Jump to content

వ్రతరత్నాకరము/వినాయకవ్రతము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

వ్రతరత్నాకరము

ప్రథమభాగము

వినాయకవ్రతము

[1] ఆచమ్య = ఆచమనము చేసి


శ్లో.

శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాన్తయే.

[2]అయం ముహూర్తః సుముహూర్తో౽స్త్వితి భవన్తో మహాన్తో౽నుగృహ్ణన్తు = ఈముహూర్తము మంచిముహర్త మగుఁగాక యని పూజ్యు లగుపెద్ద లనుగ్రహింతురుగాక.
[3]అయం ముహూర్తః సుముహూర్తో౽స్తు = ఈముహూర్తము శుభముహూర్త మగుఁగాక.
1. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలంచంద్రబలంతదేవ, విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం౽ఘ్రి యుగం స్మరామి.

2. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః, తత్ర శ్రీర్విజయోభూతిర్ధృవానీతిః మతిర్మమ.

3 . అనన్యాశ్చిన్తయన్తో మాం యేజనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమంవహామ్యహమ్.

4. స్మృతేసకలకల్యాణభాజనంయత్రజాయతే, పురుషన్తమజంనిత్యం ప్రజామిశరణంహరిమ్.

5. సర్వదాసర్వకార్యేషు నాస్తి తేషామమఙ్గలం, యేషాం హృదిస్థో భగవాన్

1. ఓలక్ష్మీ దేవిభర్తా ! నేను నీపాదములను ధ్యానించు చున్నాను. నీ పాదముల ధ్యానించుటయే (నాకు) లగ్నము. అవే శుభదినము. అదియే తారాబలము. అదియే చంద్ర బలము. అదియే విద్యాబలము. అదే దైవబలము.

2. ఎచ్చట యోగేశ్వరుఁడగు కృష్ణమూర్తియు, గాండినధారియగు అర్హుసుండును నున్నారో, అచ్చట సంపద యు, జయమును, వైభవమును, బాయకయుండును.

3 . ఎవరితర కార్యములనెల్ల విడిచి నన్నే ధ్యానించుచు, నన్నే యుపాసన చేయుచున్నారో, ఎల్లప్పుడు నాకు భక్తులై యుండువారి యోగ క్షేమములను నేను విచారించుకొనుచున్నాను. (అని కృష్ణమూర్తి యర్జునునకు. జైప్పెను.)

4. స్మరించినమాత్రముననే సంపదల నొసఁగువాఁడును, సకలభూతముల లోపల నుండువాడును, పుట్టుక లేనివాఁ డును, శాశ్వతుఁడును నైన విష్ణుమూర్తిని నేను శరణుచొచ్చుచున్నాను. 5 - 6. మేలులకెల్ల నునికిపట్టును, నల్లఁగల్వవలె నల్లనైన వాడును, దుష్టులను ఓడించువాడును నైన శ్రీకృష్ణమూర్తి నేమానవులు తమ మనస్సులందుఁ దలఁచుచున్నారో, అట్టివారికిఁ మఙ్గళాయతనం హరిః. 6 . లాభస్తేషాం జయ స్తేషాం కుతస్తేషాం పరాభవః, యేషామిన్దీవరశ్యామో హృదయస్థో జనార్దనః.

7. ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదాం, లోకాభి రామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్.

—————♦♦—————

వి నా య క ప్రార్థనా

సుముఖశ్చైకదంన్తశ్చ కపిలో గజకర్ణకః, లమ్బోదరశ్చవికటో విఘ్నరాజో గణాధిషపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాల చన్ద్రో గజాననః,వక్రతున్డః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి, విద్యారమ్బే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా. సఙ్గ్రామే సర్వకార్యేషు విఘ్న

__________________________________________________________________________________________ జెఱుపు గలుగదు. వారికి లాభమును గెల్పును గలుగునుగాని, వారికోటమి యెక్కడిది ? వారన్ని కార్యములందును జయమునే పొందుదురు. 7. ఇడుములను దీర్చి యన్నికలుములనొసంగునట్టి జన ప్రియుఁడయిన శ్రీరామమూర్తిని మాటిమాటికి మ్రొక్కుచున్నాను.

సుముఖ, ఏకపంత, కపిల, గజకర్ణక, లంబోదర, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్షు, ఫాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, హేరమ్బ, స్కన్దపూర్వజ అను పదునాడు నామములను చదువ ప్రారంభించునప్పుడును, పెండ్లియందును, ఊరికిఁ బ్రయాణమై పోవునప్పుడును, ఊరినుండి మఱలివచ్చునప్పుడు, యుద్ధములకుఁ బోవునప్పుడును, మఱి యనేక కార్యసముయంబులందును చదువువారికిని, వినువారికిని విఘ్నముగలుగదు. మఱియు వేల్పులుగూడఁ దమకోరిన కార్య స్తస్య న జాయతే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి, సర్వవిఘ్నచ్ఛిదే తస్మై శ్రీగణాధిపతయే నమః.

ఓం దైవీ గాయత్రీ ఛన్దః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓమ్ భువః, ఓగ్ం సువః, ఓమ్ మహః, ఓమ్ జనః , ఓమ్ తపః, ఓగ్ం సత్యం, ఓమ్ తత్ సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్ , ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.

మమ ఉపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే, అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే,శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వన్తరే, కలియుగే, ప్రథమపాదే, జమ్బూద్వీపే, భరతవర్షే భరతఖణ్డే, శకాబ్దే, మేరోః, దక్షిణదిగ్భాగే....... సమస్తదేవతా బ్రాహ్మణసన్నిధౌ, వర్తమానే, వ్యావహారిక చాంద్ర మానేన ప్రభవాాదిషష్టిసంవత్సరాణాం మధ్యే ...నామవత్సరే... ఆయనే...ఋతౌ...మాసే...పక్షే , ...తిధౌ... వాసర యుక్తాయాం ఏవంగుణవిశేషణవిశిష్టాయా మస్యాంశుభతిధౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాఞ్ఛాఫలసిద్ధ్యర్థం, సమస్తదురితోప శాన్త్యర్థం, సమ స్తమఙ్గళావాప్త్యర్థం, వరసిద్ధివినాయక దేవతా

__________________________________________________________________________________________ ములు నెఱవేఱుటకై యేవిఘ్నేశునిఁ బూజించిరో, అట్టి మహాత్యుడును సకలవిఘ్నములను బోగొట్టువాడును నైన మహాగణాధిపతికొఱకు నమస్కారము. ముద్దిశ్య, వరసిద్ధివినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.[4]

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే, తదంగత్వేన కలశ పూజాం కరిష్యే.[5]

కలశం గన్ధపుష్పాక్షతై రభ్యశ్చ్య (కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షతలద్ది లోపల నొక పుష్పము నుంచి) తదుపరి హస్తం నిధాయ (ఆ పాత్రమును చేతితో మూసిపెట్టి ఈ క్రింది మంత్రము సుచ్చరించి గంగాది నకలతీర్ణోదకములను కలశమునం దావాహనము చేయవలెను.)

1. కలశస్య ముఖే విష్ణుః కణ్ఠే రుద్రః సమాశ్రితః, మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాస్మృతాః,

2. కుక్షౌతుసాగరాః సర్వే సప్తద్వీపా వసున్ధరా, ఋగ్వేదో౽థ యజుర్వేదః సామవేదో హ్యధర్వణః.

3. అఙ్గైశ్చసహితాః సర్వే కలశామ్బుసమా


1. కలశముయొక్క పైభాగమున విష్ణువును, గొంతుకడరుద్రుఁడును, అడుగున బ్రహ్మయు, నడుమ సప్తమాతృకలును, లోపల నేడుసముద్రములును, ఏడుద్వీపములును, భూమియు నున్నవి. 2. ఋగ్వేద, యజు ర్వేద, సామవేద, అధర్వణ వేదములును, శిక్షా వ్యాకరణ, ఛందో, నిరుక్త జ్యోతిషంబు లనెడి యాఱంగముల తోఁ గూడినవై కలశోదకము నాశ్రయించి యున్నవి. 3. పాప శ్రితాః, ఆయాన్తు దేవపూజార్ధం దురితక్షయకారకాః. 4. గఙ్గేచ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ క్ సన్నిధిం కురు.

