శశికళ/ఒకరికొకరు
< శశికళ
Jump to navigation
Jump to search
ఒకరికొకరు
నువ్వూ నేను కలసి
పువ్వులో తావిలా
తావిలో మధువులా !
నువ్వూ నేనూ కలసి
కోకిలా గొంతులా
గొంతులో పాటలా !
నువ్వూ నేను కలసి
వెన్నెలా వెలుగులా
వెలుగులో వాంఛలా !
నువ్వూ నేనూ కలసి
గగన నీలానిలా
నీలాన శాంతిలా !