వ్రతరత్నాకరము/వరలక్ష్మీవ్రతము

వికీసోర్స్ నుండి

వరలక్ష్మీ వ్రతము


[1]ఆచమ్య. 'శుక్లాంబరధరం విష్ణు 'మిత్యాది. . . భూర్భువఃసువరోమ్. మమ ఉపాత్తసమ స్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభే...తిధౌ అస్మాకం సహకుటుమ్బానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్ధం ఈ సత్సన్తాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం వర్షేవర్షే ప్రయుక్తాం వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యోత్తరపురాణకల్పోక్తప్రకారేణ యావచ్చక్తి ధ్యానా వాహనాది షోడశోపకార పూజాం కరిష్యే, తదంగ త్వేన కలశ పూజాం కరిష్యే. (కలశ పూజ చేసి, ఆదౌ గణాధిపతిపూజాం కరిష్యే. (మొదట గణాధిపతి పూజ చేసి) వరలక్ష్మీ ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే. (వరలక్ష్మీ ప్రాణ ప్రతిష్టాపనచేసి) పూజామార భేత. (పూజ యారంభింపవలయును.)

వరలక్ష్మీ పూజా ప్రారంభము

శ్లో. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
    నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా.

    క్షీరోదార్ణవసమ్భూతే కమలే కమలాలయే,
    సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే,
                                వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి

తా. కమలాసనమందుఁగూర్చుండినదానవు, పద్మముచేతఁ బట్టినదానవు, సకలజనులచే ముఖ్యముగాఁ గొనియాడఁబడుదానవునైన ఓ విష్ణు దేవుని రాణీ! నీవు నాయెడ నెల్లప్పుడును బ్రీతిగలిగి యుండుము. పాల్కడలియందుఁబుట్టినదానవు, దేవాసురులచే నమస్కరింపఁబడినదానవు, తామరపువ్వులందు వసించుదానపు నైన ఓలక్ష్మీ దేవీ ! నీవు మాయింట శాశ్వతముగా నుండుము. అని ధ్యానము చేయవలెమ.

   సర్వమంగళమాఙ్గల్యే విష్ణువక్షస్థలాలయే,
   ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా.
                                     వరలక్ష్మీ దేవతా మావాహయామి.

తా. అన్ని శుభకార్యములకు శుభంబు నొసంగుదానా! విష్ణువు ఱొమ్ముననుండుదానా! నిన్నావాహన చేయుచున్నాను. ఓ దేవీ! నాయెడం గడుఁ బ్రేమగలిగియుండుము.


   సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం,
   సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే.
                                      వరలక్ష్మీ దేవతాయై రత్నసింహాసనం సమర్పయామి.

తా. పదివేలసూర్యులవలెఁ బ్రకాశించుదానా! ధగధగ మెఱయురత్నములచే నలంకరింపబడిన సింహాసనమిదిగో వేయుచున్నాను. దేవతలచే పూజింపఁబడిన యోయమ్మా! కూర్చుండుము.

   శుధ్దోదకం చ పాత్రస్థం గన్ధపుష్పాదిమిశ్రితం ,
   అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే.
                                      వరలక్ష్మీ దేవతాయై అర్ఘ్యం సమర్పయామి.

తా. ఓదేవపూజితురాలా! గంధము పుష్పములు మొదలగుసువాసన ద్రవ్యములతో గూడిన శుద్ధోకముతో నర్ఘ్యము నొసఁగుచున్నాను అను గ్రహింపుము.

సువాసిత జలం రమ్యం సర్వతీర్థసముద్భవం,
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవనమస్కృతే.
                          వరలక్ష్మీ దేవతాయై పాద్యం సమర్పయామి.

తా. దేవతలందఱిచేఁ గొనియాడఁబడుదానా! అన్ని తీర్థములనుండి తెచ్చిన సుగంధజలముతోఁ బాద్యము నొసఁగెదను. స్వీకరింపుము.

సువర్ణకలశానీతం చన్దనాగరుసంయుతం,
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే.
                          వరలక్ష్మీ దేవతాయై ఆచమనీయం సమర్పయామి.

తా. శుభముల నొసఁగుదానా! బంగారుగిండ్లతోఁ దెచ్చిన చందనము, అగరు చేర్చినయుదకముతో ఆచమనీయ మొసఁగుచున్నాను.