మంత్రము - ఆపోవా ఇదగ్ సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవఆపోన్న మాపో౽మృతమాపస్సమ్రాడాపో విరాడాపస్స్వరాడాపశ్ఛన్ధాపోజ్యోతీగ్ ష్యాపోయజూగ్ ష్యా పస్సత్యమాపస్సర్వా దేవతాఆపోభూర్భువస్సువరాపఓం.

కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమణ్టప మాత్మానం సంప్రోక్ష్య (కలశమందలిజలమును చేతిలోఁ బోసుకొని, పూజకొఱకయిన వస్తువులమీఁదను, దేవుని మందసమునందును తననెత్తి నను జల్లుకొనవలసినది.)

_________

గ ణా థి ప తి పూ జ

గణానాంత్వాగణపతిగ్ం హవామ హేకవిం కవీనాముపమ శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభిస్సీదసాదనమ్ - మహాగణాధిపతిం ధ్యాయామి. మహాగణాధిపతిం ఆవాహయామి.

మహాగణాధిపతయే ఆసనం సమర్పయామి.
మహాగణాధిపతయే అర్ఘ్యం సమర్పయామి.

________________________________________________________________________________________ ముల నెల్లఁ బరిమార్చునట్టి యవి యెల్ల దేవపూజకొఱకు కలశమునందు వచ్చి చేరునుగాక 4. ఓగంగా దేవీ ! ఓయమునా దేవీ ! ఓగోదావరీ దేవీ ! ఓసరస్వతీ దేవీ ! ఓనర్మదా దేవీ ! ఓసింధు దేవీ ! ఓకావేరీ దేవీ ! మీరందఱీ కలశంబునఁ జేరుదురుఁగాక.

మహాగణాధిపతయే పాద్యం సమర్పయామి
మహాగణాధిపతయే ఆచమనీయం సమర్పయామి
మహాగణాధిపతయే ఔపచారికస్నానం సమర్పయామి
మహాగణాధిపతయే స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
మహాగణాధిపతయే వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి
మహాగణాధిపతయే యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి
మహాగణాధిపతయే గంధాన్ ధారయామి
మహాగణాధిపతయే గంధస్యోపరి అలంకారణార్థం అక్షతాన్ సమర్పయామి

పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః, ఏకదన్తాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లమ్బోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరమ్బాయ నమః, స్కంద పూర్వజాయ నమః, మహాగణాధిపతయే నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. ధూపార్థం అక్షతాన్ సమర్పయామి.

మహాగణాధిపతయే దీపార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం___యాత్, దేవసవితః ప్రసువ, సత్యంత్త్వర్తేన పరిషించామి అమృతమస్తు, అమృతోపస్తరణమసి, స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా, బ్రహ్మ ణిమ ఆత్మామృతత్వాయ. మహాగణాధిపతయే ...నివేదనం సమర్పయామి మహాగణాధిపతయే మధ్యేమధ్యే పానీయం సమర్పయామి, మహాగణాధిపతయే తాంబూలం సమర్పయామి, మహాగణాధిపతయే నీరాజనం సమర్పయామి, నీరాజనానన్తరం ఆచమనీయం సమర్పయామి.

వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ, అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః, మంత్రపుష్పం సమర్పయామి. మహాగణాధిపతయే నమః, ఆత్మ ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి. సర్వోపచారపూజాః సమర్పయామి, యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు, న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వన్డే తమచ్యుతం, మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప, యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.

అనయా పోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మకః శ్రీమహాగణాధిపతిః సుప్రసన్నో వరదో భవతు. (అని అక్షతలు పువ్వులతో గూడ నీళ్లు విడువవలసినది ) మను ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధి రస్తు.

గణాధిపతిప్రసాదం శిరసాగృహ్ణామి (అని చెప్పి అక్షతలు పుష్పములు శిరస్సున ధరింపవలసినది.)

ఈప్రకారము ప్రతివ్రతమునకును మొదట వినాయక పూజ చేయవలయును.

తదంగ త్వేన [6] (ఫలసిద్ధి వినాయక) ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే.

ప్రా ణ ప్ర తి ష్ఠా ప న ము

అస్య శ్రీ (వరసిద్ధివినాయక) ప్రాణ ప్రతిష్ఠాపన మహామన్త్రస్య, బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయః, ఋగ్యజుస్సామాధర్వాణి ఛందాంసి, ప్రాణశక్తిః పరదేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తి, హ్రూం కీలకమ్, మమ (వరసిద్ధివినాయక) ప్రాణప్రతిష్ఠా సిద్ధ్యర్దే జపే వినియోగః.

కరన్యాసము అంగన్యాసము.
హ్రాం అంగుష్ఠాభ్యాం నమః హ్రాం హృదయాయ నమః
హ్రీం తర్జనీభ్యాం నమః హ్రీం శిరసే స్వాహా
హ్రూం మధ్యమాభ్యాం నమః హ్రూం శిఖాయై వషట్
హ్రైం అనామికాభ్యాం నమః హ్రైం కవచాయ హుమ్
హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః హ్రః అస్త్రాయ ఫట్

భూర్భువ స్సువరో మితి దిగ్బన్ధః

———♦♦———

ధ్యానమ్

1. శ్లో. రక్తామ్భోధిస్థపోతోల్ల సదరుణసరోజాధిరూఢా కరాబ్జైః
       పాశంకోదణ్ణమి క్షూద్భవమళిగణమప్యఙ్కుశంష్చు బాణాన్

________________________________________________________________________________________ 1. రక్తసముద్రమునందుండు తెప్పలో వెలయుచున్న యెఱ్ఱదామరపువ్వునందుఁ గూర్చుండి, కమలములంబోలు తన చేతులయందు పాశము, చెఱుకువిల్లు, తుమ్మెదలగుంపు, అంకుశము, ఐదు

బాణములను, రక్తపూరితమైన పుఱ్ఱెను దాల్చినదియు, మూడునేత్రములచే వెలుఁగునదియు, గబ్బిగుబ్బలుగల

బిభ్రాణాసృక్కపాలం త్రినయనలసితా పీనవక్షోరుహాఢ్యా,
దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః

హ్రాం హ్రీం క్రోం య ర ల వ శ ష స హోమ్. ఓం (వరసిద్ధివినాయక) ప్రాణః మమ ప్రాణః (వ రసిద్ధివినాయక) జీవః మమ జీవః వాఙ్మనఃశ్రోత్ర జిహ్వాఘ్రాణైః ఉచ్ఛ్వాసరూపేణ బహిరాగత్య, అస్మిన్ బింబే (అస్మిన్ కలశే) (అస్యాం ప్రతిమాయామ్) సుఖేన చరన్ తిష్ఠన్తు స్వాహా.

మంత్రము__అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోధేహి భోగమ్, జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త మనుమతేమృడయానస్స్వస్తి, అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వాయతే.

శ్లో. 'స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం,
    తావత్త్వం ప్రీతిభావేన (బింబే౽స్మిన్) సన్నిధిం కురు.

[7]ఆవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ, అవకుణ్ఠితోభవ, స్థిరాసనంకురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద, __________________________________________________________________________________________ దియు, బాలసూర్యునిఁ బోలునదియు నైన పరదేవత ప్రాణశక్తి మాకు సుఖం బొసఁగునది యగుఁ గాక. - 1. ఓ స్వామీ ! లోకములన్నిటికి రక్షకుఁడా! నేను జేయు పూజయగునంతవఱకు ఈబింబమునందు (లేక యీ ప్రతిమ యందు, లేక ఈకలశమునందు) సంతోషముతో నాకుఁ బ్రత్యక్షమై యుండుము. ఆ త్వా వహస్తు హరయస్సచేతసశ్శ్వేతై రశ్వైస్సహ కేతుమద్భిః, వాతాజవైర్బలవద్బిర్మనోజవైరాయాహి శీఘ్రం మమ హవ్యాయ శర్వోమ్.

(ఈమంత్రము చెప్పి అక్షతలు పుష్పములు తీసికొని ప్రతిమ శిరస్సున నుంచి చేతిని నెత్తినుంచవలెను) యత్కించిన్ని వేదనం కుర్యాత్. పిమ్మట అవసర నివేదనము (పండు బెల్లము మొదలగునవి.)

