వృక్షశాస్త్రము/వంగ కుటుంబము

వికీసోర్స్ నుండి

311

ఎఱ్ఱకత శీతాకాలములో పుష్పించును. లేత తీగల ల్మీద తెల్లని నూగు గలదు. కొమ్మలను విరచిన పాలు వచ్చును. పువ్వులు నీలపు రంగు.

కోకతీగ అడవులలో చెట్ల మీద ప్రాకెడు పెద్దతీగె. దీని ఆకులు పొడగుగా నుండును. పువ్వులు పెద్దవియె కాయ ఎండి ముక్కముక్కలుగ బ్రద్దలగును.

బురిడి తీగె అడవులలోనె యుండును. ఒక్కొక ఆకు వద్ద ఒక్కొక తెల్లని పుష్పముగలదు.

విష్ణు క్రాంతము:- ఆకుల తొడిమ చాల పొట్టిది. ఆకుల వద్ద మూడేసి పువ్వులున్నవి.


వంగ కుటుంబము.


వంగ మొక్క బహు వార్షికమగు నొక గుల్మము.

ఆకులు
- కొంచమించు అభిముఖ చేరికగా వుండును. అండాకారము, లఘు పత్రములు, తమ్మెలు గలవు. అడుగు వైపున రోమములు గలవు. కొన్ని రకములలో ఆకుల మీదను కొమ్మమీదను ముళ్ళు గలవు.
పుష్పమంజరి
- మధ్యరంభమంజరులు సరిగాగణుపు సందుల నుండవు. సాధారణముగ నొక్కొక్కచో రెండు మంజరులుండును. ఒక దాని పై నొ 312

కమిదన పుష్పమును రెండవానిమీద పురుష పుష్పమును వుండును. పువ్వులు నీలపు రంగు.

పుష్పకోశము
సంయుక్తము. 5 తమ్మెలు బల్లెపాకారము నీచము. కాయతోగూడ బెద్దదగును.
దళవలయము
- సంయుక్తము అయిదు రెమ్మలు నీలపు రంగు.
కింజల్కములు
- 5 కాడలు పొట్టి దళవలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులకు చివర రంద్రములేర్పడి వాని ద్వార పుప్పొడి బైటకు వచ్చును.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. కీలము పొడుగు ఫలము కండ కాయ.

ఈ కుటుంబములో గుల్మములు, గుబురు చెట్లు, చిన్న చెట్లును గలవు. ఆకులు వంటరి చేరిక. వృంతము యొద్ద అభి ముఖ చేరికలగ నుండిన నుండవచ్చును. పుష్పములు ఒంటరిగా నైనను మధ్యారంభ మంజరులుగా నైన నుండును. కొన్ని మొక్కల పుష్పములు మాత్రము అసరాళము. పుష్ప కోశము, 5 దళ వలయము. 5 సంయుక్తము, కింజల్కములు 5, దళ వలయము నంటి యుండును. అండ కోశము, ఉచ్చము అండాశయము సరాళముగ నుండక కొంచెము వంకరగ వుండును. 2 గదులు కొన్నిటిలో నింక నెక్కువ యుండును. కీలాగ్రములు 2 ఫలము కండ కాయ. 313

వంగకాయలు మనము తరచుగా ఉపయోగించు కూరలలో నొకటి. అన్య దేశమునుండి కొని తేబడినదగుటచే దీనిని పితృకార్యములందు వండరు. వంగ ఒక్కలు కొన్ని ఋతువులలోనె బాగుగ పెరుగును., కాని వాడుక యెక్కువ గల కూరగాయ అగుట వలన వేసవికాలమందును పెంచు చున్నారు. ఈ కాలపు కాయలు కొంచము కసరుగా వుండును. మెట్ట వంగలోనే పెక్కు రకములున్నవి. కొన్నిటికి ముచ్చిక మీద మొక్కల మీదను ముండ్లుండును. కొన్ని నీలపు రంగుగా నుండును. కొన్ని మెరయుచు పూర్తిగ ఆకు పచ్చగ నుండును. కొన్ని కొంచెము ఎలుపు గలిసి యుండును. కొన్ని చోట్ల వంగ విత్తనములను మళ్ళలో చల్లి చిన్న మొక్కలను తోటలలో నాటుదురు. వీనికి చేప పెంట తెలక పిండి మంచి ఎరువులు. వంగ తోటల వలన లాభము చాలనే రావచ్చును.

