శశికళ/మార్పు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మార్పు

కత్తి పట్టిన చేతికో దేవీ
ఇత్తువేమే సకల సౌరభ పుష్ప దామము !

ఉరుము లురిమే కంఠమున దేవీ
విరియ చేస్తువె మధుర మంద స్వరములే!

తీష్ణ రోహిత పూర్ణ జన్మిని
తీర్తు వేమే దివ్య మంజుల వర్ణములనే !