ప్రాణప్రతిష్ఠాపనవిధి సంపూర్ణము.

————♦♦————

——₪₪♦♦పూ జా ప్రా రం భ ము♦♦₪₪——

అథ వరసిద్ధివినాయకపూజావిధానమ్___

1. శ్లో. భవసఞ్చితపాపౌఘ విధ్వంసనవిచక్షణం, విఘ్నాన్ధకారభాస్వన్తం విఘ్న రాజమహం భజే, ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం, పాశాఙ్కుశధరం దేవం ధ్యాయేత్సద్ధివినాయకమ్. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం, ________________________________________________________________________________________ 1. శ్రీ వినాయక వ్రతము అన్ని వ్రతములలో మేలయినది. కలిమి నొసంగునది, శుభముల నిచ్చునది గనుక, సంసారమునఁ జేర్చిన పాపరాసులను బోఁగొట్టుటయందు దిట్టరియు, సూర్యునిమాడ్కి విఘ్న ములనెడి చీకటిం బోఁగొట్టువాడును, ఒంటికొమ్ముగలవాడును, చేటచెవులవాడును, ఏనుఁగుమోమువాడును, నాలుగు చేతులవాడును, పాశము అంకుశము అను నాయుధం భక్తాభీష్టప్రదం తస్మాద్ద్యాయేత్తం విఘ్ననాయకమ్. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాఞ్చనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్.

శ్రీవరసిద్ధివినాయకం ధ్యాయామి

శ్లో. అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర,
    అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ. 1


శ్రీవరసిద్ధివినాయకం ఆవాహయామి,



శ్లో. మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం,
    రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్. 2


శ్రీవరసిద్ధివినాయకాయ ఆసనం సమర్పయామి.

________________________________________________________________________________________ బులను ధరించినవాడును, భక్తుల కోరికలు నొసఁగువాఁడును, బంగారుచాయగలవాడును, గొప్ప మేనుఁగలవాఁడును సకల భూషణములఁ దాల్చినవాడు నైన వరసిద్ధివినాయకుని నేను మనసున ధ్యానించుచున్నాను.

1. లోకములచే పొగడఁదగినవాఁడవు, ఇంద్రాది దేవతలచే పూజింపఁ బడినవాఁడవు, దిక్కు లేనివారికి దిక్కువు, అన్నిటిని దెలిసినవాఁడవు, పార్వతీ దేవికిఁ బుత్త్రుడవునైన ఓసిద్ధివినాయకా! నిన్ను (ఈబింబమునందు) ఆవాహనము చేయుచున్నాను.

2. ఓవినాయకా ! ముత్యములు పుష్యరాగములు నీలములు పచ్చలు వజ్రములు గోమేధికములు మొదలగు మణులుచెక్కిన సొగసైన ఆసనము నొసఁగుచున్నాను. దీనిని నాప్రీతికై కైకొనుము.

శ్లో. గౌరీపుత్ర నమస్తేస్తు శఙ్కర ప్రియనందన,
    గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్. 1

శ్రీవరసిద్ధివినాయకాయ అర్ఘ్యం సమర్పయామి,


శ్లో. గజవక్ష నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక,
    భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన. 2

శ్రీ వరసిద్ధివినాయకాయ పాద్యం సమర్పయామి.


శ్లో. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత,
    గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో 3

శ్రీవరసిద్ధివినాయకాయ ఆచమనీయం సమర్పయామి.


శ్లో. దధిక్షీరసమాయుక్తం మథ్వాజ్యేన సమన్వితం,
    మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. 4

శ్రీవరసిద్ధివినాయకాయ మధుపర్కం సమర్పయామి.

________________________________________________________________________________________ 1. ఓ పార్వతీపరమేశ్వరుల ముద్దుబిడ్డఁడా! నీకు మ్రొక్కెదను,గంధము, పువ్వులు, అక్షతలతోఁ గూడినయర్ఘ్యము(చేతులకు నీళ్లను) నొసఁగెదను. గ్రహింపుము.

2. ఓసకలజనులకోర్కుల నొసఁగు గజముఖుఁడా! నీకు నమస్కరించెదను. నేను భక్తితో నొసంగిన పాద్యమును (కాళ్లకునీళ్లను) గ్రహింపుము.

3. దిక్కులేనివారికి ప్రాపా, సర్వము 'నేనెఱిగినవాఁడా ! దేవతాశ్రేష్ఠులచే పూజితుఁడా! ఓప్రభూ! ! ఓదేవా ! నేనాచమనీయమునిచ్చెదను. పుచ్చుకొనుము.

4. ఓయేనుఁగుమోము దేవరా ! నీకు నమస్కారము. ఆవుపాలు పెరుగు నెయ్యి తేనెలతోఁ గూడిన మధు

పర్కము నొసఁగుచున్నాను. దీనిం బుచ్చుకొనుము.

శ్లో. స్నానం పఞ్చామృతై ర్దేవ గృహాణ గణనాయక,
    అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత.

శ్రీవరసిద్ధివినాయకాయ [8]పఞ్చామృతస్నానం సమర్పయామి

1. పాలు__ ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సో మవృష్ణియం, భవా వాజస్య సంగధే ,

శ్రీవర .. నాయకం, క్షీరేణ స్నపయామి.

2. పెరుగు__ దధి క్రావ్ ణో అకార్షం జిష్ణో రశ్వస్య వాజినః సురభినో ముఖాకర త్ప్రణ ఆయూగ్౦షితారిషత్ శ్రీవర .. నాయకం, దధ్నా స్నపయామి.

3. నెయ్యి__శుక్రమసి జ్యోతిరసి తేజో౽సి దేవోవస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః శ్రీవర .. నాయకం ఆజ్యేన స్నపయామి.

4. తేనె___మధు వాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః, మాధ్వీర్నస్సన్త్వోషధీః.

శ్రీవర .. నాయకం మధునాస్నపయామి.


1. దీనుల బోషించువాఁడవు, సర్వజ్ఞుఁడవు, దేవతలచేఁ బూజింపఁబడువాఁడవు నైన గణనాయకుఁడా ! పంచామృతములచే నీకు స్నానము చేయించెద అనుగ్రహింపుము. లేక, పంచదార — స్వాదుః పవస్వ దివ్యాయ జిన్వనే స్వాదురిన్ద్రాయ సుహవే తు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః (శ్రీవర.. యకం) శర్కరయా స్నపయామి.

ఫలోదకము__యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తా 'నో ముఞ్చస్త్వగ్ం హసః - (శ్రీవర.. యకం) ఫలోదకేన స్నపయామి.

1.శ్లో. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః,
      స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమో౽స్తుతే.

       శ్రీవరసిద్ధి. ..కం శుధ్ధోదకస్నానం కారయామి.

మంత్రము____ఆపోహిష్ఠా మయోభువః, తాన ఊర్జేధాతన, మహేరణాయ చక్షసే, యో వశ్శివతమో రసః, తస్యభాజయతే హనః, ఉశతీరివ మాతరః, తస్మా అరంగమానవః. 'యస్య క్షయాయ జిన్వథ' ఆపో జనయథా చ నః.

2. శ్లో. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మఙ్గళం ,
       శుభ ప్రద గృహాణ త్వం లమ్బోదర హరాత్మజ.

       శ్రీవర .. య వస్త్రయుగ్మం సమర్పయామి.

మంత్రము____అభివస్త్రా సువసన్యాస్యర్షాభిధేనోస్సుదుఘాః

________________________________________________________________________________________ 1. ఓభగవంతుడా! ఓపార్వతీపుత్త్రుడా! నీకు నమస్కరించెదను. గంగానది మొదలగు పుణ్యతీర్థములన్ని టినుండి తెచ్చిన నిర్మలోదకములచే స్నానముచేయుము. 2. భక్తులకు మేలొసఁగు

వైదికులు శ్లోకములతోఁ గ్రిందిమంత్రములను గూడ చెప్పెదరు. అట్లే అంతటను తెలియవలెను. వూయమానాః , అభిచన్ద్రా భర్తవేనో హిరణ్యో౽భ్యశ్వాన్ రథి నో దేవసోమ.

