శశాంకవిజయము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
శశాంకవిజయము
తృతీయాశ్వాసము
| శ్రీరంగపతిపదాంబుజ | 1 |
వ. | అవధరింపుము సూతుండు శౌనకాదిమునీంద్రుల కిట్లనియె నవ్విధంబున బృహస్పతి దివస్పతిసదనంబునకుంజనిన యనంతరంబ యిక్కడ. | 2 |
ఉ. | ఒంటిగ నబ్బెఁ జంద్రుఁ డిపు డొంటిగ వాతెరజుంటితేనియల్ | 3 |
గీ. | గురునివెంబడిఁ దా నొకకొంతదూర | 4 |
సీ. | సరసాన్నపానము ల్శాకపాకంబులు | |
గీ. | పువ్వుటెత్తులపొట్లము ల్నివ్వటించి | 5 |
క. | వచ్చినయాతని వేగమె | 6 |
ఉ. | ఊరికిఁ బంపి వచ్చితివె యొజ్జల నీగురుఁ డమ్మ చెల్ల! సం | 7 |
గీ. | ప్రొద్దు వోయెను లెమ్మిఁక సుద్దు లేల? | 8 |
సీ. | ఫాలభాగమున వజ్రాలపాపటబొట్టు | |
గీ. | గొప్పుముడి వీడ నుదుట ముంగురులు గూడ | 9 |
గీ. | చెండ్ల గెలిచినమెఱుఁగుపాలిండ్లతోడ | |
| జించి సారస్య మంతయు వంచినట్లు | 10 |
మ. | తరుణీరత్నము బాలకైతకదళోదంచన్నఖాగ్రంబులన్ | 11 |
ఉ. | జాఱుపయంటఁ జెక్కి బిగి చన్గవ నిక్కఁగ బాహుమూలశృం | 12 |
సీ. | పసమించుమాదరపాకపోరువలచేఁ | |
గీ. | కమ్మకస్తురిచేఁ దిలకమ్ము దీర్చి | 13 |
చ. | బలురతనంపుఁజక్కడపుఁబళ్లెర ముంచి పసిండిగిండిలో | 14 |
సీ. | విరహాగ్ని నీరీతి గరఁగె నామానసం | |
| నెమ్మి నీరీతి నాకెమ్మోవి గ్రోలుమీ | |
గీ. | నొప్పుగా గిన్నియల నుంచి యుపచరించి | 15 |
క. | బంగారుబొమ్మ రంగగు | 16 |
ఉ. | కాంత యొసంగువీడియముఁ గైకొని యింతి యొనర్చునవ్విధం | 17 |
క. | అలపొలఁతుక దా నంతట | 18 |
సీ. | తేటయౌ గొజ్జఁగినీట మజ్జన మాడి, | |
గీ. | మినుకకాటుకరేఖ కన్గొనలఁ దీర్చి, | |
| తనయొయారంబు నిలువుటద్దమునఁ జూచి | 19 |
సీ. | చిగురాకువిలుకానిచేతిచక్రమురీతి, | |
గీ. | సారె రతిరాజుమ్రోల హెచ్చరిక దెలుపు | 20 |
వ. | ఇవ్విధంబున నచ్చకోరలోచన యచ్చటికి వచ్చి నిచ్ఛనిచ్చలు న్బొరవిచ్చి విచ్చలవిడి రాలిన నిచ్చలంపుఁబచ్చకపురంపుఁబరాగంబునం బ్రోదులుగాఁ బాదులు గట్టి సజ్జకం బైనగుజ్జుగొజ్జంగినీరు నించి పెంచినపొన్నలు పొగడగున్నలు గన్నేరులు కన్నెగోరంటలు చిన్నిసురపొన్నలు నిమ్మలు కమ్మసంపెఁగలు నింపుమీఱునునుపోకమాఁకులు డంబుమీఱునారికేళంబులు తావులకుం దావు లయినమోవుల నెలమావులప్రోవులు వాసనాసారదంబు లగుశారదంబులు నారదంబులు నీరదంబులడంబు విడంబించుఁ చీఁకటిమాఁకులును లికుచకుచాకుచసాదృశ్యఫలంబులపోడిమి మీఱుదాడిమీనికుంజంబులు