Jump to content

వృక్షశాస్త్రము/ఆవ కుటుంబము

వికీసోర్స్ నుండి

ఆవ కుటుంబము

ఆవ మొక్క 4,....5 అడుగులెత్తు పెరుగును. కొమ్మలు గుబురుగా బయలుదేరును. నునుపుగా నుండును కాని వాని మొదళ్ళయందు తెల్లముండ్లు గలవు.

ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు, అన్నియాకులు నొకరీతిగలవు. క్రిందుగానున్న యాకులు పెద్దవి. తొడిమలు పొడుగుగా నుండు దీనిమీదను ముండ్లుగలవు. పత్రములకు బెక్కు- తమ్మెలుగలవు. పై 83

కులు చిన్నవి. తమ్మెలుతక్కువ. విషమరేఖ పత్రము. అంచున రంపపు పండ్లున్నవి.

పుష్ప మంజరి
... గెలలు కొమ్మల చివరల నుండి పుట్టును.
పుష్పకోశము
... సయుక్తము. 4. తమ్మెలు నీచము.
దళవలయములు
- ఆకర్షణ పత్రములు 4. అధశ్చిర యండాకారము పాదముకలదు. పచ్చగా నుండును వృంతము నంటియుండును.
కింజల్కములు
... 6 కాడలు, ఆకర్షణ పత్రములకంటే బొడుగుగా నున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
.... అండాశయము ఉచ్చము. రెండు గదులు. గింజల వరుస ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి గలదు. కుడ్యసంయోగము, కీలము గుండ్రముగాను బొట్టిగా నున్నది.

తెల్ల ఆవాల మొక్క 3 మొదలు 5 అడుగులెత్తు పెరుగును. కొమ్మలు గుబురుగా నుండును.

ఆకులు ఒంట్రి చేరిక, లఘు పత్రములు, కొమ్మలనంటి పెట్టుకొని యుండును. క్రింది యాకులు పెద్దవి. తమ్మెలు గలవు. ఇవి ఒక దాని కొకటి ఎదురుగా నుండును. కొన్ని త్రిభుజాకారముగాను కొన్ని గుండ్రముగా నుండును.పై యాకులు బల్లెపాకారము. రెండుప్రక్కల సున్నగా నుండును.

పుష్పమంజరి
.... కొమ్మల చివరలనుండి గెలలు ఉపవృంతములు నున్నగా నున్నవి.

పుష్పకోశము:.... సయుక్తము 4 దంతములు, నీచము.

దళవలయము
.... ఆకర్షణ పత్రములు 4 అధశ్చిర అండాకారము. పాదము గలదు. వృంతము నంటియుండును, పసుపురంగు.
కింజల్కములు
... 4. ఆకర్షణ పత్రములు పాదముల కంటె రెండింతలు పొడుగు. 84
అండకోశము
... అండాశయము ఉచ్చము 2 గదులు, కీలము గుండ్రము. కాయ ద్వివిదారుణ ఫలము.

ఆవ కుటుంబపు మొక్కలు శీతల దేశమునందేకాని ఉష్ణదేశము లందంతగా బెరుగంజాలవు. మన దేశములో నీ కుంటుంబపుమొక్కలు తక్కువ. వానిలో జాలభాగము కొండలమీదనేగాని పెరుగవు. వీనిలో ఆకులు ఒంటరి చేరిక. విశేషముగా లఘుపత్రములు. రక్షక పత్రములు, అకర్షణపత్రములు నాలుగు, కింజల్కములారు కంటె నెక్కువ యుండవు. ఆకర్షణపత్రములకు బాదము గలదు. అండాశయమున రెండుగదులు గలవు.

