శశికళ/నారాణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నారాణి

నారాణి నావాణి నా శశికళవు దేవీ !
నా బాణి నాప్రాణప్రియ రహశ్యము నీవు నీవే !

కనుమూసి కనుతెరచి కనలేని కలగనుచు
వినువీధిలో కొత్త మనుగడలు మలిచానె
              .......నా రాణి

వెన్నెలను వన్నెలను మిన్ను కన్నై వెదికి
నిన్నె నాసొద నడుమ విన్న దే నేనెరుగ
              .......నా రాణి

విడబోని నాకోర్కె కడపలను ఎరుగదే
ఎడమీని నాకొలువు జడతనే తెలియదే
              .......నా రాణి

నీప్రేమ కనలేక ఈసీమ మనలేను
నన్నోముదువొగాక నా బ్రాములే నాకొ !
              .......నా రాణి

కలలు విరుగగ నీకు తలపు లందగరావు
తలపులే కళంపస వలపు వరమీయవే !
              .......నా రాణి