శతావధానసారము/తిరుమాలి
ప్రభాత కాలము.
శా|| నీ రేజమ్ములు కాంతిఁ జెన్నల రె వన్నెన్ గోక ముల్. గాంచెసు
శ్రీ రంజిల్లె దెసల్ సభమ్ము వెలిఁగెన్ జెన్నారి రెల్లన్ జనుల్
సూరుల్ సూరున కర్ఘ్యముల్ విడువఁగా శుంభద్గతిన్ స్నానముల్
ప్రారంభించిరి తారకల్ జుణిగే నప్పట్లన్ బ్రభాతము నన్ 2
(సమస్య) ప్రాతః పశ్చిమపర్వ తేదినమణిః పూర్వాచ లేచంద్రమాః (పూర్తి)
శ్లో|| ధాత కుమహీధ్రలంఘనధియూ వింధ్యా ద్రిణా సర్వతో వ్యాప్తం
వ్యోమతలం, ది వేతిచ నిశే త్యస్తం ప్రతీతిర్గణా
దూతే నైవ మభాషి సత్య ముత నోసత్యం గతే వాస రే
ప్రొతః పశ్చిమపర్వతే దీనమణిః పూర్వాచలే చంద్రమాః" శ్రీ శ్రీ శ్రీ,
ప్లవసం || మాఖమాసమున కిర్లంపూడి వద్దనున్న తిరుమాలియను
నొక్క పల్లెటూరికిఁ బోయినప్పు డచ్చటిక రణంగారి యింట వారి కోరిక మీఁ
ద నాశుగా రచించిన కొన్ని పద్యములు.
మ|| కలుముల్ గల్గఁగఁ జేయునింతి కళ్యాణభూయిష్టమై
పలు చిత్రముల కాకరంబయి . సుసంవన్మ్మునై దోసతోఁ
టలలిన్ బుత్రులఁ బుత్రికల్ దగ నిరూఢంబై సయోలేటికొం.
డల రాయండు వసించు గేహముప్రభన్ దారాజిలున్ హృశ్యమై1
పరికీ యాసక్తుడు.
సీ||" రాత్రి యెప్పుడు వచ్చురా దైవమా" యంచుఁ బలుమాఱు మది
ని జవ మ్మొనర్చు|నదీ వచ్చు పైఁ దనదై వసంకేతమ్ము చేరు 'టెప్పుడ
టుంచుఁ జింత గాంచుఁ | జింతించి యచ్చోటు చేసిన పిమ్మట గలికి
రాదే” యని కళ వళించుఁ | గవళించుచు దేనీ, గాంచిన దియే"
యఁటంచు విభ్రాంతి చే నాత్మ నెంచు,
తే\గీ|| నెంచి కాకున్నఁ దత్పతి నెంచి తిట్టు
దిట్టి యేమేమొ మదిఁ గోర్కె దీటుకొలువుఁ
గఱచు పాము నెఱుగఁడు పఱచుభూత
మెఱుఁగఁ డన్యాంగ నాసక్తుల డేని జనుఁడు.2
ఉపరిసురతము.
సీ|| అతిరహస్య పుఁజోటు అరయఁగా నుంకించుధవునికంగన మూయఁ దలఁ
చి మఱచు | నేమాటయో చెప్పు నెదలోనఁ దలపోసి వలుకు వేఱొ
<poem>క మాట పలికికొంకు | సిగ్గేడఁ బోవునా చేటేడ కేగు- నిశ్శం
క రతికృతి నేర్పు చూపు | నెదురొత్తుల మెసంగునెడ మోదమందు
నాయెసకమ్ము లేనిచో నేవగించు,
తే! గీ! ఇట్లు పలుభంగుల నటించి యిశుధన్వు
శివ మొకించుక డిగే నేనిఁ జెలువఁ గాంచు
సిగ్గుఁ జేటును వచియింపఁ జెల్ల దేరి
కది తమఃకారి యగుకంతు నాసం గాని3
శుభకృత్సం | మాఖమాసమున నూజవీడు సంస్థానములోని సం పూర్ణ శతావధానములోని కొన్ని పద్యములు,
చంపకమాల, లక్ష్మి
సిరినగవిందవాసిని వి, శేషతనూరుచిభాసమాన సుం డరి హరిరాణి రిక్త జన, తాపరి తాపనివారిణి బురం దరముఖ దేన తాబ్దపద, సొనతపాదసరోరుహన్ గృపా కర సర విందలోచన ద, గన్నుతియిం చెద సంపదర్థినై1
శార్ధూలము, నిర్గుణబ్రహ్మము.
నీరూపు న్నిగమాంతపండితగతి, న్ని స్కామ సేవ్యున హా ధీరు న్నిర్గుణు నిర్మలు న్నిరుపముం, దేజోమయు న్భాస్వరున్ వై రాదిప్రతిబద్ద చిత్తులకు, నెన్నండేనియుంబొందఁగాఁ జేరంగా సతిదుర్ల భుం బరు మదిం, జింతింతు సశ్రాంతమున్.2
మత్తేభము, ఎడ్వర్డుచక్రవర్తి,
ఘనుఁ డత్యంతకలావిదుండు రుచిరా కారుండు శాంతాత్మ కుం
డసఘుండెంతయు దానశీలుఁడు సీతా, స్యన్వచ్ఛనంశ్యుండు స
జనమాన్యుండుసమస్త రాజమక్క టీ, సంలగ్నరత్నప్రభా
కవదంఘ్రీమతిభాసమానుఁడయివే, డ్కంజెందునెడ్వర్డిలన్.3