శతావధానసారము/విశాఖపట్టణము

వికీసోర్స్ నుండి

జయ సం॥ ఆషాఢమాసములో విశాఖపట్టణములో జరిగిన యష్టావధానములలోని పద్యములలో గొన్ని,

చ! ఇనకులమందు బుట్టిజన కేచ్ఛ వనమ్మునవనమున కేగి యచ్చటన్
దనపతీ దొంగిలించినకు దానను సంహృతుఁ గా నొనర్చి సీ
తను గొని సర్వవానరులు తన్ గొలు వంగ నయోధ్య
లన మొనరించురాముని విలాసముల" పీనుతింతు నిచ్చలుణ్1

\

(సమస్య) జ్యేష్ఠ లక్ష్మీం నమామి.

శ్లో॥:: యత్కారుణ్యా జ్జగ దధిపతి రాయతే నర్భరిక్తో
యస్యా, కోపాన్ని ధసమనుజో జాయతే 'రాజతుల్యం
యస్యాః పుత్రైస్సక లజగతీ బ్రామ్య తే దేవ తాం తాం
త్యక్త్వా త్రాతుం నిరతమపి మా జ్యేష్ఠలక్ష్మీం నమామి,2

దీనికే తెలుఁగు)

చ॥! కరుణ కలికఁ జూచిన నుండ నృపోత్త ముఁడై
ను తరణోపదృష్టిఁ గన ఒక్క క్షణమున రిక్తు స భూ
ననుఁ డగు నేమహాజనని శట్టి జగము పరిభ్రమించు నా
సరిదధిరాజు పెద్ద సుత చయ్యన సన్విడనా ఆ ప్రోవుతన్ .3

(మీసములవలని నష్టము )

సీ:॥ మెసవుచోనన్నంపు మెతుకు లో జిక్కినఁ బై వారి నెల్ల నవ్వంగఁజేయుఁi
దనముద్దియను ముద్దుగొనినచో సత్తులో దవిలి యత్యంత బాధనుఘటించు|
పొడుము పీల్చిన రెల్లుకడలంక వృద్ధి చేసినయట్లు మాలిన్య మును ఘటించు!
తేనెపానము సేయుచో నెఱుంగక కొంచెముగఁదగిల్చిన దెలుపునుఘటించు.

తే|| గీ|| పొట్టి దౌచుట్ట గాల్చునప్పు డొక కొంత కాకదగిలిన నుర సుర కాలి పాడు వాసన ఘటింపఁ జేయు నహ్వ? యటైన వాసీ మీసాలు లౌకికాగ్రేసరులకు4

(సమస్య) మీసము చుట్టుకొన్న దిసుమీ యిటు మోమటు త్రిప్పఁబోకుమా

ఉ॥ హాసము, మోమునఁ జెలఁగ సంగజు ప్రేరణచేఁ బ్రియుండు దన్ మోసము చేసి 'మోవి గొన ముద్దియ పెంగగసాగె నష్టు వా డాసఖితోడఁ బల్కు నిటు లక్కట! యల్ల రిమాను సత్తులో మీసము చుట్టుకొన్న దిసుమీ! యిటుమో మటు త్రిప్పఁబోకుమీ,5

(సమస్య) ఈక లసారస్యము నీక కాని తెలీయం గా రాదు బింబాధరీ.

మ|| కలగంటి? వివరింపు మికలచమత్కారంబు నీ నంచు న వ్వెలయన్ బల్కిన నారకాంతగని యోహె! యీకలా! యీకలా! లలనా! నాకిది చెప్ప శక్య మగునా? లక్షించి చూడంగ నీ కలసారస్యము నీక కాని తెలియం గా రాదుబింబాధరీ,6

(సమస్య) పంగుస్సుదూరం వ్రజతి క్షణేన.

శ్లో ॥ శ్రీరామచంద్రస్య దయామ వాప్య కష్టం కరిష్యా మ్యవధాన మద్య లోకే యదాఽరు హ్య హి ధూమయానం పంగు స్సుదూరం ప్రజతి క్షణేన,7

(సమస్య). యువతవసనమధ్యే డంతీన స్పంచరంతి.

శ్లో | కరికరణవ కించి ద్దృశ్య తే వశ్య తాం న స్స భవతి కిము మో వేత్యాకులం చాపిచిత్తం వద ఇగళితలజ్జం లజ్జయాఽలహి కింతే యువతివసనమ ధ్యే దంతిన స్సంచరంతి8

(సమస్య) తొడియందము చెప్పఁదరమే తోయజనేత్రా.

క || వడివడి పనియున్న ప్పుడు, పొడు మెక్కక మిగుల విసువు పుట్టించునునీ గోడవొకటి లేక యుండినఁ దొడియందము చెప్పఁదరమెతోయజనేత్రా.

శ్రీ శ్రీ శ్రీ

జయ సం॥ కార్తీకములో ధవళేశ్వరములో జరగిన యష్టానధాన పద్యములలోఁ గొన్ని, (అగస్త్యేశ్వరుఁడు)

ఉ॥ శ్రీరుచిరప్రభావ మునఁ జెన్న లరా రెడి గౌతమీనదీ
తీరము నందు నివ్వటిలి దీనుల సందఱి వేడ్కఁ బ్రోచుచుఁ
గారణ దేహుఁడై తగియగస్త్య మహామునిరాహేతిష్ఠితుం
డై రహిమీఱు దేవు ధవళాచల నాసు నుతింతు నిచ్చలు న్1

(సమస్య) కలహపుదుంప భూమిపయిఁ గామినిగాదె తలంచి చూచినన్

.

చ॥| కలకలనవ్వు నా మొగము గన్పడఁ జేయుచు గబ్బిగుబ్బల
గులుకఁగఁ జేసినంతన దిగుల్పడి యెంతటినీతిశాలియు
వలచును దాని నద్ది పెఱవానినిఁ గూడిన వానిఁ జంపు నౌ
గలహాపుదుంప భూమిపయిఁ గామినిగా దె? తలంచిచూచినన్ 2

శ్రీ. శ్రీ. శ్రీ.

మరల నమలాపురములో ఒక యష్టావధానము జరిగినదిగాని ఆది కార్డు దొరకదయ్యె.