శశాంకవిజయము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
శశాంకవిజయము
ద్వితీయాశ్వాసము
| శ్రీవిజయరంగచొక్క | 1 |
వ. | అవధరింపుము సూతుండు శౌనకాదిమహామునీంద్రుల కిట్లనియె. | 2 |
శా. | ఆలీలన్ గమలాసనుండు చన నయ్యాజ్ఞాపనం బౌదలన్ | 3 |
క. | ఆపురివిభవము శివునకు | 4 |
మ. | నగరీసౌధములన్ గుమారికలు వీణ ల్మీటుచో నీలపుం | 5 |
మ. | అఱజాబిల్లిమెఱుంగు బాసికముచాయం బూనఁగా తారక | 6 |
చ. | విలసితపద్మరాగమణివేల్లితమై తగుమేటికోటకొ | 7 |
ఉ. | పా టొకయింత లేనిఘనపత్త్రసహస్రము రాజమాన్య మౌ | 8 |
సీ. | వసుమతీవలయాధిపత్యరాజద్రాజ | |
గీ. | నెసఁగు బహుజీవనప్రదాతృత్వవిష్ణు | 9 |
గీ. | జాళువాకోటకొమ్మలు చాలుదీప | 10 |
చ. | కళుకుకడానిచాయ మెయిఁ గన్పడఁగా మెఱుఁగుందురాయితో | 11 |
చ. | అలపురికోటకొమ్మగమి నానను దద్గరుడోపలద్యుతిన్ | |
| నలసెద నొంటిగా ననుచు నర్కుఁ డన న్నెల కొక్కరుండు గా | 12 |
ఉ. | పంత మెసంగఁ దన్నగరభామిను లబ్జము లంఘ్రిఁ దోయు చ | 13 |
శా. | వాటంబై తగుఁ గోటక్రింద వసధివ్యాఖ్యేయ మాఖేయమున్ | 14 |
ఉ. | పెక్కుముఖంబులం జదివె వేదము లంతట నిద్ర సోమరై | 15 |
సీ. | ఒమ్మైనబళువుగోతమ్ములు ద్రొబ్బిన | |
గీ. | హల్లకద్యుతిచెంగావిచల్లడాలు | 16 |
శా. | బాణావంకిని పెద్దకత్తిగుమితిన్ బాణాసనప్రౌఢిమన్ | 17 |
ఉ. | నిచ్చల మైన కెంపులును నీలమణు ల్వరమౌక్తికంబులున్ | 18 |
ఉ. | చారుచిరత్నరత్నమయసౌధముల న్బురివైశ్యకన్యక | 19 |
ఉ. | ఏ రొక టబ్బె రామునకు నెడు పొసంగవు చంద్రమఃకళా | 20 |
చ. | భుజములు తమ్మితూండ్లు కనుబొమ్మలు సింగిణివిండ్లు చన్ను ల | 21 |
సీ. | చంచలత్వము తళ్కు మించుకన్నుల నుంచి | |
గీ. | నలరుదురు లోకసంహననాభిలాషి | 22 |
సీ. | కే లెత్తి సురదంతి నాలంబునకు నిల్చు | |
| గలశభవాచాంతజలధి నింపఁగఁ జాలు | |
గీ. | కీలు మేలును మదభరోద్వేలధార | 23 |
శా. | బ్రద్దల్వాఱి ధరిత్రి లీలఁ దెలిబాబాఁ జూచి వేఁటాడుచున్ | 24 |
సీ. | కసవుమోపరిగాలి గణుతియే మా కంచు | |
గీ. | లురము నందంబుఁ బలుకంద ముదుటుఁగన్ను | 25 |
మత్తకోకిల. | చక్రము ల్జత గూడ బంగరుచాయ నింగి చెలంగఁగాఁ | 26 |
క. | తురగము రౌతును బల్లము | 27 |
సీ. | కర్ణాటకామినీకర్ణావతంసిత | |
గీ. | నలినకువలయనవలయనటనపటిమ | 28 |
చ. | కలువల కేమి నీ విపుడు కన్గొనినంతనె తెప్పతెప్పలౌ | 29 |
