శశికళ/అతిధి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అతిధి

రూపు రేఖల రుచి తళర్ధళ
చూపు సొ బగుల సురభిళమ్ములు

        జల జలా వచ్చావు బాలా
        పల పలా తోచావు బాలా !

స్వచ్ఛ శోభాపూర్ణ మూర్తివి
విచ్చు పాటల పుష్ప వదనపు

        అలలు లా వచ్చావు బాలా
        కలలు లా వచ్చావు బాలా !

ఘల్లు ఘల్లన కాలి మువ్వలు
ఝల్లుమన నా జన్మ మంతా

        వెల్లువై వచ్చావు ప్రేయసీ !
        వెన్నలై వచ్చావు ప్రేయసీ !