వృక్షశాస్త్రము/నీరద కుటుంబము
93
ఆరుదొండ:... దేనిపైనైనను నెగ బ్రాకు గుబురు మొక్క. దానికి ముళ్ళుగలవు. పువ్వులు కణుపుసందుదగ్గర నొకదానిపై నొకటి యుండును. దీని వేరు, ఆకుల కషాయము డోకులను కట్టించును. అన్నహితవును గలుగ జేయును.
- పలికి
- .... చిన్న గుబురు మొక్క. కణుపు పుచ్చములు ముళ్ళవలె మారియున్నవి. ఆకులు లఘుపత్రములు. పువ్వులు పోచ్చగ నుండును.
- పట్టతీగె
- .... కొండలమీద బెరుగు పెద్ద తీగె. ముళ్ళు లేవు. ఆకులు అండాకారము. పువ్వులు పెద్దవి. కింజల్కములు చాల కలవు. కాయ కండ కాయ.
- ఆగుబ
- .... తీగ అడవులలో బెరుగును. దీనికి ముళ్ళుగలవు. పువ్వులు తెల్లగ నుండును. పచ్చని చారలును గలవు.
- గులి
- .... చిన్న చెట్టు. ముళ్ళుగలవు. దీనికలపయు గట్టిగానుండుడు.
నీరద కుటుంబము.
కురంగ వాము. 95
రిక, కొన్నిటి పువ్వులు మిధునపుష్పములు. కొన్నిటిలో నేకలింగ పుష్పములును గలవు. తరచు నీపువ్వులకు ఆకర్షణ పత్రములుండవు. కింజల్కములు చాల గలవు. విత్తనములలో అంకురచ్చదనము గలదు.
- నీరదచెట్లు
- ... దక్షిన హిందూ దేశమునందును మలబారు నందును విరివిగా నున్నవి. దీని గింజలు ముప్పాతిక అంగుళం పొడగు, అరంగుళము వెడల్పు ఉండును. ఈ గింజలనుండి తీసిన చమురును చర్మవ్యాధులను బోగొట్టుటకును ఇతర జబ్బులకును వాడుదురు.
- కురంగ వాము
- .... చెట్టు గుబురు మొక్క. దీనిలో రెండు రకములు గలవు. ఒకటి తెల్లని పువ్వులను రెండవది కొంచ మెర్రని పువ్వులను బూయును. ఈ రెండవ రకము చట్టే మంచిది. దీనినే తరచుగా బెంచెదరు. దీని కాయలనుండి, గింజలనుండి ఎర్రరిని రంగువచ్చును. ఈ రంగుతో పట్టు బట్టలకు రంగు వేయుదురు. కాయలను ఉడక బెట్టి, గింజలచుట్టునుండి కండ దీసి దానిని నుపయోగించెదరు.
దీని గింజలు, వేరు బెరడును ఔషధములలో కూడ వాడుదురు. వేరు, బెరడు జ్వరములకు పని చేయును. గింజల కషాయము శగ రోగముల కిత్తురు. 96
- కనరు
- ....చెట్టు గుబురు మొక్క. దీనిమీద ముండ్లుగలవు. ఆకులు నిడివి చౌక పాకారము.
- పెద్దకనరు
- .... పైదానంత విరివిగా బెరుగుట లేదు. దీని ఆకులు అండాకారముగ నున్నవి.
పావలి కుటుంబము.
ఈ కుటుంబము చిన్నది. దీనిలో జేరు మొక్కలన్నియు గుల్మములే. పెద్దచెట్లు లేవు. ఆకులు, సమాంచలము. అభిముఖ చేరికగా నైనను, ఒంటరి చేరికగానైనను నుండును. కణుపుల వద్ద రోమముల వంటివి గలవు. రక్షక పత్రములు రెండు. అవి మొగ్గలో అల్లుకొని యుండును. ఆకర్షణ పత్రములు నాలుగో, అయిదో గలవు. కొన్నిటిలో నడుగున నివన్నియు గలసి యున్నవి. దళవలయము కొన్నిటిలో వృతాశ్రితముగను, గొన్నిటిలో బుష్ప కోశాశ్రితముగ
గూడ నున్నది. కింజల్కములు నాలుగు గాని అంత కంటె నెక్కువవ గాని యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాశయము ఒక గది అండములు రెండో, ఇంక నెక్కువయో యుండును. కీలము చివరి రెండుమొదలు ఎనిమిది చీలికల వరకు గలవు. ఈ చీలికలు కీలాగ్రముల వలెనే నుండును.