మ. | కులుకుంజందురుకావిపావడపయిన్ గ్రొందళ్కురాయంచ యం | 30 |
శా. | బాగై మించినయప్పురోత్తమముక్రేవన్ జూడ నయ్యెన్ రకం | 31 |
క. | ఆనగరంబునఁ జంద్రుఁడు | |
| గానసుధాపానబుధా | 32 |
ఉ. | పిన్నటినాఁటనే తనవివేకము లోకమువారు మెచ్చఁగా | 33 |
క. | అత్త్రి నయ మలర ని ట్లను | 34 |
చ. | చదువునఁ బ్రజ్జ దాన సరసజ్ఞత యందునఁ గార్యఖడ్గకో | 35 |
ఉ. | ఆఱనిదీవె యక్షయమహానిధి జూపునవాంజనంబు నూ | 36 |
క. | చెఱకునకుఁ బండు పసిఁడికిఁ | 37 |
క. | దురమున కలుకనితురగము | 38 |
ఉ. | కావున నీవు ప్రాభవము గల్గుటకు న్ఫల మొందువైఖరి | 39 |
క. | అన విని చంద్రుఁడు జనకుని | 40 |
ఉ. | మైత్రి యెలర్ప నీ ట్లను కుమారక! సారెకు సచ్చరిత్రుఁ డౌ | 41 |
ఉ. | మాతలిదండ్రు లన్నలును మాతలిసారథికార్చనీయ! సం | 42 |
ఉ. | ఒజ్జలు నిర్జరావళికి నుజ్జ్వలబుద్ధి సమృద్దు లెంతయున్ | 43 |
శా. | మీచెంత న్బహువేదశాస్త్రపఠన న్బెక్కండ్రు విద్వాంసు లై | 44 |
క. | సదమలగురువిశ్వాసము | 45 |
మ. | అనిన న్సంతస మంది గీష్పతి కుమారా! యత్రిగర్భంబున | 46 |
క. | పదునెనిమిదివిద్యలు నినుఁ | |
| బదు లితనికి లేదనిపిం | 47 |
చ. | అని మది మోద మందుచు బృహస్పతి యాహరిణాంకు నింటికి | 48 |
ఉ. | నీరజగంధి! వీఁడు జననీజనకు ల్గడుగారవంబున | 49 |
మ. | అనినన్ దారయు నట్ల కాక యని విద్యాసక్తుఁ డౌచంద్రునిన్ | 50 |
మ. | పరమప్రీతి నహర్నిశంబు త్రిదశోపాథ్యాయవర్యుండు సు | 51 |
క. | ప్రఖ్యాతిఁ గాంచఁగలఁ డని | 52 |
సీ. | చదివెను ఋగ్యజుస్సామాదివేదంబు | |
గీ. | నేర్చెఁ దెల్లముగా దండనీతిశాస్త్ర | 53 |
చ. | అరసి విశుద్ధశబ్దములు నర్థములు న్ధ్వనివైభవం బలం | 54 |
క. | అంగనలసొక్కుమందుగ | 55 |
క. | అఱువదినాలుగువిద్యలు | 56 |
క. | నానావిధవిద్యలకు | 57 |
ఉ. | అంత ననంతవిభ్రమనిరంతర మై జిగికుందనానకున్ | 58 |
క. | పరువంపుఁబ్రాయమున నా | 59 |
చ. | అలనలినారి పొల్చె నిజయౌవనవేళ స్వకీయబింబలీ | |
| వలుదద యారుణద్యుతులు వాతెఱ వెన్నెలడాలు లేఁతన | 60 |
సీ. | తను జూచుజవరాండ్ర కెనయుకోర్కులభంగి | |
గీ. | మిసమిసలు దేరునునుపైనమేనిసొబగు | 61 |
ఉ. | చక్కనిపోఁకబోదె నగఁ జాలుగళంబును గేల నొక్కినం | 62 |
క. | చక్కెరవిల్తునొయారపుఁ | 63 |
చ. | మునుమును వింతగాఁ జిలుకముక్కుజిగి న్దగునుక్కుగోటిచే | 64 |
సీ. | పలుమాఱు ముగ్ధభాషలు పల్కుటలు మాని | |
