Jump to content

వృక్షశాస్త్రము/వాయింట కుటుంబము

వికీసోర్స్ నుండి

87

అడలు గింజలు:... కూడ నౌషధములో నుపయోగ పడుచున్నది. అవి దోస గింజలవలె నుండును గాని కొంచెమెర్రగా నుండును. ఈ గింజలను నూరి పట్టించినచో గొన్ని నొప్పులు తగ్గును. గింజలను నమిలి మింగిన గాని, పొడుము చేసి నీళ్ళలో గలిపి పుచ్చు కొనిన గాని జిగట విరేచనములు కట్టును.

క్యాబేజి
... కూడ నీ కుటుంబములోనెదె. ఈ మొక్క అయిరోపా దేశస్తులతోడనే మన దేశమునకు వచ్చెను. అంతకు పూర్వము లేదు. ఇప్పుడైనను మనము తరుచుగా దీనిని వండుకొనుట లేదు. మరియు గొప్ప పట్టణములందు దప్ప అన్ని చోట్ల దొరకదు. మనము కూర వండుకొను క్యాబేసి లేత యాకుల మొగ్గ.


వాయింట కుటుంబము


వాయింట మొక్కమూడడుగులెత్తు వరకు బెరుగు నేక వార్షికపు గుల్మము. కొమ్మల కొక్కొక్కప్పుడు రంగుండును. లే గొమ్మలపై రోమములును జిగటయు గలదు.

ఆకులు
... ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు: తాళ పత్ర వైఖరి అయిదు చిట్టి యాకులు గలవు. చిట్టి యాకులకు దొడిమ లేదు. అన్నియు సమముగా నుండవు, సమాంచలము, కొన సన్నము, రెండు వైపుల జిగురు జిగురుగా నుండు రోమములు గలవు. తొడిమపై జిన్నచిన్న ముళ్ళవంటివి గలవు.

88

పుష్పమంజరి
కొమ్మల చివరల నుండి గెలలు లేతవి గుత్తుల వలె నగుపించును. గెలలపైన ఆకుల వంటి చేరికలు గలవు. వానిలో మూడేసి చిట్టి పత్రములున్నవి. అడుగున నున్న వాని కణుపు సందులో బువ్వులు లేవు గాని

89

పైవాని యందు గలవు. పువ్వులు చిన్నవి. ఉపవృంతము పొడువుగానే యుండును.

పుష్పకోశము
.... రక్షక పత్రములు 4. బల్లెపాకారము. జిగటగ నుండును రోమమలు గలవు.
దళవలయము
... ఆకర్షణ పత్రములు నాలుగు. వీనికి నిడుపాటి పాదము గలదు. తెలుపు.
90
కింజల్కములు
.... 8 . వృంతాగ్రము ఆకర్షణ పత్రముల మధ్యనుండి పైకి వచ్చి యున్నది. దీనినే కింజల్కమౌలంటుకొని యున్నవి.
అండకోశము
... అండాశయము ఉచ్చము. దీనికిని కింజల్కములకును మధ్య వృంతాగ్రము పొడుగగనే యున్నది. ఒక గది. అండములు చాల గలవు. కాయ ఎండి పగులును. కీలము లేదు. కీలాగ్రము పెద్దది. దానిపై రంధ్రములు గలవు.
మావలింగము చెటేటు
... మనదేశపు పడమటి తీరమున విరివిగాబెరుగుచున్నది గాని అంతటను దోటలందు బెంచు చున్నారు. మార్గ శిర ప్రాంతముల నాకులు రాలి వేసవి కాలమందు ఆకులును బువ్వులును గలిసి వచ్చును.
ఆకులు
... కొమ్మల చివర గుబురులుగా నుండును. ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు, మూడేసి చిట్టి యాకులు గలవు. ఇవి అండాకారముగనైనను, సమ గోళాకారముగనైనను బల్లెపాకారముగ నైన నుండును. సమాంచలము. కొన వాలము గలదు. చిట్టి యాకులకు జిన్న తొడిమలు గలవు. అవి యతుకు పెట్టినట్లుండును.
పుష్పమంజరి
... కొమ్మల చివరలనుండు గుత్తులు.
పుష్పకోశము
... రక్షక పత్రములు నాలుగు. త్వరగ రాలి పోవును.
దళవలయము
.... ఆకర్షణ పత్రములు నాలుగు. పాదములు గలదు. అధశ్చర అండాకారము. కొంచము పసుపు రంగుగ నుండును.
కింజల్కములు
..... అసంఖ్యములు. కాడలు ఆకర్షణ పాత్రము లం పొడవు.
అండ కోశము
..... అండాశయము ఉచ్చము. ఒక గది. దీనికిని కింజల్కముల మధ్య నుండి వచ్చిన వృంతాగ్రము గలదు. కీలము లేదు. అండములు రెండు వరుసలు. కుడ్య సంయోగము. ఫలము కండకాయ. ఈ కుటుంబమునందు గుల్మములు, గుబురు మొక్కలు చెట్లును గలవు. ఆకులు ఒంటరి చేరిక, లఘుపత్రములు గాని తాళ పత్ర వైఖరినున్న మిశ్రమ పత్రములు గాని గలవు. కొన్నిటిలో గణుపు పుచ్చములున్నవి. కొన్నిటిలో నవి ముళ్ళవలె మారి యున్నవి. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు నాలుగేసి యుండును. సాధారణముగ గింజల్కములెక్కువగా నుండును.అండాశయము ఒక జాతి మొక్కలందు దప్ప మిగిలిన వాని యందు గింజల్కముల మధ్య నుంది పైకి వచ్చిన వృతాగ్రము పై నున్నది. అండములు రెండు వరుసలు. కుడ్య సంయోగము. కీలము లేదు.

