శశికళ/సంప్రార్ధన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సంప్రార్ధన

సకల శిల్ప సుందరాలు
సర్వ రసానందాలూ

            వెలసిపోవు దేవళాన్ని
            చెలీ నీకు నిర్మించితి.

అధి వసింపరావ నీవు
అవతరింప ఒప్పకున్న

            ముందు యుగపు రసికాత్ములు
            ముందు యుగాల సహృదయులు

                         పాడుపడిన సౌందర్యము
                         పరికిస్తూ నిట్టూర్తురు.

ఏదో ఒక విడ్డూరము
ఏదో ఒక ప్రణయభంగ
          
            మావహిల్లె నిచటనంచు
            అంజలితో కంట నీరు

                        అర్పింతురు నీకు నాకు.