వ్రతరత్నాకరము/సరస్వతీవ్రతము
సరస్వతీ వ్రతము
ఏవంగుణవి శేషణవిశిష్టాయామస్యాం శుభతిథౌ మమ (అస్మాకం) ధర్మార్థ కామమోక్షురూప చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సకలవిద్యాపారంగతత్వసిద్ధ్యర్థం చ వర్షే వర్షే వస్త్ర ప్రయుక్తాం శ్రీసరస్వతీదేవతా ముద్దిశ్య సరస్వతీదేవతా ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోప చార పూజాం కరిష్యే.[1]
అని సంకల్పము చేసి కలశపూజాదులను చేయవలెను
సరస్వతీ పూజా ప్రారంభము
శ్లో. (పుస్తకేషు యతో దేవీ క్రీడతే పరమార్థతః, తత స్తత్ర ప్రకుర్వీత థ్యానమావాహనాదికమ్.) ధ్యాన మేవం ప్రకుర్వీత సాధకో విజితేన్డియః, ప్రణవాసనమారూఢాం తదర్ధత్వేన నిశ్చితామ్. అఙ్కుశం చాక్షసూత్రంచ పాశం వీణాంచ ధారిణీం, ముక్తాహారసమాయుక్తాం 'మోదరూపాం మనోహరామ్. కృతేన దర్పణాభేన వస్త్రేణోపరి భూషితాం, సుస్తనీం వేదవేద్యాం చ చన్ద్రార్ధకృతశేఖరామ్, జటాకలాపసంయుక్తాం పూర్ణచన్ద్రనిభాననాం, త్రిలోచనాం మహాదేవీం స్వర్ణనూపురథారిణీమ్. కటకైః స్వర్ణరత్నాథ్యైర్ముక్తావలయభూషితాం,కమ్బు కణ్ఠీం సుతామ్రోష్ఠీం సర్వాభరణభూషితామ్.కేయూరైర్మేఖలా ద్యైశ్చ ద్యోతయన్తీం జగత్రయం, శబ్దబ్రహ్మాత్మికాం దేవీంథ్యానకర్మసమాహితః.
సరస్వత్యై నమః ధ్యాయామి.
(సరస్వతి పుస్తకములందు సర్వదా క్రీడించుచుండునుగావున జితే ద్రియుఁడయినపురుషార్థములఁ గోరునతఁడుకములందే ధ్యానావాహనాది పూజలం జేయవలయును) ఓం కారరూప మగుపీఠమునఁ గూర్చుండునదియు, ఆఓంకారార్థమని నిర్ణయింపఁబడినదియు, 'అంకుశము, జపమాల, పాశము, వీణను ధరించునదియు, ముత్యాలసరములను దాల్చినదియు, సంతోష స్వరూపురాలును, చక్కగా నేయబడిన యద్దము, బోలెడి వెలిపట్టుబట్టను గట్టినదియు, సుస్తనియు 'వేదములచే నెఱుఁగఁ దగినదియు, అర్ధ చంద్రుని శిరస్సునందుఁ దాల్చినదియు, జడలగుంపుతో వెలయునదియు, నిండుచంద్రుని బోలు మోముగలదియు, మూడుకన్నులు గలదియు, దేవతలలో నెక్కువయినదియు, బంగారపుటందెలు, రవలు చెక్కిన చేతి గాజులు,ఓడ్యాణము, వంకీలు మొదలగు సకలభూషణంబులఁ దాల్చి నదియు, ఎఱ్ఱనిమోవియు, శంఖమువంటి మెడయుఁ గలదియు,తనభూషణముల మెఱుఁగుచే ముల్లోకంబులను వెలుఁగఁజేయు నదియునైన శబ్దబ్రహ్మస్వరూపిణి యగుసరస్వతీ దేవిని ధ్యానించుచున్నాను. 39
సరస్వతీ వ్రతము
అత్రాగచ్ఛ జగద్వన్ద్యే సర్వలోకైకపూజితే,
మయా కృతామిమాం పూజాం గృహాణ జగదీశ్వరి.
సరస్వతీమావాహయామి
జగముల నేలునట్టియు, జనులచేఁ గొనియాడంబడు ఓతల్లీ!