[2]పయోదధిఘృతో పేతం శర్కరామధుసంయుతం,
పఞ్చామృతస్నానమిదం గృహాణ కమలాలయే.
                         వరలక్ష్మీదేవతాయై పఞ్చామృతస్నానం సమర్పయామి.

గఙ్గాజలం మయా౽నీతం మహాదేవ శిరఃస్థితం,
శుద్దోదకస్నానమిదం గృహాణ విధుసోదరీ.
                         వరలక్ష్మీ దేవతాయై స్నానం సమర్పయామి.
                         స్నానానన్తరం ఆచమనీయం సమర్పయామి.

________________

59: వరలక్ష్మీ వ్రతము లొ. ఓచంద్రునితోఁ బుట్టినదానా! ఈశ్వరుని శిరస్సునుండి వచ్చిన గంగాజలమును దెచ్చితిని. ఈతీర్ణముతో స్నానమాచ. రింపుము. సురార్చితాంఘియుగళే దుకూలవసన ప్రియే, వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్ల భే. వరలక్ష్మీ దేవతాయై వస్త్రయుగ్మం సమర్పయామి. తా, దేవతలచేఁ బూజింపఁబడిన పొచములతో గూడిన దానవు, వెలి పట్టుచీరగట్టినదానవునైన వెన్ను నిరాణీ! నీకు నలు వలజతఁ గట్టబెట్టెదను అనుగ్రహింపుము. . కేయూరకజణే దివ్యే హారనూపుక మేఖలాః, విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే. వగల క్ష్మ్యే ఆభరణాని సమళ్పయామి. తా, ఋషులమన్న నలఁబడసిన యోదేవీ! కడియములు,, పంకీలు, హారములు, అందేలు, మొలనూలు మొదలగు సకల భూషణములను దాల్పుము. తప్త హేచుకృతం దేవి గృహాణ త్వం శుభ ప్రదే, ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభ ప్రదే, వరలక్ష్మీ దేవతాయై యజ్ఞోపవీతం సమర్పయామి, తా. శుభములొసఁగుబానా! ఆపకంజితోఁ జేసి,ముత్యాల సరములతో నలంకరించిన యజ్ఞోపవీతమును ధరింపుము. కర్పూరాగరుకస్తూరిరోచనాదిభికన్వితం, గద్దం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్. వరలక్ష్మీ దేవతాం గంధాం ధారయామి. ________________

60 వ్రతుత్నాకరము తా, ఓ దేవీ ! పచ్చకర్పూరము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వు మొదలగు సువాసన ద్రవ్యములతోఁ జేర్చినచందనము నొసఁగుచున్నాను. కృపనీయుము. అక్షతాక్ ధవళాణ దేవి శాలీయాం స్తండులా?" శుభాణ, హరి ద్రాకుంకుమోపేతా? గృహ్య తామబ్ధపుత్రీ కే. వరలక్ష్మీ దేవతాయై అకు తాణ సమర్పయామి తా. ఓసముద్రునికూతురా! తెల్ల నియక్షతలను పసుపు కుంకుమ కలిపి యొసఁగుచున్నాను. వీనిని గ్రహింపుము, • మల్లి కాజాలికుసు మైళ్ళంపకైర్వకు భైరవి, శతప తైశ్చ కల్లా రైః పూజయామి హరి ప్రియే. సరళ్మీ దేవతాం పుస్పెః పూజయామి. తా. మొల్లలు, జాజులు, సంపెంగలు, పొగడలు, తామ రలు, కల్వలు మొదలగు పూవులతో, ఓవిష్ణుని ప్రియురాలా! నిన్ను బూజించుచున్నాను. అథాంగ పూజా “పూజయామి”. అని ప్రతిపదమునకుఁ గడపట చేర్పుఁడు, చబ్బలాయై నమః పాదౌ సుముఖాయై నమః ముఖం చసలాయైనమః జానునీ (రూ శ్రీయై నమః ఓస్లా పీతామ్బరధరాయై నమః ఊ సునాసికాయై నమః నాసికాం కమలవాసిన్యై నమః కటిం సునేత్యై నమః నేత్రే 'పచాలయాయై ననుః నాభిం రమాయై నమః కర్లో మద మాత్రే నమః స్తనౌ కమలాయై నమః శిరః “లలితాయై ననుః భుజద్వయం వడల మ్యై నమః సర్వాణ్య జ్ఞాని శమ్బుకంర్యై నమః కణ్ణం పూజయామి. పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/62 పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/63 ________________

