజవసంపద నప్పురి | |
క. | మోపులు గైకొని యమృతపుఁ | |
| ఱేపులు మాపులు నప్పురి | |
వ. | మఱియు నప్పురంబు సత్యలోకంబునుంబోలెఁ జతురాననాధిష్ఠితంబై, వైకుంఠపురంబునుబోలె బురుషోత్తమావాసంబై, కైలాసంబునుంబోలె సర్వజ్ఞాభిరామంబై, యమరావతియునుంబోలెఁ మఘవద్విజితంబై, యలకాపురంబునుంబోలె ధనదవిలసితంబై, నక్షత్రగ్రహమండలంబునుంబోలెఁ గళానిధిశోభితంబై, వియన్నదియునుంబోలె లక్ష్మీసముదయంబై, మాతంగవిరహితంబయ్యు మదమాతంగయుక్తంబై, భోగిదూరంబయ్యు ననేకభోగిభూషితంబై, యశ్రుపాతంబు పురాణపఠనశ్రవణవేళయంద, చేలచలనంబు ధ్వజంబులయంద, పరవశత్వంబు రతిసమయంబులయంద, దీర్ఘనిశ్శ్వాసంబు సారయోగులయంద, నన్యోన్యసంఘర్షణంబు యువతీస్తనంబులయంద, పాణిగ్రహణంబు వివాహంబులయందకాని తనయందుఁ బొనరవనంజాలి చక్కదనంబుకుఁ | |
| జక్కటియు, మగతనంబులకు మగఁటిమియు, సంపదల కింపును, యశంబునకు వశంబును, సౌఖ్యంబులకు సౌఖ్యంబును, విద్యలకు నాద్యంబును, విశ్వాసంబున కాదికారణంబును నగు నప్పురవరంబున:- | |
సీ. | యజ్ఞదత్తుండను నవనీసురోత్తముం | |
క. | నరకాంబుధిఁ బడి మునిఁగెడు | |
| న్నరకాత్త్రాయతి” యనియెడు | |
క. | సంతానము నిహపరమును | |
క. | సుతుఁ డుదయించినమాత్రనె | |
క. | పితరులసుగతికి మూలము | |
సీ. | వరరత్నధనధాన్యవస్త్రసమృద్ధైక | |
| శ్యాలకజామాతృసఖిమిత్రబాంధవ | |
మ. | అని యూహించుచు నమ్మహీసురుఁడు చింతాయతవృత్తి న్నతా | |
మ. | ఉపవాసంబులు సత్యధర్మమహితోద్యోగాదికృత్యంబులున్ | |
| జపముల్ విప్రకుటుంబభోజనముల్ శాంతుల్ పయస్సత్రముల్ | |
సీ. | బహువిధస్తోత్రముల్ పఠియింపఁ బఠియింపఁ | |
గీ. | సురభిపొదుగున దుగ్ధముల్ దొరకుఁగాక | |
వ. | అని తనవృత్తాంతం బాధర్మపత్ని కెఱుంగఁజెప్పి తా నొక్కరుండ పురంబు వెలువడి వచ్చి వచ్చి యఖిలజనానందమయి యవసరంబుల నుత్ఫుల్లమల్లికావకుళకేతకీకుటజపాటలీపున్నాగపరిమళామోదపరిహృతపరిశ్రమపథికజనానుమోదంబును, విచ్ఛిన్నస్వచ్ఛగుళుచ్ఛనిష్ఠూత్యమరందబిందుధారానందితతుందిలనటదిందిందిరమాలికాసందోహక్రియాఝంకారంబును, ఉన్మదశుకశారికాకేకికలవరకలకంఠకోమలతరంగితమేదురనాదమాధురీధురీణతామానంబును, బిసగ్రసనకౌతుకకలహంససంకులక్రేంకారగుంభితవిచరత్కిన్నరమిథునమధురగానంబును, సహకారకదళీపనసఖర్జూరద్రాక్షనారికేళబిల్వజంబీరమాతులుంగఫలసమిత్కుశాయాతమునికుమారనిరంతరం | |