వాయింటగింజలను ఆకులను వేరులను ఔషధములలో వాడెదరు. కడుపులో నుండి ఏలుగపాములు మొదలగు పురుగులను బోగొట్టుటకు గింజలను పొడుము చేసి పంచ దారతో కలిపి పుచ్చుకిందురు. ఆకుల రసము చెవిపోటును బోగొట్టును గాని చెవి మంట పెట్టును. వేరును ముక్కలుగా గోసి కషాయము గాచి జ్వరమున కిత్తురు.

మావలింగ్దము బెరుడుతో గషాయము గాచి మూత్ర విసర్జన మప్పుడు కలుగు మంట మొదలగు వ్యాధుల కిత్తురు. ఆకులను నిమ్మకాయల రసముతో నూరి పట్టు వేసిన గొన్ని చర్మ వ్యాధులును బోవును.

కుక్కవాయింట:.... మొక్కలు పలు తావుల బెరుగుచున్నవి. ఆకులు మిశ్రమ పత్రములు. పచ్చని పువ్వులు పూయును. దీనిని వాయింట మొక్క వలెనే నుపయోంచుచు 92

న్నారు. ఈ రెండు మొక్కలించుమించుగ ఒకరీతినే యుండును. కాని వానినీభేదముల వలన గుర్తింప వచ్చును.

ఆరుదొండ:

కుక్కవాయింట పువ్వులు పచ్చగాను, కాయలు బల్లబరుపుగాను నుండును. దీనిపై జిగురుగానుండు రోమమములు గలవు. కాయకుండు తొడిమ పొట్టిది. దీని పువ్వులు తెలుపు. కాయ కొంచము గుండ్రముగా నుండును. తొడిమ పొడుగు. కాయ మీద రోమమములు లేవు. 93

ఆరుదొండ:... దేనిపైనైనను నెగ బ్రాకు గుబురు మొక్క. దానికి ముళ్ళుగలవు. పువ్వులు కణుపుసందుదగ్గర నొకదానిపై నొకటి యుండును. దీని వేరు, ఆకుల కషాయము డోకులను కట్టించును. అన్నహితవును గలుగ జేయును.

పలికి
.... చిన్న గుబురు మొక్క. కణుపు పుచ్చములు ముళ్ళవలె మారియున్నవి. ఆకులు లఘుపత్రములు. పువ్వులు పోచ్చగ నుండును.
పట్టతీగె
.... కొండలమీద బెరుగు పెద్ద తీగె. ముళ్ళు లేవు. ఆకులు అండాకారము. పువ్వులు పెద్దవి. కింజల్కములు చాల కలవు. కాయ కండ కాయ.
ఆగుబ
.... తీగ అడవులలో బెరుగును. దీనికి ముళ్ళుగలవు. పువ్వులు తెల్లగ నుండును. పచ్చని చారలును గలవు.
గులి
.... చిన్న చెట్టు. ముళ్ళుగలవు. దీనికలపయు గట్టిగానుండుడు.

నీరద కుటుంబము.


ఇది యొక చిన్న కుటుంబము. దీనిలో పెద్ద చెట్లు గుబురు మొక్కలును గలవు. ఆకులు లఘుపత్రములు, ఒంటరి చే

కురంగ వాము.