63 వరలక్ష్మీ వ్రతము తా. ఓ దేవీ! నేతితోఁ దడిపిన వత్తులు వేసిన దీపమును వెలి. గించుచున్నాను. స్వీకరించి సంతోషపడుము. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం, నానాభక్ష్యఫలో వేతం గృహాణ హరివల్ల భే. ధూపదీపాన నగం ఆచమనీయం సమర్పయామి. తా, షడ సములుగలదియు, అనేకభక్ష్యములతోను, పండ్లతోనుగూడిన నై వేద్యమును బెట్టుచున్నాను. ఓవిష్ణుపత్నీ ! ఆరగింపుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై నై వేద్యం సమర్పయామి. ఘనసారసుగనేన మి శ్రీతం పుష్పవానీతం, పొనీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహకమ్. తా. పచ్చకర్పూరపు తావితోను, పట్టివేళ్ల వాసనతోను, పువ్వుల వాసనతోను కూడినచల్ల నియుచకంబు పుచ్చుకొనుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై పానీయం సమర్పయామీ, పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం, కర్పూరచూర్ణ సంయుక్తం తామ్బూలం ప్రతిగృహ్యతామ్. శ్రీవరలక్ష్మీ దేవతాయై తామ్బూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూ రేణ సమన్వితం, తుభ్యం దాస్యామ్యహం - దేవి గృహ్యతాం విష్ణువల్ల భే. తా. ఓ దేవీ! విష్ణుపత్నీ ! కర్పూర నీరాజన మొసఁగు చున్నాను. గ్రహింపుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం దర్శయామి. నీరాజనాన మౌనం ఆచమనీయం సమర్పయామి. పదాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, ________________

M వ్రతరత్నాకరము నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా, శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మన్త పుష్పం సమర్పయామి. యాని కాని చ పొసొని జనాస్తరకృతాని చ, తానిలోని ప్రణశ్య స్త్రీ ప్రదక్షిణప దేపదే. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి, నమస్తే లోక్య జనని నమస్తే విష్ణువల్ల భే, తాహీ మాం భక్తవరదే వరలక్ష్మీర్న మో నమః, తా, ఓ ముల్లోకములతల్లీ ! విష్ణునిరాణీ! భక్తులశోరికల నొసంగు ఓవరలక్ష్మీ! నీకు మ్రొక్కెదను నన్నుఁ గాపాడుము. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమస్కా రాక" సమర్పయామి.

  • అథ (నవసూత్ర తోరగ్రంథి పూజా. కమలాయై నమః ప్రథమగ్రస్లిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రణిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గద్ధిం పూజయామి. విశ్వజనన్యైనమః చతురస్లిం పూజు యామి. మహాల వ్యైనమః షఇ్చమగ్ర్యం పూజయామి. శ్రీరాబ్ది తనయాయై నమః షష్ణగద్దింపూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రస్థిం పూజయామి. చన్ద సోదర్యై నమః అష్టమగ్రధ్ధం పూజయామి. హరిపల్ల భాయై నమః నవమ గ్రన్షిం పూజయామి. తొరముకట్టుకొనునప్పుడు చెప్పుమంత్రము. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభ ప్రదం, పుత్రపౌత్రాభివృద్దిం చ సౌభా గ్యం దేహి మే రమే. "
  • తోరపుముళ్ల ను బూజించుట, ఈ తోరమునకు తొమిదిముడు లుండ పలెను. ఒక్కొక్క ముడియు తెలియునట్లు విడిగా నుంచి ఒక్కోక్క ముడిని పూజింపవలెనుగాని, కుప్పగా పెట్టకూడదు. గ్రంథి నుండి. ________________