| బును నగు వనాంతరంబున నొక్క వటవిటపిచ్ఛాయం దపం బున్న కపింజలమహాముని యాశ్రమంబుఁ జేరంజని. | |
సీ. | తుండముల్ నిమురు భేరుండముల్ శరభంబుఁ | |
వ. | ఇట్లున్న యమ్మునితపోమహిమకు నిచ్చమెచ్చుచుఁ జేరంజని సాష్టాంగదండప్రణామంబు లాచరించినం జూచి | |
| యమ్మౌనీంద్రుం డతనిరాక మనంబున నెఱింగి నీమనోరథంబు సఫలంబయ్యెడు నిక్కడఁ దపం బాచరింపుమని యనుజ్ఞ యిచ్చిన నయ్యజ్ఞదత్తుండును దదుపదిష్టమార్గంబునఁ దపస్సాధనంబు లొనగూర్చుకొని యందంబున నపరనందీశ్వరుహృదయారవిందంబునఁ బొందుపఱిచి ఫలాహారపర్ణాహారపవనాహారపరిహృతాహారుండై పరమతపోనిష్ఠ వాటించుచున్నసమయంబున నప్పరమేశ్వరుండు ప్రసన్నుండైనం బ్రణమిల్లి యిట్లనియె. | |
సీ. | “కరిముఖజనకాయ కనకాద్రిచాపాయ | |
| భక్తపరతంత్రహృదయాయ భవహరాయ | |
మత్తకోకిలము. | “భూసురోత్తమ, యాత్మ మెచ్చితి పుత్త్రు నీ కిదె యిచ్చితిన్ | |
వ. | అని సర్వేశ్వరుండు సంతానలబ్ధికై యొక్కసంతానఫలంబు దయచేసినఁ బుచ్చుకొని కపింజలమహామునియనుమతంబునఁ బురంబున కరుగుదెంచి తనధర్మపత్నియైన పుణ్యవతికి నొసంగె నంతఁ గ్రమక్రమంబున. | |
సీ. | పసిఁడిపుత్తడికిని బల్వంపుమరువుగా | |
క. | నవమాసంబులు నిండిన | |
క. | ‘ఏలికవలెఁ జూడఁగవలె | |
| నేలగవలెఁ బదియేఁడులు | |
వ. | అని యజ్ఞదత్తుండు పుత్త్రకునకు నుదయాదికృత్యంబులు గావించి విద్యానిధియను బ్రాహ్మణునొద్దఁ జదువంబెట్టిన నతండు. | |
సీ. | అంగయుక్తంబుగా నామ్నాయములు రెండు | |
క. | అన్నగరము వేశ్యలలో | |
క. | ఆయక్క యెన్నినోములు | |
క. | మొలకచనుమొనలు చెలువపుఁ | |
క. | నిలుకలు మన్మథునమ్ముల | |
క. | కులమును గుణమును రూపును | |
| తలపఁగఁ బసిఁడికి వాసన | |
వ. | మదనసేన విద్యానిధియను నాచార్యునొద్దఁ దనముద్దుపట్టిం జదువంబెట్టిన నయ్యాచార్యుండును; | |
సీ. | బాలిక కక్షరాభ్యాసంబు గావించి | |
క. | సరికిని బేసికిఁ జదువుచు | |
చ. | పలుకయుఁ బుస్తకంబులును బట్టుకొ యింటికిఁ బుష్పగంధి రా | |
క. | మలహణునిం దమయింటికిఁ | |
క. | ఆలోనఁ బుష్పగంధిని | |
| మేలైన నాట్యవిద్యయు | |
సీ. | మొగవరి కట్టడమొనవుకోలాటంబు | |
గీ. | సకియ రేపును మాపును సాముసేయు | |
సీ. | స్వరమండలంబును జంత్రంబు నొకవేళ | |
