శతావధానసారము/చెన్నపట్టణము

వికీసోర్స్ నుండి


విజయ సం॥ మార్గశీర్షములో చెన్న పట్టణములో నడియారులో నానేబిసంటుదొరసాని యొద్ద జరిగిన యష్టావధానములోని యొక పద్యము

సీ|| శేషునిఁబోలి లెక్చెరు చెప్పఁగాఁ జాలు నానే బిసంటొక్కయండఁదనర
నాపె లెక్చెరు విని యలరు నానా దేశ సజ్జనావళి యొక్క చక్కి - దనర
"తెలియ దేమందురా దేవుఁడా యింగ్లీ" షటను మాదృశులు నొక్క
టను జలంగ | నింగ్లీషు చదివెద నిది ముదలేనని పల్కు వారలునెక్కప్రక్కదవర||

తే!!! నొప్పు నీసభలోఁ గడు మెప్పు దసర
జలుపఁబూనితి నవధానసరణి నేను
నీదుదయకొంతనా మీఁద నెగడవలయు
లేక యుండిన నెగ్గుట లేదు నేఁదు.15

ఆ పట్టణముననే... రెంటాల సుబ్బారావుగారి, మేడలోని యవధా సములోని కొన్ని పద్యములు.

సీ: ఏపట్టణము వింద్యకీభాగమున నుండు రాణి రాజ్యమునకు రాజధాని యేపట్టణపు మేడ లెలమిఁ జూచిన వారి తలగుడ్డ బర్వు తత్క్షణము తీరు నేపట్టణము వాణిశోపమా నవిద్య ద్ర్యాతమునకు నా వాసభూమి యేపట్టణము తా నింగ్లీషు భాషకుఁ బెంపుడుతల్లియై యింపుగుల్గు ............................................................................................

I have much pleasure in stating that I was present at the remarkable exhibition given by D, Tirupati gastri and Ch. Venkata sastri, of the powers of memory they possess, It entirely excelied any thing I should have thought possible, judging log ordinary standards and in addition to feats of memory the Bestries sboved .. great powere of improvising verse in difficult metres and nimble wit in repartee.

ADYAR, MADRAS.

{Sd) ANNEE BESANT..

28 December 1893.

తేటగీ॥! నట్టియీ చెన్న పట్టణాఖ్య పురమందుఁ
జేవ మాజంగ నిప్పుడష్టావధాన
కష్టకృతిఁ జేయఁబూనికిఁ గాన దేవి!
నీ సహాయం బొకించుక నెగడవలయు1

సీ| ఎవనికుశాగ్రబుద్ధిని శేషములు చూడ శతఘంట కవికి నాశ్చర్య మొదవు !
నెవనియుక్తి ప్రయుక్తి విచిత్రములు గన్న దార్కికు డైనఁ దత్తర
ము చెందు | నెవనినిర్మల సౌక్యనివహంబు విన్న చో వైయాకరణులు
వహ్వా యటంచు | రెవనియాదార్యరీతి విని బంగ రు కొండ యెప్పు
డేమొ యని భీతిల్లుచుండు:

తే.గీ॥సట్టి రెంటాలసుబ్బ రాయాభిధాను
సౌధమునఁ బండితావృతసభనుజేయు
బూనితిని దేవి! యష్టావధానకృతిని
నీదుసాహాయ్యమున భవానీ? మదంబ,2

శ్రీ. శ్రీ. శ్రీ.