వరలక్ష్మీవ్ర తము జాయనమిచ్చువిధి-- ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః, దాతవ్యం ద్వాదశా పూపం వాయనం హి ద్విజాతయే. తా. ఈ ప్రకారము మోత,మునొసంగు వరలక్ష్మీ దేవిని తనశక్తికొలదని బూజించి, బ్రాహణునికి తాము జేసిన భక్ష్యము లలో పండ్రెండు వాయనమియ్యవలసినది. వాయనమిచ్చునప్పుడు చెప్పు మంత్రము. – ఇందిరా ప్రతీగృష్ణతు ఇందిరా పై చదాతి చ, ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః, 'తా. లక్ష్మీ దేవియే యిచ్చునది, లక్ష్మీ దేవియే తీసికొనునది. ఇందిక యే యిద్దతికి తాకకము. ఇంక కొఱుకు నమస్కారము. 'యస్య స్మృత్యా చ నామోక్త్యా తపపూజా క్రియావిషు, న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వన్డే తమచ్యుతమ్. మన్త హీనం క్రి యాహీనం భక్తిహీసం మ హేశ్వరి, యత్పూజితంమయా దేవి పరిపూర్ణం తవస్తు తే. ఆనయా కల్పోక్తప్రకారేణ కృత యా పొడశోపచార పూజయా భగవతీ సర్వదేవాతి కొ వరలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వనడా భవతు. " మమ ఇష్ట కామ్యా ర్థసిద్ధిరస్తు' అని అక్షతలు నీళ్లు విడువవలసినది. "ఇతి పూజావిధానం సమాక్తమ్. కథా ప్రారంభము కైలాసశిఖ రే రమ్యే నానాగణనిషేవితే, 'మన్గాళవిటపి ప్రాస్తే నానామణి భూషి తే. 1. పాటలాశోకపున్నాగఖర్జూరవకు శాన్వి తే, కు బేకవరుణేశోది దిక్పాలైశ్చ సమావృతే. 2. నార వ్రత-1 ________________

వ్రతరత్నాకరము దాగ స్త్య వాలీ కిపరాశరసమానృతే, ' కత్న పీలే సుఖాసీనం శంకరం లోకళజ్కనమ్. 3. పపచ్చ గౌరీ సంతుష్టా లోకాను గహకామ్యయా. గౌరీభగవర్ సక్వలో కేశ సర్వభూత హీతే రత. 4. యద్రహస్యమిదం పుణ్యం తదాచక్వ మమానఘ. ఈశ్వర:--వ్రతానాము త్తమంనామ సర్వసౌభాగ్య కారణమ్. 5. సర్వసమృత దం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం, వరలక్ష్మీవ్ర తం నామ వతమ స్తి మనోహళమ్. 6. శుక్లే శ్రావణికే మాసే పూర్ణి మోపొంత భార్గవే, యదాతు నాలీ వ౦త ప్ర తే తస్యాః ఫలం శృణు. 7. ఛారి.....విధినా కేన కర్తవ్యం తత్ర కా నామ దేవ తా, కయా చారాధితా పూర్వం సాభూత్సంతుష్టమానసా. 8. ఈశ్వరు వరలక్ష్మిన తం పుణ్యం నమామి శృణు పార్వతి, కుళ్లినం నామ నగరం సర్వమజ్ఞానమణితమ్. 9. హేను ప్రాకార సంయు క్తం బొనాకరగృహోజ్జ్వలం, తత్రాభూద్బా హణీ కాచిన్నామ్నా చారుమతీ శ్రుతా. 10. పతిభ క్తికతా సాధ్వీ శ్వశూశ్వశుర యోర్మ తా, కళావతి సా విదుషీ సతతం మణం భాషిణీ. 11. తస్యాః ప్రసన్న చిత్తాయా లక్ష్మీః స్వప్న గతా తదా, ఏహికల్యాణి భద్రం తే వరలక్ష్మీ సమాగతా. 12. నభోమానే పూర్ణిమాయాం నాతి క్రాస్తే భృగోర్ది 'నే, మత్పూజు తత్ర కర్త వ్యా వరం దాస్యామి కాంక్షితమ్. 13. ఇత్యుక్తాం వరలక్ష్మీం సా తుష్టావ పయా ముదా, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూ ర్తయే.14.శరణ్యే త్రి జగద్వన్యే విష్ణువక్షస్థలాలయే, త్వయా వలోకితః సద్యః స ధన్యః స గుణాన్వితః. 15. స శ్లాఘ్యః సకుటు మ్నీ చ స శూరః సచ పణితః, జన్మాంతర సహసేషు కిం మయా సుకృతంకృతమ్. 16. అత స్త్వత్పాదయుగళం పళ్యామిహరివల్ల భే, - 4 ________________

