శశికళ/నాట్యము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాట్యము


నారాణి కళ్లలో నాట్యమొక్కటి మెరిసె
తారాపధాలలో తళుకు హంగులు మురిసె !

నారాణి కనుబొమలు నాట రాగము పాడె
కారుమబ్బుల దరులు పూరించె శృతిమోడి !

నారాణి కనురెప్ప లారజము వాయించె
నీరధి నీలాలు ఆరభటి మ్రోయించె !

నారాణి కనుపాపలే రాగ తాళగతి
చార సంచారిగా సలిపె లాస్యము నిరతి !

నారాణి కళ్లలో నాట్య నాయకుడేను
ధీర లలితుడను, స్వాధీన పతికవు నీవు !