నీటి వంగమొక్కలను కొన్ని చోట్లనే పెంచుచున్నారు. దీని కాయలు సన్నముగను, పొడగుగను, నీలపు రంగుగను నుండును. ఈ మొక్కలును మెట్ట వంగ మొక్కలును కూడ, నీరు పోయుచు నున్నచో చాల సంవత్సరములు బ్రతుకును. 314

మెరప మొక్క
315

మెరప మొక్క గుల్మము, ఆకులు లఘుపత్రములు బల్లెపాకారము పువ్వులు ఛాత్రాకారము, తెలుపు. అండాశయములో రెండు గదులు కొన వరకు లేవు. ఈ మొక్క అన్య దేశముల నుండి తేబడినది గాని అనాదినుండియు మన దేశమున మొలచినది గాదు పోర్చు గీసు వారు మొదట మన దేశమునకు వచ్చునపుడు దీసికొని వచ్చిరి. శీఘ్ర కాలములోనే మెరప కాయల వాడుకయు వ్వాపించెను. మెరప కాయల లో ముఖ్యమైనవి రెండు రకములు గలవు. ఒకటి ఎఱ్ఱగానుండును. రెండవది పచ్చాగా నుండును. వీని లోను బొడుగు పొట్టి భేదములు గలవు. ఎర్రవానికంటె పచ్చనివియు, పొడుగువాని కంటే పొట్టివియు కార మెక్కువ. మెరప గింజలను కొన్ని చోట్ల చేల గట్ల మీద జల్లెదరు, కాని ప్రత్యేఇకముగ వానినే బండించు నపుడు ఎరువు వేసి పొలము కలియ దున్ని విత్తనములు చల్లుదురు. కొన్ని చోట్ల గింజలను మళ్ళలో జల్లి లేత మొక్కలను చేలలో పాతు చున్నారు. వీనికి నీరు ఎక్కువగా అక్కర లేదు. మెరప కాయలు హిందూ దేశములో ఎల్ల చెన్న రాజ్యములో ఎక్కువ పండు చున్నవి.