67 వరలక్ష్మీ వ్రతము పవం స్తుతా సా కమలా ప్రాదాత్తస్యై బహూస్వరాక్. 17, తతశ్చారుమతీ సాధ్వీ స్వప్నా దుత్థాయ సంభ్రమాత్, తత్సర్వం కథయామాసబంధూనాం పుకత స్తదా, 18. శుత్వాతు బాస్టవాః సర్వే సాధు సాధ్వితి చాబ్రునక్, తథైవ కరవామేతి తదాగ మన కాండీ. 19. భౌగ్యోదయేన సంప్రాప్తి వరలక్ష్మిది నేత థా, స్త్రీయః ప్రసన్న హృదయా నిర్మలాశ్చిత్ర వాపసః. 20. నూతనై స్తండులై: పూర్లే కుమ్బే చ వటపల్ల వై.. సాయం చారుమతీ ముఖ్యాశ్చ క్రుః పూజాం ప్రయత్నతః. 21. పడ్డాసనే పద్మకరే సర్వ లోకైక పూజి తే, నారాయణ ప్రియే దేవి సుప్రీ తా భవ సర్వదా. 22. ఇత్యాచమ నైసక లైరుపచారా? యథాశ్రమం, కృత్వాతు డక్షిణే హస్తే నవసూత్రం దధుః స్త్రియః. 2. హవిష్యం సఘృతం చైప వరల మ్యై న్య వేవయక్, గవ్లాదిభినలంకృత్య సు శీలం వృద్ధభూసుకమ్. 24. తస్పై దత్వా వాయనం చ ద్వాదశా పూషసంయుతం, తతో దేనీసమీపే తు హవిష్యం చకు, కళ్లనా?, 25. అథ లక్ష్మీప్రసాదేన ముత్తామాణిక్యభూషితాః , నూపురాక్రాన్తచరణా మణికాప్చనభూషణా!. 20. పుత్ర పౌత్రైః పరివృతా ధనధాన్య సమృద్దిభిః, అన్న దానర తో నిత్యం బగ్గు పోషణతత్సరాః. 27. స్వం స్వం సద్మ సమాజగు స్త్యశ్వకథ సభ్కు..లం, అన్యోన్యం కథయామాసుః శ్రుతం చారుమతీము ఖాత్ . 29. ఇదం సత్య మిదం సత్యం సరో భబ్రాణిపశ్యలి, వయం చారుమతీముఖ్యా ఉపలబ్దమనోరథా!. 29. పుణ్యా చారుమతీ ధన్యా భూయో భాగ్యవతీ చిరం, స్వయం యస్తాన్మహాల్యూ బోధికం హి వ్రతో త్తమమ్, 30. ఇతి చారుమతిం సాధ్వీం తుష్టువు స్తత్ర, యోషితః, వగలక్ష్మీపతం నామ తబాని భువి Ranు. విశ్రుతమ్. 31. ఏతత్తే సర్వమాఖ్యాతం వ్రతానాముత్తమం వ్రతం, య ఇదం శృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః, సిద్ధ్యన్తి సర్వకార్యాణి వరలక్ష్మీ ప్రసాదతః. 32.

వరలక్ష్మీ వ్రతకథ

సకలమునిగణంబులతోఁ గూడి రమ్యమైయున్న కైలాసపర్వతశిఖరంబున నానావిధంబులగుమణులు చెక్కినదియ, పాటలములు, అశోకములు, సురపొన్నలు. ఖర్జూరములు, పొగడలు మొదలగు నెక్కు వృక్షములతోఁ గూడినదియునై, కుబేరుఁడు, వరణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును, నారదుఁడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయి యుండుకల్పవృక్షపుఁ జేరువ, రత్నమయమైన సింహాసనమునందు నింపుగాఁ గూర్చుండియున్నట్టి జనులకు సుఖములఁ గలిగించువాఁడయిన శంకరునిఁ జూచి, పార్వతీదేవి కడుముదమంది “సకలలోకంబుల నేలుచు సకలభూతములందును దయగలిగియుండునట్టి యోనాథుఁడా! రహస్యమయి పావనమయిన యొక శుభ వ్రతంబును నాకుఁ దెల్పుము” అని లోకముల మేలుకోరినదై యడిగెను. అంతట నీశ్వరుఁడు పార్వతి కిట్లనియె. 'ఓపార్వతీ! వ్రతములలోనెల్ల నుత్తమ మయిన వ్రత మొక్కటి యున్నది. అది సకలసంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్ర పౌత్రులను ఒసఁగునది. ఈ పావనవ్రతము వరలక్ష్మీవ్రత మనఁబడును. వ్రతమును శ్రావణమాసంబునందు పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాఁ డాచరింపవలెను. ఓ పార్వతీ! ఆవ్రతము చేసిన స్త్రీకిఁ గలుగు పుణ్యఫలంబుఁ జెప్పెదనాలకింపు" మని పార్వతికి పరమశివుఁడు చెప్పఁగా, నాపార్వతీదేవియు వెండియు శంకరుని జూచి, “నాథా ఆ వ్రతంబు నేవిధితోఁ జేయవలెను? ఆవ్రతంబునం దే దేవతను గొలువవలయును? ఆవరలక్ష్మీదేవి నింతకుముందెవరారాధించి యామెను సంతోషపెట్టిరి?” అని యడుగఁగా, నీశ్వరుడు పార్వతీదేవితో నిట్లనియె.

