శతావధానసారము/కోటరామచంద్రపురం
(రాయబారము) శార్దూలవిక్రీడితమ్
త్వయ్యేవం నిముఖే నితాంతమదనావే సేన సా సాంప్రతం
త్వామే వాలపతి త్వదీయసుగుణాన్ గా తేహి వీణాది నా
దూలీః ప్రేషయతే పునః పునర హెూ అసాదృశస్త్వం తతో
నీరోదాత్త గుళోత్త గో భవ నతే కోపో స్తుతస్యాం వృధా8
(చంద్రాస్త మయము) మా లినీ వృత్తం.
కువలయసము దాయే కొంతభాగ్యేన శూన్యే
విరహిజనసమూహే శాంత కామాగ్ని తాపే
ధనయువతికదంబే ముక్త నైపథ్య వేసే
చరమదిశిపయోధౌ చంద్రబింబం పపాత9
(సమస్య) సరసుని వైపు వీపు నలచాన మొగం బటుగోడ వైపు,
చ!! సరసుని వైపు వీపు నలచాన మొగంబటుగోడవైపు నా
సరసుఁడు కేలుచాపు నలచానయుఁజన్ను లఁ జేయిమోపు నా
సరడుగుకోర్కెఁజూపు సలచానదొడందొడలోనఁబోఫు నీ
వరుసనె తెల్లవారె నుక వైఖరి నొక్క ని కొక్క వేశ్యతోన్ .10
సభకు వేశ్యలను పిలువకూడదనుట.) వసంతతిల కావృత్తం
షర్ణేనవా నచగురు ర్న చవృత్తి రీత్యా
నోవ గుణై ర్నచవర్తనతో పినూనాం
ఆహూయతే తదపి గానవి నోదనార్థం
నారాంగ నాజనవి శేష ఇదంతు దుష్టం11
. శ్రీ శ్రీ శ్రీ.
వికారిసం|| ఆషాఢమాసము లో రోటరామచంద్రపురం రాజుగారు
చేయించినసభలో రచియించిన పద్యములలోఁ గొన్ని ,
తెల్లవారు సమయమందలినక్ష,త్రములు.
మ|| పరమం బై నతిరస్కృతిం గని సభన్ భావింపఁగా రానిదుః
ఖరసా వేశత నొప్పుపండితునివక్త్రమున్ విడంబించుచున్
జరమప్రస్థిత పాండురోగినఖచ్ఛాయాను కారిస్థితిన్
ధరణి దారలొ లొప్పు నస్త మితుఁడౌ తారేశుకాలమ్మునన్1
..
సమీషమందున్న యురిశిక్ష కల వాడు.
ఉ||లోకము క్రుంగినట్లు వనిలోపల వ్యాఘ్రముఖము నందుఁదా
నూకొని పడ్డ భంగిని ననూస కుజానృతుపో ల్కె నెంతయున్
హీ? కడుదుష్టమైనపనియేల యొనర్చితి" నంచుఁ జంతమై
నాకులు : డయ్యె నొక్కఁడు. సమాగతమృత్యు ముఖాంతకాళుడై2.
ఇంద్ర చాపము.
మ|| పరిణామోజ్వల పంచవర్ణయుతమై భప్యూదయం బై మహా
పరితోషాస్పదమై మయూర విలసద్బర్హోపమానమ్మునై
సరవిన్ హాలిక జాతీ కెంతయును నుత్సాహంబు సంధించుచున్
వఱలెr 'మేఘగతంబు నై మఘవుచాపం బెంతయు వింతగాన్ 4
వికారీ! సం!! - శ్రావణమాసములో ఆలమూరులో జరగిన యవ
ధానములో రచించిన 55 వద్యములలోఁ గోన్ని.
(శ్యామలాంబ) మత్త కోకిల.
కోమలాంఘ్రిసరోరుహ్య మదకోకిలా ప్రతిభ స్వసన్
శ్యామలాంబ నుతింతు నెంతయు సంతసం బిగురొత్తంగన్
భూమి నేజగదంబఁ గొల్చిన పూరుషుండు సదా సుఖ
శ్రీమహత్త్వభుత్వకీర్తు లఁ జెంది చెన్న లరాడిన్1
ప్రకృతావధాన విషయమై సభ్యుల యోజన .
సీ||శతఘంటక వసమ్ము సల్పుటిట్టిదియొక్కొ? తెలి సెనే డని లోనలుకు
వారు . మొదటఁ జెప్పిన పాదమున విస్మృతియు లేక చెప్పి రేయని ప్రీ
తిఁజెందు వారు! ఇ దియ బ్బెసమొ లేక యే దేవు కరుణయో గుగుకృ
పయో" యంచు గొణుగువారు! " కాదిది యుచ్ఛిష్టగణపత్యుపాసనా
ఫల"మంచు లోలోలోనఁ దలఁచువారు,
తే: గీ|| బ్రైండుశక్తియ యిది” యంచుఁ బల్కువారు
పూర్వజన్మ సుకృత " మని పొగడువారు
వైరి సభనున్న వారు శతావధాన
మరసి తిరుపతి వేంక టేశ్వరు లొనర్చ2