శశికళ/నువ్వు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నువ్వు


పూవు లో మసృణములు
తావి లో ఘ సృణములు

        ప్రోవు ప్రోవులు చేరి
        నీవుగా మూర్తించె.

రాయంచ స్విన్నతలు
ప్రాలేయ స్వచ్ఛతలు

         లీలార్ద్రమై కలసి
         బాల నీవై వెలసె.

కోకిలల కువ కువలు
వాక పరువుల కివలు

         నీ కంఠమున సొలసి
         నీకు పలుకులు పొలసె.

ఆకాశ నీలాన
రాకా సు ధాకరము

         నీ కనులు వెలిగెనే
         నా కమృతము కలిగె !