"ఓ ప్రియురాలా! పావనమైన వరలక్ష్మీ వ్రతప్రభావంబు చెప్పెద నాలకింపుము. బంగారు ప్రాకారముతో గూడి, బంగారుమయంపు టిండ్లతోఁగూడి సకలభూషణములచే సింగారింపఁబడిన కుండిన మను పేరుగల పట్టణమొకటి కలదు. ఆపట్టణముందు చారుమతియను బ్రాహ్మణస్త్రీ యొకతె యుండెను. ఆమె భర్తయందు భక్తి గలిగి అత్తమామలకు శుశ్రూష సల్పుచుండును. ఆమె యన్ని పనులను జేయఁగలది, అన్ని శాస్త్రములను జదివినవి, ఎల్లప్పుడు ఇంపుగా మాటాడునది. నిర్మలమైన మనస్సుగల యాచారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నమందుఁ బ్రత్యక్షమై “ఓమంగళకరురాలా! రమ్ము నీకు మేలయ్యెడు. వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణమాసంబున బున్నమకు ముందుగా వచ్చెడి శుక్రవారంబున నన్ను బూజింపుము. నీకు కోరినవరంబు నొసంగెదను.” అని చెప్పగా చారుమతి స్వప్నమందే యావరలక్ష్మీదేవి నెక్కు వసంతసముతో జగములకన్నింటికిఁ దల్లివి. పుణ్యస్వరూపురాలవు; శరణుజొచ్చిన వారిని గాపాడుదానవు; ముల్లోకములవారిచేఁ గొనియాడఁదగిన దానవు; విష్ణువు యొక్క ఱొమ్మున నుండుదానవునైన యో దేవీ! నీవెవనిని గటాక్షముతో జూతువో, ఆమానవుఁడే పుణ్యాత్ముడు; ఆతఁడే సుగుణములతో 'ఁగూడినవాఁడు; ఆతఁడే కొనియాడదగినవాడు; ఆతడే యాలుబిడ్డలు గలవాడు; ఆతఁడే శూరుఁడు; ఆతఁడే పండితుఁడును. ఓహరి ప్రియురాలా! ఇతరములైన పెక్కువేల జన్మములలో నెంత పుణ్యము జేసితినో! అట్లుకాని మీపాదారవిందముల దర్శనము నాకబ్బునా” అని యావరలక్ష్మీదేవిని బహువిధములుగా స్తోత్రముచేసెను. ఆవరలక్ష్మీదేవియు ఆచారుమతిచే స్తోత్రము చేయఁబడినదై ఆచారుమతికిఁ బెక్కువరంబుల నొసఁగి యంతర్ధానము నొందెను.