| సహజంబుగా వధూజనులఁ జూచుట మాని | |
గీ. | వటువు జిగిమోవి మెఱయ నవ్వుట లెఱింగె | 65 |
ఉ. | వాని యొయారవున్నడలు వానిచకచ్చక లీనుపొన్నొడ | 66 |
సీ. | కులుకుఁ జూపులను గల్గొననియేణాక్షియు | |
గీ. | డాసి దయ నేలు మనుచు వేఁడనియబలయుఁ | 67 |
ఉ. | హాటకగర్భునంశ నమృతాంశుఁడు నుజ్జ్వలమూర్తి యౌజగ | 68 |
ఉ. | ఆలలితంబు లాసొగసు లానెఱజాణతనంబు లాకళా | |
| హాళి మెయిం గనుంగొనినయంతన వేలుపుటొజ్జలయ్యయి | 69 |
ఉ. | రాకకుఁ బోకకుం గలువరాయనిచక్కదనంబు కంటి కిం | 70 |
మ. | ప్రమదారత్నము తార చంద్రు నెనయన్ భావించుఁ దోడ్తోన న్యా | 71 |
ఉ. | ఒప్పుగ నొజ్జయొద్ద శశి యున్నతఱిం దలు పోరఁ జేసి యా | 72 |
ఉ. | కమ్మజవాదివాసనలు గ్రమ్మఁగ నోరపయంట జాఱఁగా | 73 |
ఉ. | పాయనిప్రేమ బాల్యమునఁ బాపఁడ! చిన్న కుమార! రార! బా | 74 |
మ. | జనము ల్లేనియెడన్ శశాంకుసరసన్ సాంబ్రాణిధూపంబు వా | 75 |
క. | పరిపరివిధముల ని ట్లా | 76 |
సీ. | కనుఱెప్ప వెట్ట కాతని నెగాదిగఁ జూచుఁ, | |
గీ. | జేరి చెవిలోన గుసగుస ల్చెప్పినట్ల | 77 |
చ. | గడెతడ వాతఁ డొక్కపనిగాఁ జని యింటికి రాకయుండినన్ | 78 |
ఉ. | అందపుజాఱుఁగొప్పు నసియాడెడుకౌనును లేఁతవెన్నెలల్ | 79 |
ఉ. | మట్టుకు మీఱుమోహమున మానిని వానికి మేలిదుప్పటు | 80 |
సీ. | జిలుఁగువల్వ వదల్చి చెంగావి ధరియించి, | |
| హెచ్చుముక్కర దీసి పచ్చతళ్కు ధరించి, | |
గీ. | గమ్మకస్తురితిలకమ్ముఁ జిమ్మి సమ్మ | 81 |
గీ. | ఇంట మెలఁగెడివారిలో నెవ్వ రైన | 82 |
క. | అద్దము గానము తిలకము | 83 |
ఉ. | చేరఁగ రార నీకురులు చి క్కెడలించెద నంచు నేర్పుతో | 84 |
ఉ. | ఒక్కొకవేళ నాసరసుఁ డొంటిగ నింటను నిద్ర పోవఁగా | 86 |
సీ. | గుబగుబ మని పల్కుకోకిల పల్కులు, | |
గీ. | మురిపెమున మేను విఱుచుఁ గెమ్మోవిఁ దెఱచుఁ | 86 |
క. | ఈరీతిన్ వానియెడన్ | 87 |
క. | ఆపొలఁతి తలఁపు వలపున | 88 |
సీ. | కులుకులాడిని ప్రేమ దొలుకుఁజూపులఁ జూచి, | |
గీ. | నొంటిపాటున నవ్వాలుగంటి నంటి | 89 |
ఉ. | చెంతఁ దనంత నింతి కడుఁ జేరిక సేయఁగ సంతసంబున్ | 90 |
క. | వెండియు దినదినమును దన | |
| మెండుకొన నుండఁ గన్నుల | 91 |
ఉ. | ఈయబలాలలామ కెన యేయుగమందును గాన నీబెడం | 92 |
క. | చన్నులు కౌఁగిటి కణుగవు | 93 |
సీ. | నిద్దంపుటద్దంపునిగనిగల్ గలదీని, | |
గీ. | మదనదవదహదోదూయమానమాన | 94 |
ఉ. | ఎందఱిఁ జూడ మిద్ధరణి నిందునిభాస్యల వారి కెల్ల నీ | 95 |