యిచ్చటికి విజయము చేసి నేనొనర్చుపూజను గైకొనుము.
అనేకరత్న సంయుక్తం సువర్ణేన విరాజితం,
ముక్తామణ్యఞ్చితం చారు చాసనం తే దదామ్యహమ్.
సరస్వత్యై ఆసనం సమర్పయామి.
ఓ సరస్వతీ! రతనాలు చెక్కి ముత్యాలసరంబులు గట్టిన
బంగారపుసింహాసనము నొసఁగెదను అనుగ్రహింపుము.
గన్ధ పుష్పాక్ష తైః సార్ధం శుద్ధతోయేన సంయుతం,
శుద్ధస్ఫటిక తుల్యాఞ్గి పాద్యం తే ప్రతిగృహ్యతామ్.
సరస్వత్యై పాద్యం సమర్పయామి
ఓస్ఫటికమువలెఁ దెల్లనైన మేనుగల దేవీ! గంధపుష్పా
క్షతలు చేర్చిన పరిశుద్ధజలముచేఁ బాద్య మొసఁగెదను. స్వీక
రింపుము.
భక్తాభీష్టప్రదే దేవి దేవదేవాదివన్దితే,
ధాతృప్రియే జగద్ధాత్రి దాదామ్యర్థ్యం గృహాణ మే.
సరస్వత్యై నమః అర్ఘ్యం సమర్పయామి
భక్తుల కోరికల నిచ్చుదానా ! ఇంద్రుఁడు మొదలగు దేవ
తలచేఁ గొనియాడఁ బడుదానా ! లోకరక్షకురాలా! బ్రహ్మ
వ్రతరత్నాకరము
పూర్ణచన్ద్ర సమానా భే కోటిసూర్యసమప్రభే,
భక్త్యా సమర్పితం వాణి గృహాణాచమనీయకమ్.
సరస్వత్యై నమః ఆచమనీయం సమర్పయామి.
పున్నమచంద్రునివలెను, కోటిసూర్యులవలెను బ్రకాశించు ఓదేవీ! నేను భక్తితో నొసఁగు ఆచమనీయమును గ్రహింపుము.
కమలభువనజాయే కోటిసూర్యప్రకాశే, విశదశుచివిలాసే
కోమలే హారయుక్తే, దధిమధుఘృతయుక్తం క్షీరరమ్భా
ఫలాఢ్యం, సురుచిరమధుపర్కం గృహ్యతాం దేవవన్ద్యే.
సరస్వత్యై మధుపర్కం సమర్పయామి
కోటిసూర్యులవంటి కాంతిగలదానవు, శుభ్రమైనచిఱునగవు గలదానవు, హారములఁ దాల్చినదానవు, దేవతలచేఁ గొనియాడఁబడుదానవునైన యోబ్రహ్మపత్నీ! పెరుగు,తేనె, పాలు, అరఁటిపండ్లు గలిపిన మధుపర్కము నొసఁగెనను గ్రహింపుము.
[2]
దధిక్షీరఘృతో పేతం శర్క రామధుసంయుతం,
పంచామృతస్నానమిదం స్వీకురుష్వ మహేళ్వరి.