పువ్వులు ఛాత్రాకారము. తెలుపు. అండాశయములో రెండు గదులు కొన వరకు లేవు. 316

బంగాళదుంపలు
అమెరికాదేశమునుండి మన దేశమునకు తేబడినవే. మహమ్మదీయ చక్ర వర్తుల కాలములో అపురూపముగ తోటలందు బెంచు చుండెడి వారు. అవి మన దేశములో ఎక్కువగా బైరగుచున్న కొంత కాలమునకు గాని మనము వాని ఉపయోగింప నారంభింప లేదు. మనకు పూర్వమే మహామ్మ దీయులు వాడుచు వచ్చిరి. బంగాళా దుంప మొక్క కొమ్మలే భూమిలోనికి పోయు దుప లగును. వాని మీద గుంటలు గుంటలు వలెను కన్నులు వలెను నుండునవి మొగ్గలుండు తావులు. అట్టిది యొకటుండిన ముక్కను గోసి పాతినచో మొక్క మొలచును. వానినిట్లే పైరు చేయుదురు. ఇప్పుడు మన దేశములోను బలు తావులందు దానిని పండించు చున్నారు. ఈ మొక్కలకు తేమ నేలలు కావలయును. కాని నీరు నిలువ యుండరాదు. పొలములో పేడను ఆముదపు తెలక పిండిని ఎరువుగా వేసి దున్ని దుంప ముక్కలను నాగటి చాళ్ళ గట్ల మీద అడుగడుగు దూరమున పాతుదురు. తరువాత అప్పుడప్పుడీ మొక్కలకు నీరు పెట్టు చుండవలెను. ఎకరము నేలలో వేయుటకు ఖర్చు సుమారు రూ: 170 అగును గాని దాదాపు రెండు వందల నిరువది రూపాయల వరకు వచ్చును. ఈ పంట అయిన పిదప తిరిగి వీనినే బండించుకంటే మరియొక పైరు చల్లుటమంచిది. 317
పెన్నేరు
చిన్నగుబురుమొక్క. ఇది మొరక నేలల మీద పలు తావులందు పెరుగు చున్నది. పువ్వులు చిన్నవి. ఆకు పచ్చగా నుండును. దీని ఆకులను, వేరులను ఔషధౌలలో ఉపయోగింతురు. కాని అంగళ్ళ యందు నితర దుంపలకు పెన్నేరు దుంపలని అమ్ముదురు. మట్ట పాల దుంపయు కొంచెము పన్నేరు దుంపను పోలి యుండును.
పొగాకు
పోర్చు గీసు వారె మన దేశము లోనికి గొని వచ్చిరి. అది హిదూస్థానము కంటె దక్షిణ దేశములో త్వరగా వ్యాపించెను. అక్బరు చక్ర వర్తి కాలము నాటికి నింకనిది అపురూపముగనే యుండెను. ఆ చక్ర వర్తి ఒక నాడు పొగాకు చుట్టను కాల్వ మనసు పడ గొలుపులో నున్న వైద్యులు వారించిరట. తరువాత ఏకారణముననో అతి శీఘ్రముగ నా వాడుక వ్యాపించినది. జహంగీరు పొగాకు చుట్టలు కాల్ల్చుటను తగ్గించుటకు ప్రయత్నించెను. ఇపుడన్ని చోట్లను అనేకులు చుట్టలు గాల్చు చున్నారు. స్త్రీలును కొందరు వానినుపయోగించు చున్నారు.

పొగాకులో పలు తెగలును పెక్కు రకములును గలవు. కొన్ని రకములు చుట్టలకే బాగుండును. కొన్ని పొడుమునకు బాగుండును. 318

పొగాకు విత్తులు చల్లుటకు మళ్ళు, చెరువులు గుంటల దగ్గర చేయుదురు. విత్తనములు చల్లుటకు పూర్వము ఎకరమునకు ఏబది అరువది బళ్ళ పేడ వేసి దున్నుదురు. చల్లిన కొన్ని దినముల వరకు దినమునకు మూడు నాలుగు సారులు నీళ్ళు పోయుదురు గాని తరువాత తగ్గించుదురు. ఎనిమిది తొమ్మిది అంగుళములు ఎదిగిన పిదప నీరసముగ నున్న మొక్కలను లాగి వేసి, కొమ్మలేమైన పుట్టుచుండిన యెడల వానిని త్రుంచి వేసి, పొలములో పాతుటకు మొక్కలను దీసి కట్టలు గట్టుదురు. పొలములో మంద గట్టి చెరువు బెడ్డ వేసి బలపరుచ వలయును. పొలములో మళ్ళు గట్టి మొక్కలను పాతుదురు. పాదిన మూడు నాలుగు దినముల వరకు రెండేసి సార్లు నీరు పోయుచుందురు గాని తేరువాత మానెదరు. దోదావరి కృష్ణా మొదలగు నదులలోని వండ్రు మట్టి గల లంక ప్రదేశములు యివి పైరు చేయుటకు చాల మంచివి. మొక్కలు రెండున్నర అడుగులు ఎదిగిన పిదప వాని చివరలను త్రుంపి వేయుదురు. పొడుము కొరకై పొగాకును బండించు చున్న యెడల నూతి నీరెప్పుడు వాడరు. వర్షాధారముననే బండించెదరు.

నములుటకైనచో ఆకు గోయుటకు నాలుగైదు దినముల మ్ందటినుండి నీరు దగుల నీయరు. ఆకులకు ముదురు రం 319

గువచ్చి పశుపు పచ్చని మచ్చలు పడ బోవు చుండగా కోసి వేసెదరు. వెంటనే వానిని నీలమీద బరచి చొంచమునే వుంచి గ్దులలో ఆర బెట్టుదురు. త్వరగా కొలది దినములలోనె ఎండినచో ఆకులు పసపు పచ్చగనో ఆకు పచ్చగనో నుండును. లేని యెడల నల్లగనగును. లంక లలోని వారీయాకును గోయగనే పాతర వేయుదురు. ఎండిన ఆ ఆకులను కొన్ని దినములు పోయిన తరువాత కొబ్బరి నీళ్ళ మొదలగు వానితో బదును పట్టుదురు.