వ. | ఇట్లు మలహణపుష్పగంధులు బాల్యస్నేహంబునం గూడి చరియింప నెలప్రాయంబు దోతెంచిన. | |
చ. | ఒసపరిలాగు బాగు సుగుణోన్నతి రూపు విలాసరేఖయున్ | |
| బిసరుహసూతి యాతనికిఁ బేర్కొని మక్కువ నిచ్చెఁగాక నాఁ | |
సీ. | రమణిచన్నులు చేసి రాలినరజముతోఁ | |
సీ. | పటుమోహనస్ఫూర్తి పాలిండ్లు పాలిండ్లు | |
| పంకజంబులతుదిపదములు పదములు | |
వ. | ఇట్లు మల్హణపుష్పగంధులు నవయౌవనారంభంబున. | |
సీ. | శారదచంద్రుండు చంద్రికయునుబోలె | |
| వరవసంతుండును వనలక్ష్మియునుబోలె | |
సీ. | విద్యలు గని చొక్కువేడుకఁ గొన్నాళ్ళు | |
వ. | అంత నప్పురంబునంగల విటవిదూషకప్రేష్యనాగరికాదులు మలహణపుష్పగంధులయన్యోన్యానురాగంబులు దలంచి యిట్లని వితర్కించిరి తమలోన. | |
క. | కూడం జదివినకతమునఁ | |
క. | చిన్నప్పటిప్రేమంబును | |
చ. | చెదరనియట్టికోరికలు జెందిలినొందనియట్టి వేడ్కయున్ | |
| మదవతిఁ బాయఁ డెన్నఁడును మల్హణుఁ డెంతటిభాగ్యవంతుఁడో? | |
సీ. | కోర్కిమై దీనితోఁ గూడియుండగలేని | |
సీ. | చిత్రోపధానవిచిత్రవితానాదు | |
| ఘనసారచందనకస్తూరికాదులు | |
సీ. | ముద్దియలావణ్యమునకు సంతోషించి | |
| పొలఁతిఁ దలపోసి యటమీఁదఁ బొగులువారు | |
వ. | అంత నమ్మదనసేన పరిజనంబులతోడ మలహణు నివేదించి యిట్లనియె. | |
సీ. | మొండితొత్తులమారి లండుబకంకంబు | |
చ. | ఎక్కడి బాపనయ్య, యితఁ డిక్కడ వచ్చుచునున్నవాఁడు దా | |
| నిక్కమె సాధుఁబోలి తననెయ్యముఁ దియ్యము చాలుఁజాలు నీ | |
వ. | అనుటయు నమ్మాటలు మలహణపుష్పగంధులు విని తమలో నిట్లనిరి. | |
క. | పురజనము లాడువార్తలు | |
ఉ. | ఎవ్వరిఁ గీడుపల్కితిమొ యెవ్వరిఁ జూడఁగ నాడినారమో | |
| యివ్విధి వట్టిరట్టు పడ నెట్టుగఁ జేసె విధాత యక్కటా! | |
క. | నొడిమలకుఁ గలవి లేనివి | |
చ. | అనుజులుఁ దల్లిదండ్రులు నిజాప్తులుఁ బౌరులు బంధుకోటులున్ | |
వ. | అని యిరువురు నన్యోన్యురాగసుఖంబులం దనరుచుండి రంత నప్పురంబున. | |
మ. | కరుణాంభోధిసమాన మానవిలసత్కల్యాణ కల్యాణభూ | |
| కరసౌందర్యవిశేష శేషకటకాకల్పాంఘ్రి పద్మార్చనా | |
క. | డిండరహార సురవే | |
మాలిని. | సరసగుణసముద్రా సంతతౌదార్యముద్రా | |
గద్యము. | ఇది శ్రీమత్సకలసుకవిమిత్ర, సోమయామాత్య | |
ఇతర ప్రతులు
[మార్చు]This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.