మన దేశములో బెరుగు నీకుటుంబపుమొక్కలలో నావమొక్కయే ముఖ్యమైనది. వీనిపంట మన రాష్ట్రమున కంటే హిందూస్థానమునందెక్కువకలదు. వరి, చెఱుకు పండు పల్లపు భూములలో నావాలు పెరుగజాలవు. వరికి నావశ్యకమయిన యుష్ణము ఆవాలకు బనికిరాదు. వానిని విడిగా నైనను, గోదుమల పొలములందైనను జల్లెదరు. విడిగా జల్లునపుడు ఎకరమునకు సేరున్నర, రెండు సేరుల విత్తులు గావలయును. పంట బాగున్న యెడల ఆరు మణుగుల వరకు బండును. ఈ మొక్కలకు తెగుళ్ళు పట్టుటయు గలదు. కాని పంట పండిన 85

యెడల చాల లాభము వచ్చును. ఆవాలలో వణన్ ఆవాలు పెద్దఆవాలు మూడు గొల్లు ఆవాలు, తెల్లఆవాలు, మొదలగు తెగలుగలవు. వీనిలో మొదటి తెగయే శ్రేస్టము. తెల్ల ఆవాలౌషదమునందే కాని పోపులలో వాడము. అవాల నుండి పిండి చేసి యమ్ముదురు. ఇట్టిపిండి ఐరోపాదేశము లందుండి కూడ వచ్చు చున్నది. మనదేశపు పిండికంటే నిదియే శ్రేష్టమందురు. భోజన మెక్కసమై బాధ చెందుచుండిన గాని, త్రాగి పడియుండిన గాని దీనిని కొంచెము దినినచో వాంతియై కడుపులోని మలినముపోయి బాధ తగ్గును. అన్నముతో బాటీ పిండిని కొన్ని దినములు తినినయెడల జీర్ణ శక్తి కలిగి ఆకలి పుట్టును. కొన్నినొప్పులకు నావపిండిని పట్టువేసెదరు.

ముల్లంగి
... మన దేశములో జాల చోట్ల బెరుగును గాని మన మంతగా వాడమిచే దాని సేద్యము తక్కువగానున్నది. వర్షములకు ముందర నేలను బాగు చేసి, కొన్ని వానలు కురియునప్పుడు గింజలను జల్లెదరు. తరువాత వారానికి 6 దినముల కొక సారి తడి తగులుచుండవలెను. ఒక మాసము లోనే దుంపలెదిగి త్రవ్వుటకు సిద్ధముగా నుండును. దుంపలకు నాకులకు నొక విధమగు వాసన కలదు కాని కొందరు దుంపలు ఆకులు కాయలు కూడ కూర వండుకొనెదరు. ఇది వంటికి మంచిది. కడుపునొప్పివంటి బాధలను మూత్ర వ్యాధులను గొంత తగ్గించును.


అడలువిత్తులు; పుష్పము.

87

అడలు గింజలు:... కూడ నౌషధములో నుపయోగ పడుచున్నది. అవి దోస గింజలవలె నుండును గాని కొంచెమెర్రగా నుండును. ఈ గింజలను నూరి పట్టించినచో గొన్ని నొప్పులు తగ్గును. గింజలను నమిలి మింగిన గాని, పొడుము చేసి నీళ్ళలో గలిపి పుచ్చు కొనిన గాని జిగట విరేచనములు కట్టును.

క్యాబేజి
... కూడ నీ కుటుంబములోనెదె. ఈ మొక్క అయిరోపా దేశస్తులతోడనే మన దేశమునకు వచ్చెను. అంతకు పూర్వము లేదు. ఇప్పుడైనను మనము తరుచుగా దీనిని వండుకొనుట లేదు. మరియు గొప్ప పట్టణములందు దప్ప అన్ని చోట్ల దొరకదు. మనము కూర వండుకొను క్యాబేసి లేత యాకుల మొగ్గ.


వాయింట కుటుంబము


వాయింట మొక్కమూడడుగులెత్తు వరకు బెరుగు నేక వార్షికపు గుల్మము. కొమ్మల కొక్కొక్కప్పుడు రంగుండును. లే గొమ్మలపై రోమములును జిగటయు గలదు.

ఆకులు
... ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు: తాళ పత్ర వైఖరి అయిదు చిట్టి యాకులు గలవు. చిట్టి యాకులకు దొడిమ లేదు. అన్నియు సమముగా నుండవు, సమాంచలము, కొన సన్నము, రెండు వైపుల జిగురు జిగురుగా నుండు రోమములు గలవు. తొడిమపై జిన్నచిన్న ముళ్ళవంటివి గలవు.