సీ. | కలకంఠితళ్కుగాజులు గల్లు మనినంత, | |
| గులుకుగుబ్బెతజాఱుకొప్పు ఘమ్మనినంత, | |
గీ. | బాళిఁ గడు దూలి జవరాలిపై విరాళి | 96 |
ఉ. | ము న్నొకనాఁడు నంగనల ముద్దులసుద్దు లెఱుంగనట్టిచో | 97 |
ఆ. | అలక లురులు గాఁగ యలనాభి చెలమగా | 98 |
ఉ. | ప్రేంఖదధర్మవర్తనకు భీతిలి గోలతనాన నిప్పు డీ | 99 |
క. | ఈవనిత బెళుకుఁజూపులు | 100 |
సీ. | పొలయల్కలోన నీపొలఁతుకతోఁ గూడఁ | |
| మిమ్ముగా నిమ్ముద్దుగుమ్మగుణములు, | |
గీ. | మలఁతికొనగోట నొక్కి నీయతివనీవి | 101 |
క. | మెఱుఁ గెక్కినయద్ధముగతిఁ | 102 |
చ. | మెలకువ సెజ్జఁ గాంచి తమి మించి నయంబున బుజ్జగించి వై | 103 |
క. | ఉన్నవి నామది కోరిక | 104 |
మ. | అని యంతంత నిరంతరాంతరదురంతానంతచింతామహాం | 105 |
క. | పువ్విలుతుఁ డొకఁడు ద్రిప్పఁగ | 106 |
చ. | పలుకులనేర్పులున్ జిలుగుఁబయ్యెదజార్పులు వింతమోడిన | 107 |
చ. | తలఁపఁగ సాహసంబు తలిదండ్రులు విన్నను తాళ రీగురుం | 108 |
క. | అగ్గలిక మీఱఁ దాలిమి | 109 |
ఉ. | అంత లతాంతకుంజసదనాంతవిహారవిలాసవత్యుప | 110 |
క. | ఆకులపాటు వియోగుల | 111 |
ఉ. | వాలుగడాలువానిదళవాయి వసంతుఁడు జైత్రయాత్రకై | 112 |
క. | ఎలమావిని నునుఁబల్కులు | 113 |
మ. | తెలిమొగ్గల్ బలుసిబ్బెపుంబొడలుగాఁ దేనె ల్మదోద్వేలధా | 114 |
గీ. | సరజసారుణమకరందసారధార | |
| కమ్మవిలుకాఁడు విరహులఁ గ్రమ్మి దివియఁ | 115 |
ఉ. | కోయిలపేరిగారడపుగొంటరి తా ఋతురాజుముందటన్ | 116 |
మ. | అమరం గ్రొవ్విరితేనెచాలుకొణతా లందంద లాగించి పొం | 117 |
రగడ. | వెలసె వనాంతరవీథి వసంతము | |
| మెలఁతరొ! నావి సుమీ విరవాదులు | |
| విలులితసురభిళవేణీచాలన | 118 |
సీ. | ఏలాలతాజాలడోలాసమాలోల | |
గీ. | కనఁ దగె నకుంఠకలకంఠకంఠనాద | 119 |
క. | ఆమని యేమని చెప్పెద | 120 |
చ. | ప్రతతభుజానిరర్గళపరాక్రమపాలితలోకుఁడౌ శత | 121 |
క. | తిన్నగ జన్నము సేయుమ | |
| బన్నుగ నాతని ఫలసం | 122 |
క. | హృదయమున సమ్మోదము | 123 |
పంచచామరము. | పయోజపత్రనేత్ర! గోత్రపత్త్రభంజనుండు స | 124 |
శా. | ముల్లోకంబుల నేలురాజు సవనంబున్ దీర్ప రమ్మన్నచో | 125 |
చ. | అలకలు దువ్వరాదు సరసాన్నములన్ భుజియింపరాదు మై | 126 |
గీ. | కాన నీవును మారాక మానసమునఁ | 127 |
చ. | మఱియొకమాట బోటి వినుమా మనమారసి యీడ కేము క్ర | 128 |