జంబూవృక్షంబులు జంబీరంబులు ఫలరసజంబాలంబు లైనపనసతరుజాలంబులు సాలహింతాలతాలతక్కోలసాలంబులుం గలిగి యెల్లెడల నల్లిబిల్లిగా మొల్లమిగ నల్లికొనినమల్లియల నుల్లాసంబునం దిరుగుతేఁటిపిల్లలగరులగములఁ గని నిగనిగనిజిగి మిగులు మొగులతెగ లని మచ్చికలం బురివిచ్చి యాడుమవ్వంపుఁజిలువజవ్వనుల ఱెక్కమొక్కతెరల మరువున మలయపవననటనర్తితలలితలతికాలతాంగులనటనంబులకు న్ఘటనంబులుగా జోకమీఱుతదీయకేకారవంబులు షడ్జంబులుగా | |
| సమదకోకిలకాకలీరవంబులు పంచమశ్రుతులుగా గానంబుఁ జేయు తేఁటిబోటిపాటల కనుగుణంబుగా నుగ్గడించు భరతపిట్టల దిట్టంపుసొల్లుకట్టులం గమ్మి యఖండనాదమేదురంబై యయత్నకల్పితసంగీతమాధుర్యంబునం బొలుపొందు నందనోద్యానంబు చందంబున హృదయానందం బగునమ్మందిరోద్యానంబునఁ జెంగల్వకొలనిచెంగట రంగారుబంగారుకలశంబులం బొలుపొందుజీవదంతపుఁజవిక వసియించునమ్మనోహరాకారునిం దూరంబునం గాంచి కాంచీకలకలంబులు నిగుడ గబ్బిమబ్బులోపల నొరపు నెరపు మెఱుపుఁదీఁగెలాగునం బొదరిండ్ల డాఁగుచు మనోన్మాదంబునన్ దూఁగుచు నిద్దంవుటద్దంబులగతి ముద్దుగులుకు బాహుమూలంబులరుచులు చెమచెమక్కని వెలిం బర్వఁ దళుక్కునఁ జనుగుబ్బలు నిక్క నిక్కి విరులు గోసి కప్పుగొప్పునం జెక్కుచుఁ బుప్పొడితిన్నియల నెక్కుచుఁ జిఱుచెమటజాఱినతిలకంబు తేటనీటిబావులనీడం జూచి నీటుగాఁ గొనగోట దిద్దుచుఁ జేనున్నపూబంతి కాలువ నద్దుచు మొయిళ్లనుండి ముత్తియంబులు రాలువిధంబున గొప్పుననుండి తెలిమల్లెమొగ్గలు రాలఁ దేనెవాఁకలు దాఁటుచుఁ జిగురుటాకుల నెలవంకగోళ్లు నాటుచుఁ జెదరినముంగురులు చక్కందువ్వుచు నల్లనల్లనం గులుకుచుఁ బల్లటీలం గని నవ్వుచు మలయానిలంబున నరజాఱుపయంట మాటిమాటికిం జేర్చుచు రాయంచలకుఁ దనగమనవిలాసంబు నేర్చుచు వెడవెడసడలినపోకముడి బిగియించునెపంబునఁ దనపొక్కిలిచక్కదనంబుఁ గన్పడం జేయుచుఁ గర్ణావతంసంబునకై చివురులు గోయుచు మరువంపుఁబాదులజాడ ద్రాక్షపందిళులనీడఁ గప్పురపుటనంటులమాటునఁ బోకమాఁకులచాటునఁ బటికంపు మెట్టికల కేళాకూళులఠేవఁ గుసుమకేసరపరాగధూసరం బైనత్రోవం జేరవచ్చు నవసరంబున. | 21 |
చ. | కనియె మృగాంకుఁ డాచెలిని గన్గొనినంతనె తళ్కుబెళ్కుగా | 22 |
శా. | ఔరా చక్కదనంబు హౌసు! మురిపెం బయ్యారె! యొయ్యార మౌ | |
| జ్ఝారే జవ్వన! మద్దిరా వగలు! మజ్ఝారే తనూవిభ్రమం! | 23 |
గీ. | కొమ్మ గా దిది బంగారుబొమ్మ గాని | 24 |
చ. | నవతనుకాంతియుక్తిని ఘనప్రతిభం బని తాను తారకా | 25 |