సరస్వత్యై పఞ్చమృతస్నానం సమర్పయామి
శుద్ధోదకైశ్చ సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం,
సువర్ణ కలశానీ తైర్నా నాగస్ధసువాసితైః
సరస్వతీం స్నాపయామి
పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/42 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/43 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/44 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/45 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/46 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/47 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/48 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/49 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/50 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/51 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/52 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/53
ఒకానొకప్పుడు సూతమహాముని శౌనకాదిమునీంద్రులను జూచీ యిట్లనియె: "ఓ మునులారా ! మీ రందఱు వినుఁడు. దుర్గా లక్ష్మీ సరస్వతీపూజ యను వ్రతములలో నుత్తమ వ్రతం బొక్కటి కలదు, ఆవ్రతముయొక్క విధానంబు నెఱిఁగించెదను. వినుఁడు, ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలీ వ్రతంబును తొమ్మిది దినములు చేయవలయును. లేదేని మూలానక్షత్రమునాఁటినుండి యైనను జేయవలెను. దానికి శక్తిలేనివాఁడు మహానవమినాఁడైనను జేయవలెను. ఈ వ్రతంబు నాచరించుమానవుఁడు శాశ్వత సంపదతో గూడిన వాఁడై యుండి, యీ దేహంబు విడిచినపిమ్మట దుర్గాదేవియొక్క లోకంబును జెందుచున్నాడు.” అని సూతుఁడు ఋషులతోఁజెప్పఁగా, వా రమ్మునిపుంగవునిఁ జూచి, "ఓమహాత్మా తొల్లి యీ వ్రతంబు నెవ్వ రాచరించిరి? ఎవరికి దీని వలన గొప్పసుఖంబు గలిగెను? ఆనతిం"డని యడుగఁగా సూత మహాముని వారితో నిట్లనియె. “ఓఋషులారా! మీరు సావధానముగా వినుఁడు. ఆవ్రతమహిమను మీకుఁ దెలియఁజెప్పెదను. తొల్లి కృతయుగంబున సుకేతువను రాజొకఁ డుండెను. అతఁడు పుణ్యాతుఁడు. జనులను న్యాయముతోఁ బాలించువాఁడు. ఎడతెగని కలిమితోఁగూడిన వాఁడు. చతురంగ బలసమృద్ధిగలవాఁడు. అతనికి విఱివిగలకన్నులుగలదియు, వయసుగలదియు, సకలశుభకార్యములఁ జేయునదియునైన సువేది యనుభార్యగలదు. ఆపతివ్రత యాతనికిఁ దగినదై యుండును. ఆతని రాజ్యమున గ్రామము, చోరభయము లేకయుండెను. అట్లు అతఁడు రాజ్యమేలుచుండఁగా నాతనిసామంత రాజులకు ఆతనివిఁద ఓర్వ లేమిపుట్టెను. ఆసంగతి సుకేతు వెఱిఁగి, వారిపైకి యుద్ధమునకుఁ బోయెను. ఆ శత్రువులాతనిదండునంతయుఁజంపి, యతనినిఁగొట్టఁగా నతఁడోడి పరుగెతనారంభించెను. అట్లుపరుగెత్తుచుండు ఆసు కేతువు నతని భార్యనువేది వెంబడించెను. అట్లు వారిద్దలోకవనము నుండి మఱి యొకవనంబునకుఁ బోవుచు నొక్క యేకాంతమయిన యరణ్యము నడుమఁ జేరిరి. వారాహారములేక యాఁకలిదప్పులకు మిక్కిలి డస్సిరి. రాజన్ననో శత్రువుల బాణముల దెబ్బలుతీనియున్న వాఁడగుటచే రోగములలోఁ జిక్కి నడువ లేక పోయెను. అంతనాసు వేది తనయాఁకలిదప్పుల కే కాళ, తనభర్తయొక్క యవస్థకును. మిక్కిలి విచారపడినదై, తనమగనిని తన