శివతాండవము/అభిప్రాయము
స్వరూపం
అభిప్రాయము
శ్రీమాన్ నారాయణాచార్యులుగారు చెప్పిన 'శివ తాండవ' కృతి ఆకర్ణించి ఆనందపరవశుఁడ నైనాను. ఈ కావ్యము ఆంధ్ర సరస్వతికి ఉజ్జ్వల నూతనాలంకారము. కల్పన అతిలోకము. సంగీత, సాహిత్య, నాట్యసంకేతములు సరసముగా, సలక్షణముగా ఈ కృతిలో యిమిడిపోయినవి. అర్ధము, గంభీరము, ఆశయము అత్యుదాత్తము. నా దృష్టిలో ఆధునిక సారస్వతమున యిటువంటి గేయకృతి యింకొకటి లేదు.
ఇతి శివమ్!
తల్లావఝుల శివశంకర శాస్త్రి