క. | పాటలగంధిమొగంబుం | 26 |
ఉ. | పల్లవజాతిబింకములఁ బాపుట కే నిటు సాక్షి కాంతిసం | 27 |
ఉ. | కామతరుప్రవాళనవకందళరేఖలొ లేక మన్మనః | 28 |
గీ. | కమలగర్భాదుల జయించుకలికిజంఘ | 29 |
చ. | కరభము లన్నపేరు విసఁగానె వికారము డొంకు దెల్పెడిన్ | 30 |
చ. | గొనబురువారపుంజలువకోకకు బంగరునీటిచిన్కుడా | 31 |
క. | ఈనారీమణినునుతొడ | 32 |
చ. | కటి యొకటే ధరిత్రి నవఖండము లేలఁగఁ జాలు నందుపైఁ | 33 |
సీ. | ఈలేమ చక్కదనాలవెల్లియొ కాక, | |
గీ. | మేటియీబోఁటి తేటపన్నీటిచెర్వు | 34 |
గీ. | అంఘ్రులకుఁ బద్మసారూప్య మక్షులకును | 35 |
ఉ. | బంగరుకుండ లంచు విరి బంతు లటంచును జెం డ్లటంచు రా | |
| ల్కంగ నయుక్త మిక్కలికిగబ్బిచనుంగవ కంతురాజరా | 36 |
సీ. | |
గీ. | నొమ్ము గాన్పించె బలుగజనిమ్మపండ్లు | 37 |
చ. | కమలదళాక్షి హస్తములు గల్గొనఁ బద్మిని కౌనుదీవెపో | 38 |
చ. | మృగమదసారసౌరభము మీఱినయాసతికంఠలక్ష్మి న | 89 |
క. | పగడంబుల తెగడంబుల | 40 |
క. | అంబుజముఖినెమ్మొగ మన | |
| బింబమునకుఁ బ్రతిబింబము | 41 |
ఉ. | చక్కదనంబు పాల్కడలిచాయఁ దగెం గుచమందరాద్రి యా | 42 |
సీ. | ఇది మనోహరకాంతి కింపైనబింబంబు, | |
గీ. | కురుజుతేనెయుఁ గా దిది కుసుమరసము | 43 |
ఉ. | నీరజగంధిమోవిజిగి నెక్కొనుముక్కరముత్తియంబు దా | 44 |
మ. | తళుకుందేటయు విప్పు సోఁగతన మందం బొప్పఁగాఁ దారకా | 45 |
క. | కులుకునెఱవంకకన్బొమ | 46 |
సీ. | పదపల్లవంబులఁ బద్మసంపదయును, | |
గీ. | యలకముల నీలకాంతియు నెలవుకొలిపి | 47 |
క. | నుదురా జిగి కొన్నెలచె | 48 |
సీ. | సవరంబు తనకుఁ దా సవరంబుగా నెంచు, | |
గీ. | మంపు సాంబ్రాణిధూపంబుపెంపు పెంపు | 49 |
గీ. | ఆకృతిని హేమరూపి యౌనైనముక్కు | |
| మోముఁ జూచిన శశిరేఖమోడి యమరె | 50 |
ఉ. | పన్నగకన్యల న్మనుజభామల యక్షసరోరుహాక్షులన్ | 51 |
గీ. | చూడకుండంగఁ గూడ దీసుదతిసొబగు | 52 |
క. | అని చింతించుచు నుండఁగ | 53 |
గీ. | వచ్చి కూర్చున్న వాఁడు నవ్వన్నెలాడిఁ | 54 |
క. | ఏటికి వచ్చితి నే నీ | 55 |
క. | నిలువర మయ్యెను మును నా | 56 |
క. | ఐనను గానీ నాచే | 57 |
మ. | ఇది యే మిచ్చటి కేల వచ్చితివి నీ కింటం బను ల్లేవె యొ | 58 |
క. | అనఁ జిఱునవ్వు మొగంబున | 59 |
ఉ. | వచ్చిన నేమి రావలసివచ్చితి నేపని యున్న దింట నీ | 60 |
ఉ. | కాకయె సంశయించినను కాదన నేటికిఁ గంతు బారికిన్ | 61 |
