శారద లేఖలు (మొదటి సంపుటము)/విజ్ఞప్తి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


విజ్ఞప్తి

1921 - 22 సంవత్సరముల ప్రాంతమున నాంధ్ర పత్రికలో చక్కని శైలితో రమణీయములగు భావములతో వసంత లేఖలు, పచురింపబడుచుండెడివి. వానిని చదువు చుండ నిదేమాదిరిగా స్త్రీలకు సంబంధించిన విషయములను గూర్చి లేఖలు (వాయవలయునని నాకుగూడ కుతూహలము గలిగెను. వెంటనే యొక లేఖనువ్రాసి శ్రీమతి కళ్లేపల్లి వెంకట రమణమ్మగారి యాధిపత్యమున నెలువడిన 'ఆంధ్రలక్ష్మి ' యను స్త్రీమాసపత్రికకు బంపితిని. ఆ పత్రిక నడచినంతకాలము నా శారద లేఖలు గూడ నందు క్రమముదప్పక ప్రచురింపబడు చుండెను. అది ఆగిపోవుటతో నా లేఖలును ఆగిపోయెను. తదుపరి శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మగారి 'అనసూయ ' పత్రిక పునరుద్ధరింపబడగా వారి కోర్కెపై ని యందును రెండు మూడు లేఖలు వ్రాసితిని, తరువాత నదియు నాగిపోయెను.

తదుపరి 1928వ సంవత్సరమునందు 'గృహలక్ష్మీ ' ప్రకటింపబడ నున్నపుడు ప్రతికాధిపతులు నావ్యాసములను కోరగా 'శారద లేఖ 'లను వ్రాసెదనని తెల్పి యట్టులనే వ్రాసి పంపితిని. నాటినుండి నేటివఱకు నా లేఖలను నడపభారము 'గృహలక్ష్మి'యే వహించియున్నది.

దేవతావల్లరియైన కల్పలతవలెనే నా లేఖలును చిరకాలము వర్ధిల్లవలయునను తలంపుతోడను, కల్పలతవలెనే నా లేఖలును స్త్రీలయ భీష్టప్రదాయినులుగా నుండవలయునను తలంప తోడను, నాలతకు నెల్లప్పడు పూచినపూవులుగా నా లేఖలు 14 ప్రచురింపబడుచుండెడి తలంపుతోగోడను, నేను జాబులువ్రాసెడి కల్పిత వ్యక్లియైన నెచ్చెలికి కల్పలతియని యభిధేయమిడితిని. రచనాసౌకర్యముకొఱకు కొలదిమార్పులు చేయబడినను, వ్యకుల్లయొక్క_యు, ప్రదేశములయొక్క_యు పేరులు మార్చ బడినను నిందలి విషయములు మాత్రము యథార్థములని నేను రూఢిగా చెప్పగలను. కన్నులార చూడనివియు, చెవులార విననివియు, చక్కగా మనస్సునకు నవగాహనము చేసికొనని వియు నగు విషయము లేవియు నిందు లిఖంపబడలేదు. కాన శారద లేఖల ప్రచురణము వినోదతుల్యముగా 6 ܕܗ̄sܕܬܰܡܵܐ భావింపబడి వాని ప్రయోజనము గురింపబడకున్నను మును ముందు నిప్పటి దేశవ్యవహారములను నాంఘిక పరిస్థితులను దెలిసికొనుటకు చారిత్రకముగ దోడ్పడి ప్రయోజనకరముగా నుండXలవని నా యాచేయము, గృహలక్ష్మీ? పత్రికను స్థాపించి యాంధ్రమహిళాప్రపంచ మునకు జేయుచున్న యపారయుపకృతియే గాక మహశాదార్య ముతో నా లేఖా సంపుటములను గూడ ప్రచురింపబూనిన మ, రా, శ్రీ డాక్టరు కే. యన్. కేసరిగారికి నా మనవూర్వక నమస్కా_రము లర్పించుచున్నాను. పత్రికలలో ప్రచురింపబడిన నా శారద లేఖలపె జూచిన యాదరమునే యూ లేఖాసంపుట ములపై గూడ భావి యాంధ్రమహాజనులు ప్రోత్సహింపగలరని నమ్ముచున్నాను. భగవంతు డనుగ్రహించునుగాక ! "2) °ჯ3ტეა . ఇట్లు నుజనవిధేయి, 31-1-183 - కనుప రి వరలక్మమ్మ