చ. | వయసున బాలుఁ డయ్యుఁ బరువంబగుతెల్విని జాలపెద్ద యెం | |
| దయమున నెండ కన్నెఱుఁగఁ డారయఁ జూచినఁ గందు మేను స | 129 |
క. | ఇంటికి బ్రాపై యెప్పుడు | 130 |
చ. | అనినఁ దదీయదార సముదారముదారమదాత్మభావగో | 131 |
శా. | ఔ! లెం డేమిటిమాట! హా పయనమా హాస్యానకుం బల్కుటో! | 132 |
ఉ. | ఏ మనుదాన నేకరణి నే మనుదాన వియోగసాగరం | 133 |
ఉ. | పైన మిదేల యన్న గ్రతుభంగము చేసినదోస మశ్రువుల్ | 134 |
గీ. | తలఁపు లొక్కటి గాఁగ నగ్గలపువలపు | 135 |
సీ. | తీర్థాలవెంబడిఁ దిరుగుట కొన్నాళ్ళు | |
| గురుకులవాసపుగోష్ఠిచేఁ గొన్నాళ్లు, | |
గీ. | గాఁగ యెలప్రాయ మెల్ల నీకరణి నేఁగె | 136 |
చ. | గళరవమంత్రము ల్చెలఁగఁగా జిగిసిబ్బెపుగుబ్బచన్ను ల | 137 |
గీ. | తఱుచుమాటలు నేర నిర్దయత మీఱ | 138 |
చ. | అని కపటాంతరంగ మెనయంగఁ బొసంగఁగఁ బల్కు నంగనన్ | 139 |
చ. | వగవకు మింతకంటె బలవంతపువంత పురంధ్రి! మా కిదే | 140 |
ఉ. | ఇచ్చటియగ్నిహోత్రతతు లెవ్వరిపా లతిథివ్రజంబులన్ | 141 |
క. | నటవిటవారవధూటీ | |
| ఘటకుచయుగ! సతులకు నేఁ | 142 |
వ. | నావచనంబులకుఁ బ్రతివచనంబులు వచియింపకు నాయాన యానంబు విడువుము శుభోదయంబుగా మమ్ముఁ బైనంబు పంపుము పోయివచ్చెద మనిన నక్కల్కి కల్పితవిషాదంబును కపటలజ్జాభరంబును గైతవాశ్రుపాతంబునుం గనుపట్ట మీ రిట్లు పల్కిన నేమి సేయఁగలదాన విరహసాగరం బేరీతిఁ గడవఁ గలదాన నైనను మీయానతికి సమ్మతింపడితి నన్నగారాతిజన్నంబు సేయించి పిమ్మట నిమిషమాత్రం బైన నచ్చట నిలువవలదు మీమాట జవదాఁట నే నంతబేలనే యాత్మకుమారునింబలె యీయత్రికుమారునిం బోషించెద విశేషించి నేఁటనుండియుఁ బ్రాణపదంబుగా గారవించెద మీకుం బ్రియుం డఁట యితని యేనుం బ్రియునిఁ గాఁ దలంపవలవదె యిచ్చటివిచారంబులు మాని నెమ్మదిగాఁ బయనమ్ముఁ బోయిరమ్మని యనుపుటయు నయ్యనిమిషగురుండు శతమఖమఖనిర్వర్తనకౌతుకాయత్తచిత్తంబున నమరావతీపురంబునకుం జనియె ననుటయు. | 143 |
ఆశ్వాసాంతము
శా. | అర్ణో రాశిగభీర! భీరహితచిత్తభోగ! భోగావళీ | 144 |
క. | కల్పక సమదానకళా | 145 |
పృధ్వి. | మంతుకృద్వైరిసామంతమంత్రిస్మయ | 146 |
గద్య. | ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానందకందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్యతనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతంబైన శశాంకవిజయం బనుమహాప్రబంధమునందు ద్వితీయాశ్వాసము. | |
--- ---