ఉ. | నీనెఱనీటు నీసొగసు నీరసికత్వము నీవిలాసము | 62 |
సీ. | కమ్మనినీముద్దుకెమ్మోవి గని యాస, | |
గీ. | యెపుడు పైకొందు ముచ్చట లెపుడు గందు | |
| ననుచు నే నుందు నేటికి నబ్బె సందు | 63 |
చ. | అన విని గుండె జల్లనఁగ నచ్చెరుపాటును రిచ్చపాటు నె | 64 |
క. | తగునే నీ కిది యెంతటి | 65 |
ఉ. | ఇంతిరొ పాలవంటికుల మీవు జనించిన దౌట నెన్నఁగా | 66 |
ఉ. | ఓర్వదు బంధుజాల మడకొత్తున నొత్తును మామగా రిదే | 67 |
చ. | రమణిరొ! యేటి కి ట్లిహపరంబులకు న్వెలి యైనయట్టియీ | 68 |
శా. | కానీరా యిటువంటినీతము లనేకంబు ల్నినుం బోలివి | 69 |
ఉ. | గోలతనానఁ బల్కెదవు కుంభ కుచాపరిరంభగుంభనో | 70 |
ఉ. | సూనశరార్తికి న్మిగులఁ జొక్కుచు దీనతఁ జేరి మ్రొక్కుచున్ | 71 |
క. | గణ్యత నేమైనసరే | 72 |
క. | అతివలహృదయము లారసి | 73 |
ఉ. | ఎంచఁగ రానిమోహమున నే నిటు పిన్నటనాఁటనుండియు | 74 |
ఉ. | నావుడు నాతఁ డేమియు నన న్మన సొగ్గక మోహ మెట్టిదో | 75 |
చ. | వికలచరిత్రుఁ డైన ముదివెంగలి యైనఁ గురూపి యైననున్ | 76 |
క. | కోపము వల దిది నీ వీ | 77 |
క. | కటకట! గురువులతోనే | |
| నటు నిటు ప్రొద్దులు పుచ్చుచు | 78 |
చ. | మగని నతిక్రమించుటలు మానినికిం దగ దంటి వొప్పితిన్ | 79 |
ఉ. | బాళి మనంబునం దణఁచి ప్రాయము వ్యర్థము చేసి యూరకే | 80 |
సీ. | కన్నకూఁతు రటంచు నెన్నక భారతీ | |
గీ. | ఇట్టి మీవారినడతలు గట్టిపెట్టి | 81 |
ఉ. | లోకములోనఁ గొంద ఱబలు ల్సతులం దనియింపలేక య | 82 |
ఉ. | పాప మటంచు నీపనికిఁ బైకొనకుండితి వేని కంతుసం | 83 |
ఉ. | ఎక్కువ మాట లేల విను మే బహుభాషలదానఁ గాను నా | 84 |
ఉ. | ఒల్లను శీల మామగని నొల్ల ను కాపుర మొల్ల మాన మే | 85 |
ఉ. | ఏలర జాలిఁ బెట్టె దిపు డేలర వేగమె యెన్ని పువ్వులన్ | 86 |
సీ. | చిత్తజాకార! నీ చెలువుఁ జూడఁగ లేని, | |
గీ. | చిన్ని వయసున నుండియు నిన్నే కోరి | 87 |
చ. | సరసుఁడ! నీ మనంబునకె సమ్మతి గావలె నంచు నింతసే | 88 |
చ. | అని యిఁక మాఱు పల్క వల దంచును దీనత దోఁప నాడుచున్ | |
| ల్లను బులకింప నీవి వదలం గరకంకణకింకిణీకన | 89 |
చ. | పరవశుఁ డయ్యె వాఁడు నలపంకజగంధియుఁ జొక్కి వ్రాలె న | 90 |
ఉ. | భావము గాంచి యావికచపంకజలోచన మంచ మెక్కియు | 91 |
మ. | తరితీపు న్వగలెత్తి మోవి మెలుపుందప్పింపులం జాల య | 92 |