1. శ్లో. రాజతం బ్రహ్మసూత్రం చ కాఞ్చనంచోత్తరేయకం,
       గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక .

      శ్రీవ...య యజ్ఞోపవీతం సమర్పయామి
మంత్రము... యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ , ఆయుష్యమగ్ర్యం ప్రతిముఞ్చ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః.

2. శ్లో. చన్దనాగరు కర్పూర కస్తూరీ కుఙ్కుమాన్వితం,
       విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్.

       శ్రీవ...యకం గంధాన్ ధారయామి.
మంత్రము - గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం, ఈశ్వరీగ్ం సర్వభూతానాం త్వామిహోపహ్వయే
శ్రియమ్.

_______________________________________________________________________________ పెద్దబొజ్జ గల ఓశివపుత్రా ! దేవతలకు ధరింపఁదగినవి, చక్కనివియు నైన యీ మేటి యెఱ్ఱబట్టలను ధరింపుము. 1. సర్వము తెలిసిన యోదేవా! భక్తులకోర్కుల నొసఁగు ఓగణాధిపా! రజతముతో నిర్మించినయజ్ఞోపవీతమును, బంగారు మయమైన యుత్తరీయమును గ్రహింపుము.

2. ఓ దేవతలలో శ్రేష్ఠుడా! కస్తూరి, కుంకుమపువ్వు మొదలగు సుగంధ ద్రవ్యములు చేర్చిన గంధము పూసెదను స్వీకరింపుము.

1. శ్లో. అక్షతాన్ ధనళాన్ దివ్యాన్ శాలీయాం స్తణ్డులాన్శుభాన్,
       గృహాణ పరమానన్ద శమ్భుపుత్ర నమో౽స్తు తే.
శ్రీవర...కాయ అలంకరణార్థం ఆక్షతాన్ సమర్పయామి.

మంత్రము—ఆయనే తే పరాయణే దూర్వారోహస్తు పుష్పిణీ,
హ్రదాశ్చ పుణ్డరీకాణి సముద్రస్య గృహా ఇమే.
2. శ్లో, సుగన్ధాని చ పుష్పాణి జాతీకున్దముఖాని చ,
        ఏకవింశతిప త్రాణి సంగృహాణ నమో౽స్తు తే.
శ్రీవ....నాయకం పుష్పైః పూజయామి,

అథాంగ పూజా
గణేశాయ నమః పాదౌ పూజయామి (పాదములు)
ఏకదంతాయ నమః గుల్ఫౌపూజయామి (మడిమలు)
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి (మోకాళ్లు)
విఘ్న రాజాయ నమః జఙ్ఘే పూజయామి (పిక్కలు)
ఆఖువాహనాయనమః ఊరూ పూజయామి (తొడలు)
హేరమ్బాయనమః కటిం పూజయామి (పిఱుఁదు)
లంబోదరాయనమః ఉదరం పూజయామి బొజ్జ

____________________________________________________________________________

1. ఎక్కువ యానంద 'మొసఁగునట్టి యో యీశ్వరుని పుత్త్రుడా! నీకు నమస్కారము. మంచిబియ్యముతోఁ జేసిన యక్షతల నొసఁగుచున్నాను గ్రహింపుము. ఓవినాయకా ! సువాసనగలజాజులు, మొల్లలు మొదలగు పువ్వులతోను, ముఖ్యముగా, ఇరువదియొక్కటి యగు ఆకులతోను బూజించెదనుగ్రహింపుము. నీకు మ్రొక్కెదను.

గణనాథాయ నమః|| నాభిం పూజయామి || ప్రొక్కిలి
గణేశాయ నమః హృదయం పూజయామి (ఱొమ్ము)
స్థూలకణ్ఠాయ నమః కణ్ఠ౦ పూజయామి (కంఠము)
స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి (మూపులు)
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి (చేతులు)
గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి (ముఖము)
విఘ్నహన్త్రే నమః నేత్రే పూజయామి (కన్నులు)
శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి లలాటంచెవులు)
ఫాలచన్ద్రాయ నమః లలాటం పూజయామి ( నొసలు)
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి (తల)
విఘ్న రాజాయ నమః సర్వాణి అంగాని పూజయామి (అన్ని యంగములు)

అథ ఏకవింశతి పత్రపూజా. (21 ఆకులతోఁ జేయుపూజ)

సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
గణాధిపాయ నమః బృహతీపత్రం (వాకుడాకు)
ఉమాధిపాయ నమః బిల్వపత్రం (బిల్వము)
గజాననాయ నమః దూర్వాయుగ్మం (గరికా)
హరసూనవే నమః దత్తూర పత్రం (ఉమ్మెత్త)
లంబోదరాయ నమః బదరీపత్రం (రేగుఆకు)
గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం (ఉత్తరేణి)
గజకర్ణాయ నమః తులసీపత్రం (తులసీదళములు)
ఏకదంతాయ నమః చూతపత్రం (మామిడి ఆకు)
వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
భిన్నదన్తాయ నమః విష్ణుక్రాన్తపత్రం పూజయామి (విష్ణుక్రాంతము)
వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మాకు)
సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారి ఆకు)
ఫాలచన్ద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువము)
హేరమ్బాయ నమః సిన్ధువారపత్రం పూజయామి (వావిలాకు)
శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి (జాజిఆకు)
సురాగ్రజాయ నమః గణకీపత్రం పూజయామి (ఒకపత్రము )
ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మిపత్రి)
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావిపత్రి)
సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్దిఆకు)
కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (జిల్లేడాకు)
శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి (21 పత్రములు)

అప్టోత్తరశతనామావళిః

ప్రతి నామమునకు కడపట "నమః" అని చేర్చవలయును.

ఓం గజాననాయ నమః కృతినే మహాబలాయ
గణాధ్యక్షాయ సుప్రదీపాయ 10 హేరమ్బాయ
విఘ్నరాజాయ సుఖనిధయే లమ్బజఠరాయ
వినాయకాయ సురాధ్యక్షాయ హ్రస్వగ్రీవాయ 20
ద్వైమాతురాయ సురారిఘ్నాయ మహోదరాయ
ద్విముఖాయ మహాగణపతయే మదోత్కటాయ
ప్రముఖాయ మాన్యాయ మహావీరాయ
సుముఖాయ మహాకాలాయ మన్త్రిణే
మఙ్గళస్వరాయ మన్త్రకృతే విష్ణుప్రియాయ
ప్రమథాయ చామీకరప్రభాయ భక్తజీవితాయ
ప్రథమాయ సర్వస్మై జితమన్మథాయ
ప్రాజ్ఞాయ సర్వోపాస్యాయ ఐశ్వర్యకారణాయ
విఘ్నకర్త్రే సర్వకర్త్రే జ్యాయసే
విఘ్నహన్త్రే సర్వనేత్రే యక్షకిన్నరసేవితాయ
విశ్వనేత్రే సర్వసిద్ధిప్రదాయ గంగాసుతాయ
విరాట్పతయే సర్వసిద్ధయే గణాధీశాయ 80
శ్రీపతయే పఞ్చహస్తాయ గమ్బీరనినదాయ
వాక్పతయే పార్వతీనన్దనాయ వటవే
శృంగారిణే ప్రభవే అభీష్టవరదాయ
ఆశ్రితవత్సలాయ కుమారగురవే 60 జ్యోతిషే
శివప్రియాయ అక్షోభ్యాయ భక్తనిధయే
శీఘ్రకారిణే కుఞ్జరాసురభఞ్జనాయ భావగమ్యాయ
శాశ్వతాయ ప్రమోదాత్తాయనాయ మఙ్గళప్రదాయ
బలాయ 40 మోదకప్రియాయ అవ్యక్తాయ
బలోత్థితాయ కాన్తిమతే అపాకృతపరాక్రమాయ
భవాత్మజాయ ధృతిమతే సత్యధర్మిణే
పురాణపురుషాయ కామినే సఖ్యే
పూష్ణే కపిత్థపనస ప్రియాయ సరసామ్బునిధయే
పుష్కరోత్క్షిప్తవారిణే బ్రహ్మచారిణే మహేశాయ.
అగ్రగణ్యాయ బ్రహ్మరూపిణే 70
అగ్రపూజ్యాయ బ్రహవిద్యాదిదానభువే
అగ్రగామినే జిష్ణవే
దివ్యాంగాయ విఘాతకారిణే అవరజజితే
మణికిఙ్కిణిమేఖలాయ విష్వగ్దృశే 100 సమస్తజగదాధారాయ
సమస్తదేవతామూర్తయే విశ్వరక్షాకృతే సర్వైశ్వర్య ప్రదాయ
సహిష్ణవే కల్యాణగురవే ఆక్రాన్తచిదచిత్ప్రభవే
సతతోత్థితాయ ఉన్మత్తవేషాయ శ్రీవిఘ్నేశ్వరాయ నమః 108

శ్రీవర...య నమః, ఆప్టోత్తరశతనామ పూజాం సమర్పయామి.