భుజములమీఁద నెక్కించు కొని, ఒకవనమునుండి మఱియొక వనంబునకుఁ బోవుచుండెను. ఆ ప్రకారము సువేది పోవునపు డాంగీర సమహామునియెదురపడెను. ఆసువేది యమ్మునినిఁ జూచి వెక్కి వెక్కి యేడ్చెను. ఆయాంగి రసమహాముని యాసువేదిని జూచి 'అమాయీ! దుఃఖపడకుము. నీకు మేలయ్యెఁడు. మీరలెవ్వరు? ఏల బహుదుఃఖములలోఁబడి యున్నారు? మీ రాజ్యమేది? మీ బంధువులు ఎచ్చట సున్నారు ? ఏల యాకఁలితోఁగష్టపడుచున్నా' రని యడుగఁగా, సువేది, తనమగండు శత్రువులతో యుద్ధముచేసి యందోడి యడవులకు వచ్చి రోగములలోఁబడి నడువ లేకపోఁగాఁ దానిట్లు మగనిని మోసుకొని పోవుచున్నట్లు చెప్పి తనకష్టము దొలఁగి సుఖపడఁ దగినయుపాయముఁ దెలువఁగోరెను. ఆంగీరసుఁడును, 'ఓసు'వేదీ ? పంచవటీనదీతీరమునకు నాతోఁగూడ రమ్ము. అచ్చట దుర్గాదేవళ మున్నది. ఆదుర్గాదేవిని బూజించినట్లైన, మీకు పుత్రపౌత్రాదీ సంపదలును, రాజ్యమును, మహదైశ్వర్యమును గలుగునని చెప్పఁ గా, సంవేదియు నచ్చటికిఁ బోఁదలఁచి, భ రనుమోసికొని బహు దూరముపోయి, యాపంచవటినది యొడ్డు చేరి భర్తతోఁగూడ స్నానము చేసి, యాబ్రాహ్మణోత్తమునియానతిప్రకారము దుర్గాదేవిని ఆశ్వయుజశుద్ధపాడ్యమిమొదలు మహానవమివఱకుఁ గుంకుమాదులతోఁబూజించి, పదియవదినమున 'దుర్గాం దేవీగ్ శరణమహం ప్రపద్యే౽లక్ష్మీర్మేనశ్యతాంత్వాం వృణే' అనుమంత్రముచే క్షీరాన్నముతో హోమము చేయించెను. తర్వాత సువేది యాంగీరసమహామునికి దంపతిపూజ చేసి, బ్రాహ్మణుల కెక్కువగా దశదానము లిచ్చి వ్రతము పూర్తిగావించుకొని, తనయాశ్రమమునకు వచ్చెను. వచ్చిన కొన్నిదినములకే ఆసువేది గర్భము దాల్చి తొమ్మిదినెలలు నిండినతోడనే పురుషశిశువును గనెను. ఆంగీరసమహామునియే యాశిశువునకు జాతకర్మనామకరణంబులు జరిపించెను. ఆమునియే యాశిశువునకు సూర్యప్రతాపుఁడని పేరు పెట్టెను. ఆబాలుఁడు శుక్లపక్షచంద్రుని మాడ్కి దినదినప్రవర్ధమానుఁడై సకలశాస్త్రములను జదివి, యౌవనము పొంది ఋషి యొసఁగిన ప్రభావముతోఁ గూడి మహర్షులందఱి దీవనలను బడసి శత్రుపురంబునకుఁ బోయి పగతురనందఱం బరిమార్చి, తనరాజ్యము లాగికొని, తల్లిదండ్రులతోఁ గూడఁ దనపురంబునఁ కేగి రాజ్యము చేయుచు సుఖంబుగా నుండెను. ఆసువేదియుఁ బ్రతియేఁటను ఈవ్రతము నాచరించి పుత్రపౌత్రధనసమృద్ధి గలదై యిహంబున సర్వసుఖములను బొంది, పరలోకమున శాశ్వతమోక్షసుఖమును బొందినదాయెను; కావున మునీంద్రులారా! సకలవర్ణాశ్రమములవారును ఈవ్రతంబు చేయవలెను. ఈవ్రతకథను విన్నవారును, చదివినవారును, చదివి వినిపించినవారును పాపములనుండి తొలఁగి యుత్తమలోకంబు నొందుదురు.
శ్రీస్కాందపురాణాంతర్గతం బగుసరస్వతీవ్రతము సంపూర్ణము.
————
- ↑ "శుక్లాంబరధరం" మొదలగు భగవద్ధ్యానము మొదటఁజేసి పిమ్మట పైరీతిగా సంకల్పము చేసి, ఆవల కలశపూజయు, గణాధిపతి పూజయు, ప్రాణ ప్రతిష్టయుఁ జేసి, పూజయారంభింపవలెను. భగవధ్యానము, సంకల్ప విధానము, గణాధిపతిపూజ, ప్రాణప్రతిష్ఠ వీనివిధానములను వినాయకవ్రతముఁ జూచి తెలిసికొనవలయును. గ్రంథము పెరుగు ననెడి హేతువుచే నవి యిచ్చట వాయఁబడలేదు.
- ↑ *పంచామృతము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, ధూపము, దీపము, నైవేద్యము, నీరాజనము మొదలగు వానికిగాను వలయు మంత్రములను (వినాయక వ్రతమునందు) చూడవలయును.