చ. | కమలదళాక్షి సంకలితకంకణఝంకృతి సీత్కృతు ల్సవి | 93 |
ఉ. | మోమును మో మురంబు నురము న్బుజము ల్భుజము ల్దొడ లొడ | 94 |
సీ. | కన్నాత లాఁగించి కాంతుమోము గదించి, | |
గీ. | యరిది సూదంటుశిలవలె హత్తి హత్తి | 95 |
చ. | ఎఱుఁగదు చన్నుదోయి బిగియించి కరంబులఁ బట్టు టెంతయున్ | 96 |
ఉ. | మక్కువఁ దిట్లుకొట్లు బతిమాలుట లూఱట లెచ్చిపోరుట | 97 |
మ. | కనుదము ల్ముకుళింపఁగాఁ బులక లంగశ్రోణి నిండారఁ గాఁ | 98 |
సీ. | చిలుక వ్రాలినమేలిచిఱుదొండపం డన, | |
గీ. | గొం గొకటి కట్టి మిగిలినకోకఁ జుట్టి | 99 |
గీ. | ఇవ్విధంబునఁ జనుదెంచి యిగురుఁబోఁడి | |
| లేరుగా యంచు సదనంబుఁ బారఁజూచి | 100 |
శా. | పన్నీటం జలకంబు లాడి నునుజాళ్వాయంగదట్టంబుతో | 101 |
గీ. | కాంతునట్లనె కైచేసి కళ్కుపసిఁడి | 102 |
సీ. | కసటు వోఁ బన్నీటఁ గడిగి పువ్వులతావి, | |
గీ. | తెరయు చౌశీతిబంధంబుటరిదిపటము | 103 |
చ. | జిలిబిలితేనియ ల్చిలుకుచెందొవచందువక్రింద నంద మై | 104 |
చ. | గమగమవాసన ల్దెసలఁ గప్పఁగ నొప్పగుకప్పురంపుబా | 105 |
మ. | మొనపంట న్మడు పందుకొంచుఁ జెలి కెమ్మో వింత యానంగ నం | 106 |
క. | అద నైనపికిలిగువ్వలు | 107 |
క. | గుత్తంపుగుబ్బ లురమున | 108 |
చ. | పెనఁకువతత్తరంబునను బిత్తరి కత్తఱి నీవి జాఱిన | 109 |
చ. | అమరిక మీఱఁగా నిలిచి యందపు మై సిరి నుల్లసిల్లఁగాఁ | 110 |
సీ. | కట్టుగంబంబునఁ గట్టినగంధేభ | |
గీ. | కలయ మెలఁకువ బెలుకుచుఁ గులికి కులికి | |
| యలపుసొలఫున నిలువక నిలిచి నిలిచి | 111 |
సీ. | అరవిందమకరందమళి యానినటు లాని, | |
గీ. | అమరికకు మెచ్చి కెమ్మోవి యాన నిచ్చు | 112 |
సీ. | సొంపారఁ గుల్కెడుకెంపుబావిలితోడ, | |
గీ. | మించుతీవియ మెఱసి నటించుజాడ | 113 |
ఉ. | [5]సెయ్యక సెయ్యుచిక్కులును జిన్నిమిటారపుగోటినొక్కులున్ | |
| దొయ్యనికూర్ములుం దనరఁ దొయ్యలియున్ శశియున్ దివానిశం | 114 |
వ. | అనుటయు. | 115 |
శా. | ఆచంద్రాచలచందనాచలధరణ్యాకల్పకీర్తిప్రభా | 116 |
క. | స్వామిద్రోహరగండా! | 117 |
స్రగ్విణీవృత్తము. | దానధారాసుతా! ధర్మసత్యవ్రతా! | 118 |
గద్య. | ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానంద కందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్య తనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతంబైన శశాంకవిజయం బనుమహాప్రబంధమునందు దృతీయాశ్వాసము. | |