1. శ్లో. దశాఙ్గం గుగ్గులో పేతం సుగన్ధి సుమనోహరం,
        ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ.
శ్రీవర...య నమః ధూపమాఘ్రాపయామి,
మంత్రము___ ధూరసి ధూర్వ ధూర్వన్తం ధూర్వతం యో౽స్మాన్ ధూర్వతి తం ధూర్వయం వయం ధూర్వామః.

2. శ్లో. సాజ్యం త్రివర్తిసంయు క్తం వహ్ని నా ద్యో తితం మయా,
        గృహాణ మఙ్గ ళం దీపమీశపుత్ర నమోస్తు తే.
శ్రీవర...య నః దీపం దర్శయామి. .
మంత్రము___ఉద్దీప్యస్వ జాత వేదోపఘ్నం నిరృతిం మమ,

____________________________________________________________________________

1. ఓపార్వతీపుత్త్రా! నీకు నమస్కారము. పదియంగములు గలది, గుగ్గిలము వేయఁబడిన పరిమళముగలిగి మనస్సునకు సంతోషముచేయు ధూపము వేయుచున్నాను. పీల్చుము. నాకు వరంబుల నొసఁగుము. 2. ఓపరమేశ్వరునిపుత్త్రుడా! సీకు మ్రొక్కెదను. నేయిపోసి మూఁడువత్తులు వేసి వెలిగించిన మంగళ దీపమును గైకొనుము. పశూగ్ శ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశ, మా నోహిగ్ం సీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ , అబిభ్రదఘ్న ఆగ హి శ్రియా మా పరిపాలయ.

1 శ్లో. సుగంథాన్ సుకృతాంశ్చైవ 'మోదకాన్ ఘృతపాచితాన్,
       నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గై ప్రకల్పితాన్ .

2 భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేన చ,
     ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక.
     శ్రీవర... కాయ నమః మహానైవేద్యం సమర్పయామి.

[9]మంత్రము. దేవ సవితః ప్రసువ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా, ఓంప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, బ్రహ్మణే స్వాహా.

2. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తప్రక్షాళనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమ నీయం సమర్పయామి.

శ్లో. పూగీఫలసమాయు క్తం నాగవల్లీదళైర్యుతం,
     కర్పూరచూర్ణ సంయు క్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్.
     శ్రీవర...స్వామినే నమః తామ్బూలం సమర్పయామి.

____________________________________________________________________________

1. నేతియందుఁ బక్వము చేసిన సెనగ పెసలపప్పు పూర్ణము పెట్టిన కుడుములను, మఱి యనేక భక్ష్యభోజ్య లేహ్య చోష్య పానీయాదులతో గూడిన మహానివేదన చేయుచున్నాను. ఓ వినాయకుడా ! ఆరగింపుము.

1 శ్లో. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,
     భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక.
                         శ్రీవర... కాయ నమః సువర్ణ పుష్పం సమర్పయామి.

2 శ్లో. ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూకశకలై స్తథా,
      నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ.
                          శ్రీవర... కాయ నమః నీరాజనం దర్శయామి.

              నీరాజనానన్తరం ఆచమనీయం సమర్పయామి. .

మంత్రము___ హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోపానీతి, ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజోదధాతి.

అథ దూర్వాయుగ్మ (=గరికెపోచలు) పూజా. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి “దూర్వాయుగ్మం పూజయామి” అని ప్రతి నామము వెంబడిఁ జేర్పవలయును,

గణాధిపాయ నమః || సర్వసిద్ధిప్రదాయనమః

ఉమాపుత్రాయ నమః ఏకదన్తాయ నమః
ఆఖువాహనాయ నమః ఇభవక్త్రాయ నమః
వినాయకాయ నమః మూషకవాహనాయ నమః
ఈశ పుత్రాయ నమః కుమారగురవే నమః

దూర్వాయుగ్మపూజా సమాప్తా.

________________________________________________________________________________________

1 సత్పురుషులకు సంతోషముగలిగించు ఓ వినాయకా ! విఘ్నేశా ! భూమియందున్న యావద్ధనములను గ్రహింపుము.

2 ఓవిఘ్నేశా ! వేయి నేతిలో ముంచిన వత్తులును, అనేక కర్పూరపుఁ దునుకలును నుంచి వెలిగించిన నీరాజనమును గ్రహింపుము.

1 శ్లో. గణాధిప నమస్తే౽స్తు ఉమాపుత్రాఘనాశన,
      వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక
      ఏకదన్తైకవదన తథా మూషకవాహన,
      కుమారగురవే తుభ్యమర్పయామి సుమాఞ్జలిమ్.[10]

                            శ్రీవర... కాయ నమః మంత్రపుష్పం సమర్పయామి.

2 శ్లో. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ,
      నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన.
          
                            శ్రీవర... కాయనమః ఆత్మ ప్రదక్షిణనమస్కారాంత్సమర్పయామి.

3. శ్లో. అర్ఘ్యం గృహాణ హేరమ్బ సర్వభద్రప్రదాయక,
       గన్ధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన.[11]

                            శ్రీవర .. కాయనమః పునరర్ఘ్యం సమర్పయామీ.

________________________________________________________________________________________

1 ఓగణాధిపా! పార్వతికిఁ బుత్త్రుడా ! పాపముల నాశనము చేయువాఁడా ! పర మేశుని పుత్త్రుడా! అన్ని కోరికల నొసఁగు వాఁడా! ఒంటికొమ్ము వాఁడా! ఏకవదనుఁడా ! మూషకము నెక్కువాఁడా ! కుమారుని యన్న యగువాఁడా ! నీకు మంత్ర పుష్పము నర్పించుచున్నాను. 2 కుడుములందుఁ బ్రియుఁడా ! విఘ్నములఁబోగొట్టువాఁడా! ఎల్లప్పుడు నీకుఁ బ్రదక్షిణనమస్కారములు చేయుచున్నాను. 3. అందరికి మేలొసఁగువాఁడవు. పాపములఁ బోఁగొట్టువాఁడవు నైనవినాయకా! గంధపుష్పాక్షతలతోఁ గూడిన పాత్రమునందున్న యర్ఘ్యమును గ్రహింపుము. 

1 శ్లో. యం బ్రహ్మ వేదాన్తవిదో వదన్తి పరం ప్రధానం పురుషంతథాన్యే,
      విశ్వోద్గతే: కారణమీశ్వరం వాతస్మై నమో విఘ్న వినాయకాయ,

2 శ్లో. నమస్తుభ్యం గణేశాన నమస్తే విఘ్న నాశన,
      ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్.

3.శ్లో. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ,
      నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా,

ఇతి ప్రార్థనా అని వినాయకునిఁ బ్రార్థన చేయవలయును.

వాయనదానము.

శ్లో.గణేశః ప్రతిగృహ్లాతు గణేశో వై దదాతి చ,
గణేశస్తారకోభాభ్యాం గణేశాయ నమో నమః
                                (ఈ వాక్యమును వాయనమిచ్చువాడు చెప్పవలెను)

దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాంపూష్ణో హస్తాభ్యామాదదే
                                (ఈ మంత్రమును వాయనము పుచ్చుకొను వారు చెప్పవలెను.)

________________________________________________________________________________________

1. వేదాంతులు వినాయకుని బ్రహ్మమనియు, మఱికొందఱు ప్రపంచముయొక్క యుత్పత్తికి కారణభూతుఁడైన ప్రధాన పురుషుఁడనియుఁ జెప్పుదురు. అట్టివినాయకుని నమస్కరించు చున్నాను.