చారుమతియు స్వప్నమువచ్చిన పిమ్మట పరుండి నిద్రపోవక మేల్కాంచి, సూర్యోదయమైన తరువాత తన స్వప్నవృత్తాంతమును దన బంధువులకు దెలిపెను. బంధువులును “చారుమతీ, నీస్వప్నంబు బాగుగా నున్నది. మంచిది, మనమందఱము ఆలాగే చేయుద” మనియు నిశ్చయించుకొని శ్రావణపూర్ణిమకు ముందటి శుక్రవార మెన్నఁడు వచ్చునా యని యెదురుచూచుచుండిరి. వారియదృష్టవశంబున వరలక్ష్మీ వ్రతదినము ప్రాప్తింషగా, స్త్రీలు మనస్సులందు విచారము మాని, పరిశుద్ధముగా స్నానముచేసి, వింతవింతలైన బట్టలగట్టి క్రొత్తబియ్యముతోను, మఱ్ఱియిగుళ్లతోను నిండినపూర్ణకుంభమునందు వరలక్ష్మీదేవి నావాహనముచేసి, చారుమతి మొదలగువారందఱు భక్తితోఁ బూజలు సల్పిరి. “పధ్యాసనే పద్మకరే... సర్వదా" అను శ్లోకము చెప్పి, యా వరలక్ష్మీదేవి నావాహనము చేసి, మఱియు కల్పమందుఁ జెప్పఁబడిన ప్రకారము పోడశోపచార పూజలను జేసి, కుడిహస్తమందుఁ దోరముసు కట్టుకొని, నేతితోఁ జేయఁబడిన భక్ష్యభోజ్య చోష్య లేహ్యపానీయాది సకలవిధపదార్థంబులను నివేదనచేసి చక్కని నిష్ఠగల యొక ముసలి బ్రాహణునికిఁ బండ్రెండుభక్ష్యములను దక్షిణా తాంబూలాదులతో వాయన మిచ్చి యా దేవి సన్నిధానంబున దాము నివేదనచేసిన భక్ష్యభోజ్యాదులగు సకలపదార్థములతోగూడిన యన్నమును దనివితీఱ భుజించిరి.

తర్వాత వరలక్ష్మీ ప్రభావంబుననే చారుమతి మొదలగు స్త్రీలందఱు వరలక్ష్మీదేవి యనుగ్రహమువలన ముత్యాల మాణిక్యములహారములను మెడనిండ ధరించిరి. కాలియందెలను, రవలు చెక్కినసొమ్ములను బడసిరి. ఇట్లు కలిమియేకాక, పుత్రపౌత్రాదులను, ధనధాన్యసమృద్ధిని బడసి, యెల్లప్పుడన్నదానమునందును బంధువులపోషణయందును మిక్కిలి శ్రద్ధగలవారలై, చతురంగబలముచే నిండిన తమతమ గృహంబులకుఁ జనిరి.

ఓ పార్వతీ! చారుమతీ దేవివలన విన్నయావరలక్ష్మీవ్రతంబు ఆనగరమందుండువా రొండొరులకుఁ జెప్పికొనిరి. ఓ పార్వతీ! ఇది నిజము. ఇది నిజము. ఈ వ్రతంబు నాచరించుటవలన మానవుడు మేలులను బడయును. చారుమతీదేవిమూలమున మనము కోరిన కోర్కులెల్లఁ బడసితిమి. చారుమతి యెంతపుణ్యాత్తురాలు! ఎంతమహిమగలది! ఆమెకు వరలక్ష్మీదేవియే ప్రత్యక్షమై యీ వ్రతంబు నుపదేశించినది. అని యాచారుమతిని బొగడిరి. ఓ పార్వతీ! అది మొద లీవ్రతము వరలక్ష్మీవ్రతంబని లోకమునఁ బ్రసిద్ధమయ్యెను. ఇది వ్రతములలోనెల్ల నుత్తమ వ్రతము. దీని నీకు సవిస్తరముగాఁ జెప్పితిని. ఎవరీ వ్రతంబును వినుచున్నారో లేక నెమ్మదిగా ఒరులచేత వినిపించుచున్నారో, వారికి వరలక్ష్మీదేవి ప్రభావమువలన సకలకార్యములును సిద్ధించును” అని పార్వతీదేవికిఁ జెప్పెను.

ఇది భవిష్యోత్తరపురాణంబునందలి పార్వతీ పరమేశ్వరుల సంవాదమున వరలక్ష్మీవ్రతంబు సంపూర్ణము.

  1. కలశపూజ. గణాధిపతి పూజ, ప్రాణ ప్రతిష్ఠాపనవిధులను గూర్చి వినాయక వ్రతారంభమునందుఁ జూచి తెలుసుకొనుడు.
  2. పంచామృతమంత్రములను స్నాన, వస్త్ర, యజ్ఞోపవీతధూపాది మంత్రములను వినాయక వ్రతముఁ జూచి తెలిసికొనవలయును.