చుట్టలు కాల్చు వారలును, పొడువుము పీల్చు వారలును పొగాకు నములు వారలును చాల మంది కలరు కాని, మొత్తము మీద అది తెచ్చి పెట్టుకొనిన క్రొత్త అలవాటనియు అంత ఆరోగ్యం కాదనియు అందురు.

సుమారు నూరేండ్ల నుండియు మనమును పొగాకును వర్తకము చేయు చున్నాము. 1825 సంవత్సరములో మొట్టమొదట బందరు నుండి పొడుము ఎగుమతి అయ్యెను. చుట్టలు సిగరెట్లు కాల్చుట కలవడిన వారలకును, అవి ప్రియమగునున్నవని మాను వారలకును వీలుగ నుండు నట్లు అన్య దేశముల వారు అ యీరకముల పొగాకుతో చౌకగ సిగరెట్లను చేసి మనకు పంపు చున్నారు. ప్రతి సంవత్సస్రమును మనము 320

సుమారు 2250000 రూపాయల వరకు కొనుక్కొను చున్నాము.

1. పుష్పము, 2. అండ కోశము, 3. దళ వలయ చీలిక. 4. కింజల్కము.
ఉమ్మెత్త
-

ఉమ్మెత్త మొక్కలు పలు చోట్ల బెరుగుచున్నవి. పువ్వులును ఆకులును పెద్దవియే. కాయల మీద ముండ్లుగలవు. కొన్ని తెగలలో ముండ్లులేవు. దీని ఆకులును, కాయలును ఔషదములలో వాడుదురు. వాని గుణములు పూర్తిగ దెలిసిన గాని వాడరాదు. అవి అపాయము గలుగ జేయును. 321

రసస్గడ్డిమాను కొండల మీద పెరుగు చున్న చెట్టు. తొడిమ చిన్నది. ఆకులు పెద్దవి. తెల్లని పువ్వులు పూయును.

నేలములగ నేల మీద ప్రాకును. కాయగుండ్రముగను నున్నగను నుండును. దీనిని వండికొని తిందురు. ఉస్తి మొక్క నేలమీద ప్రాకు చుండును. ఆకుల మీదను హాయల మీదను ముండ్లు కలవు.


నాచు కుటుంబము.


నాచు అను పేరును నీళ్ళమీద తేలు చుండు ప్రతి మొక్కకును, ఒక్కొక్కప్పుడు పాకుడునకు కూడ వాడుచున్నాము. గాని ఆ మొక్కలన్నియు వేరు వేరు కుటుంబములలోనివే. కొన్ని నాచు లకు పువ్వులుండ నేయుండవు. ఇచ్చట వర్ణించిన నాచు పువ్వులు పూచునదియె.

నిలకడగా నున్న నీళ్ళలో కొన్ని మొక్కలు తేలుచుండుట జూతుము. మొక్కల ఆకులు నీళ్ళస్లోనె యున్నవి. ఈ మొక్కలకు వేళ్ళు లేవు. ఆకులు మిక్కిలి సన్న సన్నముగ చీలి యున్నవి. వాని వద్ద మిరియపు గింజలంతంత సంచుల వంటివి చూడ నగును. వీని మూలముననే మొక్క తేలు చున్నది. దాని పువ్వుల కాడ నీటిపైకి వచ్చుటకై యది తేలుచున్నది. పువ్వులు కూడ నీళ్ళలోనె యున్న ఎడల నొక పువ్వు వద్దనుండి మరియొక పువ్వులోనికి, పుప్పొడి వచ్చి చేరుటకు వీలుండదు గావున పువ్వులు పైకి రావలసి యున్నది. ఈ మె