2 ఓగణాధిపా! విఘ్నములఁ బోగొట్టువాఁడా ! నీకు మ్రొక్కుచున్నాను. నాకుఁ గోరినకోర్కులను, పరలోక మున నుత్తమగతి నొసగుము. 3 ఎల్లపుడు కుడుములందుఁ బ్రియమైనవాఁడ వగు ఓ వినాయకా ! నీకు నమస్కారము.

1. వినాయకస్యప్రతిమాం వస్త్రయుగసమన్వితాం,
   తుభ్యం దాస్యామి విప్రేన్ద్ర యథో క్తఫలదో భవ.

2. ప్రపీద దేవదేవేశ ప్రసీద గణనాయక, ప్రదక్షిణం కరోమీశపుత్ర విఘ్నేశ సర్వదా,
   ప్రదక్షిణం కరోమి త్వా మమ త్వం సన్నిధౌ భవ.

3. యాని కాని చ పాపాని జనానుకృతాని చ,
   తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణపదేపదే .

4. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః,
   త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల

__________________________________________________________________________________________ ఓ దేవా! నీ వెల్లప్పుడు నా కార్యములను విఘ్నములు లేకుండ ననుకూలము చేయుము.

1. ఓ బ్రాహ్మణోత్తమా! ధోవతులజోడుతోఁగూడ వినాయకుని ప్రతిమను నీకు నొసంగుచున్నాను. శాస్త్రోక్తమైన ఫలము నొసఁగుము.[ఈశ్లోకమును జెప్పి వినాయకుని ప్రతిమాదానము చేయవలయును.]

2. ఓ దేవ దేవా! నాయం దనుగ్రహింపుము. పరమేశ్వరుని పుత్రుఁడా! ఓగణనాథా ! నీకుఁ బ్రదక్షిణం బొనర్చెదను. నాకుఁ బ్రత్యక్షమగుము.

3. నేను జన్మజన్మము లందుఁ జేసిన పాపకర్మంబు లన్నియుఁ బ్రదక్షిణము చేయు నొక్కొక్క యడుగునను దొలఁగుచున్నవి.

4. నేను పాపుఁడను, పాపపుఁబనులు సేయువాఁడను, పాపబుద్ధిగలవాఁడను, పాపముల కునికియైయుండువాడను. ఓ దేవా శరణు జొచ్చిన వారిని కాపాడు వాఁడా! నన్నుఁ గృపతోఁ గాపాడుము. 

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ,
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక .

తా. నీవు తక్క నాకు వేఱుదిక్కు లేదు. కావున వినాయకా! నన్ను దయతోఁ బలుమాఱు గాపాడుము (అని ప్రదక్షిణ నమస్కారములఁ జేయవలెను.)

పూజావిధానం సంపూర్ణమ్

—————♦♦♦♦—————

క థా ప్రా రం భ ము

శ్లో. ఆసీత్పురా చన్ద్రవంశే రాజా ధర్మఇతి శ్రుతః, స్వరాజ్యే దైవయోగేన జ్ఞాతవః కుటిలైర్హృతే,
1. అనుజైర్భార్యయా సార్థం జగామ గహనం వనం,
   బహువృక్షసమాకీర్ణం నానామృగ సమన్వితమ్.

2. బహుపక్షికులోపేతం వ్యాఘ్ర భల్లూకసఙ్కులమ్,

తా. పూర్వము చంద్ర వంశమున ధర్మరాజుని ప్రసిద్ధి కెక్కిన నృపాలుండెను. ఆతఁడు తన గ్రహచారము చాలమిచేతల దన రాజ్యమును దాయాదు లపహరించగా తమ్ములును భార్యయుఁగూడి పెక్కు వృక్షములతో గూడి పెక్కు పక్షులును, పులులు, ఎలుగుబంట్లు మొదలగు బహుభీకరమృగంబులు గలిగి చొఱనలవి కాకయున్న వసమును బ్రవేశించెను.

తత్రతత్ర సమావిష్టా మునయో బ్రహ్మవాదినః .

3. ఆదిత్య సన్నిభాః సర్వే సర్వే వహ్ని సమప్రభాః,
   తేజోమణ్డల సఙ్కాశా వాయుపర్ణామ్బుభక్షకాః.

4. అగ్ని హోత్రరతా నిత్యమతిథీ

 
                        నాం చ వూజకాః,
   ఊర్ధ్వబాహనిరాలమ్బాః సర్వే ముని గణాస్తథా.

5. తాన్ పశ్యన్ ధర్మరాజో౽పి సంభ్రమేణ సమన్వితః.
   సూతాశ్రమం సమాసాద్య సూతం దృష్ణ్వా ససంభ్రమః,

6. నత్వా చ భార్యయా సార్థమనుజైః సముపావిశత్

తా. ఆవనమునం దచ్చటచ్చట బ్రహ్మవాదులయిన మునులు కూర్చుండియుండిరి. వారందఱు సూర్యుని, అగ్నిని బోలిన కాంతి గలవారును, వెలుగుల రాశింబోలిన వారును, గాలియు ఆకలములు నీరు మాత్రమే యాహారముగాఁ గలవారును, ఎల్లప్పు డగ్నిహోత్రములను జేయువారును, అతిథులను బూజించువారును, జేతులు పైకెత్తియు ఆధారము లేకయుఁ దపస్సు చేయువారును నైయుండిరి. ధర్మరాజు మునులందరిని జూచి మనస్సున సంతసము పడుచు సూతమహాముని యాశ్రమమునకుఁబోయి యమ్మునీంద్రునింజూచి తత్తరపాటుతో గూడిన వాడై, తాను భార్య తోను తమ్ములతోనుగూడ నమ్మునీంద్రునికి నమస్కరించి యాతని యాజ్ఞవడసి కూర్చుండి యామునీం ద్రులతో ని ట్లనియె,

ధర్మ ఉవాచ___ సూతసూత మహా ప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద.

7. వయం చ భార్యయా సార్ధం జ్ఞాతిభిః పరిపీడితాః,
   స్వరాజ్యం సకలం చైవ పుత్రాశ్చాపహృతా హి నః .

8. తన దర్శన మాత్రేణ సర్వం దుఃఖం వినాశితం,
   మమోపరి కృపాం కృత్వా వ్రతం బ్రూహి దయానిధే.

తా. “సకలశాస్త్రములను జదివిన గొప్పపండితుఁడవైన ఓ సూతమహామునీ! మాదాయాదు లగుకౌరవులు మాతో మోసపుజూదమాడి, మారాజ్యంబంతయు లాగికొని మమ్మును ద్రౌపదిని సకలవిధంబుల బాధించి, మాపుత్త్రులనుజంపి, మాకుఁ దీరనిదుఃఖము గలిగించిరి. తమ దర్శన ప్రభావముచేతనే మా దుఃఖ మెల్లం దొలఁగినది. దయకు నిధివైన ఓమహాత్మా ! మా మీఁద ననుగ్రహించి, మాకు మరల రాజ్యము వడయుటకు సాధనమైన యొక వ్రతంబు ననుగ్రహింపవలయును” అని ధర్మరాజు సూతమహాముని నడుగఁగా, నమ్మునీంద్రుఁ డిట్లనియె.

సూత ఉవాచ___

    వ్రతం సంపత్కరం నౄణాం సర్వసౌఖ్య ప్రవర్ధనం,
    శృణుధ్వం పాణ్ణవాః సర్వే వ్రతానాముత్తమం వ్రతమ్ .

10. రహస్యం సర్వపాపఘ్నం పుత్ర పౌత్రాభివర్ధనం,
    వ్రతం సాంబశి వేనైన స్కన్దస్యోద్బోధితం పురా. "

తా. ఓపాండవులారా! మీరందఱు వినుఁడు. వ్రతములలో నెల్ల నుత్తమమైన వ్రతమున్నది. ఆవ్రతము మానవులకు సంపదను, సౌఖ్యములన్నిటిని వృద్ధినొందించునది. పరమగోప్యమైనది. సకలపాపములను బోగొట్టునది. పుత్రపౌత్రాదులను వృద్ధి చెందించునది. ఓ పాండవులారా! తొల్లి యీవ్రతమును పరమేశ్వరుడు కుమారస్వామికి నుపదేశించెను. కుమారస్వామి పరమేశ్వరుని పృచ్ఛచేసినరీతియు, ఆపరమేశ్వరుడు కుమారు నికిఁ బదులు చెప్పిన రీతియు నెఱిఁగించెదను వినుఁడు.

11. కైలాసశిఖరే రమ్యే నానామునిని షేవితే,
    మన్దారవిటపి ప్రాన్తే నానామణి విభూషితే.

12. హేమసింహాసనాసీనం శఙ్కరం లోకశఙ్కరం,
    పప్రచ్ఛ షణ్ముఖ స్తుష్టో లోకానుగ్రహ కాఙ్క్షయా

13. స్కన్దఉవాచ.
    కేన వ్రతేన భగవన్ సౌభాగ్య మతులం భవేత్ ,
    పుత్రపౌత్రాన్ ధనం లబ్ధ్వా మనుజః సుఖ

మేధతే.

14. తన్మే వద మహాదేవ వ్రతానాము త్తమంవ్రతం,
ఈశ్వర ఉవాచ. ఆస్తి చాత్ర మహాభాగ గణనాథ ప్రపూజనమ్.

15. సర్వసమ్పత్కరం శ్రేష్టమాయుః కామార్గసిద్ధిదం,
    మాసే భాద్రపద శుక్ల చతుర్థ్యాం వ్రతమాచరేత్ .

16. ప్రాతః స్నాత్వా శుచిర్భూత్వా నిత్యకర్మ సమాచరేత్ ,
    స్వశక్త్యా గణనాథస్య స్వర్ణరౌప్యమథాకృతిమ్.

17. ఆథవా మృణ్మయం కుర్యాద్విత్తశాఠ్యం న కారయేత్ ,
    స్వగృహస్యోత్తరే దేశే మణ్డపం కారయేత్తతః.

18. తన్మధ్యే౽ష్టదళం పద్మం యవైర్వా తణ్డులేన వా,
    ప్రతిమాం తత్ర సంస్థాప్య పూజయిత్వా ప్రయత్నతః

19 . శ్వేతగన్ధాక్షతైః పుష్పైర్దూర్వాఙ్కురసమన్వితైః ,
     ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్మోదకైర్ఘృతపాచితైః

20. ఏకవింశతిసంఖ్యాని నారికేళఫలాన్యపి,
    రంభాజమ్బుకపిత్థౌఘానిక్షుఖణ్డాంశ్చతావతః.

21. ఏవమన్యఫలావూపైర్నైవేద్యం కారయేత్సుత,
    నృత్తగీతైశ్చవాద్యైశ్చ పురాణపఠనాదిభిః.

22. తర్పయేద్గణనాథం చ విప్రాన్ దానేన శ్రోత్రియాన్,
    బంధుభిః స్వజనైః సార్థం భుంజీయాత్తైలవర్జితమ్.

23. ఏవం యః కురుతే మర్త్యో గణనాథ ప్రసాదతః,
    సిద్ధ్యన్తి సర్వకార్యాణి నాత్ర కార్యా విచారణా.

24. తతః ప్రభాతే విమలే పునఃపూజాంసమాచరేత్,
    మౌంజీం కృష్ణాజినం దణ్డముపవీతం కమణ్డలుమ్,

25. పరిధానం తథా దద్యాద్యథావిభవముత్తమం,
    ఉపాయనం తతో దద్యాదాచార్యాయ స్వశక్తితః.

26. అన్యేభ్యో దక్షిణాం దద్యాద్బ్రాహ్మణాన్ భోజయేత్తతః,
   త్రైలోక్యేవిశ్రుతం చైతద్వ్రతానాముత్తమోత్తమమ్.

27. అన్యైశ్చ దేవమునిభిర్గన్దర్వైః కిన్నరైస్తథా ,
    చీర్ణమేతద్వ్రతం సర్వై: పురాకల్పే

షడానన.
28. ఇతి పుత్త్రాయ శర్వేణ షణ్ముఖాయోదితం పురా,
    ఏవం కురుష్వ ధర్మజ్ఞ గణనాథ ప్రపూజనమ్.

29. విజయస్తే భవేన్నిత్యం సత్యం సత్యం వదామ్యహం,
    ఏతద్వ్ర హరిశ్చాపి దమయన్తీ పురా౽కరోత్ .

30. కృష్ణో జామ్బవతీమాగాద్రత్నం చాపి స్యమన్తకం,
    దమయన్తీ నళంచైవ వ్రతస్యాస్యప్రభావతః.

31. శక్రేణ పూజితః పూర్వం వృత్రాసురవధే తథా,
    రామ దేవేన తద్వచ్చ సీతాయా మార్గణే తథా.

32. భగీరథేన తద్వచ్చ, గఙ్గామానయతా పురా,
    అమృతోత్పాదనార్థాయ తథా దేవాసురైరపి.

33. కుష్ఠవ్యాధియు తేనాపి సామ్బేనారాధితః పురా,
    ఏవముక్తస్తు సూతేన సాసుజః పాణ్ణునన్దనః.

34. పూజయా మాస దేవస్య పుత్రం త్రిపురఘాతినః,
    శత్రు సంఘం నిహత్యాశు ప్రాప్తవాన్ రాజ్యమోజసా.

35. పూజయిత్వా మహాభాగం గణేశం సిద్ధిదాయకం,
    సిద్ధ్యన్తి సర్వకార్యాణి మనసా చిన్తితాన్యపి.

36. తేన ఖ్యాతిం గతో లోకే నామ్నా సిద్ధివినాయకః,
    విద్యారమ్బే పూజితశ్చేత్ విద్యాలాభో భవేద్ద్రువమ్.

37. జయంచ జయకామశ్చ పుత్రార్జీ లభతే సుతాన్,
    పతికామా చ భర్తారం సౌభాగ్యం చ సువాసినీ.

38. విధవా పూజయిత్వా తు వైధవ్యం నాప్సుయాత్క్వచిత్ ,
    బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా౽ప్యథవా స్త్రియః.

39. అర్భకశ్చాపి భక్త్యా చ వ్రతం కుర్యాద్యథావిధి,
    సిద్ధ్యన్తి సర్వకార్యాణి గణనాథ ప్రసాదతః.

40. పుత్ర పౌత్రాభివృద్ధిం చ గజాద్యైశ్వర్యమాప్నుయాత్.

ఇతి వినాయక వ్రతకల్పః సమాప్తః.

————♦♦♦♦————

తా. మునులందఱికి ఉనికిపట్టయిన రమ్యమైన కైలాస పర్వత శిఖరంబున నవరత్నములచేఁ జెక్కఁబడిన కల్పవృక్షము క్రింద బంగారు సింహాసనముమీఁద లోకులకు మేలుచేయునట్టియీశ్వరుఁడు కూర్చుండియుండఁగా కుమారస్వామి జనులకు మేలుచేయగోరినవాఁడై , తండ్రినిఁ జూచి యోభగవంతుడా! మానవుండేవ్రతము నాచరించినయెడల నతనికి సాటి లేని సంపదలు గలుగును? పుత్త్ర పౌత్త్రులును, ధనమును గలవాఁడై మనుష్యుఁడు సుఖముకలిగి యుండును? ఓమహాదేవా! నాకిట్టివ్రతములలో నుత్తమోత్తమమయిన యొక వ్రతంబు ననుగ్రహింపుము” అని యడుగఁగా, శివుఁడును తన కుమారునిఁ జూచి యిట్లనియె.

కుమారా! సకలసంపదలను, దీర్ఘాయుస్సును, కోరినకోరికలను, పశులను నొసఁగునట్టి గణపతి పూజనమనెడి యొక వ్రతంబు గలదు. ఆవ్రతమును భాద్రపదశుక్లచతుర్థినాఁ డాచరింపవలెను. ఆదినమున ఉదయమున లేచి స్నానము జేసి పరిశుద్ధుఁడై సంధ్యావందనము మొదలగు నిత్యకర్మములను జేసికొని , తనశక్తికిఁ దగినట్లు ద్రవ్యలోపము చేయక వెండితో గాని, బంగారుతో గాని, తుదకు మంటితోఁగాని వినాయకుని ప్రతిమను జేసికొని తనయింటియొక్క యుత్తరపువైపున నొకపాలపల్లి నేర్పఱచి, దానినడుమ నెనిమిదిదళములుగలకమలమును యవలతో గాని బియ్యపుఁబిండితోగాని నిర్మించి, యచ్చట నాప్రతిమను బెట్టి భ క్తిపూర్వకముగా తెల్లనిగంధముతోను అక్షతలతోను పూవులతోను గరికపోచలతోను యిరువది యొక పత్రములతోను పూజచేసి, ధూపదీపములను సమర్పించి నేతితో వండినకుడుములు, ఇరువదియొక టేసివంతున టెంకాయలు, ఇంకను ఆరఁటిపండ్లు, నేరేడిపండ్లు, వెలఁగపండ్లు, చెఱకుగడలు, మఱి యనేకవిధము లగుభక్ష్యములు పండ్లును నైవేద్యము పెట్టి వినాయకునిసన్నిధిని నాట్యములుసల్పి, పాటలుపాడి పురాణపఠనము మొదలగు ఉపచారములచే వినాయకునిఁ దనివి నొందించి, వేదాధ్యయనపరు లయిన బ్రాహ్మణులకు వాయనదానంబుచేసి, పిమ్మట తానును తనబంధువులును మిత్రులును తృప్తిగా నూనె తగులకుండ భోజనము సలుపవలయును. ఈ ప్రకారము భక్తితో నీ వినాయక వ్రతంబు నాచరించువానికి బను లన్నియు సందేహము లేకుండ సిద్దింపఁ గలవు. ఆమఱుసటిదినము ఉదయమున నిద్ర లేచి, ముందటిదిన మందువలెనే సకలానుష్టానములను తీర్చుకొని గణనాయకునికి పునఃపూజ చేయవలయును. ఆదినమున నొక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతికై, ముంజదర్భ త్రాటిని, కృష్ణాజినమును, దండమును, యజ్ఞోపవీతమును, కమండలమును, వస్త్రమును తన శక్తికిఁ దగినట్లుగా నీయవలయును. పిమ్మటఁ దనపురోహితునికి శక్తికి లోపము లేకుండ ఉపాయన మియ్యవలెను, తక్కిన బ్రాహ ణులకును శక్తికొలఁది దక్షిణలిచ్చి, భోజనము పెట్టవలయును. ఇది వ్రతములలో నెల్ల నుత్తమవ్రతంబు. మూఁడులోకంబులందుసు బ్రసిద్ది చెందినది. ఈ వ్రతమును ముందటికల్పమున దేవతలుసు, మునులును, గంధర్వులును, కిన్నరులును, మఱి యనేకు లాచరించిరి. ఓధర రాజా! యీ ప్రకారము పరమశివుఁడు తన పుత్రుఁడయినకుమారస్వామి కుపదేశించెను. ఓధర్మరాజా! నీవుసు ఈ ప్రకారముగా గణపతి పూజ చేయుము. నీకు తప్పక జయంబు గలుగఁగలదు. నామాటనిక్కము. నిక్కము. నమ్ముము. ఈ వ్రతమును భూలోకమున నెందరోయాచరించిరి. ఈ వ్రతము చేసీ దమయంతి నలుని బడసెను. కృష్ణుఁ డాచరించి జాంబవతిని, స్యమంతక మణిని బడసెను. ఇంద్రుఁడు పూజించి వృతాసురునిసంహరించెను. రావణుఁడు సీతనెత్తుకొని పోయినప్పుడు, రాముఁడీ వ్రతము చేసి సీతను బడసెను. భగీరథుఁడు గంగ దెచ్చునపుడును దేవాసురు లమృతము పుట్టించునిమిత్తమును, సాంబుఁడు తన కుష్ఠరోగము తొలఁగునిమిత్తమును ఈగణనాథవ్రతము లాచ రించితమతమకోరికలను బడసిరి. ఇట్లు సూతమహాముని చెప్పఁగా ధర్మరాజావిధి ప్రకారము గణపతి పూజఁ గావించి, శత్రువులను సంహరించి, రాజ్యమును దనపరాక్రమమున సంపాదించుకొని సుఖంబుండెను. మనసులోఁ దలఁచిన కార్యములుగూడ జరుగు చుండును గనుకనే ఆవినాయకునికి సిద్ధివినాయకుఁడని పేరు ప్రసిద్దికి వచ్చినది. ఈగణనాథుని విద్య యారంభించునపుడు పూజించినయెడల విద్య బాగుగ వచ్చును. జయముగోరువాడు పూజ చేసిన జయమును పొందును. బిడ్డలుగోరువాఁడు పూజించిన బిడ్డలంగాంచును. మగని కోరుదానికి వయస్సుమగఁడు వచ్చును. సుమంగలి పూజించినయెడల సౌభాగ్యమును బొందును. విధవ పూజించినయెడలఁ బైజన్మకు విధవత్వము రానేరదు. బ్రాహణక్షత్రవైశ్యశూద్రు లనెడి నాలుగు వర్ణములవారును, స్త్రీలును, పిల్లవాండ్రునుగూడ యథావిధిగా నీ వ్రతము సేయవలయును. గణనాయకుని ప్రసాదమువలన నట్టిమనుష్యునికి సకల కార్యములు సిద్ధించును. పుత్రపౌత్రాభివృద్ధియు, ఏనుఁగులవఱకు నుండెడి కల్మియుఁ గలుగును అని పాండురాజపుత్రునికి సూత మహామునిచెప్పఁగా నతఁడట్లెచేసి సకలైశ్వర్యములనుబొందెను.

ఇది శ్రీస్కాందపురాణమున ఉమామహేశ్వరసంవాదమున వినాయక వ్రతకల్పము సంపూర్ణము.

————♦♦♦♦————

  1. కర్త ఆచమనము చేయవలసినది. పిదప నమస్కారము చేయవలసినది, పిడికిళ్లతో చెక్కిళ్లయందుఁ దాఁకవలసినది.
  2. ఈవాక్యమును వ్రతము చేయువా రచ్చటనుండు బ్రాహణోత్తముల నడుగవలసినది.
  3. ఈవాక్యమును పురోహితుఁడు మొదలగు బ్రాహణోత్తములు బదులిడవలసినది.
  4. అని చెప్పి పంచపాత్రము నందలి నీటిని తాఁకవలయును
  5. ఈ వ్రతము వినాయక వ్రతమే కనుక ఈవ్రతమునందు మొదట వినాయక పూజ యనవసరము. తక్కిన వ్ర తములయారంభమునందు గణపతి పూజ చేయవలెను.
  6. మన మేదేవత నుద్దేశించి వ్రతముఁ జేయఁబోవుచున్నామో, ఆ దేవతా నామమును ప్రాణ ప్రతిష్టాపనమునందు ముందుగాఁ జేర్చవలయును. 'వరలక్ష్మీ దేవతా ప్రాణ ప్రతిష్ఠాపనం, సరస్వతీ దేవతా ప్రాణ ప్రతిష్ఠాపనం' అని చెప్పవలయును.
  7. స్త్రీ దేవత నుపాసించునప్పుడు “స్వామిని సర్వజగన్నాథే” అనియు "ఆవాహితా భవ, స్థాపితాభవ, సుప్రసన్నా భవ, అవకుణ్ఠితా భవ” అనియు అన్ని స్త్రీ లింగముగాఁ జెప్పవలెను.
  8. పంచ అమృతములచే స్నానము చేయుట యనఁగా; ఆవు పాలు,పెరుగు, నెయ్యి, తేనె లేక పంచదార, ఫలోదకము ఇవి పంచామృతములనఁబడును. వీనితో నభిషేకము చేయునప్పుడు ఈ క్రిందిమంత్రములను గూడఁ జెప్పుట కలదు.
  9. దీనియర్థము ముందు వ్రాయబడినది.
  10. ఇక్కడ మంత్రపుష్పము చెప్పవచ్చును. ఆ మంత్రములు మంత్రపుష్పము అనుగ్రంథమునుండి తెలియవలెను.
  11. ఇట్లు 3 - 4 - 8 దానికంటే హెచ్చుమాఱులీ శ్లోకమును చెప్పి, యర్ఘ్యమును విడువ వలయును.